Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Premalayam (1995)



చిత్రం: ప్రేమాలయం (1995)
సంగీతం: రామ్ లక్ష్మణ్
సాహిత్యం: వెన్నలకంటి (All)
గానం: యస్.పి.బాలు
నటీనటులు: మాధురీ దీక్షిత్, సల్మాన్ ఖాన్
దర్శకత్వం: సూరజ్ ఆర్. బరజాత్య
నిర్మాత: తారాచంద్ బరజాత్య
విడుదల తేది: 1995

మదిలో మెదిలే మాటిది పాటై పలికే ప్రేమిది
మదిలో మెదిలే మాటిది పాటై పలికే ప్రేమిది
తెలిసి మనసే దాచెనే చిత్రమైంది నా చెలి
మదిలో మెదిలే మాటిది పాటై పలికే ప్రేమిది

చూసేనిలా...
చూసి చూడని చూపుల్లోన  ఓరగా చూసేనిలా
సిగ్గే ఇలా...
మొగ్గే వేసి వలపుల తలూపే తీయగా సిగ్గే ఇలా
ఆపనే నన్నిలా చిత్రమైంది నా చెలి

మదిలో మెదిలే మాటిది పాటై పలికే ప్రేమిది

తొలి సంధ్యలా...
గుండెళ్లోన వెలుగే కురిసే వెచ్చగా తొలి సంధ్యలా
తెలుసామికే...
తన చేతుల్లోనే ఉందని నా జీవితం తెలుసామికే
సాటేలేని నెచ్చెలి చిత్రమైంది నా చెలి

మదిలో మెదిలే మాటిది పాటై పలికే ప్రేమిది
మదిలో మెదిలే మాటిది పాటై పలికే ప్రేమిది


********   ********   *********


చిత్రం: ప్రేమాలయం (1995)
సంగీతం: రామ్ లక్ష్మణ్
సాహిత్యం: వెన్నలకంటి
గానం: యస్.పి.బాలు, చిత్ర

టెన్ నైన్ ఎయిట్ సెవెన్
సిక్స్ ఫైవ్ ఫోర్ త్రీ
టూ వన్ లెట్స్ స్టార్ట్ ద ఫన్

చల్లని గాలుల వెల్లువకే ఎగిరేనమ్మా వోణీలు
చల్లని గుండెను అల్లుకునే అల్లరి వయసుకు బోణీలు
కలయో... లేక మాయో ఐతే ఇది ఏంటో....
ఈ పిల గాలి చేసింది మహిమా....
ఈ మదిలోనె దాగుంది మహిమ
గాలే కుదురుగ ఉండదే
నువు వల వేస్తే లొంగదే ఎలా నువ్వు పడతావో పట్టుకో

ఓ ఓ ఓ ఈ పిల గాలి చేసింది మహిమా...

అందాలా బుల్లెమ్మ పట్నం బాబు తో వచ్చింది
ఎంకి నాయుడు బావల్లే ఈడు జోడు బాగుంది

పూలే విసిరింది వసంతం పలికే రాగాలు అనంతం
హ పూలే విసిరింది వసంతం పలికే రాగాలు అనంతం
మదిలో చేసింది సంకేతం ఇక్కడే ఉందాం కొన్నాళ్ళు
మునుపెన్నడూ లేని వింత పూదోట లో తెలిసే చూడు

ఈ పిల గాలి చేసింది మహిమా - మహిమా
నీ మది లోనే దాగుంది మహిమా
గాలే కుదురుగ ఉండగా
నే వల వేస్తే లొంగద ఎలా నీవు పడతావో చూసుకో....
ఓ ఓ ఓ ఈ పిల గాలి చేసింది మహిమా...

చెప్పవె చెప్పవె బుల్లెమ్మా
గుట్టే విప్పవె బుల్లెమ్మా
ఏడా నుంచి వచ్చావు ఏడకు వెళుతున్నావు

మాతో కలిసింది ప్రయాణం పలికే ఏకాంతమే గానం
మాతో కలిసింది ప్రయాణం పలికే ఏకాంతమే గానం
కలిసే సరికొత్తగ స్నేహం ఇంకా ఏమౌనో ఏమో
మరి ఇంత దూరమూ నాతో
ఎలా వచ్చినావే నేరజాణ

ఈ పిల గాలి చేసింది మహిమా - మహిమా
నీ మది లోనే దాగుంది మహిమా
గాలే కుదురుగ ఉండదే
నువు వల వేస్తే లొంగదే ఎలా నువ్వు పడతావో పట్టుకో

ఓ ఓ ఓ ఈ పిల గాలి చేసింది మహిమా...
మహిమా...


********   *********  *********


చిత్రం: ప్రేమాలయం (1995)
సంగీతం: రామ్ లక్ష్మణ్
సాహిత్యం: వెన్నలకంటి
గానం: చిత్ర

దొరికెనమ్మా... దొరికెనమ్మ
మా మరిది గారికి మంచి జోడీ దొరికెనమ్మా
దొరికెనమ్మా... దొరికెనమ్మ
మా మరిది గారికి మంచి జోడీ దొరికెనమ్మా
ఈ మరిది పెళ్లి నే జరుపుతాలే
సంతోషమే పొంగిపోగా

దొరికెనమ్మా... దొరికెనమ్మ
మా మరిది గారికి మంచి జోడీ దొరికెనమ్మా

ఈ మరిదేమో మరి నేడు పెళ్లి కొడుకాయనే
పెళ్లి పెత్తనం ఈ వదినే చేయంగా
ప్రేమలు విరిసేనటా మమతలు ముడులే పడి
దేవతలంతా ఆశీర్వాదాలియ్యంగా
గుర్రం పైనే ఊరేగి వెళ్లి నీ పెళ్లి కూతురినే తేగ

దొరికెనమ్మా... దొరికెనమ్మ
మా మరిది గారికి మంచి జోడీ దొరికెనమ్మా

వారెవ్వ హ రామయ్య జోడీ ఎంతో బాగుంది
మరిది తోడు కోడలు ఈడు జోడు కుదిరింది
కమ్మని బంధం పది కాలాలు నిలిచే దీవెనలీవయ్యా

తెచ్చిందీ శుభక్షణం నాకె పెత్తనమిల
ఇంటికి నేనే పెద్ద కోడలిని ఇక నుంచి
హుకుం చాలయింతు నమ్మ
కల్లెర్ర జేస్తానమ్మ ఆనిగి మనిగి ఉండాలి తోడి కోడలు
ఇన్నాళ్ల స్వప్నం పండించు స్వర్గం నా ముందరే ఉన్నదంటా

దొరికెనమ్మా... దొరికెనమ్మ
మా మరిది గారికి మంచి జోడీ దొరికెనమ్మా

********   *********  *********


చిత్రం: ప్రేమాలయం (1995)
సంగీతం: రామ్ లక్ష్మణ్
సాహిత్యం: వెన్నలకంటి
గానం: యస్.పి.బాలు

ధిక్తన ధిక్తన ధిక్తన ధిక్ ధిక్తన ధిక్తన ధిక్తన
ధిక్తన ధిక్తన ధిక్తన ధిక్ ధిక్తన ధిక్తన ధిక్తన
మా వదినే చిరు నవ్వుల వాన
ధిక్తన ధిక్తన ధిక్తన ధిక్ ధిక్తన ధిక్తన ధిక్తన
ధిక్తన ధిక్తన ధిక్తన ధిక్ ధిక్తన ధిక్తన ధిక్తన

మా ఇంటికే వెలుగన్నది వదినమ్మలా వచ్చిందిలా
ఇంటిని మొత్తం ప్రేమాలయమై మార్చెను తానే నేటికి
మా ఇంటికే వెలుగన్నది వదినమ్మలా వచ్చిందిలా
పసివాడుగా తనలేదులే ఈ ప్రేమ ఇప్పటి దాకా

ధిక్తన ధిక్తన ధిక్తన హెయ్ ధిక్తన ధిక్తన ధిక్తన
ధిక్తన ధిక్తన ధిక్తన హేయ్ ధిక్తన ధిక్తన ధిక్తన

ఐతే మరి అహ వదినమ్మా నా పెళ్లి నువ్  చెయ్యాలమ్మా..
తోడి కోడలిని వెతకాలమ్మా ఎవరి మాటలు వినకమ్మా
ఐతే మరి అహ వదినమ్మా నా పెళ్లి నువ్  చెయ్యాలమ్మా..
ముమ్మూర్తుల నీ రూపమే అమ్మాయికి ఉండాలంటా

ధిక్తన ధిక్తన ధిక్తన ధిక్ ధిక్తన ధిక్తన ధిక్తన
ధిక్తన ధిక్తన ధిక్తన ధిక్ ధిక్తన ధిక్తన ధిక్తన

ఈ నాటికీ నే పసివాడ్నే  ఇంకో చిన్నోడు పుడతాడంటా
ముద్దు మాటల ముసి ముసి నవ్వుల
బుజ్జి బాబుని ఇవ్వమ్మా
ఈ నాటికీ నే పసివాడ్నే  ఇంకో చిన్నోడు పుడతాడంటా
మేమిద్దరమూ ఈ ఇంటిని నవ్వులతో వెలిగిస్తాము

ధిక్తన ధిక్తన ధిక్తన ధిక్ ధిక్తన ధిక్తన ధిక్తన
ధిక్తన ధిక్తన ధిక్తన హేయ్ ధిక్తన ధిక్తన ధిక్తన
మా వదినే చిరు నవ్వుల వాన
ధిక్తన ధిక్తన ధిక్తన ధిక్ ధిక్తన ధిక్తన ధిక్తన


********   *********  *********


చిత్రం: ప్రేమాలయం (1995)
సంగీతం: రామ్ లక్ష్మణ్
సాహిత్యం: వెన్నలకంటి
గానం: చిత్ర

అమ్మ అమ్మ మన ముంగిట్లో కూసెను నేడో కాకి
అమ్మ అమ్మ మన ముంగిట్లో కూసెను నేడో కాకి
యోగీశ్వరుడా శంకరుడే నా పతి ఔతాడని అంది

అమ్మ అమ్మ మన ముంగిట్లో కూసెను నేడో కాకి
యోగీశ్వరుడా శంకరుడే నా పతి ఔతాడని అంది

చందామమే తలపైనే ఉన్నవాడే నా మొగుడే
చందామమే తలపైనే ఉన్నవాడే నా మొగుడే
ఈశుని కోరి తపసే చేసి ఔతా అతని అర్ధాంగి
ఆశ తీర అతనిని చేర పొంగును నేల నింగి
ఆ పరమేశుని విభూతి పూతై
ఆ పరమేశుని విభూతి పూతై తరీయించాలని ఉంది
యోగీశ్వరుడా శంకరుడే నా పతి ఔతాడని అంది

కన్నె మొజులే సన్న జాజులై విచ్చెను నేటికి ఇలా
అందరొక్కటై చిందులేయగా పండును కమ్మని కల

మనసే పడిన వాడితో నాకు పెళ్లే జరిపించాలి
వెండి కొండల వేలుపు గుండెల నిండుగ నేనుండాలి
ఈ చేతి నిండా గోరింట పండి
ఈ చేతి నిండా గోరింట పండి మదిలో వలపులు నిండి
యోగీశ్వరుడా శంకరుడే నా పతి ఔతాడని అంది

అమ్మ అమ్మ మన ముంగిట్లో కూసెను నేడో కాకి
యోగీశ్వరుడా శంకరుడే నా పతి ఔతాడని అంది



********   *********  *********


చిత్రం: ప్రేమాలయం (1995)
సంగీతం: రామ్ లక్ష్మణ్
సాహిత్యం: వెన్నలకంటి
గానం: యస్.పి.బాలు, చిత్ర

అక్కా నీ మరిదెంతో వెర్రోడే
ఓ అక్కా నీ మరిదెంతో వెర్రోడే
అయ్యో రామ పిట్టాలకు వల వేస్తాడే
అయ్యో రామ పిట్టాలకు వల వేస్తాడే

జల్సా చేసే దసరా బుల్లోడే
జల్సా చేసే దసరా బుల్లోడే
అయ్యో రామ పిట్టాలకు వల వేస్తాడే
అయ్యో రామ పిట్టాలకు వల వేస్తాడే

చెప్పిందేమొ నేను తెమ్మని చింతకాయ
మరేమో కర్జూరం తెచ్చాడే వెర్రోడే
వేవిల్లంటు నేను మావిల్లడిగితేను
ఖర్భుజా తెచ్చాడే బుర్రే చిన్నదంటా
పనికిరాని బంధర్ పిచ్చోడే
అరె పనికిరాని బంధర్ పిచ్చోడే

అయ్యో రామ పిట్టాలకు వల వేస్తాడే
అయ్యో రామ పిట్టాలకు వల వేస్తాడే
హొయ్ హొయ్ అక్కా నీ మరిదెంతో వెర్రోడే
అయ్యో రామ పిట్టాలకు వల వేస్తాడే

చెప్పిందేమొ నేను తెమ్మని నిమ్మకాయ
మరేమో సపోటా తెచ్చాడే వెర్రోడే
పుళ్లనిదేదో నేను తెమ్మంటే అబ్బాయి
ఓ బస్తాడుగా తెచ్చాడే మిఠాయి
పోజే కొడితే బోల్తా పడతాడే
పోజే కొడితే బోల్తా పడతాడే

అయ్యో రామ పిట్టాలకు వల వేస్తాడే
అయ్యో రామ పిట్టాలకు వల వేస్తాడే
ఓ యమ్మా అక్కా నీ మరిదెంతో వెర్రోడే
అయ్యో రామ పిట్టాలకు వల వేస్తాడే


వదినా  నీ చెల్లెంతో గొప్పంటా
ఓ వదినా  నీ చెల్లెంతో గొప్పంటా
అయ్యో రామ పిట్టలదే రాజ్యమంటా
అయ్యో రామ పిట్టలదే రాజ్యమంటా
కాపాడాలి నన్నాపైవాడే
హొయ్ కాపాడాలి నన్నాపైవాడే

అయ్యో రామ పిట్టలదే రాజ్యమంటా
అయ్యో రామ పిట్టలదే రాజ్యమంటా

మీ ఆనతిని నేను పాటించాను కాను
కోరెను మన్నించెయ్ ఇక నైనా క్షమించెయ్
ఏ శిక్షైనా వెయ్యి ఒప్పుకుంటాను నేను
అలా మధిలో బాధ తప్పించాలి నువ్వే
బానిసలాగ  ఉండే మంచోడ్నే
అరె బానిసలాగ  ఉండే మంచోడ్నే

అయ్యో రామ పిట్టలదే రాజ్యమంటా

అయ్యో రామ - పిట్టలదే రాజ్యమంటా (4)

Most Recent

Default