Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Happy (2006)





చిత్రం: హ్యాపీ (2006)
సంగీతం: యువన్ శంకర్ రాజా
నటీనటులు: అల్లు అర్జున్, జనీలియ
దర్శకత్వం: ఏ. కరుణాకరణ్
నిర్మాత: అల్లు అరవింద్
విడుదల తేది: 27.01.2006



Songs List:



ఛల్ చల్ రే పాట సాహిత్యం

 
చిత్రం: హ్యాపి (2006)
సంగీతం: యువన్‌శంకర్‌రాజా
సాహిత్యం: విశ్వా
గానం: క్లింటన్ సెరిజో

ఛల్ చల్ రే చల్ మెర సాథీ హం బన్‌గయె హైదరబాది 
తన ఒడిలో చోటిచ్చే ఈ హైదరబాదుకి సాటింకేదీ 
Everybody is wat they wanna be 
Pyar se jeethenge hum sabhi 
ప్రతి నిత్యం మధిలో నిలిచె 
నీది నాది మన ట్విన్ సిటీ 

Awaken city, girls r so pretty 
పడదామా పోటి పద నా తోటీ 
In cyber city ప్రతి beauty పోటీ 
They love their duty n also party 

ఛల్ చల్ రే చల్ మెర సాథీ హం బన్‌గయె హైదరబాది 
తన ఒడిలో చోటిచ్చే ఈ హైదరబాదుకి సాటింకేదీ 
Everybody is wat they wanna be 
Pyar se jeethenge hum sabhi 
ప్రతి నిత్యం మధిలో నిలిచె 
నీది నాది మన ట్విన్ సిటీ 

If u wanna learn about history it’s a never ever ending true glory (2)

హే నా హే నా హే నా హే నా యే నా (4)

ముత్యాలు గాజుల షెహరు అనుకుంటే పొరబడతారూ 
మరి ముందుకు సాగె తీరు గమనిస్తె జై కొడతారు 
మన గోల్కొండ సాలార్జంగ్ చార్మినారూ 
ఘన చరితేలే అని చెపుతుంటారు
కాని చీటికి మాటికి నెక్లెస్ రోడ్లు ఐమాక్స్ హాలు 
తెగ సరదాగా ఎప్పుడు చుడుతుంటారు 
ఉరుకుల పరుగుల నగరం ఇది లెరా మనకిక 
New halt busy busy బతుకుల సమరం 
it's a seriously new new venue.. 

ఛల్ చల్ రే చల్ మెర సాథీ హం బన్‌గయె హైదరబాది 

యూరోప్ అమెరిక సైతం కన్నేసే మనపై నిత్యం 
ఈ సైబర్ బాబుల కష్టం పెంచునులె ఆంధ్ర income 
ఎకడెక్కడి నుంచొ యువతే ఎంతో ఆశలతోటి 
ఈ హైదరబాదు కి  కదిలొస్తారు 
కొంచెం కలివిడి చొరవా చూపక పోతే ఎవరే ఐనా 
ఈ sylicon speedu కి తడబడతారు 
ఉరుకుల పరుగుల నగరం ఇది లెరా మనకిక new halt 
Busy busy బతుకుల సమరం 
It's a seriously new new venue.. 

ఛల్ చల్ రే చల్ మెర సాథీ హం బన్‌గయె హైదరబాది 
తన వొడిలో చోటిచ్చే ఈ హైదరబాదుకి సాటింకేదీ 
Everybody is wat they wanna be 
Pyar se jeethenge hum sabhi 
ప్రతి నిత్యం మధిలో నిలిచె 
నీది నాది మన ట్విన్ సిటీ 



హ్యాపీ.. పాట సాహిత్యం

 
చిత్రం: హ్యాపి (2006)
సంగీతం: యువన్‌శంకర్‌రాజా
సాహిత్యం: చంద్రబోస్
గానం: కార్తిక్

హ్యాపీ...పాపకి లుక్కిస్తే హ్యాపీ... 
లుక్కులొ క్లిక్ ఐతే హ్యాపీ.... 
క్లిక్ అయి కిస్ ఇస్తే హ్యాపీ... 
హ్యాపీ... బేబీ కి బెంజ్ ఉంటే హ్యాపీ.. 
భామ కి రేంజ్ ఉంటె హ్యాపీ.. 
బావ కి ఏజ్ ఐతె హ్యాపీ.. 

చరణం: 1
వయ్యారికి డాష్ ఇస్తే తను థాంక్యు అంటె సో హ్యాపీ.. 
థియేటర్ లొ ప్యారి నీపై చెయేస్తే ఫుల్ హ్యాపి
బ్రదర్స్ లు లేని ఫిగర్ కి నువ్వే లవర్ వి ఐతె భలె హ్యాపీ
కలర్సు చిమ్మె కసక్కు నీకే చమ్మక్కులిస్తె యమ హ్యాపీ.. 

హ్యాపీ...పాపకి లుక్కిస్తె హ్యాపీ... 
లుక్కులొ క్లిక్ ఐతే హ్యాపీ.... 
క్లిక్ అయి కిస్ ఇస్తే హ్యాపీ... 

చరణం: 2 
నీకో స్వీటీ సిగ్నల్ ఇస్తే హ్యాపీ
స్వీటీ Daddy SP ఐతే BP.. Happy... BP Happy... 
బ్యుటీ పార్టీ కొచ్చిదంటే హ్యాపీ
Next day Party మారిస్తే Unhappy 
చెల్లెలేమో ఫ్రెండ్స్ వచ్చారని చెవిలో చెబితే very happy 
వెళ్ళి చూస్తె ఆ ఫ్రెండ్స్ ఎమో బాయ్ ఫ్రెండ్స్ ఐతే నీకు టోపి.. 
Happy.. Happy.. 

Happy పాపకి లుక్కిస్తె హ్యాపీ
లుక్కులొ క్లిక్ ఐతే హ్యాపీ.... 
క్లిక్ అయి కిస్ ఇస్తే హ్యాపీ... 

గురు, లవ్ లో లాజిక్కులు గురించి భలే చెప్పావ్ గురు.. 
ఆ లాజిక్కులన్నీ మీవరకు.. నా వరకు మాత్రం... 
హ్యాపీ.. ప్రేయసి లేకుంటే.. హ్యాపి 

ప్రేమలో పడకుంటె.. హ్యాపి 
ఫ్రీగా తిరిగేస్తే.. హ్యాపి హ్యాపి 
సోలొ లైఫ్ ఉంటే.. హ్యాపి 
సింగిల్ గా ఉంటే.. హ్యాపి 
స్వేచ్చగ బతికేస్తే.. హ్యాపీ 
పాకెట్ మనీ ఖర్చే లేదు బిల్డప్ అవసరమే లేదు.. 
వెయిటింగ్ చేసె చాన్సే లేదు  చాకిరి చేసే శ్రమ లేదు.. 
అదుర్స్ అంటు బెదుర్స్ అంటు అందాన్ని పొగిడే పని లేదు 
అశాంతి లేదు హెడ్డేకు లేదు విశ్రాంతికి అడ్డే ఇక లేదు.. 

హ్యాపీ.. ప్రేయసి లేకుంటే.. హ్యాపి 
ప్రేమలో పడకుంటె.. హ్యాపి 
ఫ్రీగా తిరిగేస్తే.. హ్యాపి.. 



ఒస్సారె ఒస్సా ఒస్సా రె పాట సాహిత్యం

 
చిత్రం: హ్యాపి (2006)
సంగీతం: యువన్‌శంకర్‌రాజా
సాహిత్యం: పోతుల రవికిరణ్
గానం: జస్సి గిఫ్ట్ , సుచిత్ర

పల్లవి : 
చిరుత కన్నుల వాడే - చిలిపి చిన్నొడె 
చిలక కొట్టని చోటే - కొరికి పెట్టాడే 
అల్లాడి పోకే సత్యాభామా 
కిల్లాడీ ఓడే నా చందమామ 

ఓస్స హే ఒస్సా హే ఓస్స హే ఒస్సా 
హే ఒస్స ఒస్సా ఒస్సా ఒస్సా ఒస్సా ఒస్సా ఒస్సారే
ఓ ఒస్సారె ఒస్సా ఒస్సా రె ఒస్సారె వచ్చే ఓ సారే 
ఏయ్ ఒస్సారె ఒస్సే ఒస్సా రె ఒస్సారె వస్తా ఓ సారే

చిరుత కన్నుల వాడే - చిలిపి చిన్నొడె 
చిలక కొట్టని చోటే - కొరికి పెట్టాడే 
అల్లాడి పోకే సత్యాభామా 
కిల్లాడీ ఓడే నా చందమామ

ఓస్స హే ఒస్సా హే ఓస్స హే ఒస్సా 
హే ఒస్స ఒస్సా ఒస్సా ఒస్సా ఒస్సా ఒస్సా ఒస్సారే
ఓ ఒస్సారె ఒస్సా ఒస్సా రె ఒస్సారె వచ్చే ఓ సారే 
ఏయ్ ఒస్సారె ఒస్సే ఒస్సా రె ఒస్సారె వస్తా ఓ సారే

అందమంతా ఆరబోసి అమ్ముకుంటావే 
అందగాడే పక్కనుంటే అంతే అంతేలే 
తప్పు ఒప్పు చెప్పకమ్మొ తప్పదివ్వాళే 
సిగ్గు సిగ్గు ఆపరయ్యొ బుగ్గే కందేలే
నీ ఒంపు సొంపుల్లో ఆ మడతే రమ్మందే
నీ ఒళ్ళో తుళ్ళి పడి వెచ్చబడీ 
జారి పడీ కెవ్వుమనేలే...

ఓస్స హే ఒస్సా హే ఓస్స హే ఒస్సా 
హే ఒస్స ఒస్సా ఒస్సా ఒస్సా ఒస్సా ఒస్సా ఒస్సారే
ఓ ఒస్సారె ఒస్సా ఒస్సా రె ఒస్సారె వచ్చే ఓ సారే 
ఏయ్ ఒస్సారె ఒస్సే ఒస్సా రె ఒస్సారె వస్తా ఓ సారే

రబ్బరు తో చెసినా రంభ నువ్వేలే 
రంగులలో తెంపర నా రిబ్బను ముల్లె 
హంగు పొంగు లాగుతుంటే మతే పోయేలే 
గుచ్చి గుచ్చి చూడకయ్యొ మతే ఎక్కేలె
ఎదైనా ఎమైనా ఈ రాతిరి జాతరలే 
హయ్యె నీ తోనే అల్లుకుని గిల్లుకుని 
హత్తుకుని జివ్వుమనేలే... 

ఓస్స హే ఒస్సా హే ఓస్స హే ఒస్సా 
హే ఒస్స ఒస్సా ఒస్సా ఒస్సా ఒస్సా ఒస్సా ఒస్సారే
ఓ ఒస్సారె ఒస్సా ఒస్సా రె ఒస్సారె వచ్చే ఓ సారే 
ఏయ్ ఒస్సారె ఒస్సే ఒస్సా రె ఒస్సారె వస్తా ఓ సారే




I hate you పాట సాహిత్యం

 
చిత్రం: హ్యాపి (2006)
సంగీతం: యువన్‌శంకర్‌రాజా
సాహిత్యం: అనంత్ శ్రీరామ్
గానం: రంజిత్, వసుంధరా దాస్

గోవిందా చూడవయ్యా వీళ్ళిద్దరి వింత గోల 
గోరంత దానికైన కొండంత యుద్ద లీల 
ఇద్దరి మధ్య hate you ఇంటా బయటా hate you 
రేయి పగలు hate you ఎప్పుడు చూడు hate you 
వెక్కిరింతలె చూసినప్పుడమ్మాయి పలికె I hate you 
తిక్క మాటలే వింటున్నప్పుడబ్బాయి పలికె I hate you  
కుప్పి గంతుల కొతి చెష్టల కుర్ర కుంక I hate you 
కీచు కూతల కుళ్ళు మొతువే కర్రి కేక I hate you 

Hate you hate you Hate you 
Hate you hate you Hate you 

I hate you... same to you... 
I hate you.... 
Hate you.... Hate you.... 

హెయ్ గలాటాల తోనే రోజులు అన్ని గడచునుగా 
గళాసులు పళ్ళేలన్నీ రోజూ పగులునుగా
ఈ రోషమె వద్దొయ్ హో హో  
చిరాకు తేవద్దె హో హోహో
కబుర్లు చెప్పొద్దోయ్ హో హో హో
కట్టింగు లివ్వద్దె
చి చి  పోవె చింపిరి పెంటమ్మా... 
ఏమిటి ఈ గతి గోవిందా 
ఇల్లొక నరకం అయ్యిందా
ఎదురుగ మధుమతి ఉండంగా
ఇంకొక నరకము ఉంటుందా 

వెక్కిరింతలే చూసినప్పుడమ్మాయి పలికె I hate you  
తిక్క మాటలె వింటున్నప్పుడబ్బాయి పలికె I hate you  

ఎండాకాలం ఎండలు కూడా 50 దాటవుగా 
ఈ ఇంట్లోన మాత్రం ఎపుడూ 90 తగ్గవుగా 
జిగుర్ ఫేసు నీదె హో హో హో
తగుల్తాయి నీకె హో హో హో
పొగర్బోతు నువ్వే హో...
పగుల్తాది నీకె 
తు తు పొరా తుంటరి పెంటయ్య... 
యేమిటి ఈ గతి గోవిందా
ఇల్లొక నరకం అయ్యిందా
ఎదురుగ బన్నీ వుండంగా
ఇంకొక నరకము వుంటుందా 

వెక్కిరింతలె చూసినప్పుడమ్మాయి పలికె I hate you 
తిక్క మాటలే వింటున్నప్పుడబ్బాయి పలికె I hate you  
కుప్పి గంతుల కొతి చేష్టల కుర్ర కుంక I hate you 
కీచు కూతల కుళ్ళు మొతువే కర్రి కేక I hate you 



ఎగిరే మబ్బులలోనా పాట సాహిత్యం

 
చిత్రం: హ్యాపీ (2006)
సంగీతం: యువన్ శంకర్ రాజా
సాహిత్యం: కులశేఖర్
గానం: యస్. పి. బి. చరణ్

ఎగిరే మబ్బులలోనా పగలే వెన్నెల వాన
పలికే నవ్వుల వీణ గుండెల్లో సాగే రాగాలేవో..
ఏ ఉదయం ఏ హృదయం ఓ చేరుతుందో ఈ ప్రేమా
ఏ నిమిషం ఏది నిజం ఓ తెలియకుందే ఈ మాయ
ఆశ పడితే అందనందే ఊరుకుంటే చేరుకుందే
తగువులోనే చిగురు వేసిందే...

ఎగిరే మబ్బులలోనా పగలే వెన్నెల వాన
పలికే నవ్వుల వీణ గుండెల్లో సాగే రాగాలేవో (2)

నిదరోయే నీ కనులు యదలోన ఆ కలలు
ఎదురైనా ఎపుడైనా కళ్ళారా చూసేనా
నీతో కలిసి నీతో పెరిగి నీతో తిరిగి ఆశగా
నిన్నే తలచి నిన్నే పిలిచి ఇన్నాళ్ళుగా
నువ్వంటే ఇష్టం ఉన్నా నువ్వే నా సర్వం అన్నా
నా గుండెల్లో దాచేసిందే మౌనంగా ప్రేమ

ఎటువైపే నీ పరుగు వినలేదా నా పిలుపు
ఇపుడైనా ఇకనైనా నీ పంతమాగేనా
అన్నీ మరిచి కోపం విడిచి నాతో చెలిమే చేసినా
పోయే వరకు నా ఈ బతుకు నీదే కదా
నీ తోడే కావాలంటు నీ నీడై ఉండాలంటు
నవరాగాలు ఆలాపించే నాలో ఈ ప్రేమా

ఎగిరే మబ్బులలోనా పగలే వెన్నెల వాన
పలికే నవ్వుల వీణ గుండెల్లో సాగే రాగాలేవో... (2)

ఏ ఉదయం ఏ హృదయం ఓ చేరుతుందో ఈ ప్రేమా
ఏ నిమిషం ఏది నిజం ఓ తెలియకుందే ఈ మాయ
ఆశ పడితే అందనందే ఊరుకుంటే చేరుకుందే
తగువులోనే చిగురు వేసిందే...

ఎగిరే మబ్బులలోనా పగలే వెన్నెల వాన
పలికే నవ్వుల వీణ గుండెల్లో సాగే రాగాలేవో... (2)




ఎగిరే మబ్బులలోనా (Version ll) పాట సాహిత్యం

 
చిత్రం: హ్యాపీ (2006)
సంగీతం: యువన్ శంకర్ రాజా
సాహిత్యం: కులశేఖర్
గానం: కె.కె.

ఎగిరే మబ్బులలోనా పగలే వెన్నెల వాన
పలికే నవ్వుల వీణ గుండెల్లో సాగే రాగాలేవో..
ఏ ఉదయం ఏ హృదయం ఓ చేరుతుందో ఈ ప్రేమా
ఏ నిమిషం ఏది నిజం ఓ తెలియకుందే ఈ మాయ
ఆశ పడితే అందనందే ఊరుకుంటే చేరుకుందే
తగువులోనే చిగురు వేసిందే...

ఎగిరే మబ్బులలోనా పగలే వెన్నెల వాన
పలికే నవ్వుల వీణ గుండెల్లో సాగే రాగాలేవో (2)

నిదరోయే నీ కనులు యదలోన ఆ కలలు
ఎదురైనా ఎపుడైనా కళ్ళారా చూసేనా
నీతో కలిసి నీతో పెరిగి నీతో తిరిగి ఆశగా
నిన్నే తలచి నిన్నే పిలిచి ఇన్నాళ్ళుగా
నువ్వంటే ఇష్టం ఉన్నా నువ్వే నా సర్వం అన్నా
నా గుండెల్లో దాచేసిందే మౌనంగా ప్రేమ

ఎటువైపే నీ పరుగు వినలేదా నా పిలుపు
ఇపుడైనా ఇకనైనా నీ పంతమాగేనా
అన్నీ మరిచి కోపం విడిచి నాతో చెలిమే చేసినా
పోయే వరకు నా ఈ బతుకు నీదే కదా
నీ తోడే కావాలంటు నీ నీడై ఉండాలంటు
నవరాగాలు ఆలాపించే నాలో ఈ ప్రేమా

ఎగిరే మబ్బులలోనా పగలే వెన్నెల వాన
పలికే నవ్వుల వీణ గుండెల్లో సాగే రాగాలేవో... (2)

ఏ ఉదయం ఏ హృదయం ఓ చేరుతుందో ఈ ప్రేమా
ఏ నిమిషం ఏది నిజం ఓ తెలియకుందే ఈ మాయ
ఆశ పడితే అందనందే ఊరుకుంటే చేరుకుందే
తగువులోనే చిగురు వేసిందే...

ఎగిరే మబ్బులలోనా పగలే వెన్నెల వాన
పలికే నవ్వుల వీణ గుండెల్లో సాగే రాగాలేవో... (2)



నీ కోసం ఒక మధుమాసం పాట సాహిత్యం

 
చిత్రం: హ్యాపి (2006)
సంగీతం: యువన్‌శంకర్‌రాజా
సాహిత్యం: సిరివెన్నెల
గానం: శంకర్ మహదేవన్

ఓ...ఓ...ఓ... 
నీ కోసం ఒక మధుమాసం
అందించిన ఈ జన్మ నీదేనే చెలి కొమ్మ
తనలో చిగురాశల గంధం నీ శ్వాసకి పంచమని
చలిగాలికి చెదరని బంధం నీ నవ్వుతో పెంచమని

నీ కోసం ఒక మధుమాసం
అందించిన ఈ జన్మ నీదేనే చెలి కొమ్మ

దూరంగానే ఉంటా నువు కందే మంటై చేరగా
దీపంలా చూస్తుంటా నడి రేయంతా నీ తోడుగా
కలకలాన్ని రగిలిస్తున్న చలి సంకెళ్ళు తెగేట్టుగా

నీ కోసం ఒక మధుమాసం

పాదం నేనై వస్తా దరిచేరే దారే చూపగా
ప్రాణం పందెం వేస్తా ప్రతి గెలుపు మెళ్ళో వాలగా
కలలెట్టున్నా నీ ముందొచ్చి నిలబడాలి నిజాలుగా

నీ కోసం ఒక మధుమాసం
అందించిన ఈ జన్మ నీదేనే చెలి కొమ్మ
తనలో చిగురాశల గంధం నీ శ్వాసకి పంచమని
చలిగాలికి చెదరని బంధం నీ నవ్వుతో పెంచమని

నీ కోసం ఒక మధుమాసం

Most Recent

Default