-->
Home Movie Songs Latest Updated Movies Devotional Songs Non-Movie Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box



చిత్రం: మన్మధ బాణం (2010)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: కమల్ హాసన్, ప్రియా హమేష్
నటీనటులు: కమల్ హాసన్, త్రిషా కృష్ణన్, ఆర్. మాధవన్
దర్శకత్వం: కె.యస్.రవికుమార్
నిర్మాత: ఉదయనిధి స్టాలిన్
విడుదల తేది: 23.12.2010

పల్లవి :
నీలాకాశం... నీ నాకోసం...
జోలలే పాడగా వేడుకే వేడుక
అందమే విల్లుగా బాణమే వేయగా
ప్రేమనే మాయగా తేలెనే ఊహలు
ఇక నువ్వంటు నేనంటు
గిరిగీతలే లేవులే
నీలాకాశం... నీ నాకోసం...

చరణం: 1
నీలోనే నా ఊపిరి నేనంటూ లేనే మరి
నీ పేరు నా పేరునే జోడిస్తే ప్రేమే అది
తీసే శ్వాసే ప్రేమించడం
నీ కోసమే నే జీవించడం
నీది నాది జన్మ బంధం
గుండె గుండె మార్చుకున్నాం
కోరేందుకే మాట మిగిలిందిక
నీ తోడు దొరికిందిగా...
నీలాకాశం... నీ నాకోసం
శ్రీరస్తు శుభమస్తు చిరశాంతి సుఖమస్తు
అందాల బంధానికి

చరణం: 2
ఆరారు కాలాలకు
ఆనందం నీ స్నేహ మే
మండేటి గాయాలను
మాన్పించే మంత్రం నువ్వే
స్వర్గం అంటే ఏవిఁటంటే
నీవున్న చోటే అంటా చెలీ
నిత్యం నన్ను వెన్ను తట్టి
నడిపించు మార్గము నువ్వే మరి
చిరుగాలి పొర కూడా చొరలేదులే
నిను నన్ను విడదీయగా
నీలాకాశం... నీ నాకోసం...

Most Recent

Default