-->
Home Movie Songs Latest Updated Movies Devotional Songs Non-Movie Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box



చిత్రం: తిక్క శంకరయ్య (1968)
సంగీతం: టి.వి. రాజు
సాహిత్యం: సినారె
గానం: ఘంటసాల, సుశీల
నటీనటులు: యన్. టి.రామారావు, కృష్ణకుమారి, జయలలిత
దర్శకత్వం: డి.యోగానంద్
నిర్మాత: డి. వి.యస్. రాజు
విడుదల తేది: 11.10.1968

కోవెల ఎరుగని దేవుడు కలడని...
కోవెల ఎరుగని దేవుడు కలడని...
అనుకొంటినా నేను ఏనాడు..
కనుగొంటి కనుగొంటి ఈనాడు..

పలికే జాబిలి ఇలపై కలదని...
పలికే జాబిలి ఇలపై కలదని..
అనుకొంటినా నేను ఏనాడు...
కనుగొంటి కనుగొంటి ఈనాడు...

ఇన్నాళ్ళుగా ఇన్నేళ్ళుగా...కన్నీట తపియించినాను
ఇన్నాళ్ళుగా ఇన్నేళ్ళుగా...కన్నీట తపియించినాను
నీ రాకతో... నీ మాటతో..నిలువెల్ల పులకించినాను
నిలువెల్ల పులకించినాను...!!కోవెల!!
ఇన్నాళ్ళుగా విరజాజిలా...ఈ కోనలో దాగినావు
ఇన్నాళ్ళుగా విరజాజిలా...ఈ కోనలో దాగినావు
ఈ వేళలో...నీవేలనో...నాలోన విరబూసినావు
నాలోన విరబూసినావు...

పలికే జాబిలి.. ఇలపై కలదని...
అనుకొంటినా నేను ఏనాడు...
కనుగొంటి కనుగొంటి ఈనాడు..

Most Recent

Default