Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Meena (1973)




చిత్రం: మీనా (1973)
సంగీతం: రమేశ్ నాయుడు
సాహిత్యం: ఆత్రేయ, ఆరుద్ర, దాశరధి
గానం: పి.సుశీల, యస్.పి.బాలు, అంజలి-రఘురామ్
నటీనటులు: కృష్ణ, విజయ నిర్మల, చంద్రకళ, చంద్రమోహన్, బేబీ శ్రీదేవి 
స్క్రీన్ ప్లే, దర్శకత్వం: విజయ నిర్మల
నిర్మాతలు: పి.వి.రమణయ్య , జి.పి.మల్లయ్య 
విడుదల తేది: 28.12.1973



సూపర్ స్టార్ కృష్ణ గారితో బేబీ శ్రీదేవి నటించిన సినిమాలు:
1. మా నాన్న నిర్దోషి (1970) - బేబీ శ్రీదేవి
2. విధి విలాసం (1970) - బేబీ శ్రీదేవి
3. అగ్నిపరీక్ష (1970) ) - బేబీ శ్రీదేవి
4. అత్తలు కోడళ్లు (1971) - బేబీ శ్రీదేవి
5. నేనూ మనిషినే (1971) - బేబీ శ్రీదేవి
6. రాజమహల్ (1972) - కుమారి శ్రీదేవి
7. మేనకోడలు (1972) - కుమారి శ్రీదేవి
8. మల్లమ్మ కథ (1973) - బేబీ శ్రీదేవి
9. మమత (1973) - బేబీ శ్రీదేవి
10. మీనా (1973) - బేబీ శ్రీదేవి
11. కొత్తకాపురం (1975) - బేబీ శ్రీదేవి
12 దేవుడులాంటి మనిషి (1975) - కుమారి శ్రీదేవి

(1972 లో రిలీజ్ అయిన సినిమాల్లో కుమారి శ్రీదేవి అని టైటిల్స్ లో ఉంది, కానీ 1973 లో రిలీజైన మల్లమ్మ కథ, మమత, మీనా సినిమాలో, 1975 లో రిలీజైన కొత్తకాపురం సినిమాల్లో మాత్రం బేబీ శ్రీదేవి అని ఉంది, అంటే బహుశా ఈ సినిమాలు రిలీజ్ ఆలస్యం అయ్యుంటుంది)



Songs List:



చేనుకు గట్టుంది ఇంటికి గడపుంది పాట సాహిత్యం

 
చిత్రం:  మీనా (1973)
సంగీతం:  రమేశ్ నాయుడు
సాహిత్యం:  ఆత్రేయ
గానం:  యస్.పి.బాలు

చేనుకు గట్టుంది ఇంటికి గడపుంది 



మల్లెతీగ వంటిది మగువ జీవితం పాట సాహిత్యం

 
చిత్రం: మీనా (1973)
సంగీతం: రమేశ్ నాయుడు
సాహిత్యం: దాశరధి
గానం: పి.సుశీల

పల్లవి:
మల్లెతీగ వంటిది మగువ జీవితం
మల్లెతీగ వంటిది మగువ జీవితం
చల్లని పందిరి వుంటే... ఏ ఏ...
అల్లుకుపోయేనూ.. అల్లుకుపోయేనూ
మల్లెతీగ వంటిది మగువ జీవితం

చరణం: 1
తల్లితండ్రుల ముద్దూమురిపెం చిన్నతనంలో కావాలి
తల్లితండ్రుల ముద్దూమురిపెం చిన్నతనంలో కావాలి
ఇల్లాలికి పతి అనురాగం ఎల్లకాలమూ నిలవాలి
ఇల్లాలికి పతి అనురాగం ఎల్లకాలమూ నిలవాలి
తల్లికి పిల్లల ఆదరణ ఆ ఆ పండువయసులో కావాలి
ఆడవారికి అన్నివేళలా తోడూ నీడా ఉండాలి తోడూ నీడా ఉండాలి

మల్లెతీగ వంటిది మగువ జీవితం
చల్లని పందిరి వుంటే ..ఏ ఏ..
అల్లుకుపోయేనూ.. అల్లుకుపోయేనూ
మల్లెతీగ వంటిది మగువ జీవితం

చరణం: 2
నుదుట కుంకుమ కళకళలాడే సుదతే ఇంటికి శోభ
నుదుట కుంకుమ కళకళలాడే సుదతే ఇంటికి శోభ
పిల్లలపాపల ప్రేమతో పెంచే తల్లే ఆరని జ్యోతి
పిల్లలపాపల ప్రేమతో పెంచే తల్లే ఆరని జ్యోతి
అనురాగంతో మనసును దోచే వనితే మమతల పంట
జన్మను ఇచ్చి జాతిని నిలిపే జననియే జగతికి ఆధారం... జననియే జగతికి ఆధారం...

మల్లెతీగ వంటిది మగువ జీవితం
చల్లని పందిరి వుంటే ..ఏ ఏ..
అల్లుకుపోయేనూ.. అల్లుకుపోయేనూ
మల్లెతీగ వంటిది మగువ జీవితం...




పెళ్ళంటే... నూరేళ్ల పంట పాట సాహిత్యం

 
చిత్రం: మీనా (1973)
సంగీతం: రమేశ్ నాయుడు
సాహిత్యం: దాశరథి
గానం: యస్.పి.బాలు

పల్లవి:
పెళ్ళంటే... నూరేళ్ల పంట
అది పండాలి.. కోరుకున్న వారి ఇంట పండాలి
బంధాలను తెంచుకొని.. బాధ్యతలను పెంచుకొని..
అడుగు ముందుకేశావమ్మా.. గడప దాటి కదిలావమ్మా
పెళ్ళంటే... నూరేళ్ల పంటా...

చరణం: 1
మనిషి విలువ పెరిగేది.. ధనం వల్ల కాదు
ప్రేమించే హృదయానికి.. పేదతనం లేదు
మనిషి విలువ పెరిగేది.. ధనం వల్ల కాదు
ప్రేమించే హృదయానికి.. పేదతనం లేదు

మనసులోని మమతలను.. తెలుసుకోరు పెద్దలు
మనసులోని మమతలను.. తెలుసుకోరు పెద్దలు
అందుకే.. తిరుగుబాటు చేసేరు పిల్లలు

పెళ్ళంటే... నూరేళ్ల పంట
అది పండాలి.. కోరుకున్న వారి ఇంట పండాలి
పెళ్ళంటే... నూరేళ్ల పంటా...

చరణం: 2
మంచి.. చెడు.. తెలిసి కూడా చెప్పలేని వారు
ఎవ్వరికీ.. పనికిరారు ...ఏమి చేయలేరూ
మంచి.. చెడు.. తెలిసి కూడా చెప్పలేని వారు
ఎవ్వరికీ.. పనికిరారు... ఏమి చేయలేరూ

అన్నెం పున్నెం ఎరుగని అమాయకపు జీవులు
అపనిందలపాలవుతూ.. అలమటించుతారు
అన్నెం పున్నెం ఎరుగని అమాయకపు జీవులు
అపనిందలపాలవుతూ.. అలమటించుతారు

పెళ్ళంటే... నూరేళ్ల పంట ...
అది పండాలి.. కోరుకున్న వారి ఇంట పండాలి
పెళ్ళంటే... నూరేళ్ల పంటా...

చరణం: 3
మనసు ఒకరిపైనా.. మనువు ఒకరితోనా...
మనసు ఒకరిపైనా.. మనువు ఒకరితోనా
ఎలా కుదురుతుంది.. ఇది ఎలా జరుగుతుందీ..

కలిమి కాదు మగువకు కావలసింది...
కలిమి కాదు మగువకు కావలసింది...
మనసిచ్చిన వానితో.. మనువు కోరుకుందీ
మనసిచ్చిన వానితో.. మనువు కోరుకుందీ.. మనువు కోరుకుంది..

పెళ్ళంటే... నూరేళ్ల పంట
అది పండాలి.. కోరుకున్న వారి ఇంట పండాలి
బంధాలని తెంచుకొని.. బాధ్యతలను పెంచుకొని..
అడుగు ముందుకేశావమ్మా.. అడుగు ముందుకేశావమ్మా
పెళ్ళంటే... నూరేళ్ల పంటా...





శ్రీరామ నామాలు శతకోటి... పాట సాహిత్యం

 
చిత్రం: మీనా (1973)
సంగీతం: రమేశ్ నాయుడు
సాహిత్యం: ఆరుద్ర
గానం: పి.సుశీల

పల్లవి:
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ...

శ్రీరామ నామాలు శతకోటి...
ఒక్కొక్క పేరు బహుతీపి... బహుతీపి
శ్రీరామ నామాలు శతకోటి .....

చరణం: 1
తండ్రి ఆనతి తలదాల్చు తనయుడు...దశరధరామయ్య స్థవనీయుడు...
తండ్రి ఆనతి తలదాల్చు తనయుడు...దశరధరామయ్య స్థవనీయుడు..

కడుమేటి విలు విరిచి కలికిని చేపట్టు కళ్యాణరామయ్య కమనీయుడు
 కమనీయుడు...

శ్రీరామ నామాలు శతకోటి .....
ఒక్కొక్క పేరు బహుతీపి ..... బహుతీపి
శ్రీరామ నామాలు శతకోటి .....

చరణం: 2
సుదతి జానకి తోడ శుభ సరసమాడేటి...సుందరరామయ్య సుకుమారుడు
సుదతి జానకి తోడ శుభ సరసమాడేటి...సుందరరామయ్య సుకుమారుడు
కోతిమూకలతో ..... ఆ.. ఆ... ఆ...
కోతిమూకలతో లంకపై దండెత్తు...కోదండరామయ్య రణధీరుడు...రణధీరుడు

శ్రీరామ నామాలు శతకోటి
ఒక్కొక్క పేరు బహుతీపి ...బహుతీపి
శ్రీరామ నామాలు శతకోటి

చరణం: 3
పవమానసుతుడు పాదాలు పట్టగా...పట్టాభిరామయ్య పరంధాముడు
పవమానసుతుడు పాదాలు పట్టగా...పట్టాభిరామయ్య పరంధాముడు
అవనిలో సేవించు ఆశ్రితుల పాలించు...అచ్యుతరామయ్య అఖిలాత్ముడు అఖిలాత్ముడు..

శ్రీరామ నామాలు శతకోటి .....
ఒక్కొక్క పేరు బహుతీపి ..... బహుతీపి
శ్రీరామ నామాలు శతకోటి




శ్రీ బద్రాచలదామ పాట సాహిత్యం

 
చిత్రం: మీనా (1973)
సంగీతం: రమేశ్ నాయుడు
సాహిత్యం: ఆరుద్ర
గానం: యస్.పి.బాలు

శ్రీ బద్రాచలదామ

No comments

Most Recent

Default