-->
Home Movie Songs Latest Updated Movies Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Results for "Yuvan Shankar Raja"
SIGMA (2026) – Ososi Vayyari Song Lyrics in Telugu and English

Ososi Vayyari Song Lyrics in Telugu and English – SIGMA (2026)

MOVIE DETAILS
Movie : SIGMA (2026)
Music : Thaman S
Actresses : Faria Abdullah
Director : Jason Sanjay
Presented By : Subaskaran
Release Year : 2026

Ososi Vayyari Song Lyrics in Telugu and English – SIGMA (2026)

'Ososi Vayyari' song from SIGMA (2026) movie is composed by Thaman S and sung by Thaman S, Yuvan Shankar Raja, and Sanjana Divaker Kalmanje. Lyrics are written by Krishna Chaitanya. Starring Sundeep Kishan and Faria Abdullah.

SONG INFORMATION
Song : Ososi Vayyari
Music : Thaman S

Ososi Vayyari Song Lyrics in Telugu

ఓసోసి వయ్యారి నీవైపే నా దారి ఇందాక వచ్చావంటే నవ్వాలోసారి ఓసోసి వయ్యారి పలకాలే ఓసారి నీ పలుకే విన్నారంటే జోడీ సవారీ గుండె చూస్తే గోడెక్కి మేడెక్కి దేదెక్కి ఆటేదో ఆడిందే నిన్ను చూస్తే పండక్కి బండెక్కి మందెక్కి తూగాలంటుదే కోడే ఈడు పందెంలో పుంజల్లే ముందుకు దూకేస్తానందే రాతిరెల్లా ఉప్పులుకుప్పులు ఆటలు నీతో ఆడందే ఈలే నువ్వెయ్యకుంటే గోలే నే సేయకుంటే నీతోనే ఉండి లేనట్టే చిన్నదానా ఎత్తే నువ్వు అంతా ఉంటే చూస్తే నన్ను ఓరకంటే సొత్తే నేనవ్వనా ఏంటే ఓలామ్మో వగలాడి నువ్వేనా అమ్మడి ఒరగా సూసావంటే పోన అల్లాడి ఓలామ్మో వగలాడి సేయకే ఈదాడి ఒకటై పోయామంటే అంతా రాబడి చనువు ఇంకొంచెం వయసే ఇచ్చుకోమందే తనువులో భారం కొంచెం తగ్గినట్టుందే నువ్వు బంగారం అంటూ మనసు చెప్పిందే గుండె గడియారం నీతో ఆగిపోమందే గుండె చూస్తే గోడెక్కి మేడెక్కి దేదెక్కి ఆటేదో ఆడిందే నిన్ను చూస్తే పండక్కి బండెక్కి మందెక్కి తూగాలంటుదే ఏయ్ పిల్ల ఈడు పందెంలో పుంజల్లే ముందుకు దూకేస్తానందే రాతిరెల్లా ఉప్పులు కుప్పలు ఆటలు నీతో ఆడందే ఈలే నే వెయ్యకుంటే గోలే నే సేయకుంటే నీతోనే ఉండి లేనట్టే చిన్నవాడా ఎత్తే నువ్వు అంతా ఉంటే చూస్తే నన్ను ఓరకంటే సొత్తే నేనే అవ్వనా ఏంటి ఓలామ్మో వగలాడి నువ్వేనా అమ్మడి ఒరగా సూసావంటే పోన అల్లాడి ఓలామ్మో వగలాడి సేయకే ఈదాడి ఒకటై పోయామంటే అంతా రాబడి

Ososi Vayyari Song Lyrics in English (Transliteration)

Ososi vayyaari neevaipae naa dhaari Indhaaka vacchaavante navvaalosaari Ososi vayyaari palakaalae osaari Nee palukae vinnaarante jodee savaaree Gunde choosthe godekki medekki dhedhekki aatedho aadhindhe Ninnu choosthe pandakki bandekki mandhekki thoogaalantudhe Kode eedu pandhemlo punjalle mundhuku dhookesthaanandhe Raathirella uppulakuppulu aatalu neetho aadandhe Eele nuvveyyakunte gole ne seyyakunte Neethone undi lenatte chinnadhaanaa Etthe nuvvu anthaa unte choosthe nannu orakante Sotthe nenavvanaa yente Olammo vagalaadi nuvvena ammadie Oragaa soosaavante pona allaadi Olammo vagalaadi seyake eedhaadi Okatai poyaamante anthaa raabadi Chanuvu inkonchem vayase icchukomandhe Thanuvulo bhaaram konchem thagginattundhe Nuvvu bangaaram antoo manasu cheppindhe Gunde gadiyaaram neetho aagipomandhe Gunde choosthe godekki medekki dhedhekki aatedho aadhindhe Ninnu choosthe pandakki bandekki mandhekki thoogaalantudhe Ey pilla eedu pandhemlo punjalle mundhuku dhookesthaanandhe Raathirella uppulu kuppalu aatalu neetho aadandhe Eele ne veyyakunte gole ne seyyakunte Neethone undi lenatte chinnavaadaa Etthe nuvvu anthaa unte choosthe nannu orakante Sotthe nene avvanaa yenti Olammo vagalaadi nuvvena ammadie Oragaa soosaavante pona allaadi Olammo vagalaadi seyake eedhaadi Okatai poyaamante anthaa raabadi

Palli Balakrishna Saturday, August 29, 2026
7G Brundavan Colony (2004) Telugu Songs Lyrics Album Cover

7G Brundavan Colony (2004) Telugu Songs Lyrics

MOVIE DETAILS
Movie : 7G Brundavan Colony (2004)
Banner : Sri Surya Movies
Music : Yuvan Shankar Raja
Director : Selvaraghavan (Sri Raghava)
Producer : A. M. Rathnam
Actors : Ravi Krishna
Actresses : Sonia Agarwal
Supporting Cast : Suman Shetty
Release Date : 15 October 2004

Thalachi Thalachi Choosthe Song Lyrics in Telugu – 7G Brundavan Colony (2004)

'Thalachi Thalachi Choosthe' song from 7G Brundavan Colony (2004) movie is composed by Yuvan Shankar Raja and sung by Shreya Ghoshal.

SONG INFORMATION
Movie : 7G Brundavan Colony (2004)
Lyricist : Shiva Ganesh
Singers : Shreya Ghoshal
చిత్రం: 7/G బృందావన కాలనీ (2004) సంగీతం: యువన్ శంకర్ రాజా సాహిత్యం: ఏ. ఎమ్. రత్నం, శివ గణేష్ గానం: శ్రేయ ఘోషల్ తలచి తలచి చూస్తే తరలి దరికి వస్తా నీకై నేను బ్రతికి ఉంటినీ ఓ... నీలో నన్ను చుసుకుంటినీ తెరచి చూసి చదువు వేళ కాలిపోయే లేఖ రాశా నీకై నేను బ్రతికి ఉంటిని ఓ... నీలో నన్ను చూసుకుంటిని కొలువు తీరు తరువుల నీడ చెప్పుకొనును మన కథనెపుడూ రాలిపోయెనా పూల గంధమా... రాక తెలుపు మువ్వల సడిని తలుచుకొనును దారులు ఎపుడూ పగిలిపోయెనా గాజుల అందమా... అరచేత వేడిని రేపే చెలియ చేయి నీ చేత ఒడిలో వాలి కథలను చెప్ప రాసిపెట్టలేదు తోలి స్వప్నం కానులె ప్రియతమా కనులు తెరువుమా మధురమైన మాటలు ఎన్నో కలిసిపోవు నీ పలుకులలో జగము కరుగు రూపే కరుగునా... చెరిగిపోని చూపులు అన్ని రేయి పగలు నిలుచును నీలో నీదు చూపు నన్ను మరచునా... వెంట వచ్చు నీడ బింబం వచ్చి వచ్చి పోవు కళ్ళ ముందు సాక్ష్యాలున్నా తిరిగి నేను వస్తా ఒక సారి కాదురా ప్రియతమా ఎపుడు పిలిచినా తలచి తలచి చూస్తే తరలి దరికి వస్తా నీకై నేను బ్రతికి ఉంటినీ ఓ... నీలో నన్ను చుసుకుంటినీ

Kalalu Kane Kaalalu Song Lyrics in Telugu – 7G Brundavan Colony (2004)

'Kalalu Kane Kaalalu' song from 7G Brundavan Colony (2004) movie is composed by Yuvan Shankar Raja and sung by Harish Raghavendra and Madhumitha.

SONG INFORMATION
Movie : 7G Brundavan Colony (2004)
Lyricist : A. M. Rathnam
చిత్రం: 7/G బృందావన కాలనీ (2004) సంగీతం: యువన్ శంకర్ రాజా సాహిత్యం: ఏ. ఎమ్. రత్నం, శివ గణేష్ గానం: హరీష్ రాఘవేంద్ర, మధుమిత, ఉస్తాద్ సుల్తాన్ ఖాన్ కలలు కనే కాలాలు కరిగిపోవు సమయాలు చెరిగిపోని ముగ్గే వేయునా చూపు రాయి లేఖలు దిశలు మారు గమ్యాలు ఒంటరిగా పయనం చేయునా ఇది చేరువ కోరే తరుణం ఇరు ఎదలలో మెల్లని చలనం ఇక రాత్రులు ఇంకొక నరకం వయసులా అతిశయం ఇది కత్తిన నడిచే పరువం నిజ కలలతో తమకమ రూపం పెళ్ళి కోరును నిప్పుతో స్నేహం దేవుని రహస్యము లోకంలో తియ్యని భాషా హృదయంలో పలికే భాషా  మెల్లమెల్లగ వినిపించే ఘోషా కలలు కనే కాలాలు కరిగిపోవు సమయాలు చెరిగిపోని ముగ్గే వేయునా చూపు రాయి లేఖలు దిశలు మారు గమ్యాలు ఒంటరిగా పయనం చేయునా తడికాని కాళ్ళతోటి కడలికేది సంభందం నే వేరు నువ్వేరంటే చెలిమికేది అనుబందం ఎగరలేని పక్షికేలా పక్షి అనెడి ఆ నామం తెరవలేని మనస్సుకేలా కలలు గనే ఆరాటం ఒంటరిగా పాదాలు ఏమికోరి సాగినవో జ్యోతి వెలిగించిన చేతి కొరకు వెతికినవో కలలైనా కొన్ని హద్దులు ఉండును స్నేహంలో అవి ఉండవుళే ఎగిరొచ్చే కొన్ని ఆశలు దూకితే ఆపుట ఎవరికి సాద్యములే కలలు కనే కాలాలు కరిగిపోవు సమయాలు చెరిగిపోని ముగ్గే వేయునా.. చూపు రాయి లేఖలు దిశలు మారు గమ్యాలు ఒంటరిగా పయనం చేయునా ఏమైందో ఏమో గాలికి తేమ కాస్త తగ్గెనులే ఎకాంతం పూసుకొని సంధ్య వేళ పిలిచెనులే కలలు కనే కాలాలు కరిగిపోవు సమయాలు చెరిగిపోని ముగ్గే వేయునా చూపు రాయి లేఖలు దిశలు మారు గమ్యాలు ఒంటరిగా పయనం చేయునా తెల్లవారు ఝాముల్లన్నీ నిద్రలేక తెలవారే కనులు మూసి తనలో తానే మాట్లాడ తోచెనులే నడిచేటి దారిలో నీ పేరు కనిపించా గుండెల్లో ఏవో గుసగుసలు వినిపించె అపుడపుడు చిరు కోపం రాగా కరిగెను ఎందుకు మంచులాగ భూకంపం అది తట్టుకోగల్ము మదికంపం అది తట్టుకోలేం

Mem Vayasuku Vachcham Song Lyrics in Telugu – 7G Brundavan Colony (2004)

'Mem Vayasuku Vachcham' song from 7G Brundavan Colony (2004) movie is composed by Yuvan Shankar Raja and sung by Unnikrishnan, Yuvan Shankar Raja, Shalini and Ganga.

SONG INFORMATION
Movie : 7G Brundavan Colony (2004)
Lyricist : Shiva Ganesh
చిత్రం: 7/G బృందావన కాలనీ (2004) సంగీతం: యువన్ శంకర్ రాజా సాహిత్యం: ఏ. ఎమ్. రత్నం, శివ గణేష్ గానం: గంగ, షాలిని సింగ్, ఉన్ని కృష్ణన్, యువన్ శంకర్ రాజా మేం వయసుకు వచ్చాం పరువానికి వచ్చాం ఈ ఇరవై ఏళ్ళు అరె వ్యర్థం చేశాం మా కన్నులలోన కన్నె రూపేనంట నిత్య కలలే మాకు ఇక భోజనమంట మేం బేబీనంటవు మరి బేబీ నిస్తవు మీ మాటే మాయరా మీ రూటే వేరురా నువు లొట్టలేసి తినగా అమ్మాయిలేమి ఆవకాయ్ కాదురా మేం వయసుకు వచ్చాం పరువానికి వచ్చాం ఈ ఇరవై ఏళ్ళు అరె వ్యర్థం చేశాం మా కన్నులలోన కన్నె రూపేనంట నిత్య కలలే మాకు ఇక భోజనమంట నిద్ర లేస్తే కాఫీకి బదులు సిగరెట్ తాగ తోచెనులే చెడ్డ చెడ్డ చానెల్స్ వెతికి రిమోట్ బటన్ అరిగెనులే ఎండమావిలో వర్షం లాగ బస్టాండ్ ఫిగరే నవ్వెనులే డిస్కో తెక్ కు తీసుకు పోగా డబ్బు లేక తికమకలే ఫిబ్రవరి 14th వస్తే ఒంటరిగ మది రగిలే ఫోన్ లో గుడ్ నైట్ చెప్పా లవర్ లేక తహ తహలే నువ్వు ఎండు గడ్డిని తెగ మేసే దున్నరా నువు సందే దొరికితె లైనేసే టైపు రా నువు లొట్టలేసి తినగా అమ్మాయిలేమి ఆవకాయ్ కాదురా మేం వయసుకు వచ్చాం పరువానికి వచ్చాం ఈ ఇరవై ఏళ్ళు అరె వ్యర్థం చేశాం మా కన్నులలోన కన్నె రూపేనంట నిత్య కలలే మాకు ఇక భోజనమంట మేడ మీద టాంకు పైన హసుకు కొట్ట తోచెనులే కాలేజ్ గాళ్స్ దారిన వెళ్తే కంటి చూపు మారెనులే ఫెయిర్ అండ్ లవ్లీ పూసుకున్న ఫిగర్ మాత్రం పడలేదే సారీ అని మేం చెప్పిన కాని శారి అని వినిపించెనులే కోటిలో ఒక్కరి లాగ ఆమె ముఖమున్నదిలే కోతినొక అమ్మాయిలాగ ఆమె చెల్లెలున్నదిలే నువు లొట్టలేసి తినగా అమ్మాయిలేమి ఆవకాయ్ కాదురా మేం వయసుకు వచ్చాం పరువానికి వచ్చాం ఈ ఇరవై ఏళ్ళు అరె వ్యర్థం చేశాం మా కన్నులలోన కన్నె రూపేనంట నిత్య కలలే మాకు ఇక భోజనమంట మేం బేబీనంటవు మరి బేబీ నిస్తవు మీ మాటే మాయరా మీ రూటే వేరురా నువు లొట్టలేసి తినగా అమ్మాయిలేమి ఆవకాయ్ కాదురా

Kannula Baasalu Theliyavule Song Lyrics in Telugu – 7G Brundavan Colony (2004)

'Kannula Baasalu Theliyavule' song from 7G Brundavan Colony (2004) movie is composed by Yuvan Shankar Raja and sung by Karthik.

SONG INFORMATION
Movie : 7G Brundavan Colony (2004)
Lyricist : Shiva Ganesh
Singers : Karthik
చిత్రం: 7/G బృందావన కాలనీ (2004) సంగీతం: యువన్ శంకర్ రాజా సాహిత్యం: ఏ. ఎమ్. రత్నం, శివ గణేష్ గానం: కార్తీక్ కన్నుల బాసలు తెలియవులే కన్నెల మనసులు ఎరుగములే ఒకవైపు చూపి మరువైపు దాచగ అద్దాల మససు కాదులే చేతులు సంద్రాన్ని మూయలేవులే ఇది అద్దాల మససు కాదులే చేతులు సంద్రాన్ని మూయలేవులే గాలి వీచి ఆకురాలిన కొమ్మ గురుతులు చెరగవులే దెబ్బలెన్నీ తిన్నగాని మనసు మాత్రం మారదులే ఒక పరి మగువ చూడగనే కలిగే వ్యధతను ఎరుగదులే అనుదినము ఇక తపియించే యువకుల మనసులు తెలియవులే హే... కన్నుల బాసలు తెలియవులే కన్నెల మనసులు ఎరుగములే ఒకవైపు చూపి మరువైపు దాచగ అద్దాల మససు కాదులే చేతులు సంద్రాన్ని మూయలేవులే చరణం: 1 అడవిలో కాచే వెన్నెల అనుభవించెదెవ్వరులే కన్నులా అనుమతి పొంది ప్రేమ చెంతకు చేరదులే దూరాన కనబడు వెలుగు దారికే చెందదులే మెరుపులా వెలుగును పట్టగ మిణుగురు పురుగుకి తెలియదులే కళ్ళు నీకు సొంతమట కడగళ్ళు నాకు సొంతమట అల కడలి దాటగనే నురగలిక ఒడ్డుకు సొంతమట కన్నుల బాసలు తెలియవులే కన్నెల మనసులు ఎరుగములే ఒకవైపు చూపి మరువైపు దాచగా అద్దాల మససు కాదులే చేతులు సంద్రాన్ని మూయలేవులే చరణం: 2 లోకాన పడుచులు ఎందరున్నను మనసొకరిని మాత్రమే వరియించులే ఒక పరి దీవించ ఆశించగా అది ప్రాణంతోనే ఆటాడులే మంచు బిందువొచ్చి ఢీకొనగ ఈ ముల్లె ముక్కలు అయిపోయెలే భువిలో ఉన్న అబద్దాలే అరె చీరను కట్టి స్త్రీ ఆయలే ఉప్పెనొచ్చినా కొండ మిగులును చెట్లు చేమలు మాయమౌనులే నవ్వువచ్చులే ఏడుపొచ్చులే ప్రేమలు రెండు కలసివచ్చులే ఒక పరి మగువ చూడగనే కలిగే వ్యధ తను ఎరుగదులే అనుదినము ఇక తపియించే యువకుల మనసులు తెలియవులే ఏ... కన్నుల బాసలు తెలియవులే కన్నెల మనసులు ఎరుగములే ఒకవైపు చూపి మరువైపు దాచగా అద్దాల మససు కాదులే చేతులు సంద్రాన్ని మూయలేవులే గాలి వీచి ఆకురాలిన కొమ్మ గురుతులు చెరగవులే దెబ్బలెన్నీ తిన్నగాని మనసు మాత్రం మారదులే

Idhi Rana Rangama Song Lyrics in Telugu – 7G Brundavan Colony (2004)

'Idhi Rana Rangama' song from 7G Brundavan Colony (2004) movie is composed by Yuvan Shankar Raja and sung by Harish Raghavendra. :contentReference[oaicite:0]{index=0}

SONG INFORMATION
Movie : 7G Brundavan Colony (2004)
Lyricist : Shiva Ganesh
చిత్రం: 7/G బృందావన కాలనీ (2004) సంగీతం: యువన్ శంకర్ రాజా సాహిత్యం: ఏ. ఎమ్. రత్నం, శివ గణేష్ గానం: హరీష్ రాఘవేంద్ర ఇది రణరంగమా లేక అగ్ని గుండమా విధి నడిపే ప్రేమ అర్ధమవదే ఇది రణరంగమా లేక అగ్ని గుండమా విధి నడిపే ప్రేమ అర్ధమవదే అగ్ని కణము నీటి గుణము రెంటిని కలిపితే నువ్వేనా ఇవతలి వైపు దేవతవైతే అవతలి వైపు దెయ్యమువా సమయం తింటావ్ మెదడుని తింటావ్ నన్నే తింటావ్ తప్పు కాదా పని పాట లేని పిల్లా ఇంట్లో నీకు తిండి లేదా చూపులు తగలగ మాటలు పెగలగ ఉరుములు మెరుపులు ఆరంభం పాదం కేశం నాభి కమలం రగులు కొనగా ఆనందం ధగ ధగమని వెలిగెను జ్వాల సెగ సెగమని ఎగిరెను బాలా తహతహమని తపనల గోల కసి కసియని కౌగిలి ఏలా మిత్రుల బృందం ఎదురే వస్తే పక్కకి తొలగి నడిచితిని పొద్దుట నిన్ను చూస్తానంటూ రాత్రినంతా గడిపితిని ఇట్టా ఇట్టా రోజులు గడవగ ఇంకా నన్నేం చేస్తావు మాయా మంత్రం తెలిసిన దానా త్వరగా నన్ను చంపెదవా ఏ తాడైనా నీ తలపుల్ని బిగిసేలాగ కడుతుందా నన్నే కాల్చగ ఎముకల గూడు నీ పేరేగా చెబుతుంది చిటపటమని చిందేస్తావా వదులొదులని విదిలిస్తావా దడదడమని జడిపిస్తావా ఒంటరిగా వదిలేస్తావా ఇది రణరంగమా లేక అగ్ని గుండమా విధి నడిపే ప్రేమ అర్ధమవదే

Kalalu Kane Kaalalu (Version 2) Song Lyrics in Telugu – 7G Brundavan Colony (2004)

'Kalalu Kane Kaalalu (Version 2)' song from 7G Brundavan Colony (2004) movie is composed by Yuvan Shankar Raja and sung by Harish Raghavendra and Srimathumitha.

SONG INFORMATION
Movie : 7G Brundavan Colony (2004)
Lyricist : Shiva Ganesh
చిత్రం: 7/G బృందావన కాలనీ (2004) సంగీతం: యువన్ శంకర్ రాజా సాహిత్యం: ఏ. ఎమ్. రత్నం, శివ గణేష్ గానం: హరీష్ రాఘవేంద్ర, మధుమిత కలలు కనే కాలాలు కరిగిపోవు సమయాలు చెరిగిపోని ముగ్గే వేయునా చూపు రాయి లేఖలు దిశలు మారు గమ్యాలు ఒంటరిగా పయనం చేయునా ఇది చేరువ కోరే తరుణం ఇరు ఎదలలో మెల్లని చలనం ఇక రాత్రులు ఇంకొక నరకం వయసులా అతిశయం ఇది కత్తిన నడిచే పరువం నిజ కలలతో తమకమ రూపం పెళ్ళి కోరును నిప్పుతో స్నేహం దేవుని రహస్యము లోకంలో తియ్యని భాషా హృదయంలో పలికే భాషా  మెల్లమెల్లగ వినిపించే ఘోషా

January Masam Song Lyrics in Telugu – 7G Brundavan Colony (2004)

'January Masam' song from 7G Brundavan Colony (2004) movie is composed by Yuvan Shankar Raja and sung by Mathangi Jagdish and Kunal Ganjawala.

SONG INFORMATION
Movie : 7G Brundavan Colony (2004)
Lyricist : Shiva Ganesh
చిత్రం: 7/G బృందావన కాలనీ (2004) సంగీతం: యువన్ శంకర్ రాజా సాహిత్యం: ఏ. ఎమ్. రత్నం, శివ గణేష్ గానం: హరీష్ రాఘవేంద్ర, శ్రీ మధుమిత కలలు కనే కాలాలు కరిగిపోవు సమయాలు చెరిగిపోని ముగ్గే వేయునా చూపు రాయి లేఖలు దిశలు మారు గమ్యాలు ఒంటరిగా పయనం చేయునా ఇది చేరువ కోరే తరుణం ఇరు ఎదలలో మెల్లని చలనం ఇక రాత్రులు ఇంకొక నరకం వయసులా అతిశయం ఇది కత్తిన నడిచే పరువం నిజ కలలతో తమకమ రూపం పెళ్ళి కోరును నిప్పుతో స్నేహం దేవుని రహస్యము లోకంలో తియ్యని భాషా హృదయంలో పలికే భాషా  మెల్లమెల్లగ వినిపించే ఘోషా కలలు కనే కాలాలు కరిగిపోవు సమయాలు చెరిగిపోని ముగ్గే వేయునా చూపు రాయి లేఖలు దిశలు మారు గమ్యాలు ఒంటరిగా పయనం చేయునా తడికాని కాళ్ళతోటి కడలికేది సంభందం నే వేరు నువ్వేరంటే చెలిమికేది అనుబందం ఎగరలేని పక్షికేలా పక్షి అనెడి ఆ నామం తెరవలేని మనస్సుకేలా కలలు గనే ఆరాటం ఒంటరిగా పాదాలు ఏమికోరి సాగినవో జ్యోతి వెలిగించిన చేతి కొరకు వెతికినవో కలలైనా కొన్ని హద్దులు ఉండును స్నేహంలో అవి ఉండవుళే ఎగిరొచ్చే కొన్ని ఆశలు దూకితే ఆపుట ఎవరికి సాద్యములే కలలు కనే కాలాలు కరిగిపోవు సమయాలు చెరిగిపోని ముగ్గే వేయునా.. చూపు రాయి లేఖలు దిశలు మారు గమ్యాలు ఒంటరిగా పయనం చేయునా ఏమైందో ఏమో గాలికి తేమ కాస్త తగ్గెనులే ఎకాంతం పూసుకొని సంధ్య వేళ పిలిచెనులే కలలు కనే కాలాలు కరిగిపోవు సమయాలు చెరిగిపోని ముగ్గే వేయునా చూపు రాయి లేఖలు దిశలు మారు గమ్యాలు ఒంటరిగా పయనం చేయునా తెల్లవారు ఝాముల్లన్నీ నిద్రలేక తెలవారే కనులు మూసి తనలో తానే మాట్లాడ తోచెనులే నడిచేటి దారిలో నీ పేరు కనిపించా గుండెల్లో ఏవో గుసగుసలు వినిపించె అపుడపుడు చిరు కోపం రాగా కరిగెను ఎందుకు మంచులాగ భూకంపం అది తట్టుకోగల్ము మదికంపం అది తట్టుకోలేం

Thalachi Thalachi Choosa Song Lyrics in Telugu – 7G Brundavan Colony (2004)

'Thalachi Thalachi Choosa' song from 7G Brundavan Colony (2004) movie is composed by Yuvan Shankar Raja and sung by K. K.

SONG INFORMATION
Movie : 7G Brundavan Colony (2004)
Lyricist : Shiva Ganesh
Singers : K. K.
చిత్రం: 7/G బృందావన కాలనీ (2004) సంగీతం: యువన్ శంకర్ రాజా సాహిత్యం: ఏ. ఎమ్. రత్నం, శివ గణేష్ గానం: కె కె తలచి తలచి చూశా వలచి విడిచి నడిచా నీకై నేను బ్రతికే ఉంటినీ ఓ... నీలో నన్ను చూసుకొంటినీ తెరచి చూసీ చదువు వేళా కాలిపోయే లేఖ బాలా నీకై నేను బ్రతికే ఉంటినీ ఓ... నీలో నన్ను చూసుకొంటినీ కొలువు తీరు తరువుల నీడ నిన్ను అడిగె ఏమని తెలుప రాలిపోయిన పూలా మౌనమా ... రాక తెలుపు మువ్వల సడినీ దారులడిగె ఏమని తెలుపా పగిలిపోయిన గాజులు పలుకునా... అరచేత వేడిని రేపే చెలియ చేతులేవీ ఒడిన వాలి కదలను చెప్పా సఖియ నేడు ఏదీ తొలి స్వప్నముగియక మునుపే నిదురే చెదిరెలే తలచి తలచి చూశా వలచి విడిచి నడిచా నీకై నేను బ్రతికే ఉంటినీ ఓ... నీలో నన్ను చూసుకొంటినీ మధురమైన మాటలు ఎన్నో మారుమ్రోగే చెవిలో నిత్యం కట్టెకాలు మాటే కాలునా... చెరిగి పోని చూపులు నన్నూ ప్రశ్నలడిగే రేయి పగలూ ప్రాణం పోవు రూపం పోవునా... వెంట వచ్చు నీడకూడా మంట కలిసి పోవూ కళ్ళ ముందు సాక్ష్యాలున్నా నమ్మలేదు నేనూ ఒకసారి కనిపిస్తావనీ బ్రతికే ఉంటినీ 

Palli Balakrishna Saturday, June 20, 2026



చిత్రం: గ్యాంగ్ ఆఫ్ గోదావరి (2023)
సంగీతం: యావన్ శంకర్ రాజా 
నటీనటులు: విశ్వక్ సేన్, నేహ శెట్టి , అంజలి 
దర్శకత్వం: కృష్ణ చైతన్య 
నిర్మాత: సూర్యదేవర నాగ వంశి, సాయి సౌజన్య 
విడుదల తేది: 08.12.2023



Songs List:



సుట్టంలా సూసి పాట సాహిత్యం

 
చిత్రం: గ్యాంగ్ ఆఫ్ గోదావరి (2023)
సంగీతం: యావన్ శంకర్ రాజా 
సాహిత్యం: శ్రీ హర్ష 
గానం: అనురాగ్ కులకర్ణి 

అద్దాల ఓణిలా ఆకాశవాణిలా
గోదారి గట్టుపై మెరిసావు మణిలా
పెద్ధింటి దానిలా బంగారు గనిలా
సూత్తానే నిన్నిలా నా రెండు కన్నులా

కల ఉన్న కళ్ళకే, కాటుకే ఏలా?
మా వీధి వీధంతా దిష్టి కొట్టేలా
సన్నాయి మోతలా సందేళ పాటలా
సందల్లే తెచ్చావే నీలా

సుట్టంలా సూసి పోతలా
సుట్టేసుకోవే సీరలా
సక్కాని సంటివాడిలా
మ్ మ్ సేత్తానే నువ్ సెప్పిందలా

ఏ ఉత్తరాలు రాయలేను
నీకు తెలిసేలా
నా లచ్చనాలనన్ని
పూసగుచ్చేలా

ఏమౌతానంటే ఏది సెప్పలేను వరుసలా
నీ పక్కనుండిపోతే సాలులే ఇలా
సొట్టు గిన్నె మీద సుత్తి పెట్టి కొట్టినట్టుగా
సుమారు కొట్టుకుందే గుండె గట్టిగా
గంటకొక్కసారి గంట కొట్టే గడియారమై
నిన్నే తలిసేలా..!

సుట్టంలా సూసి పోతలా
సుట్టేసుకోవే సీరలా
సక్కాని సంటివాడిలా
సేత్తానే నువ్ సెప్పిందలా

అద్దాల ఓణిలా ఆకాశవాణిలా
గోదారి గట్టుపై మెరిసావు మణిలా
పెద్ధింటి దానిలా బంగారు గనిలా
సూత్తానే నిన్నిలా నా రెండు కన్నులా

కల ఉన్న కళ్ళకే, కాటుకే ఏలా?
మా వీధి వీధంతా దిష్టి కొట్టేలా
సన్నాయి మోతలా సందేళ పాటలా
సందల్లే తెచ్చావే నీలా

సుట్టంలా సూసి పోతలా
సుట్టేసుకోవే సీరలా
సక్కాని సంటివాడిలా
సేత్తానే నువ్ సెప్పిందలా

Palli Balakrishna Sunday, October 8, 2023



చిత్రం: సామాన్యుడు (2022)
సంగీతం: యువన్ శంకర్ రాజా 
నటీనటులు: విశాల్, డింపుల్ హయాతి
దర్శకత్వం: సరవనన్ 
నిర్మాత: విశాల్
విడుదల తేది: 2022



Songs List:



మత్తెక్కించే కళ్ళే పాట సాహిత్యం

 
చిత్రం: సామాన్యుడు (2022)
సంగీతం: యువన్ శంకర్ రాజా 
సాహిత్యం: శ్రీమణి 
గానం: యువన్ శంకర్ రాజా 

మత్తెక్కించే కళ్ళే
పిచ్చెక్కించే చూపే
నిముషాల్లో కైపెక్కించే నైజం నీదే
కత్తుల్లేని యుద్ధం
ప్రాణం తీసే అందం
సొగసే నీ ఆయుధమైతే
నేనేం చెయ్యాలి

నీతో అడుగే పడితే
నాలో ఒంటరితనమొక సెలవే
ఓ ప్రేమ ప్రపంచం నిర్మించి
కల నిజమే చేద్దాం పదవే

కనుసైగ తోటి పిలుపివ్వు చాలే
భూలోకమంతా గెలిచేస్తాలే
నా చెయ్యి పట్టి అందించు చాలే
ఈ లోకమంతా ఏలేస్తాలే

ఉదయాన్నే హాయిగా
ఒళ్ళో ఉన్న నిన్నే చూసి
నమ్మేలా లేదని
నన్నే నిన్ను గిల్లుకుని

ఎటు పక్క నేనున్నా
నాతో నిన్నే పక్కన చూసి
ఏం చక్కని జంటని చెప్పి
లోకం కుళ్ళి చావని

ప్రాణం విడువని జతగా
మన ప్రేమ ప్రయాణం మొదలవ్వని
కాలం మరువని కధగా
మన ప్రేమని చరితే చదివేయ్ని

నీ బుగ్గల్లోని సిగ్గే
చీకట్లో వెన్నెల
అది అడిగే తీయని ముద్దే
నా పెదవికి వెన్నెల

కనుసైగతోటి పిలుపివ్వు చాలే
భూలోకమంతా గెలిచేస్తాలే
నా చెయ్యి పట్టి అందించు చాలే
ఈ లోకమంతా ఏలేస్తాలే

మత్తెక్కించే కళ్ళే
పిచ్చెక్కించే చూపే
నిముషాల్లో కైపెక్కించే నైజం నీదే
కత్తుల్లేని యుద్ధం
ప్రాణం తీసే అందం
సొగసే నీ ఆయుధమైతే
ఏం చెయ్యాలి

Palli Balakrishna Wednesday, January 19, 2022



చిత్రం: 1945 (2022)
సంగీతం: యువన్ శంకర్ రాజా 
నటీనటులు: రాణా  దగ్గుబాటి, రెజీనా కసండ్రా
దర్శకత్వం: సత్య శివ 
నిర్మాత: ఎస్.యన్.రాజరాజన్
విడుదల తేది: 07.01.2022



Songs List:



అల్లరి చేసే కల పాట సాహిత్యం

 
చిత్రం: 1945 (2022)
సంగీతం: యువన్ శంకర్ రాజా 
సాహిత్యం: అనంత శ్రీరాం 
గానం: హరిచరణ్ , ప్రియా మాలి 

అల్లరి చేసే కల అల్లనదాకోకల
జతపడే మనసుతో ఆట నీకేలా
అల్లుకుపోయేవలా ఝల్లున దూకావలా
ముడిపడే ఘడియకై ఆగలేదేలా

వెల్లువలాంటి ప్రాణమే
వేచి వేచి చూడాలా
నీ ఎద నేనే చేరుతా
నిన్ను ఏదోలా
అయితే అదేదో
ఈ క్షణం లోనే చేరితే పోలా

అల్లరి చేసే కల అల్లనదాకోకల
జతపడే మనసుతో ఆట నీకేలా
అల్లుకుపోయేవలా ఝల్లున దూకావలా
ముడిపడే ఘడియకై ఆగలేదేలా

నెమ్మదిగా నెమ్మదిగా
ముసురులా కమ్మినదే
మైకమేదో మరుపు నేర్చేలా

ఆఆ ఆ, నమ్ముదుగా నమ్మవుగా
మేమేదో రమ్మందిగా
నేను నీతో కనులు కలుపుతూ
ఆదమరిచేనా

పెదవిపైన పెదవిలా
హాయిగా పవళించగా
ఎదలలోనా కదలనే
మౌనమే తెలపాలిగా
అవధులన్నీ చెరిపివేసే
ప్రేమసాక్షంగా

అల్లరి చేసే కల అల్లనదాకోకల
జతపడే మనసుతో ఆట నీకేలా
అల్లుకుపోయేవలా ఝల్లున దూకావలా
ముడిపడే ఘడియకై ఆగలేదేలా

Palli Balakrishna Sunday, January 9, 2022
చిత్రం: చక్ర (2021)
సంగీతం: యువన్ శంకర్ రాజా
సాహిత్యం: భువనచంద్ర
గానం: చిన్మయి శ్రీపాద, ప్రార్థన ఇంద్రజిత్
నటీనటులు: విశాల్, శ్రద్ధా శ్రీనాథ్, రెజీనా కాసాండ్రా
దర్శకత్వం: యం. యస్. ఆనందన్
నిర్మాత: విశాల్
విడుదల తేది: 19.02.2021







అమ్మ నువ్వంటే నాకు ప్రాణం
అమ్మ నీతోనే నాకు లోకం
నీతోనే నేనుంటా నీ రాణినంట
నీలో కనిపించేది నా రూపేనమ్మా

నీ చేతుల్లో నా చేయుంటే ఎంత సుఖం
నువ్ లేకుండా ఉండలేనే నేను క్షణం
నన్ను నడిపించేవి నీ మాటలే
దారి చూపించేవి నీ చూపులే

చిరునవ్వై ఒదిగుంటా నీ ఒడిలో నేనమ్మా
చీకట్లో దీపంలా నా దరికొచ్చావమ్మా
నువ్వే నా నేస్తం నా ప్రాణం అమ్మ
నే చూడలేనే నీ కళ్ళల్లో చెమ్మ
రెక్కలు వచ్చాయే నా మనసుకు ఈనాడు
నేనే నువ్వైపోతానమ్మా ఓ నాడు

ఆ ఆఆ ఆఆ ఆ ఆఆ
ఆఆఆ ఆఆ ఆఆ ఓఓ


Palli Balakrishna Sunday, March 21, 2021
చిత్రం: NGK (2019)
సంగీతం: యువన్ శంకర్ రాజా
నటీనటులు: సూర్య , సాయి పల్లవి, రకుల్ ప్రీత్ సింగ్
దర్శకత్వం: సెల్వ రాఘవన్
నిర్మాతలు: ఎస్. ఆర్. ప్రభు, ఎస్. ఆర్. ప్రకాశ్ బాబు
విడుదల తేది: 31.05.2019







చిత్రం: NGK (2019)
సంగీతం: యువన్ శంకర్ రాజా
సాహిత్యం: చంద్రబోస్
గానం: సిద్ శ్రీరామ్, హేమాంబిక

ప్రేమా ప్రేమా

ఓ ప్రేమా ఓ ప్రేమా

ప్రేమా సుడిగాలై నువ్వే ఉంటే 
చిరుగాలై చేరనా
నిశిలాగా నువ్వే ఉంటే 
నిను నీడై తాకనా
నదిలాగా నువ్వే ఉంటే 
చినుకై నే చిందనా

అడిగా బదులడిగా 
నీ అడుగై నడిచే మార్గం చూపుమా చూపుమా
పిలిచా నిను పిలిచా 
నీ కలలో నిలిచే మంత్రం చెప్పుమా చెప్పుమా

ప్రియమేఘం కురిసే వేళ 
పుడమెంత అందమో
మరుమల్లి మందారాల 
చెలిమెంత అందమో
ఎగసే అలలెగసే నీ ప్రేమలొ అందం 
ఎదనే లాగెనే లాగెనే

గుండెల్లొ నిండే మోహం 
శ్వాసల్లొ ధూపం వేసే
చుట్టూర పొగలై కమ్మెనే
గుట్టంత తెలిపేనే

తలుపులు వదలని యోచన
పెరిగెను మనసున యాతన
ప్రాయము చేసే ప్రార్ధన
పరుగున వచ్చే మోహన

ఓ చైత్రమాసాన మేఘమే చిందేను వర్షం
కోనల్లోన మోగదా భూపాళ రాగం

ప్రేమా ఓ ప్రేమా
మన నీడల రంగులు నేడే కలిసెనే కలిసెనే
చెలిమే మన చెలిమే ఒక అడుగై పెరిగి 
అఖిలం ఐనదే ఐనదే
ఓ అనురాగం పాడాలంటే మౌనం సంగీతమే
అనుబంధం చూపాలంటే సరిపోదె జన్మమే




Palli Balakrishna Friday, February 19, 2021
చిత్రం: సికిందర్ (2014)
సంగీతం: యువన్ శంకర్ రాజా
నటీనటులు: సూర్య, సమంతా
దర్శకత్వం: ఎన్. లింగుస్వామి
నిర్మాతలు: సిద్దార్థ్ రాయ్ కపూర్, ఎన్. సుభాష్ చంద్రబోస్
విడుదల తేది: 15.08.2014







చిత్రం: సికిందర్ (2014)
సంగీతం: యువన్ శంకర్ రాజా
సాహిత్యం: రాకెందు మౌళి
గానం: దీపక్, హరిచరణ్, యువన్ శంకర్ రాజా

నేనే  కాని నేనై  ఉండగా నీ  చూపే తాకి  
ప్రాణమే మరు జన్మే  పొందగా
ఎన్నో మార్పులు  రానె వచ్చెగా
అవి మారే కొద్ది  అణువణుల్లో నువ్వే కొత్తగా 

ఎందుకో...  ఇంతలో...
ఎందుకో  ఇంతలో  అంతటి వింతలే
ప్రేమ  మయమే మహిమే మహిలో నిండేలే

తను చిలిపిగ నగవులు చిలికితే 
తుది చనువుల చెలువలు సొకితే
అది ఇది అని తెలిసిన తరుణములో
మగతే మరి ఉరికే 
యద కదలిక  కుదురిక  వీడితే 
ఆ  పరుగులు పదనిస పాడితే 
ఆ సుృతి గతి జత పడు ప్రియ లయలే  నీ ఉపిరీ

నేనేె కాని నేనై  ఉండగా
నీ చూపే తాకి ప్రాణమే మరు జన్మే పొందగా
ఓ ఎన్నో మార్పులు రానె వచ్చెగా
అవి మారే కొద్ది అణువణుల్లో నువ్వే కొత్తగా 

కనుల కల ఎదురైతే కునుకిక కుదురేదీ
కల, నిజం,యుగం, క్షణం, నీ  జంటగా ఓ వింతట
చుపులకు కనబడని రేపటిని  చదివే మది
ఊహలోకం, నా ముందర  కొరిందిలే ఎ  తొందర
హద్దు పొద్దు లేని వలపునే పంచనా
చొరవ చూపు వేళ నిన్ను నే మించనా
నిన్ను నే మించనా
ని స్వాసే  నాలో ఉసురై ఉంచెనా

తను చిలిపిగ  నగవులు చిలికితే 
తుది  చనువుల  చెలువలు సొకితే
అది ఇది అని తెలిసిన తరుణములో
మగతే మరి ఉరికే
యద కదలిక  కుదిరిక  వీడితే 
ఆ  పరుగులు పదనిస పాడితే 
ఆ సుృతి గతి జత పడు ప్రియ లయలే  నీ ఉపిరీ

మనసు పొరలొ మాటే పలికినది పాటే
నిరంతరం  నీ ధ్యానమే ఇహం పరం నీ కోసమే
అడుగు కోరిన బాటే కడవరకు నీ తోటే
ఏ జన్శకీ  నీ తొడునే  వీడానులే అత్యాసగా
నీకు తేలుపలేని  తలపులే వేలులే
నీవు చెంత నుంటే మౌనమే మేలులే
మౌనమే మేలులే 
ఈ తహ తహ తీర్చగ  ప్రేమే చేప్పవా 

తను చిలిపిగ  నగవులు చిలికితే 
తుది  చనువుల  చెలువలు సొకితే
అది ఇది అని తెలిసిన తరుణములో
మగతే మరి ఉరికే
యద కదలిక  కుదిరిక  వీడితే 
ఆ  పరుగులు పదనిస పాడితే 
ఆ సుృతి గతి జత పడు ప్రియ లయలే  నీ ఉపిరీ



Palli Balakrishna


చిత్రం: మారి 2 (2018)
సంగీతం: యువన్ శంకర్ రాజా
నటీనటులు: ధనుష్, సాయి పల్లవి, వరలక్ష్మీ శరత్ కుమార్
దర్శకత్వం: బాలాజీ మోహన్
నిర్మాత: ధనుష్
విడుదల తేది: 21.12.2018







చిత్రం: మారి 2 (2018)
సంగీతం: యువన్ శంకర్ రాజా
సాహిత్యం: సామ్రాట్
గానం: ఎమ్. ఎమ్. మానసి, ధనుష్

హే నా నాటుకోడివే నా క్యూట్ జోడివే
నీ బుజ్జి పప్పి నే టేక్  మీ టేక్  మీ

హే నీ చిలక ముక్కే 
నా గుండెకి హుక్కే
నువ్ కేకో కేకే టాక్ మీ టాక్ మీ
హే మన్మధ రాజా నా మడత కాజా
ముద్దులిస్తాను ఆజా మస్తు మసాల మజా 
హే మాస్ మారాణి నా ఆకాశవాణి 
నా హార్ట్ కి బోణి నీ ఆటోదే పోనీ

రా మనం లాంగ్ డ్రైవే పోదాం 
ఊర మాసు స్టెప్పే వేద్దాం 
నువ్వే  లే  నా  రౌడీ  బేబీ

రా యు అర్ మై ఓన్లీ గర్ల్ ఫ్రెండు
నా  గుండె  నీకు  దిండు
ఉయ్  విల్ మాక్  అస్  న్యూ  ట్రెండు  బేబీ

పోదాం వేద్దాం రౌడీ బేబీ
గర్లు ఫ్రెండు నీ దిండు ట్రెండు బేబీ
రౌడీ బేబీ రౌడీ బేబీ

నిన్నెలే   నే   కోరింది
నా  రూటంత నీ  వల్లే  మారింది
హే  ఈడొచ్చి  మంచి  మూడొచ్చి
ఈ  మారి  కె  ఎక్కిందే  నీ  పిచ్చి

ఒకటై  కలిసి  ఉందామా ఒడిలోకొస్తే  హంగామ
రావే  నాటీ  రాణి నా  నింబు  పాణి
చీకట్లో  పని అరేయ్  చేద్దాంలే  చిన్ని
నా  సోకులా  ఖైదీ నువ్  చెప్పొక  తేది
సొగసంతా  నీది అడ్డు  లేదంట  ఏది

ఏ  రౌడీ  బేబీ , హే  రౌడీ  బేబీ
రౌడీ బేబీ రౌడీ బేబీ
రౌడీ బేబీ రౌడీ బేబీ
రౌడీ బేబీ రౌడీ బేబీ
రౌడీ బేబీ రౌడీ బేబీ

హే  నీ  నాటుకోడినే నీ  క్యూట్  జోడి  నే
న  బుజ్జి   పప్పి నే టేక్  మీ  టేక్  మీ
హే  నా  చిలక  ముక్కే నీ  గుండెకి  హుక్కే
నువ్  కేకో  కేకే టాక్  మీ  టాక్  మీ

హే మన్మధ రాజా నా మడత కాజా
ముద్దులిస్తాను ఆజా మస్తు మసాలా మజా 
హే మాస్ మారాణి నా ఆకాశవాణి 
నా హార్ట్ కి బోణి నీ ఆటోదే పోనీ

రా మనం లాంగ్ డ్రైవే పోదాం 
ఊర మాసు స్టెప్పే వేద్దాం 
నువ్వే  లే  నా  రౌడీ  బేబీ

రా  యు  అర్  మై  ఓన్లీ  గర్ల్  ఫ్రెండు
నా  గుండె  నీకు  దిండు
ఉయ్ విల్  మాక్  అస్  న్యూ  ట్రెండు  బేబీ

రౌడీ బేబీ రౌడీ బేబీ
రౌడీ బేబీ రౌడీ బేబీ 
రౌడీ బేబీ రౌడీ బేబీ
రౌడీ బేబీ రౌడీ బేబీ
రౌడీ బేబీ రౌడీ బేబీ


Palli Balakrishna


చిత్రం: సర్వం (2009)
సంగీతం: యువన్ శంకర్ రాజా
సాహిత్యం: భువనచంద్ర
గానం: హరిచరన్
నటీనటులు: ఆర్య , త్రిష , జె.డి.చక్రవర్తి
దర్శకత్వం: విష్ణువర్ధన్
నిర్మాత: యమ్. రఘునాథ్
విడుదల తేది: 15.05.2009

గాల్లొ తేలే పరిమలం లా నాదరికి రా
నీకై వాలే మెరుపులా నా వడికి రా

మారేనా మోహాల దాహమే
మధుమాసం గుండెల్లొ వుందమ్మ
తీరేన కల్లల్లొ మొహమే
ఒకదాహం కమ్మింది ఈ క్షణం మౌనమా


ఏకాంతం వెతుకుతున్నదే తరగని ఆషే
మదిలొ నిన్నెనే హ్రుదయం మారదే
ఒక సుఖం తీరదే

ఏకాంతంవెతుకుతున్నదే తరగని ఆషే
మదిలొ నిన్నెనే హ్రుదయం మారదే
ఒక సుఖం తీరదే

చిరు నవ్వై తాకవె పువ్వై పూచవు
నీవొ పూదొటవె
పరువాన్నె కవ్వించి ముద్దై లాలించి
నెర్పే నీ సొంతమె

చిరు నవ్వై తాకవె పువ్వై పూచవు
నీవొ పూదొటవె
పరువాన్నె కవ్వించి ముద్దై లాలించి
నెర్పే నీ సొంతమె

చిరుగాలే ఎదను తగిలె
ప్రియ సఖి పేరె తలచుకున్నదే
తలపులు రేపెనే
నను పెన వేసెనే

చిరుగాలే ఎదను తగిలె
ప్రియ సఖి పేరె తలచుకున్నదే
తలపులు రేపెనే
నను పెన వేసెనే

తీరలే దాహలు వుండున
నా వల్లొ వెచ్చంగ తాకవే
అందలె అన్నిట్లొ అందమె
అంగాంగం వెర్రెక్కిపొయనే వెచ్చగా


Palli Balakrishna Wednesday, February 20, 2019


చిత్రం: దేనికైనా రెడీ (2012)
సంగీతం: యువన్ శంకర్ రాజా,  చక్రి
నటీనటులు: మంచు విష్ణు, హన్సిక మోత్వాని
దర్శకత్వం: జి.నాగేశ్వర రెడ్డి
నిర్మాత: మంచు మోహన్ బాబు
విడుదల తేది: 24.10.2012


Palli Balakrishna Tuesday, February 19, 2019

చిత్రం: అభిమన్యుడు (2018)
సంగీతం: యువన్ శంకర్ రాజా 
సాహిత్యం: శ్రేష్ట
గానం: దీపక్, శ్రీవర్ధిని
నటీనటులు: విశాల్ కృష్ణ , సమంత అక్కినేని, అర్జున్ సార్జా
దర్శకత్వం: మిత్రన్ పి. ఎస్
నిర్మాత: విశాల్ కృష్ణ
విడుదల తేది: 11.05.2018

అడిగే హృదయమే అడిగే
నీ కోసం చూసే వరస ఏంటో
తెలుపమంటు ఇలా
అడుగే తెలిపెలే అడుగే
నీ వైపె నడిచే పరుగులేంటో
వివరంగా ఇలా
ఏనాడో నీ సొంతమై పొయిందే నా ప్రాణమే
ఈనాడే నీ ఒడి చెరి అనందంలోన తేలేనే

అడిగే హృదయమే అడిగే
నీ కోసం చూసే వరస ఏంటో
తెలుపమంటూ ఇలా

కొంచెం కొంచెం గుండె తట్టి లేపావే
నీ చుట్టు తిరిగే మంత్రం ఏదో వేశావే
ఎంతో అందమైన లోకం లోకి
నువ్వు తీసుకేళ్ళి నన్నే మాయం చేశావే

నన్నే వెంటాడే నీ నవ్వే
మదే ముద్దాడే నీ ఊహే
లోలో తారాడే నీ ఆశే
ఇలా నీ వైపే లాగేనే
అడిగే హృదయమే అడిగే
నీ కోసం చూసే వరస ఏంటో
తెలుపమంటు ఇలా
అడుగే తెలిపెలే అడుగే
నీ వైపే నడిచే పరుగులేంటో
వివరంగా ఇలా
ఏనాడో నీ సొంతమై పొయిందే నా ప్రాణమే
ఈనాడే నీ ఒడి చెరి అనందంలోన తేలేనే

అడిగే హృదయమే అడిగే
నీ కోసం చూసే వరస ఏంటో
తెలుపమంటు ఇలా

Palli Balakrishna Friday, January 25, 2019


చిత్రం: నాపేరు శివ (2010)
సంగీతం: యువన్‌శంకర్‌రాజా
నటీనటులు: కార్తి, కాజల్ అగర్వాల్
కథ, మాటలు ( డైలాగ్స్ ) , స్క్రీన్ ప్లే, దర్శకత్వం:  సుసీంద్రన్
నిర్మాతలు: యస్. ఆర్. ప్రకాష్ , ఎస్.ఆర్.మధు
సినిమాటోగ్రఫీ:
ఎడిటర్:
బ్యానర్:
విడుదల తేది: 20.08.2010


చిత్రం : నాపేరు శివ (2010)
సంగీతం : యువన్‌శంకర్‌రాజా
సాహిత్యం: సాహితి
గానం : హరిచరణ్

పల్లవి:
వెన్నెల చేతపట్టి తేనా పిండి బొమ్మ చేసి ఈనా
ఓహో ఆటలాడుదాం
పాటపాడుదాం చంద్రవంక పైన
నింగికి వెయ్యి నిచ్చెనలు
మేఘము చెయ్యి మాలికలు
వెల్‌కమ్ కడదాం చెలిమితో పై మెట్లు (2)

చరణం: 1
రేయి చూసి బెదురేలా వేదనెంతో పడనేలా
చీకటి లేక ఈ లోకాన జాబిలి అందం తెలిసేనా
కలలు నమ్ముకోనేలా కరుగు వేళ వగపేలా
కలలో పూచే పూవులు అన్నీ
చేతిలో మిలమిల మెరిసేనా
ఆ నింగికి మల్లే ఓ బంధం
మబ్బులు కమ్మిన ఎద మౌనం
కలిసొచ్చే రోజున వలపై రాదా
ప్రియమౌ అనుబంధం

చరణం: 2
కలత చెందు ఒక నిమిషం
గడిచిపోతే సంతోషం
నిలువున జ్వాలై మండేటపుడే
దీపపు వెలుగుకు ఉత్సాహం
కడలిలోన నది ఐక్యం
ఉనికి విడిన ఉప్పు గుణం
చినుకే ఐనా వానగ మారి
చివరికి కాదా మణిముత్యం
ఈ జీవితమన్నది ఓ వలయం
విశ్రాంతెరుగని ఓ స్వప్నం
అది మొదలే లేని ముగియని కథనీ
పొందకు దుఃఖాన్ని


*******  ******  ******


చిత్రం: నాపేరు శివ (2011)
సంగీతం: యువన్‌శంకర్‌రాజా
సాహిత్యం: సాహితి
గానం: కార్తీక్


పల్లవి:
మనసే గువ్వై ఎగిసేనమ్మో
చెలిమి మాటే వినపడగా
పసిపాపల్లే తడబడినానే నీ చూపెదనే తాకంగా
ఎద నాడే చేజారే నీ చెయ్యే నన్ను సోకగా
మంచల్లే కరిగేనే ఈ గాలే నాపై వీచగా
అయ్యయ్యో ప్రేమే పుట్టెనే
అది అణగని ఆశై పట్టెనే
నా ఎదలో ఏదో మెరుపై మెరిసి తలుపే తట్టేనే
కనురెప్పల ప్రేమల చాటు కన్నీరు తీపైనట్టు
నా జంటై ఎప్పటికింకా నువ్వుంటే అంతేచాలు
నా వెంటే నువ్వే వస్తే మిన్నంటే సంతోషాలు
నా జంటై ఎప్పటికింకా నువ్వుంటే అంతేచాలు

చరణం: 1
చెంతకొచ్చి నువు నిలవడం నిన్ను కలిసి
నే వెళ్లడం అనుదినం జరిగెడి ఈ నాటకం
ఒక సగాన్ని చెప్పేయడం మరు సగాన్ని
దాపెట్టడం తెలిసెలే తెలిసెలే కారణం
కాలాలు పూచెలే వేగాలు వేచెలే
కలువా నీ కాటుక కన్నుల చూపులు
గారడి చేసేలే

చరణం: 2
నా కంటికి ఏమైనదో రేయంతా
ఎరుగదు కునుకును
ప్రియా నువు లేనిదే నీ లేను ఓవ్ ఓహో
నా మీద నీ సువాసన ఏనాడో వీచగ కోరెను
ఎలా నిను చేరక బతికేను ఓవ్ ఓహో
నా ఇరు కళ్లకే ఓ హరివిల్లువే
నీ విరిసే నవ్వులే ఎదలో పూల జల్లులే


Palli Balakrishna Friday, February 2, 2018


చిత్రం: మిస్టర్ నూకయ్య (2012)
సంగీతం : యువన్ శంకర్ రాజా
సాహిత్యం: లక్ష్మీ భూపాల్
గానం: ప్రియా హిమేష్ , రంజిత్
నటీనటులు: మంచు మనోజ్ , కృతి కర్బంధ, సనా ఖాన్
దర్శకత్వం: అని కన్నెగంటి
నిర్మాత: డి. యస్. రావు
విడుదల తేది: 08.03.2012

పల్లవి:
ఏ జన్మ బంధమో ఈ స్నేహం
ఏ దివ్య రూపమో నేస్తం
ఎన్నాళ్ళ మౌనమో ఈ రాగం
ఇన్నాళ్ల కొచ్చెనా సాయం
నేనున్నా అంది నీచూపే
నేనున్న ధ్యాస నీవైపే
ఔనన్నా ఎవరు కాదన్నా
నువ్వేనా ప్రాణం ప్రాణం

ఏ జన్మ బంధమో ఈ స్నేహం
ఏ దివ్య రూపమో నేస్తం
ఎన్నాళ్ళ మౌనమో ఈ రాగం
ఇన్నాళ్ల కొచ్చెనా సాయం

చరణం: 1
ఎంతెంత దూరం ఆనంద తీరం
అనుకుంటూ తిరిగా ఇన్నాళ్ళు
గోరంత స్నేహం కొండంత తోడై
కనిపించగానే కన్నీళ్లు
గుండెల్లో భారాలు  మాయమై
నీరెండల్లో సెలయేటి స్నానమై
నిను కోరితే నీ ఒడి చేరితే
మనసెగిరింది మేఘాల దారుల్లో

చరణం: 2
అపురూపమైన బంగారు నువ్వు
అనుకోని కలవై కలిశావు
క్షణ కాలమైన విడలేను నిన్ను
కను రెప్ప లోనే ఉంటావు
స్నేహాన్ని దాటాను ప్రేమతో
ఈ దేహాన్ని వదలాలి ప్రేమలో
నీ నీడగా నీ చెలికాడుగా
ప్రేమిస్తాను నీకన్న నిన్నెంతో

నేనున్నా అంది నీచూపే
నేనున్న ధ్యాస నీవైపే
ఔనన్నా ఎవరు కాదన్నా
నువ్వేనా ప్రాణం ప్రాణం

ఏ జన్మ బంధమో ఈ స్నేహం
ఏ దివ్య రూపమో నేస్తం
ఎన్నాళ్ళ మౌనమో ఈ రాగం
ఇన్నాళ్ళకొచ్చెనా సాయం

Palli Balakrishna Tuesday, October 31, 2017


చిత్రం: శేషు (2002)
సంగీతం: యువన్ శంకర్ రాజా, ఇళయరాజా
సాహిత్యం: చంద్రబోస్ , సాయి శ్రీ హర్ష
గానం:  ఉన్ని కృష్ణన్
నటీనటులు: రాజశేఖర్, కళ్యాణి (తొలిపరిచయం తెలుగులో )
దర్శకత్వం: జీవిత రాజశేఖర్
నిర్మాత: బేబీ శివాని
విడుదల తేది: 28.02.2002

మెరిసి మెరిసి మురిసి మురిసి
మనసు మనసు కలిసి నేడు
కలలు తీరెనె..
తలచి తలచి తపసు చేసి తనను
గెలిచె కలత నేడు కరిగిపోయనె

మరుమల్లి పూల బాణమేసి నన్నల్లి
పరిమలాల ప్రేమ పాట పాడె..
జాబిల్లి వెన్నెలంత నాపై వెదజల్లి
జీవితాన వెలుగు నింపె నేడే

మెరిసి మెరిసి మురిసి మురిసి
మనసు మనసు కలిసి నేడు
కలలు తీరెనె..
తలచి తలచి తపసు చేసి తనను
గెలిచె కలత నేడు కరిగిపోయనె

అడుగులొన అడుగు వేసి అందమైన
బంధమేదొ నడిచి వచ్చనే..
అలిసి వున్న బ్రతుకొలొన సేద తీర్చు
చెలిమి నాకు ఎదురు వచ్చెనే..

Palli Balakrishna Tuesday, October 17, 2017


చిత్రం: ఆక్సిజన్ (2017)
సంగీతం: యువన్ శంకర్ రాజా
సాహిత్యం: శ్రీమణి
గానం: దీపక్ , యస్.ఐశ్వర్య
నటీనటులు: గోపిచంద్ , రాశిఖన్నా , అనుఇమాన్యుయేల్, శామ్
దర్శకత్వం: జ్యోతిక్రిష్ణ
నిర్మాత: యస్.ఐశ్వర్య
విడుదల తేది: 12.10.2017

కన్నులు కలిసేదోక్షణం పెదవులు కలిసేదోక్షణం
నీతో ఈ నిమిషం కలకాలం
రెప్పలు సవ్వడి ఓ క్షణం తీయని కన్నీరోక్షణం
నీతో ఈ నిమిషం చిరకాలం
ఇదే క్షణం మళ్ళీ మళ్ళీ రావాలిలే
ప్రతీ క్షణం నీతో ఇలా ఉండాలిలే

తెలుసా మనసా తెలుసా నీతో
విడి వడి వేసిన అడుగొక నిమిషం
తెలుసా మనసా తెలుసా క్షణమొక యుగమై గడిచెనులే
తెలుసా మనసా తెలుసా నీతో
జతపడి విడిచిన ప్రతి ఒక నిమిషం
తెలుసా మనసా తెలుసా ఆ క్షణం లోకం నా వశమే

నీ చెంత లేని ఏ నిమిషమైన
నీ జత నిమిషమంత మధురం పంచలేదే
కన్నీరునైనా పన్నీరు చేసే
నీ ఒడిలోనె క్షణమే నా గుడి అయ్యనే
నీ పేరుతోటి నా పేరుని పెనవేసి క్షణము ఉప్పొంగెలే
కాలాన్ని సన్న దారం లా అల్లుకున్నాయి శరమ పూలే
వయసే మళ్ళిన వెళ్లిన తనువుకి
యవ్వనం యవ్వనం పూవనం ఈ క్షణం

తెలుసా మనసా తెలుసా నీతో
విడి వడి వేసిన అడుగొక నిమిషం
తెలుసా మనసా తెలుసా క్షణమొక యుగమై గడిచెనులే
తెలుసా మనసా తెలుసా నీతో
జతపడి విడిచిన ప్రతి ఒక నిమిషం
తెలుసా మనసా తెలుసా ఆ క్షణం లోకం నా వశమే

ఈ తీపి నిమిషం చేదవ్వకుండా
నా ప్రాణాన్ని పంచి నే కాపాడుకోనా
ఈ హాయి నిమిషం మాయవ్వకుండా
నా హృదయంలో దాచి నే బ్రతికించనా
నిమి క్షణములో తీపి కవితలా
నిమి సెకనులో ప్రేమ శకములా
అని తేల్చ లేని వింతైన ముద్దులో నిలిచెను ఈ క్షణమే
ఊపిరి ఆగినా జాగిలా తెలియదే
ఈ క్షణం ముద్దులో తీర్చనే తీరదే

తెలుసా మనసా తెలుసా నీతో
విడి వడి వేసిన అడుగొక నిమిషం
తెలుసా మనసా తెలుసా క్షణమొక యుగమై గడిచెనులే
తెలుసా మనసా తెలుసా నీతో
జతపడి విడిచిన ప్రతి ఒక నిమిషం
తెలుసా మనసా తెలుసా ఆ క్షణం లోకం నా వశమే


*******   *******  *******


చిత్రం: ఆక్సిజన్ (2017)
సంగీతం: యువన్ శంకర్ రాజా
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: రేవంత్

అది లెక్క దరువెయ్ రోరన్న
తకదిన్న కూని రాగం ఎత్తుకున్న
పక్క తాళం అందుకోన
దీనికన్నా తీయనైనా కమ్మనైన వెలుగన్న
ఆ హాయే వేరన్నా
అరదండ మువ్వల పట్టిలో
56 అక్షరాలు ఘల్ ఘల్ తెలుగన్నా
మూడు లింగాల నేలంటూ నింగి గంగే జారి
తెలుగల్లే మారిందన్నా...
అణువణువు మన పుట్టకనుంచే ఒంట్లో చేరే
గాలి తెలుగు భాషే యన్నా
అడుగడుగుకట్టుబొట్టు తీరు తెన్ను
మనతో నడిచే పూల దారేయన్నా
అమ్మగోరు ముద్దే మన అచ్చతెలుగన్న
పిజ్జా బగ్గర్ పైన పిచ్చామోజు వద్దున్నా

ఎగా దిగా మనకు


*******   *******  *******


చిత్రం: ఆక్సిజన్ (2017)
సంగీతం: యువన్ శంకర్ రాజా
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: యమ్.ఎల్.ఆర్.కార్తికేయన్, యస్.ఐశ్వర్య

హో సింగమంటి మొనగాడు
మా ఇంటి బందువైనాడు
ఇక నేడు రేపు ఏనాడు
మా సొంత సైన్యమే వీడూ

సింగమంటి మొనగాడు
మా ఇంటి బందువైనాడు
ఇక నేడు రేపు ఏనాడు
మా సొంత సైన్యమే వీడు
మా సొంత సైన్యమే వీడు ఊ ఊ ఊ ఊ…

ఆకాశం పందిరి వీడు
మా అందరి నీడైనాడు
ప్రతి చోట వీడూ మా తోడూ..
భూగోలం లాగ వీడు
మా అడుగును నిలబెడతాడు
నడిపించే బలమై ఉంటాడూ..

సుతి మెత్తనైనా మనసున్న వాడూ
సివాలెత్తి సివుడైతే ఆపేవాడే లేడూ
ప్రేమ గంగ గుండెల్లొ ఉన్నొడూ..
ముప్పు చూస్తే మూడో కన్నై లెస్తాడూ.

ఆకాశం పందిరి వీడు
మా అందరి నీడైనాడు
ప్రతి చోట వీడూ మా తోడూ..
భూగోలం లాగ వీడూ
మా అడుగును నిలబెడతాడు
నడిపించే బలమై ఉంటాడూ..

గుండె దమ్ములున్న మంది ముందు వీడు
మల్లె చెండు లాగ మారిపొయినాడు
జడపాయి లో జతగాడై త్వరలో రానున్నాడు
మండె నడి పొద్దుల్లోని వేడి సూరీడు
నా పాపిట కుంకుమ వీడె నే వెతికే వాడు

హెయ్ నలు దిక్కుల పొలిమెరల్లో నిలబడినాడూ
మా ప్రాణాల పగ రా వీడూ
మా ఊపిరికే దసరా వీడూ
దైర్యం వీడూ
మా సౌర్యం వీడూ
బందం వీడూ
మా బాగ్యం వీడూ

ఆకాశం పందిరి వీడు
మా అందరి నీడైనాడు
ప్రతి చోట వీడూ మా తోడూ..
భూగోలం లాగ వీడు
మా అడుగును నిలబెడతాడు
నడిపించే బలమై ఉంటాడూ..



Palli Balakrishna Thursday, October 12, 2017


చిత్రం: నేనే అంబాని (2010)
సంగీతం: యువన్ శంకర్ రాజా
సాహిత్యం: వెన్నెలకంటి
గానం: హరిచరణ్
నటీనటులు: ఆర్యా, నయనతార
దర్శకత్వం: రాజేష్. యమ్
నిర్మాత: శివశ్రీ శ్రీనివాసన్
విడుదల తేది: 17.12.2010

ఎవరీ అమ్మాయని అడిగా ఆనాడు
తానె నా ప్రాణమని తెలిసే ఈనాడు
నన్నే చూసేనే ఏదో  అడిగెనే,
మాయే  చేసెనే.. ఒహోహో
చూపుతో  నవ్వెనే  చూపులు  రువ్వేనే,
గుండె  గిల్లెనే  ఒహోహో
చుక్కల్లో నడుమ జాబిల్లి  తానే
రెక్కలు తొడిగే సిరిమల్లి తానై
ఏదో  చేసే  నన్నే ....

ఎవరీ అమ్మాయని అడిగా ఆనాడు
తానె నా ప్రాణమని తెలిసే ఈనాడు
 
మా  ఇంటి ముంగిట్లో  తను వేసే ముగ్గులు
ఎప్పటికీ చెరిగి  పోరాదంటా
తన  పెదవుల  మందారం
తన  పాపిట  సింధూరం
నా గుండెకి  సూర్యోదయమంటా
అందాల  గాజుల  లాగా
తన చేయి స్పర్శ తగిలితే  చాలు
తన కాలి మువ్వ  సవ్వడి  నేనై ,
కల కాలముంటే  మేలు
కమ్మని చెవిలో కబురే చెప్పెనే
సిగ్గులె  బుగ్గ  మొగ్గైంది  నీవేనే
ఏదో చేసే నన్నే ..హే  హే ...

ఎవరీ అమ్మాయని అడిగా ఆనాడు
తానె నా ప్రాణమని తెలిసే ఈనాడు

నే  తనని చూస్తే ఎటో చూస్తుంది
నే చూడకుంటే నన్నే  చూసే
తన నవ్వు చూపి, నే చూస్తే ఆపి
పైపైకి  నటనేదో చేసే
స్త్రీ హృదయం అద్వైతం లాగా
ఏనాడూ  ఎవరి కర్థమే కాదు
మగవాడి మనసూ తపియించే  వయసు
ఆడవాళ్ళకి  అలుసు
మది  గాయపడ్డాక  నాకోసం  వస్తుంది
వానే  వెలిసాక  గొడుగిచ్చి నట్టుంది
ఏదో చేసే నన్నే  ఏ  హే  హే ....

ఎవరీ అమ్మాయని అడిగా ఆనాడు
తానె నా ప్రాణమని తెలిసే ఈనాడు
నన్నే చూసేనే ఏదో  అడిగెనే, 
మాయే  చేసెనే.. ఒహోహో
చూపుతో  నవ్వెనే  చూపులు  రువ్వేనే, 
గుండె  గిల్లెనే  ఒహో హో
చుక్కల్లో నడుమ జాబిల్లి  తానె
రెక్కలు తొడిగే సిరిమల్లి తానై
ఏదో  చేసే  నన్నే  హే....

Palli Balakrishna Wednesday, October 4, 2017

చిత్రం: జాదు (2006)
సంగీతం: యువన్ శంకర్ రాజా
సాహిత్యం:
గానం:
నటీనటులు: రవికృష్ణ , ఇలియానా, తమన్నా
దర్శకత్వం: ఎ. యమ్. జ్యోతి కృష్ణ
నిర్మాత: ఎ. యమ్.రత్నం
విడుదల తేది: 24.09.2006

ఆదిమవసుడు నెనె , నీ ప్రెమకు దాసుడు నెనె
నిన్ను చెర విడిపించె ప్రెమ నదెలె
అశా వాసుడు నెనె , నే బానిసనయిపొయానె
నా గుండెల్లొ నిన్ను దాచుకుందునె
దెవత నిన్నె విడిపించ, ప్రాణమె త్యాగం చెస్తానీ
వెన్నెలె నిన్ను బంధిస్తె , నింగి నె చేల్చి వెస్తా నీ

కలతె ల చెలియ నీ కన్ను చోఓపు నెనె
కావలిని దాటి , నే దరి చెరుతానె
నా తొడు నేవుంటె భయమెల హౄదయంలొ
నిప్పులొ నిలిచున్న , నన్నెమి చెయ్యదులె
నా కన్నులలొ వెలుగులొలికెను, నీ నడకకు దారి తెలియును
జననం మరణం అన్ని నీవల్లె….

నువ్వులెక పొతె నా బ్రతుకె భారం
మరణాన్ని కన్న ఆ క్షన్మె ఘొరం
హౄదయాన్ని చెదించి , రక్తాన్ని చిందించి
రాస్తాను లెఖలనీ నరములె సందించి
నాలుగు యుగములుగ భూమి నిలిచెను
దాన్ని మించి మన ప్రెమ నిలిచును
దెహం ప్రాణం నిన్నె కొరెలీ

ఆదిమవసూ మెమె , ఇక ప్రెమకు దాసులు మెమె
మమ్మ్ము చెర విడిపించె ప్రెమ మాదెలె

Palli Balakrishna Wednesday, September 27, 2017



చిత్రం: రామ్ (2006)
సంగీతం: యువన్ శంకర్ రాజా
నటీనటులు: నితిన్, జనీలియ, హర్షిత భట్, కృష్ణంరాజు
దర్శకత్వం: యన్.శంకర్
నిర్మాత: సుధాకర్ రెడ్డి
విడుదల తేది: 30.03.2006



Songs List:



షాక్ పాట సాహిత్యం

 
చిత్రం: రామ్ (2006)
సంగీతం: యువన్ శంకర్ రాజా
సాహిత్యం: చిన్ని చరణ్ 
గానం: షాన్, అన్చల్, సుచిత్ర, ప్రేమ్ జీ 

షాక్



నువ్వేనా ఎదలొ పాట సాహిత్యం

 
చిత్రం: రామ్ (2006)
సంగీతం: యువన్ శంకర్ రాజా
సాహిత్యం: చంద్రబోస్
గానం: హరిచరన్, శ్వేతా మోహన్

నువ్వేనా ఎదలొ నువ్వేనా నువ్వేనా ఎదురుగ నువ్వేనా 
అడుగడుగున నన్నే నడిపే రహదారిని నువ్వేనా 
అణువనువున నన్నే తడిపే రస గోదారివి నువ్వేనా 

నువ్వేన నువ్వేనా….. 

నువ్వేనా ఎదలొ నువ్వేనా నువ్వేనా ఎదురుగా నువ్వేనా 

నీలినింగి నువ్వేనా నేలరాజు నవ్వు నువ్వేనా 
గాలి ఈల నువ్వేనా ఆ నువ్వు నేను కానా.. 
పూల మాల నువ్వేనా ఆ మేఘమాల నువ్వేనా 
రాగామాల నువ్వేనా నీలోనా నేను లెనా 
ప్రపంచము సమస్తమూ సామాప్తమవుతున్న 
చారో సాఘం మరో జగం అనేది మనమేనా 

నువ్వేనా నువ్వేనా...
నువ్వేనా ఎడాలో నువ్వేనా నువు నువ్వేనా ఎదురుగా నువ్వేనా 

చెంప నురుపు నువ్వేనా నా పెదవి బెరుపు నువ్వేనా 
ముద్దు ముడుపు నువ్వేనా అనలేను ఎందుకన్నా.. 
సొగసు నదులు నువ్వేనా చరసాల నిధులు నువ్వేనా 
మధన తిధులు నువ్వేనా ఇకపాయినా ఆపుతున్న… 
వసంతమో ఏ మంత్రమో షరత్తు ఏదయినా 
యుగాంతము సుఖాంతమయి చరిత్ర మనదే….. 

నువ్వేనా ఎడాలో నువ్వేనా నువ్వేనా ఎదురుగా నువ్వేనా…




మేడే ఇన్ హైదరాబాద్ పాట సాహిత్యం

 
చిత్రం: రామ్ (2006)
సంగీతం: యువన్ శంకర్ రాజా
సాహిత్యం: చంద్రబోస్ 
గానం: శంకర్ మహదేవన్

మేడే ఇన్ హైదరాబాద్ 




పిల్ల భలే పాట సాహిత్యం

 
చిత్రం: రామ్ (2006)
సంగీతం: యువన్ శంకర్ రాజా
సాహిత్యం: భువనచంద్ర 
గానం: టిప్పు, సైంధవి 

పిల్ల భలే 



ఖుర్బానీ పాట సాహిత్యం

 
చిత్రం: రామ్ (2006)
సంగీతం: యువన్ శంకర్ రాజా
సాహిత్యం: భువనచంద్ర 
గానం: యువన్ శంకర్ రాజా, సాధనా సర్గమ్ 

ఖుర్బానీ 

Palli Balakrishna Thursday, September 14, 2017
Aawara (2010) Telugu Songs Lyrics Album Cover

Aawara (2010) Telugu Songs Lyrics

MOVIE DETAILS
Movie : Aawara (2010)
Banner : Thirupathi Brothers
Music : Yuvan Shankar Raja
Director : N. Linguswamy
Story : N. Linguswamy
Producers : N. Subash Chandra Bose, N. Linguswamy
Actors : Karthi
Actresses : Tamannaah Bhatia
Supporting Cast : Milind Soman, Sonia Deepti, Jagan
Release Date : 2 April 2010

Chiru Chiru Chiru Song Lyrics in Telugu – Aawara (2010)

'Chiru Chiru Chiru' song from Aawara (2010) movie. Music composed by Yuvan Shankar Raja and sung by Haricharan, Tanvi Shah.

SONG INFORMATION
Movie : Aawara (2010)
Music : Yuvan Shankar Raja
Lyricist : Chandrabose
Singers : Haricharan, Tanvi Shah
చిత్రం: ఆవారా (2010) సంగీతం: యువన్ శంకర్ రాజా సాహిత్యం: చంద్రబోస్ గానం: Haricharan, Tanvi Shah పల్లవి:  చిరు చిరు చిరు చినుకై కురిశావే  మరుక్షణమున మరుగై పోయావే  నువ్వే ప్రేమబాణం నువ్వే ప్రేమ కోణం  పువ్వై నవ్వగానే గాలై ఎగిరెను ప్రాణం  చెయ్ చెయ్ చెయ్ చెలిమిని చెయ్ అంటూ  హృదయము పలికినదే  సై సై సరసకు సై అంటూ  పాదం కదిలినదే  ఎదనే నీతో ఎత్తుకెళ్ళావే  చిరు చిరు చిరు చినుకై కురిశావే  మరుక్షణమున మరుగై పోయావే  చరణం: 1  దేవత తనే ఒక దేవత..  ముఖాముఖి అందమే చూడగా ఆయువే చాలునా  గాలిలో తనే కదా పరిమళం  చెలి సఖి అనుమతే అడగకా పువ్వులే పూయునా  సిగలో కురులే మేఘాలల్లే ఆడే వేళ  గుండెల్లోన మెరుపే మెరిసే చూపే మైమరిచే  చెలి చెక్కిళ్ళే ముద్దుల్తోనే తడిమెయ్యాల  చెంగు చెంగు అడుగుల్లోన మువ్వై మది మురిసే  ఎదనే తనతో ఎత్తుకెళ్ళిందే  చెయ్ చెయ్ చెయ్ చెలిమిని చెయ్ అంటూ  హృదయము పలికినదే  సై సై సరసకు సై అంటూ  పాదం కదిలినదే  చరణం: 2 తోడుగా ప్రతిక్షణం వీడక  అనుక్షణం ఆమెతో సాగనా ఆమె నా స్పందన  నేలపై పడేయక నీడనే  చకా చకా చేరనా ఆపనా గుండెలో చేర్చనా  దారం బదులు ప్రాయంతోనే కట్టేసిందే  గాయం లేక కోసేసిందే హాయిగా నవ్వేసిందే  నాలో నేను మౌనంగానే మాటాడేస్తే  మొత్తం తను వింటూ ఉందే తియ్యగా వేదిస్తుందే  ఎదనే తనతో ఎత్తుకెల్లిందే  చెయ్ చెయ్ చెయ్ చెలిమిని చెయ్ అంటూ  హృదయము పలికినదే  సై సై సరసకు సై అంటూ  పాదం కదిలినదే  చిరు చిరు చిరు చినుకై కురిశావే  మరుక్షణమున మరుగై పోయావే  చిరు చిరు చిరు చినుకై కురిశావే  మరుక్షణమున మరుగై పోయావే

Mandaara Poovalle Song Lyrics in Telugu – Aawara (2010)

'Mandaara Poovalle' song from Aawara (2010) movie. Music composed by Yuvan Shankar Raja and sung by Benny Dayal.

SONG INFORMATION
Movie : Aawara (2010)
Music : Yuvan Shankar Raja
Lyricist : Bhuvana Chandra
Singers : Benny Dayal
చిత్రం: ఆవారా (2010) సంగీతం: యువన్ శంకర్ రాజా సాహిత్యం: భువనచంద్ర గానం: బెన్నీ దయాల్ పచ్చని మందార పువ్వల్లె వచ్చిందిరా వెన్నెల్లో మల్లెల్లె సంతోషమిచ్చిందిరా నా గుండెల్లో వీచే సుమ గంధాల గాలి తన కళ్ళల్లో పేర్చే పసి పరువాల డోలి యదలో ఎంతున్నా ఒక మాటే రాదే నా కళ్ళల్లోన అరె కలలే రావే పచ్చని మందార పువ్వల్లె వచ్చిందిరా వెన్నెల్లో మల్లెల్లె సంతోషమిచ్చిందిరా మదిలో మౌనం రగిలే వేళ కొంచెం మోహం దాహం చుట్టివేసెనే తొలిచూపే విరి తూర్పై యద తలుపుని మెరుపల్లె తట్టివేసెనే అద్దాన్ని సరిచేసి మనసంతా కళ్ళల్లో పొదిగానే పొదిగానే పిల్లా నే నీ ముద్దు మురిపాల వలపుల్లో తడిసానే తడిసానే పురి విప్పే మేఘాన్నై ఒడిలో తారగ నిను తలిచా వేసవిలో వెల్లువనై బుగ్గలు తాకి యద మరిచా పచ్చని మందార పువ్వల్లె వచ్చిందిరా వెన్నెల్లో మల్లెల్లె సంతోషమిచ్చిందిరా అలలాగా కుదిపేసే తన పేరుని వింటే పరిమళమే కలలోనే కనిపించే తన నగవులు కంటే పరవశమే ఏనాటి ఊసుల్నో ఏనాటి బాసల్నో వింటున్నా వింటున్నా ఆగంటు నిలదీసే రహదారి దీపాన్నై నిలుచున్నా వెలిగున్నా మది తొలిచే పాటలకి అర్ధాలే నీవని మురిసితినే ఒక నదిలా నీవొస్తే బాగా దూరం తరిగెనులే నా గుండెల్లో వీచే సుమ గంధాల గాలి తన కళ్ళల్లో పేర్చే పసి పరువాల డోలి యదలో ఎంతున్నా ఒక మాటే రాదే నా కళ్ళల్లోన అరె కలలే రావే పచ్చని మందార పువ్వల్లె వచ్చిందిరా వెన్నెల్లో మల్లెల్లె సంతోషమిచ్చిందిరా

Arere Vaanaa Song Lyrics in Telugu – Aawara (2010)

'Arere Vaanaa' song from Aawara (2010) movie. Music composed by Yuvan Shankar Raja and sung by Rahul Nambiar, Saindhavi.

SONG INFORMATION
Movie : Aawara (2010)
Music : Yuvan Shankar Raja
Lyricist : Vennelakanti
Singers : Rahul Nambiar, Saindhavi
చిత్రం: ఆవారా (2010) సంగీతం: యువన్ శంకర్ రాజా సాహిత్యం: వెన్నలకంటి గానం: రాహుల్ నంబియర్, సైందవి అరెరె వాన జడి వాన  అందాల నవ్వులే పూల వాన  అరెరె వాన జడి వాన  అందాల నవ్వులే పూల వాన  మళ్ళీ మళ్ళీ వానోస్తే మనసు గొడుగు చెలి పడితే  గారం పెరిగింది దూరం తరిగింది  ఏమైంది ఏమైంది ఏదేదో జరిగింది  నెమలి కన్ను లాగ చెలి నాట్యమాడుతుంటే  ఎదే పాలపుంతై నా మనసునాడమంది  ఏమైంది ఏమైంది ఏదేదో జరిగింది  అరెరె వాన జడి వాన  అందాల నవ్వులే పూల వాన  చరణం: 1  ఆటా పాటా ఓ పాడని పాట  వానే పాడింది అరుదైన పాట  నిన్ను నన్ను కలిపిన ఈ వానకొక సలాం కొట్టు  నేను తప్పిపోయాను నీలోన వెతికి పెట్టు  మంత్రంలాగ ఉంది ఇది తంత్రం లాగ ఉంది  చిత్రంగానే మదిలో ఒక యుద్దం జరుగుతుంది  దేవత ఏది నా దేవత ఏది  తను సంతోషంగా ఆడుతూ ఉంది  చరణం: 2  నిన్ను మించి వేరెవరూ లేరే  నన్ను మించి నీకెవరూ లేరే  చిన్న చిన్న కళ్ళు రెండు దేవుడు నాకు ఇచ్చాడంట  కళ్ళు రెండు మూసుకున్నా నీవున్నదే మాయమట  మల్లెపూల పొద్దు నాకు ఇచ్చి పోవే ముద్దు  ముద్దు చాటు సద్దు చెరిపేయమంది హద్దు  పులకించింది ఎద పులకించింది  చెలి అందాలనే చిలికించింది  అరెరె వాన జడి వాన  అందాల నవ్వులే అగ్గి వాన  అరెరె వాన జడి వాన  అందాల నవ్వులే అగ్గి వాన  మళ్ళీ మళ్ళీ వానోస్తే పగటి వేళ మెరుపొస్తే  నింగే వంగింది భూమే పొంగింది  నా శ్వాస తగిలాక వణుకు వేడి సోకింది  గొడుగు పట్టీ ఎవరూ ఈ వాననాపవద్దు  అడ్డమొచ్చి ఎవరూ నా మనసునాపవద్దు  ఆడాలి ఆడాలి వానతో ఆడాలి

Chuttesai Chuttesai Song Lyrics in Telugu – Aawara (2010)

'Chuttesai Chuttesai' song from Aawara (2010) movie. Music composed by Yuvan Shankar Raja and sung by Karthik, Sunitha Sarathy.

SONG INFORMATION
Movie : Aawara (2010)
Music : Yuvan Shankar Raja
Lyricist : Bhuvana Chandra
Singers : Karthik, Sunitha Sarathy
చిత్రం: ఆవారా (2010) సంగీతం: యువన్ శంకర్ రాజా సాహిత్యం: భువనచంద్ర గానం: సునితా సారధి, కార్తిక్ పల్లవి:  చుట్టేసేయ్ చుట్టేసేయ్ భూమి  గాలిపటమల్లె మారెమల్లె స్వామి  చుట్టేసేయ్ చుట్టేసేయ్ భూమి  గాలిపటమల్లె మారెమల్లె స్వామి  రా రా రా రాధే రాధే రాధే అలకల రాధే  పాటల్ని పాడి పాడి పాడి పిలిచిన రాధే  ఎదలోన వింత మోహం మనసున ఏదో మాయ దాహం  తెలిసేనా ఎందుకాత్రం హృదయములోన పూల నాట్యం  చుట్టేసేయ్ చుట్టేసేయ్ భూమి  గాలిపటమల్లె మారెమల్లె స్వామి  చరణం: 1  చనువు చనువుగా మాటలాడితే మెరుపులే నువ్వు విసిరినా  రాణివంటూ నీ చెంత చేరితే దొంగలా ఎటు దాగినా  అందం చందం ఉన్న పసిడి మొలకవే  బ్రహ్మకైనా నిన్ను పొగడతరమటే  ముద్దు ముద్దు నడుమే అది తట్టి తట్టి వలలో పడితినే  చుట్టేసేయ్ చుట్టేసేయ్ భూమి  గాలిపటమల్లె మారెమల్లె స్వామి  చుట్టేసేయ్ చుట్టేసేయ్ భూమి  గాలిపటమల్లె మారెమల్లె స్వామి  చరణం: 2  హృదయం మంచులా కరిగిపోయెనే ప్రేయసి నా ప్రేయసి  ఒక్క నిమిషము నిన్ను విడవనే తామసి నా తామసి  ఇది వయసుకి వసంత కాలమా  వలపుల తడి తరిగి పోదామా  ఇప్పటి ఒక క్షణపు అనుబంధ గంధం హృదయం మరుచునా..హే  చుట్టేసేయ్ చుట్టేసేయ్ భూమి  గాలిపటమల్లె మారెమల్లె స్వామి  చుట్టేసేయ్ చుట్టేసేయ్ భూమి  గాలిపటమల్లె మారెమల్లె స్వామి  రా రా రా రాధే రాధే రాధే అలకల రాధే  పాటల్ని పాడి పాడి పాడి పిలిచిన రాధే  నీ అందం నన్ను కుదిపి చిట్టి చిట్టి కలల పానుపు వేసె  నీ గొలుసై పొంగిపోవా నక్షత్రాలే వచ్చి వాలిపోవా

Nee Yadalo Naaku Song Lyrics in Telugu – Aawara (2010)

'Nee Yadalo Naaku' song from Aawara (2010) movie. Music composed by Yuvan Shankar Raja and sung by Yuvan Shankar Raja, Tanvi Shah (Humming).

SONG INFORMATION
Movie : Aawara (2010)
Music : Yuvan Shankar Raja
Lyricist : Vennelakanti
Singers : Yuvan Shankar Raja, Tanvi Shah
చిత్రం: ఆవారా (2010) సంగీతం: యువన్ శంకర్ రాజా సాహిత్యం: వెన్నలకంటి గానం: యువన్ శంకర్ రాజా, Tanvi Shah (Humming) పల్లవి:  నీ ఎదలో నాకు చోటే వద్దు  నా ఎదలో చేటే కోరవద్దు  మన ఎదలో ప్రేమను మాటే రద్దు  ఇవి పైపైన మాటలులే...హే  నీ నీడై నడిచే ఆశ లేదే  నీ తోడై వచ్చే ద్యాస లేదే  నీ తోటే ప్రేమ పోతేపోనీ  అని అబద్దాలు చెప్పలేనులే  నీ జతలోన నీ జతలోన  ఈ ఎండకాలం నాకు వానాకాలం  నీ కలలోన నీ కలలోన  మది అలలాగ చేరు ప్రేమ తీరం  నీ ఎదలో నాకు చోటే వద్దు  నా ఎదలో చేటే కోరవద్దు  మన ఎదలో ప్రేమను మాటే రద్దు  ఇవి పైపైన మాటలులే...హే  చరణం: 1  చిరుగాలి తరగంటి నీమాటకే ఎద పొంగేను ఒక వెల్లువై  చిగురాకు రాగాల నీ పాటకే తనువూగేను తొలిపల్లవై  ప్రేమ పుట్టాక నాకళ్ళలో దొంగచూపేదో పురివిప్పెనే  కొంచెం నటనున్నది కొంచెం నిజమున్నది  ఈ సయ్యాట బాగున్నది  నువ్వల వేస్తే నువ్వల వేస్తే  నా ఎద మారే నా కథ మారే  అరె ఇది ఏదో ఒక కొత్త దాహం  అది పెరుగుతుంటే వీచే చెలి స్నేహం  చరణం: 2  ఒకసారి మౌనంగా నను చూడవే ఈ నిమిషమే యుగమౌనులే  నీ కళ్ళలో నన్ను బందించవే ఆ చెర నాకు సుఖమౌనులే  నిన్ను చూసేటి నా చూపులో కరిగే ఎన్నెన్ని మునిమాపులో  పసిపాపై ఇలా నా కనుపాపలే  నీ జాడల్లో దోగాడెనే  తొలి సందెలలో తొలి సందెలలో  ఎరుపే కాదా నీకు సింధూరం  మలి సందెలలో మలి సందెలలో  నీ పాపిటిలో ఎర్రమందారం  నీ ఎదలో నాకు చోటే వద్దు  నా ఎదలో చేటే కోరవద్దు  మన ఎదలో ప్రేమను మాటే రద్దు  ఇవి పైపైన మాటలులే...హే  నీ నీడై నడిచే ఆశ లేదే  నీ తోడై వచ్చే ద్యాస లేదే  నీ తోటే ప్రేమ పోతేపోనీ  అని అబద్దాలు చెప్పలేనులే 

Yedho Song Lyrics in Telugu – Aawara (2010)

'Yedho' song from Aawara (2010) movie. Music composed by Yuvan Shankar Raja and sung by S. P. Charan.

SONG INFORMATION
Movie : Aawara (2010)
Music : Yuvan Shankar Raja
Lyricist : Rakendu Mouli
Singers : S. P. Charan
చిత్రం: ఆవారా (2010) సంగీతం: యువన్ శంకర్ రాజా సాహిత్యం: రాకేందు మౌళి గానం: ఎస్. పి. చరణ్ ఏదో అలజడి నను పిలిచే.. కళ్లే దాటి కలలే నడిచే.. చుట్టూ అంతా నాటకమైతే.. నటన రాక నే వెళ్ళిపోతే.. కాలం కదిలి నన్నే వదిలి నీతో సాగి పోయనా… పోదే పొడిచి నింగే విడిచి వెన్నెల వెళ్ళిపోవునా… పిల్ల నీ తలపులతో.. ఎదకి ప్రాణం పోసానే.. నీకే దూరం అవుతున్నా… ఎదని వదిలి వెళుతున్నా… నన్నే నువ్వుగా మార్చా నేనిక ఏమి కాక మిగిలానిల ఎటూ వెళ్ళక ఏమి తోచక ఉన్న వేచి నువ్వు లేక ఎల నీ రాక జీవితంలో నా పగలు రేయిని మరిపించిందిలే నువ్వు వెంట లేకపోతే నా చావుకు బతుకుకు తేడా లేదులే మంటే రేపు తడి జ్వాలముఖి కన్నీల్లారవే ఓ చెలియా నువ్వే జ్ఞాపకం అయ్యావు ఈ క్షణం అంతేనా ఓ… పిల్ల నీ తలపులతో.. ఎదకి ప్రాణం పోసానే.. నీకే దూరం అవుతున్నా… ఎదని వదిలి వెళుతున్నా… ఏదో అలజడి నను పిలిచే కళ్లే దాటి కలలే నడిచే చుట్టూ అంతా నాటకమైతే నటన రాక నే వెళ్ళిపోతే కాలం కదిలి నన్నే వదిలి నీతో సాగి పోయనా… పోదే పొడిచి నింగే విడిచి వెన్నెల వెళ్ళిపోవునా… పిల్ల నీ తలపులతో.. ఎదకి ప్రాణం పోసానే.. నీకే దూరం అవుతున్నా… ఎదని వదిలి వెళుతున్నా… ఓఓ.. ఓఓఓ… ఓఓ.. ఓఓఓ…

Palli Balakrishna Saturday, August 19, 2017

Most Recent

Default