Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Vichitra Kutumbam (1969)
చిత్రం: విచిత్ర కుటుంబం (1969)
సంగీతం: టి.వి.రాజు
నటీనటులు: యన్.టి.రామారావు, కృష్ణ, శోభన్ బాబు, సావిత్రి, విజయనిర్మల
దర్శకత్వం: కోవెలమూడి సూర్య ప్రకాష్ (కె.రాఘవేంద్రరావు డైరెక్టర్ గారి నాన్నగారు)
నిర్మాత: కె.వి.పి.సుంకవల్లి
విడుదల తేది: 28.05.1969Songs List:రంగు రంగుల పూలు పాట సాహిత్యం

 
చిత్రం: విచిత్ర కుటుంబం (1969)
సంగీతం: టి. వి. రాజు
సాహిత్యం: డా॥ సి.నారాయణరెడ్డి 
గానం: ఘంటసాల, పి.సుశీల 

రంగు రంగుల పూలు
నింగిలో మేఘాలు
చల్లని బంగరు కిరణాలు 
మా చెల్లాయికి ఆభరణాలు

వెశాఖమాసం వస్తుంది
ఎఱ్ఱని ఎండలు కాస్తుంది
శ్రావణమాసం వస్తుంది
చల్లని జల్లులు తెస్తుంది
నిప్పులు చెరిగే అన్నయ్యకోసం
చప్పున చల్లారి పోతుంది

తేలిపోయే మబ్బుల్లారా 
నీలికలువల మాలికలారా
ఎవరు పంపిన దూతలు మీరు 
ఏ లోకాలకు వెళుతున్నారు
ఈడైన చెల్లికి జోడైన పరుని
జాడ తెలుసుకొని వసారాజ

విలపించే ఓ మబ్బులారా
వెలవెలబోయే మాలికలారా
కన్నీళ్ళు తుడిచే అన్నయ్య లేడని
కలవరపడుతున్నారా
బిల బిల యెగిరే గువ్వల్లార
ఇలపై కాస్తా దిగివస్తారా
కనరండి మాతల్లి వదినమ్మను
కలికాలాన వెలసిన సీతమ్మనుఊపులో వున్నావు మాఁవా పాట సాహిత్యం

 
చిత్రం: విచిత్ర కుటుంబం (1969)
సంగీతం: టి. వి. రాజు
సాహిత్యం: డా॥ సి.నారాయణరెడ్డి 
గానం: ఎల్. ఆర్. ఈశ్వరి, పట్టాభి 

ఊపులో వున్నావు మాఁవా | మంచి
కైపులో వున్నావు మాఁవా 
చుక్కల్లో వున్నావు ! నా చెక్కిలి మీటుతున్నావు
ఒక్క చూపు చూశానంటే పక్కమీద పడతావు

పడతాను......పడతాను

గుఱ్ఱమెక్కి పున్నావోయ్ హైలెస్స
తెల్ల గుఱ్ఱమెక్కి వున్నావోయ్ హైలెస్స 

హై హై లెస్స

కస్సులోన వున్నావు కదను తొక్కుతున్నావు
కాలుజారి పడ్డావా ! కధ కంచికి లేవోయ్ మాఁవా |

మన మింటికి లేవే భామా
పొదరింటికి లేవే భామా॥

వన్నెవన్నెల పిట్ట లెన్ని చూశావో
వాటి వలపు వాగులో ఎన్ని మునకలు వేశావో
ఇది కొత్తరకం పిట్టోయ్ కనుగొట్టకుంటే ఒట్టోయ్
అది చెయ్యిదాటి పోయిందా
మరి అయ్యగారి పని గోవిందా

ఏ అయ్యగారి పని గోవిందా ? !

మా అయ్యగారి పని గోవిందా

కాసులకోసం గాలా లెన్ని వేశావో 
తిర కాసులు చేసి తిమ్మిని బమ్మిగ చేశావో
నువు పట్టిందల్లా బంగారం తలపెట్టిందల్లా సింగారం
నీ గుట్టు తెలుసుకొను వాడు ! ఈ పట్నంలోనేలేడు

ఏ పట్నంలోనూ లేడు 
భూచక్రంలోనే లేడు
కాచుకో సవ్వాల్ కాచుకో పాట సాహిత్యం

 
చిత్రం: విచిత్ర కుటుంబం (1969)
సంగీతం: టి. వి. రాజు
సాహిత్యం: డా॥ సి.నారాయణరెడ్డి 
గానం: ఘంటసాల, ఎల్. ఆర్. ఈశ్వరి

రాధ: సవ్వాల్
కృష్ణ: కాచుకో సవ్వాల్ కాచుకో
రాధ : చూసుకో - దమ్ము పెంచి రొమ్ము సాచి కాచుకో
కవ్వించే కాలముందీ కసి పెంచే లోకముందీ
కాచుకో యహ వీలైతే చూసుకో
కృష్ణ : చూసుకో
రాధ : కాచుకో
కృష్ణ : ఆంబోతులు లేగలపై తమ్ముకు వస్తే 
రాధ : చింబోతులు మేకలపై చిమ్ముకు వస్తే
కృష్ణ : అరే పెత్తందార్లు పేదవాళ్ళ నెత్తి కెక్కితే
రాధ : కాచుకో యహ 
కృష్ణ: దెబ్బకు దెబ్బ తీసి చూసుకో
రాధ: దిక్కులేని వాళ్ళకు దేవుడే దిక్కు.
కృష్ణ : ఆ దిక్కుంటే చేయవచ్చు ఎవడినైన తుక్కు
రాధ: కాచుకో యహ చేతయితే చూసుకో
కృష్ణ : చూసుకో
రాధ : కాచుకో

రాధ : పగ పట్టిన పాములుంటై కాచుకో
కృష్ణ : వాటి నడినెత్తిన తొక్కి పట్టి చూసుకో
రాధ : దగుల్బాజి నక్కలుంటే కాచుకో
కృష్ణ: వాటి దగాపనులు నిఘావేసి చూసుకో
రాధ : కర్ర బలమే చాలదు కాచుకో నీ
బుర్ర కాస్త తోడు చేసి చూసుకో
కృష్ణ : కాచుకో పిల్లా కళ్ళు చెదిరేదాకా చూసుకో
రాధ : చూసుకో .... కాచుకో
రాధ : ముసలియెద్దు రంకెవేసె కాచుకో
ఓ పడుచువాడ నడుముకట్టి చూసుకో
సవ్వాల్ .... సవ్వాల్ .... సవ్వాల్
ఆడపిల్ల సవాలంది కాచుకో
ఓరబ్బో యని అనేదాక చూసుకో
కృష్ణ : కాచుకో యహ దెబ్బకు దెబ్బ తీసి చూసుకో

నలుగురు నవ్వేరురా గోపాలా పాట సాహిత్యం

 
చిత్రం: విచిత్ర కుటుంబం (1969)
సంగీతం: టి. వి. రాజు
సాహిత్యం: డా॥ సి.నారాయణరెడ్డి 
గానం: పి.సుశీల 

పల్లవి: 
నలుగురు నవ్వేరురా గోపాలా
నడివీధిలో నాకడకొంగు లాగిన

చరణం : 
చల్లచిలికే వేళ చక్కిలిగిలి చేసి
దండలల్లే వేళ రెండు కళ్లూ మూసి
ఒంటిగ యేమన్న ఊరకుంటిని గాని
రచ్చపట్టున నన్ను రవ్వ చేయ పాడికాదులే 

చరణం : 
పొన్న చెట్టునచేరి పొంచినట్టులకాదు
చీరెలను కాజేసి కేరినట్టులు కాదు
కన్నెమనసే వెన్న గమనించరా కన్న
అన్ని తెలిసిననీవె ఆగడాలు వేయనేల ఔరా ఆడవే... ఆడవే...పాట సాహిత్యం

 
చిత్రం: విచిత్ర కుటుంబం (1969)
సంగీతం: టి. వి. రాజు
సాహిత్యం: డా॥ సి.నారాయణరెడ్డి 
గానం: ఘంటసాల

సాకీ:
రష్యాలో పుట్టి భారతావనిలో మెట్టి
తెలుగువారి కోడలివై వలపులొలుకు జాజిమల్లి
వలపులొలుకు జాజిమల్లి...

పల్లవి:
ఆడవే... ఆడవే...
ఆడవే జలకమ్ములాడవే
ఆడవే జలకమ్ములాడవే 
కలహంస లాగా జలకన్య లాగా
కలహంస లాగా జలకన్య లాగా
ఆడవే... ఆడవే

చరణం: 1
ఆదికవి నన్నయ్య అవతరించిన నేల...
ఆ...ఆ...ఆ...  ఆ...ఆ...ఆ...
తెలుగు భారతి అందియలు పల్కె ఈ నేల
ఆంధ్రసంస్కృతికి తీయని క్షీరధారలై
జీవకళలొల్కు గోదావరి తరంగాల 

ఆడవే... ఆడవే...

చరణం: 2
నాగార్జునుని భోధనలు ఫలించిన చోట
ఆ...ఆ...ఆ...  ఆ...ఆ...ఆ...
బౌద్ధమతవృక్షంబు పల్లవించిన చోట...
బుద్ధం శరణం గఛ్చామి...
ధర్మం శరణం గఛ్చామి...
సంఘం శరణం గఛ్చామి...
కృష్ణవేణి తరంగిణి జాలిగుండెయె సాగరమ్మై
రూపు సవరించుకొను నీట...

ఆడవే... ఆడవే

చరణం: 3
కత్తులును ఘంటములు కదను త్రొక్కినవిచట
కత్తులును ఘంటములు కదను త్రొక్కినవిచట
అంగళ్ళ రతనాలు అమ్మినారట యిచట
నాటి రాయల పేరు నేటికిని తలపోయు
తుంగభద్రానదీ తోయమాలికలందు

ఆడవే...ఆడవే
ఆడవే జలకమ్ములాడవే
ఆడవే జలకమ్ములాడవేపోతున్నావా తొందరపడి పాట సాహిత్యం

 
చిత్రం: విచిత్ర కుటుంబం (1969)
సంగీతం: టి. వి. రాజు
సాహిత్యం: డా॥ సి.నారాయణరెడ్డి 
గానం: పి.సుశీల 

పల్లవి: 
పోతున్నావా తొందరపడి పోతున్నావా
మనసారా వలచిన నీ చెలి
మనసు విరిచి పోతున్నావా

చరణం :
నన్ను నీవు విడిచి పోతున్నా
నిన్ను విడిచి నే నుంటానా
నీ వెంతటి దూరాన వున్నా
నీడవలె నీ వెంట రానా
ఊపిరిలో ఊపిరి
ఉన్న నన్ను కాదన గలవా

చరణం: 
చిరుకోపం చెల రేగిందని
చెలిమి వదులు కుంటామా
ముళ్లు నాటుకుంటున్నాయని
పూలు వదులు కుంటామా
పెనవేసిన మన అనుబంధం
విడిపోతుందంటావా

చరణం: 
కరిగిపోవు మబ్బులలోనా
కన్నీళ్ళే కనుగొంటావు
విరబూసిన వెన్నెలలోనా
చిరునవ్వులె చూస్తుంటావు
మంచుతెరలు తొలగిన పిదప 
మనసు మార్చుకుంటావూ

పోతున్నావా మనసు విరిచి పోతున్నావా
మమత విడిచి పోతున్నావా 
నన్నే విడిచి పోతున్నావా

ఎర్ర ఎర్రని దాన పాట సాహిత్యం

 
చిత్రం: విచిత్ర కుటుంబం (1969)
సంగీతం: టి. వి. రాజు
సాహిత్యం: డా॥ సి.నారాయణరెడ్డి 
గానం: పిఠాపురం నాగేశ్వరరావు, ఎల్. ఆర్. ఈశ్వరి 

ఎర్ర ఎర్రని దాన బుర్రా బుగ్గలదాన
బుర్రా బుగ్గల మీద బుద్ధి పుట్టె నాకూ 
ఓ చిన్న దానా డస్కో డస్కో

ఓ రయ్యో బంజారీవాడ రొయ్య మీసాలవాడ
రొయ్య మీసాలు చూసి నవ్వు పుట్టే నాకు 
ఓ చిన్నవాడ ఇస్కో ఇస్కో
సింతపూల రైక తొడిగి నెనగపూల కోకకట్టి 
సింగారం మూటగట్టి సిట్టడవి బాటబట్టి
సిటుకు సిటుకు గాజులతో పెటుకు పెటుకు మెట్టెలతో 
గజ్జెల గుర్రంలాగ వస్తావు అరే
మజ్జారె నన్నే బులిపిస్తావు

సెంగావి పంచెగట్టి సెలగోల చేతబట్టి
అందాలా మీసాలకు మందారా నూనెబెట్టి 
గరుకు గరుకు నవ్వులతో బెరుకు చెరుకు సూపులతో
పుంజులాగ నువ్వు కేరుతుంటావు తాటి
ముంజెలాగ వూరిస్తూ వుంటావు 

నీకూ నీ వారు లేరు నాకు నా వారు లేరు
వెచ్చగ వుందామంటే గచ్చుమిద్దె గతిలేదూ
మిద్దెలొద్దు మేడలొద్దు డబ్బులొద్దు డాబు లొద్దు
చెట్టాపట్టాల్ పట్టుకుందామా చెట్టు 
చెట్టుకొక్క గూడు కట్టుకుందామా జంట
పిట్టల్లా కాపురమే వుందామా
డస్కో... డస్కో
ఇస్కో...ఇస్కో

Most Recent

Default