-->
Home Movie Songs Latest Updated Movies Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Results for "V. Madhusudhan Rao"



చిత్రం: పదండి ముందుకు (1962)
సంగీతం: ఎస్.పి.కోదండపాణి
సాహిత్యం: శ్రీశ్రీ, సి.నారాయణరెడ్డి, ఆరుద్ర, దాశరథి, జగ్గయ్య
గానం: ఎ.పి.కోమల,ఘంటసాల వెంకటేశ్వరరావు, మాధవపెద్ది సత్యం, పిఠాపురం నాగేశ్వరరావు, శిష్ట్లా జానకి, పులపాక సుశీల, మహమ్మద్ రఫీ
నటీనటులు: జగ్గయ్య, జమున, గుమ్మడి, జి.వరలక్ష్మి, ఘట్టమనేని  కృష్ణ, హేమలత
దర్శకత్వం: వి.మధుసూధనరావు
నిర్మాత: తుమ్మల కృష్ణమూర్తి
విడుదల తేది: 26.01.1962


ఎల్వీ ప్రసాద్ తీయబోయిన కొడుకులు కోడళ్ళు సినిమా ఆగిపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఘట్టమనేని కృష్ణని ఈ సినిమాలో చిన్న పాత్రకు తీసుకున్నారు. అనంతరకాలంలో సూపర్ స్టార్ అయిన కృష్ణకు తొలి చిత్రం ఇదే

Palli Balakrishna Wednesday, May 20, 2026



చిత్రం: మంచివాడు (1974)
సంగీతం: కె.వి.మహదేవన్ 
నటీనటులు: అక్కినేని నాగేశ్వరరావు, వాణిశ్రీ, కాంచన 
దర్శకత్వం: వి.మధుసూదనరావు
నిర్మాత: టి.గోవిందరాజన్
విడుదల తేది: 21.02.1974



Songs List:



ఆకలుండదు పాట సాహిత్యం

 
చిత్రం: మంచివాడు (1974)
సంగీతం: కె,వి,మహదేవన్ 
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ 
గానం: ఘంటసాల, పి.సుశీల 

ఆకలుండదు – దాహముండదు నిన్ను చూస్తుంటే
వేరే ఆశ వుండదు ధ్యాస వుండదు నువ్వు తోడుంటే
మల్లెలుండవు - వెన్నెలుండదు నీ నవ్వే లేకుంటే
మనసువుండదు—మమతవుండదు నీ మనిషిని కాకుంటె
వయసులో యీ పోరు వుండదు నీ వలపే లేకుంటే
వలపు యింత వెచ్చగుండదు నీ ఒడిలో కాకుంటే

పొద్దు గడచేపోతుంది - నీ నడక చూస్తుంటే
ఆ నడక తడబడిపోతుంది - నీ చూపుపడుతుంటే 
ఆకుమడుపులు అందిస్తు నువ్వు వగలు పోతుంటె
ఎంత యెరుపో అంత వలపని - నే నాశపడుతుంటె

తేనెకన్న తీపికలదని - నీ పెదవే తెలిపింది
దానికన్న తియ్యనై నది నీ ఎదలో దాగుంది
మొదటి రేయికి తుదేలేదని నీ ముద్దే కొసరింది
పొద్ధుచాలని ముద్దులన్ని నీ వద్ధేదాచింది
ఆ ముద్రే మిగిలింది



చిట్టి పాపలు కథలువింటూ పాట సాహిత్యం

 
చిత్రం: మంచివాడు (1974)
సంగీతం: కె,వి,మహదేవన్ 
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ 
గానం: ఘంటసాల

చిట్టి పాపలు కథలువింటూ నిదురపోతారు
నిదురపోతూ కమ్మకమ్మని కలలు కంటారు
కథలుచెప్పే అమ్మనాన్నలు నిదురపోలేరు
చెప్పలేని కథల వ్యధతో మేలుకుంటారు
చిట్టిరాణి పెద్దదైతే ఎలావుంటుందో
రాణి కన్నిట తగినరాజు ఎక్కడున్నాడో
పెళ్ళిచేసి మెట్టినింటికి ఎటుల పంపాలో
అని కలలుకంటూ కలతపడుతూ మేలుకుంటారు



మాపటికొస్తావా పాట సాహిత్యం

 
చిత్రం: మంచివాడు (1974)
సంగీతం: కె,వి,మహదేవన్ 
సాహిత్యం: డా॥ సి.నారాయణరెడ్డి 
గానం: పి.సుశీల 

మాపటికొస్తావా మరి రేపటికొస్తావా
మాపటికొస్తే యిస్తానోయ్ యిస్తానోయ్
మల్లెపూల చెండు లిస్తానోయ్
రేపటికొస్తే మొక్కజొన్న కండె లిస్తానోయ్

ఇది పూలతోటకే వెలుగిస్తాది
అది మెట్టచేనుకే సిరులిస్తాది
ఇది వాసన చూస్తేనే మత్తెక్కిస్తాది
అది చెప్పలేని రుచులిస్తాది కొత్తరుచులిస్తాది

హైరా మామా - మనసైనా మామా
తమాషాగ రమ్మంటె తళుక్కుమంటావేమో
ఎగతాళికి నేనంటే ఎంటపడతావేమో
నాచుట్టు రక్కెస ముళ్ళున్నాయ్

కోడెతాచు కోరలున్నాయ్
వాటిని తెలుసుకొని - వైనం చూసుకొని
చివరికి ననుచేరుకుంటే
జాజులు మోజులు నీకేనోయ్
నవ్వులు పువ్వులు నీకేనోయ్





అమ్మాయే పుడుతుంది పాట సాహిత్యం

 
చిత్రం: మంచివాడు (1974)
సంగీతం: కె,వి,మహదేవన్ 
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ 
గానం: ఘంటసాల, పి.సుశీల 

అమ్మాయే పుడుతుంది - అచ్చం
అమ్మలాగే వుంటుంది
అబ్బాయే పుడతాడు - అచ్చం
నాన్నలాగే వుంటాడు
కోటేరులాంటి ముక్కు కోలకళ్లు...లేత
కొబ్బరంటి చెక్కిళ్లు చిలిపి నవ్వులు

ఆ నవ్వుల్లో వస్తాయి. చిన్ని నొక్కులు
ఆ నొక్కులే తెస్తాయి—మనకెన్నో సిరులు 

దోబూచులాడు కళ్లు_దొంగ చూపులు
తియ్య తియ్యని మాటలు - తెలివితేటలు
ఆ మాటలకే పడతారు కన్నెపిల్లలు
ఈ అత్తగారికప్పుడు ఎందరమ్మా కోడళ్లు

నీలాంటి ఆడపిల్ల కావాలి నాకు
ఉహు—మీలాంటి పిల్లాణ్ణి కంటాను నేను
ఇద్దర్నీ కంటె వద్దన్నదెవరు
ఆ ఇద్దరు అబ్బాయిలైతేనొ



చూస్తా బాగా చూస్తా పాట సాహిత్యం

 
చిత్రం: మంచివాడు (1974)
సంగీతం: కె,వి,మహదేవన్ 
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ 
గానం: ఘంటసాల, పి.సుశీల 

చూస్తా బాగా చూస్తా
చేయిచూస్తా - చూసి చెబుతా
ముందు వెనక యేముందో - యెక్కడుందో
యెవరికెవరి కెంతుందో చూచి చెబుతా

కోట్లు కోట్లుగా గడించి కూడబెట్టకు
వజ్రాలుగా బంగారుగా మార్చి దాచకు
రాజ్యాంగమందు నేడు రాహువున్నాడు.
రాత్రిరాత్రి కొచ్చి మొత్తం మింగిపోతాడు.
ఏ ఎన్ ఆర్, ఎన్ టి ఆర్ ఏలుతారన్నాను
వాణిశ్రీ సావిత్రికి వారసని చెప్పాను
జగ్గయ్య, జయలలిత, శోభన్ బాబు, కృష్ణకి
పద్మనాభం, రమాప్రభ, రాజబాబుకి
దసరాబుల్లోడికి ప్రేమనగర్ నాయుడికి
ఆత్రేయ, ఆదుర్తి మహదేవన్ అందరికి
ఆనాడు చెప్పింది ఈనాడు జరుగుతూంది
ఈనాడు చెప్పేది రేపు జరుగబోతుంది

వేలవేల యెకరాలకు గోలుమాలు
తాతల యెస్టేటుకైన చెప్పాలి టాటాలు

దిగమింగే నాయకులకు దిన గండాలు
పన్నెగ వేసే పెద్దలకు వెలక్కాయలు.
తాతయ్య పేరులో మనవళ్ళు పెరిగారు
మనవళు దోచింది మునిమనవళ డిగారు
అడుగునున్న వాళ్ళింక అణిగి మణిగి వుండరు
ఆడోళ్ళే ఇకమీదట అందలాన వుంటారు
మగవాళ్ళ ఆటకట్టి మరమ్మత్తు చేస్తారు.
చిట్టి నిర్మల చేతిలో సేటు రాత రాశాడు.

సంభాషణ: ఓ పండిట్ జీ మేరా హాత్ భీ దేఖియేనా
దేకుతా దేరుతా
అందుకే
ఈనాడు చెప్పేది రేపు జరగబోతుంది
ఏమోలే అనుకుంటే మీ ఖర్మలేపొండి ॥చూసా॥



ఈ రేయి కవ్వించింది పాట సాహిత్యం

 
చిత్రం: మంచివాడు (1974)
సంగీతం: కె,వి,మహదేవన్ 
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ 
గానం: ఘంటసాల, పి.సుశీల 

ఈ రేయి కవ్వించింది
నా మేను పులకించింది
రా నీలో దాచుకొ
నా పరువాలే పంచుకో

చిలిపి మనసు నా మాట వినదు
దోరవయసు ఇకఊరుకోదు
మనసుమాటే విందాములే
వయసు ఆటే ఆడేములే
రా లోకం మరచిపో
లే ముద్దులలో మురిసిపో

నిండు వలపుల నీ కౌగిలింత
ఉండిపోని జీవితమంతా
కెంపు సొంపుల చెంపలు నావే
మధువులూరే అధరాలు నావే
రా…నాలో నిండిపో
నా ఆశలనే పంచుకో

పాలవెన్నెల కురిసేటివేళ
మల్లె పానుపు పిలిచేటివేళ
తనువులొకటై పెనవేసుకో
కన్నులొకటై కథలల్లుకోనీ
రా…ఎద పై వాలిపో
నా ఒడిలోనే సోలిపో




అబ్బాయే పుట్టాడు పాట సాహిత్యం

 
చిత్రం: మంచివాడు (1974)
సంగీతం: కె,వి,మహదేవన్ 
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ 
గానం: పి.సుశీల

అబ్బాయే పుట్టాడు - అచ్చం
నాన్నలాగేవున్నాడు -
దోబూచులాడు కళ్ళు ఇంకలేవని
తీయ్య తీయన్ని బంధాలు తీరెనని
తల్లిగా ననుచేసి తాను తప్పుకున్నాడు
ఆ కన్నతండ్రి పోలికతో కడుపుకోసి పోయాడు





పెట్టి పుట్టిన దానవమ్మా పాట సాహిత్యం

 
చిత్రం: మంచివాడు (1974)
సంగీతం: కె,వి,మహదేవన్ 
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ 
గానం: పి.సుశీల, ఘంటసాల

పెట్టి పుట్టిన దానవమ్మా నువ్వు - నీ
పుట్టుకే ఒక పండుగమ్మా మాకు

ఎందరో నీలాంటి పాపలు పుట్టివుంటారు
అందులో ఎందరమ్మా పండుగలకు
నోచుకుంటారు - వుండి చూచుకుంటారు

కన్నవాళ్ళు చేసుకున్న పూజాఫలమో
నువ్వే జన్మలోనో దాచుకున్న పూర్వపుణ్యమో
నూరు పండుగ లీలాగే చేసుకుంటావు
కొందరేమో పండుగల్లె వచ్చిపోతారు
నూరేళ్ళు నిండిపోతారు

ఉన్నవాళ్లు లేనివాళ్ళను భేదాలు
మనకెగాని మట్టిలోన లేవమ్మా 
ఆ మట్టిలోనే పుట్టి గిట్టే తోబుట్టులకు
కన్నీటి బొట్టు కానుకిస్తే చాలమ్మా చాలమ్మా


Palli Balakrishna Friday, November 24, 2023



చిత్రం: మల్లె మొగ్గలు (1986)
సంగీతం: రమేష్ నాయుడు
సాహిత్యం: వేటూరి 
గానం: యస్.పి.బాలు, యస్.జానకి
నటీనటులు: రాజేష్, సాగరిక
దర్శకత్వం: వి.మధుసూధనరావు
నిర్మాత: రామోజీ రావు
విడుదల తేది: 28.03.1986



Songs List:



ఆంగికం భువనం యస్య వాచికం పాట సాహిత్యం

 
చిత్రం: మల్లె మొగ్గలు (1986)
సంగీతం: రమేష్ నాయుడు
సాహిత్యం: వేటూరి 
గానం: యస్.పి.బాలు, యస్.జానకి 

ఆంగికం భువనం యస్య వాచికం




ఏరుపక్క మా వూరమ్మా వూరుపక్క పాట సాహిత్యం

 
చిత్రం: మల్లె మొగ్గలు (1986)
సంగీతం: రమేష్ నాయుడు
సాహిత్యం: వేటూరి 
గానం: యస్.పి.బాలు

ఏరుపక్క మా వూరమ్మా వూరుపక్క 




మందార మల్లికి శృంగార పూజలు పాట సాహిత్యం

 
చిత్రం: మల్లె మొగ్గలు (1986)
సంగీతం: రమేష్ నాయుడు
సాహిత్యం: వేటూరి 
గానం: యస్.జానకి, యస్.పి.బాలు

మందార మల్లికి శృంగార పూజలు





పూర్వజన్మ సంగమం అపూర్వ ప్రేమ పాట సాహిత్యం

 
చిత్రం: మల్లె మొగ్గలు (1986)
సంగీతం: రమేష్ నాయుడు
సాహిత్యం: వేటూరి 
గానం: యస్.జానకి, యస్.పి.బాలు

పూర్వజన్మ సంగమం అపూర్వ ప్రేమ




వెన్నెలా వెన్నెలా ఈ రేయి పాట సాహిత్యం

 
చిత్రం: మల్లె మొగ్గలు (1986)
సంగీతం: రమేష్ నాయుడు
సాహిత్యం: వేటూరి 
గానం: యస్.పి.బాలు

వెన్నెలా వెన్నెలా వెన్నెలా ఈ రేయి



యాడికే నీ పరుగు యెర్రి గంగమ్మా పాట సాహిత్యం

 
చిత్రం: మల్లె మొగ్గలు (1986)
సంగీతం: రమేష్ నాయుడు
సాహిత్యం: వేటూరి 
గానం: యస్.పి.బాలు

యాడికే నీ పరుగు యెర్రి గంగమ్మా


ఓ యబ్బలాలో పాట సాహిత్యం

 
చిత్రం: మల్లె మొగ్గలు (1986)
సంగీతం: రమేష్ నాయుడు
సాహిత్యం: వేటూరి 
గానం: యస్.జానకి 

ఓ యబ్బలాలో 

Palli Balakrishna



చిత్రం: విచిత్ర జీవితం (1979)
సంగీతం: కె.చక్రవర్తి 
సాహిత్యం: డా॥ సి.నారాయణరెడ్డి, వేటూరి, దాశరథి, ఆరుద్ర, వీటూరి వెంకట సత్య సూర్యనారాయణమూర్తి 
గానం: యస్.పి.బాలు, పి.సుశీల, జిక్కీ (పి.జి.క్రిష్ణవేణి) 
నటీనటులు: నాగేశ్వరరావు, వాణిశ్రీ, జయసుధ
దర్శకత్వం: వి.మధుసూధనరావు 
నిర్మాత: నిడమర్తి పద్మాక్షి, యన్.పుష్పా భట్  
విడుదల తేది: 14.04.1978


(గమనిక: వేటూరి సుందరరామ మూర్తి, వీటూరి వెంకట సత్య సూర్యనారాయణమూర్తి ఇద్దరు వేరు వేరు, కానీ వీరిద్దరు పాటలు రచయితలు. వీరిద్దరూ కలిసి ఒకే సినిమాలో పాటలు రాసిన సినిమాలు:
1.యమగోల (1977)
2. మల్లెపువ్వు (1978)
3. విచిత్ర జీవితం (1978)
4. విజయ (1979)
5. బొమ్మాబొరుసే జీవితం (1979)
6. చెయ్యెత్తి జై కొట్టు (1979)
7. జూదగాడు (1979)
8. మామా అల్లుళ్ళ సవాల్ (1980) 
9. మంగళ గౌరి (1980) 
ఈ తొమ్మిది సినిమాలలో వీరిద్దరి పేర్లు కనిపిస్తాయి )



Songs List:



నా కోసం .... ఆనందం పాట సాహిత్యం

 
చిత్రం: విచిత్ర జీవితం (1979)
సంగీతం: కె. చక్రవర్తి 
సాహిత్యం: దాశరథి 
గానం: పి.సుశీల, యస్.పి.బాలు

నా కోసం .... ఆనందం
నీ కోసం .... అనురాగం
మదిలో నిండిపోనీ
విరిసే వయసుంది ...
పిలిచే వలపుందీ
విడరాని బంధం మనది

నా కోసం .... ఆనందం
నీ కోసం అనురాగం
మదిలో నిండిపోనీ
విరిసే వయసుంది
పిలిచే వలపుందీ
విడరాని బంధం మనది
మురిపించే గాలి
విరబూసే పూలు

ఆటాడే కురులు
వేటాడే కనులు
మురిపించే గాలి
నిరబూసే పూలు

ఆటాడే కురులు
వేటాడే కనులు
నీ కౌగిట నేనుండే
నీ సందిట నేనుంటే
పొగమంచు పరదాలో
మన మొకటె పోకుంటే
తీరాలి మనలోని ఆశ

కలిసిన హృదయాల
కదలిన అధరాల
పొంగింది మన ప్రేమ మధువు
చెలి చూపుల సెగలో నులివెచ్చగ ఉంది
బిగి కౌగిలిలోనే సొగసంతా ఉంది....
సిరి మల్లెల పొదరింట
కలిసెనులే మన జంట
నీలాల గగనాల మేఘాల
పెనవేసుకోవాలి మనము
కీలకిల నవ్వులతో
వలపుల పువ్వులతో
ముద్దాడు కోవాలి మనము
ముద్దాడు




బంగినపల్లి మామిడిపండు పాట సాహిత్యం

 
చిత్రం: విచిత్ర జీవితం (1979)
సంగీతం: కె. చక్రవర్తి 
సాహిత్యం: వేటూరి సుందరరామ మూర్తి 
గానం: పి.సుశీల, యస్.పి.బాలు

ఒలె ఒలె ఒలె 
బంగినపల్లి మామిడిపండు
మంగినపూడి మల్లె చెండు
కాపు కొచ్చింది అరెరె కన్ను కొట్టింది
ఓ రబ్బడి సిబ్బయ్య ఇది పుట్టిందే నా కోసం
ఎందరు కాదన్నా ఎగరేసుకుపోతా ఇది పందెం

ఒలె ఒలె ఒలె 
సందకాడ సందమామ
సందుచూసి మేనమామ
తొంగి చూసాడు అరెరె.... దోచుకున్నాడు
తొంగి చూశాడు అమ్మమ్మో దోచుకున్నాడు.
ఓ.... రబ్బడి సిబ్బయ్య ఈడు పుట్టిందే నా కోసం
ఎందరు కాదన్నా ....ఎగరేసుకు పోతేనే అందం

ఎన్నాళ్ళీ పస్తులుంటే చిచ్చు కొడతాడు కొడుతుంది
రెప్పచాటు చూపుతోనే రెచ్చగొడుతుంది
అల్లాడి పోతుంటే.... ఇల్లేడి పిస్తుందదమ్మో
అల్లాడి పోతుంటే.... ఇల్లేడి పిస్తుందమ్మో
ఓ....రబ్బడి సిబ్బయ్య ఇది పుట్టిందే నా కోసం
ఎందరు కాదన్నా ఎగరేసుకు పోతా ఇది పందెం

ఒలే ఒలే ఒలె సందకాడ చందమామ
సందుచూసి మేనమామ తొంగి చూసాడు
అమ్మమ్మో దోచుకున్నాడు

ముద్దంటే పొద్దువాల నివ్వమంటుంది
పొద్దువాలి పోగానే నిద్దరంటుంది
అందాలు పక్కేసి ఆరాట పెడుతుందమ్మో
ఓ రబ్బడి సిబ్బయ్య ఇది పుట్టిందే నా కోసం
ఎందరు కాదన్నా ఎగరేసుకుపోతా ఇది పందెం

పూతరేకు కోక మడత విప్పమంటాడు
పూల పల్లకి ఎక్కమంటూ పోరు పెడతాడు
కల్లోకి వస్తుంటాడు కాటేసి పోతుంటాడు.
ఓ రబ్బడి సిబ్బయ్య ఈడు పుట్టిందే నాకోసం
ఎందరు కాదన్నా ఎగరేసుకు పోతేనే అందం

ఒలే ఒలే ఒలె
బంగినపలి మామిడిపండు
మంగినపూడీ మల్లెచెండు
కాపుకొచ్చింది అరెరె..... కన్నుకొట్టింది

సందకాడ చందమామ
సందుచూసి మేనమామ
తొంగి చూసాడు అమ్మో దోచుకున్నాడు
తొంగి చూసాడు అమ్మమ్మో దోచుకున్నాడు




అల్లి బిల్లి చిట్టిపాప పాట సాహిత్యం

 
చిత్రం: విచిత్ర జీవితం (1979)
సంగీతం: కె. చక్రవర్తి 
సాహిత్యం: ఆరుద్ర 
గానం: పి.సుశీల & కోరస్ 

అల్లి బిల్లి చిట్టిపాప
మన మందర మొకటే చిట్టిపాప
ఆడుతు పాడుతు చదవాలి
ఆ చదువే సంపద కావాలి
ఆవుల రంగులు వేరైనా
పాలది ఒకటే రంగు
పూవుల రంగులు వేరైనా
పూజ మాత్రం ఒకటే

ఎన్నో పేరులు ఉన్నా దేముడు మాత్రం ఒకడే
ఆ సత్యం తెలియాలి సఖ్యత కలపాలి

గాలి నేల నీరు నిప్పు ఆకాశం
అయిదు కలసి రూపొందెను ఈ భూగోళం
ఎన్నో జీవులు ఉన్నా
మానవ జన్మే మిన్నా

ఆ.... మనిషిగ బ్రతకాలి మంచిని పెంచాలి
సూర్యుని కిరణాలెంతో వేడిగా ఉంటాయి
సంద్రపు నీళ్ళు ఎండకు ఆవిరి అవుతాయి
ఆవిరి మబ్బులు కాగా వానలు కురియును బాగా

ఆ ఎండలు ఉంటేనే వానలు పడతాయి
వానలు పడితేనే
చేనులు పండేది.
ఆహా....!




ఓ... చంద్రమా... పాట సాహిత్యం

 
చిత్రం: విచిత్ర జీవితం (1979)
సంగీతం: కె. చక్రవర్తి 
సాహిత్యం: వేటూరి సుందరరామ మూర్తి 
గానం: పి.సుశీల

ఓ.... చంద్రమా ....
ఒకనాటి ప్రియతమా
ఈ పేద కలువ నీకు గురుతేనా తెలుపుమా ....
నీవు నాకు చేసిన బాస
నీటి మీద రాసిన రాత
తాళి కట్టిన కలువ కన్నా
తళుకు లొలికే తారమిన్నా
రోజూ మారే రూపం నీది
మోజు పడిన పాపం నాది
కలలే మార్చి కలలే చెరిపి
మనువు మార్చి మంటలు రేపి
మచ్చ పడిన మనసు నీది
చిచ్చు రేగిన మనసు నాది
కట్టగలవు మెడకో తాడు
కన్నె వలపుకే ఉరితాడు




గుమ్మాడమ్మా గుమ్ముడి పాట సాహిత్యం

 
చిత్రం: విచిత్ర జీవితం (1979)
సంగీతం: కె. చక్రవర్తి 
సాహిత్యం: వీటూరి వెంకట సత్య సూర్యనారాయణమూర్తి 
గానం: పి.సుశీల, జిక్కీ (పి.జి.క్రిష్ణవేణి) 

గుమ్మాడమ్మా గుమ్ముడి
గోకుల మంతా సందాడి
వన్నెల కృష్ణుని చిన్నెలు వింటే
మనసులు నాట్యం చేసేనమ్మ
అల్లరి వాడమ్మా
వన్నెల కృష్ణుడు చిన్నెలు వింటే
మనసులు నాట్యం చేసేనమ్మా
ఆల్లరి వాడమ్మా....

సంజవేళ స్నానం చేసి నీళ్ళు తెస్తుంటే
మరుమల్లె పూల తోటలోన ఒంటిగ వస్తుంటే
నా వెనక వచ్చాడు
నా కళ్ళు మూసాడు
ఒళ్ళంతా తడిమాడు
ఒంపులే వెతికాడు
నును సిగ్గు మొగ్గలు మీటి
తొలి వయసు వాకిలి దాటి
చుక్కల క్రింద పచ్చిక మీద
పానుపువేసి రమ్మన్నాడే
తుంటరి వాడమ్మా

ఆరుబయట ఆదమరచి నిద్దరపోతుంటే
నా జారు పైట చల్ల గాలికి జారిపోతుంటే
నీడల్లే వచ్చాడు నిద్దట్లో లేపాడు
సద్దయిన కాకుండా ముద్దివ్వ మన్నాడు

గాలిలాగ చుట్టేసాడు
పైటలాగి వాటేసాడు
॥గుమ్మాడమా
తెల్లారేక తెలిసిందమ్మా నలిగిన పక్క నవ్విందమ్మా
కొంటె వాడమ్మా



ఇన్నాళ్ళ ఈ మూగ బాధ పాట సాహిత్యం

 
చిత్రం: విచిత్ర జీవితం (1979)
సంగీతం: కె. చక్రవర్తి 
సాహిత్యం: డా॥ సి.నారాయణరెడ్డి 
గానం: యస్.పి.బాలు 

ఇన్నాళ్ళ ఈ మూగ బాధ
ఈనాటితో మాసిపోనీ
నీ నుదుట తిలకమ్ము దిద్ది
నిత్య కల్యాణిగా చూసుకోని
ఎన్నేళ్ళు వేచింది మనసు
కన్నీరు కాగింది బ్రతుకు
ఈ నాటి ఏకాంత సమయం
ఏ రేయి లేనంత మధురం
చెలియా ఈ మౌన వేళ
నన్ను అల వోలె చెలరేగి పోనీ

ఎవరైన ఎ వేళననైనా
మన జాడ గమనించరారు
జగమేలు పరమాత్ముడైనా
మన జంట విడదీయ రాడు (దు)
నీ కళ్ళలో నేను దాగి
నిన్ను నా గుండెలో దాచుకోనీ

కావాలి ఎన్నెన్నో కనులు
నిన్ను కరువారగా చూసుకోను
కావాలి ఎంతెంతో కాలం
తీపి కలలన్నీ పండించుకోను
రగిలే ఈ హాయిలో నా
నన్ను బ్రతుకంత జీవించిపోనీ

Palli Balakrishna Tuesday, November 7, 2023



చిత్రం: శివమెత్తిన సత్యం (1980)
సంగీతం: జె.వి.రాఘవులు
నటీనటులు: కృష్ణంరాజు, శారద, జయసుధ
దర్శకత్వం: వి.మధుసుదనరావు
నిర్మాత: జి.సత్యనారాయణరాజు
విడుదల తేది: 11.01.1980



Songs List:



శంభో హరహర పాట సాహిత్యం

 
చిత్రం: శివమెత్తిన సత్యం (1980)
సంగీతం: జె. వి. రాఘవులు
సాహిత్యం: ఆత్రేయ
గానం: యస్.పి.బాలు 

శంభో హరహర.... భోళాశంకర
వినరా వినరా జంగం దేవర
శివశివ శంకర....యివరం సెప్పర
బస్తీ బాబులకు... అరెరెరెరే ....
నీ భక్తుడంటే.... ఈ సత్తెమంటే
ఎట్టాంటోడో తెలిసేందుకు.....
రైతంటే బైతనుకుంటే... నీ బతుకు భజగోవిందే
తెలివంటె నీదనుకుంటే.... నీ తెలివి తెల్లారినట్టే
పనికి రాని మనిషి .... ఒక్కడైన లేడు
ఆ మనిషి పనికి నువ్వు ఖరీదు కట్టలేవు
డబ్బు కట్టే గోనిసంచి గొప్ప కాదురో.... ॥శివ శివ ॥

సత్తెమంటే సల్లగాలి.... సత్తెమంటే అగ్గినిప్పు
మంచోళ్ళ ప్రాణం సతైం.... మనసున్న మనిషే సత్తెం
ముతక కట్టినోడు .... మొద్దు ఎదవకాడు
సద్ది తిన్నవోడు.... సచ్చు సవటకాడు
నిద్దరోయె బెబ్బులి మేక కాదురో .... ॥శివ శివ ॥

పట్నంలో సదువులు సదివి.... పట్టాలు పొందిన బాబులు
సూశారు కండబలము .... సూత్తారా బుద్ది బలము
మాయ సేయలేదు ....మంత్రమేమి కాదు
గుప్పెట్లో యిసక సెప్పుకోండి ఎంత....?
ఎంత... ? ఎంత ....? ఎంత....? తెలీలా .... 
గుప్పెడంత యిసకంటే గుప్పెడేనులో.... ॥శివ శివ ॥




నిన్నా మొన్నటి చిన్నారివే పాట సాహిత్యం

 
చిత్రం: శివమెత్తిన సత్యం (1980)
సంగీతం: జె. వి. రాఘవులు
సాహిత్యం: ఆత్రేయ
గానం: యస్.పి.బాలు 

నిన్నా మొన్నటి చిన్నారివే
చిన్నారి పలుకుల చెల్లెమ్మవే
ఈ పెళ్ళి చూపుతో ఈ చీర కట్టుతో
ఎంత ఎదిగినావే........

పెళ్ళీడు వచ్చింది అమ్మాయి
పిల్లాడ్ని చూడరా నీ చెల్లికి
అని పెద్దోళ్ళు పదిసార్లు అన్నారని
ఉబలాటపడ్డాను చూద్దామని
ఈ ముస్తాబులో ....ఆ నగుమోములో
చూశాను చెల్లీ.... మన తల్లిని....

ఒకరికి ఒకరం.... ఇక ఎవరికి ఎవరం
ఓర్వనిదైనా..... తప్పని దూరం
ఏ ఆడపిల్లా.... కాదీడపిల్ల
ఏనాటికైనా ....అది ఆడపిల్ల
చేశానమ్మా..... నే చేయగలది
ఈ ఇంటి పేరింక ఆ ఇంట నిలపాలి




మేకారే మేకా .... పాట సాహిత్యం

 
చిత్రం: శివమెత్తిన సత్యం (1980)
సంగీతం: జె. వి. రాఘవులు
సాహిత్యం: ఆత్రేయ
గానం: యస్.పి.బాలు , యస్.పి.శైలజ

మేకారే మేకా .... హే.... మేకా
తోకారే తోకా... హే.... తోకా
మిల మిలలాడే కన్నులతో
మిస మిసలాడే వన్నెలతో
చుర చురలాడే చూపులతో
కొర కొరలాడే కోర్కెలతో
బిలబిల కిలకిల గలగల గలగల అమ్మాయిలూ
చకచక టకటక లుకలుక లుకలుక అబ్బాయిలూ
ఒకరిని ఒకరు ఒరుసుకొని
ముందూ వెనకా వెనకా ముందూ
ముందూ వెనకా వెనకా ముందు
ముందుగ వెళుతుంటె ....

పెట పెటలాడే పదహారేళ్ళు
చిమ చిమలాడే యిరవై యేళ్ళు
చెకుముకి రాళ్ళు ఈ కుర్రాళ్ళు
బరిలో దూకే పందెం కోళ్ళు
కిస్ మిస్ కిస్ మిస్ కిస్ మిస్ కిస్ మిస్
పిట్టల్లాడు
కుంవా కుంవా కుంవా కుంవా గువ్వల్లాగా
ఒకరిని ఒకరు తరుముకొని
పగలూ రేయీ రేయీ పగలూ
పరుగులు తీసూ ఉరకలు వేసు
పడుతూ లేసుంటే....




గీతా .... ఓ గీతా .... పాట సాహిత్యం

 
చిత్రం: శివమెత్తిన సత్యం (1980)
సంగీతం: జె. వి. రాఘవులు
సాహిత్యం: ఆరుద్ర
గానం: కె. జె. ఏసుదాసు, వాణీ జయరామ్

గీతా .... ఓ గీతా ....
డార్లింగ్.... మై డార్లింగ్ ....
మనసార నీతో మాటాడుకోనీ
రాజా....ఓ రాజా....
డార్లింగ్.... మై డార్లింగ్ ....

మనసార నీతో మాటాడుకోనీ
పర దేశంలో.... ఆవేశంలో
ప్రేమించిన మనకనుమతి ....
బహుమతి.... ఈ దేశంలో... సంతోషంతో
మనవాడినచో అనుబంధం
ఆనందం ... వెచ్చని వలపుల ముచ్చట తీరును
అనురాగ బంధం ముడివేసుకోనీ

చిరునవ్వులతో పులకింతలతో
వికసించిన మధువనం
యవ్వనం .. ఈ భంగిమలో నీ పొంగులతో
మురిపించే బిగికౌగిలి
జిలిబిలి.... ఊహలే రేగితే మోహమే ఆగుణా
ఒడిలోన నన్ను ఒదిగొదిగిపోనీ




నీవు నా పక్కనుంటే హాయి పాట సాహిత్యం

 
చిత్రం: శివమెత్తిన సత్యం (1980)
సంగీతం: జె. వి. రాఘవులు
సాహిత్యం: ఆరుద్ర
గానం: కె. జె. ఏసుదాసు, వాణీ జయరామ్

నీవు నా పక్కనుంటే హాయి
నీవు లేకుంటే చీకటి రేయి
నీ కన్నులలోన ఎన్నో ఎన్నో ఎన్నో
కిరణాలు మెరిశాయి

నీవు నా పక్కనుంటే హాయి
నీవు లేకుంటే చీకటి రేయి
నీ కన్నులలోన ఎన్నో ఎన్నో ఎన్నో
కిరణాలు మెరిశాయి

కొండలలో కోనలలో ఏకాంత వేళ
గుండెలలో రేగింది సరసాల లీల
కొండలలో కోనలలో ఏకాంత వేళ
గుండెలలో రేగింది సరసాల లీల

అనురాగ శిఖరాన అందాల తోట
ఆ చోట కోనేట సయ్యాటలాడాలి
కొనగోట మీటిన మాణిక్యవీణ
కొసరే మమతల తొలకరి వాన
కొనగోట మీటిన మాణిక్యవీణ
కొసరే మమతల తొలకరి వాన
కన్ను సైగల కౌగిలింతల సన్న జాజితాని
ఎన్నమారులు నిన్ను చూసినా దేవరంభ ఠీవి
మువ్వల రవళి మోహన మురళీ
మధురం మధురం మానసకేళీ

Palli Balakrishna Monday, November 6, 2023



చిత్రం: అండమాన్ అమ్మాయి (1979)
సంగీతం: కె.వి.మహదేవన్ 
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ (All)
గానం: యస్.పి.బాలు, పి.సుశీల 
నటీనటులు: అక్కినేని నాగేశ్వరరావు, వాణిశ్రీ, చంద్రమోహన్, బేబీ వరలక్ష్మి 
దర్శకత్వం: వి.మధుసూదనరావు 
నిర్మాతలు: టి.గోవింద రాజన్, టి.యం.కిట్టు 
విడుదల తేది: 15.06.1979



Songs List:



హేయ్ లల్లీ పప్పీ పాట సాహిత్యం

 
చిత్రం: అండమాన్ అమ్మాయి (1979)
సంగీతం: కె. వి. మహదేవన్ 
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ 
గానం: యస్.పి.బాలు 

హేయ్ లల్లీ పప్పీ లల్లీ మళ్లీ రారండీ
పువ్వులు ఉన్నవి పూజకు కావు -
లవ్వూ గివ్వూ అనకండీ
తేనె తేనెకూ తేడా ఏమిటో - తేనెటీగకు తెలుసు -
ఈ తేనెటీగకు తెలుసు
తేటికి వుంది వయసూ
తేనెకు వుంది సొగసూ
తెరవకండి మనసూ ....
మనసు గినసు అంటే నాకు అసలే అలుసు

రోజు రోజుకో రోజా పువ్వుతో - మోజు తీర్చుకోవాలి
నీ మోజు తీరిపోవాలి
నిన్న అనుభవం నిన్నే
రేపటి సంగతి రేపే
మరచిపొండి నేడే - రేపటికంఠా మీరూ నేనూ
వేరే వేరే  ॥హేయ్॥

అందమన్నది బంధంకారాదు అనుబంధం కారాదు
అది ఎవ్వరి సొంతం కాదు
కొత్తదన్నది నేడే — పాతై పోతే రోతే
ఎందుకింక సొంతం – రోజూమారే దేవునిసృష్టే
నాకూ యిష్టం ॥హేయ్॥




చిత్రా చిత్రాల బొమ్మా పాట సాహిత్యం

 
చిత్రం: అండమాన్ అమ్మాయి (1979)
సంగీతం: కె. వి. మహదేవన్ 
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ 
గానం: యస్.పి.బాలు, పి.సుశీల 

చిత్రా చిత్రాల బొమ్మా - పుత్తడీ పోతబొమ్మా
మొత్తా మొత్తంగ వచ్చి_చిత్తాన్నే దోచెనమ్మా
పైలా పచ్చీసు బొమ్మా - పరదేశీ ఆటబొమ్మా
ముచ్చల్లే వచ్చి వచ్చి - మచ్చేదో చల్లెనమ్మా
॥చిత్రా॥

టేకు మానల్లే చక్కంగా వుంటాడు
ఆకు తేలల్లె చల్లంగా వస్తాడు
సోకంతా సూపుల్లో సూపుతాడు. ఆ
సూపులతో ఒళ్ళంతా పాకుతాడు

పువ్వు తీగల్లే నాజూగా వుంటుంది
బొండు మల్లల్లె నిండుగా నవ్వుతుంది
నవ్వుల్లో చాణాలు రువ్వుకుంది అబ్బ
రువ్వుతూ ప్రాణాలు తోడుతుంది

వాడిబాకల్లే గుచ్చుతుంది గుండెలో
లేడి పిలలై గెంతుతుంది ఇంతలో....
దీపమల్లె వెలుగుతుంది దీవిలో
తెర చాపలాగ ఎగురుతుంది నావలో

అలలు అలలుగా వూగుతాడు మనసులో
కలలు కలలుగా వస్తాడు కళ్ళలో
కడలిలా వుంటాడు లోతులో
చలమలాగ వూరుతాడు చెలిమిలో




వేస్తాను పొడుపు కధ పాట సాహిత్యం

 
చిత్రం: అండమాన్ అమ్మాయి (1979)
సంగీతం: కె. వి. మహదేవన్ 
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ 
గానం: యస్.పి.బాలు, పి.సుశీల 

వేస్తాను పొడుపు కధ వేస్తాను
చూస్తాను విప్పుకో చూస్తాను.
మనం వేసుకున్న పొడుపు కథ ఈ రాత్రి
అది విప్పుకొని తప్పుకొంటే శివరాత్రి
వచ్చాక వచ్చారు. వచ్చి వెళ్ళిపోయారు.
వెళ్ళి మల్లి వచ్చారు. మళ్ళీ వెళ్తే వస్తారా....?
ఎవరు వారు...?
ఎవరు వారు.
తెలియలా .... ?
ఊహుఁ....

పళ్ళు
పగడాల చక్రాలపచ్చనీ తేరునెక్కి
సూర్యుడంటి వీరుడొస్తే దారంతా నెత్తురంట.
ఏమిటంట....?
ఏమిటబ్బా....
తెలీలా....?
తెలియలా....?
ఆకు వక్క సున్నం 

పుట్టినిల్లు మెట్టినిల్లు ఒక్కటైనది
పుట్టిన ప్రతి జీవికి తప్పకున్నది
కాయైనా పండై నా తీయనై నది
గాయమైనా మందైనా తానై నది

ఏమిటది...?
తెలీలా...?
తెలీలా ....
ప్రేమ....

నేలమీద నిలిచేవి రెండుకాళ్ళు
నింగిలోన నిలిచేవి రెండు కాళ్లు 
మధ్యలో నడిచేవి ఎన్నోకాళ్లు
ఏమిటది ....?
ఏంటది....?
ఇది తెలీలా ...
తెలీలా....
నాకు తెలియదు.





ఎందుదాగినావురా పాట సాహిత్యం

 
చిత్రం: అండమాన్ అమ్మాయి (1979)
సంగీతం: కె. వి. మహదేవన్ 
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ 
గానం: పి.సుశీల 

ఎందుదాగినావురా నందకిశోరా నవనీతచోరా
ఎందెందు వెదుకుదురా ఎటులా కనుగొందురా

మన్ను తినాబోయావో పొన్న చెట్టు నెక్కావో
వెన్న దొంగిలించి ఏ వెలది యింట పొంచావో
ఆ రాధ నిన్ను ఎక్కడ దాచిందో
పెట్టెలో పెట్టిందో బుట్టలో దాచిందో
పైటకొంగులో నిన్ను ముడివేసుకున్నదో
ఎక్కడని వెతికేది
ఇక్కడ — అక్కడ
ఎక్కడ — మరెక్కడ ....

భామా, సత్యభామా చెప్పమ్మా
నేను రుక్మిణిని కాను రాధను కాను
గోపికను కాను నీ భర్త నెత్తుకుపోను
నీడగా దొరికినా — లీలగా మెరిసినా
కనబడితే చాలు నాకు కనక వర్షాలు
ఎక్కడని వెతికేది
ఇక్కడ — అక్కడ
ఎక్కడ - మరెక్కడ




ఈ కోవెల నీకై వెలిసిందీ పాట సాహిత్యం

 
చిత్రం: అండమాన్ అమ్మాయి (1979)
సంగీతం: కె. వి. మహదేవన్ 
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ 
గానం: పి.సుశీల, యస్.పి.బాలు 

ఈ కోవెల నీకై వెలిసిందీ -
ఈ వాకిలి నీకై తెరిచుందీ
రా దేవి తరలిరా - నా దేవి తరలిరా ....
ఈ కోవెల నీకై వెలిసిందీ
ఈ వాకిలి నీకై తెరిచుందీ
రా స్వామి తరలిరా - నా స్వామీ తరలిరా
దేవతల గుడిలో లేకున్నా -
దీపం పెడుతూ వున్నాను
తిరునాళ్ళెపుడో రాక తప్పదని -
తేరును సిద్ధం చేశాను

దేవుడు వస్తాడని రోజూ—పువ్వులు ఏరితెస్తున్నాను
రేపటికోసం చీకటి మూసిన తూరుపులాగా వున్నాను

॥ఈ కోవెల॥

మాసినవెచ్చని కన్నీరు -
వేసెను చెంపల ముగ్గులను
మాయని తీయని మక్కువల చూసెను
ఎనిమిది దిక్కులను

దిక్కులన్నీ ఏకమై నా కొక్కదిక్కై నిలిచినవి
మక్కువలన్నీ ముడుపులు కట్టి మొక్కులుగానే మిగిలినవి ॥ఈ కోవెల ॥

నీరువచ్చె - ఏరువచ్చె ఎరుదాటి ఓడవచ్చె
ఓడ నడిపే తోడు దొరికె వడ్డుచేరే రోజువచ్చె
ఓడచేరే రేవు వచ్చె... నీడచూపే దేవుడొచ్చె
రేవులోకి చేరేలోగా_దేవుడే అడ్డువేసే....

Palli Balakrishna Sunday, October 29, 2023



చిత్రం: డాక్టర్ ఆనంద్ (1966) 
సంగీతం: కె.వి. మహదేవన్ 
సాహిత్యం: ఆత్రేయ, దేవులపల్లి కృష్ణ శాస్త్రి, కొసరాజు, డా॥ సి. నారాయణరెడ్డి 
గానం: ఘంటసాల, పి.సుశీల, బి. వసంత, పి.బి.శ్రీనివాస్, పిఠాపురం నాగేశ్వరరావు
నటీనటులు: రామారావు, అంజలీ దేవి, కాంచన 
దర్శకత్వం: వి. మధుసూదనరావు 
నిర్మాత: డి.వెంకటపతిరెడ్డి
విడుదల తేది: 14.10.1966



Songs List:



చక్కని చల్లని యిల్లు పాట సాహిత్యం

 
చిత్రం: డాక్టర్ ఆనంద్ (1966) 
సంగీతం: కె.వి. మహదేవన్ 
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ 
గానం: ఘంటసాల, పి. సుశీల 

చక్కని చల్లని యిల్లు
చక్కెర బొమ్మలు పాపలు 
మల్లెల మనసులు విరజల్లు
మమతల కలలకు పందిళ్ళు 

చక్కని చల్లని యిల్లు, 
చక్కెర బొమ్మలు పాపలు 
మల్లెల మనసులు విరజల్లు
మమతల కలలకు పందిళ్ళు 
చక్కని చల్లని యిల్లు
చక్కెర బొమ్మలు పాపలు 

చరణం:1
అమ్మా, నాన్నా కట్టినవి
అమ్మా, నాన్నా కట్టినవి
అల్లరి పిల్లలు పుట్టినవీ.. అహహహ 
అల్లరి పిల్లలు పుట్టినవి 
ముద్దుల ముద్దలు పెట్టినవి
ముల్లోకాలకు స్వర్గమిదీ..ఈ..

అహహహా.. అహహహా...అహహహా

చక్కని చల్లని యిల్లు
చక్కెర బొమ్మలు పాపలు 

చరణం: 2
మనసు పెరిగితే ఒకటౌతాము
వయసు పెరిగితే వేరౌతాము 
మనసు పెరిగితే ఒకటౌతాము
వయసు పెరిగితే వేరౌతాము 
పెరిగే మీరు తరిగే మేము 
ప్రేమనిక్కడే చవి చూద్దాము 

అహహహా.. అహహహా...అహహహా

చక్కని చల్లని యిల్లు
చక్కెర బొమ్మలు పాపలు 
మల్లెల మనసులు విరజల్లు
మమతల కలలకు పందిళ్ళు 
చక్కని చల్లని యిల్లు
చక్కెర బొమ్మలు పాపలు 

అహహహా.. అహహహా...అహహహా



నీలమోహనా.. రారా పాట సాహిత్యం

 
చిత్రం: డాక్టర్ ఆనంద్ (1966) 
సంగీతం: కె.వి. మహదేవన్ 
సాహిత్యం: దేవులపల్లి 
గానం: పి. సుశీల 

పల్లవి: 
నీలమోహనా.. రారా 
నిన్ను పిలిచె నెమలి నెరజాణ 
నీలమోహనా.. రారా
నిన్ను పిలిచె నెమలి నెరజాణ 
నీలమోహనా.. రారా

జారువలపు జడివాన కురిసెరా.. 
జాజిలత మేను తడిసెరా 
జారువలపు జడివాన కురిసెరా.. 
జాజిలత మేను తడిసెరా
లతలాగే నా మనసు తడిసెరా.. 
నీలమోహనా.. రారా
రారా..రారా.. 

చరణం: 1
ఏలాగె మతిమాలి? ఏడే నీ వనమాలి? 
ఏలాగె మతిమాలి? ఏడే నీ వనమాలి? 

అతడేనేమో అనుకున్నానే.. 
అంత దవుల శ్రావణ మేఘములగనీ 
అతడేనేమో అనుకున్నానే.. 
అంత దవుల శ్రావణ మేఘములగనీ 

ప్రతిమబ్బు ప్రభువైతే... 
ప్రతికొమ్మ మురళైతే ఏలాగె 
ఆ... ఏలాగె మతిమాలి.... 
ఏడే నీ వనమాలి? 
హ హా హా.. 
హా హా.. 

నీలమోహనా.. రారా..  
నిన్ను పిలిచె నెమలి నెరజాణ 
నీలమోహనా.. రారా.. రా రా రా... 

చరణం: 2
ఆ... సారెకు దాగెదవేమి? 
నీ రూపము దాచి దాచి 
ఊరించుటకా స్వామీ? 
సారెకు దాగెదవేమి..? 
నీ కన్నుల తోడు నీ కలికి నవ్వుల తోడు 
నీకోసం ఎంత వేగిపోయానో కృష్ణా 
కృషా కృష్ణా కృష్ణా... 
సారెకు దాగెదవేమి..? 

చరణం: 3
అటు... అటు... ఇటు... ఇటు... 
ఆ పొగడకొమ్మవైపు 
ఈ మొగలి గుబురువైపు 

కార్తీక రాతిరిలో కఱి మబ్బుంటుందా...
నీలిమేఘమాకాశము విడిచి... 
నేల నడుస్తుందా ? 
కార్తీక రాతిరిలో కఱి మబ్బుంటుందా...
నీలిమేఘమాకాశము విడిచి... 
నేల నడుస్తుందా ? 

నడిచే మబ్బులకు నవ్వే పెదవుందా? 
నవ్వే పెదవులకూ మువ్వల మురళుందా? 
పెదవి నందితే పేద వెదుళ్ళు 
కదిలి పాడుతాయా? 

నడిచే మబ్బులకు నవ్వే పెదవులు 
నవ్వే పెదవులకు మువ్వల వేణువులు 

మువ్వల వేణువులు... 
మువ్వల వేణువులు




పెరుగుతుంది హృదయం పాట సాహిత్యం

 
చిత్రం: డాక్టర్ ఆనంద్ (1966) 
సంగీతం: కె.వి.మహదేవన్ 
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ 
గానం: పి.సుశీల 

పెరుగుతుంది హృదయం 




మదిలోని నా స్వామి పాట సాహిత్యం

 
చిత్రం: డాక్టర్ ఆనంద్ (1966) 
సంగీతం: కె.వి. మహదేవన్ 
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి 
గానం: పి. సుశీల 

మదిలోని నా స్వామి ఎదురాయె నేడు
శిలయైన నా మేను పలికించినాడు
మదిలోని నా స్వామి ఎదురాయె నేడు
శిలయైన నా మేను పలికించినాడు

అతనిని కనినంత అందెలు పలికే
అతనిని కనినంత అందెలు పలికే
అందెలు రవళించ డెందము పలికే
నాలో శతకోటి భావాలు పలికే

మదిలోని నా స్వామి ఎదురాయె నేడు
శిలయైన నా మేను పలికించినాడు

మనసెరిగిన వాడు మమతల నెలరేడు
వలపుల దీపాలని నిలిపిన చెలికాడు
మనసెరిగిన వాడు మమతల నెలరేడు
వలపుల దీపాలు నిలిపిన చెలికాడు
ఇన్నాళ్లకు తానే నన్నేలినాడు

మదిలోని నా స్వామి ఎదురాయె నేడు
శిలయైన నా మేను పలికించినాడు

అతడే నాపాలి అభినవ వనమాలి
ఆతని నయనాలు అందిన నయనాలు
అతడే నాపాలి అభినవ వనమాలి
ఆతని నయనాలు అందిన గగనాలు
ఆతని పాదాలు నా పారిజాతాలు

మదిలోని నా స్వామి ఎదురాయె నేడు
శిలయైన నా మేను పలికించినాడు.




నీలాల కన్నులతో పాట సాహిత్యం

 
చిత్రం: డాక్టర్ ఆనంద్ (1966) 
సంగీతం: కె.వి. మహదేవన్ 
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి 
గానం: ఘంటసాల, పి. సుశీల 

నీలాల కన్నులతో ఏలాగో చూసేవు ఎందుకని చూసేవెందుకని



ముసుగు తీయవోయి పాట సాహిత్యం

 
చిత్రం: డాక్టర్ ఆనంద్ (1966) 
సంగీతం: కె.వి.మహదేవన్ 
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ 
గానం: పి.బి.శ్రీనివాస్ 

ముసుగు తీయవోయి 




తళుకు బెళుకు చీరదాన పాట సాహిత్యం

 
చిత్రం: డాక్టర్ ఆనంద్ (1966) 
సంగీతం: కె.వి.మహదేవన్ 
సాహిత్యం: కొసరాజు 
గానం: పిఠాపురం, స్వర్ణలత 

తళుకు బెళుకు చీరదాన




చక్కని చల్లని యిల్లు (Female Version) పాట సాహిత్యం

 

చిత్రం: డాక్టర్ ఆనంద్ (1966) 
సంగీతం: కె.వి. మహదేవన్ 
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ 
గానం: పి. సుశీల 

చక్కని చల్లని యిల్లు
చక్కెర బొమ్మలు పాపలు 

Palli Balakrishna Monday, October 16, 2023



చిత్రం: ప్రజానాయకుడు (1972)
సంగీతం: కె.వి.మహదేవన్ 
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ, కొసరాజు 
గానం: పి.సుశీల, ఎల్.ఆర్.ఈశ్వరి, యస్.పి. బాలు 
నటీనటులు: కృష్ణ, జగ్గయ్య, రాజబాబు, చంద్రమోహన్, నాగభూషణం, జయ (నూతన నటి) జ్యోతి లక్ష్మి, జానకి, రమాప్రభ, నిర్మల 
మాటలు: బొల్లిముంత శివరామకృష్ణ
దర్శకత్వం: వి. మధుసూదన రావు
నిర్మాత: సి హెచ్. రాఘవరావు 
విడుదల తేది: 10.11.1972

Palli Balakrishna Tuesday, December 6, 2022



చిత్రం: జీవిత రథం (1981)
సంగీతం: కె. చక్రవర్తి 
నటీనటులు: శోభన్ బాబు, రతి అగ్నహోత్రి, కవిత, సుమలత, రంగనాథ్, శరత్ బాబు
దర్శకత్వం: వి. మధుసూధనరావు 
నిర్మాతలు: గూడపాటి గోపీ మురళి, జ్యోతి కుమార స్వామి 
విడుదల తేది: 29.07.1981



Songs List:



భలే ఇబ్బందిగా ఉంది పాట సాహిత్యం

 
చిత్రం: జీవిత రథం (1981)
సంగీతం: కె. చక్రవర్తి 
సాహిత్యం: వేటూరి సుందరరామ మూర్తి 
గానం: యస్.పి. బాలు, పి. సుశీల

భలే ఇబ్బందిగా ఉంది




ఇదే ఇదే జీవితం పాట సాహిత్యం

 
చిత్రం: జీవిత రథం (1981)
సంగీతం: కె. చక్రవర్తి 
సాహిత్యం: మైలవరపు గోపి 
గానం: యస్.పి. బాలు

ఇదే ఇదే జీవితం 



చిగురాకులలో ఒక చిలకమ్మా పాట సాహిత్యం

 
చిత్రం: జీవిత రథం (1981)
సంగీతం: కె. చక్రవర్తి 
సాహిత్యం: రాజశ్రీ 
గానం: పి. సుశీల 

చిగురాకులలో ఒక చిలకమ్మా 




కోడేమో కూరైపోయే పాట సాహిత్యం

 
చిత్రం: జీవిత రథం (1981)
సంగీతం: కె. చక్రవర్తి 
సాహిత్యం: వేటూరి సుందరరామ మూర్తి 
గానం: యస్.పి. బాలు, పి. సుశీల 

కోడేమో కూరైపోయే 



ఓలమ్మి చిందెయ్యనా పాట సాహిత్యం

 
చిత్రం: జీవిత రథం (1981)
సంగీతం: కె. చక్రవర్తి 
సాహిత్యం: మైలవరపు గోపి 
గానం: యస్.పి. బాలు, పి. సుశీల 

ఓలమ్మి చిందెయ్యనా 



అల్లరంటే అల్లరి పాట సాహిత్యం

 
చిత్రం: జీవిత రథం (1981)
సంగీతం: కె. చక్రవర్తి 
సాహిత్యం: వేటూరి సుందరరామ మూర్తి 
గానం: యస్.పి. బాలు

అల్లరంటే అల్లరి 

Palli Balakrishna Saturday, August 20, 2022



చిత్రం: కన్నకొడుకు (1973)
సంగీతం: టి.చలపతి రావు
సాహిత్యం: దాశరథి, ఆరుద్ర, డా॥ సి.నారాయణరెడ్డి 
గానం: ఘంటసాల, పి.సుశీల, జయదేవ్, షరావతి , రమేష్ 
నటీనటులు: అక్కినేని నాగేశ్వరరావు, అంజలి దేవి, లక్ష్మీ, కృష్ణంరాజు 
దర్శకత్వం: వి.మధుసూధనరావు 
నిర్మాతలు: జి.రాధాకృష్ణ మూర్తి, ఎ.రామచంద్ర రావు 
విడుదల తేది: 11.05.1973



Songs List:



తింటే గారెలే తినాలి పాట సాహిత్యం

 
చిత్రం: కన్నకొడుకు (1973)
సంగీతం: టి. చలపతి రావు
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి 
గానం: ఘంటసాల, పి. సుశీల

తింటే గారెలే తినాలి ...
వింటే భారతం వినాలి
ఉంటే నీ జంటగా వుండాలి.
సైఁ యంటే స్వరాలే దిగిరావాలి

మొలక మబ్బులు ముసిరితే.... 
ఓహో....
చిలిపి గాలులు విసిరితే...
ఓహో....
పచ్చపచ్చని పచ్చిక బయలే పాన్పుగా
అమరితే అమరితే అమరితే.....
వీడని కౌగిట వేడి వేడిగా
చూడని రుచులే చూడాలి......

నీ నల్లని కురులను నే దువ్వీ
యీ సిరిమల్లెలు నీ జడలో నే తరిమీ
పట్టుచీరే కట్టించి

పైట నేనే సవరించి, సవరించి, సవరించి
నిగనిగలాడే నీ సొగసంతా
నే నొక్కడినే చూడాలి....
తీయగా నువు కవ్విస్తే - ఓహో
తీగలా నను పెనవేస్తే - ఓహో
పూలతోట పులకరించీ
యీల పాటలు పాడితే, పాడితే, పాడితే
పొంగే అంచుల పల్లకి పైన
నింగి అంచులను దాటాలి....



లోకం శోకం మనకొద్దు పాట సాహిత్యం

 
చిత్రం: కన్నకొడుకు (1973)
సంగీతం: టి. చలపతి రావు
సాహిత్యం: ఆరుద్ర 
గానం: ఘంటసాల, పి. సుశీల, జయదేవ్, షరావతి , రమేష్ 

పలవి : 
లోకం శోకం మనకొద్దు
మైకం తదేకం_వదలొద్దు 
అను అను అను హరేరామ్ అను
అను అను అను హరేకృష్ణ అను
హరేరాం.... హరేరాం....
రామ్ రామ్ హరేరామ్ ..
కృష్ణ కృష్ణ ఘనశ్యాం

చరణం: 
నీతి నియమంబూడిద
పాత సమాజం గాడిద
ఇల్లూ వాకిలీ..తల్లీ తండ్రీ
ఎవరూ లేరు—ఎవరూ రారు
నీతో నీవే నీలో నీవే
బతకాలి బతకాలి బతకాలి ....

పల్లవి: 
అయ్యో రామా -అయ్యో కృష్ణా
చూశారా నరుడెంత మారాడో మీ
భజన చేస్తూ ఎంతకు దిగజారాడో.

చరణం: 
ఆడాళ్ళకు మగవాళ్ళకు తేడా తెలియదు
అయ్య పంపే డబ్బులకే అర్థం తెలియదు
కలసి మెలసి విందు - కైపులోన చిందు
ఈ పోకడ దగా దగా బతుకంతా వృధా వృధా ...

చరణం: 
సౌఖ్యాలకు దొడ్డిదారి వెతికేవాళ్ళు
బ్లాకులోన డబ్బులెన్నో నూకేవాళ్లు
ఏ పాటు పడనివాళ్ళు సాపాటు రాయుళ్ళు
అందరికీ మీ పేరే అతి తేరగ దొరికిందా.... 

చరణం: 
కష్టాల్లో పేదాళ్ళకు మీరు అవసరం
కలవాళ్ళ దోపిడీకి మీరు ఆయుధం
ఆపదలో ముడుపు ఆ పైన పరగడుపు
అనాదిగా ఇదే ఇదే రివాజుగ సాగాలా ?



అందమైన పిలగాడు పాట సాహిత్యం

 
చిత్రం: కన్నకొడుకు (1973)
సంగీతం: టి. చలపతి రావు
సాహిత్యం: కొసరాజు 
గానం: పి. సుశీల, షరావతి 

పల్లవి: 
అందమైన పిల్లగాడూ
అందకుండా పోతున్నాడూ
నెత్తిమీద గోరువంక
నిలిచిందే చూడడూ - అయ్యో రామా
పిలిచిందే చూడడూ

చరణం: 1
బూరెల బుగ్గల బుడగడే
ఏమన్నా యిటు తిరగడే
కొట్టిన రాయిలాగా
బిర్రబిగుసుకొని వున్నాడే - అయ్యో రామా
బుర్ర గోక్కుంటున్నాడే....

చరణం: 2
ప్రేమ జబ్బులో పడ్డాడమ్మా
బిత్తరి చూపులు చూస్తాడమ్మా
ఏ యమ్మగన్న పిల్లోడోగాని
ఎంత జెప్పినా వినడమ్మా అయ్యో రామా
ఏమైపోతాడో యమ్మా -

చరణం: 3
కలిగిన పిల్లను కాదంటాడే
పేదపిల్లపై మోజంటాడే 
డబ్బున్న వాళ్ళకు ప్రేమ వుండదా
లేనివాళ్ళకే వుంటుందా 
అయ్యో రామా
పిచ్చి యింతగా ముదిరిందా...




ఎన్నడైనా అనుకున్నానా పాట సాహిత్యం

 
చిత్రం: కన్నకొడుకు (1973)
సంగీతం: టి. చలపతి రావు
సాహిత్యం: దాశరథి 
గానం: పి. సుశీల

పల్లవి: 
ఎన్నడైనా అనుకున్నానా ?
ఎప్పుడైనా కలగన్నానా ?
ఇంత చల్లని మనసు నీ కుందనీ .... ఆ
మనసులో నా కెంతో చోటుందనీ.....

చరణం: 1
నీ చిరునవ్వుల నీడలలోన మేడకడతాననీ
అల్లరిచేసే నీచూపులతో ఆడుకుంటాననీ
ఎవరికి అందని నీ కౌగిలిలో వాలిపోతాననీ
నీ రూపమునే నా కన్నులలో దాచుకుంటాననీ

చరణం: 2
వలపులు చిందే నా గుండెలలో నిండివుంటావనీ
పెదవుల దాగిన గుసగుసలన్నీ తెలుసుకుంటావనీ
నా గుడిలోపల దైవము నీవై వెలుగుతుంటావనీ
విరిసే సొగసులు విరజాజులతో పూచేసెననీ





దేవుడిచ్చిన వరముగా పాట సాహిత్యం

 
చిత్రం: కన్నకొడుకు (1973)
సంగీతం: టి. చలపతి రావు
సాహిత్యం: దాశరథి 
గానం: పి. సుశీల

పల్లవి : 
దేవుడిచ్చిన వరముగా
కోటి నోముల ఫలముగా
ఇంటిలోని దివ్వెగా - కంటిలోని వెలుగుగా
చిన్ని నాన్నా ! నవ్వరా !
చిన్ని కృష్ణా ! నవ్వరా ?

చరణం : 1
నన్ను దోచిన దేవుడే ఈ నాటితో కరుణించెలే
కన్న కలలే నిజములై - నీ రూపమున కనిపించెలే
బోసినవ్వులు ఒలకబోసి లోకమే మరపించరా

చరణం : 2
మామ ఆస్తిని మాకు చేర్చే
మంచి పాపా నవ్వవే 
ఆదిలక్ష్మివి నీవేలే  మా ఆశలన్నీ తీర్చవే
గోపి బావను చేసుకొని – కోటికే పడగెత్తవే



ఉన్నది నాకొక ఇల్లు పాట సాహిత్యం

 
చిత్రం: కన్నకొడుకు (1973)
సంగీతం: టి. చలపతి రావు
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి 
గానం: ఘంటసాల 

పల్లవి: 
ఉన్నది నాకొక ఇల్లు
ఉన్నది నాకొక తలి
ఇల్లే బంగరు కోవెల
తల్లే చల్లని దేవతా.....

చరణం: 1
చిన్నబాబుగారున్నారు
వెన్నపూసతో పెరిగారు
సరదాబాబుల సహవాసంలో
దారితప్పి పోతున్నారు
చేయిజారి పోతున్నారు....

చరణం: 2
పెదయ్యగారి పేరు చెప్పితే
పెద్దపులే భయపడుతుంది
ఛెళ్లున కొరడా ఝళిపిస్తేనే
ఇలు దదరిలి పోతుంది
మా ఒళ్ళు హూనమైపోతుంది

చరణం: 3
పాపమ్మలాంటి అత్తమ్మగారు
ప్రతి ఇంటిలోన వుంటారు 
ఆయమ్మగారు మహమ్మారి తీరు
అన్నీ స్వాహా చేస్తారు -
గుటకాయస్వాహా చేస్తారు ...

చరణం: 4
అమ్మ అనే రెండక్షరాలలో
కోటి దేవతల వెలుగుంది -
అమృత మనేది వుందంటే
అది అమ్మ మనసులోనే వుంది
మా అమ్మమనసులోనేవుంది
ఆ తలి చల్లని దీవెన చాలు ....
ఎందుకు వేయి వరాలు
ఇంకెందుకు వేయి వరాలు ....




నేను నేనేనా నువ్వు నువ్వేనా పాట సాహిత్యం

 
చిత్రం: కన్నకొడుకు (1973)
సంగీతం: టి. చలపతి రావు
సాహిత్యం: ఆరుద్ర 
గానం: పి. సుశీల 

నేను - నేనేనా
నువ్వు నువ్వేనా
ఎక్కడికో - ఎక్కడికో

రెక్కవిప్పుకొని ఎగిరిపోతోంది
హృదయం
చిక్కని చక్కని సుఖంలో
మునిగిపోతోంది దేహం హాయ్...

చరణం: 1
ఇదా మనిషి కోరుకోను మైకం
ఇదా మనసు తీరగల లోకం
జిగేలు మంది జీవితం
పకాలుమంది యవ్వనం

చరణం: 2
ఓహో ఈ మత్తు చాల గమ్మత్తు
ఊహూఁ ఇంకేది మనకు వద్దు
నిషాలు గుండె నిండనీ
ఇలాగె రేయి సాగనీ ....




కళ్ళతో కాటేసి పాట సాహిత్యం

 
చిత్రం: కన్నకొడుకు (1973)
సంగీతం: టి. చలపతి రావు
సాహిత్యం: దాశరథి 
గానం: ఘంటసాల, పి. సుశీల 

పల్లవి:
కళ్ళలో కాటేసి-వొళ్ళు ఝల్లుమనిపించి
రమ్మంటే రానంటా వెట్టాగే - పిల్ల
యెట్టాగే-పిల్ల యెట్టాగే....

బుగ్గమీద సిటికేసి సిగ్గులోన ముంచేసి
నన్నెట్టా రమ్మంటవ్ పిలగాడ
భలే పిల గాడ - కొంటె పిల గాడ

చరణం:
తోటలోనా మాటు వేసీ
వెంటబడితే బాగుందా 
పంటసేనూ గట్టుమీద
పైనబడితే బాగుందా?
సెంగావి సీరెలో - బంగారు రైకలో
పొంగులన్ని చూపిస్తే బాగుందా ॥కళ్ళతో॥

చరణం: 
మొదటిసారి చూడగానే.. మత్తుమందూ చల్లావే
మాయజేసీ—మనసు దోచీ తప్పునాదే అంటావే
బెదురెందుకు నీకనీ_ ఎదురుగ నుంచోమనీ, పెదవిమీద నా పెదవిమీద ....
అమ్మమ్మో బాగుందా ॥బుగ్గమీద॥

చరణం: 
సైగ చేసి సైకిలెక్కి సరసమాడితే బాగుందా
 పైట సెంగూ నీడలోన నన్నుదాస్తే బాగుందా
కందిరీగ నడుముతో, కన్నెలేడి నడకతో
కైపులోన ముంచేస్తే బాగుందా.... ॥కళ్ళతో॥

చరణం: 
పెంచుకున్న ఆశలన్నీ
పంచుకుంటానన్నావే
ఊసులాడీ–బాసలాడీ—వొళ్లుమరచీ పోయావే
జాబిల్లి వెలుగులో - తారల్ల తళుకులో
ఏవేవో కోరికలు కోరావే




ఉన్నది నాకొక ఇల్లు (Sad Version) పాట సాహిత్యం

 
చిత్రం: కన్నకొడుకు (1973)
సంగీతం: టి. చలపతి రావు
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి 
గానం: ఘంటసాల

ఉన్నది నాకొక ఇల్లు 

Palli Balakrishna Friday, July 8, 2022



చిత్రం: జూదగాడు (1979)
సంగీతం: కె.చక్రవర్తి 
నటీనటులు: శోభన్ బాబు, జయసుధ 
దర్శకత్వం: వి.మధుసూధనరావు 
నిర్మాత: చటర్జీ 
విడుదల తేది: 15.08.1979

(గమనిక: వేటూరి సుందరరామ మూర్తి, వీటూరి వెంకట సత్య సూర్యనారాయణమూర్తి ఇద్దరు వేరు వేరు, కానీ వీరిద్దరు పాటలు రచయితలు. వీరిద్దరూ కలిసి ఒకే సినిమాలో పాటలు రాసిన సినిమాలు:
1.యమగోల (1977)
2. మల్లెపువ్వు (1978)
3. విజయ (1979)
4. బొమ్మాబొరుసే జీవితం (1979)
5. చెయ్యెత్తి జై కొట్టు (1979)
6. జూదగాడు (1979)
7. మామా అల్లుళ్ళ సవాల్ (1980) 
8. మంగళ గౌరి (1980) 
ఈ ఎనిమిది సినిమాలలో వీరిద్దరి పేర్లు కనిపిస్తాయి )



Songs List:

కాశీకి పోయినా గంగలో దూకినా పాట సాహిత్యం

 
చిత్రం: జూదగాడు (1979)
సంగీతం: కె.చక్రవర్తి 
సాహిత్యం: వీటూరి వెంకటసత్య సూర్యనారాయణమూర్తి 
గానం: యస్.పి. బాలు, పి. సుశీల

కొక్కొరోకో - కాశీకి పోయినా గంగలో దూకినా
మునగాల తేలాల ముద్దాడు కోవాల ఇద్దరమియ్యాల
కాశీకి పోయినా గంగలో దూకినా
మునగాల తేలాల ముద్దాడుకోవాల ఇద్దరమియ్యాల
మూశా తలుపు మూళా ముద్దు చెల్లించుకోవాలని
తీకారెటు తీశా పొదు నీకొనే చూడాలని
చూశా వన్నె చూశా వయసు వాటేసుకోవాలని
వేశా గడియ వేశా మనసు ముడివేసుకోవాలని
ఓ అరమూసిన ఆ చూపులో
ఆకలివేసిన కౌగిలి నువ్వే కావాలంటుంటే
కౌగిలి కాగని నా గిలి నువ్వే తీర్చాలంటుంటే
శంభో శంకర ఆమె : అంబో గఁ గర
జై పరమేశ్వరా

చూపు చూపు కలిసి జూదమాడాలి నే జోరుగా
వయసు వయసు కలిపి పందెమెయ్యాలిలే జోడుగా
ఎవరూలేనిచోట నేనేమడిగినా ఇచ్చుకో
ఎదురేలేని పూట నేనేమిచ్చినా పుచ్చుకో
నిలవేసినా నీ చూపులో
వలవేసినా నీ వలపులో

కన్నుల రెప్పలు కలిసిన చప్పుడు కలలై పోతుంటే
వెన్నెల మబ్బులు కరిగిన చినుకులు అలలై వస్తుంటే
శంభో శంకర ఆమె : అంబో గరగర
జె పరమేశ్వరా
అతను తెరతీసిన ఆ పిలుపులో




అల్లారు ముద్దుగా పాట సాహిత్యం

 
చిత్రం: జూదగాడు (1979)
సంగీతం: కె.చక్రవర్తి 
సాహిత్యం: ఆరుద్ర 
గానం: యస్.పి. బాలు, పి. సుశీల

పల్లవి:
అల్లారు ముద్దుగా పెరిగింది మాలక్ష్మి
అల్లారు ముద్దుగా పెరిగింది మాలక్ష్మి
అత్తవారింటికి తరలింది
మా చెల్లి బంగారు తల్లీ ...
మా అక్కా చక్కనీ చుక్కా ...
పోయిరావమ్మా... పేరు తేవమ్మా... బంగారు తల్లీ

అల్లారు ముద్దుగా పెరిగింది మాలక్ష్మి
అత్తవారింటికి తరలింది

చరణం: 1
పూజ చేసి.. ఏరి కోరీ.. నిన్ను చేసుకుంది
పూజ చేసి.. ఏరి కోరీ.. నిన్ను చేసుకుంది

పువ్వుల్లో పెట్టుకో... చిరునవ్వుల్లో దాచుకో
మనసారా కాపురాన్ని మలుచుకో...
మా లక్ష్మికి అండగా మేమున్నాం తెలుసుకో
బావా.. ఓ .. మా మంచి బావా
బావా.. ఓ .. మా మంచి బావా

అల్లారు ముద్దుగా పెరిగింది మాలక్ష్మి
అత్తవారింటికి తరలింది

చరణం: 2
బావగారూ.. మహా గడుసువారూ.. మంచి చేసుకో
బావగారూ.. మహా గడుసువారూ.. మంచి చేసుకో

చిలిపి పనులు చేశాడో... ఆ చెవులు పుచ్చుకో
కట్టుకున్నవాడు కలకాలం నీ మదిలోనే ఉన్నా...
తోడబుట్టినాము మమ్ము క్షణ కాలం తలుచుకో

చెల్లీ.. ఓ.. బంగారు తల్లీ..
అక్కా.. ఓ.. చక్కని చుక్కా

అల్లారు ముద్దుగా పెరిగింది మాలక్ష్మి
అత్తవారింటికి తరలింది
మా చెల్లి బంగారు తల్లీ ...
మా అక్కా చక్కనీ చుక్కా ...
పోయిరావమ్మా... పేరు తేవమ్మా...
బంగారు తల్లీ... బంగారు తల్లీ ...





రంగు పూల పాట సాహిత్యం

 
చిత్రం: జూదగాడు (1979)
సంగీతం: కె.చక్రవర్తి 
సాహిత్యం: జాలాది రాజారావు 
గానం: యస్.పి.బాలు, పి.సుశీల

జిం జిలాడి రంగుపూల మంగిణిలు అందుకు
కంకణాల శింకిణీలు లంకెలేసుకొచ్చాయి గాలిదేవరా-
ఓర్ జర్ కుర్ కుర్ బర్ కుర్ ర్ ర్ ర్ ర్ ర్రో
గుర్ గుర్ గుర్ గుర్ గుర్ గుర్ గుర్ గుర్ గుర్ గుర్ గుర్రా
ఓ శింగరాజు పొంగులాడి - గింగిరాల అంగలాడి

హోయ్ గాలిదేవరా
అగ్గిదేవుడోచ్చాడు గాలిదేవరా
నీకు సత్తెముంటే దిగిరా గాలిదేవరా.. ఓగాలిదేవరా.. కోయదేవరా
ఓ గంగపొంగు సొంగలోడూ జింగు బిల్లి గుప్పులోడూ
గుట్టు యిప్పనున్నాడు గాలిదేవరా
గుర్రుపెట్టి నిడరోకు గాలిదేవరా దిగాలి దేవరా
కుర్ కుర్ కుర్ జర్ గుడ్ గుర్ గుర్ ....

హోయ్ గాలివరాదే
ఓ గుండెల్లో గూడకట్టి పుండలేని దేవుడోళ్ళూ
కొండలో వుండేది ఇందుకా - కోటి మాయరూపాలు దండగా
గాలిదేవరా - కోయదేవరా -
గాలిదేవరా - కోయదేవరా

నాడేమైన దేవుడంటూ నాడపోసి పెంచానంటూ
గూడెపోళ్ళు నమ్మింది ఇందుకా... మూడజనం ముడుపులన్నీ ఉండగా
కోయదేవరా - గాలి ద్వారా

నోళ్ళు కొట్టినోళ్ళంతా మేళ్ళు కట్టి కులుకుతుంటే
ఇనుపగుండె నాయాళ్ళూ యెన్నుపోటు తీస్తుంటే
అగ్గి దేవుడొచ్చాడు గాలిదేవరా
నీన తెముంటే దిగరా గాలిదేవరా..ఓగాలిదేవరా కురురురుర్
నక్కజిత్తు నాయాళ్ళూ - తొత్తు కొడుకు తోడేళ్ళూ
కడుపుకోత పెడుతుంటే ఆగనా తొక్కి నారతీసి డొక్క చీల్చనా
మేడిపందు పెరుగులో - పెరుగుతున్న పురుగులతో
మనిషి కుళ్ళిపోతుంటే చూడవా - విషంకక్కి బుసకొడితే కడలవా
దిగు దిగు దిగు దిగు దిగు దిగిరా
చరచర చర చర చర చర చర చర దిగిరా

ఫెళ ఫెళ ఫెళ ఫెళ పెడిల్లుమంటూ - పగిలిన గుండెలు ఆగవూ
కణ కణ కణ కణ నిప్పులు చెరిగే - కడుపుమంట ఇక ఆరదూ
ఈ పాపం పగలాలీ

నిజరూపం తేలాలి.
ను చరచర చర చర మరోతరంలో
మనిషే గెలవాలీ - నా మనిషే గెలవాలి - మనిషే దేవుడు కావాలీ




కారు కింద కోడి పాట సాహిత్యం

 
చిత్రం: జూదగాడు (1979)
సంగీతం: కె.చక్రవర్తి 
సాహిత్యం: వేటూరి సుందరరామ మూర్తి 
గానం: యస్.పి.బాలు

కోకొకొకొకొకొక్కొకొకో
కారు కిందకోడి కారు మీద లేడి .
ముంజకాయ మూతి చుప్పనాతి నాతి - జోరు పెరిగినా కారు ఒరిగినా
గలంతు అవుతావే పిలా బేలా తాంబేలా
వలపుదారిలో మలుపుచూసుకో చిలిపి అలకలు దులిపి వేసుకో
కోట కొద్ది సొమ్మున్నా కార్లు నడిపే దమ్మున్నా
దుమ్మురేపకే బాలా తుమ్ములొచ్చెనే చాలా
చారడేసి కన్నులున్న చిన్నదానా.ఊరికెంత అందగాణ్ని నేనుగానా
కొకొకొకొకొక్కోకొకొ
పంచరు కాలు గితే లేదు టించరు
స్పీడు పెరిగితే టైరు
కస్సుమంటే జవరాలా కౌగిలే నీ చెరసాల
మేకు జారితే పిల్లా
తోక పీకుడే మలా
బుగ్గమీద మొగ్గలున్న బుర్రుపిట్టా పగ్గమీద మొగ్గలున్న తుర్రుపిట్టా
కొకొకొకొకొక్కొరోకో




రైకంతా రంగేమిటే పాట సాహిత్యం

 
చిత్రం: జూదగాడు (1979)
సంగీతం: కె.చక్రవర్తి 
సాహిత్యం: జాలాది రాజారావు 
గానం: యస్.పి.బాలు, పి.సుశీల

రైకంత రంగేమిటే చిన్నదానా.. కోకంత కొర్రేమిచే సర్రదానా
ఏ ముల్లు పెట్టింది ఆ కుర్రపెట్టింది - ఏతలుపు తట్టింది ఆమరకలెట్టిందమ్మో
చాకిరేవు కేశానురో సందకాడ. ఉడకబెట్టి ఉతికారులో అందగాడా
రెండు మూడు కలిపిపట్టి -- బండకేసి పురుకుతుంటె
ఇరుగు పొరుగు రంగొచ్చి - యీపు కంటుకున్నదిరో

మెరుకుకన్న చురుకుదాన్ని రో-నీ.. కరుగుతనం పనికిరాదులో
పిడుగులాంటి పిల్లదాన్నిరో. నీ ఒరువుచూసి జడిసిపోనురో
అతను: నిన్ను గెలవకుంటే నా మీసం దండుగ - నువ్వు సయ్యంటే

శివరాత్రి పండగ
నడుము చుట్టినా ముద్దుపెట్టినా తాళి కట్టినా హే ఉస్కులకిడి
నీ రంగుచీర పొంగులాడితే..నా - యీడుజోడు మెలికలాడితే

ఆ పైట చెంగు పందెమాడితే నా కొంటె వయసు కుమ్ములాడితే
నవ్వు రేగుతుంటే రెయ్యిపొద్దు చాలదు
నీముద్దులేక సందెపొద్దు పొడవద్దు.. నిన్నుఆపనా ఉయ్యలూపనా జోలపాడనా
హే ఉస్కులకిడి





మల్లెల వేళ అల్లరి వేళ పాట సాహిత్యం

 
చిత్రం: జూదగాడు (1979)
సంగీతం: కె.చక్రవర్తి 
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ 
గానం: పి. సుశీల, జి. ఆనంద్ 

పల్లవి:
మల్లెల వేళ అల్లరి వేళ
మల్లెల వేళ అల్లరి వేళ
మదిలో మన్మధ లీల
నీవు నేనైన వేళ
వుండిపోవాలి ఇలా ఇలా

మల్లెల వేళ అల్లరి వేళ
మదిలో మన్మధ లీల
నీవు నేనైన వేళ
వుండిపోవాలి ఇలా ఇలా

చరణం: 1
ఒక మధుర మురళి మ్రోగింది
యమునా తటిలో మురళీ రవళి
ఒక రాగమేదొ జుమ్మంది
ఒక రాధ మనసు జల్లంది
బృందావనిలో అందాలొలికే
ఆ రాధా మాధవ రాస క్రీడలే
రసడోలలూగించు వేళ

మల్లెల వేళ అల్లరి వేళ
మదిలో మన్మధ లీల

చరణం: 2
ఒక నింగి వలచి చేరింది
ఒక నేల ముద్దులాడింది
నింగీ నేల ఉరిసీ మెరిసీ
ఒక మబ్బు ఉబ్బి ఉరిమింది
అది పెళ్ళి మేళమయ్యింది
దివిలో మేళం భువిలో తాళం
ఆ మేళ తాళాల మేళవింపులో
జగమెల్ల దీవించు వేళ

మల్లెల వేళ అల్లరి వేళ
మదిలో మన్మధ లీల
నీవు నేనైన వేళ
వుండిపోవాలి ఇలా ఇలా

మల్లెల వేళ అల్లరి వేళ
మదిలో మన్మధ లీల





కన్నెపిల్లలు కలల హీరో పాట సాహిత్యం

 
చిత్రం: జూదగాడు (1979)
సంగీతం: కె.చక్రవర్తి 
సాహిత్యం: వీటూరి వెంకటసత్య సూర్యనారాయణమూర్తి 
గానం: యస్.పి.బాలు, యస్.జానకి 

కొర కొర మిన మిన జా జా
మిస మిస కొర కొర జా జా
కన్నె పిల్లలు కలల హీరో - కాచుకున్నది చిన్నది నీ కోసం హోల్డాన్ 
వగలరాణి జయమాలిని దాచుకొన్నది దోచుకుపోతానే హోషియార్

నా హృదయం పద్మవ్యూహం - జొరబడితే వెనుకకురావు
అభికన్యుడగానే పిల్లా.. నే అర్జునుడనే రసగుల్లా
ఆగవా 
ఆగనూ
కాసుకో 
చూసుకో
ఒంపుల సొంపుల గారడిచేస్తే చూపు కైపుల సంకెల వేస్తే 
మెత్త మెత్తగా చితైపోతావో రాజా హోల్డాన్
అందరిలాంటి వాడనుగాను - అందంచూసీ - చితైపోను

అగ్గిరాముడను ఉక్కుభీముడను నేను హోషియార్
నా పేరే డైమన్ రాణీ - చేయిస్తా నీతో బోణీ
నీ బోణి తెలిసినవాణ్ణి నే పక్కా జూదగాణ్ణి
వెయ్యనా
వేసుకో
తియ్యనా
తీసికో
ఇంకో అటలో నిన్నోడిస్తా ఎత్తులకే పై ఎత్తులు వేస్తా
మగ ఊహలతోనే నిచ్చెనవేస్తా.. గుండెల్లోనా గుట్టును తీస్తా
ఈ చిలకను పట్టీ బుట్టతో పెడతాను హోషియార్

Palli Balakrishna Friday, April 15, 2022



చిత్రం: మంచిరోజులు వచ్చాయి (1972)
సంగీతం: టి.చలపతిరావు
నటీనటులు: అక్కినేని నాగేశ్వరరావు, గుమ్మడి, కృష్ణం రాజు, కాంచన, అంజలీదేవి , గీతాంజలి 
అసోసియేట్ డైరెక్టర్: ఎ.కోదండ రామిరెడ్డి
దర్శకత్వం: వి.మధుసూదనరావు
నిర్మాత: యస్.యస్.బాలన్
విడుదల తేది: 1972



Songs List:



పదరా ! పదరా! పాట సాహిత్యం

 
చిత్రం: మంచిరోజులు వచ్చాయి (1972)
సంగీతం: టి.చలపతిరావు
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి
గానం: ఘంటసాల, పి.సుశీల

పల్లవి:
పదరా ! పదరా!
నడుంకట్టి పిడికిలెత్తి పదరా
నవ విప్లవ శంఖమూది పదరా
పడగెత్తే స్వార్థపరుల
అడుగడున తరిమికొట్టి పదరా
మంచిరోజు లొచ్చాయి పదరా

చరణం: 1
కలిగినోళ్ళ జులుములింక సాగవురా ! 
వాళ్ళ దోపిడీలు, దురంతాలు చెల్లవురా
కార్మికులు - కర్షకులు, పీడితులు, తాడితులు
సంకెళ్ళను తెంచుకు సాగాలిరా
మంచిరోజు లొచ్చాయి పదరా

చరణం: 2
ఒళ్ళువంచి పని చేయని వాళ్లు ! 
పరుల నోళ్ళు కొట్టి బతికే గొప్పోళ్ళు
పెట్టెలో దాచుకున్న పుట్టెడు ధన రాసులను
పదుగురికి పంచుదాము పదరా
సమభావం పెంచుదాము పదరా
మంచిరోజు లొచ్చాయి పదరా





సిరిపల్లె చిన్నది పాట సాహిత్యం

 
చిత్రం: మంచిరోజులు వచ్చాయి (1972)
సంగీతం: టి.చలపతిరావు
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి
గానం: ఘంటసాల, పి.సుశీల

పల్లవి: 
సిరిపల్లె చిన్నది
చిందులు వేస్తున్నది
చిన్నగాలి తాకిడికే
చిర్రుబుర్రుమన్నది
ఓయమ్మో - భయమేస్తున్నది

చరణం: 1
మొన్న మొన్న ఈ పల్లెటూరిలో
పుటిన బుజ్జాయి
నిన్నటిదాకా పరికిణి కట్టి
తిరిగిన పాపాయి
బస్తీ మకాము పెట్టి -- బడాయి నేర్చుక వచ్చి
బుట్టబొమ్మలా గౌను వేసుకొని
పోజులుకొడుతూ ఉన్నది

చరణం: 2
ఇప్పుడిప్పుడే లండను నుండి
దిగింది దొరసాని
వచ్చీరానీ ఇంగిలీసులో
దంచుతోంది రాని
రేగిందంటే ఒళ్ళు పంబ రేగేనంట
అబ్బ తా చుపాములా పడగ విప్పుకొని
తై తై మన్నది

చరణం: 3
సిగ్గే తెలియని చిలిపి కళ్ళకు
నల్లని అద్దాలెందుకు
తేనెలు చిలికే తెలుగు ఉండగా
ఇంగిలీసు మోజెందుకు
నోరు ముచిదైనప్పుడు  ఊరు మంచిదే ఎప్పుడు 
తెలుసుకోలేని బుల్లెమ్మలకు - తప్పవులే తిప్పలు



ఎగిరే గువ్వ ఏమంది ? పాట సాహిత్యం

 
చిత్రం: మంచిరోజులు వచ్చాయి (1972)
సంగీతం: టి.చలపతిరావు
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి
గానం: ఘంటసాల, పి.సుశీల

పలవి:
ఎగిరే గువ్వ ఏమంది ?
విసిరే గాలి ఏమంది ?
ప్రకృతిలోన స్వేచ్ఛకన్న
మిన్న లేనే లేదంది

చరణం: 1
పూల కెందుకు కలిగెనే ఈ ఘుమ ఘుమలు
ఈ మధురిమలు
తీగ లెన్నడు నేర్చెనే ఈ అల్లికలు
ఈ అమరికలు
స్వేచ్ఛకోరే మనసువుంటే
పొందలేనిది యేముంది

చరణం: 2
కోకిలెన్నడు నేర్చెనే ఈ సరిగమలు
సరాగములు
నెమలి కెవ్వరు నేర్పిరే ఈ లయగతులు
ఈ స్వరజతులు
స్వేచ్ఛకోరే మనసువుంటే
నేర్వలేనిది యేముంది

చరణం: 3
శిరసు వంచక నిలువనా గుడి గోపురమై
గిరి శిఖరమునై
అవధులన్నీ దాటనా ప్రభంజనమై
జలపాతమునై
స్వేచ్ఛకోరే మనసునాది
ఇంక నా కెదురేముంది





ఈ నాటి సంక్రాంతి అసలైన పండగ పాట సాహిత్యం

 
చిత్రం: మంచిరోజులు వచ్చాయి (1972)
సంగీతం: టి.చలపతిరావు
సాహిత్యం: కొసరాజు
గానం: ఘంటసాల అండ్ కోరస్

సాకి !
ఏటేటా వస్తుంది సంక్రాంతి పండగ
బీదసాదల కెల్ల ప్రియమైన పండగ

పల్లవి: 
ఈ నాటి సంక్రాంతి అసలైన పండగ
సిసలైన పండగ
కష్టజీవులకు అది ఎంతో కన్నుల పండుగ!

ఎవ్వరేమి అనుకున్నా
ఎంత మంది కాదన్నా
ఉన్న వాళ్ళ పెత్తనం ఊడుతుందిలే
సోషలిజం వచ్చే రోజు - దగ్గరుందిలే

చరణం: 1
గుడిసె కాపురాలు మాకు ఉండబోవులే 
ఈ మేడలు కొద్ది మందికే స్థిరము కావులే
ఓడలు బండ్లై  బండ్లు ఓడలై
తారుమారు ఎపుడైనా తప్పదులే తప్పదులే

చరణం: 2
ఎగిరిపడే పులిబిడ్డలు పాపం ఏమైపోతారు
పిల్లులాగా తోక ముడుచుకొని మ్యావ్ మ్యావ్ మంటారు
కిక్కురుమనక - కుక్కిన పేనై
చాటుగా నక్కుతారు - చల్లగా జారుకుంటారు



నేలతో నీడ అన్నది పాట సాహిత్యం

 
చిత్రం: మంచిరోజులు వచ్చాయి (1972)
సంగీతం: టి.చలపతిరావు
సాహిత్యం: దేవులపల్లి
గానం: ఘంటసాల

పల్లవి :
నేలతో నీడ అన్నది నను తాకరాదని
పగటితో రేయి అన్నది నను తాకరాదని
నీరు తన్ను తాకరాదని గడ్డిపరక అన్నది
నేడు భర్తనే తాకరాదని ఒక భార్య అన్నది

చరణం: 1
వేలి కొసలు తాకనిదే వీణ పాట పాడేనా
చల్లగాలి తాకనిదే నల్ల మబ్బు కురిసేనా ?
తల్లి తండ్రి ఒకరి నొకరు తాకనిదే
నీవు లేవు, నేను లేను, లోకమే లేదులే

చరణం: 2
రవి కిరణం తాకనిదే నవ కమలం విరిసేనా
మధుపం తను తాకనిదే మందారం మురిసేనా
మేను మేను తాకనిదే మనసు మనసు కలవనిదే
మమత లేదు, మనిషి లేడు, మనుగడయే లేదులే

చరణం: 3
అంటరాని తనము- ఒంటరి తనము
అనాదిగా మీ జాతికి అదే మూలధనము
ఇక సమభావం, సమధర్మం, సహజీవన మనివార్యం
తెలుసుకొనుట మీ ధర్మం - తెలియకుండా మీ ఖర్మం 



మంచిరోజు లొచ్చాయి పదరా పాట సాహిత్యం

 
చిత్రం: మంచిరోజులు వచ్చాయి (1972)
సంగీతం: టి.చలపతిరావు
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి
గానం: ఘంటసాల, సుశీల అండ్ కోరస్

పల్లవి: 
పదరా - పదరా
నడుంకట్టి పిడికిలెత్తి పదరా
నవ విప్లవ శంఖమూది పదరా
పడగెత్తే స్వార్ధపరుల
అడుగడుగున తరిమి కొట్టి - పదరా
మంచిరోజు లొచ్చాయి పదరా

చరణం: 
చెమటోడ్చి పనిచేయని సోమరులకు చోటు లేదురా
పదుగురితో కలిసి రాని బాబులకిక బతుకు లేదురా
గునపమెత్తి - సుత్తిపట్టి
కొండలనే పిండికొట్టి
నదులను మళ్ళించుదాము పదరా  రతనాలను పండించుదాము పదగా
మంచిరోజు కొచ్చాయి పదరా





ఎందుకే పిరికితనం పాట సాహిత్యం

 
చిత్రం: మంచిరోజులు వచ్చాయి (1972)
సంగీతం: టి.చలపతిరావు
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి
గానం: పి. సుశీల, ఎల్. ఆర్. ఈశ్వరి

పల్లవి :
ఎందుకే పిరికితనం
చాలునే కలికితనం
రా - తెంచుకొని రా - తెలుసుకొని రా !
బంధనా లెందుకు - ఎందుకు - ఎందుకు

చరణం: 1
పెళ్ళంటే ఒక ఒప్పందం - అది
కోరేదే అనుబంధం
ఆ అనుబంధం లేనినాడు
మనువూ, మనసూ కలవని నాడు
మంగళ సూత్రమె ఉరితాడు - ఉరితాడు - ఉరితాడు
రా - తెంచుకొని రా తెలుసుకొని రా!
పంజరా లెందుకు- ఎందుకు - ఎందుకు!

చరణం: 2
మాంగల్యమే సతీమణి ప్రాణమందురే
పసుపు, కుంకుమ పడతి సౌభాగ్యమందురే
సౌశీల్యమే మగువ సహజ గుణమందురే
సహనమే స్త్రీ జాతి మూలధనమందురే

చరణం : 3
నువు చెప్పేది పాతపురాణం
నువు మెచ్చేది కొత్త సమాజం
స్వార్థపరులూ సౌఖ్యం కోసం
చల్లని సూక్తులు వల్లించి 
జాతికి వేసిరి సంకెళ్ళు - సంకెళ్ళు - సుకెళ్ళు
తెంచుకొని రా - తెలుసుకొని రా
ఉక్కు తెరలెందుకు - ఎందుకు - ఎందుకు

చరణం : 4
ఈ తాళి ఏ రీతి విడనాడనే ?
ఎటుల ఈ సంఘాని కెదురీదనే ?
పది మంది నను చూచి పకపకా నవ్వరా !
నా పేరు, నా పరువు గంగలో కలపరా?

చరణం: 5
నీ నరాల నిండా పీరికి మందు
అరె కలేజ వుంటే ఉరుకుముందు
రాజ్యాలైనా రాకెట్లయినా
రమణులు నడిపే ఈ రోజులో
ఇంకా యెందుకు - వాదనలు - వేదనలు - రోదనలు
రా - తెంచుకొని రా తెలుసుకొని రా
భంధనాలెందుకు ఎందుకు ఎందుకు




యెక్కడికమ్మా ఈ పయనం ? పాట సాహిత్యం

 
చిత్రం: మంచిరోజులు వచ్చాయి (1972)
సంగీతం: టి.చలపతిరావు
సాహిత్యం: దాశరథి
గానం: ఘంటసాల

పల్లవి: 
యెక్కడికమ్మా ఈ పయనం ?
యేమిటి తల్లీ నీ గమ్యం?
చెదరిన హృదయముతో
చెమరిన కన్నులతో

చరణం: 1
కన్న ఇంటిలో చోటేలేదు
ఉన్న ఇంటిలో సుఖమే లేదు
చిరునవ్వులతో వెలిగే బ్రతుకే
చీకటి పాలై పోయెనులే

చరణం: 2
తెలియక చేసిన చిన్న నేరమే
కలకాలం నిను వెంటాడాలా ?
మమతలు చూపి మన్నించవలసిన
పతియే నీ పై పగబూనాలా ?

Palli Balakrishna Wednesday, April 13, 2022



చిత్రం: లక్ష్మీ నివాసం (1968)
సంగీతం: కె.వి.మహదేవన్ 
నటీనటులు: కృష్ణ, శోభన్ బాబు, అంజలీ దేవి, వాణిశ్రీ, భారతి , విజయ లలిత 
దర్శకత్వం: వి.మధుసూదనరావు
నిర్మాత: టి.గోవింద రాజన్ 
విడుదల తేది: 19.07.1968



Songs List:



నవ్వు నవ్వించు పాట సాహిత్యం

 
చిత్రం: లక్ష్మీ నివాసం (1968)
సంగీతం: కె.వి.మహదేవన్ 
సాహిత్యం: ఆరుద్ర 
గానం: పి. సుశీల 

నవ్వు..నవ్వించు..ఆ నవ్వులు పండించు
ఉహు..ఉహూహూ..నా ఊహలు లాలించు
నవ్వు..నవ్వించు..ఆ నవ్వులు పండించు
ఉహు..ఉహూహూ..నా ఊహలు లాలించు
నవ్వు..నవ్వించు..ఆ నవ్వులు పండించు

చరణం: 1
నాలో వయసుంది నవనవలాడింది
నీలో మనసుంది నిగనిగలాడింది
నాలో వయసుంది నవనవలాడింది
నీలో మనసుంది నిగనిగలాడింది
కువకువలాడే కోరికలన్నీ ఘుమఘుమలాడాలి
కువకువలాడే కోరికలన్నీ ఘుమఘుమలాడాలి

నవ్వు..నవ్వించు..ఆ నవ్వులు పండించు
ఉహు..ఉహూహూ..నా ఊహలు లాలించు
నవ్వు..నవ్వించు..ఆ నవ్వులు పండించు

చరణం: 2
ఎదుటను నీవుంటే ఏదో సిగ్గు సుమా
చిలిపిగ చూస్తూంటే..తలపులు రేగు సుమా
ఎదుటను నీవుంటే ఏదో సిగ్గు సుమా
చిలిపిగ చూస్తూంటే..తలపులు రేగు సుమా
రెక్కలు విప్పి టక్కరి వలపు రెపరెపలాడాలి 
రెక్కలు విప్పి టక్కరి వలపు రెపరెపలాడాలి

నవ్వు..నవ్వించు..ఆ నవ్వులు పండించు
ఉహు..ఉహూహూ..నా ఊహలు లాలించు
నవ్వు..నవ్వించు..ఆ నవ్వులు పండించు

చరణం: 3
ఆశలు పొంగాయి అల్లరి చేశాయి
నీలో ఉబలాటం..నాలో చెలగాటం
ఆశలు పొంగాయి అల్లరి చేశాయి
నీలో ఉబలాటం..నాలో చెలగాటం
తొందరచేసే అందం పూచి పందిరి వేయాలి
తొందరచేసే అందం పూచి పందిరి వేయాలి

నవ్వు..నవ్వించు..ఆ నవ్వులు పండించు
ఉహు..ఉహూహూ..నా ఊహలు లాలించు
నవ్వు..నవ్వించు..ఆ నవ్వులు పండించు




గువ్వలాంటి చిన్నది పాట సాహిత్యం

 
చిత్రం: లక్ష్మీ నివాసం (1968)
సంగీతం: కె.వి.మహదేవన్ 
సాహిత్యం: ఆరుద్ర 
గానం: పి. సుశీల 

గువ్వలాంటి చిన్నది తారా..జువ్వలాంటి చిన్నది
వెతుక్కొని వస్తే వెన్నలా కరిగిస్తే!
ఏంచేస్తావ్‌ ఏం చేస్తావ్‌..ఓ మొనగాడా
నువ్‌ ఏంచేస్తావ్‌ ఏం చేస్తావ్‌..ఓ మొనగాడా 

గువ్వలాంటి చిన్నది తారా..జువ్వలాంటి చిన్నది
వెతుక్కొని వస్తే వెన్నలా కరిగిస్తే!
ఏంచేస్తావ్‌ ఏం చేస్తావ్‌..ఓ మొనగాడా
నువ్‌ ఏంచేస్తావ్‌ ఏం చేస్తావ్‌..ఓ మొనగాడా
నువ్‌ ఏంచేస్తావ్‌ ఏం చేస్తావ్‌..ఓ మొనగాడా

చరణం: 1
మనసైనవాడివని సొగసైనవాడివని
ఆ నోట ఆ నోట విన్నదట
మనసైనవాడివని సొగసైనవాడివని
ఆ నోట ఆ నోట విన్నదట
ఆ విన్నదంత కళ్లారా కన్నదట
నీ గడుసుతనం చూడాలని నీ భరతం పట్టాలని
నిన్న రాత్రి కలలో..కన్నుగీటి పిలిచావని 
నలుగురిలో నిలవేస్తే 
ఏంచేస్తావ్‌ ఏం చేస్తావ్‌ ఓ మొనగాడా
నువ్‌ ఏం చేస్తావ్‌ ఏం చేస్తావ్‌ ఓ మొనగాడా
నువ్‌ ఏంచేస్తావ్‌ ఏం చేస్తావ్‌..ఓ మొనగాడా

చరణం: 2
ముచ్చటైన పొగరుబోతు కుర్రది..అది
పొంకమైన బింకమైన చిన్నది
ముచ్చటైన పొగరుబోతు కుర్రది..అది
పొంకమైన బింకమైన చిన్నది
ఆ పెంకిపిల్ల నిన్నే కోరుకున్నది 

నీ గుండె దొలుచుకుంది..నిన్ను వలచుకుంది
చల్లగాలి వీచువేళ..చందమామ కాచువేళ
చలిచలిగా వుందంటే..
ఏంచేస్తావ్‌ ఏం చేస్తావ్‌ ఓ మొనగాడా
నువ్వేం చేస్తావ్‌ ఏం చేస్తావ్‌ ఓ మొనగాడా
నువ్‌ ఏంచేస్తావ్‌ ఏం చేస్తావ్‌..ఓ మొనగాడా

చరణం: 3
సిరిసిరి మువ్వసుమా..చకుముకి రవ్వసుమా
చలగాటం పండించే గవ్వసుమా
సిరిసిరి మువ్వసుమా..చకుముకి రవ్వసుమా
చలగాటం పండించే గవ్వసుమా
నీ కన్నుల్లో నిలిచి వెలుగు దివ్వే సుమా
నీ జంటబాయనంది..నీ వెంటతిరుగుతుందీ
అందర్నీ మరచిపోయి..అయినవాళ్ళ నిడిచిపెట్టి
తనవేంతే రమ్మంటే
ఏంచేస్తావ్‌ ఏం చేస్తావ్‌..ఓ మొనగాడా
నువ్‌ ఏంచేస్తావ్‌ ఏం చేస్తావ్‌..ఓ మొనగాడా

ఆ..గువ్వలాంటి చిన్నది తారా..జువ్వలాంటి చిన్నది
వెతుక్కొని వస్తే వెన్నలా కరిగిస్తే!
ఏంచేస్తావ్‌ ఏం చేస్తావ్‌..ఓ మొనగాడా
నువ్‌ ఏంచేస్తావ్‌ ఏం చేస్తావ్‌..ఓ మొనగాడా 



బొట్టిరో మేనక పాట సాహిత్యం

 
చిత్రం: లక్ష్మీ నివాసం (1968)
సంగీతం: కె.వి.మహదేవన్ 
సాహిత్యం: ఆరుద్ర 
గానం: మాధవపెద్ది సత్యం 

బొట్టిరో మేనక 



కాలేజ్ జీతమ్ము పాట సాహిత్యం

 
చిత్రం: లక్ష్మీ నివాసం (1968)
సంగీతం: కె.వి.మహదేవన్ 
సాహిత్యం: ఆరుద్ర 
గానం: మాధవపెద్ది సత్యం 

కాలేజ్ జీతమ్ము 




చేయి చేయి కలుపు పాట సాహిత్యం

 
చిత్రం: లక్ష్మీ నివాసం (1968)
సంగీతం: కె.వి.మహదేవన్ 
సాహిత్యం: ఆరుద్ర 
గానం: పి.సుశీల, పి.బి.శ్రీనివాస్ 

పల్లవి:
చేయీ చేయీ కలుపు..చెంపా చెక్కిలి కలుపు
కేరింతలతో వూరింపులతో..కిలకిల కలకల నవ్వు

చేయీ చేయీ కలుపు..చెంపా చెక్కిలి కలుపు
కేరింతలతో వూరింపులతో..కిలకిల కలకల నవ్వు

చరణం: 1
నా కోర్కెలు గుర్రాలైతే..ఎగరేసుకుపోతా నిన్నే
నా కోర్కెలు గుర్రాలైతే..ఎగరేసుకుపోతా నిన్నే
నీవంతటి మగసిరివైతే..నా అందాలిచ్చెద నీకే
నీ కన్నుల కాపురముంటా..కనురెప్పల తలుపులు తియ్యి
నీ కన్నుల కాపురముంటా..కనురెప్పల తలుపులు తియ్యి
నీ నీడకు తోడుగ వుంటా..నీ బాసలు బాసట చెయ్యి 

చేయీ చేయీ కలుపు..చెంపా చెక్కిలి కలుపు
కేరింతలతో వూరింపులతో..కిలకిల కలకల నవ్వు

చరణం: 2
నీ వలపులు ఎంతో యింపు..నా దోసిలి నిండా నింపు
నీ వలపులు ఎంతో యింపు..నా దోసిలి నిండా నింపు
నిను వీడని మైకమునవుతా..నా మమతల మధువులచేత
నిను వీడని మైకమునవుతా..నా మమతల మధువులచేత
పది చేతులు నాకే వుంటే..బంధించెద బిగువుగ నిన్నే
పది చేతులు నాకే వుంటే..బంధించెద బిగువుగ నిన్నే
జవరాలిని పిడికిట నిలిపే..మొనగాడివి నువ్వే నువ్వే 

చేయీ చేయీ కలుపు..చెంపా చెక్కిలి కలుపు
కేరింతలతో వూరింపులతో..కిలకిల కలకల నవ్వు

చేయీ చేయీ కలుపు..చెంపా చెక్కిలి కలుపు
కేరింతలతో వూరింపులతో..కిలకిల కలకల నవ్వు
హా హా హా హా హా హా 




ఓహో ఊరించే అమ్మాయి పాట సాహిత్యం

 
చిత్రం: లక్ష్మీ నివాసం (1968)
సంగీతం: కె.వి.మహదేవన్ 
సాహిత్యం: ఆరుద్ర 
గానం: పి.సుశీల, పి.బి.శ్రీనివాస్ 

పల్లవి:
ఓహో..ఊరించే అమ్మాయీ..నేనేమి చేసేది
అందాల కన్నులు నన్ను..తొందర చేశాయి
నీ అందాల కన్నులు నన్ను..తొందర చేశాయి

ఓహో..వేధించే అబ్బాయి..నేనేమి చేసేది
చూపుల్లో కైపులు..నన్ను బిత్తర చేశాయి
నీ చూపుల్లో కైపులు..నన్ను బిత్తర చేశాయి
ఓహో..ఓఓఓఓఓఓఓఓ

చరణం: 1
నీ పైట చెంగు కొస ఎగిరింది
నా పడుచుగుండె ఉసి కొలిపింది
నీ పైట చెంగు కొస ఎగిరింది
నా పడుచుగుండె ఉసి కొలిపింది

నీ చిలిపి పెదవి నను పిలిచింది
నా చెక్కిలి ఓయని పలికింది
నీ చిలిపి పెదవి నను పిలిచింది
నా చెక్కిలి ఓయని పలికింది

ఓహో..ఊరించే అమ్మాయీ..నేనేమి చేసేది
అందాల కన్నులు నన్ను..తొందర చేశాయి
నీ చూపుల్లో కైపులు..నన్ను బిత్తర చేశాయి
ఓహో..ఓఓఓఓఓఓఓఓ

చరణం: 2
నీ ఓర చూపులో ఒగరుంది
నా దోర మనసులో పొగరుంది
నీ ఓర చూపులో ఒగరుంది
నా దోర మనసులో పొగరుంది 

నీ కోడె వయసులో వేడుంది
నా కొంటె తలపుతో రగిలింది
నీ కోడె వయసులో వేడుంది
నా కొంటె తలపుతో రగిలింది

ఓహో..వేధించే అబ్బాయి..నేనేమి చేసేది
చూపుల్లో కైపులు..నన్ను బిత్తర చేశాయి
నీ అందాల కన్నులు నన్ను..తొందర చేశాయి
ఓహో..ఓఓఓఓఓఓఓఓ

చరణం: 3
నీ లేత వలపు చిగురేసింది
విరజాజిలాగ పెనవేసింది
నీ లేత వలపు చిగురేసింది
విరజాజిలాగ పెనవేసింది

నా మేని సొగసు విరబూచింది
నీ కంటికి కానుక చేసింది
నా మేని సొగసు విరబూచింది
నీ కంటికి కానుక చేసింది

ఓహో..ఊరించే అమ్మాయీ..నేనేమి చేసేది
అందాల కన్నులు నన్ను..తొందర చేశాయి
నీ అందాల కన్నులు నన్ను..తొందర చేశాయి

ఓహో..వేధించే అబ్బాయి..నేనేమి చేసేది
చూపుల్లో కైపులు..నన్ను బిత్తర చేశాయి
నీ చూపుల్లో కైపులు..నన్ను బిత్తర చేశాయి
ఓహో..ఓఓఓఓఓఓఓఓ ఓహో..ఓఓఓఓఓఓఓఓ
ఓహో..ఓఓఓఓఓఓఓఓ....




ధనమేరా అన్నిటికీ మూలం పాట సాహిత్యం

 
చిత్రం: లక్ష్మీ నివాసం (1968)
సంగీతం: కె.వి.మహదేవన్ 
సాహిత్యం: ఆరుద్ర 
గానం: ఘంటసాల 

ధనమేరా అన్నిటికి మూలం 
ఆ ధనము విలువ తెలుసుకొనుట మానవ ధర్మం
ధనమేరా అన్నిటికి మూలం

మానవుడే ధనమన్నది స్రుజియించెనురా 
దానికి తానే తెలియని దాసుడాయెరా
ధనలక్ష్మిని అదుపులోన పెట్టినవాడే
గుణవంతుడు బలవంతుడు భగవంతుడురా

ధనమేరా అన్నిటికి మూలం

ఉన్ననాడు తెలివికలిగి పొదుపుచేయరా 
లేనినాడు ఒడలు వంచి కూడబెట్టరా
కొండలైన కరిగిపోవు కూర్చుని తింటే
హయ్యో కూలి పోవు కాపురాలు ఇది తెలియకుంటే..

ధనమేరా అన్నిటికీ మూలం
కూలివాని చెమటలో ధనమున్నదిరా
పాలికాపు కండల్లొ ధనమున్నదిరా
శ్రమజీవికి జగమంతా లక్శ్మీనివాసం
ఆ శ్రీదేవిని నిరశించుత తీరని ద్రొహం

ధనమేరా అన్నిటికి మూలం 
ఆ ధనము విలువ తెలుసుకొనుట మానవ ధర్మంం 




ఇల్లే కోవెల పాట సాహిత్యం

 
చిత్రం: లక్ష్మీ నివాసం   (1968)
సంగీతం: కె.వి.మహదేవన్ 
సాహిత్యం: ఆరుద్ర 
గానం: యస్. జానకి 

ఇల్లే కోవెల చల్లని వలపే దేవత
ఇల్లూ వలపూ వనితే వనిత
ఇల్లే కోవెల చల్లని వలపే దేవత
ఇల్లూ వలపూ నోచిన వనితే వనిత

నుదుట కుంకుమరేఖ కంటికి కాటుకరేఖ..
నుదుట కుంకుమరేఖ కంటికి కాటుకరేఖ
జడలో తెల్లని విరులు యువతికి తరగని సిరులు
జడలో తెల్లని విరులు యువతికి తరగని సిరులు
ఇల్లే కోవెల చల్లని వలపే దేవత
ఇల్లూ వలపూ నోచిన వనితే వనిత

తులసికోటలో దీపము
కలకాలము వెలిగే వరము
తులసికోటలో దీపము
కలకాలము వెలిగే వరము
చెలుని నవ్వుల స్నేహము
చెలుని నవ్వుల స్నేహము
నెలతకు జీవన భాగ్యము
ఇల్లే కోవెల చల్లని వలపే దేవత
ఇల్లూ వలపూ నోచిన వనితే వనిత

చదువులు ఎన్నో చదివిన
పదవులు ఎన్నో ఏలిన
చదువులు ఎన్నో చదివిన
పదవులు ఎన్నో ఏలిన
చివరకు గృహిణిగ మారే
పడతుల బ్రతుకే - ధన్యం
చివరకు గృహిణిగ మారే
పడతుల బ్రతుకే - ధన్యం
ఇల్లే కోవెల చల్లని వలపే దేవత
ఇల్లూ వలపూ నోచిన వనితే వనిత





సోడా సోడా ఆంధ్రా సోడా పాట సాహిత్యం

 
చిత్రం: లక్ష్మీ నివాసం   (1968)
సంగీతం: కె.వి.మహదేవన్ 
సాహిత్యం: ఆరుద్ర 
గానం: పిఠాపురం నాగేశ్వరరావు 

పల్లవి:
సోడా సోడా ఆంధ్రసోడా గోలిసోడా జిల్ జిల్ సోడా
సోడా సోడా ఆంధ్రసోడా గోలిసోడా జిల్ జిల్ సోడా
సోడా సోడా ఆంధ్రసోడా గోలిసోడా జిల్ జిల్ సోడా
సోడాతాగు తెలుగోడా చల్లని సోడా
దీని మహిమ చెప్పలేడు దేవుడు కూడా
సోడాతాగు తెలుగోడా చల్లని సోడా
దీని మహిమ చెప్పలేడు దేవుడు కూడా
సోడా సోడా ఆంధ్రసోడా గోలిసోడా జిల్ జిల్ సోడా

చరణం: 1
సోడా నెత్తి మీద గంగవున్న ఈశ్వరుడైనా అహ
నిత్య సుధలు తాగుతున్న దేవతలైనా
నేత్తి మీద గంగవున్న ఈశ్వరుడైనా అహ
నిత్య సుధలు తాగుతున్న దేవతలైనా
ఆంధ్రసోడా కోరికోరి తాగుతారోయ్
అది లేకుంటే వడదెబ్బకు వాడుతారోయ్
సోడా సోడా ఆంధ్రసోడా గోలిసోడా జిల్ జిల్ సోడా

చరణం: 2
నాయకులు చెప్పేది ఉత్తగ్యాసు..ఊ..
వినాయకుల చప్పట్లు శుద్ధ గ్యాసు
నాయకులు చెప్పేది ఉత్తగ్యాసు
వినాయకుల చప్పట్లు శుద్ధ గ్యాసు
పోసుకోలు పాలిటిక్స్ పరమ గ్యాసు
వాటికన్నా ఉపయోగం సోడా గ్యాసు
సోడా సోడా ఆంధ్రసోడా గోలిసోడా జిల్ జిల్ సోడా

చరణం: 3
ఒక్క గుక్క తాగి చూడు మండుటెండలో అహ
హిమాలయం చల్లదనం నీ గొంతుకలో
ఒక్క గుక్క తాగి చూడు మండుటెండలో అహ
హిమాలయం చల్లదనం నీ గొంతుకలో
రాళ్ళు తిని తాగితే జీర్ణమవ్వాలి
నీళ్ళు తాగితే సగం కడుపు నిండాలి
సోడా సోడా ఆంధ్రసోడా గోలిసోడా జిల్ జిల్ సోడా
సోడాతాగు తెలుగోడా చల్లని సోడా
దీని మహిమ చెప్పలేడు దేవుడు కూడా
సోడా సోడా ఆంధ్రసోడా

Palli Balakrishna Tuesday, November 30, 2021

Most Recent

Default