Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Vamsoddharakudu (1972)





చిత్రం: వంశోద్దారకుడు (1972)
సంగీతం: ఘంటసాల
నటీనటులు: శోభన్ బాబు, యస్. వి.రంగారావు, కాంచన
దర్శకత్వం: పి.సాంబశివరావు
నిర్మాత: ఎ. ఎస్.ఆర్. ఆంజనేయులు
విడుదల తేది: 21.04.1972



Songs List:



గుమ్మా గుమ్మన్నల్లారా పాట సాహిత్యం

 
చిత్రం: వంశోద్దారకుడు (1972)
సంగీతం: ఘంటసాల
సాహిత్యం: ఆరుద్ర
గానం: పి. సుశీల

పల్లవి:
గుమ్మా గుమ్మన్నల్లారా
గుమ్మాన్న లారో నారాస గుమ్మాడి

చరణం: 1
నల్ల నల్లనివాడు
సల్లంగ వచ్చినాడు
కొకల్లు కొల్లగొట్టి
కొమ్మెక్కి కుకున్నాడు
సిగ్గిడిసి చీరకోసం
చేతులెత్తి దండమెడితే
వంగి వంగి సుశినాడు వగలమారి గుమ్మడు

చరణం: 2
తెల్లారే చల్ల చిలికి
తీస్తున్నా ఎన్నముద్ద
ఎనకన్నే వచ్చి వచ్చి
ముందున్న ముంతపట్టి
ముద్దంతా తిన్నాడు
నా మూతికింత రాశాడు
అంతా నేనే తిన్నానని 
మా అత్తతో చెబుతానన్నాడు

చరణం: 3
కంటికి కాటుకెట్టి
గంపా నెత్తిన పెట్టి
చల్లమ్మ చల్లోయంటూ
ఈదంట వెళుతుంటే
ఎదురొచ్చి చల్ల చూస్తా
దింపు దింపు గంపంటే
నీ తిక్కా గిక్కా దింపేసి
గంపేకెత్తుతానన్నాను



రెండు కళ్లు వెతుకుతున్నవి పాట సాహిత్యం

 
చిత్రం: వంశోద్దారకుడు (1972)
సంగీతం: ఘంటసాల
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ
గానం: పంటసాల, సుశీల

రెండు కళ్లు వెతుకుతున్నవి
మరి రెండుకళ్లు వెంటపడవి
ఈ రెండు రెండు కలిస్తే
ఎండవేళ వెన్నెలొస్తుంది

చరణం: 1
కొమ్మ కొమ్మ మనసువిప్పి
గుబులు ఒలకబోస్తూంది
దోర దోర వయసొచ్చి
కాయలు కవ్విస్తున్నవి
చెట్టు చెట్టు నీడలో
చిలిపితనం పొంచుంది
చెమ్మగిల్లి తోటంతా
జిల్లు జిల్లు మంటూంది 

చరణం: 2
కిలకిలా సెలయేరు
గిల్లికజ్జా లాడుతోంది 
తళతlళా నీరూపు 
తానాలు చేస్తూంది 
తడిసిపోయి సొగసంతా
మిడిసి మిడిసి పడుతూంది 
ఈ మిడిసిపాటు నీ కౌగిట మెత్తబడి పోతుంది



ధర్మం చెయ్యండి బాబు దానం చెయ్యండి పాట సాహిత్యం

 
చిత్రం: వంశోద్దారకుడు (1972)
సంగీతం: ఘంటసాల
సాహిత్యం:  దాశరధి
గానం: మంటసాల, జానకి

సాకి : 
పాపలున్న బాబుల్లారా!
పిల్లలున్న తల్లులారా!
పిల్లలతో మీలోగిళ్ళు చల్లగ వుండాలి నూరేళ్ల 

ధర్మం చెయ్యండి బాబు దానం చెయ్యండి 

పిల్లలతో మీలోగిళ్లు చల్లగ వుండాలి నూరేళ్ళు
తోడూ నీడాలేని పేదలగోడును వినలేరా
పెట్టిపుట్టిన పెదలు మీరు బీదల కనలేరా
బాబు చేతితో పెసా ఒకటి పారేయించండి
చిరంజీవి యై చిన్నారిబాబూ జీవించేనండి 

చరణం: 1
ఆకలి కడుపుల కన్నం పెడితే కడుపు పండునండీ.
పిల్లలతోటి పాపలతోటి యిల్లు నిండునండి -
ఇచ్చేవాడ్ని మెచ్చేవాడు ఈశ్వరుడేనని తెలియండి

పరులకోసమై తన సంతోషం పంచి పెట్టువాడూ
చీకటింటికి తనదీపంతో వెలుగునిచ్చువాడూ
త్యాగానికి వెనకాడని వాడు అతడే నిజమౌ దేవుడు



మురళీ లోలుడు ఎవడమ్మా పాట సాహిత్యం

 
చిత్రం: వంశోద్దారకుడు (1972)
సంగీతం: ఘంటసాల
సాహిత్యం: సి. నారాయణరెడ్డి
గానం: పి. నుశీల, ఘంటసాల, & కోరస్

పల్లవి:
ఆమె: మురళీ లోలుడు ఎవడమ్మా
మోహనరూపుడు ఎవడమ్మా?
అద్దమరేయి ముద్లుదు చిలికీ
నిద్దురదోచే దెవడమ్మా ఆ నెలరేడు ఎవడమ్మా 

కోరస్:
మురళీ లోలుడు ఎవడమ్మా
మోహనరూపుడు ఎవడమ్మా?
అద్దమరేయి ముద్లుదు చిలికీ
నిద్దురదోచే దెవడమ్మా ఆ నెలరేడు ఎవడమ్మా 

కోరస్: వాడే
ఆమె : ఎవడే ,
కోరస్: వాడే....
ఆమె: ఎవడే 
కోరస్: వాడే
ఆమె : అబ్బ, ఎవడే 
కోరస్: నీ వాడే 

చరణం: 1
ఆమె: సురపొన్న మాటుగా పొంచి,
నన్ను విరజాజి తీగలా వంచి
నా బుగ్గలు దోషిట అదిమీ
తొలిసిగ్గుల మొగ్గలు చిదిమీ
నా బుగ్గలు దోషిట అదిమీ
తొలిసిగ్గుల మొగ్గలు చిదిమీ
బులిపించి ఎటదాగుకున్నావు, 
మరు తొలికించి మటుమాయమైనావు -
కాగా....కాదా. కాదా
ఔను.

చరణం: 2
అతడు. చిలకా పచ్చని చీర కట్టి జారు
సిగలో జాజుల దండ చుట్టి
చిరునవ్వులు 'పెదవుల ముడిచీ
నును పయ్యెద జారగవిడిచీ
చిరునవ్వులు 'పెదవుల ముడిచీ
నును పయ్యెద జారగవిడిచీ
కలలోన నను చేరుకున్నావు -
కౌగిలి కోరగా జారుకున్నావు. ఔనా, ఔనా, ఔనా
ఆమె : ఏమో...

కోరస్: 
మురళీ లోలుడు ఒకవంక... ముద్దుల రాధిక ఒక వంక
రాధాకృష్ణుల రాసక్రీడలు - బృందావనికే సుందరదోలికలు
ఆనందాల మాలికలు - హాయ్,హాయ్, హాయ్..




నానీ, నా పేరును నిలపాలి పాట సాహిత్యం

 
చిత్రం: వంశోద్దారకుడు (1972)
సంగీతం: ఘంటసాల
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ
గానం: ఘంటసాల

పల్లవి :
నానీ, నా పేరును నిలపాలి 
నానీ మనవంశం పెరగాలీ 
ఇంతవాడవు ఇంతింత వాడి వై  
నువ్వెంతో పెద్దవాడివై 

నానీ, నా పేరును నిలపాలి 
నానీ మనవంశం పెరగాలీ 

చరణం: 1
పసిపాపడు నా నటింట
పారాడాలని తపించినాను
ఇన్నియేళ్ళ తపసుకు నీవు 
వరమైనావు - తొలిసంబరమైనావు
ఇన్నియేళ్ళ తపసుకు నీవు 
వరమైనావు - తొలిసంబరమైనావు
మోరు నేడు చిగురించింది
ముద్దుగా మురిపెం విరబూసింది 

నానీ, నా పేరును నిలపాలి 
నానీ మనవంశం పెరగాలీ 

చరణం: 2
బుడి బుడి నడకలు తడబడనీక
నడక నేర్పెదను నీకీనాడు
తరబడు అడుగుల ముపలితనంలో
నువ్వే నన్ను నడిపించాలి 
నా నానివి నీవని నే గర్విస్తే 
నువ్వే నన్ను నడిపించాలి 
నా నానివి నీవని నే గర్విస్తే
లోకం నీ నాన్నను నేనని మెచ్చాలీ 

నానీ, నా పేరును నిలపాలి 
నానీ మనవంశం పెరగాలీ 
ఇంతవాడవు ఇంతింత వాడి వై  
నువ్వెంతో పెద్దవాడివై 

నానీ, నా పేరును నిలపాలి 
నానీ మనవంశం పెరగాలీ 



నువ్వూ నవ్వూ జతగా పాట సాహిత్యం

 
చిత్రం: వంశోద్దారకుడు (1972)
సంగీతం: ఘంటసాల
సాహిత్యం: అచార్య ఆత్రేయ
గానం: మంటసాల

పల్లవి:
నువ్వూ నవ్వూ జతగా
నేనూ నువ్వొక కధగా
నిండుగ నూరేళ్ళుండాలి 
నువ్ నిండుగ నూరేళ్ళుండాలి
బ్రతుకొక పండుగ కావాలి
నీ బ్రతుకొక పండుగ కావాలి 
హాపీ బర్ డే టూ యూ

కోరస్: హాపీ బర్ డే టూ యూ!

చరణం: 1
నిన్ను నేను చూచిన నిమిషం నాలో ఏదో కదిలింది
నువ్వు వీడి వెళ్లిన క్షణమది తెలియని బాధగా మిగిలింది
యీ అనుబంధం వెనకేముందో ఎవరిని అడగాలి?
అసలెందుకు తెలియాలి ?

చరణం: 2
ఎడారివంటి జీవితమందొక చల్లని చినుకై చినికావు
మమతలు మరచిన మనసుకు మరలా 
మధురిమలేవో చూపావు
నువ్వెవరై తే నేం నేనెవ రైతేనేం 
నువ్వెవరై తే నేం నేనెవ రైతేనేం 
కాలం కలిపిందిద్దరినీ 
ఏ కలపండి ఇటు కలిపిందో  ఎవరిని అడగాలి ?
అసలెందుకు తెలియాలి?

నువ్వూ నవ్వూ జతగా
నేనూ నువ్వొక కధగా
నిండుగ నూరేళ్ళుండాలి 
నువ్ నిండుగ నూరేళ్ళుండాలి



ఎక్కురాజా, కొండెక్కు రాజా పాట సాహిత్యం

 
చిత్రం: వంశోద్దారకుడు (1972)
సంగీతం: ఘంటసాల
సాహిత్యం: కొసరాజు
గానం: మాధవ పెద్ది సత్యం, పిఠాపురం నాగేశ్వరరావు, వసంత, విజయలక్ష్మి, కన్నారావు

ఎక్కురాజా, కొండెక్కు రాజా
ఎక్కురాజా, కొండెక్కు రాజా
కొండ పైన స్వామివారు కూర్చున్నాడూ రాజా 

తాయెత్తుకడతాడు యేరుకాస్త యిస్తాడు
పాండాది తిరక్కుండ పిల్లల పుటిస్తాడు,

ఎక్కలేనే నేనెక్కలేనే ఇంతింత కొండల్ని నేనెక్కలేనే!

మగవాళ్ల కాసామి బిడ్డల పట్టిస్తేను 
తొమ్మిది నెలలు మోసి కనలేను కనలేను

చీటిక మాటికి చిరాకుపడుతూ
దేవుడు దయ్యం అనుకోకుంటే
పిల్లలు ఏలా పుడతారో రయ్యో కోదండం
నీ ఇల్లెలా నిలబడతాదిరో రయ్యో కోదండం
ఇళ్ళూ వాకిల్లెన్ని వుండినా ఇన ప్పెట్టెలో డబ్బులుండినా
పిల్లలెందరిని అడుగుతారురా
డబ్బూ దస్కం అడగరురో దండం కోదండం
నీ కులమూ గోత్రమూ నిలబడురో దండం కోదండం

పిల్లా జల్లా కలిగారంటే ఇంట్లో జనాభా పెరిగిందంటే
జలసాలకు చోటుండక పైగా గుడి బండొక్కటి మెడకుపడతదే
తలచుకుంటే దడబుడతాదే గుండెలు జారిపోతాయే
వదు వద్దు వదు  సంతానమేమీ వద్దూ

పదరా పదరా మగడా తెలుసుకోర పామరుడా
పాపాయిలు లేకుంటే బ్రతుకే బండలు గదరా 
గొడ్డుబోతురాలని నను లోకులాడిపోస్తారూ
మంచికి చెడ్డకు పిలవక చిన్న చూపు చూస్తారూ
పసికందును కలిగించే భారము నీదేకదర 
లేకపోతే పాడునింద నీకే మిగులును గడరా

గోవింద.... గోవింద....

ఎక్కురా జా, కొండెక్కు రాజా, ఎక్కు రాజా, కొండెక్కు రాజా
గోవింద.... గోవింద....
ఎక్కురాజా – కొండెక్కు రాజా—

No comments

Most Recent

Default