Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Manchi Kutumbam (1968)
చిత్రం: మంచి కుటుంబం (1968)
సంగీతం: యస్.పి.కోదండపాణి
నటీనటులు: అక్కినేని నాగేశ్వరరావు, షావుకార్ జానకి, కృష్ణ, విజయనిర్మల, చంద్రమోహన్, కాంచన, గీతాంజలి, విజయ శ్రీ, కనక దుర్గ, హేమలత 
దర్శకత్వం: వి.మధుసూదనరావు
నిర్మాత: పి.మల్లికార్జున్ రావు
విడుదల తేది: 15.03.1968Songs List:ప్రేమించుట పిల్లలవంతు పాట సాహిత్యం

 
చిత్రం: మంచి కుటుంబం (1968)
సంగీతం: యస్.పి.కోదండపాణి
సాహిత్యం: ఆరుద్ర
గానం: జేసుదాసు, పి.సుశీల, యస్.జానకి, షావుకార్ జానకి,రాళ్ళబండి 

ఓ నవభారత యువతీ యువకులారా
వారి పవిత్ర జననీ జనకుల్లారా 
వినండి వినండి ప్రేమ పురాణం 
వివరించి చూడండి పురాణసారం 

ప్రేమించుట పిల్లలవంతు 
దీవించుట పెద్దలవంతు 
పెదలు ఔనంటే అది ప్రణయం 
వద్దని విడదీస్తే అది ప్రళయం

ఒక ఉదాహరణ:
వాడని పూవేనీవు - నిను వీడని తుమ్మెద నేను 
విరిసిన జాబిలి నీవు - నినువిడలేని వెన్నెలనేను 

ఓ పయనమయ్యే పెళ్ళి కుమారికా 
వినుమా నా కన్నీటి నివేదిక
మనసు నాదైతే నీ మనువు వేరొకరితోనా
మమత నాదైతే నీ మనుగడ వేరొకరితోనా
ననుగన్న వారిని ఎదురాడలేను 
మనసైన నినుబాసి మనజాలలేను

లైలా లైలా  లైలా 

ఆనాడు పెద్దలే అంగీకరిస్తే, 
ఈ గాథ వేరుగా మారేది కాదా
కాబట్టి....  II ప్రేమించుట II

ఇంకో ఉదాహరణ.

(రచన: షేక్స్పియర్)

ఓ రోమియో.... యిఫ్ దట్ బై బెంట్ ఆఫ్ లౌ
బి హానరబుల్.
దై పర్పస్ మారేజ్, సెండ్ మి వర్డ్ టుమారో, ఏ థౌజండ్ టైమ్స్ గుడ్నైట్ 
రోమియో....
మైడియర్
ఎట్ వాటోక్లాక్ టుమారో షల్ ఐ సెండ్ టుది ? బై ది అవర్ ఆఫ్ నైన్
ఐవిల్ నాట్ ఫెయిల్.... గుడ్నైట్ గుడ్నైట్. 
పార్టింగ్ యీజ్ సచ్ స్వీట్ సారో
దట్ ఐ షుడ్ బి గుడ్ నైట్
టిల్ యిట్ బి మారో

స్టాప్ దై అన్ హా లోడ్ టాయిల్ వైల్ మాంటేగ్ 
కెన్ వెంజన్స్ బి పర్స్యూడ్ పరధర్ దాన్ డెత్ ? 
కండెమ్డ్ విలన్, ఐ డూ అప్రెహెండ్ దీ, 
ఒబే అండ్ గో విత్ మి , ఫార్ దౌ మస్ట్ డై

హియర్ యీజ్ టు మై లవ్ 
దట్ విత్ ఎ కిస్ ఐ డై 

ఉదాహరిస్తే ఎన్నో గాథలు
హృదయ విదారక విషాద చరితలు
స్వయంవరంలో ఎంచుకున్నదీ రాణీ సంయుక్త 
చాటెను జనకుడు కూడదన్ననూ చెలుడే తనభర్త 
దేవునివంటి ప్రియుడే దొరికిన జీవితమే ధన్యం 
తెగించి చివరకు దీవనలందిన రుక్మిణి కథ పుణ్యం

దేశం ఏదైనా, కాలం ఏదైనా
సందేశం మాత్రం ఒకటే, సందేశం మాత్రం ఒక టే
కాబట్టి  II ప్రేమించుట II

ప్రేమించుట పిల్లల వంతు దీవించుట పెద్దలవంతు 
పెద్దలు ఔనంటే అది ప్రణయం వద్దని విడదీస్తే అది ప్రళయం
నెరా నెరా నెరబండి పాట సాహిత్యం

 
చిత్రం: మంచి కుటుంబం (1967)
సంగీతం: యస్.పి.కోదండపాణి
సాహిత్యం: కొసరాజు 
గానం: పిఠాపురం

నెరా నెరా నెరబండి, జరా జరా విలుపుబండి 
లేడీ సైకిల్ బండి బోల్తా కొట్టిందండి
జబ్బలదాకా జాకెట్టు, జానెడు బెత్తెడు లంగాకట్టు 
తాటిపీచు తలకట్టు రయ్యినబోయే రాకెట్టు 
అబ్బదాని సోకుజూడ ఎవరికైన మోజుపుట్టు.

కొరా కొరా చూచుకుంటూ, బరాబరా తొక్కుకుంటూ 
డింగ్ డాంగ్ బెల్ కొడుతూ టిప్పు టాపుగ పోతుంటే 
అబ్బదాని టాపుచూడ ఎవరికైన మోజుపుట్టు

సీతాకోక చిలుకలాగా, బొండుమల్లె చెండులాగ 
మనసును గుంజేసుంటే, మత్తున ముంచేస్తుంటే
 అబ్బదాని మత్తుజూడ ఎవరికైన మోజుపుట్టు.
నీలో ఏముందో ఏమో... పాట సాహిత్యం

 
చిత్రం: మంచి కుటుంబం (1967)
సంగీతం: యస్.పి.కోదండపాణి
సాహిత్యం: ఆరుద్ర
గానం: ఘంటసాల, పి.సుశీల

పల్లవి:
నీలో ఏముందో ఏమో...
మనసు నిన్నే వలచింది... సొగసులన్ని కోరింది..

నీలో ఏముందో ఏమో...
మనసు నిన్నే వలచింది... సొగసులన్ని ఇమ్మంది

చరణం: 1
నీ కాటుక కన్నులలో చీకటి గుసగుసలు..ఆ..ఆ..
నీ కమ్మని నవ్వులలో వెన్నెల మిసమిసలు..ఆ..ఆ..
నీ కాటుక కన్నులలో చీకటి గుసగుసలు...
నీ కమ్మని నవ్వులలో వెన్నెల మిసమిసలు...

నీ ఎదలో పూల పొదలే పూచి... మధువులు చిందాయి
నీ ఎదలో పూల పొదలే పూచి... మధువులు చిందాయి
నా మమతలు పెంచాయి...

నీలో ఏముందో ఏమో...
మనసు నిన్నే వలచింది... సొగసులన్ని ఇమ్మంది...

చరణం: 2
నీ అల్లరి చూపులకే ఒళ్లంతా గిలిగింతా..మ్మ్.
నీ తుంటరి చేష్టలకే ..మదిలో పులకింత..ఉహు..
నీ అల్లరి చూపులకే ఒళ్ళంతా గిలిగింత...
నీ తుంటరి చేష్టలకే ...మదిలో పులకింత..

నీ వంపులలోన సొంపులలోన వలుకును వయ్యారం
నీ వంపులలోన సొంపులలోన వలుకును వయ్యారం
అది వలపుల జలపాతం...

నీలో ఏముందో ఏమో...
మనసు నిన్నే వలచింది... సొగసులన్ని కోరింది..

చరణం: 3
నీ పరువం చూడనిచో పొద్దే పోదుకదా..ఓహో..
నీ పలుకులు వినకుంటే నిదురే రాదు కదా..ఆహ..
నీ పరువం చూడనిచో పొద్దే పోదుకదా...
నీ పలుకులు వినకుంటే నిదురే రాదు కదా...

నీ సరసన లేని నిమిషం కూడ ఏదో వెలితి సుమా
నీ సరసన లేని నిముషం కూడ ఏదో వెలితి సుమా
ఇక నీవే నేను సుమా..ఇక నీవే నేను సుమా...

నీలో ఏముందో ఏమో...
మనసు నిన్నే వలచింది ...సొగసులన్ని కోరింది..
నీలో ఏముందో ఏమో...
మనసు నిన్నే వలచింది... సొగసులన్ని ఇమ్మంది...

ఎవరూ లేని చోటా..పాట సాహిత్యం

 
చిత్రం: మంచి కుటుంబం (1967)
సంగీతం: యస్.పి.కోదండపాణి
సాహిత్యం: ఆరుద్ర
గానం: ఘంటసాల, పి.సుశీల

పల్లవి:
ఎవరూ లేని చోటా.. ఇదిగో చిన్న మాటా
ఎవరూ లేని చోటా.. ఎయ్.. ఇదిగో చిన్న మాటా
ఇంకా.. ఇంకా..ఇంకా.. 

చేరువ కావాలీ.. ఇద్దరు ఒకటై పోవాలీ
ఎవరూ లేని చోటా.. ఇదిగో చిన్నమాటా
ఎవరూ లేని చోటా.. ఎయ్.. ఇదిగో చిన్న మాటా.. ఆ.. ఆ..

చరణం: 1
చిలిపి ఊహలే రేపకూ..ఊ.. సిగ్గు దొంతరలు దోచకూ..ఊ..
చిలిపి ఊహలే రేపకూ.. సిగ్గు దొంతరలు దోచకూ
జిలిబిలి ఆశలు.. పెంచకు.. పెంచకు.. పెంచకూ
పెంచి నన్ను వేదించకూ..ఊ..

ఒంపులతో ఊరించకు.. ఉసి గొలిపి వారించకు
ఒంపులతో ఊరించకు.. ఉసి గొలిపి వారించకు
కలిగిన కోరిక.. దాచకు.. దాచకు.. దాచకూ..
దాచి నన్ను దండించకూ..ఊ..

ఎవరూ లేని చోటా.. ఇదిగో చిన్నమాటా
ఎవరూ లేని చోటా.. ఎయ్.. ఇదిగో చిన్న మాటా.. ఆ.. ఆ..

చరణం: 2
కాదని కౌగిలి వీడకూ..ఊ.. కలలో కూడ కదలకూ..ఊ..
కాదని కౌగిలి వీడకూ.. కలలో కూడా కదలకూ
కలిగే హాయిని.. ఆపకు.. ఆపకు.. ఆపకూ
ఆపి నన్ను ఆడించకూ..ఊ..

ఒడిలో చనువుగ వాలకు.. దుడుకుతనాలు చూపకు
ఒడిలో చనువుగ వాలకు.. దుడుకుతనాలు చూపకు
ఉక్కిరి బిక్కిరి.. చేయకు.. చేయకు.. చేయకూ...
చేసి మేను మరిపించకూ..ఊ..

ఎవరూ లేని చోటా.. ఇదిగో చిన్న మాటా
ఇంకా.. ఇంకా..
ఇంకా చేరువ కావాలీ.. ఇద్దరు ఒకటై పోవాలీ
ఎవరూ లేని చోటా.. ఇదిగో చిన్న మాటా..ఆ..ఆ..
తుళ్ళి తుళ్ళి పడుతోంది పాట సాహిత్యం

 
చిత్రం: మంచి కుటుంబం (1968)
సంగీతం: యస్.పి.కోదండపాణి
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి
గానం: పి.సుశీల, యస్.జానకి, బి.వసంత 

పల్లవి:
తుళ్ళి తుళ్ళి పడుతోంది తొలకరి వయసు
తుళ్ళి తుళ్ళి పడ్తుంది తొలకరి వయసు
మళ్ళీ మళ్ళీ ఈ రోజు రాదని తెలుసు
తుళ్ళి తుళ్ళి పడుతోంది తొలకరి వయసు

చరణం: 1
బుగ్గ మీద కెంపులేవో...నిగ్గు లోలికి పోగాబుగ్గ మీద కెంపులేవో..
.నిగ్గు లోలికి పోగాసిగ్గులేవో నాలో...మొగ్గ తొడిగి రాగాసిగ్గులేవో నాలో...
మొగ్గ తొడిగి రాగాసిరి మల్లెల పందిరి లోనా...నవమంగళ వేదిక పైనా...
సిరి మల్లెల పందిరి లోనా...నవమంగళ వేదిక పైనా...జరిగేను కళ్యాణ వైభోగం...

తుళ్ళి తుళ్ళి పడుతోంది తొలకరి వయసు మళ్ళీ మళ్ళీ ఈ రోజు రాదని తెలుసు
తుళ్ళి తుళ్ళి పడుతోంది తొలకరి వయసు

చరణం: 2
కోరుకున్న వరుడే చేరుకున్న వేళా..కోరుకున్న వరుడే చేరుకున్న వేళా
పొంగి పొంగి తానే చెంగులాగు వేళా...పొంగి పొంగి తానే చెంగులాగు వేళా
చల చల్లగ గంధం పూసి..మెల మెల్లగ కౌగిట దూసి..
చల చల్లగ గంధం పూసి..మెల మెల్లగ కౌగిట దూసి..
లతవోలే జత కూడి లాలింతునే...

తుళ్ళి తుళ్ళి పడుతోంది తొలకరి వయసు
మళ్ళీ మళ్ళీ ఈ రోజు రాదని తెలుసు
తుళ్ళి తుళ్ళి పడుతోంది తొలకరి వయసు

చరణం: 3
ఎంత గడుసువాడో ఎన్ని నేర్చినాడో...ఎంత గడుసువాడో ఎన్ని నేర్చినాడో
తెలుసుకోవే చెల్లి వలపు పాలవెల్లి...తెలుసుకోవే చెల్లి వలపు పాలవెల్లి
అతడెంతటి మొనగాడైనా...గిలి గింతల చెలికాడైనా
అతడెంతటి మొనగాడైనా...గిలి గింతల చెలికాడైనా
తొలి రేయి పరువాల బంధింతునే....

తుళ్ళి తుళ్ళి పడుతోంది తొలకరి వయసు
మళ్ళీ మళ్ళీ ఈ రోజు రాదని తెలుసు
తుళ్ళి తుళ్ళి పడుతోంది తొలకరి వయసు
మనసే అందాల బృందావనం పాట సాహిత్యం

 
చిత్రం: మంచి కుటుంబం (1968)
సంగీతం: యస్.పి.కోదండపాణి
సాహిత్యం: ఆరుద్ర
గానం: పి.సుశీల

పల్లవి:
మనసే అందాల బృందావనం
వేణు మాధవుని పేరే మధురామృతం
మనసే అందాల బృందావనం
వేణు మాధవుని పేరే మధురామృతం

కమ్మని నగుమోము కాంచుటె తొలినోము
కడగంటి చూపైన కడుపావనం

మనసే అందాల బృందావనం
వేణు మాధవుని పేరే మధురామృతం

చరణం: 1
రాధను ఒక వంక లాలించునే
సత్యభామను మురిపాల తేలించునే
రాధను ఒక వంక లాలించునే
సత్యభామను మురిపాల తేలించునే...

మనసార నెరనమ్ము తనవారినీ
ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ ఆ....
మనసార నెరనమ్ము తనవారిని
కోటి మరులందు సుధలందు తనియింతునే..

చరణం: 2
మనసే అందాల బృందావనం
దనిస దని నిదదమ
మదని నిదదమ
గమద దమమగస
గగ మమ మగస దని
గసా మగా దమా నిద
గమదనిస బృందావనం

మాగ మగస
దామ గమద
నీద నిసమ
గమ మద దనినిస
నిసమద మగస
గమ దనిసగ బృందావనం

సమగస గమదని
గదమగ మదనిస
మనిద మదనిసగ
ఆ...........
మనసే అందాల బృందావనం
వేణు మాధవుని పేరే మధురామృతం
త్యాగ శీలవమ్మా మహిళా పాట సాహిత్యం

 
చిత్రం: మంచి కుటుంబం (1967)
సంగీతం: యస్.పి.కోదండపాణి
సాహిత్యం: ఆరుద్ర
గానం: ఘంటసాల

ధనము నీయవచ్చు, అసువులీయగవచ్చు 
ప్రాణ సఖుని యిచ్చి బ్రతుక తరమే...
త్యాగ శీలవమ్మా మహిళా అనురాగ శీలవమ్మా 
తోటివారికై సకలము నొసగే కరుణామయివమ్మా 

నీ చిరునవ్వులు సోదరి జడలో విరిసే మల్లియలు 
చల్లని నీ దీవనలు నవదంపతుల వలపుల వెన్నెలలు 
నిను వీడి పోయినది వలచిన హృదయం 
నీలో మిగిలే స్మృతులే మధురం
డింగ్ డాంగ్ డింగ్ డాంగ్ పాట సాహిత్యం

 
చిత్రం: మంచి కుటుంబం (1967)
సంగీతం: యస్.పి.కోదండపాణి
సాహిత్యం: షకీల్ బదాయుని
గానం: గీతాదత్

డింగ్ డాంగ్ డింగ్ డాంగ్ డింగ్ లలా 
ఓ కోయీ దిల్ కో సంభాలో మేరి దిల్ చాలా 
గున్ గున్ బోలే కానోమే రస్ ఖోలే 
సంగ్ సంగ్ డోలే కోయి భంవ్రా

చోరీ చోరీ బగియామే ఆనెలగా వో
చుప్ చుప్ అఖియా మిలనే లగా వో
భోలి భాలీ కలియామైతో బతియోమే ఆగయీ 
మేరా నరహా యే దిల్ మేరా


Most Recent

Default