Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Guvvala Janta (1981)





చిత్రం: గువ్వలజంట (1981)
సంగీతం: జె.వి.రాఘవులు
నటీనటులు: కృష్ణంరాజు, జయసుధ, పుష్పలత, రంగనాథ్, జయమాలిని
మాటలు: ఆచార్య ఆత్రేయ
పాటలు: వేటూరి, ఆరుద్ర 
దర్శకత్వం: కె.వాసు
నిర్మాత: ఉప్పలపాటి సూర్యనారాయణ రాజు
విడుదల తేది: 06.11.1981



Songs List:



పులకరింత పూసిందమ్మ పాట సాహిత్యం

 
చిత్రం: గువ్వలజంట (1981)
సంగీతం: జె.వి.రాఘవులు
సాహిత్యం: వేటూరి 
గానం: పి.సుశీల 

పులకరింత పూసిందమ్మ
కలవరింత కాసిందమ్మో
కొత్త కొత్తగా కోయిలమ్మ
గుండెకాయలో కూసిందంమో
కుహు కుహు కుహు

ఏటి గాలిలో ఏణువున్నది
పైటలాగినా పాటగున్నాది
మల్లియల్లో ఎన్నియల్లో
మల్లియల్లో పండుగల్లో
యవపూవులా తుమ్మెదలాడే
తీపి తేనెలా తానాలాడే
కొమ్మలో కోయిలమ్మలో
పూల రెమ్మలో ఎన్ని వయ్యారాలో

దొండపండులా పెదవులున్నాయి
కొండమల్లెలా నగవులున్నాయి
గుండియల్లో అందియల్లో
నిండుతున్న సందడుల్లో
రెపటేళలా రెప్పలల్లాడే
ఎండకన్నులే నన్ను గిల్లాడే
నవ్వులో పాల గువ్వలో
రివ్వు రివ్వనే సిగ్గు సింగారాలో



చిరుగాలి ఉయ్యాల పాట సాహిత్యం

 
చిత్రం: గువ్వలజంట (1981)
సంగీతం: జె.వి.రాఘవులు
సాహిత్యం: ఆరుద్ర
గానం: యస్.పి. బాలు

చిరుగాలి ఉయ్యాల 
చిరుగాలి ఉయ్యాల చిగురాకు జంపాల
ఊగేటి చిలకమ్మవో
సెలయేటి గలగలలో కెరటాల మిలమిలలో
నడయాడు రాయంచవో
నిన్నే నిన్నే నిన్నే ....... నిన్నే నిన్నే నిన్నే లే
నను పిలచితివో

చిరుగాలి నేనేలే చిగురాకు నేనేలే
ఊగేటి చిలకమ్మనూ
సెలయేరు నేనేలే కెరాటాలు నేనేలే
నడయాడు రాయంచనూ
నేనే నేనే నేనేలే.... నేనే నేనే నేనేలే
నను తలచితివో

చరణం: 1
తొంగి తొంగి చూసే సింగి ఎంతో
పొంగి పొంగి పోయే వేల నిన్ను
నీరెండసోకి నిగనిగలు తాకి
దోబూచులాడేను చాలా
దొంగాటలాడే ఈవేశా
కను విందుచేసేపు చాలా

||చిరుగాలి॥

చరణం: 2
చందమామలాంటి మోము
నీ అందమంతా నోచే నోము
అందచందాల బరిణె రతనాల వీణ
ఇంపైన సంపెంగి రెమ్మ
లేత సొంపైన అపరంజి బొమ్మా
వెయేళ్లు వర్థిల్ల వమ్మా

॥చిరు గాలి ||




చూపులకు సుందరాంగినే పాట సాహిత్యం

 
చిత్రం: గువ్వలజంట (1981)
సంగీతం: జె.వి.రాఘవులు
సాహిత్యం: వేటూరి
గానం: ఎస్.జానకి

పల్లవి: 
చూపులకు సుందరాంగినే
నీ అమ్మడ జిమ్మడ కోకడాబు కోమలాంగినే
కన్నేస్తే అదురు తాపు చెయ్యే స్తే బెదురుతావు
అసలు ఇపయానికోసే పసలేస్ సింగినే

సూపులకు సుందరాంగినే

చేతికర్ర చెంచలాంగినే
ఓ అమ్మమ్మ పెద్దమ్మ మాటగాటు మందరాంగి నే
పొద్దేమో వాలిపోయి ముద్దేమో రేగిపోయె
మిడిసి మిడిసి పడితే నీ నడుమింకా వంగునే

చేతికర్ర చెంచలాంగినే
ఓ అమ్మమ్మ పెద్దమ్మ మాటగాటు మందరాంగిన

చాల్లే నోరుముయ్యండెహ
మోకాళ్ళదాకా నేను మొగలి పూల జడ వేసి
ఊరిమీదికొచ్చినాకా సూడాల నా సోకు
మొగోడైన ప్రతివాడు మొగుణ్ణి ఆనుకున్నారు
ఆడ పుట్టుక పుట్టినోళ్లు అందం అరువడిగారు
కన్నున్న నాయాళ్లు కన్ను కొడితే చిత్తు
జన్ను పెడితేమత్తు జొన్న చేలో సొత్తు

ఓసోస్ కుర్రకుంకల్లారా మీ కేటి తెలుసే
ఆ కాలపు ఒడుపులు ఆ పట్టు విడుపులు
పగలంతా సూరీడ్ని తిట్టుకుని రాత్రంతా సెంద్రుడ్ని
పట్టుకుని కూకునేవాడే మా ఆయన తెల్లారకుండా

అలాగా
పుట్టగా నే పదారేళ్ల పులకరింతలున్నదాన్నీ 
పేరు పెట్టగానే పైట వేసుకున్న వన్నె చిన్నదాన్ని
అబ్బో
బావలు మావలు తప్ప బందువులే లేనిదాన్ని
చూడాల ఆడగోడు ఆడలేక మద్దెలోడు
ఒరుగై పోయిన బామ్మకు మొరుగుడెందుకు
ఈ సణుగుడెందుకు తల తిరుగుడెందుకు

చేతికర్ర చెంచలాంగినే
ఓ అమ్మమ్మ పెద్దమ్మ మాటగోటు మందరాంగివే
అడుగుల్లో హంసలున్న అందక
కత్తెను
పలుకులో సిలక లున్న ముద్దుగుమ్మను
ఓ య బ్బో
వసంతాలు దేనికంట ముసలిబామ్మకు
వన్నె చిన్నెలన్నీ నీకు మరో జన్మకు
తల్లో నేనెట్టకుంటే మల్లెపూలు నలుపు
వరసకాదు వలపునాది చివరి గెలుపు

|| చూపులకు సుందరాంగినే||




ఒంటిస్తంభం మేడ పాట సాహిత్యం

 
చిత్రం: గువ్వలజంట (1981)
సంగీతం: జె.వి.రాఘవులు
సాహిత్యం: వేటూరి
గానం: పి.సుశీల

పల్లవి:
ఒంటి స్తంభం మేడ ఒక్కరాతిరి
ఓరచూపు చూసోంది వంక జాబిలి
కౌగిలి గిలి గిలి గిలి గిలి గిలి కావాలంటే
నీ చక్కలే గిలి గిలి గిలి గిలి గిలి తీరాలంటే
దక్కరో నా చేత చిక్కరో దొరా
ఓయ్ దజ్కరో నా చేత చిక్కరో దొరా

చరణం: 1
తేనే టీగ కళ్ళు చూస్తే తీపి ముళ్లు రో
ముద్దు నీకు ముదిరితే. మూడు నాళ్లురో
ఇంగ్లీసు ముద్దు లైతే యెంగి లెక్కువ
తెలుగువాళ్ళ ముచ్చటైతే మక్కు వెక్కువ
సీమదొర సోకులన్నీ బయట చేసుకో
నాటు సరసం ఇక్కడుంది చాటు చూసుకో
నువ్వు చోటు చేసుకో

ఒంటిస్తంభం

చరణం: 2
గంటకొక్క కాపురాల ఇంటి వాడిని
పూటక్కొ పువ్వుతుంచే తోటమాలవి
తేరగుంది జుర్రుకోర తేనే యెన్నెల
చెమ్మ చెక్క లాడుకోర రెండు పక్కల
చందమామ జారిపోద్ది జాగు చేయక
కోడిపుంజు లేచిపోద్ది యేడి పించక
నన్నే ఏడిపించక అహ.....

ఒంటిస్తంభం



పిచ్చెక్కి పోతోందే పాట సాహిత్యం

 
చిత్రం: గువ్వలజంట (1981)
సంగీతం: జె.వి.రాఘవులు
సాహిత్యం: వేటూరి
గానం:యస్.పి.బాలు, పి.సుశీల

పిచ్చెక్కి పోతోందే పిల్లో నిన్ను చూస్తూంటే
చిలకపచ్చ చీరగట్టి పసువు పచ్చలారబోసి
కుచ్చుల జడ ముందుకు వేసి ఉచ్చు మెడకే వేస్తుంటే

పిచ్చెక్కి పోతోంది మామో నిన్నుచూడకుంటే
చిలకపచ్చ చీరగట్టి పసుపు పచ్చలారబోసి
చిచ్చులు రేపే చుక్కల వేళ వెచ్చవెన్నెల వేధిస్తుంటే

పుడమికి పువ్వులు పూసిందాకాపులకరింత లేరా
పెదవికి నవ్వులు పుట్టిందాకా పూలసంత లేరా

కాలు మోపితే నేలతల్లికే సక్కిలిగింతయే
కన్నుగీటి కాండ గుండెలేవెన్నెలపుంతాయే
సుక్కలకన్న సక్కని వన్నె ఉక్కిరిబిక్కిరి చేసేస్తుంటే

వెన్నెల నీడగా చీకటి తోడుగా నన్ను బతక నీరా
కమ్మని వేళలో కలతల వేళలో నాకుబతుకు నీరా

అన్నమాటకే కన్నులెందుకో నీటిమబ్బులాయే
విన్న వేళలో గుండె లోయలో ఏటి వెల్లువాయే
సూపులలోనే చుటరికాలు రాచరికా లే వద్దంటుంటే



నీలి నీలి కళ్ళతో పాట సాహిత్యం

 
చిత్రం: గువ్వలజంట (1981)
సంగీతం: జె.వి.రాఘవులు
సాహిత్యం: వేటూరి 
గానం:యస్.పి.బాలు, యస్.పి.శైలజ

నీలి నీలి కళ్ళతో నిండిపో నాలో 

No comments

Most Recent

Default