Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Anubandham (1984)




చిత్రం: అనుబంధం (1984)
సంగీతం: కె.చక్రవర్తి
నటీనటులు: నాగేశ్వరరావు, సుజాత,  రాధిక, కార్తీక్, తులసి
మాటలు: సత్యానంద్
దర్శకత్వం: ఎ. కోదండరామిరెడ్డి
నిర్మాత: యన్.ఆర్.అనురాధాదేవి
విడుదల తేది: 31.03.1984



Songs List:



జింజింతారారే... పాట సాహిత్యం

 
చిత్రం: అనుబంధం (1984)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: వేటూరి 
గానం: యస్.పి.బాలు, యస్.జానకి

జింజింతారారే...
జింజింతారారే...

చలిగాలి సాయంత్రం చెలరేగే సంగీతం
పొద్దువాలే వేళాయే ముద్దుగుమ్మా రావే
ఇద్దరున్న కౌగిట్లో ముద్దుతీర్చి పోవే
నీలో చూసా సిగ్గుపడ్డ పరువాలు
నాలో చూడు దగ్గరైన ప్రాణాలు

జింజింతారారే...
జింజింతారారే...

చలిగాలి చెలగాటం చెలరేగే ఉబలాటం
సందెపొద్దువేళాయే చందమామ రావే
చీకటైన పొదరింట దీపమెట్టిపోవే
నన్నే తాకే అగ్గిపూల బాణాలు
నాకే సోకే కొంటెచూపు కోణాలు

పువ్వుల వానల్లో నవ్వుల నావల్లే
నావంక వస్తుంటే నాజూకు తీస్తుంటే
వెచ్చని వెలుగుల్లో వచ్చిన వయసల్లే
వాటేసుకుంటుంటే వైనాలు చూస్తుంటే
సూరీడేమో కొండలు దాటే
నా ఈడేమో కొంగులు దాటే
నీ ముద్దు తాంబూలమిచ్చుకో
ఎర్రంగ వలపే పండించుకో
తూనీగల్లే తూలిపోయే నడుమివ్వు
నిన్నే చేరే నిన్నలేని నడకివ్వు

జింజింతారారే...
జింజింతారారే...

కొండకోనల్లో ఎండవానల్లో
మురిపాల ముంగిట్లో ముద్దాడుకుంటుంటే
వేసవి చూపుల్తో రాసిన జాబుల్తో
అందాల పందిట్లో నిన్నల్లుకుంటుంటే
అల్లరి కళ్ళు ఆరాతీసే
దూరాలన్ని చేరువచేసే
ఒడిచేరి పరువాలు పంచుకో
బిడియాల గడపింక దాటుకో
నింగి నేల తొంగి చూసే సాక్ష్యాలు
నీకు నాకు పెళ్ళిచేసే చుట్టాలూ

జింజింతారారే...
జింజింతారారే...

చలిగాలి చెలగాటం చెలరేగే ఉబలాటం
పొద్దువాలే వేళాయే ముద్దుగుమ్మా రావే
సందెపొద్దువేళాయే చందమామ రావే
నీలో చూసా సిగ్గుపడ్డ పరువాలు
నన్నే తాకే అగ్గిపూల బాణాలు

జింజింతారారే...
జింజింతారారే...




మల్లెపూలు గొల్లుమన్నవి పక్కలోన పాట సాహిత్యం

 
చిత్రం: అనుబంధం (1984)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: వేటూరి 
గానం: యస్.పి.బాలు, యస్.జానకి

మల్లెపూలు గొల్లుమన్నవి పక్కలోన
వెన్నెలొచ్చి గుచ్చుకున్నది గుండెలోన
వేడుంది ఒంటిలో జోరుంది వయసులో
బోలెడంత కోరికుంది తీర్చుకోనా

మల్లెపూలు గొల్లుమన్నవి పక్కలోన
చల్లగాలి గిల్లుతున్నది సంబరాన
ఎర్రాని పెదవిలో బిర్రైన వయసులో
బోలెడంత కోరికుంది తీర్చుకోనా

నీచిలిపి నవ్వులో ఆనవ్వు వెలుగులో
నాసొగసు ఆరబోసి మెరిసిపోనా
నీఒంటి నునుపులో నీపెదవి ఎరుపులో
నావయసు పొంగు నేను కలుపుకోనా

గంగలాగా ఉరికిరానా
కడలిలాగా కలుపుకోనా
నా ఒడిలో ఉయ్యాలలూగించనా
నాఎదకు నినుచేర్చి జోకొట్టనా
నీతోటి బ్రతుకంతా ఒకవింత గిలిగింత
అనిపించి మెప్పించి ఒప్పించుకోనా

మల్లెపూలు గొల్లుమన్నవి పక్కలోన
వెన్నెలొచ్చి గుచ్చుకున్నది గుండెలోన
ఎర్రాని పెదవిలో బిర్రైన వయసులో
బోలెడంత కోరికుంది తీర్చుకోనా

నీ ముద్దు ముద్దులు మురిపాల సద్దులు
ముప్పొద్దు మునిగితేలి మురిసిపోనా
నీ మెత్త మెత్తని సరికొత్త మత్తులో
నే చిత్ర చిత్తరంగా హత్తుకోనా

హోయ్...గుండెలోనా నిండిపోనా
నిండిపొయీ ఉండిపోనా
నీప్రేమ నూరేళ్ళు పండించనా
నీ ఇల్లు వెయ్యేళ్ళు వెలిగించనా
బంధాలు ముడివేసి అందాల గుడి చేసి
అనురాగ అర్చనలే చేయించుకోనా

మల్లెపూలు గొల్లుమన్నవి పక్కలోన
చల్లగాలి గిల్లుతున్నది సంబరాన
ఎర్రాని పెదవిలో బిర్రైన వయసులో
బోలెడంత కోరికుంది తీర్చుకోనా

మల్లెపూలు గొల్లుమన్నవి పక్కలోన
వెన్నెలొచ్చి గుచ్చుకున్నది గుండెలోన
వేడుంది ఒంటిలో జోరుంది వయసులో
బోలెడంత కోరికుంది తీర్చుకోనా




ఆనాటి ఆ స్నేహమానందగీతం పాట సాహిత్యం

 
చిత్రం: అనుబంధం (1984)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ
గానం: యస్.పి.బాలు 

ఆనాటి ఆ స్నేహమానందగీతం
ఆ జ్ఞాపకాలన్ని మధురాతి మధురం
ఈనాడు ఆ హాయి లేదేల నేస్తం
ఆ రోజులు మునుముందిక రావేమిరా...

హ హా లేదురా ఆ సుఖం, రాదురా ఆ గతం 
ఏమిటో జీవితం
అరె ఫుల్ గుర్తుందిరా 
గోడలు దూకిన రోజులు
మోకాలికి తగిలిన దెబ్బలు
చీకట్లో పిల్లనుకొని

ఒరే ఒరే ఒరే ఇడియట్ పక్కనే పెళ్ళికావలసిన పిల్లలున్నార్రా

నేర్చుకుంటార్రా... ఆ హహా...

నేను మారలేదు నువ్వు మారలేదు
కాలం మారిపోతే నేరం మనదేమి కాదు
ఈ నేల ఆ నింగి ఆలాగె ఉన్నా
ఈ గాలి మోస్తుంది మన గాధలెన్నో
నెమరేసుకుందాము ఆ రోజులు
భ్రమలాగ ఉంటాయి ఆ లీలలు
ఆ మనసులు ఆ మమతలు ఏమాయెరా...

ఒరే రాస్కెల్ జ్ఞాపకముందిరా 
కాలేజిలో క్లాస్ రూములో
ఓ పాప మీద నువ్వు పేపర్ బాల్ కొడితే
ఆ పాప ఎడమ కాలి చెప్పు తీసుకొని

ఒరే ఒరే ఒరే స్కౌండ్రల్ (Scoundrel) ఊరుకోరా పిల్లలు వింటారు

వింటే వింటార్రా పిల్లల పిల్లలకు పిట్టకథలుగా చెప్పుకుంటారంతే   ఆ హహా...

ఆనాటి ఆ స్నేహమానందగీతం
ఆ జ్ఞాపకాలన్ని మధురాతి మధురం
ఈనాడు ఆ హాయి లేదేల నేస్తం
ఆ రోజులు మునుముందిక రావేమిరా...

మనసే ఇచ్చినాను మరణం తెచ్చినాను
చితిలో చూసినాను చిచ్చై మండినాను
నా గుండె మంటింక ఆరేదికాదు
నేనుండి తను వెళ్ళి బ్రతుకింక లేదు
తన శాపమే నాకు తగిలిందిరా
రేయ్ పసిపాపలే లేని ఇల్లాయెరా
ఈ కన్నుల కన్నీటికి తుదియేదిరా

ఒరే ఒరే ఒరే ఏమిట్రా పసిపిల్లల్లాగా ఆ..
చి చి ఊరుకో
ఒరే ఈ కన్నీళ్లకు తుది ఎక్కడ్రా
కర్చీఫ్ తో తుడిచేయడమేరా  ఆ హహా...

ఆనాటి ఆ స్నేహమానందగీతం
ఆ జ్ఞాపకాలన్ని మధురాతి మధురం
ఆహా really those days are fabulous 
కరెక్ట్ రా
ఆ హహ హహ హహ...





ప్రతిరేయి రావాలా... పాట సాహిత్యం

 
చిత్రం: అనుబంధం (1984)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: రాజశ్రీ 
గానం: యస్.పి.బాలు , పి. సుశీల 

పల్లవి:
ఆహా..ఆ హా ఆ ఆ హా..మ్మ్
ఆహా హా అహ ఆహాహా..

ప్రతిరేయి రావాలా...
తొలిరేయి కావాలా...
సన్నజాజి పొదరింట సన్నసన్నని వెన్నెలంట
మనమీద వాలాలా మల్లెలై పోవాలా
మనమీద వాలాలా మల్లెలై పోవాలా

ప్రతిరేయి రావాలా...
తొలిరేయి కావాలా...
అలిగేటీ పడకింట అల్లుకొన్న వెన్నెలంట
మనమీద వాలాలా మల్లెలై పోవాలా
మనమీద వాలాలా మల్లెలై పోవాలా

చరణం: 1
అలిగే అందాలు చూసి కవ్వించనా
తొలిగే బేధాలు చూసి నవ్వించనా
మనసు పడుచైనా మీకు మతి చెప్పెనా
మతి మీతోపాటు పోయి శృతి తప్పనా
మళ్ళీ తొలిరేయి మొగ్గు చూపించనా
మళ్ళీ తొలినాటి సిగ్గు మొలిపించనా
చిలిపి శ్రీవారికింత వలపాయెనా
చిలిపి శ్రీవారికింత వలపాయెనా
మళ్ళీ శ్రీమతి మీద మనసాయెనా.. హాహా

ప్రతిరేయి రావాలా...
తొలిరేయి కావాలా...
సన్నజాజి పొదరింట సన్న సన్నని వెన్నెలంట
మనమీద వాలాలా మల్లెలై పోవాలా
మనమీద వాలాలా మల్లెలై పోవాలా

చరణం: 2
ఇన్నాళ్ళు లేని వయసు ఇపుడొచ్చెనా
ఇంట్లో ఇల్లాలు నేడు గురుతొచ్చెనా
మనసే కొన్నాళ్ళ పాటు నిదరోయినా
మనసై నీ ఒడిలోకి నేను చేరనా
మళ్ళీ విరజాజిపూలు నేడు విచ్చెనా
తల్లో ఈనాడు వలపు పూలుపూచెనా
నన్నె ఇన్నాళ్ళు నే మరిచిపోయినా
నన్నె ఇన్నాళ్ళు నే మరిచిపోయినా
మళ్ళీ నీ కోసమే మేలుకొన్నా... హా..హాహా

ప్రతిరేయి రావాలా...
ఊ ఊ ఊ తొలిరేయి కావాలా...
అలిగేటీ పడకింట అల్లుకొన్న వెన్నెలంట
మనమీద వాలాలా మల్లెలై పోవాలా
మనమీద వాలాలా మల్లెలై పోవాలా




ఒక బుధవారం ఒక బుల్లోడు పాట సాహిత్యం

 
చిత్రం: అనుబంధం (1984)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: వేటూరి 
గానం: మాధవపెద్ది రమేష్ , పి. సుశీల 

ఒక బుధవారం ఒక బుల్లోడు 

1 comment

Rocky Thorat said...

Please need this lyrics in English Malle pullo

Most Recent

Default