Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Jawan (2017)చిత్రం: జవాన్ (2017)
సంగీతం: యస్.యస్.థమన్
సాహిత్యం: కృష్ణ కాంత్
గానం: ఆదిత్య, రఘురామ్, సాకేత్, సాయి కృష్ణ
నటీనటులు: సాయి ధరమ్ తేజ్, ప్రసన్న, మెహరీన్ కౌర్ ఫిర్జాదా,
దర్శకత్వం: బి.వి.యస్.రవి
నిర్మాత: కృష్ణ (దిల్ రాజు సమర్పణలో)
విడుదల తేది: 2017

పల్లవి:
ఇంటికి ఒక్కడు కావాలే జంగుకు సై అని దూకాలే
కంటికి రెప్పలె కాయాలే బన్జారే తూ జవాన్
ఇంటికి ఒక్కడు కావాలే జంగుకు సై అని దూకాలే
కంటికి రెప్పలె కాయాలే బన్జారే తూ జవాన్
అబ్ హర్ ధడ్కన్ కహి జన గణ మన
బస్ బన్జా హర్ ధమ్ తూహి జవాన్
తుజ్ మేహే బడాయి ఖతం బస్ బన్జా తూహి జవాన్
అబ్ హర్ ధడ్కన్ కహి జన గణ మన
బస్ బన్జా హర్ ధమ్ తూహి జవాన్
తుజ్ మేహే బడాయి ఖతం బస్ బన్జా తూహి జవాన్

చరణం: 1
కష్టం వస్తేనే కదలను కద చేస్తా ఎదురెళ్లి రక్కసి వధ
తీసెయ్ సమరంలో ఇక తనమన తనువున జన గణ మన
సేసేయ్ అనుకుందే తక్షణమున
చూసేయ్ లక్ష్యాన్నే ఈ క్షణమున
స్వచ్చం అనునిత్యం నీ బుజమున
నిలుపుతు జన గణ మన

ఇంటికి ఒక్కడు కావాలే జంగుకు సై అని దూకాలే
కంటికి రెప్పలె కాయాలే బన్జారే తూ జవాన్

చరణం: 2
రోజూ నీకో యుద్ధమురా రాజీ పడితే వ్యర్ధమురా
జవాన్ జవాన్
జండా నీలో ధైర్యమురా జయమే దానికి ధ్యేయమురా
జవాన్ జవాన
నడు ఎవ్వరికొరకిక  వెతకక పదవురకెత్తే నువ్వు జవాన్
పడు పిడుగుకి జడవక పద నువ్ పుట్టిన మట్టికి ప్రాణమిడు
చూపించేయ్ యుధంతం కాలి కధం
బస్ బన్జా తూహి జవాన్

కష్టం వస్తేనే కదలను కద చేస్తా ఎదురెళ్లి రక్కసి వధ
తీసెయ్ సమరంలో ఇక తనమన తనువున జన గణ మన
సేసేయ్ అనుకుందే తక్షణమున
చూసేయ్ లక్ష్యాన్నే ఈ క్షణమున
స్వచ్చం అనునిత్యం నీ బుజమున
నిలుపుతు జన గణ మన

ఇంటికి ఒక్కడు కావాలే జంగుకు సై అని దూకాలే
కంటికి రెప్పలె కాయాలే బన్జారే తూ జవాన్******   ******   *******

చిత్రం: జవాన్ (2017)
సంగీతం: యస్.యస్.థమన్
సాహిత్యం: కృష్ణ కాంత్
గానం: యస్.యస్.థమన్ , శ్రేయా గోషల్

కొత్త నన్నే కనుగొన్ననా
ఉప్పెనేదో ఎగసే లోనా
పట్టుకున్నా పడిపోతున్నా
ఎందరున్నా వంటరవుతున్నా
అసలేంటీ వేదనా

అవుననా కాదనా ఉందనా లేదనా
దేనికో పేరు నే పెట్టలేనా
అవుననా కాదనా ఉందనా లేదనా
దేనికో పేరు నే పెట్టలేనా
ముందలా లేననా ఇంతలా మారినా
గుండెలో గుట్టుగా దాచుకోనా
అయోమయంగా ఇదేమిటో
అదే నయంగా ఉండేమిటో
అంతంటూ లేని కథేమిటొ
అందంగ ఉందీ అదేమిటో

ఇన్నాల్లు నాలో ఉన్నా అన్నీ తెలుసనుకుంటూన్నా
చూస్తూనే నీలో నన్నే నేనే కలిసిక వస్తున్నా
వద్దన్నా నువ్వే ఉంటే కల్లే పక్కకు లాగేనా
పర్లేదె అనుకుంటూనే మల్లి చిక్కుకుపోతున్నా
అసలేంటీ వేదనా అసలేంటీ వేదనా

సగం సగం మరో జగం
సగం సగం మరీ సుఖం
సగం సగం చెరో సగం
నువ్వో సగం నేనో సగం
సగం సగం మనోగతం
సగం సగం సహేతుకం
సగం సగం నిరంతరం
నువ్వో సగం నేనో సగం

పదానికే పెదవవుతా ని కల్లకే నిదరవుతా
ఏ పక్కనున్న ఎదురవుతా అల్లడితే కుదురవుతా
బాగుంది నీ గొదవా గోధారిలో పడవా
కల్లోను నన్ను విడవా కాస్త అల్లేసి ముడి పడవా
వద్దన్నా నువ్వే ఉంటే కల్లే పక్కకు లాగేనా
పర్లేదె అనుకుంటూనే మల్లి చిక్కుకుపోతున్నా
అసలేంటీ వేదనా అసలేంటీ వేదనా

సగం సగం మరో జగం
సగం సగం మరీ సుఖం
సగం సగం చెరో సగం
నువ్వో సగం నేనో సగం
సగం సగం మనోగతం
సగం సగం సహేతుకం
సగం సగం నిరంతరం
నువ్వో సగం నేనో సగం

******   ******   *******

చిత్రం: జవాన్ (2017)
సంగీతం: యస్.యస్.థమన్
సాహిత్యం: భాస్కరభట్ల
గానం: దీపు

మనసే గట్టిగ పట్టుకు లాగావే
చెలియా లవ్ యూ బంగారూ
బంగారూ బంగారూ బంగారూ బంగారూ
బంగారూ బంగారూ బంగారూ బంగారూ

నీ చెకుముకి చూపు విసిరావే
హెయ్ చక చక నన్ను దోచావే
అలుకలుకలేవో గుండేలోన రేపావే
నడకసికలన్నీ చూసావే
నా ఎకసికలే భరించావే
ఈ తికమలన్నీ నువ్వు నేర్పుతున్నవే
అరె చాల్లే చాల్లే తూనీగా
చేసిందంతా నువ్వే గా
పైగా నన్నే అంటావే తప్పంతా నీదేగా
అరె చాల కాలం ఓపిగ్గా
ముద్దిస్తావని చుసాగా
నీతో ఇంక లాభం లేదని నేనిచ్చేసా నేరుగా

బంగారూ బంగారూ బంగరూ బంగారూ
బంగారూ బంగారూ బంగరూ బంగారూ

కోసల దేసపు రాజ కుమారివి నువ్వా
రాసులు పోసిన రంగుల జాతర నువ్వా
హేయ్ దోసిలి నింపిన వెన్నల తారవి నువ్వా
ఆశవిగా మరి ఆశలు పెంచేసావా

మనసే గట్టిగ పట్టుకు లాగావే
బంగారు బంగారు బంగారు బంగారు

ఏదొ పనిలో ఉన్నా నిన్నే తలచే క్షణం
నువ్వే ఎదురయ్యావే ఉహల్లో
ఏదో సరదా పదీ గల్లో బొమ్మేసినా
అది నువ్వయ్యావే గుండెల్లో
యెంత బాగుంది బాగుంది ఈ లాహిరీ
నన్ను లాగింది లాగింది నీ ఊపిరీ

అరె నీలో నన్నే చూస్తున్నా
నాలో నిన్నే దాస్తున్నా
నన్నే నువ్వు ఏం చేసావో నీకే తెలుసు నాయనా
బంగారూ బంగారూ బంగరూ బంగారూ
బంగారూ బంగారూ బంగరూ బంగారూ బంగారూ

నిన్నటి దాకా నాతో నడచిన చాయా
నీ వెనకాల వచ్చెను ఏంటీ మాయ
అరె ఊపిరి నాకే ఉక్కిరి బిక్కిరి హాయా
ఏం చేసావే చెప్పవే ఓ అమ్మాయా

మనసే గట్టిగ పట్టుకు లాగావే
చెలియా లవ్ యూ బంగారూ

******   ******   *******

చిత్రం: జవాన్ (2017)
సంగీతం: యస్.యస్.థమన్
సాహిత్యం: భాస్కరభట్ల
గానం: సాకేత్ , మోహన భోగరాజు

బొమ్మ అదిరిందీ దిమ్మే తిరిగింది
లొల్లీ జరిగింది గుప్పెడు గుండెల్లో
హోయ్ బొమ్మ అదిరిందీ దిమ్మే తిరిగింది
లొల్లీ జరిగిందీ గుప్పెడు గుండెల్లో
అంబా పలికింది పంబే రేగింది
రుంబ సంతోషమే రెండు కల్లలో

కుదిరిందె మనకి లగ్గం
ఇక నువ్వూ నేను తగ్గం
అరె గల్లి గల్లి మోగించేద్దం గట్టీ మేలాలే
ఓయ్ టప్పు టప్పు టప్పు టప్పు టప్పు టపోరీ
నువు తిప్పు తిప్పు తిప్పుకుంటూ రావే కుమారీ
ఓయ్ టప్పు టప్పు టప్పు టప్పు టప్పు టపోరీ
నువ్ లిప్పు లిప్పు లిప్పు అందించాలే కన్యా కుమారీ

హోయ్ బొమ్మ అదిరిందీ దిమ్మే తిరిగిందీ
లొల్లీ జరిగింది గుప్పెడు గుండెల్లో
హేయ్ అంబా పలికిందీ పంబే రేగిందీ
రుంబ సంతోషమే రెండు కల్లలో

నీ చూపుల ముందూ యే మందూ గుండూ
సరిపోదు అంటున్న హల్లో అబ్బయో
నీ నడుము బెండూ చలి చీమల దండూ
నా చుట్టూ ముట్టేస్తే ఏట్టాగమ్మయో
నా పైటె కదా పక్కా..ఓ ఓ ఓ
నువ్ సుఖించరా ఇంకా..ఓ ఓ ఓ
నీ ఊగే ఊగే జుంకా
అది నాలో మోగే ఢంకా
నువు ఆగే పీచే లాగేస్తుంటే ఆగేదెలాగా

ఓయ్ టప్పు టప్పు టప్పు టప్పు టప్పు టపోరీ
నువు తిప్పు తిప్పు తిప్పుకుంటు రావే కుమారీ
ఓయ్ టప్పు టప్పు టప్పు టప్పు టప్పు టపోరీ
నువ్ లిప్పు లిప్పు లిప్పు అందించాలే కన్యా కుమారీ

హోయ్ బొమ్మ అదిరింది దిమ్మే తిరిగిందీ
లొల్లీ జరిగింది గుప్పెడు గుండెల్లో
హేయ్ అంబా పలికింది పంబే రేపిందీ
రుంబ సంతోషమే రెండు కల్లలో


******   ******   *******

చిత్రం: జవాన్ (2017)
సంగీతం: యస్.యస్.థమన్
సాహిత్యం: శ్రీమణి
గానం: శ్రీకృష్ణ ,లిప్సిక

బుగ్గంచున ఎరుపును పెంచే సమయం ఇవ్వరా
రెప్పంచున కలలే పంచే సమయం అవ్వరా
బుగ్గంచున ఎరుపును పెంచే సమయం ఇవ్వరా
రెప్పంచున కలలే పంచే సమయం అవ్వరా
మెడ అంచులలో ముద్దై
జడ అంచులలో తడివై
ఒడి అంచులలో తలవై
సమయం ఇచ్చెయ్ రా

ఈ వీక్షణం నిరీక్షనణం
తీరుస్తు ఉంటాను ప్రతీక్షణం
కౌగిళ్లతో శిక్షించనా
అంటుంది ప్రేమాక్షరం

చీరంచు దూరమే చెరిపెయ్
నడుమంచు చేతికే ఇచ్చెయ్
పెదవంచు మంచునే పంచెయ్
అంచులు తెంచెయ్

చీరంచు దూరమే చెరిపెయ్
నడుమంచు చేతికే ఇచ్చెయ్
పెదవంచు మంచునే పంచెయ్
అంచులు తెంచెయ్

బుగ్గంచున ఎరుపును పెంచే సమయం ఇవ్వరా
రెప్పంచున కలలే పంచే సమయం అవ్వరా

నారింజ రంగుని ఎండలో
సారంగి తీగల సంధ్యలో
శ్రుంగార పువ్వుల పూజకే
సమయం ఇచ్చెయ్ రా

నా చేతి రాతల పంచన
కస్తూరి గీతల చెంతన
దస్తూరిలా మారేందుకే
సమయం ఇచ్చెయ్ రా

నీ సోయగం సోకే విషం
బాగుంది నాలోన ప్రవహించడం
నీ యవ్వనం యమపాశమే
అవుతుంటే ప్రాణోదయం

వయసంచు వరదలో ముంచెయ్
చెమటంచు వేడినే పెంచెయ్
తనువంచు తనువుతో కంచెయ్
అంచులు తెంచెయ్

చీరంచు దూరమే చెరిపెయ్
నడుమంచు చేతికే ఇచ్చెయ్
పెదవంచు మంచునే పంచెయ్
అంచులు తెంచెయ్

బుగ్గంచున ఎరుపును పెంచే సమయం ఇవ్వరా
సమయం సమయం ఇచ్చెయ్ రా

Most Recent

Default