Home Movie Songs Latest Updated Movies Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box



చిత్రం: చిన్నోడు పెద్దోడు (1988)
సంగీతం: ఎస్.పి.బాలు
సాహిత్యం: వెన్నెలకంటి
గానం: ఎస్.పి.బాలు, జానకి
నటీనటులు: రాజేంద్రప్రసాద్, చంద్రమోహన్, కుష్బూ
దర్శకత్వం: రేలంగి నరసింహ రావు
నిర్మాత: శివలెంక కృష్ణ ప్రసాద్
విడుదల తేది: 25.03.1988

పల్లవి:
ఆ ఆ ఆ ఆ.... ఆ ఆ ఆ ఆ....

తెల్లమబ్బు తేరు మీద ఇలకు దిగిన వెండి చందమామా
ఓ భామా...  నువ్వే నా ప్రేమా

రెక్క విసిరి ఊహలన్ని రెపరెపలాడేటి గగన సీమా
కలిసేమా...  ఒకటై ఒదిగేమా

చరణం: 1
యుగాలు వేచినా నిరీక్షలోనా
ఎడారి గుండెలో వరాల వానా
పదాలకందనీ ఎదంట నువ్వు
పదాల వాలినా సుమాన్ని నేను

వయసే తపించీ...  వలపే జపించీ
కలలే ఫలించీ...  కలిపే విరించి
కుందనాల బొమ్మ...  కనువిందు చేసెనమ్మా
కోరివచ్చె కొమ్మ...  దరిజేరి ఏలుకొమ్మా
ఆరుౠతువులేకమైన ఆమని మనదే సుమా...

రెక్క విసిరి ఊహలన్ని రెపరెపలాడేటి గగన సీమా
కలిసేమా... ఒకటై ఒదిగేమా....

చరణం: 2
గులాబి సిగ్గులా నివాళులీనా... వరించి నిన్ను నే తరించిపోనా

విరాళి సైపని  వియోగ వీణ...  సరాగమైనదీ స్వరాలలోన
చూపుల మందారం...  పాపట సిందూరం
కులుకే సింగారం...  పలుకే బంగారం
చిరునవ్వుల సారం...  చిగురించిన సంసారం
చెలి సొగసుల గారం...  చెలరేగిన శృంగారం
కలసిన హృదయాలలోన వెలసిన రసమందిరం

తెల్లమబ్బు తేరు మీద ఇలకు దిగిన వెండి చందమామా
ఓ భామా.... నువ్వే నా ప్రేమా....
రెక్క విసిరి ఊహలన్ని రెపరెపలాడేటి గగన సీమా
కలిసేమా... ఒకటై ఒదిగేమా....
ఆ......

No comments

Most Recent

Default