చిత్రం: మంచి కుటుంబం (1968)
సంగీతం: యస్.పి.కోదండపాణి
సాహిత్యం: ఆరుద్ర
గానం: సుశీల
నటీనటులు: కృష్ణ , అక్కినేని నాగేశ్వరరావు, విజయనిర్మల, కాంచన
దర్శకత్వం: వి.మధుసూదనరావు
నిర్మాత: పి.మల్లికార్జున్ రావు
విడుదల తేది: 1968
పల్లవి:
మనసే అందాల బృందావనం
వేణు మాధవుని పేరే మధురామృతం
మనసే అందాల బృందావనం
వేణు మాధవుని పేరే మధురామృతం
కమ్మని నగుమోము కాంచుటె తొలినోము
కడగంటి చూపైన కడుపావనం
మనసే అందాల బృందావనం
వేణు మాధవుని పేరే మధురామృతం
చరణం: 1
రాధను ఒక వంక లాలించునే
సత్యభామను మురిపాల తేలించునే
రాధను ఒక వంక లాలించునే
సత్యభామను మురిపాల తేలించునే...
మనసార నెరనమ్ము తనవారినీ
ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆఆ....
మనసార నెరనమ్ము తనవారిని
కోటి మరులందు సుధలందు తనియింతునే..
చరణం: 2
మనసే అందాల బృందావనం
దనిస దని నిదదమ
మదని నిదదమ
గమద దమమగస
గగ మమ మగస దని
గసా మగా దమా నిద
గమదనిస బృందావనం
మాగ మగస
దామ గమద
నీద నిసమ
గమ మద దనినిస
నిసమద మగస
గమ దనిసగ బృందావనం
సమగస గమదని
గదమగ మదనిస
మనిద మదనిసగ
ఆ...........
మనసే అందాల బృందావనం
వేణు మాధవుని పేరే మధురామృతం
****** ****** ******
చిత్రం : మంచి కుటుంబం (1967)
సంగీతం : కోదండపాణి
సాహిత్యం: ఆరుద్ర
గానం: ఘంటసాల, సుశీల
పల్లవి:
నీలో ఏముందో ఏమో...
మనసు నిన్నే వలచింది... సొగసులన్ని కోరింది..
నీలో ఏముందో ఏమో...
మనసు నిన్నే వలచింది... సొగసులన్ని ఇమ్మంది
చరణం: 1
నీ కాటుక కన్నులలో చీకటి గుసగుసలు..ఆ..ఆ..
నీ కమ్మని నవ్వులలో వెన్నెల మిసమిసలు..ఆ..ఆ..
నీ కాటుక కన్నులలో చీకటి గుసగుసలు...
నీ కమ్మని నవ్వులలో వెన్నెల మిసమిసలు...
నీ ఎదలో పూల పొదలే పూచి... మధువులు చిందాయి
నీ ఎదలో పూల పొదలే పూచి... మధువులు చిందాయి
నా మమతలు పెంచాయి...
నీలో ఏముందో ఏమో...
మనసు నిన్నే వలచింది... సొగసులన్ని ఇమ్మంది...
చరణం: 2
నీ అల్లరి చూపులకే ఒళ్లంతా గిలిగింతా..మ్మ్.
నీ తుంటరి చేష్టలకే ..మదిలో పులకింత..ఉహు..
నీ అల్లరి చూపులకే ఒళ్ళంతా గిలిగింత...
నీ తుంటరి చేష్టలకే ...మదిలో పులకింత..
నీ వంపులలోన సొంపులలోన వలుకును వయ్యారం
నీ వంపులలోన సొంపులలోన వలుకును వయ్యారం
అది వలపుల జలపాతం...
నీలో ఏముందో ఏమో...
మనసు నిన్నే వలచింది... సొగసులన్ని కోరింది..
చరణం: 3
నీ పరువం చూడనిచో పొద్దే పోదుకదా..ఓహో..
నీ పలుకులు వినకుంటే నిదురే రాదు కదా..ఆహ..
నీ పరువం చూడనిచో పొద్దే పోదుకదా...
నీ పలుకులు వినకుంటే నిదురే రాదు కదా...
నీ సరసన లేని నిమిషం కూడ ఏదో వెలితి సుమా
నీ సరసన లేని నిముషం కూడ ఏదో వెలితి సుమా
ఇక నీవే నేను సుమా..ఇక నీవే నేను సుమా...
నీలో ఏముందో ఏమో...
మనసు నిన్నే వలచింది ...సొగసులన్ని కోరింది..
నీలో ఏముందో ఏమో...
మనసు నిన్నే వలచింది... సొగసులన్ని ఇమ్మంది...
****** ****** ******
చిత్రం : మంచి కుటుంబం (1967)
సంగీతం : కోదండపాణి
సాహిత్యం: ఆరుద్ర
గానం : సుశీల, జానకి, వసంత
పల్లవి:
తుళ్ళి తుళ్ళి పడుతోంది తొలకరి వయసు
తుళ్ళి తుళ్ళి పడ్తుంది తొలకరి వయసు
మళ్ళీ మళ్ళీ ఈ రోజు రాదని తెలుసు
తుళ్ళి తుళ్ళి పడుతోంది తొలకరి వయసు
చరణం: 1
బుగ్గ మీద కెంపులేవో...నిగ్గు లోలికి పోగాబుగ్గ మీద కెంపులేవో..
.నిగ్గు లోలికి పోగాసిగ్గులేవో నాలో...మొగ్గ తొడిగి రాగాసిగ్గులేవో నాలో...
మొగ్గ తొడిగి రాగాసిరి మల్లెల పందిరి లోనా...నవమంగళ వేదిక పైనా...
సిరి మల్లెల పందిరి లోనా...నవమంగళ వేదిక పైనా...జరిగేను కళ్యాణ వైభోగం...
తుళ్ళి తుళ్ళి పడుతోంది తొలకరి వయసు మళ్ళీ మళ్ళీ ఈ రోజు రాదని తెలుసు
తుళ్ళి తుళ్ళి పడుతోంది తొలకరి వయసు
చరణం: 2
కోరుకున్న వరుడే చేరుకున్న వేళా..కోరుకున్న వరుడే చేరుకున్న వేళా
పొంగి పొంగి తానే చెంగులాగు వేళా...పొంగి పొంగి తానే చెంగులాగు వేళా
చల చల్లగ గంధం పూసి..మెల మెల్లగ కౌగిట దూసి..
చల చల్లగ గంధం పూసి..మెల మెల్లగ కౌగిట దూసి..
లతవోలే జత కూడి లాలింతునే...
తుళ్ళి తుళ్ళి పడుతోంది తొలకరి వయసు
మళ్ళీ మళ్ళీ ఈ రోజు రాదని తెలుసు
తుళ్ళి తుళ్ళి పడుతోంది తొలకరి వయసు
చరణం: 3
ఎంత గడుసువాడో ఎన్ని నేర్చినాడో...ఎంత గడుసువాడో ఎన్ని నేర్చినాడో
తెలుసుకోవే చెల్లి వలపు పాలవెల్లి...తెలుసుకోవే చెల్లి వలపు పాలవెల్లి
అతడెంతటి మొనగాడైనా...గిలి గింతల చెలికాడైనా
అతడెంతటి మొనగాడైనా...గిలి గింతల చెలికాడైనా
తొలి రేయి పరువాల బంధింతునే....
తుళ్ళి తుళ్ళి పడుతోంది తొలకరి వయసు
మళ్ళీ మళ్ళీ ఈ రోజు రాదని తెలుసు
తుళ్ళి తుళ్ళి పడుతోంది తొలకరి వయసు
****** ****** ******
చిత్రం : మంచి కుటుంబం (1967)
సంగీతం : కోదండపాణి
సాహిత్యం: ఆరుద్ర
గానం: ఘంటసాల, సుశీల
పల్లవి:
ఎవరూ లేని చోటా.. ఇదిగో చిన్న మాటా
ఎవరూ లేని చోటా.. ఎయ్.. ఇదిగో చిన్న మాటా
ఇంకా.. ఇంకా..ఇంకా..
చేరువ కావాలీ.. ఇద్దరు ఒకటై పోవాలీ
ఎవరూ లేని చోటా.. ఇదిగో చిన్నమాటా
ఎవరూ లేని చోటా.. ఎయ్.. ఇదిగో చిన్న మాటా.. ఆ.. ఆ..
చరణం: 1
చిలిపి ఊహలే రేపకూ..ఊ.. సిగ్గు దొంతరలు దోచకూ..ఊ..
చిలిపి ఊహలే రేపకూ.. సిగ్గు దొంతరలు దోచకూ
జిలిబిలి ఆశలు.. పెంచకు.. పెంచకు.. పెంచకూ
పెంచి నన్ను వేదించకూ..ఊ..
ఒంపులతో ఊరించకు.. ఉసి గొలిపి వారించకు
ఒంపులతో ఊరించకు.. ఉసి గొలిపి వారించకు
కలిగిన కోరిక.. దాచకు.. దాచకు.. దాచకూ..
దాచి నన్ను దండించకూ..ఊ..
ఎవరూ లేని చోటా.. ఇదిగో చిన్నమాటా
ఎవరూ లేని చోటా.. ఎయ్.. ఇదిగో చిన్న మాటా.. ఆ.. ఆ..
చరణం: 2
కాదని కౌగిలి వీడకూ..ఊ.. కలలో కూడ కదలకూ..ఊ..
కాదని కౌగిలి వీడకూ.. కలలో కూడా కదలకూ
కలిగే హాయిని.. ఆపకు.. ఆపకు.. ఆపకూ
ఆపి నన్ను ఆడించకూ..ఊ..
ఒడిలో చనువుగ వాలకు.. దుడుకుతనాలు చూపకు
ఒడిలో చనువుగ వాలకు.. దుడుకుతనాలు చూపకు
ఉక్కిరి బిక్కిరి.. చేయకు.. చేయకు.. చేయకూ...
చేసి మేను మరిపించకూ..ఊ..
ఎవరూ లేని చోటా.. ఇదిగో చిన్న మాటా
ఇంకా.. ఇంకా..
ఇంకా చేరువ కావాలీ.. ఇద్దరు ఒకటై పోవాలీ
ఎవరూ లేని చోటా.. ఇదిగో చిన్న మాటా..ఆ..ఆ..