Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Iddaru Iddare (1976)



చిత్రం: ఇద్దరూ ఇద్దరే (1976)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: ఆరుద్ర
గానం: యస్.పి.బాలు, పి.సుశీల
నటీనటులు: శోభన్ బాబు, కృష్ణంరాజు, మంజుల
దర్శకత్వం: వి.మధుసూదనరావు
నిర్మాతలు: యస్.వెంకటరత్నం, కె.ముఖర్జీ
విడుదల తేది: 01.01.1976

ఒళ్లంత వయ్యారమే పిల్లదాన
ఒకచిన్న ముద్దియ్యవే ఓ కుర్రదాన
ఇవ్వాలనే ఉందిరా చిన్నవాడ
ఎవరైన చూస్తారురా వన్నెకాడ
హరెరెరె ఒళ్లంత వయ్యారమే పిల్లదాన
ఒకచిన్న ముద్దియ్యవే ఓ కుర్రదానా
అమ్మమ్మమ్మ ఇవ్వాలనే ఉందిరా చిన్నవాడ
ఎవరైన చూస్తారురా వన్నెకాడ
హ ఊసులాడా అ చోటుకాదు
అ చాటుఉంది అందాలతోటాలోన
మందార చెట్టుకింద నా ముద్దు చెల్లించవే

ఒ ఒ ఒ ఒళ్లంత వయ్యారమే పిల్లదాన
ఒకచిన్న ముద్దియ్యవే ఓ కుర్రదాన
హ హ హ ఇవ్వాలనే ఉందిరా ఓ చిన్నవాడ
ఎవరైన చూస్తారురా వన్నెకాడా

పువ్వల్లే నవ్వుతావు కౌవ్వించి కులుకుతావు
కులుకంతా కూరవండి మనసారా తినిపించాలి హా ఓ
రారానీ వేళలోనా రాజల్లేవస్తావూ ఏమేమో చేస్తావురా
అబ్బబ్బబ్బ అందాలవాడలోన అద్దాల మేడలోన ఇద్దరమే ఉందామురా
ఒ ఒ ఒ వళ్లంత వయ్యారమే పిల్లదాన ఒకచిన్న ముద్దియ్యవే ఓ కుర్రదాన
అయ్యయ్యయ్య ఇవ్వాలనే ఉందిరా చిన్నవాడ
ఎవ్వరైన చూస్తారురా వన్నెకాడా

ఓ మనసంతా మాలకట్టి మెడలోనా వేస్తాను
మనువాడే రోజుదాకా ఓ రయ్యో ఆగలేవా ఓ...
అందాకా ఆగలేనే నావయసూ ఊరుకోదే
అందాకా ఆగలేనే నావయసూ ఊరుకోదే
వయ్యారి నన్నాపకే...
అమ్మమ్మమ్మ చన్నీటివాగుపక్క సంపంగి తోటలోన నీదాననౌతానురా

ఒ ఒ  ఒళ్లంత వయ్యారమే పిల్లదాన
ఒకచిన్న ముద్దియ్యవే ఓ కుర్రదాన
అయ్యయ్యయ్య ఇవ్వాలనే ఉందిరా చిన్నవాడ
ఎవరైన చూస్తారురా వన్నెకాడ
హ ఊసులాడా అ చోటుకాదు
అ చాటుఉంది అందాలతోటాలోన
మందార చెట్టుకింద నా ముద్దు చెల్లించవే

ఒ ఒ హొ ఒళ్లంత వయ్యారమే పిల్లదాన
ఒకచిన్న ముద్దియ్యవే ఓ కుర్రదాన
అమ్మమ్మమ్మ ఇవ్వాలనే ఉందిరా ఓ చిన్నవాడ
ఎవరైన చూస్తారురా వన్నెకాడ

Most Recent

Default