చిత్రం: జరిగినకథ (1969) సంగీతం: ఘంటసాల నటీనటులు: జగ్గయ్య, కృష్ణ, నాగయ్య, కాంచన, జయలలిత, బేబీ రోజారమణి దర్శకత్వం: కె.బాబురావు నిర్మాత: కె.ఎ.ప్రభాకర్ విడుదల తేది: 04.07.1969
Songs List:
లవ్ లవ్ లవ్ మీ నిరజాన పాట సాహిత్యం
చిత్రం: జరిగినకథ (1969) సంగీతం: ఘంటసాల సాహిత్యం: ఆరుద్ర గానం: ఘంటసాల, ఎల్.ఆర్. ఈశ్వరి లవ్ లవ్ లవ్ మీ నిరజాన నౌ నౌ కిస్ మీ చినదాన సుఖములు సొగసులు అందించే ఖజానా లవ్ లవ్ లవ్ మీ మోనగాడ నౌ నౌ కిస్ మీ చిన్నోడా సుఖములు సొగసులు నీవేరా రారాజా కమాన్ నా ఆశ రమ్మంటే గెటప్ నీ వలపు లెమ్మంది మగసిరితో మక్కువతో మనసారా నను లాలించు ఓహో రంగేళి నీవైతే ఓహో రంగేళి నీవైతే భలే కిలాడి నేనేలే నీ పొగరు ననెవారు నేడే ఉదయం ఊగించు
ఉన్నారా - ఉన్నారా పాట సాహిత్యం
చిత్రం: జరిగినకథ (1969) సంగీతం: ఘంటసాల సాహిత్యం: కొసరాజు గానం: ఎల్.ఆర్. ఈశ్వరి ఉన్నారా - ఉన్నారా మీలో ఎవరైనగాని -- ఉన్నారా? ఒంటరిగా సుందరాంగి కంటబడితె కరగనివాళ్ళున్నారా కాబూలు - దానెమ్మను గాటు వేసి చూడమంటె కలకత్తా జామపండును కొరకమని చేతికిస్తే రంజు రంజు రంగుజూచి బలే మంచి సైజు చూచి ఏదీ రుచి చూద్దామని ఎగబడి పైబడని వాళ్ళున్నారా! ఉన్నారా ? గాలికి నాట్యంచేసే నైలాను చీరగట్టి జబ్బలదాక జరిగిపోవు సన్నని జాకెట్టు దొడిగి పక్కనున్న రామచిలక పైన చెయ్యి వేస్తుంటే అయిసయిపోవని వాళ్లు మోజులోన పడనివాళ్ళు - ఉన్నారా ?
ఏనాటికైనా ఈ మూగవీణా పాట సాహిత్యం
చిత్రం: జరిగినకథ (1969) సంగీతం: ఘంటసాల సాహిత్యం: శ్రీ దాశరధి గానం: పి. సుశీల క్రిష్ణా...క్రిష్ణా...క్రిష్ణా... ఏనాటికైనా ఈ మూగవీణా రాగాలు పలికీ రాణించునా నినుజేరి నా కథ వినిపించలేను ఎదలోన నివేదన ఎలా తెలుపను మనసేమొ తెలిసీ, మనసార పిలచి నీలోన నన్నే, నిలుపుము స్వామీ | ఏ వన్నెలేని ఈ చిన్ని పూవు నా స్వామి మెడలో నటియించునా ఎలాటి కానుక తేలేదు నేనూ కన్నీట పాదాలు కడిగేను స్వామీ క్రిష్ణా...క్రిష్ణా...క్రిష్ణా...
చినవాడ మనసాయెరా! పాట సాహిత్యం
చిత్రం: జరిగినకథ (1969) సంగీతం: ఘంటసాల సాహిత్యం: డా॥ సి. నారాయణ రెడ్డి గానం: ఎస్. జానకి చినవాడ మనసాయెరా! ఓ చినవాడ మనసాయెరా విచ్చిన జాజి పొద నీడ నిను చూడ చూడ నచ్చినవాడ మరులాయెరా పిల్ల గాలులు సాగే ! చల్లని ఆసందే అల్లన నిను చూసీ | ఘల్లనె నా అందె అంతలో నీ వింతచూపే ! ఎదురాయెరా ఎంతలో | పులకింతలెన్నో, మొదలాయెరా! తుంటరి నెలరేడు, కొంటెగా కనుగీటే తోడుగా వలరేడు - వాడి తూపులు నాటె రగిలే, నెవ్వగలే | సై పగలేనురా ! కదిలే | పయ్యెదలే | ఆపగలేనురా
బలే మంచి రోజు పాట సాహిత్యం
చిత్రం: జరిగినకథ (1969) సంగీతం: ఘంటసాల సాహిత్యం: డా॥ సి. నారాయణ రెడ్డి గానం: ఘంటసాల బలే మంచి రోజు పసందైన రోజు వసంతాలు పూచే నేటిరోజు గుండెలోని కోరికలన్నీ గువ్వలుగా ఎగిసినరోజు గువ్వలైన ఆ కోరికలే గూటిలోన చేరినరోజు నింగిలోని అందాలన్నీ ముంగిటలోనే నిలచినరోజు చందమామ అందిన రోజు బృందావని నవ్వినరోజు తొలివలపులు చిలికినరోజు కులదైవం పలికినరోజు కన్నతల్లి ఆశలన్నీ సన్నజాజులై విరసినరోజూ
తోడుగ నీవుంటే పాట సాహిత్యం
చిత్రం: జరిగినకథ (1969) సంగీతం: ఘంటసాల సాహిత్యం: డా॥ సి. నారాయణ రెడ్డి గానం: ఘంటసాల, పి. సుశీల తోడుగ నీవుంటే నీ నీడగ నేనుంటే ప్రతి ఋతువు మధుమాసం ప్రతి రేయీ మనకోసం కదిలే పిల్లగాలి శ్రీ గంధం చిలికి పోతుంది విరిసే నిండు జాబిలి నును వెన్నెల పానుపు వేసుంది మదిలో కోయల పాడుతుంది మమతల ఊయల ఊగుతుంది కనులే వేచివేచి కమ కమ్మగ కలలు కంటాయి కలలే తొంగిచూసి బిగి కౌగిలిలో దాగుంటాయి వలపుల నావ సాగుతుంది
నిన్నే నిన్నే నిన్నే కోరుకున్న చిన్నదిరా పాట సాహిత్యం
చిత్రం: జరిగినకథ (1969) సంగీతం: ఘంటసాల సాహిత్యం: డా॥ సి. నారాయణ రెడ్డి గానం: యస్. జానకి నిన్నే నిన్నే నిన్నే కోరుకున్న చిన్నదిరా నిన్ను కన్నుల్లోన దాచుకున్నదిరా వెన్నెల్లోన వేచియున్నదిరా పన్నీట జలకాలు తీర్చి ! పాల వన్నెల వలిపెమ్ము దాల్చీ! మల్లెల విరిదండ | నల్లని సిగనిండ మరులొల్క నీకై కాచుకున్నదిరా రా చిల్క నిదురించెనోయి ! లేరు నా చెలు లీనాటి రేయి తలపులు పొంగార బిగి కౌగిటచేర తలపులు ఓరగ తీసియున్న విరా
ఇదిగో మధువు పాట సాహిత్యం
చిత్రం: జరిగినకథ (1969) సంగీతం: ఘంటసాల సాహిత్యం: దాశరధి గానం: ఎల్. ఆర్. ఈశ్వరి ఇదిగో మధువు - ఇదిగో సొగసు వేడి వేడి వలపు తీయని కాటువేయు వయసు వింత మెకంలో యేమేమొ చేయాలిలే అంతులేని - ఆశలన్నీ నేడె తీరాలి తీరాలి తీరాలిలే చేత కౌగిలిలో ఈ రేయి కరగాలిలే కాలమంతా కైపులోనే సోలిపోవాలి పోవాలి పోవాలిలే
No comments
Post a Comment