Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Results for "S. P. Kodandapani"
Lakshmi Kataksham (1970)



చిత్రం: లక్ష్మీ కటాక్షం (1970)
సంగీతం: యస్. పి. కోదండపాణి 
సాహిత్యం: చిల్లర భావన్నారాయణ, డా॥ సి.నారాయణరెడ్డి 
నటీనటులు: యన్.టి.రామారావు, కె.ఆర్.విజయ, రాజశ్రీ 
దర్శకత్వం: బి.విఠలాచార్య 
నిర్మాత: పింజల సుబ్బారావు 
విడుదల తేది: 12.03.1970



Songs List:



శుక్లాంబర ధరం విష్ణుమ్ పాట సాహిత్యం

 
చిత్రం: లక్ష్మీ కటాక్షం (1970)
సంగీతం: యస్. పి. కోదండపాణి 
సాహిత్యం: చిల్లర భావన్నారాయణ
గానం: మాధవ పెద్ది, సావిత్రి

శుక్లాంబర ధరం విష్ణుమ్ శశివర్ణమ్ చతుర్భుజమ్
శుక్లాంబర ధరం విష్ణుమ్ శశివర్ణమ్ చతుర్భుజమ్
ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోప శాంతయే
ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోప శాంతయే



సకల విద్యామయీ పాట సాహిత్యం

 
చిత్రం: లక్ష్మీ కటాక్షం (1970)
సంగీతం: యస్. పి. కోదండపాణి 
సాహిత్యం: చిల్లర భావన్నారాయణ
గానం: ఘంటసాల 

సకల విద్యామయీ ఘన శారదేందు
రమ్య పాండుర రూపిణీ రాజతార్థ 
విద్యలెల్లను నేర్చితి, విమల మార్గ 
దీక్ష నడిపింపుమా, భారతీ నమస్తే




నాదు గురుదేవు కార్యార్ధి పాట సాహిత్యం

 
చిత్రం: లక్ష్మీ కటాక్షం (1970)
సంగీతం: యస్. పి. కోదండపాణి 
సాహిత్యం: చిల్లర భావన్నారాయణ
గానం: ఘంటసాల 

నాదు గురుదేవు కార్యార్ధి నౌచు నేడు
వచ్చితిని, ఎట్టి విఘ్నముల్ బడయకుండ
కరుణ దీవింప వేడితి కరము మోడ్చి
విజయమును గూర్పుమా! నమో విఘ్నరాజా ! !




పొన్న చెట్టు మాటున పాట సాహిత్యం

 
చిత్రం: లక్ష్మీ కటాక్షం (1970)
సంగీతం: యస్. పి. కోదండపాణి 
సాహిత్యం: డా॥ సి.నారాయణరెడ్డి 
గానం: యస్.జానకి 

పొన్న చెట్టు మాటున పొద్ధువాలి పోయింది
గున్న మావి గుబురున కోయలమ్మ కూసింది

పల్లవి: 
హేయిరే పైరుగాలి ఆగి ఆగి యిసిరింది.
అరెరె పైట చెంగు ఆగలేక ఎగిరింది.
వయసే వాగులాగ దూకింది.
గుండెలో కొండమల్లె గుబాళించి నవ్వింది

చరణం: 1
గడుసరి సూరీడు పడమట చేరాడు
ఇంపైన సందెపడుచు చెంపలు రెండు గిలాడు
అది తలచుకుంటె వలమాలిన పులకరింత
అది తెలుసుకుంటే చిలిపి సిగుల చిలకరింత

చరణం: 2
నచ్చిన చినవాడు మెచ్చిన జతగాడు
నాపైన మనసుపడి రేపో మాపో రాకపోడు
వాడు వెంటబడితే జంట గూడితే యెన్నెలపంట
వాడి కంటి పాపలో కొంటె సూపునై కాపురముంటా




కిలకిల బుల్లెమ్మా పాట సాహిత్యం

 
చిత్రం: లక్ష్మీ కటాక్షం (1970)
సంగీతం: యస్. పి. కోదండపాణి 
సాహిత్యం: కొసరాజు రాఘవయ్య 
గానం: ఘంటసాల, యస్.జానకి 

కిలకిల బుల్లెమ్మా ! ఒహెు! ఒహెు
కిలాడి బుల్లెమ్మా
నీ ఒంటిమీద చెయ్ ఎయ్యంగానే వులిక్కి పడతావే

బడాయి మాఁవయ్యో: ఉహు: ఉహు: ఉహు:
ఆడావు డేందయ్యో!
నువు పట్టపగులే నను పట్టుకొందవూ
పరువు పోతదయ్యో

నీ బి త్తర సూపులు సూసీ
నీ నడకల వూపులు సూసీ
నా మనసూ జిల్ జిల్ మంటాదే
సేతులోన సిక్కినావు, బూకరించి పోలేవు
సిగ్గు వొదిలి రావే నాదానా

కన్నెపడుచు కంటబడితే
నమ్మి కాస్త దగ్గరకొస్తే
మొగ వోళ్లూ సైగలు చేస్తారూ
ఒళ్ళుపైన తెలుసు కోరు
యెనక ముందు సూసుకోరు
యెర్రెక్కి పైన బడతారూ

మీ సంగతి తెలుసును లేవే
ముందట్టా చెబుదురులేవే
నేనెరగని వాళ్లా పోవే
ఎగిరి ఎగిరి పడతారు
బిగువు కాస్త సూపుతారు
సల్లంగ దారి కాస్తారూ !
ఎవరూ ?
మీరూ!
అవ్వ !
అవ్వలేదు బువ్వలేదు రా
నవ్వులాట కాదులే పో పో
రా - పో
రా - పో




గత సువిజ్ఞాన పాట సాహిత్యం

 
చిత్రం: లక్ష్మీ కటాక్షం (1970)
సంగీతం: యస్. పి. కోదండపాణి 
సాహిత్యం: చిల్లర భావన్నారాయణ
గానం: ఘంటసాల 

గత సువిజ్ఞాన ప్రకాశమ్ము మరల
కల్గించితివి తల్లీ కారుణ్యవల్లీ
జయ తిమిరి నిర్దూత దరహాస వల్లరీ
జయప్రణవ నాదాత్త ఝంకార బంభరీ
సకల సంపత్కరీ జ్ఞానేశ్వరీ నమో ...




జో జో లాలి లాలి పాట సాహిత్యం

 
చిత్రం: లక్ష్మీ కటాక్షం (1970)
సంగీతం: యస్. పి. కోదండపాణి 
సాహిత్యం: చిల్లర భావన్నారాయణ
గానం: పి.సుశీల 

జో జో 
లాలి లాలి లాలీ
చిన్నారి పాపాయి లాలీ
ఎన్నెన్ని జన్మాల
పుణ్యాల ఫలమో
ఈ తల్లి ఒడిలోన
వెలిశావు తండ్రీ

నా కంటి పాపా
నిదురింప వోయీ
నా పాల యెదలోని
దీపాని వోయీ
హాయీ హాయీ హాయీ!



అమ్మమ్మమ్మమ్మమ్మమ్మొ తెలిసిందిలే పాట సాహిత్యం

 
చిత్రం: లక్ష్మీ కటాక్షం (1970)
సంగీతం: యస్. పి. కోదండపాణి 
సాహిత్యం: డా॥ సి.నారాయణరెడ్డి 
గానం: ఘంటసాల, పి.సుశీల 

పల్లవి: 
అమ్మమ్మమ్మమ్మమ్మమ్మొ తెలిసిందిలే
గుట్టు తెలిసిందిలే
నీ రూపులోన నీ చూపులోన
ఏ రాచ కళలో మెరిసేననీ
అమ్మమ్మమ్మమ్మమ్మమ్మొ తెలిసిందిలే
గుట్టు తెలిసిందిలే ఆద్యుడేద
ఏ కొంటె ఎరుడో
గంధర్వ వీరుడో
నా కళ లోన నవ్వేననీ

చరణం: 1
కులికే వయసే పులకించిపోగా
కొంగు ఆగుతుందా ఎదలో కదలే
పొంగు ఆగుతుందా
పువ్వల్లే మారిపోయి - ముద్దుల్లో తేలిపోయి
కవ్విస్తే కన్నె మనసు ఆగుతుందా

చరణం: 2
వలచే జాబిలి యిలపైన రాగా
కలువ దాగుతుందా విరిసే మురిసే తలపు దాగుతుందా
తీగల్లే అల్లుకుంటే - ఓ ఓ
గుండెలో ఝలుషంటే ఆమె: ఓ ఓ
దాచినా దోరవలపు దాగుతుందా




రా వెన్నెల దొరా పాట సాహిత్యం

 
చిత్రం: లక్ష్మీ కటాక్షం (1970)
సంగీతం: యస్. పి. కోదండపాణి 
సాహిత్యం: డా॥ సి.నారాయణరెడ్డి 
గానం: ఘంటసాల, పి.సుశీల 

ఆహా హ అహ హ
అహ హ ఓహో ఓ ఓ
ఆహ హ హా
రా వెన్నెల దొరా కన్నియను చేరా
రా కన్ను చెదర వేచితిని రా రా ఆ ఆ ఆ
రా వెన్నెల దొరా కన్నియను చేరా
రా కన్ను చెదర వేచితిని రా రా ఆ ఆ ఆ

ఈ పాల వెన్నెలలోన నీ నీలి కన్నులలోనా
ఈ పాల వెన్నెలలోన నీ నీలి కన్నులలోనా
ఉన్నానులేవే ప్రియతమా ఆ ఆ
నీ మగసిరి నగవులు చాలునులే
నీ సొగసరి నటనలు చాలునులే
నీ మనసైన తారను నే కానులే
రా వెన్నెల దొరా వింత కనవేరా
రా చిలకవౌరా అలిగినదిలే రా ఆ ఆ ఆ

ఈ మబ్బు తెరచాటేలా ఈ నింగి పయణాలేలా
ఈ మబ్బు తెరచాటేలా ఈ నింగి పయణాలేలా
ఎద నిండిపోరా చందమా ఆ ఆ
నీ పగడపు పెదవుల జిగి నేనే
నీ చెదరని కౌగిలి బిగి నేనే
నా ఎద నిండ నీవే నిలిచేవులే
రా వెన్నెల దొరా కన్నియను చేరా
రా కన్ను చెదర వేచితిని రా రా ఆ ఆ ఆ

రా వెన్నెల దొరా వింత కనవేరా
రా చిలకవౌరా అలిగినదిలే రా ఆ ఆ ఆ





నా వయసు సుమగంధం పాట సాహిత్యం

 
చిత్రం: లక్ష్మీ కటాక్షం (1970)
సంగీతం: యస్. పి. కోదండపాణి 
సాహిత్యం: చిల్లర భావన్నారాయణ 
గానం: పి.సుశీల, విజయలక్ష్మి 

నా వయసు సుమగంధం
నా మనసు మకరందం
కొని పోవోయి వలపుల నా రాజా
అందగాడా జలకాలాడే
సుందరి నీకె వేచిందీ.
సిగు సింగారాల బిగువూ చూచె లేవే
సిగ్గు నిండారంగ నిన్నే కోరి చేరె

అయ్యొ, యింతేన మరియే మొ
అనుకున్నానూ
వేడి రగిలే విరహం సాగె
చెంతకు రాడేమె చెలికాడు
ప్రేమ బాణం నీపై
గురిపెట్టాడే భామ
అయ్యొ యేమౌతావో, చక్కని చెక్కెర బొమ్మ
ఏమె యీ బాధ పడలేనెయీ వేళా



స్వాగతం స్వాగతం పాట సాహిత్యం

 
చిత్రం: లక్ష్మీ కటాక్షం (1970)
సంగీతం: యస్. పి. కోదండపాణి 
సాహిత్యం: చిల్లర భావన్నారాయణ 
గానం: పి.లీల, యస్.జానకి & కోరస్ 

స్వాగతం స్వాగతం
శాత్రవ జన జైత్ర స్వాగతం
సుకృతావతార దయ సేయుమురా
రతనాల బాట పయనింపుమురా
రతి రాజ సార

రణరంగధీర
వర శుభ గుణ సువదన భూరి భూరమణ
పూజ తాబ చరణా

పూబాల వికసించె నీ నవ్వులో
భూమాత పులకించె నీ దారిలో
పున్నెము పురివిచ్చె
వన్నెల సిరి హెచ్చె
అందాలె నిను మెచ్చె
ఈవు యేజనని నోముపంట వవురా
శ్రీ దేవి నెలకొన యీ మందిరం
రారాజ వరులైన రాదుర్లభం
రమ్మిటు జయశీల
రంజిత జనపాల

నీ మ్రోల రసలీల
మువ్వలే పలికె
దివ్వెలే కులి కెరా




ధన్యోస్మి ధన్యోస్మి పాట సాహిత్యం

 
చిత్రం: లక్ష్మీ కటాక్షం (1970)
సంగీతం: యస్. పి. కోదండపాణి 
సాహిత్యం: చిల్లర భావన్నారాయణ 
గానం: ఘంటసాల 

ధన్యోస్మి ధన్యోస్మి త్రైలోక్యమాతా
శ్రీమన్మహా సర్వలోక ప్రవృత్తి ప్రకాశావకాశ ప్రభాకారిణీ!
పావనీ ! నిత్యసౌభాగ్య సంపన్న సంవర్దినీ, శ్రీమహాలక్ష్మి
మాణిక్య సౌవర్ల హేరాళ హారావళీ రంజితా మేయ
చాంపేయ గాత్రీ పయోరాశిపుత్రీ ! నమోవిష్ణు పత్నీ
నమస్తే, నమస్తే, నమస్తే, నమం




శుక్రవారపు పొద్దు పాట సాహిత్యం

 
చిత్రం: లక్ష్మీ కటాక్షం (1970)
సంగీతం: యస్. పి. కోదండపాణి 
సాహిత్యం: చిల్లర భావన్నారాయణ 
గానం: యస్.జానకి 

శుక్రవారపు పొద్దు సిరిని విడువద్దు
దివ్వె నూదగవద్దు బువ్వ నెట్టద్దు 
తోబుట్టువుల మనసు కష్ట పెట్టద్దు 
తొలి సంజ మలిసంజ నిదుర పోవద్దు
మాతల్లి వరలక్ష్మి నిను వేడదపుడు
ఇల్లాలు కంట తడి పెట్టనీ యింట
కల్లలాడని యింట గోమాత వెంట
ముంగిళ ముగ్గులో పసుపు గడపల్లో
పూలలో పాలల్లో ధాన్య రాసుల్లో
మా తల్లి మహాలక్ష్మి స్థిరముగా నుండు




అందాల బొమ్మను నేను చెలికాడ పాట సాహిత్యం

 
చిత్రం: లక్ష్మీ కటాక్షం (1970)
సంగీతం: యస్. పి. కోదండపాణి 
సాహిత్యం: విశ్వప్రసాద్ 
గానం: ఎల్. ఆర్. ఈశ్వరి 

అందాల బొమ్మను నేను చెలికాడ
మందార వల్లిని నేను విలుకాడ
ముద్దు ముద్దుగా హాయి హాయిగా చేరరారా..
చేరిపోరా మోహన రాజా మన్మధ రాజా

నీలో కదిలే కోరిక లేవో
నీలో మెదిలే లాలసలేవో
మారాము చేసెను లేరా
గారాలు ముగించి రారా
తనువంతా తీయని తాపమురా
తనువంతా తీయని తాపమురా
నాలో మెరిసే అందము నీదే
నాలో కురిసే చందము నీదే
జాగేలా వేగిర లేరా-కౌగిట్లో బిగించ రారా
నిను కోరి చేరిన భామనురా




జయ జయ మహాలక్ష్మి పాట సాహిత్యం

 
చిత్రం: లక్ష్మీ కటాక్షం (1970)
సంగీతం: యస్. పి. కోదండపాణి 
సాహిత్యం: చిల్లర భావన్నారాయణ 
గానం: యస్.జానకి 

జయ జయ మహాలక్ష్మి
జయ మహాలక్ష్మి
ఈ దివ్య కథ చూడ యేతెంచినట్టి
అందరికి అలరారు అఖిల భోగాలు
సకల సౌక్యమ్ములు సర్వ సంపదలు
పిల్లల పాపలు కొలంగ సిరులు
కలుగంగ దీవించి
తరుణించవమ్మా
కరుణించవమ్మా
ఓ మహాలక్ష్మి
శ్రీ మహాలక్ష్మి
జయ మహాలక్ష్మి

Palli Balakrishna Wednesday, December 6, 2023
Jagath Jetteelu (1970)



చిత్రం: జగత్ జెట్టిలు (1970)
సంగీతం: ఎస్.పి.కొదండపాణి
సాహిత్యం: దేవులపల్లి కృష్ణ శాస్త్రి, కోసరాజు రాఘవయ్య చౌదరి, కోడకండ్ల అప్పలచార్య
గానం: యస్.పి.బాలు, మాధవపెద్ది సత్యం, పి.సుశీల, ఎల్.ఆర్. ఈశ్వరి
నటీనటులు: శోభన్ బాబు, వాణిశ్రీ, రేణుక, విజయలలిత, చంద్రమోహన్, స్నేహ ప్రభ (నూతన తార)
కథ: విజయబపినీడు
అసోసియేట్ డైరెక్టర్స్: దాసరి నారాయణరావు, ఎం.ఎస్. కోటా రెడ్డి
దర్శకత్వం: కె.వి. నందనరావు
నిర్మాతలు: పి.ఏకామ్రేశ్వరరావు, కె. రాఘవ
విడుదల తేది: 18.06.1970



Songs List:



జానీ జింజర్ జానీ జింజర్ పాట సాహిత్యం

 
చిత్రం: జగత్ జెట్టిలు (1970)
సంగీతం: ఎస్.పి.కొదండపాణి
సాహిత్యం: కోసరాజు రాఘవయ్య చౌదరి
గానం: ఎల్.ఆర్. ఈశ్వరి

జానీ జింజర్ జానీ జింజర్ సైరా సర్దారు
వారే వారే వా వా | భలే హుషారు |
తిరుగులేదు మనదెబ్బకు తిరుగులేదురా
తిరుగులేదు మన దెబ్బకు తిరుగులేదురా!

రాయి రాయి రాసుకుంటే నిప్పు పుడతదీ ।
మీ చేయి చేయి కలిపితే డబ్బూడిపడతదీ
నిప్పుకు గాలికి యిప్పుడు నేస్తమయ్యింది
ఇక చూస్కో నారాజా మజాగుంటదీ॥
కొండనైన పిండిపిండిగ కొట్టేస్తారూ ।
అ కొండమీద కోతినైన దింపేస్తారూ||
సాటిలేని మేటి వీరసింహులుమీరు
మీ ధాటి కెదురులేరు ! ఎదురైతే బ్రతికిపోరు

పడుచుపిల్ల కాస్త ప్రక్కనుంటేచాలు |
ఎంతపనినైనా చిటికెలోన చెయ్యగవీలు||
మన ముగ్గురమొకటైతే ఇంకేముందీ ।
అనుకున్నది చేతిలోకి చిక్కిపోతుందీ |
మనకు దక్కిపోతుందీ




చిరునవ్వు దివ్వె ఏమన్నది పాట సాహిత్యం

 
చిత్రం: జగత్ జెట్టిలు (1970)
సంగీతం: ఎస్.పి.కొదండపాణి
సాహిత్యం: దేవులపల్లి
గానం: పి.సుశీల, ఎల్. ఆర్. ఈశ్వరి & బృందం

చిరునవ్వు దివ్వె ఏమన్నదీ
అరమోడ్పు కన్నులేమన్నదీ
తనకున్న మున్నె మగడున్నచోటికి
మనసుపోయేనంటున్నదీ

లేడిలా మనసు పరుగిడినా
వగలాడి ఆ బిగువెందులకే
వేడికోరికల దాడులకే పూబోణి రవ్వంత జంకెనులే
తొలినాటివేనే ఈ బిగువు| ఒక రాతిరేనే ఈ బెదురు
ఆ పైన మనవైపు చూడదులే

ఇంతి ముంగురులు సరదవే
వెన్నెల రాసి నొకపరి చూడాలి
ఎంతమురిపాలె అన్నకు
తన చెల్లి సొగసులు చూసుకొని
అల్లారు మేనల్లు నెత్తుకొని అంతలో తిరిగివచ్చుననీ
శ్రీవారితో ముందే చెప్పాలనీ

కలికిరో కలువరేకులలో
కనిపించు ఆ మంచు ఎందులకే
కమ్మగా వరుని విరిపాన్పు
రమ్మంటే వలపుల విందులకు
వింత తళుకులూ విరిశాయి ఏదో విశేష మీరేయీ
కదలవే మదనుకొలువునకు




షోకైన మల్లెపువ్వుమీద పాట సాహిత్యం

 
చిత్రం: జగత్ జెట్టిలు (1970)
సంగీతం: ఎస్.పి.కొదండపాణి
సాహిత్యం: అప్పలాచార్య
గానం: ఎల్. ఆర్. ఈశ్వరి 

(Note: ఇది ఆడియో వెర్షన్,  వీడియో వెర్షన్ లో కొన్ని మర్పులు చేశారు)

షోకీల్లా పిల్లా బుగ్గమీద
ముద్దిచ్చే మోజు నీకులేదా
ఉంటేలే-లే-లేచి రా-రా- రా
నీకు వైకుంఠమే చూపుతా

ఈ మగువ నవ్వులలో నా బిగువు కౌగిలిలో
మత్తు ఉందీ | గమ్మత్తు ఉంది.
రంజైన సుఖముంది రా
ఒక్కసారీ చిక్కితేనూ
ఇక పైన పోలేవురా

ఈ మేని ఒంపులలో లేమెరుపు చూపిస్తా
తేనెలూరే వయసులోని
రుచి నీకు అందించుతా
నిన్నలేదు రేపుదూ
జల్సాగ జీవించరా




అంబ పలుకవే జగదంబ పలకవే పాట సాహిత్యం

 
చిత్రం: జగత్ జెట్టిలు (1970)
సంగీతం: ఎస్.పి.కొదండపాణి
సాహిత్యం: కొసరాజు
గానం: యస్.పి.బాలు, మాధవపెద్ది సత్యం, పి.సుశీల

అంబ పలకవే జగదంబ పలకవే
కొండకింద కోటమ్మ పలకవే
ఎక్కడ వున్నావే తల్లీ ఏమైపోయినావే
ఎక్కడ వున్నావే తల్లీ ఏమైపోయినావే

టక్కుటమారం నేర్చినోళ్ళు
నిను చిక్కించుకోను చూస్తారే
పక్కన పొంచులు వేస్తారే
బొందిలో ప్రాణం ఉండువరకు
ఆ చవటల ఆటలు సాగనియ్యమే
ఆ చవటల ఆటలు సాగనియ్యమే

ఎదురుగానే నీవున్నావా.
ఎవరికి కనపడకున్నావా
లోకోద్ధరణకు పుట్టావమ్మా
నీకు సాటి ఎవరమ్మా బొమ్మా

నీదయ మాపై ఉంటేచాలు
మట్టినైన మాణిక్యం చేస్తాం
రాళ్ళనైన రత్నాలుగ చేస్తాం
దేశద్రోహుల నాశంచేసి
ఆశాజ్యోతుల వెలిగిస్తాం

Palli Balakrishna Tuesday, November 28, 2023
Jagath Janthreelu (1971)



చిత్రం: జగత్ జంత్రీలు (1971)
సంగీతం: కోదండపాణి 
సాహిత్యం: కొసరాజు రాఘవయ్య, విజయరత్నం
గానం: ఘంటసాల, పి.సుశీల , యస్.పి.బాలు, ఎల్. ఆర్. ఈశ్వరి 
నటీనటులు: శోభన్ బాబు, వాణిశ్రీ, రేణుక
కథ, మాటలు, అసోసియేట్ డైరెక్టర్: దాసరి నారాయణరావు 
దర్శకత్వం: పి.లక్ష్మీదీపక్
నిర్మాతలు: పి.ఏకామ్రేశ్వరరావు
విడుదల తేది: 30.12.1971



Songs List:



ఎక్కడున్నాడో వాడు ఎక్కడున్నాడో పాట సాహిత్యం

 
చిత్రం: జగత్ జంత్రీలు (1971)
సంగీతం: కోదండపాణి 
సాహిత్యం: విజయరత్నం
గానం: ఎల్. ఆర్. ఈశ్వరి 

ఎక్కడున్నాడో వాడు ఎక్కడున్నాడో




హరి ఓం హరి ఓం ఆనరా పాట సాహిత్యం

 
చిత్రం: జగత్ జంత్రీలు (1971)
సంగీతం: కోదండపాణి 
సాహిత్యం: విజయరత్నం
గానం: యస్.పి.బాలు 

హరి ఓం హరి ఓం ఆనరా
అల్బిత్తిరిలకు కాలం గదరా
హరి ఓం హరి ఓం ఆనరా

చరణం: 1
ఎందరి కొంపలు తియ్యందే వీడింతవాడెలా అయ్యాడు
వీడి గుబీ తియ్యాలని వీరబ్రహ్మం చెప్పాడు

హరి ఓం హరి ఓం ఆనరా
అల్బిత్తిరిలకు కాలం గదరా


చరణం: 2
నిప్పు నీరు గాలి నేల నీవి నావి అన్నారు
డబ్బు జూడ అందరి దేనిని కై దెబ్బకొడితె రైతన్నారు 
హరి ఓం హరి ఓం ఆనరా
అల్బిత్తిరిలకు కాలం గదరా

చరణం: 3
పాపం పుణ్యం అనుకోకుండా పైసా సంపాదించాలోయ్ 
జేబులు బాగా నిండిన పిమ్మట
గుళ్లు గోపురాల్ కట్టాలోయ్

చరణం: 4
జిందాబాద్  జిందాబాద్ 
సోషలిజం కావాలని లెక్చరు దంచేస్తారూ
పార్టీ మార్చేస్తారూ ఆ తరువాత .....
సొంతం మీదకు ముంచుకు వస్తే 
శోష వచ్చి పడిపోతారు



చీరియో టాటా ? పాట సాహిత్యం

 
చిత్రం: జగత్ జంత్రీలు (1971)
సంగీతం: కోదండపాణి 
సాహిత్యం: విజయరత్నం
గానం: ఎల్. ఆర్. ఈశ్వరి 

పల్లవి: 
చీరియో టాటా ?
కన్నులనిండా కైపులువుంటే నో ఫియర్
మై డియర్ - కం నియర్
వెన్నెలకన్నా వెచ్చనిహాయి ఐయాం హియర్
తారనై లేచి యున్నానురా -
చంద్రుడా సాగి రావేమిరా రా 

చరణం: 1
నాకురులు నీలాల మేఘాలుగా
నా కనులు ఆకాశ దీపాలుగా
రేయిలో – హాయివై ఆడుకో - పాడుకో
తనువులో - అణుపుగా నిలిచిపోవాలిరా....

చరణం: 2
నామధుర గానాలు నీ మధువుగా
ఈ వలపులోకాలు కనువిందుగా
చెలిమిలో కలిమివై ఏలుకో ఏలికా
ఒకరిలో ఒకరమై ఇమిడి పోవాలిరా




పచ్చజొన్న చేనుకాడ చూచానయ్యో పాట సాహిత్యం

 
చిత్రం: జగత్ జంత్రీలు (1971)
సంగీతం: కోదండపాణి 
సాహిత్యం: కొసరాజు రాఘవయ్య 
గానం: ఘంటసాల, పి.సుశీల 

పచ్చజొన్న చేనుకాడ చూచానయ్యో
నువ్వు పై లాపచ్చీసుమీద వున్నావయ్యో
అబ్బ - పండువంటి కన్నె మనసు లాగేవయ్యో

పచ్చజొన్న చేనుకాడా చూచానమ్మీ
నువ్వూ - దొంగచూపులతోటి మనసు దోచావమ్మీ
అబ్బ - తిప్పుకుందామంటే తిరిగి రాదోలమ్మీ 

కమ్మని నీ కౌగిట్లో రంజుగ కులకాలని నాకున్నది
కసిదీరంగా నాలుగు చేతులు కలపాలని నాకున్నది
ఇద్దరి ఆశలు తీరేవేళ దగ్గరలోనే వున్నది
అందాకా అమ్మాయిగారిని తమాయించమంటున్నది 

ఎన్ని జన్మలు మారిన నువ్వే కావాలని నేనంటాను
కన్నుమూసినా కలలో నువ్వే రావాలని అనుకుంటాను
నీడల్లే నీజాడ తెలుసుకొని కొంగుబట్టు కొని వస్తాను
నువ్వు వదిలినా నేను వదలనని నీళ్ళలో మునిగిచెబుతాను

కాదుకూడదని ఠలాయిస్తివా పక్కనబావి ఉందయ్యో
అవునని తలవూపావా చూస్కో కందిచేను పెరిగుందయో
చూపులు రెండూ ఏకమైనపుడు మాటలపని ఏమున్నది
పూల తెప్పపై జోరుజోరుగా తేలిపోతె హాయున్నది 




నీ మనసులోకి రావాలీ కాపురానికీ పాట సాహిత్యం

 
చిత్రం: జగత్ జంత్రీలు (1971)
సంగీతం: కోదండపాణి 
సాహిత్యం: విజయరత్నం
గానం: పి.సుశీల, యస్.పి.బాలు 

నీ మనసులోకి రావాలీ కాపురానికీ
నే అద్దె ఎంత యివ్వాలీ మాసానికీ
నా మనసులోకి రాకముందు కాపురానికి
నీ విషయమంత తెలియాలీ యివ్వడానికి

అమ్మమ్మో అయ్యయ్యొ అల్లరిచేశాడు
అబ్బబ్బో-అయ్యయ్యో-మెల్లగ దోచాడు
ఏమేమో చేశాడమ్మో
నే మైమరచి పోయానమ్మో
చేసింది యేముంది చేసేది రేపుంది
ఉలికి ఉలికి పడబోకు
ఉన్నదంత ముందుందీ
ఎంతెంతో ఉందమ్మో
ఇంకెంతో ఉందమ్మో

అమ్మమ్మో అయ్యయ్యో కళ్ళెము వేసింది
అయ్యయ్యో ఒళ్ళంత అల్లుకు పోయింది
ఎన్నెన్నో చేసిందమ్మో
అందకుండ పోయిందమ్మో
వారేవా మొనగాడా
తగ్గాలి నీ జోరు
జగజ్జంత్రి నీవై తే
జగజ్జాణ నేనోయి
ఒకరికొకరు సరిపడితే
జగమంతా మనదేలే
జగమంతా మనదేలే
ఈ యుగమంతా మనదేలే
అహో...

Palli Balakrishna
Sukha Dukhalu (1968)



చిత్రం: సుఖఃదుఖాలు (1968)
సంగీతం: ఎస్.పి.కోదండపాణి
నటీనటులు: వాణిశ్రీ, జయలలిత, చంద్రమోహన్, రామకృష్ణ 
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: ఐ. వి.మూర్తి
నిర్మాత: పి.కామేశ్వరరావు
విడుదల తేది: 19.07.1968



Songs List:



ఇది మల్లెల వేళయనీ పాట సాహిత్యం

 
చిత్రం: సుఖఃదుఖాలు (1968)
సంగీతం: ఎస్.పి.కోదండపాణి
సాహిత్యం: దేవులపల్లి కృష్ణశాస్త్రి
గానం: పి.సుశీల

ఇది మల్లెల వేళయనీ ఇది వెన్నెల మాసమనీ 
తొందరపడి ఒక కోయిల ముందే కూసిందీ విందులు చేసింది

కసిరే ఏండలు కాల్చునని
ముసిరే వానలు ముంచునని 
ఇక కసిరే ఏండలు కాల్చునని
మరి ముసిరే వానలు ముంచునని 
ఎరుగని కొయిల ఎగిరింది 
ఎరుగని కొయిల ఎగిరింది చిరిగిన రెక్కల వొరిగింది 
నేలకు వొరిగింది 
ఇది మల్లెల వేళయనీ ఇది వెన్నెల మాసమనీ 
తొందరపడి ఒక కోయిల ముందే కూసిందీ విందులు చేసింది 

మరిగి పోయేది మానవ హృదయం
కరుణ కరిగేది చల్లని దైవం 
మరిగి పోయేది మానవ హృదయం కరుణ కరిగేది చల్లని దైవం 
వాడే లతకు ఎదురై వచ్చు వాడని వసంత మాసం 
వసి వాడని కుసుమ విలాసం 
ఇది మల్లెల వేళయనీ ఇది వెన్నెల మాసమనీ 
తొందరపడి ఒక కోయిల ముందే కూసిందీ విందులు చేసింది

ద్వారానికి తారా మణి హారం హారతి వెన్నెల కర్పూరం 
ద్వారానికి తారా మణి హారం హారతి వెన్నెల కర్పూరం 
మోసం ద్వేషం లేని సీమలో
మోసం ద్వేషం లేని సీమలో మొగసాల నిలిచెనీ మందారం 

ఇది మల్లెల వేళయనీ ఇది వెన్నెల మాసమనీ 
తొందరపడి ఒక కోయిల ముందే కూసిందీ విందులు చేసింది 




ఎందరు ఉన్నారూ మీలో పాట సాహిత్యం

 
చిత్రం: సుఖఃదుఖాలు (1968)
సంగీతం: ఎస్.పి.కోదండపాణి
సాహిత్యం: కొసరాజు రాఘవయ్య 
గానం: ఘంటసాల, పి.సుశీల

ఎందరు ఉన్నారూ మీలో
ఎందరు ఉన్నారూ !
నీతికి నిలబడువారూ
నిందకు భయపడువారూ !

వచ్చానయ్యా ! వచ్చానూ
వరాల లక్ష్మిని వచ్చానూ
మక్కువగలిగిన వారికీయగా
చక్కని కానుక తెచ్చానూ


బ్లాకుమార్కెటియర్ __

వచ్చానమ్మా వచ్చానూ-నీ
కానుక కోసం వచ్చాను
ఆ కానుక నాకు యిచ్చావంటే
కళ్ళకద్దుకొని పూజిస్తాను
సత్రాలను కట్టించానూ
చలివేంద్రల పెట్టించానూ

గుడికి శిఖరమెత్తించానూ
బడిలో పప్పులు పంచానూ 
ఎలక్షన్లలో నిలిచినవాళ్ళకు
ఎన్నో చందాలిచ్చాను 

బ్లాకు మార్కెట్లు చేశావు
పాలడబ్బాలు దాచావు
శిక్షలు ఫైనులు తప్పుకొనంగా
బడానాయకుల మేపావు
చాలయ్యా నీ వేషాలు
జాతికి నువ్వు వేరుపురుగువు 

జైళ్ళలోన పడుకున్నాను
దేవతాపులుసు తిన్నాను
మీటింగులలో ముందుకు దూకి
ఎన్నో లెక్చరు లిచ్చాను
యిల్లూవాకిలి వదలిపెట్టి నే
ప్రజా సేవలో పండాను 

ప్రజా సేవకుడనన్నావు
ప్రజలకు టోపీ పెట్టావు
పర్మిట్లెన్నో సంపాయించి
పైసాలను తెగ తిన్నావు
దేశం పేరు చెరిచావు,
పోపో ఎందుకు అరిచేవూ

బక్కచిక్కినా రై తులం
దిక్కులేని కూలీలమూ
గంపెడు పిల్లల కన్నాము
కరువు తోటి చస్తున్నాము
మితముగ పిల్లలు కావాలి
మా బ్రతుకులు హాయిగ జరగాలి

భారతదేశపు సంపద పెంచగ
బంగారము పండించండి
పండిన పంటను దాచుకోక యీ
ప్రపంచాన్ని బ్రతికించండి
మీకోరికలను తీర్చెద
కరువుమాపి కాపాడెద
ఇదుగో కానుక పట్టండీ 




ఓ పదారు నా వయసు పాట సాహిత్యం

 
చిత్రం: సుఖఃదుఖాలు (1968)
సంగీతం: ఎస్.పి.కోదండపాణి
సాహిత్యం: ఆరుద్ర 
గానం: పి.సుశీల, యస్.పి.బాలు 

ఓ పదారు నా వయసు
పండింది నా సొగసు
పడుచుగుండె తెలిసికోలేవా
ఓహో బావా.... ఇలా రావా....దోచుకోవా
ఓ.... పదారు నా

చిలిపిగా నవ్వకు
వలపులే పొంగును
కొంటె కొంటె చూపులన్ని గొడవ చేసెనోయ్
గులాబి బుగ్గలపై ఫలాన గురుతులతో
సరాగమాడినచో చల్లని మైకం

ఓ.... పదారు నా వయసు
పండింది నా సొగసు

నడకలో హంసలు నవ్వులో చిలకలు
గొంతులోన వంతపాడుకోయిలున్నది
చలాకి నా పరువం - జిలేబి తీపిసుమా
అందాల నా హొయలు ఆరగించుమా - ఓ

ఓ పదారు నా వయసు
పండింది నా సొగసు
పడుచుగుండె తెలిసికోలేవా
ఓహో బావా - యిలా రావా దోచుకోవా
ఓ పదారు




ఓ అందాలుచిందే పాట సాహిత్యం

 
చిత్రం: సుఖఃదుఖాలు (1968)
సంగీతం: ఎస్.పి.కోదండపాణి
సాహిత్యం: డా॥ సి.నారాయణరెడ్డి 
గానం: యస్.పి.బాలు, పి.సుశీల 

పల్లవి: 
ఓ అందాలుచిందే ఆ కళ్ళలోనే
బంగారు కలలే దాగున్నవి

అవిరేకులు విరిపీ నీకై వేచీ
రేయీ పగలూ తీయని వగలై దాగున్నవి

చిరుగాలిలాగా సెలయేరులాగా
చెలరేగే తీయని పరువం ఏమన్నది

అనురాగం జిల్లున సోకే
ఆనందం వెల్లువదూకే
ఆ రోజు రానీ గానీ అంటున్నది

మనసైన నీవే పెనవేయగానే
అణవణువూ ఏమో ఏమో ఔతున్నది

నీ జడలో మలెలు వలికే
నా యెదలో తేనెలు చిలికే
ఆ రేయి నేడే నేడే రానున్నది
లలలాలా - అహహహా ఓహోహోహో



మేడంటే మేడా కాదూ పాట సాహిత్యం

 
చిత్రం: సుఖఃదుఖాలు (1968)
సంగీతం: ఎస్.పి.కోదండపాణి
సాహిత్యం: దేవులపల్లి కృష్ణశాస్త్రి 
గానం: యస్.పి.బాలు

మేడంటే మేడా కాదూ
గూడంటే గూడూకాదూ
పదిలంగ అల్లుకొన్న
పొదరిల్లుమాది
నేనైతే ఆకూ కొమ్మా
తానైతే వెన్నెలవెల్ల
పదిలంగ నేసిన పూసెన
పొదరిల్లుమాది
కోవెల్లో వెలిగే దీపం దేవి మాతల్లి
కోవెలో తిరిగే పాటల గువ్వ నా చెల్లి
గువ్వంటే గువ్వకాదు గొరవంకగాని
వంకంటే వంకగాదూ నెలవంక గాని
గోరింకా పెళ్లయిపోతే
ఏ వంకకో వెళ్ళిపోతే
గూడంతా గుబులైపోదా
గుండెల్లో దిగులై పోదా

Palli Balakrishna Friday, November 17, 2023
Pachani Samsaram (1970)



చిత్రం: పచ్చని సంసారం (1970)
సంగీతం:  యస్.పి.కొదండపాణి
నటీనటులు: కృష్ణ , వాణిశ్రీ 
దర్శకత్వం: లక్ష్మి దీపక్
నిర్మాత: బి.నారాయణ
విడుదల తేది: 07.08.1970



Songs List:



అమ్మా నీవులేని తావులేదు పాట సాహిత్యం

 
చిత్రం: పచ్చని సంసారం (1970)
సంగీతం: యస్.పి.కొదండపాణి
సాహిత్యం: దాశరథి 
గానం: పి. సుశీల 

అమ్మా నీవులేని తావులేదు 



అమ్మా నీవులేని తావులేదు పాట సాహిత్యం

 
చిత్రం: పచ్చని సంసారం (1970)
సంగీతం: యస్.పి.కొదండపాణి
సాహిత్యం: దాశరథి 
గానం: పి. సుశీల, యస్. జానకి 

అమ్మా నీవులేని తావులేదు 



అనురాగ మాల విరిసింది అణువణువున పాట సాహిత్యం

 
చిత్రం: పచ్చని సంసారం (1970)
సంగీతం: యస్.పి.కొదండపాణి
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి 
గానం: ఘంటసాల, పి. సుశీల 

అనురాగ మాల విరిసింది అణువణువున





పచ్చ పచ్చగా పైరు సాగింది పాట సాహిత్యం

 
చిత్రం: పచ్చని సంసారం (1970)
సంగీతం: యస్.పి.కొదండపాణి
సాహిత్యం: కొసరాజు 
గానం: ఎల్.ఆర్.ఈశ్వరి 

పచ్చ పచ్చగా పైరు సాగింది 



పాపాయి నవ్వులే మల్లెపూలు పాట సాహిత్యం

 
చిత్రం: పచ్చని సంసారం (1970)
సంగీతం: యస్.పి.కొదండపాణి
సాహిత్యం: దాశరథి 
గానం: ఘంటసాల 

పాపాయి నవ్వులే మల్లెపూలు 




పాపాయి నవ్వులే మల్లెపూలు (Bit Song) పాట సాహిత్యం

 
చిత్రం: పచ్చని సంసారం (1970)
సంగీతం: యస్.పి.కొదండపాణి
సాహిత్యం: దాశరథి 
గానం: ఘంటసాల 

పాపాయి నవ్వులే మల్లెపూలు (Bit Song)





పాడమని పాట వినే రాజు ఎవరూ పాట సాహిత్యం

 
చిత్రం: పచ్చని సంసారం (1970)
సంగీతం: యస్.పి.కొదండపాణి
సాహిత్యం: మైలవరపు గోపి 
గానం: పి. సుశీల 

పాడమని పాట వినే రాజు ఎవరూ 


Palli Balakrishna Tuesday, July 5, 2022
Bangaru Thimmaraju (1964)



చిత్రం: బంగారు తిమ్మరాజు (1964)
సంగీతం: యస్.పి. కోదండపాణి
నటీనటులు: కాంతారావు, కృష్ణ కుమారి 
దర్శకత్వం: జి.విశ్వనాధం
నిర్మాత: యస్.భావనారాయణ
విడుదల తేది: 28.02.1964



Songs List:



కోడె కారు పాట సాహిత్యం

 
చిత్రం: బంగారు తిమ్మరాజు (1964)
సంగీతం: యస్.పి. కోదండపాణి
సాహిత్యం: 
గానం:

కోడె కారు 



ఈ వింత పులకింత పాట సాహిత్యం

 
చిత్రం: బంగారు తిమ్మరాజు (1964)
సంగీతం: యస్.పి. కోదండపాణి
సాహిత్యం: వేటూరి 
గానం: ఎస్. జానకి 

ఈ వింత పులకింత 




నాగమల్లి కోనలోన... పాట సాహిత్యం

 
చిత్రం: బంగారు తిమ్మరాజు (1964)
సంగీతం: యస్.పి. కోదండపాణి
సాహిత్యం: వేటూరి
గానం: జమునారాణి

పల్లవి:
నాగమల్లి కోనలోన... నక్కింది లేడికూన
ఎరవేసి..హ...గురి చూసి...హ... పట్టాలి మామా....

చరణం: 1
చూపుల్లో కైపుంది ... సొగసైన రూపుంది
వయ్యారం ఒలికిస్తుంది... వన్నెలు చిన్నెలు నేర్చింది
ఓ ఉడుకుమీద ఉరికావంటే జడుసుకుంటది
దాన్ని ఒడుపుచూసి మచ్చిక చేస్తే వదలనంటది... మావోయ్...

చరణం: 2
నడకల్లో హొయలుంది ... నాట్యంలో నేర్పుంది ....
మలిసందె చీకట్లోన.. నీటికి ఏటికి వస్తుంది
ఓ జాడ చూసి కాశావంటే దారికొస్తది
దాని జాలి చూపు నమ్మావంటే.. దగా చేస్తది... మావోయ్





ఓ నిండు చందమామ పాట సాహిత్యం

 
చిత్రం: బంగారు తిమ్మరాజు (1964)
సంగీతం: యస్.పి. కోదండపాణి
సాహిత్యం: ఆరుద్ర 
గానం: కె. జె. యేసుదాస్ 

ఓ నిండు చందమామ 

Palli Balakrishna Saturday, June 25, 2022
Inti Gowravam (1970)



చిత్రం: ఇంటి గౌరవం (1970)
సంగీతం: ఎస్. పి. కోదండపాణి 
నటీనటులు: శోభన్ బాబు, చంద్రమోహన్, జానకి, జయకుమారి, విజయ భాను
దర్శకత్వం: బాపు
నిర్మాత: పి. మల్లికార్జున రావు
విడుదల తేది: 14.08.1970



Songs List:



నారుపోసి ఊరకుంటే పాట సాహిత్యం

 
చిత్రం: ఇంటి గౌరవం (1970)
సంగీతం: ఎస్. పి. కోదండపాణి
సాహిత్యం: కొసరాజు
గానం: సుశీల - ఘంటసాల

బుద్ధి కలిగి వుండాలమ్మా
శ్రద్ధగా చదవాలమ్మా
పెద్దలు బాటను నడచీ
వృద్ధికి రావాలమ్మా
నారుపోసి ఊరకుంటే
తీరిపోదు. బాధ్యత
నీరుపోసి పెంచడమే
నిజమగు మమతా

తుమ్మెదా పూవూ
విందు చేసుకొను వేళా
పిందె ఒకటి పుడుతుందని
అనుకున్నా లేకున్నా
తొమ్మిది మాసాలు మోసి
కన్నామే చిన్నారి
అమ్మ రుణం నాన్న రుణం
తీర్చవేమిటంటారు
పెద్దల కెపుడు పిలలు రుణపడి లేరూ
కన్నందుకు ఏ కాస్తో  వారే రుణముంటారు 

తనకు మించి ఎవ్వర నే ధన
గర్వము పనికి రాదు
వినయమ్మును చూపకుండ విర్రవీగరాదు
మంచితనము లేకుంటే
కొంచమైన విలువ లేదు 
తప్పటడుగు వేయు చిన్న పాపాలకు
తప్పుటడుగు పడకుండా
నడవడి సరిదిదాలీ
అదుపున పెరిగిన బిడలు
అభివృద్ధికి వస్తారు
హద్దు దాటి పోనిస్తే 

అథోగతికి పోతారు
ఆ పాపం - ఆ లోపం
అంతా తలిదండ్రులదే





ఓ నో డార్లింగ్ పాట సాహిత్యం

 
చిత్రం: ఇంటి గౌరవం (1970)
సంగీతం: ఎస్. పి. కోదండపాణి
సాహిత్యం:  శ్రీ దాశరధి
గానం: ఎల్. ఆర్. ఈశ్వరి

ఓ నో డార్లింగ్ 
నో ప్లీజ్ డార్లింగ్ 
వద్దురా....
అందానికీ - చందానికి
పరదా వుంటేనే సరదారా

అందీ అందని పెదవులలో
చిందీ చిందని మధువుందీ
కలిసి కలియని మనసులలో
తెలిసీ తెలియని వలపుందీ
ఆ మధువులూ - ఈ వలపులూ
అందించు సమయాలు ఇవి కావులే

దాచీ దాచని వొంపులలో
తోచీ తోచని సొగసుందీ
తగిలీ తగలని తనువులలో
రగిలీ రగలని కై పుంది
రగిలించకు కోర్కె రగిలించకు
పది మందిలో నన్ను కవ్వించకు



హవ్వ హవ్వ సిరి సిరి మువ్ పాట సాహిత్యం

 
చిత్రం: ఇంటి గౌరవం (1970)
సంగీతం: ఎస్. పి. కోదండపాణి
సాహిత్యం:  ఆరుద్ర
గానం: సుశీల 

హవ్వ హవ్వ సిరి సిరి మువ్వ నువ్వా నువ్వా
గువ్వలాంటి పిల్ల మీద లవ్వా ల వ్వా

మోటు సరసము ముదిరిపోయిందా
నీ నీటు నీటు తలకాసా పండిపోయిందా
లేటు వయసులో ఘాటు వలపులా 
నీ వాటమైన నడుమయ్యో వాలిపోయిందా
నీ నాటకాల బూటకాల ఆట నీకే చేటు తెచ్చిందా 
ఆడపిల్లను అలుసు చేయకు – నువ్వు
ఆవలిస్తే పేగులెన్నో లెక్క పెడుతుందోయ్

చిలిపి చేష్టలు వలపు అల్లురి
మనసు మనసు కలిసినపుడు మధుర మౌతుందోయ్
ఈ వేషా లెందుకు మోసాలెందుకు వేళాకోళం
మనకూ తెలుసునోయ్
దోర మనసును  దోచబోయేనా
దొంగను పట్టె దోరగారు దొంగ వైనావా
కమ్మ కమ్మగా ఖైదు చేయనా
కంటి చూపు సంకెలేసి జంటకటనా
అందమైన డెందమందు బందీచేసి విందు చేయనా 




చింత పువ్వు ఎరుపు పాట సాహిత్యం

 
చిత్రం: ఇంటి గౌరవం (1970)
సంగీతం: ఎస్. పి. కోదండపాణి
సాహిత్యం:  ఆరుద్ర
గానం: సుశీల , బాల సుబ్రహ్మణ్యం

చింత పువ్వు ఎరుపు
చిలక ముక్కు ఎరుపు
చేయి చేయి కలుపు
లేత వలపు తెలుపు
మల్లె మొగ్గ తెలుపు
మంచి మనసు తెలుపు
చేయి చేయి కలుపు
నిండువలపు నిలుపు
అబ్బ వూరించు పెదవులు ఎరుపు
అవి నాలోన ఆశలు రేపు
ఆగాలి పెళ్ళయిన వరకు
ఆ పెన తమదే గెలుపు
వలచే వేళ తొలగే వేల
ఈ ఎడమోము పెడమోము రుచి చూడు పులుపు 
అబ్బ నీ చేయి చిదిమిన చోట
అయ్యో నా బుగ్గ కందేను చూడు

నీ నవ్వు వెలిగిన పూట
నా మేను పొంగేను చూడు
నీలో నాలో ఒకటే ఆశ
అవి పండేను మురిపాలు నిండేను రేపు

Palli Balakrishna Tuesday, April 5, 2022
Pelli Kuthuru (1970)



చిత్రం: పెళ్లి కూతురు  (1970)
సంగీతం: యస్.పి.కోదండ పాణి
నటీనటులు: కృష్ణ , విజయ నిర్మల, కృష్ణంరాజు
దర్శకత్వం: వి.రామచంద్రరావు
నిర్మాత:  పి.బాబ్జీ
విడుదల తేది: 17.04.1970



Songs List:



ఊరునాడంత గుమ్మెత్త ఊరేగింపోస్తోంది పాట సాహిత్యం

 
చిత్రం: పెళ్లి కూతురు  (1970)
సంగీతం: యస్.పి.కోదండ పాణి
సాహిత్యం: కొసరాజు రాఘవయ్య 
గానం: యస్.పి. బాలు, మాధవపెద్ది సత్యం 

ఊరునాడంత గుమ్మెత్త ఊరేగింపోస్తోంది 



చక్కని పిల్ల పక్కన ఉంది పాట సాహిత్యం

 
చిత్రం: పెళ్లి కూతురు  (1970)
సంగీతం: యస్.పి.కోదండ పాణి
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి 
గానం: పి. సుశీల 

చక్కని పిల్ల పక్కన ఉంది 



మేలిమి బంగారు పాట సాహిత్యం

 
చిత్రం: పెళ్లి కూతురు  (1970)
సంగీతం: యస్.పి.కోదండ పాణి
సాహిత్యం: గురజాడ అప్పారావు / ఆరుద్ర 
గానం: పి. సుశీల 

మేలిమి బంగారు మెలతల్లారా ఆటల పాటల




రాముని రూపమే మోహనము పాట సాహిత్యం

 
చిత్రం: పెళ్లి కూతురు  (1970)
సంగీతం: యస్.పి.కోదండ పాణి
సాహిత్యం: దాశరథి 
గానం: పి. సుశీల 

రాముని రూపమే మోహనము 



వెర్రి మొర్రి వెంగళప్ప పాట సాహిత్యం

 
చిత్రం: పెళ్లి కూతురు  (1970)
సంగీతం: యస్.పి.కోదండ పాణి
సాహిత్యం: ఆరుద్ర 
గానం: యస్.పి. బాలు, పిఠాపురం నాగేశ్వరరావు , ఎల్.ఆర్.ఈశ్వరి 

వెర్రి మొర్రి వెంగళప్ప పుట్టినరోజంట




ఆలకించవా నా మొర మురళీధర పాట సాహిత్యం

 
చిత్రం: పెళ్లి కూతురు  (1970)
సంగీతం: యస్.పి.కోదండ పాణి
సాహిత్యం:
గానం: పి. సుశీల 

ఆలకించవా నా మొర మురళీధర

Palli Balakrishna Friday, December 24, 2021
Asthulu Anthasthulu (1969)



చిత్రం: ఆస్తులు అంతస్తులు (1969)
సంగీతం: కొదండపాణి 
సాహిత్యం: కొసరాజు, ఆరుద్ర, దాశరధి, అప్పలాచార్య 
గానం: ఫై.సుశీల, ఎస్.ఫై.బాలు, ఎల్ .ఆర్. ఈశ్వరి 
నటీనటులు: కృష్ణ , వాణిశ్రీ 
మాటలు: ముళ్ళపూడి  వెంకటరమణ
దర్శకత్వం: వి.రామచంద్ర రావు 
నిర్మాతలు: సుందరలాల్ నహత, డూండీ
విడుదల తేది: 15.05.1969



Songs List:



రేగుపల్లు ఎర్ర ఎర్రని పల్లు పాట సాహిత్యం

 
చిత్రం: ఆస్తులు అంతస్తులు (1969)
సంగీతం: కొదండపాణి 
సాహిత్యం: కొసరాజు
గానం: పి. సుశీల

రేగుపల్లు ఎర్ర ఎర్రని పల్లు




నిన్నేమో అనుకున్నాను నేడేమో అయిపోతున్నాను పాట సాహిత్యం

 
చిత్రం: ఆస్తులు అంతస్తులు (1969)
సంగీతం: కొదండపాణి 
సాహిత్యం: దాశరధి
గానం: పి. సుశీల

నిన్నేమో అనుకున్నాను నేడేమో అయిపోతున్నాను



ఒకటై పోదామా.. పాట సాహిత్యం

 
చిత్రం: ఆస్తులు అంతస్తులు (1969)
సంగీతం: కొదండపాణి 
సాహిత్యం: ఆరుద్ర 
గానం: పి. సుశీల, యస్.పి. బాలు 

పల్లవి:
ఒకటై పోదామా..ఊహల వాహినిలో
మమతల తరగలపై..మధువుల నురగలపై
పరవశమొందగా..ఏకమౌదామా..ఆ ఆ
పరవశమొందగా..ఏకమౌదామా

చరణం: 1
ఓ..అనురాగసీమలో..అందాల కోనలో
అల్లారు ముద్దుగా ఉందామా

సొంపైన పొదరింట..ఇంపైన గిలిగింత
సొంపైన పొదరింట..ఇంపైన గిలిగింత
దోబూచులాడుతూ..నవ్వుకొందామా

ఒకటై పోదామా..ఊహల వాహినిలో
మమతల తరగలపై..మధువుల నురగలపై
పరవశమొందగా..ఏకమౌదామా..ఆ ఆ
పరవశమొందగా..ఏకమౌదామా

చరణం: 2
చిగురాకు జంపాల..చెలరేగు చెలువాల
ఉయ్యాలలూగుతూ ఉందామా..
చిగురాకు జంపాల..చెలరేగు చెలువాల
ఉయ్యాలలూగుతూ ఉందామా

నింగిలో విహరించి..నేలపై పులకించి
నింగిలో విహరించి..నేలపై పులకించి
శృంగార జలధిలో తేలుదామా

ఒకటై పోదామా..ఊహల వాహినిలో
మమతల తరగలపై..మధువుల నురగలపై
పరవశమొందగా..ఏకమౌదామా..ఆ ఆ
పరవశమొందగా..ఏకమౌదామా

చరణం:3
వలపుల జంటగా..సరదాల పంటగా
సయ్యాట పాటలై సాగుదామా..

తారా చంద్రులమై..రాధాకృష్ణులమై
తారా చంద్రులమై..రాధాకృష్ణులమై
తన్మయ మొందుతూ కరిగిపోదామా

ఒకటై పోదామా..ఊహల వాహినిలో
మమతల తరగలపై..మధువుల నురగలపై
పరవశమొందగా..ఏకమౌదామా..ఆ ఆ
పరవశమొందగా..ఏకమౌదామా





అలెక్ కలకండ పలుకు కన్నా పాట సాహిత్యం

 
చిత్రం: ఆస్తులు అంతస్తులు (1969)
సంగీతం: కొదండపాణి 
సాహిత్యం: అప్పలాచార్య కొడకండ్ల 
గానం: యస్.పి. బాలు, ఎల్.ఆర్.ఈశ్వరి 

కలకండ పలుకు కన్నా నీ సొగసు భలే తీపి 

Palli Balakrishna Tuesday, November 2, 2021
Mallamma Katha (1973)



చిత్రం: మల్లమ్మ కథ (1973)
సంగీతం: ఎస్. పి. కోదండపాణి
నటీనటులు: కృష్ణ , శారద, బేబీ శ్రీదేవి
దర్శకత్వం: అక్కినేని సంజీవి
నిర్మాత: బి. చెంచు రామయ్యా
విడుదల తేది: 27.04.1973



సూపర్ స్టార్ కృష్ణ గారితో బేబీ శ్రీదేవి నటించిన సినిమాలు:
1. మా నాన్న నిర్దోషి (1970) - బేబీ శ్రీదేవి
2. విధి విలాసం (1970) - బేబీ శ్రీదేవి
3. అగ్నిపరీక్ష (1970) ) - బేబీ శ్రీదేవి
4. అత్తలు కోడళ్లు (1971) - బేబీ శ్రీదేవి
5. నేనూ మనిషినే (1971) - బేబీ శ్రీదేవి
6. రాజమహల్ (1972) - కుమారి శ్రీదేవి
7. మేనకోడలు (1972) - కుమారి శ్రీదేవి
8. మల్లమ్మ కథ (1973) - బేబీ శ్రీదేవి
9. మమత (1973) - బేబీ శ్రీదేవి
10. మీనా (1973) - బేబీ శ్రీదేవి
11. కొత్తకాపురం (1975) - బేబీ శ్రీదేవి
12 దేవుడులాంటి మనిషి (1975) - కుమారి శ్రీదేవి

(1972 లో రిలీజ్ అయిన సినిమాల్లో కుమారి శ్రీదేవి అని టైటిల్స్ లో ఉంది, కానీ 1973 లో రిలీజైన మల్లమ్మ కథ, మమత, మీనా సినిమాలో, 1975 లో రిలీజైన కొత్తకాపురం సినిమాల్లో మాత్రం బేబీ శ్రీదేవి అని ఉంది, అంటే బహుశా ఈ సినిమాలు రిలీజ్ ఆలస్యం అయ్యుంటుంది)



Songs List:



వందే శంభుం ముమాపతిం (శ్లోకం) పాట సాహిత్యం

 
చిత్రం: మల్లమ్మ కథ (1973)
సంగీతం: యస్. పి. కోదండపాణి
సాహిత్యం: దాశరథి
గానం: కౌసల్య సీనియర్, మాధవపెద్ది సత్యం 

వందే శంభుం ముమాపతిం (శ్లోకం)



శరణం శ్రీ కైలాస నాథ పాట సాహిత్యం

 
చిత్రం: మల్లమ్మ కథ (1973)
సంగీతం: యస్. పి. కోదండపాణి
సాహిత్యం: వీటూరి వెంకటసత్య సూర్యనారాయణమూర్తి 
గానం:  జె. వి. రాఘవులు 

శరణం శ్రీ కైలాస నాథ 



ఈశా మహేశ పాట సాహిత్యం

 
చిత్రం: మల్లమ్మ కథ (1973)
సంగీతం: యస్. పి. కోదండపాణి
సాహిత్యం: వీటూరి వెంకటసత్య సూర్యనారాయణమూర్తి 
గానం: పి. సుశీల

ఈశా మహేశ అమ్మను ఒకసారి చూపించ రాదా




క్రూరుడని ఎరిగి (పద్యం) పాట సాహిత్యం

 
చిత్రం: మల్లమ్మ కథ (1973)
సంగీతం: యస్. పి. కోదండపాణి
సాహిత్యం: వీటూరి వెంకటసత్య సూర్యనారాయణమూర్తి 
గానం: యస్.పి. బాలు 

క్రూరుడని ఎరిగి  (పద్యం)



తొలి వాన కురిసింది పాట సాహిత్యం

 
చిత్రం: మల్లమ్మ కథ (1973)
సంగీతం: యస్. పి. కోదండపాణి
సాహిత్యం: వీటూరి వెంకటసత్య సూర్యనారాయణమూర్తి 
గానం: యస్.పి. బాలు 

తొలి వాన కురిసింది తొలకరి వచ్చింది 



ముత్యాల బొమ్మకు మొగుడొస్తాడే పాట సాహిత్యం

 
చిత్రం: మల్లమ్మ కథ (1973)
సంగీతం: యస్. పి. కోదండపాణి
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి 
గానం: కౌసల్య సీనియర్, పి. సుశీల 

ముత్యాల బొమ్మకు మొగుడొస్తాడే 



నిన్నటి దాకా పాట సాహిత్యం

 
చిత్రం: మల్లమ్మ కథ (1973)
సంగీతం: యస్. పి. కోదండపాణి
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి 
గానం: 

నిన్నటి దాకా 



మచ్చలేని చందమామను పాట సాహిత్యం

 
చిత్రం: మల్లమ్మ కథ (1973)
సంగీతం: యస్. పి. కోదండపాణి
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి 
గానం: పి. సుశీల 

మచ్చలేని చందమామను 



సరి సరి ఈ వేళ ఈ బిగువేళ పాట సాహిత్యం

 
చిత్రం: మల్లమ్మ కథ (1973)
సంగీతం: యస్. పి. కోదండపాణి
సాహిత్యం: వీటూరి వెంకటసత్య సూర్యనారాయణమూర్తి 
గానం: ఘంటసాల, పి. సుశీల

సరి సరి ఈ వేళ ఈ బిగువేళ




అంతా శివమయమే కాదా పాట సాహిత్యం

 
చిత్రం: మల్లమ్మ కథ (1973)
సంగీతం: యస్. పి. కోదండపాణి
సాహిత్యం: వీటూరి వెంకటసత్య సూర్యనారాయణమూర్తి 
గానం: పి. సుశీల

అంతా శివమయమే కాదా 



ఎంతటి సరసుడవో పాట సాహిత్యం

 
చిత్రం: మల్లమ్మ కథ (1973)
సంగీతం: యస్. పి. కోదండపాణి
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి 
గానం: పి. సుశీల, ఘంటసాల 

ఎంతటి సరసుడవో ప్రియ ఎంతటి చతురుడవో



చల్లనైన తల్లి (పద్యం) పాట సాహిత్యం

 
చిత్రం: మల్లమ్మ కథ (1973)
సంగీతం: యస్. పి. కోదండపాణి
సాహిత్యం: వీటూరి వెంకటసత్య సూర్యనారాయణమూర్తి 
గానం: పి. సుశీల

చల్లనైన తల్లి (పద్యం)



భవ హరణ శుభ చరణ పాట సాహిత్యం

 
చిత్రం: మల్లమ్మ కథ (1973)
సంగీతం: యస్. పి. కోదండపాణి
సాహిత్యం: దాశరథి
గానం: పి. సుశీల

భవ హరణ శుభ చరణ
నాగ భరణ గౌరీ రమణ 
భవ హరణ శుభ చరణ
నాగ భరణ గౌరీ రమణ 

దిక్కేలేని దేనులు పాలిట
దిక్కై నిలచిన దేవుడవయ్యా...

భవ హరణ శుభ చరణ
నాగ భరణ గౌరీ రమణ

నీ భక్తులకు పెన్నిధి నీవే
మా కన్నులులో ఉన్నది నీవే
నీ భక్తులకు పెన్నిధి నీవే
మా కన్నులులో ఉన్నది నీవే

నిండు మనసుతో నీవారొసగే
నిండు మనసుతో నీవారొసగే
గరికపూలకే మురిసేవయ్యా
కన్నీటితోనే పూజించగానే
కన్నీరు గానే భావింతువయ్య

భవ హరణ శుభ చరణ
నాగ భరణ గౌరీ రమణ

నందివాహనం ఉందంటారు
కందిపోయే నీ కాల్లెందుకయ
నందివాహనం ఉందంటారు
కందిపోయే నీ కాల్లెందుకయ

మంచుకొండ నీ ఇళ్ళంటారే
మంచుకొండ నీ ఇళ్ళంటారే
వళ్ళంతా ఈ వేడెందుకయ
అన్నపూర్ణ నీ అండనుండగ
అన్నపూర్ణ నీ అండనుండగ
ఆకలి బాధ నీకెందుకయ

భవ హరణ శుభ చరణ
నాగ భరణ గౌరీ రమణ

దిక్కేలేని దేనులు పాలిట
దిక్కై నిలచిన దేవుడవయ్య

భవ హరణ శుభ చరణ
నాగ భరణ గౌరీ రమణ




కావరావా దేవ దేవ పాట సాహిత్యం

 
చిత్రం: మల్లమ్మ కథ (1973)
సంగీతం: యస్. పి. కోదండపాణి
సాహిత్యం: వీటూరి వెంకటసత్య సూర్యనారాయణమూర్తి 
గానం: పి. సుశీల

కావరావా దేవ దేవ 


Palli Balakrishna Wednesday, April 14, 2021
Gopaludu Bhoopaludu (1967)



చిత్రం: గోపాలుడు-భూపాలుడు (1967)
సంగీతం: యస్.పి.కోదండపాణి
నటీనటులు: యన్ టి.రామారావు, జయలలిత, రాజశ్రీ
దర్శకత్వం: జి.విశ్వనాథన్
నిర్మాత: యస్.భావన్నారాయణ
విడుదల తేది: 13.01.1967



Songs List:



ఇదేనా! ఇదేనా! పాట సాహిత్యం

 
చిత్రం: గోపాలుడు-భూపాలుడు (1967)
సంగీతం: యస్.పి.కోదండపాణి
సాహిత్యం: డా॥ సి.నారాయణరెడ్డి 
గానం: సౌందర రాజన్ 

ఇదేనా! ఇదేనా! తరతరాల చరిత్రలో
జరిగిందీ ఇదేనా జరిగేదీ ఇదేనా!
ఒక రకం పంచుకున్న అన్నదమ్ము లే
ఒకరినొకరు హతమార్చగ కత్తి దూసిరే
నీతికి గొడుగై నిలిచే రాచగద్దెనే
నెత్తుటి ధారలలో ముంచెత్తి వేసిరే 

ఒకే తల్లి కడుపులో ఉదయించిన పాపలు
విధిచేసిన వంచనతో విడిపోయిరి పాపము
కోనలోన పెరిగె నొకడు గోపాలుడై
కోటలోన వెలిగె నొకడు భూపాలుడై



కోటలోని మొనగాడా! పాట సాహిత్యం

 
చిత్రం: గోపాలుడు-భూపాలుడు (1967)
సంగీతం: యస్.పి.కోదండపాణి
సాహిత్యం: డా॥ సి.నారాయణరెడ్డి 
గానం: ఘంటసాల, పి.సుశీల 

కోటలోని మొనగాడా!
వేటకు వచ్చావా వేటకు వచ్చావా!
జింక పిల్ల కోసమో - ఇంక దేనికోసమో 

తోటలోని చినదానా
వేటకు వచ్చానే వేటకు వచ్చానే
జింక పిల్ల కన్నులున్న చిన్న దానికోసమే....

ఏలాటి పిల్ల అది ? ఏపాటి అంద మది?
ఏవూరి చిన్నది ? ఏకోన వున్నది?
చారెడు కన్నులది - చామంతి వన్నెలది
ఏవూరొ ఏమో నా యెదురుగ నేవున్నది

కత్తుల వీరునికి - కన్నె మనసెందుకో
జిత్తులు సిపాయికి చెలివల పెందుకో

కత్తులు ఒకచేత - గుత్తులు ఒక చేత
నిలిపే బంటునే - నీకు తగిన జంటనే




ఉయ్యాలో! ఉయ్యాలో ఉయ్యాలో పాట సాహిత్యం

 
చిత్రం: గోపాలుడు-భూపాలుడు (1967)
సంగీతం: యస్.పి.కోదండపాణి
సాహిత్యం: డా॥ సి.నారాయణరెడ్డి 
గానం: యస్.జానకి, లత 

ఉయ్యాలో! ఉయ్యాలో ఉయ్యాలో
కన్నెమనసుల వన్నెలతలపుల సన్నజాజుల ఉయ్యాలో
ఉయ్యాలో ఉయ్యాలో ఉయ్యాలో
దాగి ఉన్న దోరవయసే ఊగుతున్నది .... ॥ఉయ్యాలో॥
ఊగి ఊగి మత్తులోన తూగుతున్నది ...॥ఉయ్యాలో॥
అల్లదుగో కొలనుంది - అందాలకు నెలవుంది
కలువల కనులతో పిలిచింది.
చల్ల చల్లగ జల్లులాడగ జాణలేవ్వరో రమ్మంది

బృందం : ఉయ్యాలో, ఉయ్యాలో ఉయ్యాలో

జిల్లులోయమ్మ జల్లులూ

బృందం : జల్, జల్, జల్, జల్ జల్లులూ

కొంటె కృష్ణుడెవ్వడైన పొంచి చూసెనో'
గట్టుమీది చీరపైన కన్ను వేసెనో
కృష్ణయ్యే తావస్తే కోకమీద కన్నేస్తే
చూపుల సంకెలు వేస్తానే
వాని బింకము - వాని పొంకము
వాని సంగతి — చూస్తానే

బృందం : ఉయ్యాలో! ఉయ్యాలో ఉయ్యాలో,





ఎక్కడివాడొ? అట్టెకనుపించి (పద్యం) పాట సాహిత్యం

 
పద్యం 1


చిత్రం: గోపాలుడు-భూపాలుడు (1967)
సంగీతం: యస్.పి.కోదండపాణి
సాహిత్యం: పాలగుమ్మి పద్మరాజు
గానం: యస్.జానకి

ఎక్కడివాడొ? అట్టెకనుపించి
తటాలున మాయమైన, యా
చక్కనివాడు, వెన్నెల పసందులు చిందెడు
కొంటె చూపులున్
చక్కిలి గింతపెట్టు చిరునవ్వుల పువ్వులు
రాచఠీవి, కైపెక్కిన జవ్వనంబు మరియెన్నడు 
నా కనువిందు సేయునో
ఎక్కిడివాడో....



ఒకసారి కలలోకి రావయ్యా పాట సాహిత్యం

 
చిత్రం: గోపాలుడు-భూపాలుడు (1967)
సంగీతం: యస్.పి.కోదండపాణి
సాహిత్యం: ఆరుద్ర 
గానం: ఘంటసాల , యస్.జానకి

ఒకసారి కలలోకి రావయ్యా
ఒకసారి కలలోకి రావయ్యా
నా మువ్విళ్ళు కవ్వించి పోవయ్యా
ఓ గొల్ల గోపయ్యా

ఒకసారి రాగానే ఏమౌనులే
నీ హృదయాన శయనించి ఉంటానులే ఏలుకొంటానులే
ఒకసారి రాగానే ఏమౌనులే... ఏ...

పగడాల నా మోవి చిగురించెరా
మోము చెమరించెరా మేను పులకించెరా
సొగసు వేణువు చేసి పలికించరా
సొగసు వేణువు చేసి పలికించరా

చెమ్మోవి పై తేనె ఒలికించనా
చెమ్మోవి పై తేనె ఒలికించనా
తనివి కలిగించనా మనసు కరిగించనా
కేరింత లాడించి శోలించనా
కేరింత లాడించి శోలించనా

ఒకసారి కలలోకి రావయ్యా...ఆ... ఆ...

వొంపు సొంపుల మెరుపు మెరిపించవే
వగలు కురిపించవే మేను మరపించవే
మరపులో మధుకీల రగిలించవే
మరపులో మధుకీల రగిలించవే

చిలిపి చూపుల సిగ్గు కలిగిందిరా
చిలిపి చూపుల సిగ్గు కలిగిందిరా
మొగ్గ తొడిగిందిరా మురిసి విరిసిందిరా
పదును తేరిన వలపు పండించరా
పదును తేరిన వలపు పండించరా

ఒకసారి కలలోకి రావయ్యా
నా మువ్విళ్ళు కవ్వించి పోవయ్యా
ఓ గొల్ల గోపయ్యా
ఒకసారి రాగానే ఏమౌనులే




ఎంత బాగున్నది పాట సాహిత్యం

 
చిత్రం: గోపాలుడు-భూపాలుడు (1967)
సంగీతం: యస్.పి.కోదండపాణి
సాహిత్యం: డా॥ సి.నారాయణరెడ్డి 
గానం: ఘంటసాల, పి.సుశీల,  యస్.జానకి

ఎంత బాగున్నది ఎంత బాగున్నది
అందరాని చందమామ అందుతున్నది
ఎంత బాగున్నది ఎంత బాగున్నది
పలుకలేని పూలరెమ్మ పలుకుతున్నది
వెచ్చని ఊహ్మవొ విరియగా,
పచ్చని తిన్నెలేమొ పిలువగా
పూతవయసు పులకరించగా నీ
లేతనడుము చేతి కందగా!
సన్నని పైటకొంగు సోకగా
నున్నని బుగ్గల పైనే తాకగా
కనులలోని కలలు పండగా హాయ్,
కైపు గాని కైపు నిండగా 
వాడని ఆశలల్లుకుందమా ?
పాడని పాట పాడుకుందమా?
పొదలనీడ ఒదిగి ఉందమా?
నిదురకాని నిదుర పోదమా?





చూడకు, చూడకు పాట సాహిత్యం

 
చిత్రం: గోపాలుడు-భూపాలుడు (1967)
సంగీతం: యస్.పి.కోదండపాణి
సాహిత్యం: డా॥ సి.నారాయణరెడ్డి 
గానం: ఘంటసాల, పి.సుశీల

చూడకు, చూడకు చూడకు చూడకూ
మరీ అంతగా చూడకూ
విరుల పానుపున పరచిన మల్లేల
ఒరిగి ఒరిగి చూస్తున్నాయి.
ఆకాశాన విరిసిన తారలు.
అదే పనిగ చూస్తున్నాయి.

ఇన్ని చూడగా లేనిది — నేను చూడ ఏమైనది?
చూడనీ! చూడనీ చూసిన అందమె
తిరిగి తిరిగి నను చూడనీ తేనెమనసు తెరతీయనీ

అసలే యేవొ మిసిమికోరికలు
కొసరి కొసరి నను కవ్వించే
ఆపై నాలో గడుసు వెన్నెలలు హాయి హాయిగా రగిలించే
ఇంక నన్ను కదిలించకు - ఎదలో చూపులు దించకు.
చూడకూ చూడకు
మరీ అంతగా మనసుతో చెరలాడకు!





మరదలా చిట్టి మరదలా పాట సాహిత్యం

 
చిత్రం: గోపాలుడు-భూపాలుడు (1967)
సంగీతం: యస్.పి.కోదండపాణి
సాహిత్యం: డా॥ సి.నారాయణరెడ్డి 
గానం: పిఠాపురం నాగేశ్వరరావు, ఎల్. ఆర్. ఈశ్వరి 

మరదలా చిట్టి మరదలా
మేటి మగ ధీరుడనే నంటే మాటలా
బావా పొట్టిబావా నీ బలమెంతో కొంత కొంత చెప్పవా
ಬడా ಬడా సర్ధారులు - ఖడాయించి చూస్తుంటే,
కాసెగట్టి కత్తి పట్టి - మీసం మెలివేస్తుంటే.
చిత్రంగా నువ్వు గుర్తుకొస్తివే - అంత చెమటపట్టి
నేను తిరిగి వస్తి నేక

అవ్వో అవ్వో
కువ్వో మరినువ్వో!
మా ఊరి యేటికాడ నే నొంటిగ పోతుంటే,
కొంటె సూపు సోగ్గాళ్ళు వెంటబడి వస్తుంటే,
బెదిరి బెదిరి బెదిరి పడితిరా
నీ పేరు చెప్పి భయటపడితిరా

పులిమల్లుడు నాకోసం - పలవరిస్తువున్నాడో,
ఉక్కుమగడు నాకోసం - దిక్కులు చూస్తున్నాడో.
సెలవిస్తే వెళ్ళొస్తానే మరదలా - చిటికలోన మళ్ళొస్తానే

అమ్మో! అమ్మో!
గుమ్మో। గుమ్మో!
ఓ బావా నన్నిడిచీ పోతావా ఊరిడిచి
రాక రాక వచ్చిన - నారాజ నిమ్మలపండా|
కొంగున కట్టేసుకొందురా నిన్నే నా ప్పున చుట్టేసు కొందురా!
మరదలా చిట్టి
బావా పొటి బావా!





ఓ జింతడీ! పాట సాహిత్యం

 
చిత్రం: గోపాలుడు-భూపాలుడు (1967)
సంగీతం: యస్.పి.కోదండపాణి
సాహిత్యం: డా॥ సి.నారాయణరెడ్డి 
గానం: పి.సుశీల 

ఓ జింతడీ!
జిం! జిం! జిం! జిం! జింతడీ!
రం! రం! రం! రం! రంఖడీ!

అచ్చమైన సరకు రెచ్చ గొట్టే చురుకు
మచ్చుకోసం తెచ్చింది లంబాడీ!
లాలాలో, లాలాలో, లాలాలో, లాలాలో,
ఏం బాగ పొంగింది సర సర
ఏం బాబు కావాలా జెర జెర
చుక్కేస్తే, కై పెక్కేస్తే -
చుక్కర్లు తిరగాలి గిర గిర
కొండంత వాడైన బెండౌతడు
ఎలకంత మనిషైన యేను గౌతడు
మోతాదూ - ముదిరిందా
గురెటి నా సామి గోవిందా గోవిందా!


Palli Balakrishna Monday, February 22, 2021
Sri Sri Sri Maryada Ramanna (1967)

Palli Balakrishna Monday, March 18, 2019
Mahabaludu (1969)



చిత్రం: మహాబలుడు (1969)
సంగీతం: యస్.పి. కోదండపాణి
నటీనటులు: కృష్ణ , వాణిశ్రీ
దర్శకత్వం: రవికాంత్ నగాయిచ్
నిర్మాత: పి.మల్లికార్జున రావు
విడుదల తేది: 18.04.1969



Songs List:



చూడండి మీకు నేను పాట సాహిత్యం

 
చిత్రం: మహాబలుడు (1969)
సంగీతం: యస్.పి. కోదండపాణి
సాహిత్యం: దాశరథి 
గానం: పి. సుశీల 

చూడండి మీకు నేడు చూపిస్తాను
రుచి చూపిస్తాను
మధువిచ్చీ - మరపించీ
స్వర్గాన్ని మీకు చూపిస్తాను

తాజాగా దించిందండి
వలపునింపి ఉంచిందండి
ఒక్కచుక్కె చాలునండి
ఎక్కినకైపు ఎన్నడు దిగదండి
కోరుకున్న చిన్నదాన్ని చేరుకుంటారు
అందరాని ఆనందాన్ని అందుకుంటారు
ఎంత యెంతటివారికైనా
ఇంద్రభోగం - అక్కడే

మగువమీకు జోడైతేనూ
మధువుగూడ తోడైతేనూ
పడుచుదనం రగిలేనండి
గడుసుదనం పెరిగేనండి
అరవైలో ఇరవైలాగే ఆడుకుంటారు
చెలరేగి ఎవ్వరినైనా గెలుచుకుంటారు
అంతులేని ఈ జగానికి
అసలుమూలం అక్కడే 




ఏమే ఒప్పులకుప్ప పాట సాహిత్యం

 
చిత్రం: మహాబలుడు (1969)
సంగీతం: యస్.పి. కోదండపాణి
సాహిత్యం: ఆరుద్ర
గానం: యస్.పి. బాలు

ఏమే ఒప్పులకుప్పా, నిను
ప్రేమిస్తే అది తప్పా !
అలరించే జవరాలా - నీ
అందం దాచెదవేలా - రావేలా !

ఓ విరిబోణి - కులికే అలివేణి
నీ వయ్యారాల, తియ్యదనాలు, చవిచూపవే,
రేపు మనసార - మనువాడు తానే,
నేడు తమిదీర - పులకించనీవే

నీ పరువాలు - అవి నా మురిపాలు
నా బిగికౌగిలిలో - నీ సొగసంతా కరిగించవే
కులుకు బింకాలు పొంకాలు దోచి
కోటి బాహువుల బంధించనీవే




మగాడంటే పాట సాహిత్యం

 
చిత్రం: మహాబలుడు (1969)
సంగీతం: యస్.పి. కోదండపాణి
సాహిత్యం: ఆరుద్ర 
గానం: రాజబాబు, పి. సుశీల 

మగాడంటే మజావున్నా
అదోలాంటి భయం
సరాగాలూ విలాసాలూ
తెలియవో యీ నిజం

నేబాలను - ఏమెరుగను
నీవంటే వుందిలే ప్రియం
ఈ నిగ నిగ మేనూ నీకె దాల్చితిరా
ఈ కులుకుల గోమూ కొత్తగ నేర్చితిరా
నునుసిగ్గులా విరిమొగ్గనూ
నిను చూస్తే అవుతా పరవశం 

నీ ముసిముసినవ్వు గుసగుసలాడినచో
నా మిసమిసలన్నీ మేలము లాడునురా
కొన గోటితో - నను తాకితే
ఎదనిండా ఎదేదో సుఖం





రావేలా ఓ ప్రియా పాట సాహిత్యం

 
చిత్రం: మహాబలుడు (1969)
సంగీతం: యస్.పి. కోదండపాణి
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి 
గానం: పి. సుశీల 

రావేలా ! జాగేలా
ఓ ప్రియా  నా ప్రియా
సిగలోన మల్లెలు పిలిచెను
గగనాన తారలు నిలిచెను
నీ కోసం నా పరువం
రేకులు విరిసీ నిలిచెను
రవిచంద్రులే వెలిగేదాకా 
భువనమ్ములే నిలిచేదాకా 
గంగమ్మతల్లీ కడుపు చల్లగా

గలగలమని పారేదాకా
చల్లగ నీవుండాలి 
నా నోములు పండాలి

ఆశల దివ్వెలు ఆరకముందే
అపరంజి మువ్వలు ఆగకముందే
ఒడిలోన తియ్యగ ఒదిగేకాలం
బడబానలమె రగులకముందే 
నీ రాకకై వేనేనూ  నా
కడ ఊపిరి దాచేనూ




ఓ..ఓ..విశాల గగనం లో పాట సాహిత్యం

 
చిత్రం: మహాబలుడు (1969)
సంగీతం: యస్.పి. కోదండపాణి
సాహిత్యం: ఆరుద్ర
గానం: ఎస్.పి. బాలు, పి. సుశీల

పల్లవి:
ఓ..ఓ..విశాల గగనం లో చందమామా
ప్రశాంత సమయం లో కలువలేమా
ఒడిలోన వాలితే ఒకసారి కరిగితే నేరమా...ఆ..

ఓ..ఓ..విశాల గగనములో చందమామా
ప్రశాంత సమయం లో కలువలేమా
ఒడిలోన వాలితే ఒకసారి కరిగితే నేరమా...ఆ..

చరణం: 1
వన్నెలలో చిన్నెలలో తేనెలున్నవి
నా కన్నులనే గిన్నెలతో తాగమన్నవి
వన్నెలలో చిన్నెలలో తేనెలున్నవి
నా కన్నులనే గిన్నెలతో తాగమన్నవి

వొలికే.. మధువు ..కొసరే.. వధువూ రెండూ...నీవే...

ఓ..ఓ..విశాల గగనములో చందమామా
ప్రశాంత సమయం లో కలువలేమా
ఒడిలోన వాలితే ఒకసారి కరిగితే నేరమా...ఆ..

చరణం: 2
చుక్కలలో జాబిలిలా వెలుగుతావులే
నా చక్కదనం దొరలాగా ఏలుతావులే
చుక్కలలో జాబిలిలా వెలుగుతావులే
నా చక్కదనం దొరలాగా ఏలుతావులే

తీరే.. తనివి.. మీరే.. అలవి.. ఏదో...గారడీ...

ఓ..ఓ..విశాల గగనములో చందమామా
ప్రశాంత సమయం లో కలువలేమా
ఒడిలోన వాలితే ఒకసారి కరిగితే నేరమా...ఆ..

ఓ..ఓ..విశాల గగనములో చందమామా
ప్రశాంత సమయం లో కలువలేమా
ఒడిలోన వాలితే ఒకసారి కరిగితే నేరమా...ఆ..



ఇక్కడే ఉన్నది (ఏటికే ఎదురీదుతా) పాట సాహిత్యం

 
చిత్రం: మహాబలుడు (1969)
సంగీతం: యస్.పి. కోదండపాణి
సాహిత్యం: ఆరుద్ర
గానం: పి. సుశీల

ఇక్కడే - ఉన్నదీ
చక్కనీ - చిన్నదీ - రా! రా! రా!
ఏటికీ ఎదురీదకు
ఇంతి చెలిమి విడనాడకూ 
నదులన్ని కలవాలి కడలిలోనె 
ఎద ఉంటె కరగాలి వలపులోనె
కమలాన్ని భ్రమరము కలియుటలేదా
కలువకై నెలరాజు వెలుగుటలేదా !
చిలుకతో గోరింక కులుకుటలేదా !
కలికిని చెలికాడు కాదనరాదురా 
జవరాలితోడా మేలమాడా జాలమేలరా

లతకూన తరువును పెనవేయదా
లాలించితే హొయలు చిగురించదా :
జగతిలో ప్రణయమే సహజమురా !
మగువకూ మగవాడు మనసీయవలెరా 
మురిపాలతోడా బాలతోడా తేలవేలరా

Palli Balakrishna Sunday, March 17, 2019

Most Recent

Default