Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Jalsa (2008)

చిత్రం: జల్సా (2008)
సంగీతం: దేవీ శ్రీ ప్రసాద్
నటీనటులు: పవన్ కళ్యాణ్, ఇలియానా, పార్వతి మెల్టన్
దర్శకత్వం: త్రివిక్రమ్ శ్రీనివాస్
నిర్మాత: అల్లు అరవింద్
విడుదల తేది: 02.04.2008Songs List:కరో కరో జర జల్సా పాట సాహిత్యం

 
చిత్రం: జల్సా (2008)
సంగీతం: దేవీ శ్రీ ప్రసాద్
సాహిత్యం: సిరి వెన్నెల
గానం: బాబా సెహగల్ ,  రీటా 

సరిగమపదనిస అరె కరో కరో జర జల్సా స జల్సా
సనిదపమగరిస అరె కరో కరో జర జల్సా స జల్సా
తెల్సా తెల్సా తెల్సా ఎవ్వరికైనా తెల్సా
సునామీ ఎదురుగ వస్తే ఎలాగ కనబడుతుందో
తెల్సా తెల్సా తెల్సా ఎవ్వరికైనా తెల్సా
తుఫానే తలుపులు తడితే ఎలాగ వినబడుతుందో
అరె తెలియకపోతే చూడర బాబూ 
హిజ్ హ్యూమన్ సునామీ
తెలియాలనుకుంటే డేంజర్ బాబూ 
యు హావ్ గాట్ బిలీవ్ మి
హే సరిగమపదనిస అరె కరో కరో జర జల్సా స జల్సా
హే సనిదపమగరిస అరె కరో కరో జర జల్సా స
వన్ మోర్ టైమ్ జల్సా

చరణం: 1
హైటెంతుంటాడో కొలవాలనిపిస్తే అమాంతమూ
అలా అలా మౌంటెవరెస్ట్ అవుతాడు
ఫైటేంచేస్తాడో అని సరదాపడితే స్ట్రెచర్ తనై
సరాసరి వార్డుకి చేరుస్తాడు
అరె గడ్డిపోచ అనుకుని తుంచడానికొస్తే
గడ్డపార నమిలేస్తాడు
గుండు సూది చేతికిచ్చి దండ గుచ్చమంటే
కొండ తవ్వి పారేస్తాడూ
హే సరిగమపదనిస అరె కరో కరో జర జల్సా స జల్సా
హే సనిదపమగరిస అరె కరో కరో జర జల్సా

చరణం: 2
మనవాడనుకుంటే చెలికాడవుతాడు
హెయ్ విమానమై భుజాలపై సవారి చేయిస్తాడు
పగవాడనుకుంటే విలుకాడవుతాడు
హెయ్ ప్రమాదమై క్షణాలలో శవాలు పుట్టిస్తాడు
హే దోసెడు పూలను తెచ్చిపెట్టమంటే 
తోటలన్నీ నొల్లుకొస్తాడు
యమపాశం వచ్చి పీకచుట్టుకుంటే 
దానితోటి ఊయలూగుతాడు
సరిగమపదనిస అరె కరో కరో జర జల్సా స జల్సా
సనిదపమగరిస అరె కరో కరో కరో జర జల్సా స జల్సామై హార్ట్ ఈజ్ బీటింగ్ పాట సాహిత్యం

 
చిత్రం: జల్సా (2008)
సంగీతం: దేవీ శ్రీ ప్రసాద్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: కె.కె

మై హార్ట్ ఈజ్ బీటింగ్ అదోలా తెలుసుకోవా అదీ
ఎన్నాళ్ళీ వెయిటింగ్ అనేలా తరుముతోంది మదీ

పెదవిపై పలకదే మనసులో ఉన్న సంగతి
కనులలో వెతికితే దొరుకుతుందీ
టీ స్పూన్ టన్ను బరువవుతుందే
ఫుల్ మూన్ నన్ను ఉడికిస్తుందే
క్లౌడ్ 9 కాళ్ళకిందకొచ్చిందే
లాండ్ మైన్ గుండెలో పేలిందే దే దే

మై హార్ట్ ఈజ్ బీటింగ్ అదోలా తెలుసుకోవా అదీ
ఎన్నాళ్ళీ వెయిటింగ్ అనేలా తరుముతోంది మదీ

Hey I wanna be with you forever
Hey I wanna live with you forever

పెనుతుఫాను ఏదైనా మెరుపుదాడి చేసిందా
మునుపు లేని మైకానా మదిని ముంచి పోయిందా
ఊరికినే పెరగదుగా ఊపిరి సలపని భారమిలా
నీ ఉనికే ఉన్నదిగా నాలో నిలువెల్లా
తలపులలో చొరబడుతూ గజిబిజిగా చెలరేగాలా
తలగడతో తలబడుతూ తెల్లార్లు ఒంటరిగా వేగాలా
సెల్ ఫోన్ నీ కబురు తెస్తుంటే స్టెన్ గన్ మోగినట్టు ఉంటుందే
క్రాంప్టన్ ఫాను గాలి వీస్తుంటే సైక్లోన్ తాకినట్టు ఉంటుందే దే దే

మై హార్ట్ ఈజ్ బీటింగ్ అదోలా తెలుసుకోవా అదీ
ఎన్నాళ్ళీ వెయిటింగ్ అనేలా తరుముతోంది మదీ

ఎప్పుడెలా తెగిస్తానో నా మీదే నాకు అనుమానం
మాటల్లో పైకనేస్తానో నీ మీద ఉన్న అభిమానం
త్వరత్వరగా తరిమినదే పదపదమని పడుచు రథం
యదలయలో ముదిరినదే మదనుడి చిలిపి రిథం
గుసగుసగా పిలిచినదే మనసున మెరిసిన కలలవనం
తహతహగా తరిమినదే ధమ్ రె ధమ్ అని తూలే ఆనందం
ఫ్రీడం దొరికినట్టు గాలుల్లో వెల్కం పిలుపు వినిపిస్తుందే
బాణం వేసినట్టు ఏ విల్లో ప్రాణం దూసుకెళ్ళిపోతుందే దే దే

మై హార్ట్ ఈజ్ బీటింగ్ అదోలా తెలుసుకోవా అదీ
ఎన్నాళ్ళీ వెయిటింగ్ అనేలా తరుముతోంది మదీ
యు అండ్‌ ఐ (ఏ జిందగీ నడవాలంటే హస్తే హస్తే ) పాట సాహిత్యం

 
చిత్రం: జల్సా (2008)
సంగీతం: దేవీ శ్రీ ప్రసాద్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: దేవీ శ్రీ ప్రసాద్

ఏ జిందగీ నడవాలంటే హస్తే హస్తే నదిలో దిగి ఎదురీదాలి అంతే అంతే 
హీరోషిమా  ఆగిందా ఆటంబాంబేేస్తే
ఛల్ చక్ దే చక్ దే అంటే పదినాళ్ళే చస్తామంతే 
హకునామ టాటా అనుకో తమాషగా తలఊపి 
వెరైటీగా శబ్ధం విందాం అర్ధం కొద్దిగా సైడుకి జరిపి 
అదే మనం తెలుగులో అంటే డోంట్‌ వర్రీ బిహ్యాపీ 
మరోరకంగా మారుద్దాం కొత్తదనం కలిపి

యు అండ్‌ ఐ లెట్స్ గో హై అండ్ డు భల్లే భల్లే 
లైప్ ఈజ్ లైక్ సాటర్ డే నైట్ లెట్స్ డు భల్లే భల్లే
లెట్స్ డు భల్లే భల్లే లెట్స్ డు భల్లే భల్లే

ఏ జిందగీ నడవాలంటే హస్తే హస్తే నదిలో దిగి ఎదురీదాలి అంతే అంతే 
హీరోషిమా  జీరో అయిందా  ఆటంబాంబేదో వేస్తే
ఛల్ చక్ దే చక్ దే అంటే పదినాళ్ళే చస్తామంతే

చరణం: 1 
ఎన్నో రంగుల జీవితం నిన్నే పిలిచిన స్వాగతం విన్నా నీలో సంశయం పోదా
ఉంటే నీలో నమ్మకం కన్నీరైన అమృతం కష్టం కూడా అధ్భుతం కాదా 
బొటానికల్ బాషలో మెటల్స్ పూరేకులు 
మెటీరియల్ సైన్స్ లో కలలు మెదడు పెనుకేకలు 
మెకానికల్ శ్వాసలో ఉసూరనే ఊసులు 
మనస్సు పరి భాషలో మధురమైన కధలు

యు అండ్‌ ఐ లెట్స్ గో హై అండ్ డు భల్లే భల్లే 
లైప్ ఈజ్ లైక్ సాటర్ డే నైట్ లెట్స్ డు భల్లే భల్లే
లెట్స్ డు భల్లే భల్లే లెట్స్ డు భల్లే భల్లే

ఏ జిందగీ నడవాలంటే హస్తే హస్తే నదిలో దిగి ఎదురీదాలి అంతే అంతే 
హీరోషిమా  జీరో అయిందా  ఆటంబాంబేదో వేస్తే
ఛల్ చక్ దే చక్ దే అంటే పదినాళ్ళే చస్తామంతే 

చరణం: 2 
పొందాలంటే విక్టరీ పోరాటం కంపల్సరీ రిస్కంటే ఎల్లామరి బోలో 
ఎక్కాలంటే హిమగిరి ధిక్కారం తప్పనిసరి కాలం మొక్కే హిస్టరీ లిఖనా 
ఇథోఫియా ఊహలో అటో ఇటో సాగుదాం 
యుకోరియా ఊపులో ఎగసి ఎగసి చెలరేగుదాం 
ఫిలాసఫీ చూపులో ప్రపంచమో బూటకం 
ఎనాటమి ల్యాబులో మనకు మనము దొరకం

యు అండ్‌ ఐ లెట్స్ గో హై అండ్ డు భల్లే భల్లే 
లైప్ ఈజ్ లైక్ సాటర్ డే నైట్ లెట్స్ డు భల్లే భల్లే
లెట్స్ డు భల్లే భల్లే లెట్స్ డు భల్లే భల్లే
చలోరే చలోరే చల్ పాట సాహిత్యం

 
చిత్రం: జల్సా (2008)
సంగీతం: దేవీ శ్రీ ప్రసాద్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: రంజిత్

చలోరే చలోరే చల్ చలోరే చలోరే చల్ 
చలోరే చలోరే చల్ చల్ (2)

నీ పయనం ఎక్కడికో నీకు తెలియాలిగా 
ఏ సమరం ఎవ్వరితో తేల్చుకో ముందుగా

చలోరే చలోరే చల్ చలోరే చలోరే చల్ 
చలోరే చలోరే చల్ చల్ (2)

చంపనిదే బతకవనీ బతికేందుకు చంపమనీ 
నమ్మించే అడవిని అడిగేం లాభం బతికే దారెటనీ 
చలోరే చలోరే చల్ చలోరే చలోరే చల్ 
చలోరే చలోరే చల్ చల్ 
సంహారం సహజమనీ సహవాసం స్వప్నమనీ 
తర్కించే తెలివికి తెలిసేనా తానే తన శతృవనీ
చలోరే చలోరే చల్ చలోరే చలోరే చల్ 
చలోరే చలోరే చల్ చల్ 
నీ పయనం ఎక్కడికో నీకు తెలియాలిగా 
ఏ సమరం ఎవ్వరితో తేల్చుకో ముందుగా

ధీరులకీ దీనులకీ అమ్మ ఒడి ఒక్కటే 
వీరులకీ చోరులకీ కంటతడి ఒక్కటే 
చలోరే చలోరే చల్ చలోరే చలోరే చల్ 
చలోరే చలోరే చల్ చల్ 
అపుడెపుడో ఆటవికం మరి ఇపుడో ఆధునికం 
యుగయుగాలుగా ఏ మృగాల కన్నా ఎక్కువ ఏం ఎదిగాం
చలోరే చలోరే చల్ చలోరే చలోరే
రాముడిలా ఎదగగలం రాక్షసులను మించగలం 
రకరకాల ముసుగులు వేస్తూ 
మరిచాం ఎపుడో సొంత ముఖం 
చలోరే చలోరే చల్ చలోరే చలోరే 
తారలనే తెంచగలం తలుచుకుంటే మనం 
రవికిరణం చీల్చగలం రంగులుగా మార్చగలం

చలోరే చలోరే చల్ చలోరే చలోరే చల్ 
చలోరే చలోరే చల్ చల్ (2)హే Jennifer Lopez స్కెచ్ గీసినట్టుగా ఉందిరో ఈ సుందరి  పాట సాహిత్యం

 
చిత్రం: జల్సా (2008)
సంగీతం: దేవీ శ్రీ ప్రసాద్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: బెన్నీ దయల్ , ప్రియా

హే Jennifer Lopez స్కెచ్ గీసినట్టుగా ఉందిరో ఈ సుందరి 
హే Britney Spears ని ప్రింట్ తీసినట్టుగా ఉందిరో ఈ కాడ్బరి 
ఓ నడుమే చూస్తే Shakira దాన్ని అంటుకున్న చెయ్యే లక్కిరా 
నడకే చూస్తే Beyonce  బేబి నవ్విందంటే ఖల్లాసే
ఓ జీన్స్ పాంట్ వేసుకున్న James Bond లాగా గన్ను లాంటి కన్ను కొట్టి చంపమాకురో 
బ్లాక్ బెల్ట్ పెట్టుకొని Jackie Chan లాగా నాన్ చాక్ తిప్పమాకురో 

చరణం: 1
హే లేడికళ్ళ లేజరే నువ్వా పారడైజ్ ఫ్లేవరే నువ్వా 
Oxyzen నింపుకున్న ఆడబాంబువా సాక్సోఫోన్ వంపువే నువ్వా 
ఓ Volcano కి బెస్ట్ ఫ్రెండ్ వా వెయ్యి వోల్ట్స్ హై కరెంటువా
వయసు మీద వాలుతున్న Tornedo నువ్వా Earth Quack థండరేనువ్వా 
నీ రెండు కళ్ళు Radium డయల్సా నీ పెదవులు ప్లాటినం ఫ్లవర్సా 
నువ్వు Hello అంటే రొమాన్సా నీ సైలెన్స్ అయినా వాయిలెన్సా
హే టైటానిక్ హీరోయిన్ పార్ట్ 2 నువ్వని నవ్వుతున్న మోనలిస మొత్తుకోదా 
Playboy చూపులున్న సమురాయ్ నువ్వని సుమోలంత సలాం కొట్టరా

హే Jennifer Lopez స్కెచ్ గీసినట్టుగా ఉందిరో ఈ సుందరి 
Britney Spears ని ప్రింట్ తీసినట్టుగా ఉందిరో ఈ కాడ్బరి 

చరణం: 2
హే DTS రింగుటోన్ వా హార్ట్ షేపు మూనువే నువ్వా
అందమన్న సాఫ్ట్ వేరు CD-ROM వా కమ్మనైన క్లోరోఫామ్ వా
హో రోమెయోకి క్లోనువే నువ్వా రెయిన్బోకి ట్విన్నువే నువ్వా
Dream University కి డీనువే నువ్వా నా Zodiac సైనువే నువ్వా 
హే 24 Carrot Vanila నువ్వు హాట్ హాట్ మెక్సికన్ Taquilla 
Fully Loaded రైఫుల్లా నన్ను రైడ్ చేసావే రాంబోలా
హే మడొన్నాను బంతి చేసి బౌన్సరేసినట్టుగా పల్స్ రేటు పెంచినావే ఫ్రెంచ్ మోడలా 
Maradona లాగిపెట్టి గోల్ కొట్టినట్టుగా Flying Kiss పెట్టమాకురో

హే Jennifer Lopez స్కెచ్ గీసినట్టుగా ఉందిరో ఈ సుందరి 
Britney Spears ని ప్రింట్ తీసినట్టుగా ఉందిరో ఈ కాడ్బరి 
గాల్లో తేలినట్టుందే గుండె పేలినట్టుందే పాట సాహిత్యం

 
చిత్రం: జల్సా (2008)
సంగీతం: దేవీ శ్రీ ప్రసాద్
సాహిత్యం: భాస్కరభట్ల రవి కుమార్
గానం: జి. సాహితి, గోపికా పూర్ణిమ, టిప్పు 

పల్లవి:
గాల్లో తేలినట్టుందే గుండె పేలినట్టుందే
తేనె పట్టు మీద రాయి పెట్టి కొట్టినట్టుందే
ఒళ్ళు ఊగినట్టుందే దమ్ము లాగినట్టుందే
ఫుల్లు బాటిలెత్తి దించకుండా తాగినట్టుందే
ఊర్వశివో నువ్వు రాక్షసివో నువ్వు
ప్రేయసివో నువ్వు నా కళ్ళకి
ఊపిరివో నువ్వు ఊహలవో నువ్వు
ఊయలవో నువ్వు నా మనసుకి

చరణం: 1
హే నిదుర దాటి కలలే పొంగె
పెదవి దాటి పిలుపే పొంగె
అదుపుదాటి మనసే పొంగె నాలో
గడపదాటి వలపే పొంగె
చెంపదాటి ఎరుపే పొంగె
నన్ను దాటి నేనే పొంగె నీ కొంటె ఊసుల్లో
రంగులవో నువ్వు రెక్కలవో నువ్వు
దిక్కులవో నువ్వు నా ఆశకి
తుమ్మెదవో నువ్వు తుంటరివో నువ్వు
తొందరవో నువ్వు నా ఈడుకి

గాల్లో తేలినట్టుందే గుండె పేలినట్టుందే
తేనె పట్టు మీద రాయి పెట్టి కొట్టినట్టుందే
ఒళ్ళు ఊగినట్టుందే దమ్ము లాగినట్టుందే
ఫుల్లు బాటిలెత్తి దించకుండా తాగినట్టుందే

చరణం: 2
తలపుదాటి తనువే పొంగె
సిగ్గుదాటి చనువే పొంగె
గట్టుదాటి వయసే పొంగె లోలో
కనులుదాటి చూపే పొంగె
అడుగు దాటి పరుగే పొంగె
హద్దు దాటి హాయే పొంగె నీ చిలిపి నవ్వుల్లో
తూరుపువో నువ్వు వేకువవో నువ్వు
సూర్యుడివో నువ్వు నా నింగికి
జాబిలివో నువ్వు వెన్నెలవో నువ్వు
తారకవో నువ్వు నా రాత్రికిChalore Chalore Chal (Hindi)

 
చిత్రం: జల్సా (2008)
సంగీతం: దేవీ శ్రీ ప్రసాద్
సాహిత్యం: Raqueeb Alam
గానం: దేవీ శ్రీ ప్రసాద్

Chalore Chalore Chal (Hindi)మై హార్ట్ ఈజ్ బీటింగ్ (Remix) పాట సాహిత్యం

 
చిత్రం: జల్సా (2008)
సంగీతం: దేవీ శ్రీ ప్రసాద్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: కె.కె

మై హార్ట్ ఈజ్ బీటింగ్  (Remix)సరిగమపదనిస (The Devi Mix)

 
చిత్రం: జల్సా (2008)
సంగీతం: దేవీ శ్రీ ప్రసాద్
సాహిత్యం: సిరి వెన్నెల
గానం: బాబా సెహగల్ ,  దేవీ శ్రీ ప్రసాద్

సరిగమపదనిస అరె కరో కరో జర జల్సా  (The Devi Mix)

Most Recent

Default