Home Movie Songs Latest Updated Movies Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box


చిత్రం: రేయ్ (2015)
సంగీతం: చక్రి
సాహిత్యం: చంద్రబోస్
గానం: చక్రి
నటీనటులు: సాయి ధరమ్ తేజ్, శ్రద్ధా దాస్, సయామి కెహర్
దర్శకత్వం: వై. వి.యస్. చౌదరి
నిర్మాత: వై. వి.యస్. చౌదరి
విడుదల తేది: 27.03.2015

ప్రియతమా ఎందుకే చంపుతావే నన్నిలా
మనసులో గుణపమే దించుతావే ఇంతలా
ప్రియతమా...

ఓ ప్రియతమా... ఓ ప్రియతమా ఓ ప్రియతమా ఒహొ (2)

కింగ్ లాగ ఉండేవాన్ని కులాషాగ తిరిగేవాన్ని
భాదలేమి తెలియని వాణ్ణి బిందాస్ గా బ్రతికేవాణ్ణి
నిన్నే నే చూశాను నీ చుట్టు తిరిగాను
శని పట్టి సన్యాసయ్యను
నీకే మనసిచ్చాను నిన్నే ప్రేమించాను
నిలువెల్లా నాశనమయ్యాను

ఓరి దేవుడో ఓరోరి దేవుడో ఓ ఓ హో
ఓ సమ్మగుందిరో ఓ హో ఓ హో...
నా చెలినందుకే ఏ ఏ ఏ ఏ
వడలబోనురో... ఓ

ఓ ప్రియతమా... ఓ ప్రియతమా ఓ ప్రియతమా ఒహొ

గురియైన అంతో ఇంతో డమ్ డమ్ అని కలిసే
పువ్వైతే ఎంతో కొంత లోతుల్లో ధమ్ ధమ్ అని కలిసెనే
నీవల్లే లోతే తెలియని ప్రేమల్లో నే మునిగానే
నీ వల్లే తీరం చేరని దారుల్లో నే తిరిగానే
సునామీలు ఎదురవగా సుడుల్లోన పడిపోగా
నీళ్ళల్లో కన్నిరాయెనే
కన్నీరే కనుమరుగాయెనే

ఓరి దేవుడో ఓరోరి దేవుడో ఓ ఓ హో
ఓ సమ్మగుందిరో ఓ హో ఓ హో...
తాను చస్తే ఎహ ఎహ నేను చస్తారా

స్వర్గానికి తనుపోతే తనవెనకే నే పోతా
తనుతాగే అమృతమైపోతా
నరకానికి తను పోతే తనపక్కన నేనుంటా
తన శిక్షలు నాకే ఇవ్వమంటా

ఓ ప్రియతమా... ఓ ప్రియతమా ఓ ప్రియతమా ఒహొ

ఇన్నాళ్లు సంతోషాల దేశాలెన్నో ఏలానే
ఇన్నాళ్లు ఆనందాల ఆకాశంలో ఎగిరానే
నీతోని జంటే కోరి శూన్యంలోకే జారానే
నీ పైనే ప్రాణాలుంచి సున్నా నేనై మిగిలానే
నిప్పు ఉప్పెనెదురైనా మంట చుట్టుముడుతున్నా
మసిబారి మళ్ళీ వస్తానే కసితీర నిను కదిలిస్తానే


ఓరి దేవుడో ఓరోరి దేవుడో ఓ ఓ హో
ఓ సమ్మగుందిరో ఓ హో ఓ హో...
నన్ను కుడితే ఏయ్ ఏయ్ ఏయ్ నేను కుడతా

ఏ జీవిగ తానుంటే ఆ జీవిగ నేనుంటా
నా జీవిత లక్ష్యం ప్రేమంటా
ఏ జాతిలో తానుంటే ఆ జాతిలో నేనుంటా
నా ప్రేమకు జాతర జరిపిస్తా

ఓ ప్రియతమా... ఓ ప్రియతమా ఓ ప్రియతమా ఒహొ
ఎందుకే చంపుతావే నన్నిలా ఓహో
ఓ ప్రియతమా... ఎందుకే చంపుతావే నన్నిలా ఓహో

Most Recent

Default