Home Movie Songs Latest Updated Movies Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box



చిత్రం: ఆ ఒక్కటి అడక్కు (1992)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: వేటూరి
గానం: యస్. పి.బాలు, జానకి
నటీనటులు: రాజేంద్రప్రసాద్ , రంభ
దర్శకత్వం: ఇ. వి.వి.సత్యన్నారాయణ
నిర్మాతలు: యమ్.శరవణన్, యమ్.బాలసుబ్రమణియం
విడుదల తేది: 19.09.1992

పావురమా పావురమా మన బ్రతుకే పంజరమా
కన్నులలో కాపురమా అందని ఓ గోపురమా
పావురమా పావురమా మన బ్రతుకే పంజరమా

వెన్నెల్లో మల్లెపూల మంచం వేసి ఉంచాను
అందాల మందారాల గందలెన్నో దాచాను
కళ్ళల్లో వత్తులు వేసి నీకై వేచి ఉన్నాను
వెచ్చని నీ కౌగిలిలోన ఒకటై పోదామన్నాను
వన్నెల పామై కరిచిన వేళ
కన్నుల ఆశ కరిగిన వేళ
జాలైన లేనేలేదా రానేరాదా నీకింకా
ఈ బాధ తీరేదెట్టా నువ్వే చెప్పు నాకింకా

పావురమా పావురమా మన బ్రతుకే పంజరమా
కన్నులలో కాపురమా అందని ఓ గోపురమా
పావురమా పావురమా మన బ్రతుకే పంజరమా

ఎన్నాళ్లీ ఉపవాసాలు ఎన్నాళ్ళమ్మా వనవాసం
శివరాత్రి రాకుండానే చేస్తున్నానే జాగారం
ఆకుంది వక్కా ఉంది రెండూ కలిసేదేనాడో
పరువాల తాంబూలంతో పెదవుల పండేదేనాడో
నెమ్మదిలేని తుమ్మెద గోల
తుమ్మెద రాని పువ్వున జ్వాల
ఎన్నెన్నో కలలే కన్నా నిన్నా నేడు నీకోసం
మౌనంగా ఏడుస్తున్నా నాలో నేను మనకోసం

పావురమా పావురమా మన బ్రతుకే పంజరమా
కన్నులలో కాపురమా అందని ఓ గోపురమా
పావురమా పావురమా మన బ్రతుకే పంజరమా

Most Recent

Default