Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Swapna (1980)




చిత్రం: స్వప్న (1980)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
నటీనటులు: స్వప్న, రాజా, రాంజి
దర్శకత్వం: దాసరి నారాయణరావు
నిర్మాత: జి.జగదీష్ చంద్ర ప్రసాద్
విడుదల తేది: 14.11.1980



Songs List:



అంకితం నీకే అంకితం పాట సాహిత్యం

 
చిత్రం: స్వప్న (1980)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: దాసరి నారాయణరావు
గానం: యస్.పి.బాలు

పల్లవి: 
అంకితం నీకే అంకితం నూరేళ్ళ ఈ జీవితం
ఓ ప్రియా ఓ ప్రియా ఓ ప్రియ
ఓ
||అంకితం॥

వచనం: 
కాళిదాసు కలమందు చిందు అపురూవ దివ్య కవితా
త్యాగరాయ కృతులందు వెలయు
గీతార్థ సార నవతా - నవవసంత శోభనా మయూభా
లలిత లలిత రాగ చంద్ర రేఖా

చరణం: 
స్వరము స్వరము కలయికలో ఒక రాగం పుడుతుంది - 
మనసు మనసు కలయిక లో అనురాగం పుడుతుంది 
ఆ అనురాగం ఒక ఆలయమైతే
ఆ ఆలయ దేవత నీ వైతే
గానం గాతం గీతం బావం - సర్వం అంకితం

పల్లవి: 
లోకవినుతి జయదేవశ్లోక
శృంగార రాగ దీపా - భరత శాస్త్ర రమణీయనాద
నవహావ భావరూప స్వర విలాసహాస చతుర నయనా
సుమువికాస భాష సుందర వదన

చరణం: 
నింగినేలా కలయికతో - ఒక ప్రళయం అవుతుంది
ప్రేమా ప్రేమా కలయికతో ఒక ప్రణయం పుడుతుంది
ఆ ప్రణయం ఒక గోపుర మైతే ఆ గోపురం కలశం నీవైతే
పుష్పం పత్రం ధూపం దీపం - సర్వం ఆంకితం





అందాలు రాశిగ పోసి పాట సాహిత్యం

 
చిత్రం: స్వప్న (1980)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: రాజశ్రీ
గానం: యస్.పి.బాలు, జానకి

పల్లవి: 
అందాలు రాశిగ పోసి ఆ రాసికి ప్రాణం పోసి
ఆ బ్రహ్మచేసిన బొమ్మ నువ్వు నీకు జోహారు
స్వప్నా.... స్వప్నా.... స్వప్నా

చరణం: 1
చూపులలోన పువ్వుల బాణం నవ్వులలోన వెన్నెల వర్షం
వయసొక హరివిల్లు పగలే విరిజల్లు
మలచిన నీ రూపం చిలికిన శృంగారం
ఆహా సోయగాలే నీకు సొంతం నువ్వు నా సొంతం

చరణం: 2
ఊర్వశి నిన్ను చూసిందంటే అవమానంతో తలవంచేను
మన్మధుడే నిను చూశాడంటే రతినే వీడి నిను చేరేను
సొగసున నీ సాటి - హొయలున సరిసాటి
దివిలోనే లేదు - భువిలోను లేదు
గారాల కొమ్మ పూల రెమ్మ చాలు ఈ జన్మ



ఇదే నా మొదటి ప్రేమలేఖ..పాట సాహిత్యం

 
చిత్రం: స్వప్న (1980)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు

ఇదే నా మొదటి ప్రేమలేఖ..
రాసాను నీకు చెప్పలేక..
ఎదుటపడి మనసు తెలుపలేక..
తెలుపుటకు బాష చేతకాక..
తెలుపుటకు బాష చేతకాక..

ఇదే నా మొదటి ప్రేమలేఖ..
రాసాను నీకు చెప్పలేక..
ఎదుటపడి మనసు తెలుపలేక..
తెలుపుటకు బాష చేతకాక..
తెలుపుటకు బాష చేతకాక..

మెరుపనీ పిలవాలంటే..ఆ వెలుగు ఒక్క క్షణం..
పూవనీ పిలావాలంటే..ఆ సొగసు ఒక్క దినం..
ఏ రీతిగా నిన్నూ..పిలవాలో తెలియదు నాకూ..
ఏ రీతిగా నిన్నూ..పిలవాలో తెలియదు నాకూ!!
తెలిసింది ఒక్కటే.. నువ్వు నా ప్రాణమనీ!!
ప్రేమా..ప్రేమా..ప్రేమా..

ఇదే నా మొదటి ప్రేమలేఖ..
రాసాను నీకు చెప్పలేక..
ఎదుటపడి మనసు తెలుపలేక..
తెలుపుటకు బాష చేతకాక..
తెలుపుటకు బాష చేతకాక..

తారవని అందామంటే.. నింగిలో మెరిసేవూ..
ముత్యమని అందామంటే.. నీటిలో వెలిసేవూ..
ఎదలోన కదిలే నిన్నూ.. దేనితో సరిపోల్చాలో??
ఎదలోన కదిలే నిన్నూ.. దేనితో సరిపోల్చాలో??
తెలిసింది ఒక్కటే..నువ్వు నా ప్రాణమని!!
ప్రేమా..ప్రేమా..ప్రేమా..

ఇదే నా మొదటి ప్రేమలేఖ..
రాసాను నీకు చెప్పలేక..
ఎదుటపడి మనసు తెలుపలేక..
తెలుపుటకు బాష చేతకాక..
తెలుపుటకు బాష చేతకాక..





ముద్ద ముద్ద మందారాలు పాట సాహిత్యం

 
చిత్రం: స్వప్న (1980)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: దాసరి
గానం: యస్.జానకి, ఆనంద్, రమేష్

ముద్ద ముద్ద మందారాలు - లేత బుగ్గ బంగారాలు
పొద్దుపోని మనసుకి ముద్దులే సింగారాలు
ముద్ద ముద్ద మందారాలు - పిల్లదాని సింగారాలు
రెప్ప పడని కళ్ళకు చూపులే శృంగారాలు
ముద్ద ముద్ద మందారాలు మళ్ళచాటు సంగీతాలు
వాడిపోయే మనసుకి మాసిపోనీ గాయాలు
అందాలోలికే మందారాలు ఎర్రన
ఉదయించే సూర్యుడు ఎర్రన
దిగిపోయే సూర్యుడు ఎర్రన
నుదుటి సింధూరం ఎర్రన
మొదటి కౌగిలింత ఎర్రన
చివరి వీడుకోలు ఎర్రన

ఎర్ర ఎర్రని అందాలతో దాగుందొక హృదయము
దాగున్న హృదయాన్ని పిలిచిందనురాగం
అనురాగమే శృతితప్పి పాడిందొక రాగం



మల్లె మొగ్గ పూచిందంట పాట సాహిత్యం

 
చిత్రం: స్వప్న (1980)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: దాసరి
గానం: యస్. పి. బాలు, యస్.జానకి

మల్లె మొగ్గ పూచిందంట ఎక్కడో
పిల్లి మొగ్గ వేసిందంట యిక్కడే
ఆ మొగ్గ ఈ మొగ్గ - బుగ్గ బుగ్గ కలిసి
సిగ్గులల్లాయి - ముగ్గులేసాయి
సిగ్గులు వచ్చి బుగ్గలు ఎక్కితే 
ఎరుపే సిగ్గు పడుతుంది

మొగ్గలు వచ్చి సిగలో నక్కితే - నింగే వంగి చూస్తుంది
ఆ సిగ్గులు ఎక్కడ ?
నువు చూసిన చూపులవి
ఆ చూపులు ఎక్కడివి?
నువు విసిరిన వలపులవి
ఆ వలపులు ఎక్కడివి?
నువు పిలిచిన పిలుపులవి

మబ్బులు వచ్చి మనసును తాకితే వయసే చల్ల బడుతుంది
పువ్వులు వచ్చి నవ్వులు జల్లితే నవ్వే నవ్వి పోతుంది

ఆ మబ్బులు ఎక్కడివి?
మన చూపుల ఆవిరివి
ఆ చూపులు ఎక్కడివి?
మన ప్రేమకు పూచినని
ఆ నవ్వులు ఎక్కడివి
మన పెళ్లికి వచ్చినవి



శ్రీరస్తు అబ్బాయి - శుభమస్తు అమ్మాయి పాట సాహిత్యం

 
చిత్రం: స్వప్న (1980)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: రాజశ్రీ
గానం: పి. సుశీల, పి. బి. శ్రీనివాసు

శ్లోకం|| 
సర్వ మంగళ మాంగల్యే - శివే
సర్వార్థ సాధకే
శరణే త్ర్యంబకే దేవి - నారాయణి నమోస్తుతే

పద్యం||
శ్రీరస్తు అబ్బాయి - శుభమస్తు అమ్మాయి
ఈ పచ్చని పందిరిలోనా కళ్యాణ మస్తు

శ్లోకం: 
మాంగల్య తంతునా నేనా - మమ జీవన హేతునా
కంఠే బధ్నామి శుభగే - త్వంజీవన శరదశ్నతాం

చరణం: 1
మంత్రాలతో మీ జంట చేరి 
నూరేళ్ళకూ అది పంటకావాలి
మీ కలలన్నీ నేడే తీరాలి

వచనం: 
సర్వశుభ కారిణి ఆదిలక్ష్మి - కరుణా స్వరూపిణి గజలక్ష్మీ
సిరిసంపదలిచ్చు ధనలక్ష్మీ - పాడిపంటల నిచ్చు ధాన్యలక్ష్మి
విజ్ఞాన మందించు విద్యాలక్ష్మి - విజయమును కలిగించు విజయలక్ష్మి
శక్తిని ప్రసాధించు ధైర్యలక్ష్మి
సౌభాగ్యమునుగూర్చు సంతానలక్ష్మి

ఈ అష్ట లక్ష్ముల అంశలతోను వర్ధిల్లాలి గృహలక్ష్మి

చరణం:
చిగురాశలే సన్నాయి పాడాలి
తొలి బాసలే ఉయ్యాల లూగాలి
యో చిననాటి ప్రేమ దండాలి

No comments

Most Recent

Default