Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Saubhagyavati (1975)




చిత్రం: సౌభాగ్యవతి (1975)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: ఎ. వేణుగోపాల్
గానం: ఎల్.ఆర్.ఈశ్వరి
నటీనటులు: కృష్ణ , శారద
దర్శకత్వం: పి.చంద్రశేఖర రెడ్డి
నిర్మాత: పి.నాగభూషణం యాదవ్
విడుదల తేది: 01.05.1975



Songs List:



గోలుకొండ దిబ్బ పాట సాహిత్యం

 
చిత్రం: సౌభాగ్యవతి (1975)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: ఎ. వేణుగోపాల్
గానం: ఎల్.ఆర్.ఈశ్వరి

గోలకొండ దిబ్బ భలే గుండ్రమైన దబ్బా
గుట్టు తెలుపుదబ్బో గోల చేయకబ్బా

ఎత్తు వంపుల దిబ్బపై ఎక్కి ఎక్కి చూడాలి
మత్తుగ గమ్మత్తుగ మీ మనసు లయలూగాలి
సత్తువ చూపాలి సరదాలు పొందాలి
కొత్తవారు ఒక్కసారి ఎక్కి చూస్తే అబ్బోయబ్బా

నవాబులూ తానిషాలు ఎక్కిన దీ దిబ్బ
నాణ్యమైన వజ్రాలను కన్నది ఈ దిబ్బ
ఎందరో కన్నేసి ఎదురు దెబ్బ తిన్నారు
ఒక్కరికే దక్కింది కోహినూరు ఓయబ్బా

బండపరుపు రాళ్ళల్లో ఎత్తైనది ఈ కొండ
కండబలం లేనివారు ఎక్కలేరు ఈ కొండ
రబ్బరు బంతల్లే రమ్యమైన దీ దిబ్బ
నిబ్బరంగ పైకెక్కితే క్రిందంతా పట్నమబ్బా




వలపుల పూల పాట సాహిత్యం

 
చిత్రం: సౌభాగ్యవతి (1975)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: దాశరధి
గానం: సుశీల, ఎస్.పి.బాలసుబ్రమణ్యం

పలవి: 
వలవుల పూలవానలలో వయసే విరిసేలే
కౌగిలిలో మైమరచీ కరిగి కరిగిపోనా,
వలపుల తేనెవానలలో నా మనసే తడిసెలే 

చరణం: 1
పాటనై నీదు పెదవులపై పలుకనా తీయగా
పాపనై నీదు కన్నులలో ఊగనా ఊయల
నీ మనసే కోవెలగా నేను నిలిచిపోనా

చరణం: 2 
కురులలో పారిజాతాల పరిమళం నింపనా
మమతతో ప్రేమగీతాల మధువులే చిందనా
నీ జతగా కలకాలం మురిసి మురిసి పోనా
యెన్నడో చేసుకున్నాను ఎంతో పుణ్యము
అందుకే అందుకున్నాను ఈ సౌభాగ్యము
నా చెలివై నీవుంటే లేని భాగ్యమేది



కలదని లోపము పాట సాహిత్యం

 
చిత్రం: సౌభాగ్యవతి (1975)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: ఎ. వేణుగోపాల్
గానం: ఎస్.పి.బాలసుబ్రమణ్యం

చరణం: 1
కలదని లోపము కలవరపడుకు
చీకటిలోనే దీపము బ్రతుకు
నా కనుచూపులు , నాలో చదువులు
నీవేయనుకొని నవ్వుతు గడువు? 
మట్టిలో పుట్టిన ఏ మణికైనా
మకుటములోన స్థానము లేదా
శిలలో చెక్కిన నల్లని బొమ్మను
ఇల వేలుపుగా కొలుచుట లేదా

మూగ మనసుల ముచ్చట వినుచు
సిగలో మల్లెలు చిలిపిగ నవ్వెను
బిగి కౌగిలిలో హాయిని పొంది
నాలో సగమై నడిచే వేళ




కసి ఉసి ఉసి కసి పాట సాహిత్యం

 
చిత్రం: సౌభాగ్యవతి (1975)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: ఎ. వేణుగోపాల్
గానం: యస్. జానకి

పలవి: 
కసీ ఉసీ, ఉసీ కసీ ఉన్న దాన్ని రా
మనసెన మగాడికి నిషానురా
చురుకైన మొనగాడికి ఖుషీనిరా ఏమ్మా 

చరణం: 1 
సిసలైన పసవున్న చిన్నోడా, నీ
కసిదీర నా వయసు దోచుకోరా రాం
నిషాకండలో నన్ను దాచుకోరా
నా ఎదలోన ఊపిరిగా నిలిచిపోరా
కమ్మని, యవ్వనం, ఉందిరా, అందుకో ... ఏమ్మా

చరణం: 2 
మందు వేసి మత్తులో నీవుంటే, 
ఈ ముద్దుగుమ్మ ముచ్చ టెవరు తీర్చేరురా
మనసున్న మగాడికి ప్రాణమిత్తురా
మాట తప్పినోడి బ్రతుకు మట్టి చేతురా
టక్కరి పిలను సొంతము చేసుకో...ఏమ్మా




ఎందుకింత కంగారు పాట సాహిత్యం

 
చిత్రం: సౌభాగ్యవతి (1975)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: ఎ. వేణుగోపాల్
గానం: పిఠాపురం, యస్. జానకి

హాయ్
నువ్వా

ఎందుకింత కంగా రూ ఓ సింగరయ్యా
ఇన్నాళ్ళుగా వేయమన్న వేషమయ్య
నువ్విన్నాళ్ళుగా వేయనున్న వేషమయ్య

పైట లేని నిన్ను చూడ సిగ్గాయె అయ్యోరామా
మాటవరుస కేదో అన్నానే ఓ సుందరమ్మ
నీ మనసు మళ్ళీ మార్చుకో ఓ ముద్దుల గుమ్మా

కొతరకం వేషంతో కులుకులాడే
ఆడపిల్లలే కంటికి అందమన్నావు
టక్కు టిక్కు చూపించే తారలాగా
నే చక్కనేస మేనుకొస్తే వదంటావా

కట్టు బొట్టు మాని,
మన సాంప్రదాయం వదిలి

ఇల్లాలే ఈలాగా మారినపుడు
ఆ యింటి వాడి బ్రతుకంతా గోవిందా
ఎ మంచివాడి పరువైన గోవిందా
ఇప్పుడైన తెలిసిందా ఇంతులంటేను
చేత కాని వాళ్ళ క్రింద లెక్కేయకు
తలచుకుంటే ఏపనైనా చేసి చూపిస్తారు
తెలుసుకొని, మసలుకుంటే బాగుపడతావు




మదిలో తలచు కున్నా పాట సాహిత్యం

 
చిత్రం: సౌభాగ్యవతి (1975)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: ఎ. వేణుగోపాల్
గానం: వాణీజయరామ్

పల్లవి: 
మదిలో తలచుకున్న శ్రీవారే దొరికినారు
మరిచిపోని మధురమైన ఆశ లెన్నో రేపారు

చరణం: 1 
కన్న కలలు సఫలమౌనని తెలుసుకున్నాను నేడు
కన్నెహృదయం కానుక నొసగి ఎన్నుకున్నాను తోడు
మనసు మురిపించి తనువు నర్పించి
అనురాగమే అందుకుంటాను

చరణం: 2 
మరిదిగారి మంచి చూసి మురిసిపోతావు నీవు
నీ బాబాయి నిన్ను చేరి పొంగిపోయేరు బాబు
బోసిగ నవ్వాలి, ముద్దులు ఇవ్వాలి
బాబాయితో ఆడుకోవాలి


No comments

Most Recent

Default