Home Movie Songs Latest Updated Movies Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box



చిత్రం: ఒక్క అమ్మాయి తప్ప (2016)
సంగీతం: మిక్కి జె మేయర్
సాహిత్యం: శ్రీమణి
గానం: రమ్యా బెహ్రా , అభయ్ జోధ్పుర్కార్
నటీనటులు: సందీప్ కిషన్, నిత్యామీనన్
దర్శకత్వం: రాజసింహ తాడినాడ
నిర్మాత: అంజి రెడ్డి
విడుదల తేది: 10.06.2016

ఎగిరెనే  ఎగిరెనే మనసిలా హాయిగా
ఎదురయే ఎదురయే ప్రేమలా మాయగా
కుదిరెనే కుదిరెనే తరుణమే కుదురుగా
నిజమా కలా వెన్నెలా
ఈ రోజిలా నా కన్నులా నీ వన్నెలా
మన నిన్నలా పసిపాపలా సిందులే వేసేలా

ఎగిరెనే  ఎగిరెనే మనసిలా హాయిగా
ఎదురయే ఎదురయే ప్రేమలా మాయగా
కుదిరెనే కుదిరెనే తరుణమే కొత్తగా
జరిగెనే జరిగెనే అద్భుతం తియ్యగా

యమున లాగ ఎగసే హృదయం ఇలా
వేణు వేణివిన్న రాధమ్మలా
సీత జాడ వెతికే రాముడి కలా
జటాయువులు కలిసే పావురమిలా
ఏ చేత నవ్వులు ఏవైనా
ఈ క్షణము గుండెపై చిక్కేనా
నిశిలో ఇలా శశి రేఖలా నా దిశలిలా దశ మారెలా
ఏం చెప్పను ఎంత వింతీవేళ

ఎగిరెనే  ఎగిరెనే హా...
ఎదురయే ఎదురయే హా...
కుదిరెనే కుదిరెనే తరుణమే కొత్తగా
జరిగెనే జరిగెనే అద్భుతం తియ్యగా

ఏడురంగులేనా హరివిల్లుకి
వేల రంగులొచ్చే నా కళ్ళకి
ఏడు అద్భుతాలే ఈ భూమికి
ఎన్ని అద్భుతాలో ఈ ప్రేమకి
ఆకాశమయ్యెనే నా వాసం
ఆ చందమామలా దరహసం
నే నీ వశం ఇక నా వశం ఈ పరవశం
ఒక మధురసం నా ప్రాణమే పంచనా నీకోసం

ఎగిరెనే  ఎగిరెనే
ఎదురయే ఎదురయే
ఎగిరెనే  ఎగిరెనే మనసిలా హాయిగా
ఎదురయే ఎదురయే ప్రేమలా మాయగా
కుదిరెనే కుదిరెనే తరుణమే కొత్తగా
జరిగెనే జరిగెనే అద్భుతం తియ్యగా

Most Recent

Default