Home Movie Songs Latest Updated Movies Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box



చిత్రం: దేవ్ (2019)
సంగీతం: హరీష్ జయరాజ్
సాహిత్యం: చంద్రబోస్
గానం: ఎస్.పి.బాలు
నటీనటులు: కార్తీ, రకూల్ ప్రీత్ సింగ్, రమ్యకృష్ణ
దర్శకత్వం: రాజత్ రవిశంకర్
నిర్మాత: ఎస్. లక్ష్మణ్ కుమార్
విడుదల తేది: 2019

నన్నే వీడి ఎటో వెళ్లినావే
నిన్నే వీడి ఎటూ వెళ్లలేనే
నన్నే వీడి ఎటో వెళ్లినావే
నిన్నే వీడి ఎటూ వెళ్లలేనే

నీరు లేనిదే ఏరు లేదులే
శోకం లేనిదే ప్రేమ లేదులే
నన్నే వీడి.. అ.. అ.. ఆ..
నిన్నే వీడి.. అ.. అ.. ఆ..
నన్నే వీడి ఎటో వెళ్లినావే
నిన్నే వీడి ఎటూ వెళ్లలేనే

నువులేని నింగిలో నాకింకా
ఏ ఇంద్రధనస్సులు లేవే
నువు లేని నేలలో నాకింకా
ఏ పచ్చదనము లేదే
నా ప్రాణ వాయువే నువ్వంట
నా ఊపిరల్లే నిండాలే
నా ప్రేమ దీపమే నువ్వంట
వెలుగల్లే ఉండిపోవే
అరె ఏం చేశానే ఘోరం నేరం
మరి నీకు నాకు ఏంటీ దూరం
నువ్వంటే నాదే ఇంకో రూపం
నామీదే నాకులాగే కోపం

నన్నే వీడి ఎటో వెళ్లినావే
నిన్నే వీడి ఎటూ వెళ్లలేనే
నన్నే వీడి ఎటో వెళ్లినావే
నిన్నే వీడి ఎటూ వెళ్లలేనే

నీ ప్రేమ జ్వాలలో నిలువెల్లా
నే కాలి బుడిదయ్యానే
నువ్వేమి చేసినా యెదలోన
నా ప్రేమ కాలిపోదే
ఒక గంట నువ్వు నను కాదంటే
ఒక రోజు వేచి వుంటానే
ఒక జన్మ నువ్వు నను కాదంటే
పదిజన్మ లెత్తుతానే
నా ప్రాణాన్నంత గొంతే చేసి
నా ప్రేమే నీకు చెప్పేస్తున్నా
ఈ ప్రాణం గాల్లో కలిసేలోగా
నీ ప్రేమే నాకు చెప్పేస్తావా

నన్నే వీడి ఎటో వెళ్లినావే
నిన్నే వీడి ఎటూ వెళ్లలేనే

నీరు లేనిదే ఏరు లేదులే
శోకం లేనిదే ప్రేమ లేదులే
నన్నే వీడి.. అ.. అ.. ఆ..
నిన్నే వీడి.. అ.. అ.. ఆ..
నన్నే వీడి ఎటో వెళ్లి నావే
ఎటో వెళ్లి నావే  నన్నే వీడి..



No comments

Most Recent

Default