Home Movie Songs Latest Updated Movies Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box



చిత్రం: మోసగాడు (1980)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: వేటూరి (All Songs)
గానం: యస్.పి.బాలు, పి.సుశీల
నటీనటులు: చిరంజీవి, శోభన్ బాబు, శ్రీదేవి
దర్శకత్వం: కె. రాఘవేంద్రరావు
నిర్మాత: క్రాంతికుమార్
విడుదల తేది: 22.05.1980

ఆకుంది ఒక చోట పోకుంది ఒక చోట
సున్నమేసి చూడమంట అది సుబ్బరంగ పండునంట
ఆకుంది ఒక చోట పోకుంది ఒక చోట
సున్నమేసి చూడమంట అది సుబ్బరంగ పండునంట
ఎర్రంగ కుర్రదాని నోరు పండితే...
ఎర్ర ఎర్రాని మొగుడు నీకు వస్తడంట
నేనమ్మో ఆడు నేనమ్మో

ఆకుంది ఒక చోట - పోకుంది ఒక చోట

చూపుల్లో  చాపుంది కూరొండుకో
చంపల్లో చామంతి పువ్వు పట్టుకో
జింకళ్ళే గంతేసే నడుముందిరో...
ఆ జింకళ్ళే గంతేసే నడుముందిరో
వలవేసుకో దాన్ని వాటేసుకో
ఏమైన చేసేసుకో
ఏడబట్టినా నీలో ఎన్నెలుండగా
చికటింటిలో నిన్ను చిదపకుంటనా
చిట్టివలస చిన్నదాన
బుల్లి సరసమాడిపోన
చిట్టివలస చిన్నదాన
బుల్లి సరసమాడిపోన

ఆకుంది ఒక చోట పోకుంది ఒక చోట
ఆకుంది ఒక చోట పోకుంది ఒక చోట

అందాల విందువుంది అందిపుచ్చుకో
అందిట్లో తోపువుంటె మళ్ళి వచ్చిపో
అందాల విందువుంది అందిపుచ్చుకో
అందిట్లో తోపువుంటె మళ్ళి వచ్చిపో
జాబిల్లి నన్నుగిల్లి చంపుతుందిరో
గురిచూసుకో అది చేసుకో
ఏమైన చేసేసుకో...
ఏడ తాకినా నీలో తళుకు లుండగా
తళుకు చాటున కుళుకు చూడకుంటన

చిట్టివలస చిన్నదాన
బుల్లి సరసమాడిపోన
చిట్టివలస చిన్నదాన
బుల్లి సరసమాడిపోన

ఆకుంది ఒక చోట పోకుంది ఒక చోట
ఆకుంది ఒక చోట పోకుంది ఒక చోట
సున్నమేసి చూడమంట అది సుబ్బరంగ పండునంట
ఎర్రంగ కుర్రదాని నోరు పండితే...
ఎర్ర ఎర్రాని మొగుడు నాకొస్తడంట
నేనమ్మో ఆడు నేనమ్మో





Most Recent

Default