Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Ramudu Bheemudu (1964)


చిత్రం: రాముడు-భీముడు (1964)
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు
సాహిత్యం: సినారె
గానం: ఘంటసాల, సుశీల
నటీనటులు: యన్.టి.రామారావు, జమున, యల్. విజయలక్ష్మి
దర్శకత్వం: తాపీ చాణక్య
నిర్మాత: డి.రామానాయుడు
విడుదల తేది: 21.05.1964

తెలిసిందిలే తెలిసిందిలే
నెలరాజ నీ రూపు తెలిసిందిలే
తెలిసిందిలే తెలిసిందిలే
నెలరాజ నీ రూపు తెలిసిందిలే

చలిగాలి రమ్మంచు పిలిచింది లే
చెలి చూపు నీ పైన నిలిచింది లే
చలిగాలి రమ్మంచు పిలిచింది లే
చెలి చూపు నీ పైన నిలిచింది లే

ఏముందిలే.. ఇపుడేముందిలే
ఏముందిలే.. ఇపుడేముందిలే
మురిపించు కాలమ్ము
ముందుందిలే నీ ముందుందిలే

తెలిసిందిలే తెలిసిందిలే
నెలరాజ నీ రూపు తెలిసిందిలే

వరహాల చిరునవ్వు కురిపించవా
పరువాల రాగాలు పలికించవా
ఆ .. ఆ .. ఓ .. ఓ ..ఆ....
వరహాల చిరునవ్వు కురిపించవా
పరువాల రాగాలు పలికించవా

అవునందునా.. కాదందునా
అవునందునా కాదందునా
అయ్యారే విధి లీల
అనుకొందునా ..అనుకొందునా

తెలిసిందిలే తెలిసిందిలే
నెలరాజ నీ రూపు తెలిసిందిలే

సొగసైన కనులేమో నాకున్నవి
చురుకైన మనసేమో నీకున్నది
సొగసైన కనులేమో నాకున్నవి
చురుకైన మనసేమో నీకున్నది

కనులేమిటో.. ఈ కథ ఏమిటో
కనులేమిటో ఈ కథ ఏమిటో
శృతి మించి రాగాన
పడనున్నది.. పడుతున్నది

ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ

తెలిసిందిలే తెలిసిందిలే
నెలరాజ నీ రూపు తెలిసిందిలే


**********  **********  **********


చిత్రం: రాముడు-భీముడు (1964)
సంగీతం: పెండ్యాల
సాహిత్యం: సినారె
గానం: ఘంటసాల, సుశీల

అదే అదే అదే నాకు అంతు తెలియకున్నదీ
ఏదో లాగ మనసు లాగు తున్నదీ
అదే అదే అదే......
అదే అదే అదే నాకు అంతు తెలియకున్నదీ
ఏదో లాగ మనసు లాగు తున్నదీ
అదే అదే అదే......

అదే అదే అదే వింత నేను తెలుసుకున్నదీ
అదే నీ వయసు లోన ఉన్నదీ
అదే అదే అదే......
అదే అదే అదే వింత నేను తెలుసుకున్నదీ
అదే నీ వయసు లోన ఉన్నదీ
అదే అదే అదే......

చరణం: 1
నీ నడకలోన రాజహంస అడుగులున్నవీ
నీ నవ్వులోన సన్నజాజి పువ్వులున్నవీ
అహా హా హాహా అహాహా హాహా
అహాహా అ హాహాహా హా

ఏమేమి ఉన్నవీ ఇంకేమి ఉన్నవి
ఏమేమి ఉన్నవీ ఇంకేమి ఉన్నవి
ఈ వేళ నా పెదవులేల వణుకుచున్నవీ
అదే అదే అదే వింత నేను తెలుసుకున్నదీ

చరణం: 2
నీ చేయి తాకగానె ఏదో హాయి రగిలెనూ
ఓయీ అని పిలవాలని ఊహ కలిగెను
అహా హా హాహా అహాహా హాహా
అహాహా అ హాహాహా హా

ఏమేమి ఆయెను ఇంకేమి ఆయెను
ఏమేమి ఆయెను ఇంకేమి ఆయెను
ఈ వేళ లేత బుగ్గలేల కందిపోయెనూ
ఏదో లాగ మనసు లాగు తున్నదీ
అదే వింత నేను తెలుసుకున్నదీ
అదే నీ వయసు లోన ఉన్నదీ
అదే అదే అదే......
వింత నేను తెలుసుకున్నదీ


********  ********  ********


చిత్రం: రాముడు-భీముడు (1964)
సంగీతం: పెండ్యాల
సాహిత్యం: సినారె
గానం: ఘంటసాల, సుశీల

తగునా ఇది మామా! తమరే ఇటు బల్క నగున
తగునా ఇది మామా!
నిగమ మార్గములు తెలిసిన నీవే ఇటులనదగునా...
తగునా ఇది మామా!
అల్లుడనగనెవడు మీ అమ్మాయికి మగడూ
అల్లుడనగనెవడు మీ అమ్మాయికి మగడూ
నీవు కాళ్ళు కడిగి కన్యాదానము చేసిన ఘనుడు
ఆ ఘనుని మీద అలుక బూన ఏటికి చీటికి మాటికి
తగునా ఇది మామా! తమరే ఇటు బల్క నగున
తగునా ఇది మామా!
ఫోఫోర ఫొమ్మికన్ నా గృహమ్మునకు భోజనమ్మునకు
ఇక రా వలదు రా తగదు చీ పో ఫోఫోర ఫొమ్మికన్
అరెరే ఎంతటి మోసగాడవుర నాకే టోపీ వేసినావుర
అరెరే ఎంతటి మోసగాడవుర నాకే టోపీ వేసినావుర
నీ సాహసము పరీహాసము నీ సాహసము పరీహాసము
నిర్భాగ్యుల తోటి సహవాసము
సహించను క్షమించను యోచించను నీ మాటన్
వచ్చిన బాటన్ పట్టుము వేగన్ ఫోఫోర ఫొమ్మికన్
ఫోఫోర ఫొమ్మికన్ నా గృహమ్మునకు భోజనమ్మునకు
ఇక రా వలదు రా తగదు చీ ఫో ఫో
కొడుకులు లేనందుకు తల కొరివి బెట్టువాడనే
నీకు కొరివి బెట్టువాడనే డైరెక్టుగ
స్వర్గానికి చీటి నిచ్చువాడనే తల్లి లేని పిల్ల ఉసురు
తగలదె ఒంటిగ ఉంచగ తగునా ఇది మామా!
అరె ఊరికెల్ల మొనగాడినే
అరె ఊరికెల్ల మొనగాడినే
పెద్ద మిల్లు కెల్ల యజమానినే నీ డాబూసరి బలే బిత్తరి
నీ డాబూసరి బలే బిత్తరి నిజమేనని నమ్మితి పోకిరి
దురాత్ముడ దుష్టాత్ముడ గర్వాత్ముడ నీచుడా
ఇపుడె తెలిసెన్ నీ కథ ఎల్లన్ ఫోఫోర ఫొమ్మికన్
ఫోఫోర ఫొమ్మికన్ నా గృహమ్మునకు భోజనమ్మునకు
ఇక రా వలదు రా తగదు చీ ఫో ఫో


**********  **********  **********


చిత్రం: రాముడు-భీముడు (1964)
సంగీతం: పెండ్యాల
సాహిత్యం: సినారె
గానం: ఘంటసాల, సుశీల

హోయ్ తళుకు తళుకు మని గలగలసాగే (2)
తరుణీ ఇటు రావేమే హొయ్ చమకు చమకుమని
చిన్నారి నడకల చేరుకోవేమే
హోయ్ తళుకు తళుకు మని గలగలసాగే తరుణీ

చరణం: 1
రమ్మనకూ హోయ్ రమ్మనకూ
ఇప్పుడే నను రా రమ్మనకూ హోయ్ రమ్మనకూ
చీకటి ముసిరే దెన్నడూ నా చేతికి అందేదెన్నడూ
ఊ ఊ ఊ
హోయ్ సిగ్గులు తొలిగేదెన్నడూ
నీ బుగ్గలు పిలిచే దెన్నడు
హోయ్ కదిలే కన్నులు మూసుకో
నిన్నటి కలలో మెత్తగా
నా నిద్దుర దోచితి వెందుకూ

ఆ ఆ ఆ

చరణం: 2
హోయ్ మొన్నటి కలలో మత్తుగా
కనుసన్నలు చేసితి వెందుకూ
అంతకు మొన్నటి రాతిరీ
అంతకు మొన్నటి రాతిరీ
గిలిగిలిగింతలు మొదలైనందుకూ

రమ్మనకూ హోయ్ రమ్మనకూ
ఇప్పుడే నను రా రమ్మనకూ హోయ్ రమ్మనకూ
చీకటి ముసిరే దెన్నడూ నా చేతికి అందేదెన్నడూ
ఊ ఊ ఊ

హోయ్ తళుకు తళుకు మని గలగలసాగే (2)
తరుణీ ఇటు రావేమే హొయ్ చమకు చమకుమని
చిన్నారి నడకల చేరుకోవేమే
హోయ్ తళుకు తళుకు మని గలగలసాగే


**********  **********  **********


చిత్రం: రాముడు-భీముడు (1964)
సంగీతం: పెండ్యాల
సాహిత్యం: సినారె
గానం: ఘంటసాల, సుశీల

పల్లవి:
ఉందిలే మంచీకాలం ముందూ ముందూనా
ఉందిలే మంచీకాలం ముందూ ముందూనా
అందరూ సుఖ పడాలి నంద నందనా...
ఉందిలే మంచీకాలం ముందూ ముందూనా
అందరూ సుఖ పడాలి నంద నందనా...
ఉందిలే మంచీకాలం ముందూ ముందూనా
అందరూ సుఖ పడాలి నంద నందనా...
ఆ..ఆ.. ఎందుకూ సందేహమెందుకూ...
రానున్న విందులో నీ వంతూ అందుకో

చరణం: 1
ఎందుకూ సందేహమెందుకూ...
రానున్న విందులో నీ వంతూ అందుకో
ఆ రోజూ అదిగో కలదూ నీ ఎదుటా నీవే రాజువటా...
ఆ... ఆ..
ఉందిలే మంచీకాలం ముందూ ముందూనా
అందరూ సుఖ పడాలి నంద నందనా...
ఏ విటే విటే విటీ ?మంచికాలమంటున్నావు...
ఎలా ఉంటుందో అది ఇశిదంగా చెప్పూ
దేశ సంపద పెరిగే రోజూ మనిషి మనిషిగా బ్రతికే రోజూ
గాంధి మహాత్ముడు కలగన్న రోజూ
నెహ్రూ అమాత్యుడు నెలకొల్పు రోజూ
ఆ రోజెంతో దూరం లేదూ రండయ్యో
అదిగో చూడు రేపే నేడు చిన్నయ్యో
ఆ రోజెంతో దూరం లేదూ రండయ్యో
అదిగో చూడు రేపే నేడు చిన్నయ్యో
బలే బలే బాగా సెప్పావ్ !
కానీ అందుకు మనమేం చెయ్యాలో అది కూడా నువ్వే సెప్పు
అందరి కోసం ఒక్కడు నిలచి ఒక్కని కోసం అందరు కలసి
అందరి కోసం ఒక్కడు నిలచి ఒక్కని కోసం అందరు కలసి
సహకారమే మన వైఖరి ఐతే
ఉపకారమే మన ఊపిరి ఐతే
పేద గొప్పా భేధం పోయి అందరూ
నీది నాదని వాదం మాని ఉందురూ
ఆ రోజెంతో దూరం లేదో రన్నయ్యో
అదిగో చూడు రేపే నేడు చిన్నయ్యో
... ఆ...ఆ..

చరణం: 2
తీయగా బ్రతుకంతా మారగా
కష్టాలు తీరగా సుఖ శాంతులూరగా
ఆకాశ వీధుల ఎదురే లేకుండా
ఉందిలే మంచీకాలం ముందూ ముందూనా
అందరూ సుఖ పడాలి నంద నందనా... ఉందిలే


Most Recent

Default