Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Classmates (2007)చిత్రం: క్లాస్ మేట్స్  (2007)
సంగీతం: కోటి
సాహిత్యం: సిరివెన్నెల
గానం: మల్లికార్జున, అంజనా సౌమ్య
నటీనటులు: సుమంత్, రవివర్మ, శర్వానంద్, సదా, కమిలిని ముఖర్జీ
దర్శకత్వం: కె.విజయభాస్కర్
నిర్మాత: స్రవంతి రవికిశోర్
విడుదల తేది: 20.04.2007

గుండెచాటుగా ఇన్నినాళ్ళుగా ఉన్న ఊహలన్నీ
ఉన్నపాటుగా హంసలేఖలై ఎగిరి వెళ్ళిపోనీ - నిన్ను కలుసుకోనీ
నిన్ను కలుసుకోనీ విన్నవించుకోనీ ఇన్నాళ్ళ ఊసులన్నీ

నీలిమబ్బులో నిలచిపోకలా నింగి రాగమాల
మేలిముసుగులో మెరుపుతీగలా దాగి ఉండనేల
కొమ్మ కొమ్మలో పూలుగా దివిలోని వర్ణాలు వాలగ
ఇలకు రమ్మని చినుకుచెమ్మని చెలిమి కోరుకోనీ - నిన్ను కలుసుకోనీ

రేయిదాటని రాణివాసమా అందరాని తార
నన్నుచేరగ దారిచూపనా రెండు చేతులార
చెదిరిపోని చిరునవ్వుగా నా పెదవిపైన చిందాడగ
తరలిరమ్మని తళుకులిమ్మని తలపు తెలుపుకోనీ - నిన్ను కలుసుకోనీ


********   *********   ********


చిత్రం: క్లాస్ మేట్స్  (2007)
సంగీతం: కోటి
సాహిత్యం: సిరివెన్నెల
గానం: చైత్ర , హేమచంద్ర

మౌనమెందుకు మాటాడవెందుకు
దూరమెందుకు దరిచేరవెందుకు
ఎదమారుమూల దాగివున్నమాట దాచి ఉంచకు
ఎదురైన వేళ అదుపుదాటి చేరవెందుకు

అంత బిగువా మెట్టుదిగవా ఎంత ఇష్టం ఉన్నా పైకి చెప్పవా
ఇంత తెగువా మాటవినవా కొంత కష్టమైనా కాస్త ఆగవా
మది నాకు చెప్పకుండ నీ వెంట పడ్డది
మన చేతిలోన ఉంద ఈ ప్రేమ పద్ధతి
తప్పేమి ఉన్నది నిజమొప్పుకొందుకు
దారేమి ఉన్నది నిను తప్పుకొందుకు

నందకిషోరా నవనీతచోరా నవమన్మదాధారా రారా నన్నేలుకోవేరా
చెయ్యందుకోరా శృంగారశూరా చేరంగరావేరా కృష్ణా చెట్టెక్కిదిగవేరా

రెచ్చగొట్టినా నవ్వుతున్నదే మత్తు కమ్మేసిందా కన్నెమనసుని
ఎంత కుట్టినా కెవ్వుమనదే పువ్వు పొమ్మంటుందా తేనెటీగని
నిను చూడకుంటె ప్రాణం ఇక నిలువనన్నది
పదునైన పూలబాణం నను తాకుతున్నది
దారేమి ఉన్నది నిను తప్పుకొందుకు
తప్పేమి ఉన్నది నిజమొప్పుకొందుకు


********   *********   ********


చిత్రం: క్లాస్ మేట్స్  (2007)
సంగీతం: కోటి
సాహిత్యం: సిరివెన్నెల
గానం: హేమచంద్ర

భూగోళంతో బంతాట ఆడాలంది మన పాదం
పూబాణంలా అందాలే వేటాడాలంది ప్రాయం
పడిలేస్తూ మనవెనకాలే తడబడిపోతుంటే కాలం
ఆనందోబ్రహ్మ అంది మన వేగం

కథలోకింక అద్భుతం ఎదురయేదాక వెతుకుదాం
పదమందీ నవయవ్వనంలో పసితనం
దొరుకుతుందా అది అడగదే మన నమ్మకం
కలనైనా తరిమేగుణం మన లక్షణం
నిజమైనా కలలాంటిదే మనకీక్షణం

అదుపులోలేని పరుగులం రసతరంగాన ఉరుములం
మనకింకా తెలియదు కద భయమన్నది
పిల్లగాలై ఎదురేగుదాం గగనానికి
ఎగరేద్దాం చిరునవ్వుని నలువైపులా
స్వాగతిస్తాం స్వర్గాలనే మనవైపిలా

Most Recent

Default