Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Puttinillu Mettinillu (1973)

చిత్రం: పుట్టినిల్లు - మెట్టినిల్లు (1973)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
నటీనటులు: కృష్ణ, శోభన్ బాబు సావిత్రి, లక్ష్మీ, చంద్రకళ
కథ: ఏ.ఎస్. ప్రకాశం
స్క్రీన్ ప్లే: జి.నారాయణదాస్
దర్శకత్వం: పట్టు
నిర్మాణం: ఏ.వి.యమ్. స్టూడియోస్
విడుదల తేది: 12.07.1973

Songs List:

ఇదే పాటా ప్రతీ చోటా పాట సాహిత్యం

చిత్రం: పుట్టినిల్లు - మెట్టినిల్లు (1973)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి
గానం: యస్..పి. బాలు

పల్లవి:
ఇదే పాటా ప్రతీ చోటా ఇలాగే పాడుకుంటాను
పలుకలేని వలపులన్నీ పాటలో దాచుకుంటాను 

ఇదే పాటా ప్రతీ చోటా ఇలాగే పాడుకుంటాను 
పలుకలేని వలపులన్నీ పాటలో దాచుకుంటాను 

చరణం: 1
నా పాట విని మురిశావు ఆ పైన నను వలచావు
నా పాట విని మురిశావు ఆ పైన నను వలచావు
కలలాగ నను కలిశావు లతలాగ నను పెనవేశావు
ఒక గానమై ఒకప్రాణమై జతగూడి మనమున్నాము
ఉన్నాము ఉన్నాము

చరణం: 2
నాడేమి ఉందని భ్రమశేవు నేడేమి లేదని విడిచేవు
నాడేమి ఉందని భ్రమశేవు నేడేమి లేదని విడిచేవు
ఆ మూడుముళ్లని మరిచేవు నా పాల మనసుని విరిచేవు
ఈనాడు నను విడనాడినా ఏనాటికైనా కలిసేవు నువు
కలిసేవు నను కలిసేవూ

చిన్నారి కన్నయ్యా.. పాట సాహిత్యం

చిత్రం: పుట్టినిల్లు - మెట్టినిల్లు (1973)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి
గానం:  పి.సుశీల

పల్లవి:
చిన్నారి కన్నయ్యా..  నా ఆశ నీవయ్యా
తొలగాలీ మా కలతలు.. నీవే కలపాలీ మా మనసులు 

చిన్నారి కన్నయ్యా..  నా ఆశ నీవయ్యా
తొలగాలీ మా కలతలు.. నీవే కలపాలీ మా మనసులు 

చరణం: 1
మెట్టినింట నిందలపాలై పుట్టి నింట చేరాను 
మెట్టినింట నిందలపాలై పుట్టి నింట చేరాను 
కట్టుకున్న పతికే బరువై కన్నీరై కరిగేను ఎంత కాలమో... ఈ వియోగము
ఇంతేనా ఈ జీవితం... బాబూ.. పంతాలా పాలాయెనా

చిన్నారి కన్నయ్యా...  నా ఆశ నీవయ్యా
తొలగాలీ మా కలతలు.. నీవే కలపాలీ మా మనసులు  

చరణం: 2 
రామయ్యకు దూరమైన సీతలాగ వున్నాను
రామయ్యకు దూరమైన సీతలాగ వున్నాను
చిక్కు ప్రశ్నలెన్నోవేసి చిక్కులలో చిక్కాను
బోసినవ్వుతో బుంగమూతితో మార్చాలీ మీ మామను
బాబూ చేర్చాలి...  మీ నాన్నను

చిన్నారి కన్నయ్యా.. నా ఆశ నీవయ్యా
తొలగాలీ మా కలతలు..నీవే కలపాలీ మా మనసులు 

ఇదే పాటా ప్రతీ చోటా పాట సాహిత్యం

చిత్రం: పుట్టినిల్లు - మెట్టినిల్లు (1973)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి
గానం: యస్..పి. బాలు

పల్లవి:
ఇదే పాటా ప్రతీ చోటా ఇలాగే పాడుకుంటాను
పలుకలేని వలపులన్నీ పాటలో దాచుకుంటాను 

ఇదే పాటా ప్రతీ చోటా ఇలాగే పాడుకుంటాను 
పలుకలేని వలపులన్నీ పాటలో దాచుకుంటాను 

చరణం: 1
నా పాట విని మురిశావు ఆ పైన నను వలచావు
నా పాట విని మురిశావు ఆ పైన నను వలచావు
కలలాగ నను కలిశావు లతలాగ నను పెనవేశావు
ఒక గానమై ఒకప్రాణమై జతగూడి మనమున్నాము
ఉన్నాము ఉన్నాము

చరణం: 2
నాడేమి ఉందని భ్రమశేవు నేడేమి లేదని విడిచేవు
నాడేమి ఉందని భ్రమశేవు నేడేమి లేదని విడిచేవు
ఆ మూడుముళ్లని మరిచేవు నా పాల మనసుని విరిచేవు
ఈనాడు నను విడనాడినా ఏనాటికైనా కలిసేవు నువు
కలిసేవు నను కలిసేవూ

బోల్తా పడ్డావే పిల్లాదానా.. పాట సాహిత్యం

చిత్రం: పుట్టినిల్లు - మెట్టినిల్లు (1973)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి
గానం: యస్..పి. బాలు 

పల్లవి:
హెహె హో హో హేహే ఆహా.. 
బోల్తా పడ్డావే పిల్లాదానా.. చెమ్కి తిన్నావే చిన్నదానా
ఆహా.. బోల్తా పడ్డావే పిల్లాదానా.. చెమ్కి తిన్నావే చిన్నదానా

ఇలా చూడు బలే జోడు కోరినోడు కూడినాడు
బోల్తా పడ్డావే పిల్లాదానా.. చెమ్కి తిన్నావే చిన్నదానా

చరణం: 1
నీ మీదే నా పంచప్రాణాలూ .. ఇక చేదామా సరి గంగ స్నానాలూ ఓ..
నీ మీదే నా పంచప్రాణాలూ .. ఇక చేదామా సరి గంగ స్నానాలూ

ఏమి అలకా ? రామచిలకా.. ఉలికి పడకే వలపు మొలకా

బోల్తా పడ్డావే పిల్లాదానా చెమ్కి తిన్నావే చిన్నదానా
ఆహా  బోల్తా పడ్డావే పిల్లాదానా చెమ్కి తిన్నావే చిన్నదానా

చరణం: 2
అందాల నీ నడుమూ ఊగింది..  అమ్మమ్మొ నా గుండె ఆగింది
అందాల నీ నడుమూ ఊగింది..  అమ్మమ్మొ నా గుండె ఆగింది 

హల్లో హల్లో.. పడుచు పిల్లో..  పెళ్లి గుళ్లో.. తాళి మెళ్లో
డు డు పి పి రి పి పి డుం డుం పి పి రి పి

బోల్తా పడ్డావే పిల్లాదానా.. చెమ్కి తిన్నావే చిన్నదానా
 ఇలా చూడు.. బలే జోడు.. కోరినోడు.. కూడినాడు 

బోల్తా పడ్డావు బుజ్జి నాయనా.. పాట సాహిత్యం

చిత్రం: పుట్టినిల్లు - మెట్టినిల్లు (1973)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి
గానం: ఎల్. ఆర్. ఈశ్వరి 

పల్లవి:
హెహె ఆహా  హేహే
ఆహా  బోల్తా పడ్డావు బుజ్జి నాయనా..  చెమ్కి తిన్నావు చిన్ని నాయనా
ఆహా  బోల్తా పడ్డావు బుజ్జి నాయనా..  చెమ్కి తిన్నావు చిన్ని నాయనా
ఏమిసిగ్గా ? కందెబుగ్గా తుళ్ళి పడకోయ్ మల్లెమొగ్గా
బోల్తా పడ్డావు బుజ్జి నాయనా..  చెమ్కి తిన్నావు చిన్ని నాయనా 

చరణం: 1
ఏటుగాడి వనుకున్నా వోరబ్బా కన్నెజింక చేత తిన్నావు దెబ్బ
ఏటుగాడి వనుకున్నా వోరబ్బా కన్నెజింక చేత తిన్నావు దెబ్బ
కోపమొద్దూ తాపమొద్దూ ఉన్నమాటే ఉలకవద్దూ 

బోల్తా పడ్డావు బుజ్జి నాయనా..  చెమ్కి తిన్నావు చిన్ని నాయనా..  ఓహో
బోల్తా పడ్డావు బుజ్జి నాయనా..  చెమ్కి తిన్నావు చిన్ని నాయనా 

చరణం: 2
సరదాగా అన్నాను చిన్నోడా కలకాలం కావాలి నీ నీడ
సరదాగా అన్నాను చిన్నోడా కలకాలం కావాలి నీ నీడ
కలుపుచేయీ కలుగుహాయీ పోరునష్టం పొందులాభం

బోల్తా పడ్డావు బుజ్జి నాయనా చెమ్కి తిన్నావు చిన్ని నాయనా ఓహో
బోల్తా పడ్డావు బుజ్జి నాయనా చెమ్కి తిన్నావు చిన్ని నాయనా
ఏమిసిగ్గా ? కందెబుగ్గా తుళ్ళి పడకోయ్ మల్లెమొగ్గా

సిరిమల్లె సొగసు పాట సాహిత్యం

చిత్రం: పుట్టినిల్లు - మెట్టినిల్లు (1973)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: దాశరథి
గానం: ఎ.ఎం. రాజా, పి.సుశీల

పల్లవి:
సిరిమల్లె సొగసు జాబిల్లి వెలుగు
నీలోనే చూశానులే..ఏ..ఏ..ఏ..ఏ
సిరిమల్లె సొగసు జాబిల్లి వెలుగు
నీలోనే చూశానులే..ఏ..ఏ..ఏ..ఏ

ఏ నోము ఫలమో..ఏ దేవి వరమో..
నీ దాననైనానులే..ఏ..ఏ..ఏ..ఏ
సిరిమల్లె సొగసు జాబిల్లి వెలుగు..
ఈ రేయి నీకోసమే... 

చరణం: 1
పానుపు మురిసింది మన జంట చూసి
వెన్నెల కురిసింది మన ప్రేమ చూసి
పానుపు మురిసింది మన జంట చూసి
వెన్నెల కురిసింది మన ప్రేమ చూసి
వలచిన ప్రియునీ..కలసిన వేళ..
వలచిన ప్రియునీ..కలసిన వేళ..
తనువంత పులకింతలే..ఏ..ఏ..ఏ..ఏ
సిరిమల్లె సొగసు జాబిల్లి వెలుగు
నీలోనే చూశానులే...
ఓ..ఓ..ఓ..ఓ..ఓ..ఓ..ఓ..

చరణం: 2
దివిలో నెలరాజు దిగివచ్చినాడు..
భువిలో కలువమ్మ చేయిపట్టెనాడు....
దివిలో నెలరాజు దిగివచ్చినాడు..
భువిలో కలువమ్మ చేయిపట్టెనాడు...

నీ తోటి చెలిమి..నిజమైన కలిమి
నీ తోటి చెలిమి..నిజమైన కలిమి
నిలవాలి..కలకాలమూ..ఊ..ఊ..ఊ.

సిరిమల్లె సొగసు జాబిల్లి వెలుగు
నీలోనే చూశానులే...
సిరిమల్లె సొగసు జాబిల్లి వెలుగు..
ఈ రేయి నీకోసమే...

ఓ..ఓ..ఓ..ఓ..ఓ..ఓ..ఓ..ఓ..ఓ..ఓ..

జమలంగిడి జమక పాట సాహిత్యం

చిత్రం: పుట్టినిల్లు - మెట్టినిల్లు (1973)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: కొసరాజు 
గానం: యస్.పి.బాలు, ఎల్. ఆర్. ఈశ్వరి 

జమలంగిడి జమక

No comments

Most Recent

Default