Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Kondaveeti Raja (1986)





చిత్రం: కొండవీటి రాజా (1986)
సంగీతం: కె.చక్రవర్తి
నటీనటులు: చిరంజీవి , విజయశాంతి, రాధ
దర్శకత్వం: కె.రాఘవేంద్రరావు
నిర్మాత: దేవి వర ప్రసాద్
విడుదల తేది: 31.01.1986



Songs List:



అంగాంగ వీరంగమే పాట సాహిత్యం

 
చిత్రం: కొండవీటి రాజా (1986)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: 
గానం: యస్.పి.బాలు, జానకి

అంగాంగ వీరంగమే 




కొమ్మలకి కోయిలకి పాట సాహిత్యం

 
చిత్రం: కొండవీటి రాజా (1986)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: 
గానం: యస్.పి.బాలు, సుశీల 

కొమ్మలకి కోయిలకి పాటలకి పల్లవికి
కొమ్మ కోన సందిట్లోన పెళ్ళి
రాగలన్ని కత్నాలంట తాళలన్ని మేళాలంట
ముద్దు ముద్దు పండె వేల తాంభులాలంటా
కొమ్మలకి కోయిలకి పాటలకి పల్లవికి
కొమ్మ కోన సందిట్లోన పెళ్ళి
బంతి పువ్వు బాజాలంట మంచి గంధం మర్యాదంట
ప్రేమ ప్రేమ కలిసె జంట పేరంటాలంట

గోరు వెచ్చ యిడొచ్చింది గోరింటకుల్లో
ఆకుపచ్చ తోడిస్తావ వెలుగు నీడల్లో
బుగ్గ చుక్కె నాకు పుట్టు మచ్చ
వాలు చూపె నాకు వేగు చుక్క
గజుల్తొ దీవించు ముందె తిని
జాజులతొ ఒడించు ప్రతి రాత్రిని
పెరాలలొ గులాబిలె విచ్చె వేలల్లో
నరాలలొ చలి స్వరం వచ్చె వేలల్లో

వెన్నెలంత నిండాలంట వెండి మట్టెల్లో
పొద్దులన్ని పండాలంట పెట్టె బుట్టల్లో
కాలికెస్తే ఏడు అదుగులంటా
వేలికేస్తే వేయి జన్మలంట
పల్లకిలో తలవంచె వయ్యారము
పానుపులొ తల యెత్తె శ్రుంగారము
క్షనాలకై యుగాలనె దాతె వేలల్లో
సగం సగం సరాగమె సాగె వేలల్లో

కొమ్మలకి కోయిలకి పాటలకి పల్లవికి
కొమ్మ కోన సందిట్లోన పెళ్ళి
బంతి పువ్వు బాజాలంటట్లోన పెళ్ళి
తాళలన్ని మేళాలంట
ప్రేమ ప్రేమ కలిసె జంట పేరంటాలంట




మంచమేసి దుప్పటేసి పాట సాహిత్యం

 
చిత్రం: కొండవీటి రాజా (1986)
సంగీతం: చక్రవర్తి
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, సుశీల 

పల్లవి :
తననం తననం తననం తననం... తననం తననం తా
తననం తననం తననం తననం... తననం తననం తా

మంచమేసి దుప్పటేసి మల్లెపూలు జల్లాను రారా రారా.. తనన తననం
చిన్నచీర కట్టాను సన్నజాజు లెట్టాను రారా రారా.. 
తనన తననం
దిండు ఎంత మెత్తనో మంచ మెంత గట్టిదో
చుక్కలోంక చూసుకుంటూ లెక్కబెట్టుకుందాము రారా
ఆకలేసి దప్పికేసి అందమంటూ వచ్చాను రావే రావే... తనన తననం... 
ఆకులోన సున్నవేసి పోకచెక్కలిస్తాను రావే రావే... తనన తననం
పండు ఎంత తీయనో పాలు ఎంత చిక్కనో
సోకులోంక చూసుకుంటూ సొమ్మసిల్లిపోదాము రావే

చరణం: 1
నిన్ను చూడకుంటే నాకు పిచ్చిగుంటది...తనన తననం..
నిన్ను చూస్తే వయసు నన్ను మెచ్చుకుంటది ...తనన తననం...
కౌగిలింత కోరలేక అలిసిపోతిని
రాతిరంత కునుకులేక రగిలిపోతిని
కసి కసి ఈడు కమ్ముకొస్తే ... కంటిని రెప్పే కాటు వేస్తే
ఎట్టా ఆగను చలిలో విరులు ... ఎట్టా అడగను అసలు కొసరు
సాగాలి ... నీ జోరు

ఆకలేసి దప్పికేసి అన్నమంటూ వచ్చాను రావే రావే
మంచమేసి దుప్పటేసి మల్లెపూలు జల్లాను రారా.. రారా

చరణం: 2
పెరుగుతున్న సోకుమీద మీగడున్నది... తనన తననం...
పెదవి తాకి ముద్దులాగ మారుతున్నది... తనన తననం..
చీకటింట చిట్టిగుండె కొట్టుకున్నది
వాలుకంట వలపుమంట అంటుకున్నది
జళ్ళో పువ్వు జావళి పాడే ....ఒళ్ళో ఒళ్ళో ఒత్తిడి సాగే
ఎంత తీరినా ఎదలో సొదలే ...వింతవింతగా జరిగే కతలే
మోగాలి....  తొలితాళం 

మంచమేసి దుప్పటేసి మల్లెపూలు జల్లాను రారా రారా.. తనన తననం..
ఆకులోన సున్నవేసి పోకచెక్కలిస్తాను రావే రావే.. తనన తననం..

దిండు ఎంత మెత్తనో మంచమెంత గట్టిదో
సోకులోంక చూసుకుంటూ సొమ్మసిల్లిపోదాము రావే

తననం తననం తననం తననం... తననం తననం తా
తననం తననం తననం తననం... తననం తననం తా




నా కోక బాగుందా.. పాట సాహిత్యం

 
చిత్రం: కొండవీటి రాజా (1986)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, సుశీల 

పల్లవి:
నా కోక బాగుందా...  హోయ్..హోయ్..హోయ్
నా రైక బాగుందా... హోయ్..హోయ్..హోయ్
నా కోక బాగుందా.. నా రైక బాగుందా
కోకారైకా కలిసిన వంటి సోకు బాగుందా

నీ కోక నచ్చింది... హోయ్..హోయ్..హోయ్
నీ రైక నచ్చింది... ఆ.. ఆ.. ఆ
నీ కోక నచ్చింది... నీ రైక నచ్చింది
కోకా రైకా కలవని చోట  సోకు నచ్చింది

నా కోక బాగుందా.. నా రైక బాగుందా

చరణం: 1
చెయ్యెస్తే చెదిరే కోకా... కన్నేస్తే బిగిసే రైకా
ఆ పైన ఏమౌతుందో అంటుకోకా... 
నీ సోకే నెయ్యని కోకా... నీ సిగ్గే తొడగని రైకా
ముద్దంటా మూటలు కట్టి దాచుకోకా
ఈ ప్రేమ తందనాలలో... ఓ.. ఓ..ఈ జంట బంధనాలలో... ఓ.. ఓ..చుట్టాలై చూపు చూపు... చుక్కాడే రేపు మాపు
మాపట్లో మావిడి పిందె ఇవ్వమాకా

డరిడారిడరిడా... లాలాలలాలాలా
కోకా రైకా కలవని చోట  సోకు నచ్చింది

చరణం: 2
ఇరుకుల్లో నీ వయ్యారాం... నడకల్లో జడకోలాటం
చాన్నాల్లీ ఆరాటాలు పెంచుకోకా
కళ్ళల్లో కసి ఉబలాటం... కవ్వించే నీ చెలగాటం
ఈ చాటు పేరంటాలు ఆడుకోకా
నీ తీపి సోయగాలలో.. నీ వంతు కానీదేమిటో
వాటెస్తా వొళ్ళు వొళ్ళు.. వేసేస్తే మూడే ముళ్లు
కౌగిట్లో గుప్పెడు మనసు గుంజుకుంటా

నా కోక బాగుందా...  హోయ్..హోయ్..హోయ్
నా రైక బాగుందా... హోయ్..హోయ్..హోయ్
నా కోక బాగుందా.. నా రైక బాగుందా
కోకారైకా కలిసిన వంటి సోకు బాగుందా

నీ కోక నచ్చింది... హోయ్..హోయ్..హోయ్
నీ రైక నచ్చింది... ఆ.. ఆ.. ఆ
నీ కోక నచ్చింది... నీ రైక నచ్చింది
కోకా రైకా కలవని చోట  సోకు నచ్చింది

నా కోక బాగుందా.. నా రైక బాగుందా



ఊరికంత నీటుగాడు పాట సాహిత్యం

 
చిత్రం: కొండవీటి రాజా (1986)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: 
గానం: యస్.పి.బాలు, సుశీల 

ఊరికంత నీటుగాడు 




యాల యాల పాట సాహిత్యం

 
చిత్రం: కొండవీటి రాజా (1986)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: 
గానం: యస్.పి.బాలు, సుశీల 

యాల యాల 

Most Recent

Default