Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Life Is Beautiful (2012)




చిత్రం: లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్  (2012)
సంగీతం: మిక్కీ జే మేయర్
నటీనటులు: శ్రేయ శరన్, అంజలీ జవేరి, అమలా అక్కినేని, అబిజిత్, కౌశిక్, విజయ్ దేవర కొండ, శ్రీవిష్ణు
దర్శకత్వం: శేఖర్ కమ్ముల
నిర్మాత: శేఖర్ కమ్ముల
విడుదల తేది: 14.09.2012



Songs List:



లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ పాట సాహిత్యం

 
చిత్రం: లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్  (2012)
సంగీతం: మిక్కీ జే మేయర్
సాహిత్యం: అనంత్ శ్రీరామ్
గానం: కె.కె.

పల్లవి :
అహ అహ అది ఒక ఉదయం
ఆశలను తడిమిన సమయం
ఆ క్షణమే పిలిచెను హృదయం
లే అని లేలే అని...
జిల్లుమని చల్లని పవనం
ఆ వెనకే వెచ్చని కిరణం
అందరిని తరిమెను త్వరగా
రమ్మని రా రమ్మని
వేకువే వేచిన వేళలో
లోకమే కోకిలై పాడుతుంది
లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ (8)

చరణం: 1
రోజంతా అంతా చేరి సాగించేటి
చిలిపి చిందులు కొంటె చేష్టలు
పెద్ద్దోళ్లే ఇంటా బయటా
మాపై విసిరే చిన్ని విసురులు
కొన్ని కసురులు
ఎండైనా వానైనా ఏం తేడాలేదు
ఆగవండి మా కుప్పిగంతులు
కోరికలు నవ్వులు బాధలు
సందడులు సంతోషాలు
పంచుకోమన్నది
ఈ అల్లరి అల్లరి అల్లరి జీవితం
లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ (8)

చరణం: 2
సాయంత్రం అయితే చాలు
చిన్నా పెద్దా రోడ్డు మీదనే
హస్కు వేయడం
దీవాలీ హోలీ క్రిస్టమస్ తేడా లే దు
పండగంటే పందిళ్లు వేయటం
ధర్నాలు రాస్తారోకోలెన్నవుతున్నా
మమ్ము చేరనేలేదు ఏ క్షణం
మా ప్రపంచం ఇది మాదిది
ఎన్నడూ మాకే సొంతం
సాగిపోతున్నది
ఈ రంగుల రంగుల
రంగుల జీవితం
లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ (8)




Beautiful Girl... పాట సాహిత్యం

 
చిత్రం: లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్  (2012)
సంగీతం: మిక్కీ జే మేయర్
సాహిత్యం: వనమాలి
గానం: కార్తిక్

పల్లవి :
Beautiful smile... beautiful face
Beautiful eyes... you're nothing but grace
Beautiful you... I look amazed
what is your name... what is your name
ఏముందో నవ్వే కన్నుల్లో....ఏముందో ఆ పెదవంచుల్లో
ఏముందో లాగే ఒంపుల్లో...ఏముందో మీ అమ్మాయిల్లో
ఏమౌతుందో ఏమో ఇంతందం చూస్తుంటే
వారిస్తున్నా వింటుందా వయసే నా మాటే
తప్పేదైనా జరిగే వీలుందే నీ వెన్నంటే ఉంటే...
॥Beautiful smile॥॥

చరణం: 1
ఎదనే కొరికే చూపందం... అలకే అందం
మనసే తెలిపే మాటందం
ప్రతీది అందం... జగమే కననీ అందం
తన జతలో చెలిమే ఆనందం

చరణం: 2
మెరుపై కదిలే మేనందం... నడకే అందం
నలిగే నడుమే ఓ అందం... పలుకే అందం
మగువే అందం కాదా
మది తనకే వశమైపోదా




అటు ఇటు ఊగుతూ పాట సాహిత్యం

 
చిత్రం: లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్  (2012)
సంగీతం: మిక్కీ జే మేయర్
సాహిత్యం: అనంత్ శ్రీరామ్
గానం: శ్రీరామచంద్ర

అటు ఇటు ఊగుతూ అలజడి రేపుతూ
తికమక పెంచుతోంది మనసుకేమయింది
చకచక దూకుతూ తడబడి తుళ్లుతూ
తలపుని తరుముతోంది వయసుకేమయింది
నీ వలనే ఇదిలా మొదలయిందే
నా మాటే వినదే... ప్రేమా... ఏ?
నా ప్రాణం తింటావు నిన్నే తలచే వరకు
ప్రేమా... ఏ?
నా వెంటే ఉంటావు..నీలా మారే వరకు

చరణం: 1
జాబిలికి జలుబును తెచ్చే చలువ నీవే
సూర్యుడికి చెమటలు పట్టే వేడి నీదే
మేఘముని మెలికలు తిప్పే మెరుపు నీవే
కాలముని కలలతో నింపే కథవి నీవే
మౌనం నీ భాషయితే చిరునవ్వే కవితౌతుందే
నీ కనుల కావ్యాన్నే చదివేయమన్నదే
నీ వలనే ఇదిలా ఔతోందే

చరణం: 2
మాములుగా అనిపిస్తుందే నువ్వు వస్తే
మాయమని తెలిసొస్తుందే లోతు చూస్తే
మంటవలె వెలుగిస్తావే దూరముంటే
మంచువలె లాలిస్తావే చేరువైతే
విరబూసే పువ్వైనా మరునాడే చూస్తది అందం
నువ్వు పూస్తే నూరేళ్లూ విరిసేను జీవితం
నీ వలనే ఇదిలా జరిగిందే





ఇట్స్ యువర్ లవ్ పాట సాహిత్యం

 
చిత్రం: లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్  (2012)
సంగీతం: మిక్కీ జే మేయర్
సాహిత్యం: అనంత్ శ్రీరామ్
గానం: నరేష్ అయ్యర్

ఓ ఓ...ఓ ఓ...
ఏమిటో ఏమిటో ఏమిటో..మెల్లగా లాగుతోంది ఏదో
కంటితో చూడలేనంత సన్న తీగతో
ఏమిటో ఏమిటో ఏమిటో...ముందుకే తోస్తుంది ఏదో
పువ్వుకీ తేనెకీ పుట్టినా పెదాలతో
నా గుండె లోన చక్కిలెందుకో
ఇన్ని వింతలకు కారణం మరేమిటో... ఓ...
ఇట్స్ యువర్ లవ్... ఇట్స్ యువర్ లవ్...
ఇట్స్ యువర్ లవ్ ఆ ఆ... ఓ ఓ...
ఇట్స్ యువర్ లవ్... ఇట్స్ యువర్ లవ్...
ఇట్స్ యువర్ లవ్ ఆ ఆ... ఓ ఓ...

చరణం: 1
రివ్వున రాయె... రివ్వున రాయె...
రివ్వున రివ్వున రాయె రెక్కలు ఎత్తి సీతాకోకా
పువ్వుకి తొందరగుందే తేనెల భారం పెరిగాక
గుట్టుగా సప్పుడు సేయకా .... ఓ...
గుట్టుగా సప్పుడు సేయకా .. దాక్కొని పోకే వానా సినుకా
మట్టిలో ఒంటిగవుందే సిన్నారి మొలక
నే తన చెంత... ఓ క్షణమైనా...
నడకే సంబరంగా గడికో సందడేగా
బ్రతుకే పండగేగా కొడిగట్టని దివ్వెలుగా
ఇట్స్ యువర్ లవ్... ఇట్స్ యువర్ లవ్...
ఇట్స్ యువర్ లవ్ ఆ ఆ... ఓ ఓ...

న న న న నాననన

చరణం: 2
ఎన్నెలా ఎన్నెల ఎండి ఎన్నెలా ఎండ ఎందుకంటా
గుండెలో ఉన్నట్టుండి యవ్వనమేదో ఎలిగిందా
మబ్బులో దిక్కులో నింగి సుక్కలో లేని ఇంత
కొత్తగా కంటికి అలా వచ్చే ఎలుగంతా
నా హృదయాన ఈ అదురేంటో
మురిపించేది ఎవరో... మరిపించేది ఎవరో...
కదిలించేది ఎవరో... నులివెచ్చని అల్లరితో

నా గుండె లోన చక్కిలెందుకో
ఇన్ని వింతలకు కారణం మరేమిటో... ఓ...

ఇట్స్ యువర్ లవ్... ఇట్స్ యువర్ లవ్...
ఇట్స్ యువర్ లవ్ ఆ ఆ... ఓ ఓ...

ఇట్స్ యువర్ లవ్... ఇట్స్ యువర్ లవ్...



అమ్మా అని కొత్తగా.. పాట సాహిత్యం

 
చిత్రం: లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్  (2012)
సంగీతం: మిక్కీ జే మేయర్
సాహిత్యం: వనమాలి
గానం: శశి కిరణ్ , శ్రావణ భార్గవి

అమ్మా అని కొత్తగా.. మళ్ళీ పిలవాలనీ
తుళ్ళే పసి ప్రాయమే.. మళ్ళీ మొదలవ్వనీ
నింగీ నేలా నిలిచేదాకా తోడుగా
వీచే గాలి వెలిగే తారల సాక్షిగా
నువు కావాలే అమ్మా
నను వీడొద్దే అమ్మా
బంగారం నువ్వమ్మా
అమ్మా అని కొత్తగా.. మళ్ళీ పిలవాలనీ
తుళ్ళే పసి ప్రాయమే.. మళ్ళీ మొదలవ్వనీ

నిదురలో నీ కల చూసి తుళ్ళి పడిన ఎదకీ
ఏ క్షణం ఎదురవుతావొ జోల పాటవై
ఆకలని అడగక ముందే నోటిముద్ద నువ్వై
ఏ కథలు వినిపిస్తావొ జాబిలమ్మవై
నింగీ నేలా నిలిచేదాకా తోడుగా
వీచే గాలి వెలిగే తారల సాక్షిగా
నువు కావాలే అమ్మా
నను వీడొద్దే అమ్మా
బంగారం నువ్వమ్మా

చిన్ని చిన్ని తగవులె మాకు లోకమైన వేళా
నీ వెతలు మనసెపుడైన పోల్చుకున్నదా

రెప్పలా కాచిన నీకు కంటి నలుసు లాగా
వేదనలు పంచిన మాకు వేకువున్నదా
నింగీ నేలా నిలిచేదాకా తోడుగా
వీచే గాలి వెలిగే తారల సాక్షిగా
నువు కావాలే అమ్మా
నను వీడొద్దే అమ్మా
బంగారం నువ్వమ్మా

నీకు పసిపాపలమేగ ఎంత ఎదుగుతున్నా
జాలిపడి మాజతలోనే ఉండిపో ఇకా
ఆఖరికి దేవుడికైనా అమ్మ మనసు ఉంటే
నీకు తన బదులుగ కొత్త జన్మ నివ్వడా
నింగీ నేలా నిలిచేదాకా తోడుగా
వీచే గాలి వెలిగే తారల సాక్షిగా
నువు కావాలే అమ్మా
నను వీడొద్దే అమ్మా
బంగారం నువ్వమ్మా

Most Recent

Default