-->
Home Movie Songs Latest Updated Movies Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Results for "A. Karunakaran"
Tholi Prema (1998) Telugu Songs Lyrics Album Cover

Tholi Prema (1998) Telugu Songs Lyrics

MOVIE DETAILS
Movie : Tholi Prema (1998)
Music : Deva
Director : A. Karunakaran
Producer : G. V. G. Raju
Actors : Pawan Kalyan
Actresses : Keerthi Reddy
Release Date : 24 July 1998

Ee Manase Se Se Song Lyrics in Telugu – Tholi Prema (1998)

'Ee Manase Se Se' song from Tholi Prema (1998) movie is composed by Deva and sung by S. P. Balasubrahmanyam.

SONG INFORMATION
Movie : Tholi Prema (1998)
Music : Deva
చిత్రం: తొలిప్రేమ (1998) సంగీతం: దేవా సాహిత్యం: సిరివెన్నెల గానం: ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం అలబలబ అలబలబ ఎహె పా... మపపని మపగా... మనిరిసగమపా... మపపని మపగా... అలబలబ అలబలబ ఎహె అలబలబ అలబలబ ఎహె అలబలబ అలబలబ ఎహె అలబలబ అలబలబ ఎహె అలబలబ ఆయియాయ ఎహె అలబలబ ఆయియాయ ఎహె అలబలబ ఆయియాయ ఎహె అలబలబ అలబలబ ఈ మనసే సెయ్ సెయ్ సెయ్ సెయ్ నా మనసే సెయ్ సెయ్ సెయ్ సెయ్ పరుగెడుతోంది నీకేసి, వినమంటొందీ తన ఊసే అలలెగసే కలవరమాయె తనలో నిను చూసే ఈ మనసే సెయ్ సెయ్ సెయ్ సెయ్ నా మనసే సెయ్ సెయ్ సెయ్ సెయ్ హాలబ హాలబ అలబా అలబా అలబా అలబా అలబా అలబా అలబా అలబా ఎన్నో కలలను చూసి కన్నే కునుకొదిలేసే నువ్వే నను వెతికే ఆ తొలి వెలుగని తెలిసే ఎన్నో కలలను చూసి కన్నే కునుకొదిలేసే నువ్వే నను వెతికే ఆ తొలి వెలుగని తెలిసే కోరుకున్న తీరాన్నే తాను చేరినా తీరిపోని ఆరాటంతొ కలవరించెనా వెనకనె తిరుగుతూ చెలిజత విడువదు దొరికిన వరమది కుదురుగ ఉండదు ఏం చేస్తే బాగుంటుందో చెప్పని వింత నసే ఈ మనసే సెయ్ సెయ్ సెయ్ సెయ్ నా మనసే సెయ్ సెయ్ సెయ్ సెయ్ హాలబ హాలబ అలబా అలబా అలబా అలబా అలబా అలబా అలబా అలబా నీతో చెలిమిని చేసే నీలో చలువని చూసే ఐనా ఇంకా ఏదో అడిగే అత్యాశె నీతో చెలిమిని చేసే నీలో చలువని చూసే ఐనా ఇంకా ఏదో అడిగే అత్యాశె వెల్లువంటి నీ స్నేహం నన్ను అల్లినా వెన్నలంటి నీ నవ్వుల్లో చెమ్మగిల్లినా తహ తహ తరగదు అలజడి అణగదు తన సొద ఇది అని తలపులు తెలుపదు ఏమిస్తే శాంతిస్తుందో తెలుసా ఏం వరసే ఈ మనసే సెయ్ సెయ్ సెయ్ సెయ్ నా మనసే సెయ్ సెయ్ సెయ్ సెయ్ పరుగెడుతోంది నీకేసి, వినమంటొందీ తన ఊసే అలలెగసే కలవరమాయె తనలో నిను చూసే ఈ మనసే సెయ్ సెయ్ సెయ్ సెయ్ నా మనసే సెయ్ సెయ్ సెయ్ సెయ్

Yemaindo Yemo Ee Vela Song Lyrics in Telugu – Tholi Prema (1998)

'Yemaindo Yemo Ee Vela' song from Tholi Prema (1998) movie is composed by Deva and sung by S. P. Balasubrahmanyam.

SONG INFORMATION
Movie : Tholi Prema (1998)
Music : Deva
Lyricist : Bhuvanachandra
చిత్రం: తొలిప్రేమ (1998) సంగీతం: దేవా సాహిత్యం: భువనచంద్ర గానం: ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం ఏమయిందో ఏమో ఈ వేళ రేగింది గుండెలో కొత్త పిచ్చి ఎంత వింతో బాడి ఈ వేళ తూలింది గాలిలో రెక్కలొచ్చి న్యూటన్ థియరీ తల్లకిందులై తప్పుకున్నదా భూమికి ఆకర్షణ తారానగరి కళ్ళవిందులై చూపుతున్నదా ప్రేమకున్న ఆకర్షణ చరణం: 1 వెతకాలా వైకుంఠం కోసం అంతరిక్షం వెనకాలా హే ప్రియురాలే నీ సొంతం అయితే అంత కష్టం మనకేల ప్రతి కలని చిటికెలతో గెలిచే ప్రణయాన జత వలతో ఋతువులనే పట్టే సమయాన ముల్లోకాలు గుప్పిట్లోనే చిక్కవా ఒళ్లో తానే స్వర్గం వచ్చి దిగదా చరణం: 2 జనులారా ఒట్టేసి చెబుతా నమ్ముతారా నా మాట మనసారా ప్రేమించి చూస్తే అమృతం అందేనంట మిస్ లైలా మిస్సైలా స్మైలే విసిరిందా అది తగిలి కునుకొదిలి మనసే చెదిరిందా అదే కాదా లవ్‌లో లవ్లీ లీల అయ్యా నేనే ఇంకో మజునూలా ఏమయిందో ఏమో ఈ వేళ రేగింది గుండెలో కొత్త పిచ్చి ఎంత వింతో బాడి ఈ వేళ తూలింది గాలిలో రెక్కలొచ్చి న్యూటన్ థియరీ తల్లకిందులై తప్పుకున్నదా భూమికి ఆకర్షణ తారానగరి కళ్ళవిందులై చూపుతున్నదా ప్రేమకున్న ఆకర్షణ

Emi Sodhara Song Lyrics in Telugu – Tholi Prema (1998)

'Emi Sodhara' song from Tholi Prema (1998) movie is composed by Deva and sung by Krishna Raj.

SONG INFORMATION
Movie : Tholi Prema (1998)
Music : Deva
Singers : Krishna Raj
చిత్రం: తొలిప్రేమ (1998) సంగీతం: దేవా సాహిత్యం: సిరివెన్నెల గానం: కృష్ణరాజ్ ఏమి సోదరా మనసుకి ఏమయిందిరా ఒళ్ళు తోమలా పౌడర్ పుయ్యలా అరె ఇంతలోనే ఎంత డేంజరైపోయరా ఏమి సోదరా మనసుకి ఏమయిందిరా కళ్ళు తెరుచుకుంటే కలలాయె అవి మూసుకుంటే ఎద వినదాయె సరికొత్త ఊపు వచ్చి మనసు నిలవదాయే తారురోడ్డే స్టారు హోటలాయె మంచినీళ్ళే ఓల్డ్ మాంకు రమ్మాయే కారు హెడ్ లైట్సే కన్నె కొంటె చూపులాయే పువ్వే నవ్వై హొయలొలికించేస్తుంటే గుండే గువ్వై అరె దూసుకుపోతుంటే లైఫ్ అంతా కైపేలే సోదరా క్లాసు బుక్స్ యమ బోరాయె న్యూ తాట్సు డే అండ్ నైటు విడవాయే నిముషాలె యుగములై నిద్దర కరువాయే క్లోజు ఫ్రెండ్సు కనపడరాయె పేరెంట్సు మాట వినపడదాయె పచ్చనోట్లు కూడ పేపర్ బోట్సైపోయాయే ఏమవుతుందో కనుగొంటే ఒక వింత కాలం చాచే కౌగిట్లో గిలిగింత డూ యు నో వాట్ ఈజ్ దిస్ నేస్తమా ఏమి సోదరా మనసుకి ఏమయిందిరా ఒళ్ళు తోమలా పౌడరు పుయ్యలా అరె ఇంతలోనే ఎంత డేంజరైపోయరా

Gagananiki Udayam Song Lyrics in Telugu – Tholi Prema (1998)

'Gagananiki Udayam' song from Tholi Prema (1998) movie is composed by Deva and sung by S. P. Balasubrahmanyam.

SONG INFORMATION
Movie : Tholi Prema (1998)
Music : Deva
చిత్రం: తొలిప్రేమ (1998) సంగీతం: దేవా సాహిత్యం: సిరివెన్నెల గానం: ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం గగనానికి ఉదయం ఒకటే కెరటాలకి సంద్రం ఒకటే జగమంతట ప్రణయం ఒకటే ఒకటే ప్రణయానికి నిలయం మనమై యుగయుగముల పయనం మనమై ప్రతి జన్మలొ కలిశాం మనమె మనమే జన్మించలేదా నీవు నాకోసమే గుర్తించలేదా నన్ను నా ప్రాణమే ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ గగనానికి ఉదయం ఒకటే కెరటాలకి సంద్రం ఒకటే జగమంతట ప్రణయం ఒకటే ఒకటే చరణం: 1 నీ కన్నుల్లో కలను అడుగు ఇతడు ఎవరని నీ గుండెల్లో తిరిగే లయనే బదులు పలకని నిదురించు యవ్వనంలో పొద్దుపొడుపై కదిలించలేదా నేనే మేలుకొలుపై గతజన్మ జ్ఞాపకాన్నై నిన్ను పిలువా కలకాలం మంచు పొరలో ఉండగలనా గగనానికి ఉదయం ఒకటే కెరటాలకి సంద్రం ఒకటే జగమంతట ప్రణయం ఒకటే ఒకటే చరణం: 2 నా ఊహల్లో కదిలే కళలే ఎదుట పడినవి నా ఊపిరిలో ఎగసే సెగలే కుదుట పడినవి సమయాన్ని శాశ్వతంగా నిలిచిపోనీ మమతన్న అమృతంలో మునిగిపోనీ మనవైన ఈ క్షణాలే అక్షరాలై మృతి లేని ప్రేమకథగా మిగిలిపోని గగనానికి ఉదయం ఒకటే కెరటాలకి సంద్రం ఒకటే జగమంతట ప్రణయం ఒకటే ఒకటే ప్రణయానికి నిలయం మనమై యుగయుగముల పయనం మనమై ప్రతి జన్మలొ కలిశాం మనమె మనమే జన్మించలేదా నీవు నాకోసమే గుర్తించలేదా నన్ను నా ప్రాణమే ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ

Romance Rhythm Song Lyrics in Telugu – Tholi Prema (1998)

'Romance Rhythm' song from Tholi Prema (1998) movie is composed by Deva and sung by Suresh Peters and P. Unnikrishnan.

SONG INFORMATION
Movie : Tholi Prema (1998)
Music : Deva
Lyricist : Bhuvanachandra
చిత్రం: తొలిప్రేమ (1998) సంగీతం: దేవా సాహిత్యం: భువనచంద్ర గానం: సురేష్ పీటర్స్, ఉన్ని కృష్ణన్ రొమాన్స్ లో రిథమ్స్ కలగలిపిన లిటిల్ హార్ట్ తడాఖా తెలిసెను గనక ఓ ఓ ఆగదే పసి చిలక ఆశలు కాస్త ముదిరాక వలపు తగదనక ఈడుకు వేడి తగిలాక తప్పదిక చురక ఎ ప్లస్ బి ఏన్ ఈక్వేషన్ హే యు అండ్ మి కలిస్తే సెన్సేషన్ డైలీ క్లాసుల్నెగ్గొట్టి లేడీస్ బస్ స్టాండ్ లో వేచే క్రేజీ స్టూడెంట్స్ గుండె గుస గుసలే కన్నె కళ్ళల్లోకొచ్చి కొత్త కోర్కెల్ని రేపి కొంటె పాటలనెన్నో నేర్పించావ టీనేజి సొగసు లోని స్వీట్నెస్ తెలుసుకోని లైఫే పరమ వేస్ట్ కన్నా కాలేజ్ కాంపస్ లోనే లవ్ సీక్రెట్స్ తెలుసుకున్న వాడే గ్రేట్ లవర్ చిన్నా... రిగ రిగ రిగ రిగ రి రిగ రిగ రిగ రిగ రి రొమాన్స్ లో రిథమ్స్ కలగలిపిన లిటిల్ హార్ట్ తడాఖా తెలిసెను గనక ఓ ఓ ఆగదే పసి చిలక ప్రాణాల కన్న ప్రియురాలే మిన్న అనుకున్న ప్రియునిదే స్వర్గం ఓ తొలి చూపు తోనే మగవాని మనసు అలరించు లలనదే భాగ్యం లేటెస్ట్ లవ్ సూత్రం బట్టీ పట్టి కాంటీన్లో అడుగెట్టి చూపించు టాలెంట్ శక్తి డేరింగ్ గర్ల్స్ తో జట్టు కట్టి కుర్భాని కిస్ కొట్టి ఆడించే వెన్ను తట్టి రిగ రిగ రిగ రిగ రి స్టార్ట్ చేయి నువ్వు లవ్ స్టోరీ రొమాన్స్ లో రిథమ్స్ కలగలిపిన లిటిల్ హార్ట్ తడాఖా తెలిసెను గనక ఓ ఓ ఆగదే పసి చిలక హే ఆశలు కాస్త ముదిరాక వలపు తగదనక ఈడుకు వేడి తగిలాక తప్పదిక చురక ఎ ప్లస్ బి ఏన్ ఈక్వేషన్ హే యు అండ్ మి కలిస్తే సెన్సేషన్

Palli Balakrishna Monday, June 22, 2026

చిత్రం: తేజ్  I Love You (2018)
సంగీతం: గోపి సుందర్
సాహిత్యం: సాహితి
గానం: హరిచరన్, చిన్మయి
నటీనటులు: సాయిధరమ్ తేజ్, అనుపమ పరమేశ్వరన్
దర్శకత్వం: ఎ. కరుణాకరన్
నిర్మాత: కె.ఎస్. రామారావు
విడుదల తేది: 2018

అందమైన చందమామ నీవేనా
నిన్ను నేను అందుకుంది నిజమేనా
నువు తోడుంటే ఓ లాల
ఈ లైఫంతా ఉయ్యాల
హగ్ చేయవే ఓ పిల్లా
వైఫై లా నాన్నిల్లా

అందమైన చందమామ నీవేనా
నిన్ను నేను అందుకుంది నిజమేనా

పరుగిడు ఈ కాలాన
అడుగులు దరికాలేక
మనమెవరో ఏమో ఎందాక
పరవశమే ప్రతి రాక
చూపి ఓ శుభలేఖ
మన మధిలో ప్రేమే కలిగాక
మన ఇద్దరి పైనే విరిపూలు చెల్లింది పున్నాగా
నీ ముద్దులకోసం నే వేచి ఉన్నా

అందమైన చందమామ నీవేనా
నిన్ను నేను అందుకుంది నిజమేనా
నువు తోడుంటే ఓ లాల
ఈ లైఫంతా ఉయ్యాల
హగ్ చేయవే ఓ పిల్లా
వైఫై లా నాన్నిల్లా

ఓ అరవిరిసే జాజుల్లో కలగలిసే మోజుల్లో
అలలెగసే ఆసే ప్రేమంటా
మధి మురిసే వలపుల్లో మైమరచే మెరుపుల్లో
మెలితిరిగే వయసా రమ్మంటా
పడకింటి కొచ్చి నువ్వు పాల మురిపాలు కోరంగా
నడుమిచ్చు కుంటా వయ్యారిలాగ

అందమైన చందమామ నీవేనా
నిన్ను నేను అందుకుంది నిజమేనా
నువు తోడుంటే ఓ లాల
ఈ లైఫంతా ఉయ్యాల
హగ్ చేయవే ఓ పిల్లా
వైఫై లా నాన్నిల్లా

అందమైన చందమామ నీవేనా
నిన్ను నేను అందుకుంది నిజమేనా (2)

Palli Balakrishna Wednesday, July 11, 2018



చిత్రం: ఉల్లాసంగా ఉత్సాహంగా (2008)
సంగీతం: జి. వి. ప్రకాష్ కుమార్
నటీనటులు: యశో సాగర్, స్నేహ ఉల్లాల్
దర్శకత్వం: ఎ. కరుణాకర్
నిర్మాతలు: జి. యస్.రంగనాథ్, బి. పి.సోము
విడుదల తేది: 18.07.2008



Songs List:



ఉల్లాసంగా పాట సాహిత్యం

 
చిత్రం: ఉల్లాసంగా ఉత్సాహంగా (2008)
సంగీతం: జి. వి. ప్రకాష్ కుమార్
సాహిత్యం: అనంత్ శ్రీరామ్
గానం: క్రిష్ 

ఉల్లాసంగా 




దన్నాలే తల్లి పాట సాహిత్యం

 
చిత్రం: ఉల్లాసంగా ఉత్సాహంగా (2008)
సంగీతం: జి. వి. ప్రకాష్ కుమార్
సాహిత్యం: అనంత్ శ్రీరామ్
గానం: రాహుల్ నంబియార్ 

దన్నాలే తల్లి 



నా ప్రేమ పాట సాహిత్యం

 
చిత్రం: ఉల్లాసంగా ఉత్సాహంగా (2008)
సంగీతం: జి. వి. ప్రకాష్ కుమార్
సాహిత్యం: అనంత్ శ్రీరామ్
గానం: కార్తీక్, హరిణి 

నా ప్రేమ 




లాలీ పాట పాట సాహిత్యం

 
చిత్రం: ఉల్లాసంగా ఉత్సాహంగా (2008)
సంగీతం: జి. వి. ప్రకాష్ కుమార్
సాహిత్యం: అనంత్ శ్రీరామ్
గానం: వి.వి.ప్రసన్న 

లాలీ పాట 




ప్రియతమా పాట సాహిత్యం

 
చిత్రం: ఉల్లాసంగా ఉత్సాహంగా (2008)
సంగీతం: జి. వి. ప్రకాష్ కుమార్
సాహిత్యం: అనంత్ శ్రీరామ్
గానం: సోను నిగమ్, రాహుల్ నంబియర్

ఎంత అందమో ఎంత అందమో
నమ్మలేను నా కళ్ళని
ఎంత  సేపిలా ఎంత చూసినా
నిన్ను వీడి నే వెళ్లనే
ఇలా వచ్చి అలా నవ్వి వలేస్తుంటే ఎలా ఎలా
కలో కాదో నిజం ఏదో తెలీలేదే ఎలా ఎలా
ఇలా వచ్చి అలా నవ్వి వలేస్తుంటే ఎలా ఎలా
కలో కాదో నిజం ఏదో తెలీలేదే ఎలా ఎలా

ప్రియతమా తిరుగులేని సౌందర్యమా
ప్రియతమా తరిగిపోని లావణ్యమా
ప్రియతమా విరగబూసే వాసంతమా
ప్రియతమా ఉరకలేసే వయ్యారమా

నాకోసం నేలపైకి నువ్వు వచ్చావా
ఆకాశం అంచుదాక తీసుకెళ్తావా

ఇలా వచ్చి అలా నవ్వి వలేస్తుంటే ఎలా ఎలా
కలో కాదో నిజం ఏదో తెలీలేదే ఎలా ఎలా

సఖి చెలి సఖి చెలి  సుధామాధురి
నిజానికి నువ్వే మరి సదా నా సిరి
గులాబీలో శ్వాసే చేరగా చలాకీగా నీలా మారదా
ఓ బేబీ యు ఆర్ మై లైఫ్ ఐ కెన్ ఫీల్ యు ఎవ్రీ టైం
ఓ బేబీ యు ఆర్ మై లైఫ్ ఐ కెన్ ఫీల్ యు ఎవ్రీ టైం
హో చామంతి కైనా పూబంతి కైనా లేదు ఇంత సున్నితం

నాకోసం నేలపైకి నువ్వు వచ్చావా
ఆకాశం అంచుదాక తీసుకెళ్తావా

ఇలా వచ్చి అలా నవ్వి వలేస్తుంటే ఎలా ఎలా
కలో కాదో నిజం ఏదో తెలీలేదే ఎలా ఎలా

ప్రియా అని ప్రియా అని పిలుస్తావని
నరాలలో  ప్రతి కణం నిరీక్షించని
సరాగమా నీపై ధ్యాసతో
ప్రతి క్షణం ఉన్నా ఆశతో

ఓ బేబీ యు ఆర్ మై లైఫ్ ఐ కెన్ ఫీల్ యు ఎవ్రీ టైం
ఓ బేబీ యు ఆర్ మై లైఫ్ ఐ కెన్ ఫీల్ యు ఎవ్రీ టైం
హో నీ చేతిలోన ఉన్నాయి నేడు నా చేతి గీతలు

నాకోసం నేలపైకి నువ్వు వచ్చావా
ఆకాశం అంచుదాక తీసుకెళ్తావా

ప్రియతమా తిరుగులేని సౌందర్యమా
ప్రియతమా తరిగిపోని లావణ్యమా
ప్రియతమా విరగబూసే వాసంతమా
ప్రియతమా ఉరకలేసే వయ్యారమా

నాకోసం నేలపైకి నువ్వు వచ్చావా
ఆకాశం అంచుదాక తీసుకెళ్తావా




మాట మాటికి పాట సాహిత్యం

 
చిత్రం: ఉల్లాసంగా ఉత్సాహంగా (2008)
సంగీతం: జి. వి. ప్రకాష్ కుమార్
సాహిత్యం: అనంత్ శ్రీరామ్
గానం: సాయనోర ఫిలిప్ , రాహుల్ నంబియార్, కార్తీక్ 

మాట మాటికి 




చకోరి పాట సాహిత్యం

 
చిత్రం: ఉల్లాసంగా ఉత్సాహంగా (2008)
సంగీతం: జి. వి. ప్రకాష్ కుమార్
సాహిత్యం: అనంత్ శ్రీరామ్
గానం: సాయనోర ఫిలిప్ , రాహుల్ నంబియార్, కార్తీక్ 

చకోరి 

Palli Balakrishna Friday, November 10, 2017

చిత్రం: యువకుడు (2000)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: సిరివెన్నెల
గానం: యస్.పి.బి.చరణ్
నటీనటులు: సుమంత్ , భూమిక
దర్శకత్వం: కరుణాకరన్
నిర్మాత: అక్కినేని నాగార్జున , యన్.సుధకర్ రెడ్డి
విడుదల తేది: 19.05.2000

మైకం కాదిది నిన్నటి లోకం కాదిదీ
ఇవాళే చూస్తున్నట్టు ఉన్నది
ఊపిరినే ఇది ఊయలలూగిస్తున్నది
ఇదేదో మహా కొత్త సంగతి
గుండెలో గుట్టుగా ఉండనంటున్న వేడుక
అందరూ చూడగా ఉప్పెనవుతుండగా
అంతటా నవ్వులే పలకరిస్తున్న పండగ
అందరూ పూవులై స్వాగతిస్తుండగా

తేలుతున్నాను నీలి మేఘాలలో
మునుగుతున్నాను తొలిప్రేమ భావంలో
మేలుకున్నాను కలలోన ఉన్నానో

పాటలా ఉంది గాలి ఈలేసినా
ఆటలా ఉంది ఎవరేమి చేస్తున్నా
తోటలా ఉంది ఎటు వైపు చూస్తున్నా


**********  ********   *********


చిత్రం: యువకుడు (2000)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: సిరివెన్నెల
గానం: పార్థసారథి

నా పాదం ఆగేనా ఏ బంధం కాదన్నా
చెరిగిన శాంతి చెదిరిన కాంతి
కనపడు దారి వెతుకుతు సాగుతున్న వేళ
నా పాదం ఆగేనా ఏ బంధం కాదన్నా

కమ్మని జోలలతో చిననాటి ఆ కల
కమ్మిన జ్వాలలతో నిలిచింది కన్నులా
తీరని ఊహలా తీరని ఆశలా
అలనాటి జ్ఞాపకాల కోవెల
కోయిల పాటలా కోరిన కోటలా
పిలిచింది నన్ను కోటి గొంతులా
చెరిగిన శాంతి చెదిరినకాంతి
కనపడు దారి వెతుకుతు సాగుతున్న వేళ
నా పాదం ఆగేనా ఏ బంధం కాదన్నా

నీ కొనవేలితో మొదలైంది ఈ కదం
నీ చనుబాలతో పదునైంది పౌరుషం
నీ ఎదలో లయ వినపడనీయక
నను ఆపకమ్మ కాలు తూలగా
నీ కనుపాపలో కాంతిని ఈయక
కరిగించకమ్మ కంటి నీరుగా
చెరిగిన శాంతి చెదిరిన కాంతి
కనపడు దారి వెతుకుతు సాగుతున్న వేళ
నా పాదం ఆగేనా ఏ బంధం కాదన్నా


Palli Balakrishna Thursday, September 14, 2017


చిత్రం: ఎందుకంటే ప్రేమంట (2012)
సంగీతం: జి. వి. ప్రకాష్ కుమార్
సాహిత్యం: రామ జోగయ్య శాస్త్రి
గానం: హరిచరణ్ , చిత్ర
నటీనటులు: రామ్, తమన్నా
దర్శకత్వం: ఏ.కరుణాకర్
నిర్మాత: స్రవంతి రవికిశోర్
విడుదల తేది: 08.06.2012

పల్లవి:
నీ చూపులే నా ఊపిరి
ఓసారిలా చూడే చెలీ
అమవాసనై ఉన్నా చెలీ
అందించవే దీపావళి
ఎందుకే చెలియా రెప్పల వలలో ఒదిగిన కలలా
కనుపాపలు వెతికే రేపటి వెలుగును చూసీ చూడవెలా
నయనం హృదయం నీవే నీవై
సమయం వెనకే చేశా పయనం
తదుపరి జన్మ కైనా జాలి చూసే వీలుందంటే
ఈ క్షణాన ఊపిరాపనా

చరణం:
రోజూ కొత్తగా నీ సందర్శనం
ఆహా అన్నది నాలో స్పందనం
నిత్యం నువ్విలా నాకై చూడటం
ఎంతో వింతగా ఉందీ అనుభవం
నడి వేసవిలో మరిగిస్తూనే మురిపిస్తోందే నీ చల్లదనం
ఎద మంటంతా దాచేస్తూ వెన్నెలయింది ప్రేమ గుణం
నీకై వేచే నిట్టూరుపులే తూరుపు కానీ
నీ తలపులలో తలమునకవనీ ఎన్నో జన్మలనీ

నయనం హృదయం నీవే నీవై
సమయం వెనకే చేశా పయనం
తదుపరి జన్మ కైనా జాలి చూసే వీలుందంటే
ఈ క్షణాన ఊపిరాపనా

చరణం:
నీతో బంధమే రాసిందెవ్వరో
నిన్నే నాకిలా చూపిందెవ్వరో
నన్నీవైపుగా లాగిందెవ్వరో
నిన్నే చూడగా ఆపిందెవ్వరో
దరిదాపుల్లో పడిగాపుల్లోపడి నిలిచానే రహదారుల్లో
తొలి వెలుగల్లే వస్తాలే కలిసే రేపటి పొద్దుల్లో

నీ చూపులే నా ఊపిరి
ఓసారిలా చూడే చెలీ
అమవాసనై ఉన్నా చెలీ
అందించవే దీపావళి
ఎందుకే చెలియా రెప్పల వలలో ఒదిగిన కలలా
కనుపాపలు వెతికే రేపటి వెలుగును చూసీ చూడవెలా
నయనం హృదయం నీవే నీవై
సమయం వెనకే చేశా పయనం
తదుపరి జన్మ కైనా జాలి చూసే వీలుందంటే
ఈ క్షణాన ఊపిరాపనా

Palli Balakrishna Tuesday, August 15, 2017
Happy (2006) Telugu Songs Lyrics Album Cover

Happy (2006) Telugu Songs Lyrics

MOVIE DETAILS
Movie : Happy (2006)
Music : Yuvan Shankar Raja
Actors : Allu Arjun
Actress : Genelia D'Souza
Director : A. Karunakaran
Producer : Allu Aravind
Release Date : 27 January 2006

Chal Chal Re Song Lyrics in Telugu – Happy (2006)

'Chal Chal Re' song from Happy (2006) movie is composed by Yuvan Shankar Raja and sung by Clinton Cerejo.

SONG INFORMATION
Movie : Happy (2006)
Lyricist : Viswa
Singers : Clinton Cerejo
చిత్రం: హ్యాపి (2006) సంగీతం: యువన్ ‌శంకర్ ‌రాజా సాహిత్యం: విశ్వా గానం: క్లింటన్ సెరిజో ఛల్ చల్ రే చల్ మెర సాథీ హం బన్‌గయె హైదరబాది  తన ఒడిలో చోటిచ్చే ఈ హైదరబాదుకి సాటింకేదీ  Everybody is wat they wanna be  Pyar se jeethenge hum sabhi  ప్రతి నిత్యం మధిలో నిలిచె  నీది నాది మన ట్విన్ సిటీ  Awaken city, girls r so pretty  పడదామా పోటి పద నా తోటీ  In cyber city ప్రతి beauty పోటీ  They love their duty n also party  ఛల్ చల్ రే చల్ మెర సాథీ హం బన్‌గయె హైదరబాది  తన ఒడిలో చోటిచ్చే ఈ హైదరబాదుకి సాటింకేదీ  Everybody is wat they wanna be  Pyar se jeethenge hum sabhi  ప్రతి నిత్యం మధిలో నిలిచె  నీది నాది మన ట్విన్ సిటీ  If u wanna learn about history it’s a never ever ending true glory (2) హే నా హే నా హే నా హే నా యే నా (4) ముత్యాలు గాజుల షెహరు అనుకుంటే పొరబడతారూ  మరి ముందుకు సాగె తీరు గమనిస్తె జై కొడతారు  మన గోల్కొండ సాలార్జంగ్ చార్మినారూ ఘన చరితేలే అని చెపుతుంటారు కాని చీటికి మాటికి నెక్లెస్ రోడ్లు ఐమాక్స్ హాలు తెగ సరదాగా ఎప్పుడు చుడుతుంటారు  ఉరుకుల పరుగుల నగరం ఇది లెరా మనకిక New halt busy busy బతుకుల సమరం it's a seriously new new venue..  ఛల్ చల్ రే చల్ మెర సాథీ హం బన్‌గయె హైదరబాది  యూరోప్ అమెరిక సైతం కన్నేసే మనపై నిత్యం  ఈ సైబర్ బాబుల కష్టం పెంచునులె ఆంధ్ర income  ఎకడెక్కడి నుంచొ యువతే ఎంతో ఆశలతోటి ఈ హైదరబాదు కి  కదిలొస్తారు కొంచెం కలివిడి చొరవా చూపక పోతే ఎవరే ఐనా ఈ sylicon speedu కి తడబడతారు  ఉరుకుల పరుగుల నగరం ఇది లెరా మనకిక new halt  Busy busy బతుకుల సమరం It's a seriously new new venue..  ఛల్ చల్ రే చల్ మెర సాథీ హం బన్‌గయె హైదరబాది  తన వొడిలో చోటిచ్చే ఈ హైదరబాదుకి సాటింకేదీ  Everybody is wat they wanna be  Pyar se jeethenge hum sabhi  ప్రతి నిత్యం మధిలో నిలిచె  నీది నాది మన ట్విన్ సిటీ 

Happy Song Lyrics in Telugu – Happy (2006)

'Happy' song from Happy (2006) movie is composed by Yuvan Shankar Raja and sung by Karthik.

SONG INFORMATION
Movie : Happy (2006)
Lyricist : Chandrabose
Singers : Karthik
చిత్రం: హ్యాపి (2006) సంగీతం: యువన్‌ శంకర్‌ రాజా సాహిత్యం: చంద్రబోస్ గానం: కార్తిక్ హ్యాపీ...పాపకి లుక్కిస్తే హ్యాపీ...  లుక్కులొ క్లిక్ ఐతే హ్యాపీ....  క్లిక్ అయి కిస్ ఇస్తే హ్యాపీ...  హ్యాపీ... బేబీ కి బెంజ్ ఉంటే హ్యాపీ..  భామ కి రేంజ్ ఉంటె హ్యాపీ..  బావ కి ఏజ్ ఐతె హ్యాపీ..  చరణం: 1 వయ్యారికి డాష్ ఇస్తే తను థాంక్యు అంటె సో హ్యాపీ..  థియేటర్ లొ ప్యారి నీపై చెయేస్తే ఫుల్ హ్యాపి బ్రదర్స్ లు లేని ఫిగర్ కి నువ్వే లవర్ వి ఐతె భలె హ్యాపీ కలర్సు చిమ్మె కసక్కు నీకే చమ్మక్కులిస్తె యమ హ్యాపీ..  హ్యాపీ...పాపకి లుక్కిస్తె హ్యాపీ...  లుక్కులొ క్లిక్ ఐతే హ్యాపీ....  క్లిక్ అయి కిస్ ఇస్తే హ్యాపీ...  చరణం: 2  నీకో స్వీటీ సిగ్నల్ ఇస్తే హ్యాపీ స్వీటీ Daddy SP ఐతే BP.. Happy... BP Happy... బ్యుటీ పార్టీ కొచ్చిదంటే హ్యాపీ Next day Party మారిస్తే Unhappy  చెల్లెలేమో ఫ్రెండ్స్ వచ్చారని చెవిలో చెబితే very happy  వెళ్ళి చూస్తె ఆ ఫ్రెండ్స్ ఎమో బాయ్ ఫ్రెండ్స్ ఐతే నీకు టోపి..  Happy.. Happy..  Happy పాపకి లుక్కిస్తె హ్యాపీ లుక్కులొ క్లిక్ ఐతే హ్యాపీ....  క్లిక్ అయి కిస్ ఇస్తే హ్యాపీ...  గురు, లవ్ లో లాజిక్కులు గురించి భలే చెప్పావ్ గురు..  ఆ లాజిక్కులన్నీ మీవరకు.. నా వరకు మాత్రం...  హ్యాపీ.. ప్రేయసి లేకుంటే.. హ్యాపి  ప్రేమలో పడకుంటె.. హ్యాపి  ఫ్రీగా తిరిగేస్తే.. హ్యాపి హ్యాపి  సోలొ లైఫ్ ఉంటే.. హ్యాపి  సింగిల్ గా ఉంటే.. హ్యాపి  స్వేచ్చగ బతికేస్తే.. హ్యాపీ  పాకెట్ మనీ ఖర్చే లేదు బిల్డప్ అవసరమే లేదు..  వెయిటింగ్ చేసె చాన్సే లేదు చాకిరి చేసే శ్రమ లేదు..  అదుర్స్ అంటు బెదుర్స్ అంటు అందాన్ని పొగిడే పని లేదు  అశాంతి లేదు హెడ్డేకు లేదు విశ్రాంతికి అడ్డే ఇక లేదు..  హ్యాపీ.. ప్రేయసి లేకుంటే.. హ్యాపి  ప్రేమలో పడకుంటె.. హ్యాపి  ఫ్రీగా తిరిగేస్తే.. హ్యాపి.. 

Ossa Re Song Lyrics in Telugu – Happy (2006)

'Ossa Re' song from Happy (2006) movie is composed by Yuvan Shankar Raja and sung by Jassie Gift, Suchitra and Yuvan Shankar Raja.

SONG INFORMATION
Movie : Happy (2006)
చిత్రం: హ్యాపి (2006) సంగీతం: యువన్‌ శంకర్‌ రాజా సాహిత్యం: పోతుల రవికిరణ్ గానం: జస్సి గిఫ్ట్, సుచిత్ర, యువన్‌ శంకర్‌ రాజా (Rap vocals) పల్లవి :  చిరుత కన్నుల వాడే - చిలిపి చిన్నొడె  చిలక కొట్టని చోటే - కొరికి పెట్టాడే  అల్లాడి పోకే సత్యాభామా కిల్లాడీ ఓడే నా చందమామ  ఓస్స హే ఒస్సా హే ఓస్స హే ఒస్సా హే ఒస్స ఒస్సా ఒస్సా ఒస్సా ఒస్సా ఒస్సా ఒస్సారే ఓ ఒస్సారె ఒస్సా ఒస్సా రె ఒస్సారె వచ్చే ఓ సారే ఏయ్ ఒస్సారె ఒస్సే ఒస్సా రె ఒస్సారె వస్తా ఓ సారే చిరుత కన్నుల వాడే - చిలిపి చిన్నొడె  చిలక కొట్టని చోటే - కొరికి పెట్టాడే  అల్లాడి పోకే సత్యాభామా కిల్లాడీ ఓడే నా చందమామ ఓస్స హే ఒస్సా హే ఓస్స హే ఒస్సా హే ఒస్స ఒస్సా ఒస్సా ఒస్సా ఒస్సా ఒస్సా ఒస్సారే ఓ ఒస్సారె ఒస్సా ఒస్సా రె ఒస్సారె వచ్చే ఓ సారే ఏయ్ ఒస్సారె ఒస్సే ఒస్సా రె ఒస్సారె వస్తా ఓ సారే అందమంతా ఆరబోసి అమ్ముకుంటావే  అందగాడే పక్కనుంటే అంతే అంతేలే  తప్పు ఒప్పు చెప్పకమ్మొ తప్పదివ్వాళే  సిగ్గు సిగ్గు ఆపరయ్యొ బుగ్గే కందేలే నీ ఒంపు సొంపుల్లో ఆ మడతే రమ్మందే నీ ఒళ్ళో తుళ్ళి పడి వెచ్చబడీ  జారి పడీ కెవ్వుమనేలే... ఓస్స హే ఒస్సా హే ఓస్స హే ఒస్సా హే ఒస్స ఒస్సా ఒస్సా ఒస్సా ఒస్సా ఒస్సా ఒస్సారే ఓ ఒస్సారె ఒస్సా ఒస్సా రె ఒస్సారె వచ్చే ఓ సారే ఏయ్ ఒస్సారె ఒస్సే ఒస్సా రె ఒస్సారె వస్తా ఓ సారే రబ్బరు తో చెసినా రంభ నువ్వేలే  రంగులలో తెంపర నా రిబ్బను ముల్లె  హంగు పొంగు లాగుతుంటే మతే పోయేలే  గుచ్చి గుచ్చి చూడకయ్యొ మతే ఎక్కేలె ఎదైనా ఎమైనా ఈ రాతిరి జాతరలే  హయ్యె నీ తోనే అల్లుకుని గిల్లుకుని  హత్తుకుని జివ్వుమనేలే...  ఓస్స హే ఒస్సా హే ఓస్స హే ఒస్సా హే ఒస్స ఒస్సా ఒస్సా ఒస్సా ఒస్సా ఒస్సా ఒస్సారే ఓ ఒస్సారె ఒస్సా ఒస్సా రె ఒస్సారె వచ్చే ఓ సారే ఏయ్ ఒస్సారె ఒస్సే ఒస్సా రె ఒస్సారె వస్తా ఓ సారే

I Hate You Song Lyrics in Telugu – Happy (2006)

'I Hate You' song from Happy (2006) movie is composed by Yuvan Shankar Raja and sung by Ranjith and Vasundhara Das.

SONG INFORMATION
Movie : Happy (2006)
Lyricist : Anantha Sriram
చిత్రం: హ్యాపి (2006) సంగీతం: యువన్ ‌శంకర్‌ రాజా సాహిత్యం: అనంత్ శ్రీరామ్ గానం: రంజిత్, వసుంధరా దాస్ గోవిందా చూడవయ్యా వీళ్ళిద్దరి వింత గోల  గోరంత దానికైన కొండంత యుద్ద లీల  ఇద్దరి మధ్య hate you ఇంటా బయటా hate you  రేయి పగలు hate you ఎప్పుడు చూడు hate you  వెక్కిరింతలె చూసినప్పుడమ్మాయి పలికె I hate you  తిక్క మాటలే వింటున్నప్పుడబ్బాయి పలికె I hate you   కుప్పి గంతుల కొతి చెష్టల కుర్ర కుంక I hate you  కీచు కూతల కుళ్ళు మొతువే కర్రి కేక I hate you  Hate you hate you Hate you Hate you hate you Hate you  I hate you... same to you... I hate you....  Hate you.... Hate you....  హెయ్ గలాటాల తోనే రోజులు అన్ని గడచునుగా  గళాసులు పళ్ళేలన్నీ రోజూ పగులునుగా ఈ రోషమె వద్దొయ్ హో హో చిరాకు తేవద్దె హో హోహో కబుర్లు చెప్పొద్దోయ్ హో హో హో కట్టింగు లివ్వద్దె చి చి పోవె చింపిరి పెంటమ్మా...  ఏమిటి ఈ గతి గోవిందా ఇల్లొక నరకం అయ్యిందా ఎదురుగ మధుమతి ఉండంగా ఇంకొక నరకము ఉంటుందా  వెక్కిరింతలే చూసినప్పుడమ్మాయి పలికె I hate you   తిక్క మాటలె వింటున్నప్పుడబ్బాయి పలికె I hate you   ఎండాకాలం ఎండలు కూడా 50 దాటవుగా  ఈ ఇంట్లోన మాత్రం ఎపుడూ 90 తగ్గవుగా  జిగుర్ ఫేసు నీదె హో హో హో తగుల్తాయి నీకె హో హో హో పొగర్బోతు నువ్వే హో... పగుల్తాది నీకె తు తు పొరా తుంటరి పెంటయ్య...  యేమిటి ఈ గతి గోవిందా ఇల్లొక నరకం అయ్యిందా ఎదురుగ బన్నీ వుండంగా ఇంకొక నరకము వుంటుందా  వెక్కిరింతలె చూసినప్పుడమ్మాయి పలికె I hate you  తిక్క మాటలే వింటున్నప్పుడబ్బాయి పలికె I hate you   కుప్పి గంతుల కొతి చేష్టల కుర్ర కుంక I hate you  కీచు కూతల కుళ్ళు మొతువే కర్రి కేక I hate you 

Egire Mabbula (Version I) Song Lyrics in Telugu – Happy (2006)

'Egire Mabbula (Version I)' song from Happy (2006) movie is composed by Yuvan Shankar Raja and sung by S. P. Charan.

SONG INFORMATION
Movie : Happy (2006)
Lyricist : Kulashekhar
Singers : S. P. Charan
చిత్రం: హ్యాపీ (2006) సంగీతం: యువన్ శంకర్ రాజా సాహిత్యం: కులశేఖర్ గానం: ఎస్. పి. చరణ్ ఎగిరే మబ్బులలోనా పగలే వెన్నెల వాన పలికే నవ్వుల వీణ గుండెల్లో సాగే రాగాలేవో.. ఏ ఉదయం ఏ హృదయం ఓ చేరుతుందో ఈ ప్రేమా ఏ నిమిషం ఏది నిజం ఓ తెలియకుందే ఈ మాయ ఆశ పడితే అందనందే ఊరుకుంటే చేరుకుందే తగువులోనే చిగురు వేసిందే... ఎగిరే మబ్బులలోనా పగలే వెన్నెల వాన పలికే నవ్వుల వీణ గుండెల్లో సాగే రాగాలేవో (2) నిదరోయే నీ కనులు యదలోన ఆ కలలు ఎదురైనా ఎపుడైనా కళ్ళారా చూసేనా నీతో కలిసి నీతో పెరిగి నీతో తిరిగి ఆశగా నిన్నే తలచి నిన్నే పిలిచి ఇన్నాళ్ళుగా నువ్వంటే ఇష్టం ఉన్నా నువ్వే నా సర్వం అన్నా నా గుండెల్లో దాచేసిందే మౌనంగా ప్రేమ ఎటువైపే నీ పరుగు వినలేదా నా పిలుపు ఇపుడైనా ఇకనైనా నీ పంతమాగేనా అన్నీ మరిచి కోపం విడిచి నాతో చెలిమే చేసినా పోయే వరకు నా ఈ బతుకు నీదే కదా నీ తోడే కావాలంటు నీ నీడై ఉండాలంటు నవరాగాలు ఆలాపించే నాలో ఈ ప్రేమా ఎగిరే మబ్బులలోనా పగలే వెన్నెల వాన పలికే నవ్వుల వీణ గుండెల్లో సాగే రాగాలేవో... (2) ఏ ఉదయం ఏ హృదయం ఓ చేరుతుందో ఈ ప్రేమా ఏ నిమిషం ఏది నిజం ఓ తెలియకుందే ఈ మాయ ఆశ పడితే అందనందే ఊరుకుంటే చేరుకుందే తగువులోనే చిగురు వేసిందే... ఎగిరే మబ్బులలోనా పగలే వెన్నెల వాన పలికే నవ్వుల వీణ గుండెల్లో సాగే రాగాలేవో... (2)

Egire Mabbula (Version II) Song Lyrics in Telugu – Happy (2006)

'Egire Mabbula (Version II)' song from Happy (2006) movie is composed by Yuvan Shankar Raja and sung by KK.

SONG INFORMATION
Movie : Happy (2006)
Lyricist : Kulashekhar
Singers : KK
[Egire Mabbula Version II Lyrics]

Nee Kosam Song Lyrics in Telugu – Happy (2006)

'Nee Kosam' song from Happy (2006) movie is composed by Yuvan Shankar Raja and sung by Shankar Mahadevan.

SONG INFORMATION
Movie : Happy (2006)
చిత్రం: హ్యాపి (2006) సంగీతం: యువన్ ‌శంకర్‌ రాజా సాహిత్యం: సిరివెన్నెల గానం: శంకర్ మహదేవన్ ఓ...ఓ...ఓ... నీ కోసం ఒక మధుమాసం అందించిన ఈ జన్మ నీదేనే చెలి కొమ్మ తనలో చిగురాశల గంధం నీ శ్వాసకి పంచమని చలిగాలికి చెదరని బంధం నీ నవ్వుతో పెంచమని నీ కోసం ఒక మధుమాసం అందించిన ఈ జన్మ నీదేనే చెలి కొమ్మ దూరంగానే ఉంటా నువు కందే మంటై చేరగా దీపంలా చూస్తుంటా నడి రేయంతా నీ తోడుగా కలకలాన్ని రగిలిస్తున్న చలి సంకెళ్ళు తెగేట్టుగా నీ కోసం ఒక మధుమాసం పాదం నేనై వస్తా దరిచేరే దారే చూపగా ప్రాణం పందెం వేస్తా ప్రతి గెలుపు మెళ్ళో వాలగా కలలెట్టున్నా నీ ముందొచ్చి నిలబడాలి నిజాలుగా నీ కోసం ఒక మధుమాసం అందించిన ఈ జన్మ నీదేనే చెలి కొమ్మ తనలో చిగురాశల గంధం నీ శ్వాసకి పంచమని చలిగాలికి చెదరని బంధం నీ నవ్వుతో పెంచమని నీ కోసం ఒక మధుమాసం

Palli Balakrishna Saturday, August 5, 2017




చిత్రం: బాలు (ABCDEFG) (2005)
సంగీతం: మణిశర్మ
నటీనటులు: పవన్ కళ్యాణ్, శ్రేయ శరణ్
దర్శకత్వం: ఏ. కరుణాకరన్
నిర్మాత: సి. అశ్వనీదత్
విడుదల తేది: 06.01.2005



Songs List:



ఇంతే ఇంతింతే పాట సాహిత్యం

 
చిత్రం: బాలు (ABCDEFG) (2005)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: చంద్రబోస్
గానం: కే. కే.

ఇంతే ఇంతింతే ఇంతే ఇంతింతే
ఆలోచిస్తే అంతా ఇంతింతే
కన్ను ఇంతే కనుపాప ఇంతే 
లోకం లోతు చూడాలంతే

ఇంతే ఇంతింతే ఇంతే ఇంతింతే
ఆలోచిస్తే అంతా ఇంతింతే
కన్ను ఇంతే కనుపాప ఇంతే 
లోకం లోతు చూడాలంతే

ఛరణం: 1
మొగ్గల్లోన దాగుంది కాయో పండో 
కనిపెట్టాలి ముందే
మబ్బుల్లోన దాగుందీ చినుకో తూఫానో 
పసిగట్టాలి ముందే
మనుషుల్లో మంచోడెవరో ముంచేదెవరో 
మనసెట్టీ చూడాలంతే
ఈ మట్టి లోని వజ్రం చూడు 
బొగ్గులోని అగ్గిని చూడు 
అన్నిటికన్నా నీలోని నిన్నే చూడు
అలా చూస్తే ఎదురే లేదంతే 
నువ్వలా చేస్తే తిరుగే లేదంతే
రాసి ఫలాలన్ని వచ్చును నీ వెంటే
తొమ్మిది గ్రహాలన్ని పనులే మాని 
తిరుగును నీ చుట్టే

ఇంతే ఇంతింతే ఇంతే ఇంతింతే
ఆలోచిస్తే అంతా ఇంతింతే

ఛరణం: 2
గుడిసెల్లోని పేదలకి స్నేహితుడయ్యే 
గుణముండాలి నీలో
మేడల్లోని అమ్మడికి ప్రేమికుడయ్యే 
పొగరుండాలి నీలో
దేశన్నే శోకం నుంచి చీకటి నుంచి 
రక్షించే సైనికుడవ్వాలి
నీ పనుల్లోను శ్రామికుడల్లే 
పగలురేయి కార్మికుడల్లే
సముద్రంలో నావికుడల్లే ముందుకు పొతుంటే
జనం మెచ్చే నాయకుడవుతావు 
జగం మెచ్చే ఉత్తముడౌతవు
ప్రపంచంలో దేవుడివౌతావు
ఈ భూమ్మీద అస్సలు సిస్సలు మానవుడౌతావు

ఇంతే ఇంతింతే ఇంతే ఇంతింతే
ఆలోచిస్తే అంతా ఇంతింతే
కన్ను ఇంతే కనుపాప ఇంతే 
లోకం లోతు చూడాలంతే



నీలో జరిగేతంతూ పాట సాహిత్యం

 
చిత్రం: బాలు (ABCDEFG) (2005)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: సిరివెన్నెల
గానం: హరిహరన్, శ్రేయ గోషల్

నీలో జరిగేతంతూ చూస్తూనే ఉన్నా 
దీన్నే తొలిప్రేమ అంటారే మైనా 
ఏదో జరిగిందంటూ నీతో చెప్పానా 
చాల్లే ఇట్టాంటివి చాలానే విన్నా 
అంటే అన్నానంటూ కోపాలేనా 
నువ్వే చెప్పు నే తప్పన్నానా 
పోన్లే నీకేంటంటా నాకేమైనా 
ఏదో సాయం నిన్నిమ్మన్నానా 
వలపంటే నిప్పులాంటిది కలకాలం దాచలేనిది 
సలహా విని ఒప్పుకోవే ఇకనైనా 
ఓ సర్లే ఈ ప్రేమ సంగతి నాలాగే నీకు కొత్తది 
ఐనా ముందు నీకే తెలిసేనా 

ప్రతిరోజు నడిరాతిరిలో చేస్తావా స్నానాలు 
ఒళ్ళంతా చెమటలు పడితే తప్పవుగా చన్నీళ్ళు 
వణికించే చలికాలంలో ఏమా ఆవిర్లు 
ఉడికించే ఆలోచనలు పుడుతున్నవి కాబోలు 
ఇంతిదిగా వేడెక్కే ఊహలు రేపిందెవరు 
నీలా నను వేధించే దుష్టులు ఎవరుంటారు 
అదిగో ఆ ఉలుకే చెబుతుంది నువు దాచాలనుకున్నా...
దీన్నే లవ్ లవ్  పడిపోటం అంటున్నా 
చాల్లే ఇట్టాంటివి చాలానే విన్నా 

ఒంట్లో బాగుంటం లేదా ఈ మధ్యన నీకసలు 
నాకేం ఎంచక్కా ఉన్నా నీకెందుకు ఈ దిగులు 
అంతా సరిగానే ఉంటే ఎరుపెక్కాయేం కళ్ళు 
వెంటాడే కలలొస్తుంటే నిదరుండదు తెల్లార్లు 
ఐతేమరి నువ్వెపుడు కనలేదా ఏ కలలు 
నా కలలో ఏనాడు నువు రాలేదిన్నాళ్ళు 
అదిగో ఆ మాటే నీనోటే చెప్పించాలనుకున్నా 
దీన్నే లవ్ లవ్  పడిపోటం అంటున్నా 
ఊఁ అవునా ఏమో నే కాదనలేకున్నా 

నీలో జరిగేతంతూ చూస్తూనే ఉన్నా 
దీన్నే తొలిప్రేమ అంటారే మైనా 
నాలో జరిగేతంతూ చూస్తూనే ఉన్నా 
దీన్నే తొలిప్రేమ అంటారో ఏమో 
అంటే అన్నానంటూ కోపాలేనా 
నువ్వే చెప్పు నే తప్పన్నానా 
పోన్లే నీకేంటంటా నాకేమైనా 
ఏదో సాయం నిన్నిమ్మన్నానా 
వలపంటే నిప్పులాంటిది కలకాలం దాచలేనిది 
సలహా విని ఓప్పుకోవే ఇకనైనా 
ఆ సర్లే ఈ ప్రేమ సంగతి నాలాగే నీకు కొత్తది 
ఐనా ముందు నీకే తెలిసేనా




కన్ను కొట్టినా పాట సాహిత్యం

 
చిత్రం: బాలు (ABCDEFG) (2005)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: సిరివెన్నెల
గానం: ఉదిత్ నారాయణ్, సుజాత

కన్ను కొట్టినా నన్ను కుట్టవా రేగే తేనీగ 
కంట చూసినా కందిపోతవే తూగే తూనీగ 
కన్ను కొట్టినా నన్ను కుట్టవా రేగే తేనీగ 
హే కంట చూసినా కందిపోతవే తూగే తూనీగ 
అయినా సరే అన్నాగా సిద్ధంగానే ఉన్నాగా 
అందం అంతా నిండా కందేందుకే అందిస్తున్నాగా 
దేవుడా అమ్మాయంటె ఇలా కూడా ఉంటుందా 
ఎక్కడా మచ్చుక్కూడా ఆడ లక్షణం లేకుండా 
ఎంతకీ తెగించావే పైగా ఎందుకు ఈ నింద 
అందుకే తప్పనిసరై ముందడుగేశా కాస్తంత 

కన్ను కొట్టినా నన్ను కుట్టవా రేగే తేనీగ 
కంట చూసినా కందిపోతవే తూగే తూనీగ 

చరణం: 1
పెదవిచ్చి వరం వద్దనుకుంటావా 
విదిలించీ వ్రతం ముద్దనుకున్నావా 
బెదిరించే గుణం ప్రేమని అంటావా 
శృతి మించే తనం క్షేమం అంటావా 
వెచ్చగా నెచ్చెలి వస్తే వెళ్లిపోమంటావా 
వెల్లువై ముంచుకువస్తే తాళదే పడవ 
నది లోతెంతుందో ఒడ్డున ఉండే చూస్తూ ఉంటావా 

దేవుడా అమ్మాయంటె ఇలా కూడా ఉంటుందా 
ఎక్కడా మచ్చుక్కూడా ఆడ లక్షణం లేకుండా 
ఎంతకీ తెగించావే పైగా ఎందుకు ఈ నింద 
అందుకే తప్పనిసరై ముందడుగేశా కాస్తంత

చరణం: 2
వాస్తు లోపం ఉందా నా ఒంటి వంపుల్లో 
దృష్టిదోషం ఉందా నీ కంటి చూపుల్లో
ఈడు తాపం ఇలా వీధెక్కు చిందుల్లో 
ఏమి లాభం పిల్లా ఇబ్బందితనంలో 
యవ్వనం నివ్వెరపోదా కోరికే లేదంటే 
చెప్పినా నమ్మవు కదా తీరికే లేదంటె 
అరె పాపం అని పాపాయిని పాలించలేవా 

దేవుడా అమ్మాయంటె ఇలా కూడా ఉంటుందా 
ఎక్కడా మచ్చుక్కూడా ఆడ లక్షణం లేకుండా 
ఎంతకీ తెగించావే పైగా ఎందుకు ఈ నింద 
అందుకే తప్పనిసరై ముందడుగేశా కాస్తంత 

కన్ను కొట్టినా నన్ను కుట్టవా రేగే తేనీగ 
కంట చూసినా కందిపోతవే తూగే తూనీగ
అయినా సరే అన్నాగా సిద్ధంగానే ఉన్నాగా 
అందం అంతా నిండా కందేందుకే అందిస్తున్నాగా 
దేవుడా అమ్మాయంటె ఇలా కూడా ఉంటుందా 
ఎక్కడా మచ్చుక్కూడా ఆడ లక్షణం లేకుండా 
ఎంతకీ తెగించావే పైగా ఎందుకు ఈ నింద 
అందుకే తప్పనిసరై ముందడుగేశా కాస్తంత 



హట్ హట్ జా పాట సాహిత్యం

 
చిత్రం: బాలు (ABCDEFG) (2005)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: నితిన్ రైక్వార్
గానం: కునాల్ గంజవాల

ఆర్ నహి తో పార్ వర్న జీన హై బేకార్ 
జీ వైసె జీ జైసె జీనేకొ దిల్ బోలా 
తో ఉస్కేలియె షాయరికా దుష్మన్ కేలియె 
జంగల్కా షేర్ కర్దేగా ఢేర్ క్యా సంఝా

హట్ హట్ జా హట్ హట్ జా 
చల్ ఫుట్ జా చల్ ఫుట్ జా 
యా డర్ర్ డర్ర్కే మిట్ జా 
యా డర్ కొ డరా దిఖ్ జా బిందాస్! 

భేజా జొ మేర సట్కా 
ఝట్కే మె ఉస్కొ పట్కా 
జో రాస్తే మె ఖట్కా 
మైన్ హైద్రబాది లడ్కా హే హే హే

చల్తా హై కాల ధందా 
ఆంఖేన్ హై ఫిర్ భి అంధా 
దెఖో హర్ ఏక్ బందా 
ముర్దా హై ఫిర్ బి జిందా 
No morals... nothing... nothing 
హే హే హే హే హే హే హే హే హే

భగ్వాన్ కౌన్ కైసా 
ఐసా కహున్ య వైసా 
చల్తా హై ఫిర్ క్యున్ వైసా 
అరెయ్ కిస్కొ పడి హై క్యా బిందాస్! 

భగ్వాన్ కౌన్ కైసా 
ఐసా కహున్ య వైసా 
చల్తా హై ఫిర్ క్యున్ వైసా 
అరెయ్ కిస్కొ పడి హై క్యా బిందాస్!

సబ్ కుచ్ హై భిక్ర భిక్రా 
అరెయ్ ఇన్సానియత్ క కచ్రా 
ఉఫ్ఫ్ ఇన్ లడ్కియొన్ క నఖ్రా 
క్యున్ దేదియా కరారా బిందాస్! 
There is no love in this world
There is no love in this world

లెహరా రహా హై ఝండా 
సర్కర్ క్యున్ హై ఠండా 
క్యున్ ఆజ్ భి బనా హై 
ఫుట్ పాత్ ఘర్ కిసీకా బిందాస్!

లెహరా రహా హై ఝండా 
సర్కర్ క్యున్ హై ఠనండా 
క్యున్ ఆజ్ భి బనా హై 
ఫుట్ పాత్ ఘర్ కిసీకా

మైన్ హూన్ కహిన్ దీవానా 
Thats right hyderabad కా సోనా 
That's me That's me 
హొ జావూంగ మైన్ హాజిర్ 
బస్ యాద్ ముఝ్కొ కర్నా బిందాస్! 
Think of me... i'll be there 
Think of me... i'll be there




అతి మెత్తని మనసుని రువ్వి పాట సాహిత్యం

 
చిత్రం: బాలు (ABCDEFG) (2005)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: చంద్రబోస్
గానం: రంజిత్, మహాలక్ష్మి అయ్యర్

అతి మెత్తని మనసుని రువ్వి 
మతి మొత్తం తబ్బుబ్బీ 
నచ్చావోయ్ అచ్చ తెలుగబ్బీ 
సుతి మెత్తని కనులతొకుమ్మీ సుమగంధం విరజిమ్మీ నచ్చావొయ్ అచ్చ తెలుగమ్మీ 
రౌడి అబ్బి నిను చూడంగానే మనసుబ్బీ 
వచ్చానబ్బీ అబ్బీ 
రాగలమ్మీ నువు పిలవంగానే నిను నమ్మీ 
వలచానమ్మీ అమ్మీ 
నన్నయ్యకి అన్నయ్ నువ్వై గురజాడ గురువే నువ్వై 
నవ కవితలు రాసెయ్ ఓ రబ్బీ 

సుతి మెత్తని కనులతొకుమ్మీ సుమగంధం విరజిమ్మీ నచ్చావొయ్ అచ్చ తెలుగమ్మీ 

లేపాక్షి నంది నీ రూపులో చేపాక్షినయ్యా నీ చెరువులో 
అద్దంకి టీర నీ మేనిలో అడ్డంకినయ్యా నీ త్రోవలో 
కోనలు తలకోనలు నీ మీసాలలో 
ఏరులు కొల్లేరులు నీ మురిపాలలో 
మేడలు బెజవాడలు నీ పరువాలలో 
దాడులు పలనాడులు నీ పంతాలలో 
అమరావతి శిల్పాన్ని నేనై చిగురించా 
నీ నీడలో నీడలో 
హైద్రాబాది బిర్యాని రుచినే చవి చూశా
నీ తోడులో తోడులో 
గోదావరిఖనిలో కన్నా ఖనిజాలు నాలో మిన్న 
సోదాలే చేసెయ్ ఓ రబ్బి 

ఆ కోన సీమ నీ కులుకులో కోటప్ప కొండ నీ గుండెలో 
ఆ కాక రేగె నా తనువులో ఓ కాకతీయ నీ చెలిమితో 
మేలిమి శివ తాండవం నీ పాదాలలో 
బాసర మంత్రాలయం నీ బంధాలలో 
నైరుతి రుతు మారుతం ఇక నీ రాకతో 
నైజాముల పరిపాలనం మన నడిజాములో 
అరకు లోయ ఇరుకుల్లో నేనే పడుతున్నా 
ఈ వేళలో ఈ వేళలో లో 
విఠలాచార్యా వింతలనే నేనే చూస్తున్నా 
నీ లీలలో లీలలో 
ఆ రామగుండంలోని వెలుగంతా చూపిస్తాలే 
ఈ ప్రేమల్లోనే ఓ లమ్మి

అతి మెత్తని మనసుని రువ్వి మతి మొత్తం తబ్బుబ్బీ నచ్చావోయ్ అచ్చ తెలుగబ్బీ 
సుతి మెత్తని కనులతొకుమ్మీ సుమగంధం విరజిమ్మీ నచ్చావొయ్ అచ్చ తెలుగమ్మీ ఓ ఓ



లోకాలే గెలవగ పాట సాహిత్యం

 
చిత్రం: బాలు (ABCDEFG) (2005)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: జొన్నవిత్తుల
గానం: మురళీధర్, చిత్ర

లోకాలే గెలవగ నిలిచిన స్నేహాల విలువలు తెలిసిన 
ఈ ప్రేమ సరిగమ నువ్వేగా 
కాలాన్నే కదలక నిలిపిన ఆకాశం భూమిని కలిపిన 
ఏదైనా వెనకన నువ్వేగా 
ఎన్నెన్నో వరములు కురిసిన గుండెల్లో వలపై ఎగసిన 
ఈ ఆనందం నీ చిరునవ్వేగా 
నీతోనే కలిసిన క్షణమున నీలోని అణువణువణువున 
నీవే నీవే నీవే నీవుగా

లోకాలే గెలవగ నిలిచిన స్నేహాల విలువలు తెలిసిన 
ఈ ప్రేమ సరిగమ నువ్వేగా 
కాలాన్నే కదలక నిలిపిన ఆకాశం భూమిని కలిపిన 
ఏదైనా వెనకన నువ్వేగా 

చరణం: 1
ఈ పూవ్వు కోరిందిరా ప్రేమాభిషేకాలనే 
నా చూపు పంపిందిలే పన్నీటి మేఘాలనే 
బుగ్గపై చిరు చుక్కవై జుట్టువై సిరిబొట్టువై 
నాతోనే నువ్వుండిపో 
ఊపిరై ఎద తీపినై ఊపునై కనుచూపునై 
నీలోనే నేనుంటినే 
నీ రామ చిలకను నేనై నా రామచంద్రుడు నీవై 
కలిసి ఉంటె అంతే చాలురా

లోకాలే గెలవగ నిలిచిన స్నేహాల విలువలు తెలిసిన 
ఈ ప్రేమ సరిగమ నువ్వేగా 
కాలాన్నే కదలక నిలిపిన ఆకాశం భూమిని కలిపిన 
ఏదైనా వెనకన నువ్వేగా 

చరణం: 2
ఈ రాధ బృందావనం సుస్వాగతం అందిరా 
నా ప్రేమ సింహాసనం నీ గుండెలో ఉన్నదే 
పక్కగా రారమ్మని కమ్మగా ముద్దిమ్మనీ 
ఎన్నాళ్ళు కోరాలి రా 
ఎప్పుడు కనురెప్పలా చప్పుడై యదలోపల 
ఉంటూనె ఉన్నానుగా 
సన్నాయి స్వరముల మధురిమ 
పున్నాగ పువ్వుల ఘుమ ఘుమ 
అన్ని నీవై నన్నే చేర రా

లోకాలే గెలవగ నిలిచిన స్నేహాల విలువలు తెలిసిన 
ఈ ప్రేమ సరిగమ నువ్వేగా 
కాలాన్నే కదలక నిలిపిన ఆకాశం భూమిని కలిపిన 
ఏదైనా వెనకన నువ్వేగా 
ఎన్నెన్నో వరములు కురిసిన గుండెల్లో వలపై ఎగసిన 
ఈ ఆనందం నీ చిరునవ్వేగా 
నీతోనే కలిసిన క్షణమున నీలోని అణువణువణువున 
నీవే నీవే నీవే నీవుగా

లోకాలే గెలవగ నిలిచిన స్నేహాల విలువలు తెలిసిన 
ఈ ప్రేమ సరిగమ నువ్వేగా

Palli Balakrishna Sunday, July 30, 2017



చిత్రం: వాసు (2002)
సంగీతం:  హారీస్ జైరాజ్ 
నటీనటులు: వెంకటేష్  , భూమిక చావ్లా
దర్శకత్వం: ఏ. కరుణాకరన్
నిర్మాత: కె.యస్. రామారావు
విడుదల తేది: 10.04.2002



Songs List:



నమ్మవే అమ్మాయి పాట సాహిత్యం

 
చిత్రం: వాసు (2002)
సంగీతం:  హారీస్ జైరాజ్ 
సాహిత్యం: సిరివెన్నెల
గానం: రాఘవేంద్ర, చిత్ర

నమ్మవే అమ్మాయి తరించిపోయే చేయి
ఇలాంటి హాయి మొదటిసారి  సొంతమై
నమ్మవే అమ్మాయి తరించిపోయే చేయి
ఇలాంటి హాయి మొదటిసారి  సొంతమై
హాయి మిగిలిపోయి మనస్సు జారిపోయి
నిన్నొదిలిరాను అంది నన్ను మరచిపోయి
దేహమంత మారిపోయే చేయిగా
కాలమంత కాలుతోంది తీయగా
మాయమైన ఆ క్షణాన్ని వెతుకుతోంది చిలిపిగానె

నమ్మవే అమ్మాయి తరించిపోయే చేయి
ఇలాంటి హాయి మొదటిసారి  సొంతమై
నమ్మవే అమ్మాయి తరించిపోయే చేయి
ఇలాంటి హాయి మొదటిసారి  సొంతమై
హాయి మిగిలిపోయి మనస్సు జారిపోయి
నిన్నొదిలిరాను అంది నన్ను మరచిపోయి

చరణం: 1
ఓ సారి చెయ్యేస్తే ఇలా కళ్ళుమూసి ఒళ్ళు మరచిపోతే
నువు గనుక నేనయితే నువ్వే చెప్పగలవు ఏమి జరిగనంటే
ఇలాగ వేలుతాకి అలాగ సోలిపోతే
నువ్వేమిటౌదువో మరింత ముందుకొస్తే
తుఫాను కాకముందు చిటుక్కు చినుకు ముద్దు
ఇలాగె మన గుండెల్లోన ఆవిర్లు రేపి పోదా

నమ్మవే అమ్మాయి
హే చాలులే బడాయి కవిత్వమా అబ్బాయి
కబుర్లతోనే కాలమంతా గడపకోయి
ఇంతకన్న హాయి కావాలా ఆకతాయి
అందించగలను చేతిలోన చేయి

చరణం: 2
హో ఇన్నాళ్లు ఈ గాలి ఇలా పాడలేదు ఇంతచిలిపి లాలి
ఇంకేమి కావాలి సరే వెళ్ళు కలలలోకి తేలి తేలి
ఇవాళ నుంచి నేను పూలైన ముట్టుకోను
నీ లేత చేతి స్పర్శ కందిపోవునేమో
మరైతె ఇంక నేను ఎలాగ తట్టుకోను
నీ వరస చూస్తే ఇంక నువ్వు నన్నైన తాకవేమో
చాలులే బడాయి 

హో హో హో హో       
నమ్మవే అమ్మాయి తరించిపోయే చేయి
ఇలాంటి హాయి మొదటిసారి  సొంతమై
హాయి మిగిలిపోయి మనస్సు జారిపోయి
నిన్నొదిలిరాను అంది నన్ను మరచిపోయి
దేహమంత మారిపోయే చేయిగా
కాలమంత కాలుతోంది తీయగా
మాయమైన ఆ క్షణాన్ని వెతుకుతోంది చిలిపిగానె

నమ్మవే అమ్మాయి తరించిపోయే చేయి
ఇలాంటి హాయి మొదటిసారి  సొంతమై
హాయి మిగిలిపోయి మనస్సు జారిపోయి
నిన్నొదిలిరాను అంది నన్ను మరచిపోయి
లేనిపోని మైకమింక మానుకో
చేరువైన నన్ను కాస్త చేరుకో
లేకపోతే కోపమొచ్చి మాయమౌత చూసుకోర





పాటకు ప్రాణం పల్లవి ఐతే పాట సాహిత్యం

 
చిత్రం: వాసు (2002)
సంగీతం:  హారీస్ జైరాజ్ 
సాహిత్యం: పోతుల రవికిరణ్ 
గానం: కె కె (కృష్ణ కుమార్ కున్నత్), స్వర్ణలత

పాటకు ప్రాణం పల్లవి ఐతే  
ఓ ఓ ఓ ఓ పల్లవి అయితే
ప్రేమకు ప్రాణం ప్రేయసి కాదా 
ఓ ఓ ఓ ఓ ప్రేయసి కాదా

పాటకు ప్రాణం పల్లవి ఐతే  
ఓ ఓ ఓ ఓ పల్లవి అయితే
ప్రేమకు ప్రాణం ప్రేయసి కాదా 
ఓ ఓ ఓ ఓ ప్రేయసి కాదా

బ బహామ, ఎవరేమనుకున్నా వినదీ ప్రేమా
బ బహామ, ఎదురేమవుతున్నా కనదీ ప్రేమా
బ బహామ, కనులే తెరిచున్నా కల ఈ ప్రేమా
బ బహామ, నిదురే రాకున్నా నిజమో ప్రేమా... 
ఓ... చెలీ... సఖీ... ప్రియా యూ లౌమీ నౌ
నౌ ఫర్ ఎవర్  ప్రియా... నన్నే	

పాటకు ప్రాణం పల్లవి ఐతే  
ఓ ఓ ఓ ఓ పల్లవి అయితే
ప్రేమకు ప్రాణం ప్రేయసి కాదా 
ఓ ఓ ఓ ఓ ప్రేయసి కాదా

చరణం: 1
ఓ... వయసాగక నిను కలచిన నను మరచిన 
పదే పదే పరాకులే
ఓ... నీ ఆశలు నీ ధ్యాసలు చిగురించగా 
అదే అదే ఇదాయెలే
ప్రేమించే మనసుందే ప్రేమంటే తెలుసందే
అది ప్రేమించిందో ఏమో నిన్నే ఐ లవ్ యు అంటుందే
నువ్వంటే చాలా ఇష్టం లవ్వుంటే ఎంతో ఇష్టం
ఇన్నాళ్ళూ నాలో నాకే తెలియని ఆనందాలా ప్రేమే ఇష్టం

పాటకు ప్రాణం పల్లవి ఐతే  
ఓ ఓ ఓ ఓ పల్లవి అయితే
ప్రేమకు ప్రాణం ప్రేయసి కాదా 
ఓ ఓ ఓ ఓ ప్రేయసి కాదా

చరణం: 2
ఓ... ఆనుకున్నదే నిజమైనది ఎదురైనది 
ఇలా  ఇలా  ఈ వేళలో
ఓ... అనుకోకులే అలవాటులో పొరపాటుగ
అలా అలా నీ తీరులో
నా వెంటే నీవుంటే నీడల్లే తోడుంటే
పెదవిప్పాలన్నా చెప్పాలన్నా కిస్సే మిస్సౌనేమో
కుట్టిందే తేనెటీగా పుట్టిందే తీపి బెంగా
కిల్లాడి ఈడే ఆడీ పాడీ కోడై కూసిందేమో బాబూ
పాపకు పా పా  పాపప పా పా

పాటకు ప్రాణం పల్లవి ఐతే  
ఓ ఓ ఓ ఓ పల్లవి అయితే
ప్రేమకు ప్రాణం ప్రేమికుడేలే
ఓ ఓ ఓ ఓ ప్రేమికుడేలే

బ బహామ, ఎవరేమనుకున్నా వినదీ ప్రేమా
బ బహామ, ఎదురేమవుతున్నా కనదీ ప్రేమా
బ బహామ, కనులే తెరిచున్నా కల ఈ ప్రేమా
బ బహామ, నిదురే రాకున్నా నిజమో ప్రేమా... 
ఓ... చెలీ... సఖీ... ప్రియా యూ లౌమీ నౌ
నౌ ఫర్ ఎవర్  ప్రియా... నన్నే	

పాటకు ప్రాణం పల్లవి ఐతే  
ఓ ఓ ఓ ఓ పల్లవి అయితే
ప్రేమకు ప్రాణం ప్రేయసి కాదా 
ఓ ఓ ఓ ఓ ప్రేయసి కాదా



స్పోర్టివ్ బోయ్స్ పాట సాహిత్యం

 
చిత్రం: వాసు (2002)
సంగీతం:  హారీస్ జైరాజ్ 
సాహిత్యం: సాహితి
గానం: కె కె (కృష్ణ కుమార్ కున్నత్), స్వర్ణలత , టిప్పు , 

సోనారే... సోనారే... సున్ సున్ సోనారే (2)

కోరస్: సోనారే... ఏ ఓహో... 
సోనారే... ఏయ్... ఏయ్... ఏయ్... ఓహో

స్పోర్టివ్ బోయ్స్ స్పైసీ గాళ్స్ యూతే హేపీనెస్
డాన్సీ గైస్ ఫాన్సీ బేబ్స్ ఎంజాయ్ ఆల్ ది డేస్
స్పోర్టివ్ బోయ్స్ స్పైసీ గాళ్స్ యూతే హేపీనెస్
డాన్సీ గైస్ ఫాన్సీ బేబ్స్ ఎంజాయ్ ఆల్ ది డేస్
మన యూత్ మేధస్సుకు ఆకాశమే సరిహద్దూ
మన జర్నీ ఏనాడు ఆపదు ఏ చెక్ పోస్టూ...

చరణం: 1
రెయిన్బోని సెట్ చేసి వాలిబాల్ ఆడేద్దాం
సూర్యుణ్ణే ఓ స్టైకర్ చేసి కారమ్స్ ఆడేద్దాం
శాటిలైట్ రెక్కలపై తూగుటూయలూగేద్దాం
కోయిలతోనే పోటాపోటీకి కీ బోర్డ్  వాయిద్దాం
మన శక్తికి సాటిలేదని లోకానికి చాటిచెప్పరా
పాకిస్తాన్ బోర్డర్ లో చెడుగుడునే ఆడేయ్ రా
ఐ.రా.స. సభలోనే జనగణమన పాడెయ్ రా
సోనారే...

స్పోర్టివ్ బోయ్స్ స్పైసీ గాళ్స్ యూతే హేపీనెస్
డాన్సీ గైస్ ఫాన్సీ బేబ్స్ ఎంజాయ్ ఆల్ ది డేస్

చరణం: 2
ఓ మామ... ఓ మామ...ఓ మామ  సయ్యె
ఓ మామ... ఓ మామ...ఓ మామ  సయ్యె...ఓయే...
డై సబ్మిట్ పవరెట్టీ డే, నైట్ శ్రమ చేస్తే
ఎవరెస్టయినా మన పాదాల కిందకి వస్తుంది
డేరింగ్ మైండ్ గురిపెట్టి
కెర్ ఫుల్ గా నువు అడుగేస్తే
విక్టరీ తప్పక ఏదో నాడు తలుపే తడుతుంది
మన కండలో బలము ఉన్నది
బుర్రలో యమ తెలివివున్నది
ఈ రెండూ ఒకటైతే ఎదిరింకా ఏముందే 
ఏదైనా సాధిస్తాం ఇదిగో మా చాలెంజ్ 

స్పోర్టివ్ బోయ్స్ స్పైసీ గాళ్స్ యూతే హేపీనెస్
డాన్సీ గైస్ ఫాన్సీ బేబ్స్ ఎంజాయ్ ఆల్ ది డేస్
మన యూత్ మేధస్సుకు ఆకాశమే సరిహద్దూ
మన జర్నీ ఏనాడు ఆపదు ఏ చెక్ పోస్టూ...
స్పోర్టివ్ బోయ్స్ స్పైసీ గాళ్స్ యూతే హేపీనెస్
డాన్సీ గైస్ ఫాన్సీ బేబ్స్ ఎంజాయ్ ఆల్ ది డేస్

సోనారే... ఏయ్... ఏయ్... ఏయ్... ఓహో
సోనారే... ఏయ్... ఏయ్... ఏయ్... ఓహో
సోనారే.... సోనారే....సున్ సున్ సోనారే





పాడనా తీయగా కమ్మని ఒకపాట పాట సాహిత్యం

 
చిత్రం: వాసు (2002)
సంగీతం:  హారీస్ జైరాజ్ 
సాహిత్యం: పోతుల రవికిరణ్ 
గానం: యస్. పి. బాలు

నీ జ్నాపకాలే నన్నే తరిమేనే 
నీ కోసం నేనే పాటై మిగిలానే 
చెలియా  చెలియా ఓ చెలియా 

పాడనా తీయగా కమ్మని ఒకపాట
పాటగా బతకనా మీ అందరినోట
ఆరాధనే అమృత వర్షం అనుకున్నా
ఆవేదనే హాలాహలమై పడుతున్నా 
నా గానమాగదులే ఇక నా గానమాగదులే                               

పాడనా తీయగా కమ్మని ఒకపాట
పాటగా బతకనా మీ అందరినోట

చరణం: 1
గుండెల్లో ప్రేమకే...
గుండెల్లో ప్రేమకే గుడి కట్టేవేళలో
తనువంత పులకింతే
వయసంతా గిలిగింతే
ప్రేమించే ప్రతిమనిషి ఇది పొందే అనుభూతే
అనురాగాల సారం జీవితమనుకుంటే
అనుబంధాల తీరం ఆనందాలుంటే
ప్రతి మనసులో కలిగే భావం ప్రేమేలే 
ప్రతి మనసులో కలిగే భావం ప్రేమేలే 

పాడనా తీయగా కమ్మని ఒకపాట
పాటగా బతకనా మీ అందరినోట

చరణం: 2
ఆకాశం అంచులో... 
ఆకాశం అంచులో  ఆవేశం చేరితే
అభిమానం కలిగెనులే
అపురూపం అయ్యెనులే 
కలనైనా నిజమైనా కనులెదుటే ఉన్నాలే
కలువకు చంద్రుడు దూరం ఓ నేస్తమా 
వెన్నెలకురిసే వేసే ఆ బంధం
ఈ విజయం వెనుక ఉన్నది నీవేలే 
ఈ విజయం వెనుక ఉన్నది నీవేలే 

పాడనా తీయగా కమ్మని ఒకపాట
పాటగా బతకనా మీ అందరినోట
ఆరాధనే అమృత వర్షం అనుకున్నా
ఆవేదనే హాలాహలమై పడుతున్నా 
నా గానమాగదులే ఇక నా గానమాగదులే                        



ఓ ప్రేమా ఓ ప్రేమా ఓ ప్రేమా పాట సాహిత్యం

 
చిత్రం: వాసు (2002)
సంగీతం:  హారీస్ జైరాజ్ 
సాహిత్యం: పోతుల రవికిరణ్ 
గానం: దేవన్ ఏకాంబరం

చుచ్చూరు  చుచ్చూరు చుచ్చూరు  (4)

చిరె చీ చీ, చిరె చీ చీ
ప్రియా ఓహ కనిపించావులే ప్రియా 
చూపించాలి నీవులే  నాపై దయా...
తొలిప్రేమాయలే ప్రియా 
నాలో కంటి పాపకే నీవే లయా
ఎదురైన అందమా ఎదలోని భావమా
మనసైన ముత్యమా సొగసైన రూపమా
పదహారు ప్రాయమా పరువాలు భారమా
అధరాలు మదురమా అరుదైన హృదయమా

ఓహొ హొ 
ఓ ప్రేమా ఓ ప్రేమా ఓ ప్రేమా
ఓ ప్రేమా ఓ ప్రేమా ఓ ప్రేమా 
ఓ ప్రేమా ఓ ప్రేమా ఓ ప్రేమా 
కలలో భామా కలిగే ప్రేమా ప్రియా ఓహ

చుచ్చూరు  చుచ్చూరు చుచ్చూరు  (4)

చిరె చీ చీ, చిరె చీ చీ  ప్రియా...

చరణం: 1
తొలి కలయిక ఒక వరమో
ప్రతి కదలిక కలవరమో
అణువనువున పరిమళమో
అడుగడుగున  పరవశమో
ఏదైనా ఏమైనా నువ్వేలే నా ప్రాణం
ఔనంటూ కాదంటావా
లేదంటూ తోడొస్తావా
నాకోసం ప్రియా ఓహ...

కనిపించావులే ప్రియా 
చూపించాలి నీవులే  నాపై దయా
తొలిప్రేమాయలే ప్రియా 
నాలో కంటి పాపకే నీవే లయా

చరణం: 2
ఎదురుగ నువు నిలబడితే ఎదరసనస మొదలైతే
మదనుడు కధ మొదలెడితే అడుగులు తడబడి పడితే
చిరునామా తెలిసిందే నాప్రేమా ఆహొ విరిసిందే
ఆకాశం అంచుల్లోనే ఆనందం చేరిందేమో
ఊహల్లో ప్రియా... ఓహ...

కనిపించావులే ప్రియా 
చూపించాలి నీవులే  నాపై దయా
తొలిప్రేమాయలే ప్రియా 
నాలో కంటి పాపకే నీవే లయా
ఎదురైన అందమా ఎదలోని భావమా
మనసైన ముత్యమా సొగసైన రూపమా
పదహారు ప్రాయమా పరువాలు భారమా
అధరాలు మదురమా అరుదైన హృదయమా

ఓహొ హొ 
ఓ ప్రేమా ఓ ప్రేమా ఓ ప్రేమా
ఓ ప్రేమా ఓ ప్రేమా ఓ ప్రేమా 
ఓ ప్రేమా ఓ ప్రేమా ఓ ప్రేమా
ఓ ప్రేమా ఓ ప్రేమా ఓ ప్రేమా
కలలో భామా కలిగే ప్రేమా ప్రియా




వాలే వాలే పొద్దులా పాట సాహిత్యం

 
చిత్రం: వాసు (2002)
సంగీతం:  హారీస్ జైరాజ్ 
సాహిత్యం: పోతుల రవికిరణ్ 
గానం: చిత్ర  , కార్తీక్ 

వాలే వాలే పొద్దులా తెగ ముద్దొస్తావే మరదలా
వాలే వాలే పొద్దులా తెగ ముద్దొస్తావే మరదలా
లేనే లేని హద్దులా నను జడిపిస్తావే వరదలా
పుట్టుమచ్చే చూడనా...
పుట్టుమచ్చే చూడనా తొలి ముద్దే దానికి పెట్టనా
పట్టుకుంటే జారనా మరి ముట్టుకుంటే కందనా
మందార బుగ్గల్లో ప్రేమంతా చెప్పిందే....ఓయ్...

వాలే వాలే పొద్దులా తెగ ముద్దొస్తావే మరదలా
లేనే లేని హద్దులా నను జడిపిస్తావే వరదలా

చరణం: 1
ఎన్ని అందాలో ఎన్నెన్ని అందాలో
కౌగిలించి ముద్దులిస్తే కలలా ఉందిలే
ఎన్ని అందాలో ఎన్నెన్ని అందాలో
కౌగిలించి ముద్దులిస్తే కలలా ఉందిలే
ఎన్ని బంధాలో ఎన్నెన్ని బంధాలో
గుండెకేసి హత్తుకుంటే అలలా ఉందిలే
ఇన్నాళ్లు ఈ ప్రేమంతా ఏమయిందిలే
ఇవ్వళే చెప్పేసావు ఎట్టా ఎట్టా ఎట్టెట్టా

వాలే వాలే పొద్దులా తెగ ముద్దొస్తావే మరదలా
లేనే లేని హద్దులా నను జడిపిస్తావే వరదలా
పుట్టుమచ్చే చూడనా...
పుట్టుమచ్చే చూడనా తొలి ముద్దే దానికి పెట్టనా
పట్టుకుంటే జారనా మరి ముట్టుకుంటే కందనా
హోయ్ మందార బుగ్గల్లో ప్రేమంతా చెప్పిందే

చరణం: 2
ఒంపు సొంపుల్తొ ఈ ఒంటి భాదల్తో
చీరంటే నవ్వేస్తుంటే సిగ్గువుతుందిలే....ఏ ఏ  ఏయ్
ఒంపు సొంపుల్తొ ఈ ఒంటి భాదల్తో
చీరంటే నవ్వేస్తుంటే సిగ్గువుతుందిలే....ఏ ఏ  ఏయ్
కంటి సైగల్తో నీ కొంటె చేష్టల్తో
కవ్వించి  రమ్మంటుంటే మతి పోతుందిలే
ఎన్నాళ్ళు మోయాలయ్యె పొంగే పొంగులే
నీ సాయం కావాలయ్యే  ఎట్టా ఎట్టా ఎట్టెట్టా...

వాలే వాలే పొద్దులా తెగ ముద్దొస్తావే మరదలా
లేనే లేని హద్దులా నను జడిపిస్తావే వరదలా
పుట్టుమచ్చే చూడనా...
పుట్టుమచ్చే చూడనా తొలి ముద్దే దానికి పెట్టనా
పట్టుకుంటే జారనా మరి ముట్టుకుంటే కందనా
ఓ మందార బుగ్గల్లో ప్రేమంతా చెప్పిందే

వాలే వాలే పొద్దులా తెగ ముద్దొస్తావే మరదలా
లేనే లేని హద్దులా నను జడిపిస్తావే వరదలా


Palli Balakrishna Saturday, July 29, 2017



చిత్రం: డార్లింగ్ (2010)
సంగీతం: జి.వి.ప్రకాష్‌కుమార్
నటీనటులు: ప్రభాస్, కాజల్ అగర్వాల్, శ్రద్ధాదాస్
దర్శకత్వం: ఏ. కరుణాకరన్
నిర్మాత: బి.వి.యస్.ఎన్. ప్రసాద్
విడుదల తేది: 23.04.2010



Songs List:



హోసహారే... పాట సాహిత్యం

 
చిత్రం: డార్లింగ్ (2010)
సంగీతం: జి.వి.ప్రకాష్‌కుమార్
సాహిత్యం: అనంత శ్రీరామ్
గానం: కె.కె., లేస్లె లెవీస్

హోసహారే... హోసహారే... 
సాధించే సత్తువ ఉన్నది గుండెలలో 
ప్రేమించే మెత్తని మనసుల మూలలలో 
మా పాట అక్షరమొదలక విన్నదో 
ఫైనున్న జాక్సన్ కిందికి దిగుతాడో 
హోసహారే హోసహారే హెయ్.. 

గుండెల్లో నా పాట గిటార్ అయి మోగిందే 
యేయే యాయియే యేహే యాయియే 
చేతుల్లో నా రాత చప్పట్లై చేరిందే 
యేయే యాయియే యేహే యాయియే 

కష్టం నీకు నేస్తమవగా 
విజయం నిన్ను ఇష్టపడదా 
నీ సంగీతం నీ రధం 
ముందుకు సాగుపద 
ప్రెమన్న ఆయుధం తోడుగ ఉంది కదా 
హోసహో హోసహో హోసహారే హోసహో……..రే 

యే దేసం లో ఐన సందేసం మా పాటే 
యేయే యాయియే యేహే యాయియే హె హెయ్ 
యే వేదిక పై ఐన వేడుక రా మా ఆటే 
యేయే యాయియే యేహే హె హె హెయ్ 
నింగి నేల నది మధ్యన 
పొంగే గంగ మా భావన హెయ్ 
పేదిల్ల గొంతులు కలసిన కాలం ఇదే 
పెదాల వేడిని చాటిన వేల ఇదే హే హే హే హే హెయ్ 

హోసహారే... హోసహారే... 
సాధించే సత్తువ ఉన్నది గుండెలలో 
ప్రేమించే మెత్తని మనసుల మూలలలో 
మా పాట అక్షరమొదలక విన్నదో 
ఫైనున్న జాక్సన్ కిందికి దిగుతాడో 
హోసహారే హోసహో హోసహో హోసహో హోసహో 
హోసహారే హోసహో హోసహో హోసహో హోసహో




ఇంకా ఏదో పాట సాహిత్యం

 
చిత్రం: డార్లింగ్ (2010)
సంగీతం: జి.వి.ప్రకాష్‌కుమార్
సాహిత్యం: అనంత శ్రీరామ్
గానం: ప్రశాంతిని, సూరజ్ 

ఇంకా ఏదో ఇంకా ఏదో
ఇదై పోతావే ఇష్టాలే తెలిపేందుకు
సంకెళ్ళతో బంధించకు
ఎదే చేరాలి ఈ రోజే చెలి చెంతకు
తనలో నీ స్వరం వినరో ఈ క్షణం
అనుకుందేదీ నీలోనే నువు దాచకు
నీ మనసే నీకిలా ఆ మగువై నిండుగా
కనిపించాక మౌనాన్నే చూపించకు
ఇంకా ఏదో ఇంకా ఏదో
ఇదై పోతావే ఇష్టాలే తెలిపేందుకు

చరణం: 1
మేఘాల ఒళ్ళోనే ఎదిగిందనీ
జాబిల్లి చల్లేనా జడివాననీ
ముళ్ళపై మేమిలా విచ్చుకున్నామనీ
నీకు పూరేకులే గుచ్చుకోవే మరీ
తీరమే ఓరినా తీరులో మారునా మారదూ ఆ ప్రాణం
ఇంకా ఏదో ఇంకా ఏదో
ఇదై పోతావే ఇష్టాలే తెలిపేందుకు

చరణం: 2
వెళ్ళెళ్ళు చెప్పేసై ఏమవ్వదూ
లోలోన దాగుంటే ప్రేమవ్వదూ
అమృతం పంచడం నేరమే అవదురా
హాయినే పొందడం భారమే అవదురా
హారతే చూపుతూ స్వాగతం చెప్పదా ఇప్పుడే ఆ అందం
ఇంకా ఏదో ఇంకా ఏదో
ఇదై పోతావే ఇష్టాలే తెలిపేందుకు
సంకెళ్ళతో బంధించకు
ఎదే చేరాలి ఈ రోజే చెలి చెంతకు
తనలో నీ స్వరం వినరో ఈ క్షణం
అనుకుందేదీ నీలోనే నువు దాచకు
నీ మనసే నీకిలా ఆ మగువై నిండుగా
కనిపించాక మౌనాన్నే చూపించకు




నీవే నీవే... పాట సాహిత్యం

 
చిత్రం: డార్లింగ్ (2010)
సంగీతం: జి.వి.ప్రకాష్‌కుమార్
సాహిత్యం: అనంత శ్రీరామ్
గానం: జి.వి.ప్రకాష్‌కుమార్

నీవే నీవే... నీవే నీవే...నీవే నీవే... నీవే నీవే...
నీవే నీవే... నీవే నీవే... నీవే నీవే... నీవే నీవే...
ఏదైనా నీ తరువాతే అనిపిస్తుందే ఇలా
ఏమైనా అది నీ వల్లే జరిగుంటుందే ఎలా
ఎదురొస్తూనే ఉన్నావే నేనేదారిలో వేళ్తున్నా
కదిలిస్తూనే ఉన్నావే నేనేకాంతంలో ఉన్నా
మరిపిస్తూనే ఉంటావే నాకేమేం గుర్తొస్తున్నా
మురిపిస్తూనే ఉంటావే నా ముందే నువు లేకున్నా
నీవే నీవే... నీవే నీవే... నీవే నీవే... నీవే నీవే...
నీవే నీవే... నీవే నీవే... నీవే నీవే... నీవే నీవే...

చరణం: 1
ఒక నిమిషములోన సంతోషం
ఒక నిమిషములోన సందేహం
నిదురన కూడ హే... నీ ధ్యానం
వదలదు నన్నే హో... నీ రూపం
ఆలోచిస్తూ పిచ్చోణ్ణయ్యా నేనే... చెలియా...
ఎదురొస్తూనే ఉన్నావే నేనేదారిలో వేళ్తున్నా
కదిలిస్తూనే ఉన్నావే నేనేకాంతంలో ఉన్నా
మరిపిస్తూనే ఉంటావే నాకేమేం గుర్తొస్తున్నా
మురిపిస్తూనే ఉంటావే నా ముందే నువు లేకున్నా
నీవే నీవే... నీవే నీవే... నీవే నీవే... నీవే నీవే...
నీవే నీవే... నీవే నీవే... నీవే నీవే...

చరణం: 2
నడకలు సాగేది నీ వైపే
పలుకులు ఆగింది నీ వల్లే
ఎవరికి చెబుతున్నా నీ ఊసే
చివరికి నేనయ్యా నీలానే
చుట్టూ అంతా తిట్టేస్తున్నా నేనే... విననే
ఎదురొస్తూనే ఉన్నావే నేనేదారిలో వేళ్తున్నా
కదిలిస్తూనే ఉన్నావే నేనేకాంతంలో ఉన్నా
మరిపిస్తూనే ఉంటావే నాకేమేం గుర్తొస్తున్నా
మురిపిస్తూనే ఉంటావే నా ముందే నువు లేకున్నా
నీవే నీవే... నీవే నీవే... నీవే నీవే... నీవే నీవే...
నీవే నీవే... నీవే నీవే... నీవే నీవే... నీవే నీవే...
ఏదైనా నీ తరువాతే అనిపిస్తుందే ఇలా
ఏమైనా అది నీ వల్లే జరిగుంటుందే ఎలా





ఎ బుల్లే నా తింగరి బుల్లే పాట సాహిత్యం

 
చిత్రం: డార్లింగ్ (2010)
సంగీతం: జి.వి.ప్రకాష్‌కుమార్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: మల్లికార్జున్ ,  ప్రియా హిమేశ్ 

హే సనా నానా నా నా
హే తనా నానా నా నా

ఎ బుల్లే నా తింగరి బుల్లే
మల్లే నా బంగారుమల్లే
దిల్లే గుల్ గోలైందే నీవల్లే
ఎ బుల్లే నా తింగరి బుల్లే
మల్లే నా బంగారుమల్లే
లే లే నా లేత కాలం నీవల్లే
నీ యెనకోచ్చేసాలే
నీ నిగ నిగ నచ్చాసాలే
నీ మెరుపుకు పడిసచ్చాలే ఇలా కిల్లా
అరే పడి పడి మనసిచ్చాలే
నీ కథకు మలుపిచ్చాలే
నీ కలలకు కలలిచ్చాలే
నిన్నే నువ్వు మెచ్చేలా 
యె బళ్ళే బళ్ళే లే లే
బేబీ పట్నం నాదేలే
బళ్ళే బళ్ళే లే లే భారీ కట్నం నువ్వేలే
బళ్ళే బళ్ళే లే లే బేబీ పట్నం నాదేలే
బళ్ళే బళ్ళే లే లే భారీ కట్నం నువ్వేలే
ఎ బుల్లే నా తింగరి బుల్లే
మల్లే నా బంగారుమల్లే
దిల్లే గుల్ గోలైందే నీవల్లే
ఎ బుల్లే నా తింగరి బుల్లే
మల్లే నా బంగారుమల్లే
లే లే నా లేత కాలం నీవల్లే

వో రుక్కమ్మో, ఏం కిక్కమ్మో
వోళ్ళంతా నీలో వరహాలే
ఒక్కోక్కటీ నే లేక్కేదాటలే
అన్నీ నీవేలే, ఆజా అన్నాలే
ఆవురావురుమన్నావే ఆదా తోడై ఉంటాలే
నీ వయసుకు వయసుకు వొంపులవల్లే
నీ సొగసుకు అత్తరు జల్లే
నీ కులుకుల మెలికల్లోనే మెలిపడిపోతాలే
ఎ బుల్లే నా తింగరి బుల్లే
మల్లే నా బంగారుమల్లే
దిల్లే గుల్ గోలైందే నీవల్లే
ఎ బుల్లే నా తింగరి బుల్లే
మల్లే నా బంగారుమల్లే
లే లే నా లేత కాలం నీవల్లే

నా లెక్కల్లో, ఆ చుక్కల్లో
నువ్వంటే జిగి జిగి జాబిల్లీ
నీ తళుకే తళ తళ కిరణాలే
యేసెయ్ పగ్గాలే,పెట్టేయ్ లగ్గాలే
తమలపాకులు చుడతాలే
తాంబూలానై పోతాలే
నీ కిరి కిరి కథకలి గిల్లీ
జర గరమై చలరేగేనా
నరనరమున చేరమయ్యెనా
ఎమమ్మో గోదారె హే హే హే
బుల్లే నా తింగరి బుల్లే
మల్లే నా బంగారుమల్లే
దిల్లే గుల్ గోలైందే నీవల్లే
ఎ బుల్లే నా తింగరి బుల్లే
మల్లే నా బంగారుమల్లే
లే లే నా లేత కాలం నీవల్లే
నీ యెనకోచ్చేసాలే
నీ నిగ నిగ నాచ్చేసాలే
నీ మెరుపుకు పడిసచ్చాలే ఇలా కిల్లా
అరే పడి పడి మనసిచ్చాలే
నీ కథకు మలుపిచ్చాలే
నీ కలలకు కలలిచ్చాలే
నిన్నే నువ్వు మెచ్చేలా 
యె బళ్ళే బళ్ళే లే లే
బేబీ పట్నం నాదేలే
బళ్ళే బళ్ళే లే లే భారీ కట్నం నువ్వేలే
బళ్ళే బళ్ళే లే లే బేబీ పట్నం నాదేలే
బళ్ళే బళ్ళే లే లే భారీ కట్నం నువ్వేలే




ప్రాణమా ప్రాణమా... పాట సాహిత్యం

 
చిత్రం: డార్లింగ్ (2010)
సంగీతం: జి.వి.ప్రకాష్‌కుమార్
సాహిత్యం: అనంత శ్రీరామ్
గానం: రాహుల్ నంబియార్, బృందం

తాననాననానా... (2)
ప్రాణమా ప్రాణమా...
అరే సంద్రంలాగా పొంగావే ఈరోజున
సిరి వర్షం లాగా కురిశావే ఎద చాటున
చూపులతో ఏం చెప్పావే అంతగా
ఊపిరితో ముడిపెట్ట్టావే వింతగా

చరణం: 1
తాననాననానా...
నిన్నా మొన్నా లేని సంతోషాల బాణీ
వింటున్నానే మెల్లగా ఈ చోట
చిన్నా పెద్దా చేరి చూస్తూ ఉన్నా గానీ
ఆగేలాగ లేదిక నీ ఆట
దూరాన్ని దూరంగా తోశావే మౌనంగా
ప్రాయాలు పులకించు ఈ మలుపులో

ప్రాణమా ప్రాణమా...
అరే సంద్రంలాగా పొంగావేఈరోజున
సిరి వర్షంలాగా కురిశావేఎద చాటున


సపమప గమగా... (4)
నిదని పదమపా
సపమప గమగా... (2)
నిదని పదమపా
గమపని సాసానిరీ
సాసానిరీ నీదా సనీదా
సని సాసాని మరి సాసా
నిసరి నీద పమ దమారి మరినిరి

చరణం: 2
తాననాననానా...
గిల్లీక జ్జాలన్నీ మళ్లీ గుర్తొచ్చేలా
గడిచాయమ్మా రోజులు హాయి హాయిగా
ఎన్నాళ్లైనా గానీ ఎపుడూ గుర్తుండేలా
నిలిచాయమ్మా నవ్వులు తియతియ్యగా హో...
ఈ జన్మలోనైనా ఏ జన్మలోనైనా
తన జంటగా నన్ను నడిపించగా
ప్రాణమా ప్రాణమా...ప్రాణమా....
ప్రాణమా ప్రాణమా...అరే సంద్రంలాగా పొంగావే ఈరోజున
సిరి వర్షంలాగా కురిశావేఎద చాటున
చూపులతో ఏం చెప్పావే అంతగా
ఊపిరితో ముడిపెట్ట్టావే వింతగా




ఆకాశం కన్నా పైనా పాట సాహిత్యం

 
చిత్రం: డార్లింగ్ (2010)
సంగీతం: జి.వి.ప్రకాష్‌కుమార్
సాహిత్యం: అనంత శ్రీరామ్
గానం: బెన్నీ దయాల్ 

ఘుమ్ ఘుమ్ యె యొ
ఘుమ్ ఘుమ్ యె యొ (4)

ఆకాశం కన్నా పైనా
నక్షత్రాలుంటాయంటా ఐతే ఎంటంటా
నేనే చెప్పేస్తా రాలాలంటా అంటా

ఘుమ్ ఘుమ్ యె యొ
ఘుమ్ ఘుమ్ యె యొ (6)

ఎవదేవా దేవా దేమవుతాదో
ఎమవుతాదో ఎమో
ఎవడెవడికి ఎవడికి
ఎదురవుతాదో ఎదురవుతాదో ఎమో
నీదే నీకు ఈడు తోడే
నేస్తమనుకుంటే ఆగిపోదు సందడే
ఇవ్వాలంతా నవ్వేవాడేలే అది మొనగాడే

ఘుమ్ ఘుమ్ యె యొ
ఘుమ్ ఘుమ్ యె యొ (4)


నిజమవదని కలగనకుండా
కలగనకుండా ఉంటే
నిదురలో ఆ సంతోషాన్నే 
మిస్ ఐపోతావ్ అంతే హో
తేది మారితే ఎదీ మారదోయ్
నీలా నువ్వు ఉన్నావంటే
ఆవారాగా తిరగడం వో
అదృష్టం అంతే యె..

ఘుమ్ ఘుమ్ యె యొ
ఘుమ్ ఘుమ్ యె యొ (4)

ఆకాశం కన్నా పైనా
నక్షత్రాలుంటాయంటా ఐతే ఎంటంటా
నేనే చెప్పేస్తా రాలాలంటా అంటా


Palli Balakrishna Monday, July 3, 2017

Most Recent

Default