Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Juliet Lover Of Idiot (2017)చిత్రం: జూలియట్  Lover of ఇడియట్ (2017)
సంగీతం: రతీశ్ వేగ
సాహిత్యం:
గానం: అనిత కార్తికేయన్
నటీనటులు: నవీన్ చంద్ర, నివేద థామస్
దర్శకత్వం: అజయ్ ఓదిరాల
నిర్మాత: కొత్తపల్లి ఆర్. రఘుబాబు
విడుదల తేది: 24.11.2017

నీకై వేచే కనులకే రానే రాదు అలసటే
నిను చూశాక మనసే ఎగసే
నీతో నిండే తలపులే నాతో నిత్యం తలపడే
రేయి పగలు చెదిరే నిదరే
తొలిసారి గుండెల్లో గుబులేదో తొలిచింది
నీవల్లే నీవూ
నాలో నన్నుని వెలివేశానులే
నీలో నన్నుని వెతికానే
నేనను భావనే చెరిపేశానులే
నువ్వేలే నువూ నడిచాలే
ఎపుడో అపుడు చూస్తావంటు నావైపే

ఓ హో హో  ఓ హో హో ఓ హో హో

నా కనులే రాసినా ఈ చూపు లేఖలు
నిన్నింకా చేరనే లేదు
మాటలు దాచి మేఘాల సందేశాలే పంపా
మాటుగ చూస్తూ నీ ముందే నా ప్రేమంతా పరిచే ఉంచా

ఓ హో హో  ఓ హో హో  ఓ హో హో

నీకై వేచే కనులకే రానే రాదు అలసటే
నిను చూశాక మనసే ఎగసే
నీతో నిండే తలపులే నాతో నిత్యం తలపడే
రేయి పగలు చెదిరే నిదరే

నీ వైపే సాగుతూ నా మనసే ఎందుకో
నా మాటే వినడమే లేదూ
గ్రాననలోని ఏ మంత్రం విసిరేశావో ఏమో
గాలం వేసి నా హృదయం నీతో పాటే లాగేశావు...

ఓ హో హో  ఓ హో హో  ఓ హో హో

నీకై వేచే కనులకే రానే రాదు అలసటే
నిను చూశాక మనసే ఎగసే
నీతో నిండే తలపులే నాతో నిత్యం తలపడే
రేయి పగలు చెదిరే నిదరే


******  ******  *******


చిత్రం: జూలియట్  Lover of ఇడియట్ (2017)
సంగీతం: రతీశ్ వేగ
సాహిత్యం: సర్వారావ్
గానం: రాహుల్ నంబియర్

అడుగులు వెతికే గమ్యం కోసం
అలుపును గెలిచి చూడు
గుప్పిట దాచిన చీకటిలోన
దైర్యం చూపి దుకెయ్ రో

ఎత్తుకే పైకెదిగినా నీలాకాశ౦ అందునా
ఎంతలా నువ్ ఒదిగినా పైసా లాబం రాలునా
పాపం పుణ్యం ఆలొచించే నైజం
వున్నోడిని చూపించెయ్ రా నేస్తం

కాలం కర్మం కాలిసొస్తె చిత్రం
రానప్పుడె పుట్టించేస్తే నయ్యం
ఓ ఓ ఓ ఓ ఒహ్ ఓ ఓ
ఓ ఓ ఓ ఓ ఒహ్ ఓ ఓ
ఓ ఓ ఓ ఓ ఒహ్ ఓ ఓ
ఓ ఓ ఓ ఓ ఒహ్ ఓ ఓ

మంచిగ ఉంటే పెంచేస్తడా ఆయుషంతా నీకు
ఆప్షన్ లేని ఇన్నింగ్స్ రా
హెయ్ స్వార్దం తోనె సాద్యం రా
అవసరమైతే రాజైనా అష్వద్దామా హతహా అన్నడే
హెయ్ హెయ్ ఏరోజు కారోజు కాలాన్ని మార్చెయ్యరా మార్చెయ్యరా
నీ గుండె లోతుల్ని చూసేది నువ్వే కదా నువ్వే కదా
ఓ ఓ ఓ ఓ ఒహ్ ఓ ఓ
ఓ ఓ ఓ ఓ ఒహ్ ఓ ఓ
ఓ ఓ ఓ ఓ ఒహ్ ఓ ఓ
ఓ ఓ ఓ ఓ ఒహ్ ఓ ఓ

కొందను చూసి గుండెలు బాది కిందే ఉంటె ఎట్లా
అదిరోహిస్తు నెగ్గేయ్యరా
యుద్దం లేని విజయంలా
మష్తిత్వాన్నే వాడెయ్ రా
కాస్తొ కూస్తొ పైస నొక్కెయ్ రా
నువ్వెంత నేనెంత సొల్లంత ఆపెయ్యరా ఆపెయ్యరా
దమ్ముంటె నువ్వేంటో చెతల్లొ చూపించరా చూపించరా
ఓ ఓ ఓ ఓ ఒహ్ ఓ ఓ
ఓ ఓ ఓ ఓ ఒహ్ ఓ ఓ
ఓ ఓ ఓ ఓ ఒహ్ ఓ ఓ
ఓ ఓ ఓ ఓ ఒహ్ ఓ ఓ


******  ******  *******


చిత్రం: జూలియట్  Lover of ఇడియట్ (2017)
సంగీతం: రతీశ్ వేగ
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: యాజిన్ నిజార్

ఐఫిల్ టవర్ పై సల్సాలే
మెరుపు తీగపై ఉయ్యాలే
ఓలరవ్ నా కల్లలో
కార్నివల్ కాంతులే
ట్రఫిక్ జాం ట్రఫిక్ జాం మనసంతా
క్రేజీగా మారిందే జగమంతా

రెయిన్.బో లో రంగై పోయా
నిజమా ఇది నా కలయా
మతిపోయే ఈ సంతోషం
నీ వల్లే కద చెలియా

ట్రఫిక్ జాం ట్రఫిక్ జాం మనసంతా
క్రేజీగా మారిందే జగమంతా

సాగే కాలం కన్నా
ముందే పరిగెడుతున్నా
నేల మీద లేవె పాదాలు
లోకం కల్లలోనా
ఓ వింతగ కనిపిస్తున్నా
నీవైపేగా నా చుపులూ
తజుమహల్ తళుకై మెరుస్తుంది మనసే
నువ్వు ఇవ్వబోయె బహుమానమేదొ తెలిసీ
చేతి గీత లోన అద్రుష్టం కలిసే
నీ ప్రేమలోన నా మనసంత తడిచే

ట్రఫిక్ జాం ట్రఫిక్ జాం మనసంతా
క్రేజీగా మారిందే జగమంతా

రెయిన్.బో లో రంగై పోయా
నిజమా ఇది నా కలయా
మతిపోయే ఈ సంతోషం
నీ వల్లే కద చెలియా

నీలో నువ్వేమన్నా అన్నీ వింటు ఉన్నా
తేలుతున్న మేఘాల పైనా
సర్లె ఏదేమైనా నీ యదలోనే ఉన్నా
చదివేశా నీ అలోచనా
యెంత కాలమైనా నిన్ను కోరి వేచి ఉన్నా
అంతకంతకూ ప్రేమ పెంచుకున్నా
తీపి కలలు కంటూ నీ పిలుపునందుకున్నా
క్షణమాగనంటూ నీ చెంత చేరుకోనా

ట్రఫిక్ జాం ట్రఫిక్ జాం మనసంతా
క్రేజీగా మారిందే జగమంతా

రెయిన్.బో లో రంగై పోయా
నిజమా ఇది నా కలయా
మతిపోయే ఈ సంతోషం
నీ వల్లే కద చెలియా

ట్రఫిక్ జాం ట్రఫిక్ జాం మనసంతా
క్రేజీగా మారిందే జగమంతా
ట్రఫిక్ జాం ట్రఫిక్ జాం మనసంతా
క్రేజీగా మారిందే జగమంతా******  ******  *******


చిత్రం: జూలియట్  Lover of ఇడియట్ (2017)
సంగీతం: రతీశ్ వేగ
సాహిత్యం: కరుణాకర్
గానం:

ఐ డోంట్ నో ఆకు ముల్లు కథా
ఐ డోంట్ నో మమ్మి డాడి ఆటా
నోట్లో వేలు పెట్టినా
ఏం చెయ్యాలో తెలియదే
జారే పైటా పట్టినా
ఏం చేస్తారో తెలియదే
ఐ డోంట్ నో ఆకు ముల్లు కథా
ఐ డోంట్ నో మమ్మి డాడి ఆటా

మగవాల్లకి ఏమిటుందో
ఆడవాల్లకి ఏంకవాలో
తెలిసే ఈడె ఉన్నదా నాలో చెబుతారా హలో

ఐ డోంట్ నో ఆకు ముల్లు కథా
ఐ డోంట్ నో మమ్మి డాడి ఆటా

స్వాతీ బుక్కు టిప్సు కోసం
వారం అంతా వైట్ చేసా
రిప్లై రాక రాపిడయ్యే
ఈడునంతా దచుకున్నా మందిలో
అది ఎవ్వరైనా తీర్చరా డౌటునీ

ఐ డోంట్ నో ఆకు ముల్లు కథా
ఐ డోంట్ నో మమ్మి డాడి ఆటా

చేసెకొద్ది నచ్చెదేంటీ
చెప్తానంది జ్యోతిలక్ష్మీ
తీరా వేల్తె పక్కకొచ్చి
నూటన్ సూత్రం చెప్పుతూంది
యేమిటో దాని అర్దమేంటొ చెప్పరా కనుగొనీ

ఐ డోంట్ నో ఆకు ముల్లు కథా
ఐ డోంట్ నో మమ్మి డాడి ఆటా
నోట్లో వేలు పెట్టినా
ఏం చెయ్యాలో తెలియదే
జారే పైటా పట్టినా
ఏం చేస్తారో తెలియదే


******  ******  *******


చిత్రం: జూలియట్  Lover of ఇడియట్ (2017)
సంగీతం: రతీశ్ వేగ
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం:

ఇలా చూడురా నాన్న
ఇలా చూడు నా కన్న
నువ్వే నాకు అన్నీ నంటా ఓ వరాల మూటా
నిన్నే వీడి ఎట్టా ఉంటా
ఇలా చూడురా నాన్న
ఇలా చూడు నా కన్న
నువ్వే నాకు అన్నీ నంటా ఓ వరాల మూటా
నిన్నే వీడి ఎట్టా ఉంటా

ఉలికిపదే క్షణములలో తలనిమిరే చెయ్యవ్వనా
కలలు కనే సమయంలో తలవాల్చే దిండవ్వనా
లాలై లాలించనా పాలై పాలించనా
దిం దిం తాన దిం దిం తాన
దిం దిం తాన దింతనా
దిం దిం తాన దిం దిం తాన
దిం దిం తాన దింతనా

ఇలా చూడురా నాన్న
ఇలా చూడు నా కన్న
నువ్వే నాకు అన్నీ నంటా ఓ వరాల మూటా
నిన్నే వీడి ఎట్టా ఉంటా

ఆనదం నువ్వుగా నా కడుపే పండెనా
ఎన్నటికి నువ్వు నా చురునవ్వు రా
ఆకాశం సూర్యుడూ అందాలా వెన్నెలా
నీ వెలుగుకి పోలికే కావురా
నీ చిగురు మోమున వెలుగుందిరా
రాజాది రాజ కళా

శెతకోటి దైవాల దీవెనవై కలిశావు
ఈ అమ్మను కరునించేలా
మొప్పొద్దు నన్ను
ముద్దులతో మురిపించేలా

నా లోకం పూర్తిగా నీలా మారింది రా
నువ్వేమి చేసినా అపురూపమే
ఏ షొకం సూటిగా నా దరి రాలెదు రా
నీ రూపం మనసులో మనిదీపమే
అమ్మా అనే నీ పిలుపొకటి చాలు
అది నాకు అమ్రుతమే

ఎల్లెదిగే నిను చూసి ఎనలేని సంతోషం
కల్లరా దిష్టే తియ్యనా
యెన్నెల్లకైనా రెప్పల్లొ నిన్నే కాయనా
ఎల్లెదిగే నిను చూసి ఎనలేని సంతోషం
కల్లరా దిష్టే తియ్యనా
యెన్నెల్లకైనా రెప్పల్లొ నిన్నే కాయనా

పండుగలా మారింది నీ వలనె మా జీవనము
నిండుదనం దొరికింది ఈ సంబరమే నీ వరము
నీ జతలో కదలికే మరిచెను మా కాలము
దిం దిం తాన దిం దిం తాన
దిం దిం తాన దింతనా
దిం దిం తాన దిం దిం తాన
దిం దిం తాన దింతనా
దిం దిం తాన దిం దిం తాన
దిం దిం తాన దింతనా
దిం దిం తాన దిం దిం తాన
దిం దిం తాన దింతనా

Most Recent

Default