చిత్రం: యుగంధర్ (1979)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ
గానం: యస్.పి.బాలు, జానకి
నటీనటులు: యన్.టి.రామారావు, జయసుధ
దర్శకత్వం: కె. యస్.ఆర్.దాస్
నిర్మాత: పి.విద్యాసాగర్
విడుదల తేది: 30.11.1979
పల్లవి:
దాదాదాదా..ఆ..ఆ..ఆ..ఆ..ఆ
దాస్తే దాగే దా...ఆ..ఆ..నీపై నాకున్న మోహం..
నాలో రేపింది తాపం..పాపం..నీదా..నాదా..ఆ..ఆ..ఆ
దాదాదాదా..ఆ..ఆ..ఆ..ఆ..ఆ
దాస్తే దాగే దా...
చరణం: 1
ఉరితాడంటి బిగికౌగిలిలో.. ఉక్కిరిబిక్కిరీ ఈ..ఈ చేసేస్తా
మిన్నాగునురా విషకన్యనురా.. సొగసులతోనే కాటేస్తా..ఆ..ఆ
ఇది నీ అంతం.. మరి నా వంతో..
ఏదో ఒకటి.. ఇక తేలాలీ..
దాదాదాదా..ఆ..ఆ..ఆ..ఆ..ఆ
దాస్తే దాగే దా...ఆ..ఆ..
చరణం: 2
పుట్టాము గనక..తప్పదు చావక..
ముందూ..వెనకా..ఆ తేడాగా...ఆ
ఏ..తాడయినా మూడే ముళ్ళూ..సంబరమంతా.. మూణ్ణాళ్ళూ..
కథ జరగాలీ...తుది తేలాలి
నీకూ..నాకూ..ముడివేయాలీ....
దాదాదాదా..ఆ..ఆ..ఆ..ఆ..ఆ
దాస్తే దాగే దా...ఆ..ఆ..నీపై నాకున్న మోహం..
నాలో రేపింది తాపం..పాపం..నీదా..నాదా..ఆ..ఆ..ఆ