Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Mosagallaku Mosagadu (1971)
చిత్రం: మోసగాళ్లకు మోసగాడు (1971)
సంగీతం: పి. ఆదినారాయనరావు
నటీనటులు: కృష్ణ , విజయనిర్మల
దర్శకత్వం: కె. యస్. ఆర్. దాస్
నిర్మాత: జి.ఆది శేషగిరి రావు
విడుదల తేది: 27.08.1971Songs List:గురిని సూటిగా పాట సాహిత్యం

 
చిత్రం: మోసగాళ్లకు మోసగాడు (1971)
సంగీతం: పి. ఆదినారాయనరావు
సాహిత్యం: ఆరుద్ర
గానం: యల్. ఆర్. ఈశ్వరి

పల్లవి:
గురిని సూటిగా కొట్టేవాడా
సాటిలేనిది సూటిదెబ్బ
గోటు చాలుర ఓయబ్బ

చరణం: 1
నీవు కిలాడీ
నేను రంగేళి
తీసిపోనురా నీకు నేను
చెలిమి చేయర సోగ్గాడ

పల్లవి:
గుండెనుదోచే బంటువుకదరా
గురితప్పవులే నువ్వు
నే బరితెగిస్తి రా నమ్ము
మగసిరి చూసి మోజు పడేను
మోటుసరసాలైనా
మొగమాటపడ దీమైనా
వాటమైనదీ వయసు
నా వయసూ సొగసూ నీ సొమ్ము

చరణం: 2
ఓ ఈడూ జోడూ ఇంపూ సొంపూ
బాగా కుదిరిందంట
కాదంటే ఎంతో తంటా
కడతా జంట పడతా వెంటా
నేను నీతో వుంటా
నీ మనసే దోచుకుంటా
ఔను నీదేనంటా
నా వలపుల తొలకరి పంట

కోరినది నెరవేరినది పాట సాహిత్యం

 
చిత్రం: మోసగాళ్లకు మోసగాడు (1971)
సంగీతం: పి. ఆదినారాయనరావు
సాహిత్యం: ఆరుద్ర
గానం: యస్.పి.బాలు

కోరినది నెరవేరినది
ఒహో కలలు నిజమాయే
కోరినది దరిచేరినది
ఆహా ఎదలు ఒకటాయే
తొలివలపే మధురసము
మనబతుకే పరవశము

పూలతోటలైనా అందాలు పూసేను లే
తనివితీరగా మకరందాలు గ్రోలేనులే
దోచుకున్న వలపు
సుఖం  సుఖం సుఖం
తోడుగా, నీడగా, సాగిపో

రాగబంధమై పెనవేసుకున్నానులే
మూగకోరిక నే తెలుసుకున్నానులే
ఊసులాడు. వేళ బాసచేయు వేళ
ఇదే ఇదే ఇదే 
ఆడుకో ఆశలే తీర్చుకో
ఎలాగుంది ఎలాగుంది పాట సాహిత్యం

 
చిత్రం: మోసగాళ్లకు మోసగాడు (1971)
సంగీతం: పి. ఆదినారాయనరావు
సాహిత్యం: అప్పలాచార్య
గానం: యస్.పి.బాలు, యల్. ఆర్. ఈశ్వరి

పల్లవి:
ఎలాగుంది ఎలాగుంది అబ్బాయా
ఏడి గుందా చల్లగుందా అబ్బాయా
ఎలాగుంది ఎలాగుంది అబ్బాయా
ఏడి గుందా చల్లగుందా అబ్బాయా
లొట్టలు వేస్తూ రొట్టెలుతింటూ
సల్లగ మేమే లాగుతు ఉంటె
ఎలాగుంది  ఎహేహే 

ఎలాగుంది ఎలాగుంది అబ్బాయా
ఏడి గుందా చల్లగుందా అబ్బాయా

అబ్బా అబ్బా అమ్మా అబ్బ మా నాన్నే
తల్లి ముండమొయ్య
ఆ యేల నన్ను భలే ఎడిపించావే
నా యాల ఇయ్యాల చావు ఇలాగే

నా ప్రేమ గుండెలలో చిచ్చు పెట్టావే
ఈ పాడు ఎండలలో మాడుతున్నావే
ఆయాయా యా   ఆయాయా యా 
ఆయాయా యా   ఆయాయా యా 
ఎలాగుంది అహా

ఎలాగుంది ఎలాగుంది అబ్బాయా
ఏడి గుందా చల్లగుందా అబ్బాయా

నా వేడి కౌగిలిలో హాయిని వీడి
ఈ ఇసక దిబ్బలపై దొర్లెదవేమి
ఖర్మ అమ్మడు వాడి ఖర్మ అమ్మడు
నేనంటే నీకు మహా చిన్న చూపులే
నీ కన్నా నేనిపుడు గొప్పవాడ్నిరో
గొడుగువుందిరో మంచి గొడుగువుందిరో

ఆయాయా యా   ఆయాయా యా 
ఆయాయా యా   ఆయాయా యా 
ఎలాగుంది ఆ

ఎలాగుంది ఎలాగుంది అబ్బాయా
ఏడి గుందా చల్లగుందా అబ్బాయా

దిక్కు మొక్కు లేక 
నువ్విక్కడ చస్తావురో
నిను నక్కలు కుక్కలు తిన్నా 
నా కసి తీరదురో
కాకులు గద్దలు కొడకో 
నిను పొడుచుకు తింటాయిరో
రాబందుల గుంపులు కొడకో
నీ విందుకు వస్తాయిరో

కత్తిలాంటి పిల్లోయి పాట సాహిత్యం

 
చిత్రం: మోసగాళ్లకు మోసగాడు (1971)
సంగీతం: పి. ఆదినారాయనరావు
సాహిత్యం: ఆరుద్ర
గానం: పి. సుశీల

కత్తిలాంటి పిల్లోయి
కదలివచ్చే కాస్కో
మత్తుకళ్ళ మావోయ్
గమత్తుచేస్తా చూస్కో 
నీటు చూడు గోటు చూడు 
ఘాటు ఘాటు పొగరుచూడు
ఆట చూడు పాట చూడు
భేటీ కొస్తావా

ఈ గడుసుతనము పనికిరాదు
ఈ మిడిసిపాటు పనికిరాదు
కన్నె పరువము కఠారైనది
వన్నెచిన్నెల మిఠాయున్నది
పడుచు రామ చిలుక
ఇది పంచదార మొలక
పట్టబోతె చిక్కబోదు పంజరాన వాలదు
కొమ్ములు తిరిగిన మొగాళ్ళు సైతము
గుమ్మై పోవాలిలే

కమ్మని తళుకులు వెచ్చని చురకలు
కావాల ? ఇస్తానులే - కత్తిలాంటి పిల్లోయ్
నిన్ను చూసితి నిఘా వేసితి
నీలి కన్నుల.నిషా 'వేసితిని
రాలుగాయి వైతే నేనొక రాయినౌతా
వీలు చూచి ఈల వేసి గోలుమాలు చేస్తా
కండలు తిరిగిన గండరగండా నీగుండె రాబందులా
కైపులు మెరిగిన గుండెలు కరిగిన కథమారి
పోతుందిలే
తకిట దిమితక పాట సాహిత్యం

 
చిత్రం: మోసగాళ్లకు మోసగాడు (1971)
సంగీతం: పి. ఆదినారాయనరావు
సాహిత్యం: ఆరుద్ర
గానం: ఎల్. ఆర్. ఈశ్వరి

తకిట దిమితక తై తై  
తమాషా మైకం కలగినది 
యిక సై సై కులాసాలోకం
గాజుగిన్నెలో చుక్క ఉన్నది
గడుసు గుండెలో ఘాటులున్నవి

మోహమున్నచో మోజు తీర్చుకో
కలిగిన కైపులలో  హాయ్...
ఇటూ అటూ వేడి చిందులూ
బలే బలే చిలిపి విందులూ
సిగ్గేలా మగాడికి - పగ్గాలా వయారికి
చలరేగు యకాయకి
జిలిబిలి కులుకులతో హాయ్...

నిషా ఖుషి హుషారైనది 
మజా మజా మరల రానిది
ఈ వేడుక గరం గరం
ఈ రాతిరి సుఖం సుఖం
ఒక టౌదాం మనం మనం
చిక్కని చీకటీలో హాయ్...

Most Recent

Default