చిత్రం: మహాకవి క్షేత్రయ్య (1976) సంగీతం: పి. ఆదినారాయణ రావు నటీనటులు: అక్కినెని నాగేశ్వర రావు, అంజలి దేవి, మంజుల దర్శకత్వం: ఆదుర్తి సుబ్బారావు నిర్మాత: పి. ఆదినారాయణ రావు విడుదల తేది: 31.03.1976
Songs List:
ఆ.. రేపల్లె లోని గోపాలుడంట.. పాట సాహిత్యం
చిత్రం: మహాకవి క్షేత్రయ్య (1976) సంగీతం: పి. ఆదినారాయణ రావు సాహిత్యం: ఆరుద్ర గానం: వి.రామకృష్ణ పల్లవి: ఆ.. రేపల్లె లోని గోపాలుడంట.. ఏ పిల్లనైనా చూస్తే తంట తలచుకుంటె ఆ జగడం కన్నుల పంట.. ఓ మజా మజా కన్నుల పంట ఆ రేపల్లె లోని గోపాలుడంట.. ఏ పిల్లనైనా చూస్తే తంట తలచుకుంటె ఆ జగడం కన్నుల పంట.. ఓ మజా మజా కన్నుల పంట చరణం: 1 సుందరి జాణ బిందెలతోటి నీలాల రేవు కొచ్చిందట సుందరి జాణ బిందెలతోటి నీలాల రేవు కొచ్చిందట కళ్ళు కోలాటమాడ మెచ్చిందంట క్రిష్ణయ్య రాగా అహ కేరింతలాడ.. క్రిష్ణయ్య రాగా కేరింతలాడ పైట జారె బిందె జారె తెల్లబోయి పిల్లా జారె పైట జారె బిందె జారె తెల్లబోయి పిల్లా జారె తలచుకుంటె ఆ వైనం నవ్వులపంట ఆ రేపల్లె లోని గోపాలుడంట ఏ పిల్లనైనా చూస్తే తంట తలచుకుంటె ఆ జగడం కన్నుల పంట చరణం: 2 చక్కని చుక్క సందేళ గుళ్ళో.. మొక్కులు మొక్కంగ వచ్చిందంట చక్కని చుక్క సందేళ గుళ్ళో.. మొక్కులు మొక్కంగ వచ్చిందంట అహ.. నిక్కుతు నీల్గుతు వచ్చిందంటా నల్లనివాడు అల్లవరగా.. నల్లనివాడు అల్లవరగా కళ్ళు కలిపే ఒళ్ళు మరిచే.. దూరాన మొగుడు కారాలు నూరె కళ్ళు కళ్ళు కలిపే ఒళ్ళు మరిచే.. దూరాన మొగుడు కారాలు నూరె కళ్ళు తలచుకుంటె ఆ రగడ రవ్వలమంట ఆ రేపల్లె లోని గోపాలుడంట ఏ పిల్లనైనా చూస్తే తంట తలచుకుంటె ఆ జగడం కన్నుల పంట చరణం: 3 అందాలభామ చిందులు వేయ అందలమెక్కి సాగిందంట అందాలభామ చిందులు వేయ అందలమెక్కి సాగిందంట.. తన అందాలు కాస్త దాచిందంట పిల్లనగ్రోవి మొల్లనవింటే.. హాయ్ పిల్లనగ్రోవి మొల్లనవింటే మేనుపొంగి మేనా ఆపి.. తానేమొ క్రిష్ణయ్య సన్నిధి చేరె మేనుపొంగి మేనా ఆపి.. తానేమొ క్రిష్ణయ్య సన్నిధి చేరె తలచుకుంటె ఆ జోడి గువ్వలజంట ఆ రేపల్లె లోని గోపాలుడంట ఏ పిల్లనైనా చూస్తే తంట తలచుకుంటె ఆ జగడం కన్నుల పంట.. ఓ కన్నుల పంట
జాబిల్లి చూసెను నిన్ను నన్ను పాట సాహిత్యం
చిత్రం: మహాకవి క్షేత్రయ్య (1976) సంగీతం: పి . ఆదినారాయణ రావు సాహిత్యం: దాశరథి గానం: పి. సుశీల, వి.రామకృష్ణ జాబిల్లి చూసెను నిన్ను నన్ను .. ఒయమ్మో.. నా కెంత సిగ్గాయె బావా బావా.. నను వీడలేవా?? పొదరిల్లు పిలిచేను నిన్ను నన్ను.. ఓయబ్బో.. నీకింత సిగ్గెల బాల బాల.. నను చేరరావా?? ఆ ఆ ఆ ఆ ఆకాశ మార్గాన అందాల మేఘాలు పెనవేసుకున్నాయి చూడు.. చిగురాకు సరదాలు చిరుగాలి సరసాలు గిలిగింతలాయేను నేడు.. అందచందాలతో..ప్రేమబందాలతో.. జీవితం హాయిగా సాగనీ!! బాలా..రావా..నను చేరరావా?? ఆ ఆ ఆ ఆ కొమ్మపై ఉన్న అందాల చిలకలు అనురాగ గీతాలు పాడేను.. సిరిమల్లె ఒడిలోన చిన్నారి తుమ్మెద మైమరచి కలలందు కరిగేను ముద్దుమురిపాలతో..భావ రాగాలతో.. యవ్వనం పువ్వులా నవ్వనీ!! బావా బావా.. నను వీడలేవా?? ఆ ఆ ఆ బంగారు చెక్కిళ్ళూ పొంగారు పరువాలు కొనగోట మీటులే కోరేను.. నీ లేత అధరాలు, ఎంతెంత మధురాలు,ఈనాడు నా సొంతమాయేను.. దేవి దీవించేను..స్వామి వరమిచ్చెను.. ఇద్దరం ఏకమౌదాములే!! బాలా..రావా..నను చేరరావా?? జాబిల్లి చూసెను నిన్ను నన్ను .. ఒయమ్మో.. నా కెంత సిగ్గాయె బావా బావా.. నను వీడలేవా?? పొదరిల్లు పిలిచేను నిన్ను నన్ను.. ఓయబ్బో.. నీకింత సిగ్గెల బాల బాల.. నను చేరరావా?? ఆ ఆహహ ఆహహ.. ఆ ఆ ఆ ఆ ఆహ ఆహ హహ.. ఆ ఆహహ ఆహహ.. ఆ ఆ ఆ ఆ ఆహ ఆహ హహ..
ఎండు ఎండని పాట సాహిత్యం
చిత్రం: మహాకవి క్షేత్రయ్య (1976) సంగీతం: పి. ఆదినారాయణ రావు సాహిత్యం: ఆరుద్ర గానం: పి. సుశీల ఎండు ఎండని
శ్రీపతి పాట సాహిత్యం
చిత్రం: మహాకవి క్షేత్రయ్య (1976) సంగీతం: పి. ఆదినారాయణ రావు సాహిత్యం: క్షేత్రయ్య గానం: వి.రామకృష్ణ శ్రీపతి
ఎన్నాళ్ళవాలే పాట సాహిత్యం
చిత్రం: మహాకవి క్షేత్రయ్య (1976) సంగీతం: పి. ఆదినారాయణ రావు సాహిత్యం: క్షేత్రయ్య గానం: వి.రామకృష్ణ ఎన్నాళ్ళవాలే
అందరినే మోవితన్య పాట సాహిత్యం
చిత్రం: మహాకవి క్షేత్రయ్య (1976) సంగీతం: పి. ఆదినారాయణ రావు సాహిత్యం: క్షేత్రయ్య గానం: వి.రామకృష్ణ అందరినే మోవితన్య
ఇద్దరి సందున పాట సాహిత్యం
చిత్రం: మహాకవి క్షేత్రయ్య (1976) సంగీతం: పి. ఆదినారాయణ రావు సాహిత్యం: క్షేత్రయ్య గానం: వి.రామకృష్ణ ఇద్దరి సందున
నజరాన పాట సాహిత్యం
చిత్రం: మహాకవి క్షేత్రయ్య (1976) సంగీతం: పి. ఆదినారాయణ రావు సాహిత్యం: సి. నారాయణ రెడ్డి గానం: పి. సుశీల నజరాన
ఎటువంటి మోహమో గాని పాట సాహిత్యం
చిత్రం: మహాకవి క్షేత్రయ్య (1976) సంగీతం: పి. ఆదినారాయణ రావు సాహిత్యం: క్షేత్రయ్య గానం: వి.రామకృష్ణ ఎటువంటి మోహమో గాని ఓ యలనాగ యింతింత యనగరాదే ఎటువంటి మోహమో గాని ఓ యలనాగ యింతింత యనగరాదే మటు మాయ దైవమీ మనసు తెలియగ లేక మనలనెడబాసనయ్యో మటు మాయ దైవమీ మనసు తెలియగ లేక మనలనెడబాసనయ్యో ఓ.. మగువ.. ఎటువంటి మోహమో గాని ఓ యలనాగ యింతింత యనగరాదే కలికి నిన్నెడబాసినది మొదలు నీరూపు కనులకే కట్టి నటులుండునే చెలియ నేనొకటి తలచెదనన్న నీ చేయు చెలిమి తలపై యుండునే ఓ మగువా సొలసి నేనేయైన వ్రాయ నీయాకార శోభనమే కనుపించునే సొలసి నేనేయైన వ్రాయ నీయాకార శోభనమే కనుపించునే ఎటువంటి మోహమో గాని ఓ యలనాగ యింతింత యనగరాదే
శ్రీ మన్మహోదేవ పాట సాహిత్యం
చిత్రం: మహాకవి క్షేత్రయ్య (1976) సంగీతం: పి. ఆదినారాయణ రావు సాహిత్యం: ఆరుద్ర గానం: పిఠాపురం, పి. సుశీల, ఆనంద్ శ్రీ మన్మహోదేవ
విడజారు గొజ్జంగి పాట సాహిత్యం
చిత్రం: మహాకవి క్షేత్రయ్య (1976) సంగీతం: పి. ఆదినారాయణ రావు సాహిత్యం: క్షేత్రయ్య గానం: వి.రామకృష్ణ విడజారు గొజ్జంగి
చల్లగా నెలకొనవయ్యా పాట సాహిత్యం
చిత్రం: మహాకవి క్షేత్రయ్య (1976) సంగీతం: పి. ఆదినారాయణ రావు సాహిత్యం: ఆరుద్ర గానం: వి.రామకృష్ణ చల్లగా నెలకొనవయ్యా
ముద్దు పెట్టలేవుర పాట సాహిత్యం
చిత్రం: మహాకవి క్షేత్రయ్య (1976) సంగీతం: పి. ఆదినారాయణ రావు సాహిత్యం: క్షేత్రయ్య గానం: వి.రామకృష్ణ ముద్దు పెట్టలేవుర
వదరాకపో పాట సాహిత్యం
చిత్రం: మహాకవి క్షేత్రయ్య (1976) సంగీతం: పి. ఆదినారాయణ రావు సాహిత్యం: క్షేత్రయ్య గానం: వి.రామకృష్ణ వదరాకపో
ఆ పొద్దు ఈ పొద్దు పాట సాహిత్యం
చిత్రం: మహాకవి క్షేత్రయ్య (1976) సంగీతం: పి. ఆదినారాయణ రావు సాహిత్యం: సి. నారాయణ రెడ్డి గానం: యస్.పి. బాలు, పి. సుశీల ఆ పొద్దు ఈ పొద్దు
మేలుకో కవిరాజా పాట సాహిత్యం
చిత్రం: మహాకవి క్షేత్రయ్య (1976) సంగీతం: పి. ఆదినారాయణ రావు సాహిత్యం: సి. నారాయణ రెడ్డి గానం: యస్.పి. బాలు మేలుకో కవిరాజా
అష్ట విద్నాయక లక్షణములు పాట సాహిత్యం
చిత్రం: మహాకవి క్షేత్రయ్య (1976) సంగీతం: పి. ఆదినారాయణ రావు సాహిత్యం: సి. నారాయణ రెడ్డి గానం: యస్.పి. బాలు, పి. సుశీల అష్ట విద్నాయక లక్షణములు
No comments
Post a Comment