Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Muddula Koduku (1979)




చిత్రం: ముద్దుల కొడుకు (1979)
సంగీతం: కె.వి. మహదేవన్
నటీనటులు: నాగేశ్వరరావు, మురళీమోహన్, జయసుధ, శ్రీదేవి
నిర్మాత, దర్శకత్వం: వి.బి.రాజేంద్రప్రసాద్
విడుదల తేది: 04.05.1979



Songs List:



ఓలోలె నీసోకు పాట సాహిత్యం

 
చిత్రం: ముద్దుల కొడుకు (1979)
సంగీతం: కె.వి. మహదేవన్
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు,  సుశీల

ఓలోలె నీసోకు... లేలేత తమలపాకు...తాంబూల మివ్వమంటా
నాసూపే సున్నమేసి.. నీ వలపె వక్కచేసి చిలకచుట్టి ఇస్తుంటే

నీ చిటికెనేలు కొరుకుతుంటా అహుం అహుం అహుం

ఓలోలె నా సోకు - లేలేత తమలపాకు తాంబూల మిచ్చుకుంటా
అందాల విందుచేసి - మురిపాల ముద్దుచేసి చిలకచుట్టె ఇస్తుంటే
ఈ చిలిపి కొట్టుడెందుకంటా ఆహుం ఆహుం ఆహుం

నీ సున్న ఎక్కువైనా  నానక్క తక్కువైనా
నీ నోరు పొక్కుతుంది నా జోరు ఎక్కుతుంది
మక్కువెక్కువైనపుడూ పొక్కదు
పొక్కినా పెదపుల్లో చక్కెర పులుపెక్కదు
ఆహుం ఆహుం ఆహుం

ముట్టుకుంటే ముదురుతుంది.. పట్టుకుంటే పండుతుంది
కట్టుకుంటే కుదురుతుంది కట్టుకో కట్టుకో కట్టుకో
ముడుపు కట్టుకో కట్టుకో కట్టుకో

ముద్దు ముదిరిపోతుంటే పొద్దు నిదరపోతుంటే
హద్దు చెదిరిపోతుంటే కట్టుకో కట్టుకో కట్టుకో
ముడుపు కట్టుకో కట్టుకో కట్టుకో
నీ కుర్రకారు జోరు.. నా గుండెలోన హోరు
మితిమీరిపోతె తంటా.. పొలిమేర దాటకంటా

పగ్గమేసి పట్టుకుంటే తగ్గదు -- తగ్గినా
పడుచు ఊపు పట్టుకుంటే చిక్కదు
ఆహుం హుం ఆహుం





చిటపట చినుకుల మేళం..పాట సాహిత్యం

 
చిత్రం: ముద్దుల కొడుకు (1979)
సంగీతం: కె.వి. మహదేవన్
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు,  సుశీల

పల్లవి:
చిటపట చినుకుల మేళం.. తడిపొడి తపనల తాళం
చిటపట చినుకుల మేళం.. తడిపొడి తపనల తాళం
జోరు మీద మోగింది జోడు సన్నాయి మేళం
జోరు మీద మోగింది జోడు సన్నాయి మేళం
అందమైన అనుభవాలకు ఇదే ఆది తాళం

చిటపట చినుకుల మేళం.. తడిపొడి తపనల తాళం
చిటపట చినుకుల మేళం.. తడిపొడి తపనల తాళం
జోరు మీద మోగింది జోడు సన్నాయి మేళం
జోరు మీద మోగింది జోడు సన్నాయి మేళం

అందమైన అనుభవాలకు ఇదే ఆది తాళం
చిటపట చినుకుల మేళం.. తడిపొడి తపనల తాళం

చరణం: 1
వాన చినుకు కాటేస్తే.. వయసు నిన్ను వాటేస్తే
వలపుటేరు పోటొస్తే.. వరద గట్లు తెగుతుంటే
వాన చినుకు కాటేస్తే.. వయసు నిన్ను వాటేస్తే
వలపుటేరు పోటొస్తే.. వరద గట్లు తెగుతుంటే
ముద్దముద్దగా తడిసి.. ముద్దుముద్దుగా కలిసి
ముద్దముద్దగా తడిసి.. ముద్దుముద్దుగా కలిసి
ఇద్దరమా ఒక్కదనం ఇచ్చిపుచ్చుకుంటుంటే
తహతహ తహతహ తహతహలో
తహతహ తహతహ తహతహలో

చిటపట చినుకుల మేళం.. తడిపొడి తపనల తాళం
చిటపట చినుకుల మేళం.. తడిపొడి తపనల తాళం

చరణం: 2
వడగళ్ళ వానలో.. వడగాలి దెబ్బలు
మనసున్న కళ్ళకే.. మసకేసే మబ్బులు
వడగళ్ళ వానలో.. వడగాలి దెబ్బలు
మనసున్న కళ్ళకే.. మసకేసే మబ్బులు
బిగిసే కౌగిళ్ళలో.. ఒకటే తబ్బిబ్బులు హాయ్
బిగిసే కౌగిళ్ళలో.. ఒకటే తబ్బిబ్బులు
వయసున్న వాళ్ళకే.. వల్లమాలిన జబ్బులు

తహతహ తహతహ తహతహలో
తహతహ తహతహ తహతహలో

చిటపట చినుకుల మేళం.. తడిపొడి తపనల తాళం
ఆ ఆ చిటపట చినుకుల మేళం.. తడిపొడి తపనల తాళం

చరణం: 3
చలి మంటై సెగపెడుతుంటే.. చెలి జంటై సగమౌతుంటే
చలి మంటై సెగపెడుతుంటే.. చెలి జంటై సగమౌతుంటే
మన కోసం ప్రతి మాసం.. మాఘమాసమై పోతుంటే
మన ఇద్దరి మధ్యన ఏదో.. హద్దు వద్దు వద్దంటుంటే
మన ఇద్దరి మధ్యన ఏదో.. హద్దు వద్దు వద్దంటుంటే
ఈ వద్దుకు అర్ధం మారి మన హద్దులు రద్దౌతుంటే

తహతహ తహతహ తహతహలో
తహతహ తహతహ తహతహలో

చిటపట చినుకుల మేళం.. తడిపొడి తపనల తాళం
జోరుమీద మోగింది జోడు సన్నాయి మేళం
అందమైన అనుభవాలకు ఇదే ఆది తాళం

చిటపట చినుకుల మేళం.. తడిపొడి తపనల తాళం
చిటపట చినుకుల మేళం.. తడిపొడి తపనల తాళం




ఇంతేసంగతులు పాట సాహిత్యం

 
చిత్రం: ముద్దుల కొడుకు (1979)
సంగీతం: కె.వి. మహదేవన్
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు,  సుశీల

ఇంతేసంగతులు - చిత్తగించవలెను
ఏయ్ - ఒక్కసారి మందుకొట్టు మహదేవా
నిన్నొదిలి పెడితే ఒట్టు పెట్టు గురుదేవా

గుటకేసి గంతులేయ్ గురుదేవా 
చిటికేసి చిందులేయ్ మహదేవా
పూనకాల స్వామికి పానకాలు పొయ్యరా
తందనాల స్వామికి వందనాలు చెయ్యరా
వినోదానికి ఇది విందురా - మనోవ్యాధికి ఇదే మందురా

తప్పతాగి నోడే ఆ కర్ణుడు 
కుప్పకూలినోడే కుంభకర్ణుడు
చెప్పకు తిప్పలు మహదేవా
చేతికి చిప్పలు గురు దేవా
కులాసాలు మితిమీరాయంటే
కురుక్షేత్ర రణరంగాలు
విలాసాలు శ్రుతిమించాయంటే 
శివమెత్తిన శివతాండవాలు

శంభో శంకర్ మహదేవా సాంబ సదాశివ గురుదేవా
శంభో శంకర మహదేవా సాంబ సదాశివ గురుదేవా




దగాలు చేసి దిగాలుపడ్డ పాట సాహిత్యం

 
చిత్రం: ముద్దుల కొడుకు (1979)
సంగీతం: కె.వి. మహదేవన్
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు,  సుశీల

దగాలు చేసి దిగాలుపడ్డ దసరాబుల్లోడా
సవాలుచేసా జవాబు చెప్పర సరదా చిన్నోడా
చిన్నోడా - దసరాబుల్లోడా
మనసునే కదిలించావు  మనుతలే వెలిగించాను
మనిషిలా ప్రేమించావు - ప్రేమకై జీవించావు
ఆరాధనే మరచి అంతస్థులే వలచి -- ఆస్తిపరుల ముద్దుల కొడుకై
ఆదమరచి వున్నావా ? 
ఆత్మబలం విడిచావా ?

లేదు..లేదు మరచిపోలేదు - Never
చిన్నోడా దసరా బుల్లోడా 

బంగారుబాబుల ఆట
బంగారుబొమ్మల వేట
అదృష్టవంతులు పాడే
అలరిచిలరి వేలంపాట

నీ ఆటపాటలలో నీ అడుగుజాడలలో
అందాల జాబిలి బ్రతుకే అమావాస్య చేసావా సమాధి కట్టెవా
నేనా సమాధి కట్టానా - No No

ఉన్నమాటకే ఉలికిపడి
లేని మనసునే తరుముకునే
మోసగాడు ఒక మనిషేనా
ఏమిటి - ఎవర్ని గురించి నువ్వనేది
నిప్పులాంటిదీ నీ గతం తప్పతాగినా ఆరదు
ఎంత దాచినా దాగదు నిన్ను దహించక తప్పదు

Stop it
తప్పదు
Stop it
తప్పదు
Stop it
తప్పదు
I Say stop it



చీకటి వెలుగుల చెలగాటం పాట సాహిత్యం

 
చిత్రం: ముద్దుల కొడుకు (1979)
సంగీతం: కె.వి. మహదేవన్
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు,  సుశీల

చీకటి వెలుగుల చెలగాటం
ఎండా వానల కోలాటం
హదులు మరచిన ఆరాటం
పొద్దే ఎరగని పోరాటం

చీకటి వెలుగుల చెలగాటం
ఎండా వానల కోలాటం
హదులు మరచిన ఆరాటం
పొద్దే ఎరగని పోరాటం

నిదరనే నిదరపొమ్మని
నీలికళ్ళు ఎర్రగ చెబుతే
కౌగిలినే కమ్ముకు పొమ్మని కన్నెచూపు కమ్మగ చెబితే
ఎప్పటికీ తీరని వలపులు తరిమిన కొద్దీ వురుమవుతుంటే
ఆ నులివెచ్చని ముచ్చటలో నా మనసిచ్చిన ముచ్చికలో
చిమచిమ చిమచిమ చిమచిమ చిమచిమ
సందెగాలి రిమరిమలన్నీ చక్కలిగిలి సరిగమలై తే
సన్నజాజి ఘుమఘుమలన్నీ చలిలో చెలి సరసాలైతే
పూలగాలి పులకింతలకే పురివిప్పిన నిను చూస్తుంటే
కులికే నా చెలి పెదవులలో కురిసే కుంకుమ పూవులలో
చిమచిమ చిమచిమ చిమచిమ చిమచిమ

మొదటి ముద్దు కొసరే వేళ మొగ్గులోకి రానంటుంటే
చివరి హద్దు దాటేవేళ సిగ్గుసిగ్గు పడిపోతుంటే
ఎవ్వరికీ దొరకని నేరం ఇదరికీ వరమవుతుంటే
మనలో కలిగిన మైకంలో మనమే మిగిలిన లోకంలో
చిమచిమ చిమచిమ చిమచిమ చిమచిమ



ఎదలో రగిలే జ్వాలా పాట సాహిత్యం

 
చిత్రం: ముద్దుల కొడుకు (1979)
సంగీతం: కె.వి. మహదేవన్
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు,  సుశీల

ఎదలో రగిలే జ్వాలా
ఏమని పాడను జొలా
కన్నతల్లి కరునిపించదనా
ఉన్నతల్లి కరుణించదనా
తల్లడిల్లి నువు ఏడ్చే వేళా 
సూర్యుడికైనా చంద్రుడికైనా
తూర్పు పడమర ఇద్దరు తల్లులు

ఒకరు విడిస్తే ఒకరున్నారు ఎవరో ఒకరు లాలిస్తారూ
బొమ్మ నడిగితే నేనిస్తాను -- అమ్మ నడిగితే ఏంచేస్తాను

బ్రతుకు చీకటై లాగిననాడు
ప్రాణం నీవై వెలిగావూ
మైకంలోపడి వూగిననాడూ
సుమతే నీవై ఉదయించావూ
'అమ్మా' అంటే ఎవరొస్తారు? 'నాన్నా' అంటూ నేనొస్తాను

No comments

Most Recent

Default