Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Aakali Rajyam (1981)



చిత్రం: ఆకలిరాజ్యం (1981)
సంగీతం: యమ్.యస్. విశ్వనాథన్
సాహిత్యం: శ్రీ శ్రీ
గానం: యస్.పి.బాలు
నటీనటులు: కమల్ హాసన్, శ్రీదేవి కపూర్
దర్శకత్వం: కె.బాలచందర్
నిర్మాత: ఆర్. వెంకట్రామన్
విడుదల తేది: 1981

ఓ మహాత్మా ఓ మహర్షీ
ఏది చీకటి ఏది వెలుతురు
ఏది జీవితమేది మ్రుత్యువు
ఏది పుణ్యం ఏది పాపం
ఏది నరకం ఏది నాకం
ఏది సత్యం ఏదసత్యం
ఏదనిత్యం ఏది నిత్యం
ఏది ఏకం ఏదనేకం
ఏది కారణమేది కార్యం
ఓ మహాత్మా ఓ మహర్షి

ఏది తెలుపు ఏది నలుపు
ఏది గానం ఏది మౌనం
ఏది నాది ఏది నీది
ఏది నీతి ఏది నేతి
నిన్న స్వప్నం నేటి సత్యం
నేటి ఖేదం రేపు రాగం
ఒకే కాంతి ఒకే శాంతి
ఓ మహర్షీ ఓ మహాత్మ



********   *********   ********


చిత్రం: ఆకలిరాజ్యం (1981)
సంగీతం: యమ్.యస్. విశ్వనాథన్
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ
గానం: పి.సుశీల

గుస్స రంగయ్య కొంచం తగ్గయ్య
కోపం మనిషికి ఎగ్గయ్య
గుస్స రంగయ్య కొంచం తగ్గయ్య
కోపం మనిషికి ఎగ్గయ్య

ఈ లోకం మారేది కాదు
ఈ శోకాలు తీరేవి కావు
ఈ లోకం మారేది కాదు
ఈ శోకాలు తీరేవి కావు
దోర పాకాన ఉన్నాను నేను
కొత్త లోకాన్ని నాలోన చూడు

గుస్స రంగయ్య కొంచం తగ్గయ్య
కోపం మనిషికి ఎగ్గయ్య

దేశాన్ని దోచేటి ఆసాములున్నారూ
దేవున్ని దిగమింగు పూజారులున్నారూ
ప్రాణాలతొ ఆడు వ్యాపారులున్నారూ
మనిషికి మంచికి సమాధి కట్టారు
మహాత్ములెందరు సహాయ పడిన మంచి జరగలేదు
మహాత్ములెందరు సహాయ పడిన మంచి జరగలేదు
జాతి వైద్యులె కోత కోసిన నీతి బ్రతకలేదు
భోగాలు వెతుకాడు వయసు
అనురాగాల జతి పాడు మనసు
నీ దాహానికనువైన సొగసు
నీ సొంతాన్ని చేస్తుంది పడుచు

గుస్స రంగయ్య కొంచం తగ్గయ్య
కోపం మనిషికి ఎగ్గయ్య

కాటుకెట్టిన కళ్ళలొ కైపులున్నవీ
మల్లెలెట్టిన కురులలొ మాపులున్నవీ
వన్నె తేరిన కన్నెలొ చిన్నెలున్నవీ
అన్ని నీవె అనుటకు ఋజువులున్నవి
చక్కని చుక్క సరసనుండగ పక్క చూపులేలా
చక్కని చుక్క సరసనుండగ పక్క చూపులేలా
బాగుపడని ఈ లోకం కోసం బాధపడేదేలా
మోహాన్ని రేపింది రేయి
మన స్నేహంలొ ఉందోయి హాయి
ఈ అందానికందివ్వు చేయి
ఆనందాల బంధాలు వేయి

గుస్స రంగయ్య కొంచం తగ్గయ్య
కోపం మనిషికి ఎగ్గయ్య


********   *********   ********


చిత్రం: ఆకలిరాజ్యం (1981)
సంగీతం: యమ్.యస్. విశ్వనాథన్
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ
గానం: యస్.పి.బాలు, యస్. జానకి

తన్న తన్న నన తన్న తన్న నన
తన్నన్ననన్నన తాన తాన తన్నానా
ఓహొ
కన్నె పిల్లవని కన్నుళ్ళున్నవని
ఎన్నెన్ని వగలు పోతున్నావె చిన్నారి

లల్ల లల్ల లల్ల లల్ల లల్ల లల్ల
లల్లల లల్లల లాల లాల లాలాల
చిన్న నవ్వు నవ్వి వన్నెలన్ని రువ్వి
ఎన్నెన్ని కలలు రప్పించావె పొన్నారి

కన్నె పిల్లవని కన్నుళ్ళున్నవని
ఎన్నెన్ని వగలు పోతున్నావె చిన్నారి
చిన్న నవ్వు నవ్వి వన్నెలన్ని రువ్వి
ఎన్నెన్ని కలలు రప్పించావె పొన్నారి

ఏమంటావ్


సంగీతం
న నా నా
ఊ నువ్వైతే
రి స రి
సాహిత్యం
ఊహుహూ
నేనౌతా
సంగీతం నువ్వైతే సాహిత్యం నేనౌతా

కన్నె పిల్లవని కన్నుళ్ళున్నవని
ఎన్నెన్ని వగలు పోతున్నావె చిన్నారి

చిన్న నవ్వు నవ్వి వన్నెలన్ని రువ్వి
ఎన్నెన్ని కలలు రప్పించావె పొన్నారి
హ హా

న న న నా న
సే ఇట్ వన్స్ ఎగేన్
న న న నా న
ఊ ఉ స్వరము నీవై
తరనన తరరనాన
స్వరమున పదము నేనై
ఓకె
తానె తానె తాన
ఓహో అలాగ గానం గీతం కాగ
తరన తాన
కవిని నేనై
తాన ననన తానా
నాలొ కవిత నీవై
నాన నానన ల ల ల తననా తారన
బ్యుటిఫుల్
కావ్యమైనదీ తలపో పలుకో మనసో

కన్నె పిల్లవని కన్నుళ్ళున్నవని
ఎన్నెన్ని వగలు పోతున్నావె చిన్నారి
చిన్న నవ్వు నవ్వి వన్నెలన్ని రువ్వి
ఎన్నెన్ని కలలు రప్పించావె పొన్నారి
సంగీతం ఆహాహా
నువ్వైతే ఆహాహా
సాహిత్యం ఆహాహా
నేనౌతా ఆహాహా

ఇప్పుడు చూద్దాం

తనన తనన తన్న
ఊహూ తనన తనన అన్న
తాన తన్న తానం తరనా తన
తాన అన్న తాళం ఒకటే కదా
తనననాన తాననాన తాన
ఆహ అయ్య బాబోయ్
తనననాన తాననాన తాన
ఉ పదము చేర్చి పాట కూర్చలేద
సభాష్
దనిని దసస అన్న నీద అన్న స్వరమె రాగం కదా
నీవు నేనని అన్నా మనమే కాదా
నీవు నేనని అన్నా మనమే కాదా

కన్నె పిల్లవని కన్నుళ్ళున్నవని
కవిత చెప్పి మెప్పించావె గడసరి
చిన్న నవ్వు నవ్వి నిన్ను దువ్వి దువ్వి
కలిసి నేను మెప్పించేది ఎపుడని

కన్నె పిల్లవని కన్నుళ్ళున్నవని
కవిత చెప్పి మెప్పించావె గడసరి
చిన్న నవ్వు నవ్వి నిన్ను దువ్వి దువ్వి
కలిసి నేను మెప్పించేది ఎపుడని

అహాహా లాలలా
ఊహూహూ ఆహాహా
ల ల లా ల ల లా
ల ల లా ల ల లా


********   *********   ********


చిత్రం: ఆకలిరాజ్యం (1981)
సంగీతం: యమ్.యస్. విశ్వనాథన్
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ
గానం: యస్. జానకి

తు హై రాజా మై హు రాణీ
ఫిర్ భి నహి హై బాత్ పురాని
తు హై రాజా మై హు రాణీ
ఫిర్ భి నహి హై బాత్ పురాని
దోనోంకి ఎక్ దిల్ కి జబాని
షురు హుయి హై నయి కహాని
దోనోంకి ఎక్ దిల్ కి జబాని
షురు హుయి హై నయి కహాని

తు హై రాజా మై హు రాణీ
ఫిర్ భి నహి హై బాత్ పురాని

ప్యార్ మె మగన్ ఝీల్ హై గగన్
నాం హై లగన్ సాథ్ హై పవన్
హం సె దూర్ హై జిందగి కె ఘం
క్యు కహి రుకె ప్యార్ కే కదం
తారోన్సె ములాకాత్ కరె
ఉజియారోన్సె బాత్ కరె
చాంద్ సె జాకర్ సైర్ కరె
దునియా వాలో సె న డరె
దునియా వాలో సె న డరె

తు హై రాజా మై హు రాణీ
ఫిర్ భి నహి హై బాత్ పురాని

ధడ్కనోంకి ధున్ సున్ మేరే సనం
జాన్ హై తేరి జాన్ కి కసం
మై తేరి జుబాన్ తు జవా కలం
షాయరి కొ ది హం నయా జనం
హం సె నయె గుల్ కయి ఖిలె
దర్పన్ అప్ని జమీన్ పె ఖులె
జనం జనం మె సాత్ చలె
జల్నె వాలె ఔర్ జలె
జల్నె వాలె ఔర్ జలె

తు హై రాజా మై హు రాణీ
ఫిర్ భి నహి హై బాత్ పురాని
దోనోంకి ఎక్ దిల్ కి జబాని
షురు హుయి హై నయి కహాని
తు హై రాజా మై హు రాణీ
ఫిర్ భి నహి హై బాత్ పురాని

అందం చందం అనురాగం
ఈ ఆనందం దివ్య భోగం
ఇక మనదేలె నవ యోగం
అంతులేని ప్రేమ యాగం
అందం చందం అనురాగం


********   *********   ********


చిత్రం: ఆకలిరాజ్యం (1981)
సంగీతం: యమ్.యస్. విశ్వనాథన్
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ
గానం: యస్. పి. బాలు

హె హె హె హె హె హె హే హేహె
రు రు రు రు రూ రు రూ రూరు
సాపాటు ఎటూ లేదు పాటైన పాడు బ్రదర్
సాపాటు ఎటూ లేదు పాటైన పాడు బ్రదర్
రాజధాని నగరంలొ వీధి వీధి నీది నాదె బ్రదర్
స్వతంత్ర దేశంలొ చావు కూడ పెళ్ళిలాంటిదె బ్రదర్

సాపాటు ఎటూ లేదు పాటైన పాడు బ్రదర్
రాజధాని నగరంలొ వీధి వీధి నీది నాదె బ్రదర్
స్వతంత్ర దేశంలొ చావు కూడ పెళ్ళిలాంటిదె బ్రదర్

మన తల్లి అన్నపూర్ణ మన అన్న దాన కర్ణ
మన భూమి వేద భూమిరా తమ్ముడూ
మన కీర్తి మంచు కొండరా
మన తల్లి అన్నపూర్ణ మన అన్న దాన కర్ణ
మన భూమి వేద భూమిరా తమ్ముడూ
మన కీర్తి మంచు కొండరా
డిగ్రీలు తెచ్చుకుని చిప్ప చేత పుచ్చుకుని
డిల్లీకి చేరినాము దేహి దేహి అంటున్నాము
దేశాన్ని పాలించె భావి పౌరులం బ్రదర్

సాపాటు ఎటూ లేదు పాటైన పాడు బ్రదర్
రాజధాని నగరంలొ వీధి వీధి నీది నాదె బ్రదర్
స్వతంత్ర దేశంలొ చావు కూడ పెళ్ళిలాంటిదె బ్రదర్

బంగారు పంట మనది మిన్నేరు గంగ మనది
ఎలుగెత్తి చాటుదామురా ఇంట్లో ఈగల్ని తోలుదామురా
ఈ పుణ్యభూమిలొ పుట్టడం మన తప్ప
ఈ పుణ్యభూమిలొ పుట్టడం మన తప్ప
ఆవేశం ఆపుకోని అమ్మా నాన్నదే తప్పా
ఆవేశం ఆపుకోని అమ్మా నాన్నదే తప్పా
గంగలొ మునకేసి కాషాయం కట్టెయ్ బ్రదర్

సాపాటు ఎటూ లేదు పాటైన పాడు బ్రదర్
రాజధాని నగరంలొ వీధి వీధి నీది నాదె బ్రదర్
స్వతంత్ర దేశంలొ చావు కూడ పెళ్ళిలాంటిదె బ్రదర్

సంతాన మూలికలం సంసార బానిసలం
సంతాన లక్ష్మి మనదిరా తమ్ముడూ సంపాదనొకటి బరువురా
చదవెయ్య సీటు లేదు చదివొస్తె పనీ లేదు
అన్నమో రామచంద్ర అంటె పెట్టె దిక్కేలేదు
దేవుడిదె భారమని పెంపు చేయర బ్రదర్

సాపాటు ఎటూ లేదు పాటైన పాడు బ్రదర్
రాజధాని నగరంలొ వీధి వీధి నీది నాదె బ్రదర్
స్వతంత్ర దేశంలొ చావు కూడ పెళ్ళిలాంటిదె బ్రదర్

Most Recent

Default