Home Movie Songs Latest Updated Movies Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box



చిత్రం: 47 Days (2018)
సంగీతం: రఘు కుంచె
సాహిత్యం: లక్ష్మీభూపాల 
గానం: నీహ కడివెటి
నటీనటులు: సత్యదేవ్, పూజా జవేరి, రోషిణి ప్రకాష్
దర్శకత్వం: ప్రదీప్ మద్దాలి
నిర్మాతలు: దబ్బర శశి, భూషణ్ నాయుడు
విడుదల తేది: 15.03.2018

క్యాకరూఁ.. మై క్యాకరూఁ
ఆ నవ్వు చూస్తే మాటరాదే క్యాకరూఁ..
పావురాయల్లే నేను పోతుంటే
నీలి మబ్బై దారి కాచాడే
తేనె చుక్కల్లే జారిపోతుంటే
తుమ్మెదల్లే తాను మారాడే
ఓ మాహివే.. మాహివే..
ఓ మాహివే.. మాహివే..
క్యాకరూఁ.. ఎంత గడుసోడే
క్యాకరూఁ.. సొంతమయ్యాడే

మనసు నాకైనా చెప్పకుండానే
ఎప్పుడో తనతో వెళ్ళిందా
వయసు రాగానే ఎదురుగా తానే
ఎన్నడో ముడిపడిపోయిందా
ఓయ్ నేస్తమా నా ప్రాణమా
నా తోడుగా ఉంటావనే
వున్నానులే నీ కోసం
చిరుగాలి పరదాల్లో
అలసిన కలువగ
చెలియను ఐతే

క్యాకరూఁ.. ఓ మాహివే
మై క్యాకరూఁ.. ఎంత గడుసోడే

పచ్చబొట్టల్లే మారిపోయాడే
వెచ్చగా నాలో కలిశాడే
కాలి మెట్టల్లే చుట్టుకున్నాడే
జంటగా నాతో నడిచాడే
ఓ అమ్మలా ఈ జన్మలా
కలిశావులే కల కాదుగా
విడిపోనులే చితినైనా
మనసంతా నువ్వైతే
నేనని నువ్వని వేరౌతానా

క్యాకరూఁ..మై క్యాకరూఁ..
ఆ నవ్వు చూస్తే మాటరాదే క్యాకరూఁ..
పావురాయల్లే నేను పోతుంటే
నీలి మబ్బై దారి కాచాడే
తేనె చుక్కల్లే జారిపోతుంటే
తుమ్మెదల్లే తాను మారాడే

No comments

Most Recent

Default