Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Vandemataram (1985)




చిత్రం: వందేమాతరం (1985)
సంగీతం: కె. చక్రవర్తి
సాహిత్యం: డా॥ సి.నారాయణరెడ్డి, దాసం గోపాలకృష్ణ, ఎస్. అదృష్ట దీపక్ 
గానం: యస్.పి.బాలు, యస్.జానకి, పి.సుశీల, యస్.పి.శైలజ, వందేమాతరం శ్రీనివాస్, మాధవపెద్ది రమేష్ 
నటీనటులు: విజయశాంతి,  రాజశేఖర్ (నూతన పరిచయం), రాజేంద్రప్రసాద్, సాయికుమార్, బేబీ శుభశ్రీ 
దర్శకత్వం: టి.కృష్ణ
నిర్మాత: అనిల్ బాబు
విడుదల తేది: 27.09.1985



Songs List:



వందే మాతరం.. పాట సాహిత్యం

 
చిత్రం: వందేమాతరం (1985)
సంగీతం: కె. చక్రవర్తి
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి
గానం: వందేమాతరం శ్రీనివాస్ (Debut Song)

పల్లవి:
వందే మాతరం.. వందే మాతరం
వందే మాతరం.. వందే మాతరం
వందే మాతర గీతం వరస మారుతున్నది
వందే మాతర గీతం వరస మారుతున్నది
తరం మారుతున్నది.. ఆ స్వరం మారుతున్నది
తరం మారుతున్నది.. ఆ స్వరం మారుతున్నది

చరణం: 1
సుజల విమల కీర్తనలో.. సుఫలాశయ వర్తనలో
సుజల విమల కీర్తనలో.. సుఫలాశయ వర్తనలో
జలం లేక బలం లేక జనం ఎండుతున్నది
మలయజ శీతల పదకోమల భావన బాగున్నా..ఆ..
కంటి కంటిలో తెలియని మంట రగులుతున్నది..
మంట రగులుతున్నది..

తరం మారుతున్నది.. ఆ స్వరం మారుతున్నది
తరం మారుతున్నది.. ఆ స్వరం మారుతున్నది
వందే మాతరం.. వందే మాతరం

చరణం: 2
సస్యశ్యామల విభవస్తవ గీతాలాపనలో..ఓ..
సస్యశ్యామల విభవస్తవ గీతాలాపనలో..ఓ..
పైరు నోచుకోని బీళ్ళు నోళ్ళు తెరుస్తున్నవి
సుప్రజ్యోత్స్నా పులకిత సురుచిర యామినులలోనా..ఆ..
రంగు రంగు చీకట్ల గిరాకి పెరుగుతున్నది..
గిరాకి పెరుగుతున్నది..

తరం మారుతున్నది.. ఆ స్వరం మారుతున్నది
తరం మారుతున్నది.. ఆ స్వరం మారుతున్నది
వందే మాతరం.. వందే మాతరం

చరణం: 3
పుల్లకు సుమిత ధ్రుమదళ వల్లికామ తల్లి కలకూ..ఊ..
పుల్లకు సుమిత ధ్రుమదళ వల్లికామ తల్లి కలకూ..ఊ..
చిదిమి వేసినా వదలని చీడ అంటుకున్నది

సుహాస్ర సంపదలకేమి సుమధుర భాషణలకేమీ..ఈ..
ముసి ముసి నవ్వుల మాటున విషం మరుగుతున్నది..
ప్రజా సుఖమే తమ సుఖమని వరదానాలిస్తున్నా..
ఎక్కడ వేసిన గొంగళి అక్కడనే వున్నది..
ఎక్కడ వేసిన గొంగళి అక్కడనే వున్నది..
అక్కడనే వున్నది....

తరం మారుతున్నది.. ఆ స్వరం మారుతున్నది
తరం మారుతున్నది.. ఆ స్వరం మారుతున్నది

వందే మాతరం.. వందే మాతరం
వందే మాతర గీతం వరస మారుతున్నది
వందే మాతర గీతం వరస మారుతున్నది
తరం మారుతున్నది.. ఆ స్వరం మారుతున్నది
తరం మారుతున్నది.. ఆ స్వరం మారుతున్నది




ఆకాశమా నీవెక్కడ.. పాట సాహిత్యం

 
చిత్రం: వందేమాతరం (1985)
సంగీతం: కె. చక్రవర్తి
సాహిత్యం:  డా॥ సి. నారాయణరెడ్డి
గానం: యస్.పి.బాలు, యస్.జానకి 

పల్లవి:
ఆకాశమా నీవెక్కడ.. అవని పైనున్న నేనెక్కడా
ఆకాశమా నీవెక్కడ.. అవని పైనున్న నేనెక్కడా

ఏ రెక్కలతో ఎగిసి వచ్చినా...
ఏ రెక్కలతో ఎగిసి వచ్చినా.. నిలువగలన నీపక్కన

ఆకాశమా నీవెక్కడ.. అవని పైనున్న నేనెక్కడా

చరణం: 1
నీలాల గగనాల ఓ జాబిలి..
నిను నిరుపేద ముంగిట నిలిపేదెలా?
నీలాల గగనాల ఓ జాబిలి..
నిను నిరుపేద ముంగిట నిలిపేదెలా?
ముళ్ళున్న రాళ్లున్న  నా దారిలో
నీ చల్లని పాదాలు సాగేదెలా?
నీ మనసన్నది నా మది విన్నది..
నిలిచి పోయింది ఒక ప్రశ్నలా
నిలిచి పోయింది ఒక ప్రశ్నలా..

ఆకాశమా... లేదక్కడ ...
ఆకాశమా లేదక్కడ... అది నిలిచి ఉంది నీ పక్కన
వేల తారకలు తనలో వున్నా..
వేల తారకలు తనలో వున్నా
నేలపైనే తన మక్కువ
ఆకాశమా లేదక్కడ... అది నిలిచి ఉంది నీ పక్కన

చరణం: 2
వెలలేని నీ మనసు కోవెలలో
నను తల దాచుకోని చిరు వెలుగునై
వెలలేని నీ మనసు కోవెలలో
నను తల దాచుకోని చిరు వెలుగునై
వెను తిరిగి చూడని నీ నడకలో
నను కడదాక రాని నీ అడుగునై
మన సహజీవనం వెలిగించాలి నీ
సమత కాంతులు ప్రతి దిక్కున
సమత కాంతులు ప్రతి దిక్కున

ఆకాశమా నీవెక్కడ..
అది నిలిచి వుంది నా పక్కన
వేల తారకలు తనలో వున్నా..
వేల తారకలు తనలో వున్నా..
నేలపైనే తన మక్కువ...
ఈ నేలపైనే తన మక్కువ




అల్లాటప్ప ఆడదాన్ని కాదురబ్బాయా పాట సాహిత్యం

 
చిత్రం: వందేమాతరం (1985)
సంగీతం: కె. చక్రవర్తి
సాహిత్యం: దాసం గోపాలకృష్ణ
గానం: యస్.పి.శైలజ, పి.సుశీల 

అల్లాటప్ప ఆడదాన్ని కాదురబ్బాయా




ఏదయ మీ దయ పాట సాహిత్యం

 
చిత్రం: వందేమాతరం (1985)
సంగీతం: కె. చక్రవర్తి
సాహిత్యం:  డా॥ సి. నారాయణరెడ్డి
గానం: యస్.పి.బాలు, యస్.జానకి 

ఏదయ మీ దయ



నా పేరు పల్లెటూరు పాట సాహిత్యం

 
చిత్రం: వందేమాతరం (1985)
సంగీతం: కె. చక్రవర్తి
సాహిత్యం: అదృష్ట దీపక్ 
గానం: యస్.పి.శైలజ, మాధవపెద్ది రమేష్ 

నా పేరు పల్లెటూరు

No comments

Most Recent

Default