Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Aggi Pidugu (1964)





చిత్రం: అగ్గిపిడుగు (1964)
సంగీతం: రాజన్-నాగేంద్ర
నటీనటులు: యన్.టి.రామారావు, కృష్ణకుమారి, రాజశ్రీ 
నిర్మాత, దర్శకత్వం: బి. విఠలాచార్య
విడుదల తేది: 31.7.1964



Songs List:



తప్పంటావా నా తప్పంటావా పాట సాహిత్యం

 
చిత్రం: అగ్గిపిడుగు (1964)
సంగీతం: రాజన్-నాగేంద్ర
సాహిత్యం: సినారె
గానం: ఎస్.జానకి

తప్పంటావా నా తప్పంటావా
తెలియని ప్రేమకు పలుకులు నేర్పిన
తెలిసిపోయే పో పొమ్మంటావా

కొలనులోన నీవుంటివి
కొన కొమ్మమీద నేనుంటిని
మిసిమి వలపు నీదంటిని
నువు బుసలుకొడుతు నిలుచుంటివి
నిన్నే కోరెను వన్నెల రోజా
సిగ్గెందుకోయ్ నా చిన్నారి రాజా

తప్పంటావా నా తప్పంటావా

పొదలు దాగుకొనుటెందుకు 
కదలి కదలి రా ముందుకు
ఒడలు ఆరిపోనీయకు
ఈ గడియ జారిపోనియకు
ఎవ్వరు లేని ఈ చలివేళ
సింగారింతు నిను బంగారు రాజా




ఏమో ఏమో యిది పాట సాహిత్యం

 
చిత్రం: అగ్గిపిడుగు (1964)
సంగీతం: రాజన్-నాగేంద్ర
సాహిత్యం: సినారె
గానం: ఘంటసాల, ఎస్.జానకి

ఏమో ఏమో యిది  నాకేమో ఏమొ అయినది
ఈ వేళలో నా గుండెలో ఏదో గుబులవుతున్నది.

ఏమో ఏమో అది  నీకేమి యేమి అయినది
ఈ వేళలో నీ గుండెలో ఎందుకు గుబులవుతున్నది

కనులలో నీ కనులలో నా కలలే పొంగినవి
కురులలో ముంగురులలో నా కోరిక లూగినవి
వింతగా కవ్వింతగా ఈ వెన్నెల పూచినది
చెంతగా నువు చేరగా గిలిగింతగ తోచినది

||ఏమో ఏమో యిది// 

ఎందుకో సిగ్గేందుకో నా అందాల బొమ్మకు
అందుకో చేయందుకో మరి ఆ వైపుచూడకు
నవ్వుతో ముసి నవ్వుతో హోయ్ నను దోచి వేయకు
మాటతో సయ్యాటతో నను మంత్రించి వేయకు

"ఏమో ఏమో యిది"




కన్ను కన్ను చేరా పాట సాహిత్యం

 
చిత్రం: అగ్గిపిడుగు (1964)
సంగీతం: రాజన్-నాగేంద్ర
సాహిత్యం: జి. కృష్ణమూర్తి B. A.
గానం:  ఎస్.జానకి

కన్ను కన్ను చేరా  పున్నమి వెన్నె లేరా
చిన్నబోవనేరా - లేరా దొరా
వలపు లొలుక వచ్చానోయి  వాదులాడ మేలేనా
కోపాన కసరే వేలా  కోమలాంగినోయీ
రమ్ముంటే నే వచ్చానా  పొమ్మంటే నే పోతానా
పంతాలు చాలోయీ  రావేరా

"కన్ను కన్ను చేరా

మిసిమి వయసు పొంగిందీ యీ వన్నెలాడి వేడింది
ఈ బుస్సు బుసలు మానీ ఊసులాడవోయీ
మెచ్చానూ నే వచ్చానూ నచ్చావూ మనసిచ్చాను
అందం చందం నీదేగా

"కన్ను కన్ను చేరా"





లడ్డూ లడ్డూ లడ్డూ పాట సాహిత్యం

 
చిత్రం: అగ్గిపిడుగు (1964)
సంగీతం: రాజన్-నాగేంద్ర
సాహిత్యం: జి. కృష్ణమూర్తి B. A.
గానం:  ఘంటసాల, ఎస్.జానకి

లడ్డూ లడ్డూ లడ్డూ  బందరు మిఠాయిలడ్డూ
బూందీ లడ్డు, కోవాలడ్డూ, రవ్వా లడ్డూ
మిస్రీ బాదం పిస్తా కిసి మిసి కలిసిన  లడ్డూ  
నేతి మిఠాయి లడ్డూ

కావాలంటే రాదూ  బజారులోనే లేదు
యోగం మీకే ఉంది  మీ చేతికి వచ్చింది
బక్క నక్క తిన్నాడా  పిక్కబలం హెచ్చు
ముసలి తాత తిన్నాడా  పడుచు తనం వచ్చు
వస్తాదై పోవాలంటే  కుస్తీ లో నెగ్గాలంటే
దండా. కండా, ధైర్యం, దాటి
ధీమా, గీమా అందిస్తుంది లడ్డూ

"లడ్డూ లడ్డూ లడ్డూ"

హనుమంతుడు తిన్నాడు - లంకకు లంఘించాడు
రావణుడూ తిన్నాడూ  కైలాసమె కదిలించాడు
ఉండను తింటే భూమే గుండ్రంగా ఉందంటారు
ముక్క కొరికితే చాలు  స్వర్గాన్నే చూస్తారు
రమ్మంటే రంబోస్తుంది  మిమ్మల్నే ప్రేమిస్తుంది!
లోకం, శోకం, బాధా బందీ
చీదర బాదర మరిపిస్తుంది 



ఎవరనుకున్నావే పాట సాహిత్యం

 
చిత్రం: అగ్గిపిడుగు (1964)
సంగీతం: రాజన్-నాగేంద్ర
సాహిత్యం: సినారె
గానం:  పి.సుశీల , ఎస్.జానకి

ఎవరనుకున్నావే  ఏమనుకున్నావే
చిక్కని నెలరేడే చక్కని చెలికాడె  
ఎవడే  ఎవడే  ఇంకెవడే  నా ప్రియుడే

ఎవరనుకున్నావే  ఏమనుకున్నా వే
ఎగు భుజములవాడే  మగసిరి కలవాడే
ఎవడే ఎవడే ఇంకెవడే  నా ప్రియుడే

చెంపకు చేరడేసి కన్నులతో
సంపంగి పూలవంటి వన్నెలతో
కలలో తానే కనిపించాడే
చెలియా నన్నే కవ్వించాడే

ఎవరనుకున్నావే  ఏమనుకున్నావే

అతడే కోరచూపు చూస్తుంటే
ఆపైన పడుచుగాలి వీస్తుంటే
ఏదో ఏదో అయిపోతాదే
ఎంతో ఎంతో బాగుంటాదే

"ఎవరనుకున్నావే"

చల్లని నీటిలోన నేనుంటే
వెచ్చని నారాజు తోడుంటే
మనసే లోలో ఝుమ్మంటాదే
వలపే అలయై రమ్మంటాదే

ఎవడే  ఎవడే
ఇంకెవడే నా ప్రియుడే
ఎవరనుకున్నావే




నేనే, నేనే, పాట సాహిత్యం

 
చిత్రం: అగ్గిపిడుగు (1964)
సంగీతం: రాజన్-నాగేంద్ర
సాహిత్యం: సినారె
గానం:  L.R. ఈశ్వరి 

నేనే, నేనే, నేనే - నీ చిన్నిదానను నేనే
నీ చేతి వీణను నేనే
గవ్వ యేదో, రవ్వ యేదో - కళ్ళు తెరచి చూసుకో
విన్ను వలచే కన్నె ఎవరో, నేటికైనా తెలుసుకో

"నేనే, నేనే, నేనే

కసురుకుంటే, విసుగుకుంటే కన్నె వలపే మారును
కలుసుకుంటే, తెలుసుకుంటే, వలపులన్నీ తీరును

" నేనే, నేనే, నేనే

No comments

Most Recent

Default