-->
Home Movie Songs Latest Updated Movies Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Results for "Ileana D'Cruz"
Pokiri (2006) Telugu Songs Lyrics Album Cover

Pokiri (2006) Telugu Songs Lyrics

MOVIE DETAILS
Movie : Pokiri (2006)
Music : Mani Sharma
Director : Puri Jagannadh
Actors : Mahesh Babu
Actresses : Ileana D'Cruz
Supporting Cast : Prakash Raj
Release Date : 28 April 2006

Devuda Song Lyrics in Telugu – Pokiri (2006)

'Devuda' song from Pokiri (2006) movie is composed by Mani Sharma and sung by Naveen Madhav.

SONG INFORMATION
Movie : Pokiri (2006)
Music : Mani Sharma
Lyricist : Bhaskarabhatla
Singers : Naveen Madhav
చిత్రం: పోకిరి (2006) సంగీతం: మణిశర్మ సాహిత్యం: భాస్కరభట్ల రవికుమార్ గానం: ఎన్.ఎస్.నవీన్ మాధవ్ నొప్పి నొప్పి గుండెంతా నొప్పి గిల్లి గిల్లి గిచ్చేస్తదే పట్టి పట్టి నరాలు మెలేసి లవ్వులోకే లాగేస్తదే అసలేమయిందో తెలియకుందిరో బాబోయ్ రాతిరంతా కునుకు లేదు ఏమెట్టి కన్నారురో... అ దేవ దేవ దేవ దేవ దేవ దేవుడా (4) అత్తమామలు ఎక్కడున్నా కాళ్ళు మొక్కాలిరో చిచ్చు పెట్టీ చంపుతోంది... అ దేవ దేవ దేవ దేవ దేవ దేవుడా (4) కొంపలే ముంచకే నువ్వలా నవ్వమాకే ముగ్గులో దించకే మూతలా పెట్టమాకే ఓరగా చూడకే జలగలా పట్టుకోకే బతకనీ నన్నిలా ఇరుకులో పెట్టమాకే దేవుడా... నా మతి చెడిపోయెను పూర్తిగా అయినా... బాగుంది హాయిగా రాతిరంతా కునుకులేదు ఏదోటి చెయ్యాలిరో అ దేవ దేవ దేవ దేవ దేవ దేవుడా (4) మెషిన్ లోన పెట్టి నన్ను పిండుతున్నాదిరో కొట్టి కొట్టి దంచుతోంది... ఏమిటీ కలవరం ఎన్నడూ చూడలేదే దీనినే ప్రేమనీ ఎవ్వరూ చెప్పలేదే యేటిలో మునిగినా ఎక్కడో తేలుతారే ప్రేమలో మునిగితే తేలడం వీలుకాదే దేవుడా...ఈ తెలియని తికమక దేనికో అరెెరే... ఈ తడబాటేమిటో రాతిరంతా కునుకులేదు ఫుల్లోటి కొట్టాలిరో అ దేవ దేవ దేవ దేవ దేవ దేవుడా (4) ఒళ్ళు మొత్తం కుంపటల్లే మండుతున్నాదిరో లోపలేదో జరుగుతోంది... అ దేవ దేవ దేవ దేవ దేవ దేవుడా (4)

Dole Dole Song Lyrics in Telugu – Pokiri (2006)

'Dole Dole' song from Pokiri (2006) movie is composed by Mani Sharma and sung by Suchitra and Ranjith.

SONG INFORMATION
Movie : Pokiri (2006)
Music : Mani Sharma
Lyricist : Viswa
Singers : Suchitra, Ranjith
చిత్రం: పోకిరి (2006) సంగీతం: మణిశర్మ సాహిత్యం: విశ్వ గానం: రంజిత్, సుచిత్ర డోలె డోలె దిల్ జర జరా నిను ఓర ఓర గని నరవరా జాగు మాని చెయ్ కలపరా జత చేరి నేడు జతి జరుపరా జర జల్ది జల్ది పెందలకడనే రా రా ఒడి అంతరంగ సంబరమునకే రారా రాలుగాయవే రసికుడా కసి కోకలాగు సరి సరసుడా రార మాటుకే ముడిపడ నిశికేళి వేళ జత చోరా చలేగ చలేగ యెహ్ హై ఇష్క జమాన కరేగ కరేగ హర్ దిల్ కో దీవాన చలేగ చలేగ యెహ్ హై ఇష్క జమాన కరేగ కరేగ హర్ దిల్ కో దీవాన అనువుగా అందిస్తా సొగసుని సంధిస్తా పొదుగుతూ కుదురుగా నీలోన ముడుపుతో మెప్పిస్తా ఒడుపుతో ఒప్పిస్తా దిల్ బర్ దేఖో నా మిస మిస కన్నె కొసరకు వన్నె వలపులతో వలపన్నీ నకసికలన్నీ నలుగును కొన్నే కలబడు సమయాన్ని ఒడికి త్వరగా యా... బరిలో కరగా యా... ఒడికి త్వరగా యా... బరిలో కరగా చిటుకిని విప్పేస్తా చెమటని రప్పిస్తా తళుకుతో తెగబడి నీపైన చటుకున చుంబిస్తా చనువుగా బందిస్తా సుందర దీవానా తొలితెరలన్నీ గడుసరి కన్నె తొలగును తమకాన్ని కలిమితో కొన్ని బలిమితో కొన్ని బలిగొను తరుణాన్ని తరలి దరికే యా... ఎగసి ఎదకే యా... తరలి దరకే యా... ఎగసి ఎదకే జర జల్ది జల్ది పెందలకడనే రా రా ఒడి అంతరంగ సంబరమునకే రారా రాలుగాయవే రసికుడా కసి కోకలాగు సరి సరసుడా రార మాటుకే ముడిపడ నిశికేళి వేళ జత చోరా చలేగ చలేగ యెహ్ హై ఇష్క జమాన కరేగ కరేగ హర్ దిల్ కో దీవాన చలేగ చలేగ యెహ్ హై ఇష్క జమాన కరేగ కరేగ హర్ దిల్ కో దీవాన

Gala Gala Song Lyrics in Telugu – Pokiri (2006)

'Gala Gala' song from Pokiri (2006) movie is composed by Mani Sharma and sung by Nihal.

SONG INFORMATION
Movie : Pokiri (2006)
Music : Mani Sharma
Lyricist : Kandikonda
Singers : Nihal
చిత్రం: పోకిరి (2006) సంగీతం: మణిశర్మ సాహిత్యం: కందికొండ గానం: నిహాల్ గల గల పారుతున్న గోదారిలా జల జల జారుతుంటే కన్నీరెలా గల గల పారుతున్న గోదారిలా జల జల జారుతుంటే కన్నీరెలా నా కోసమై నువ్వలా కన్నీరులా మారగా నాకెందుకో ఉన్నది హాయిగా నా కోసమై నువ్వలా కన్నీరులా మారగా నాకెందుకో ఉన్నది హాయిగా గల గల పారుతున్న గోదారిలా జల జల జారుతుంటే కన్నీరెలా గల గల పారుతున్న గోదారిలా వయ్యారి వానలా వాన నీటిలా ధారగా వర్షించి నేరుగా వాలినావిలా నా పైనా మిన్నేటి దారులా వేచి నువ్విలా చాటుగా పొమ్మన్న పోవెలా చేరుతావిలా నాలోన ఊ...ఓ...ఈ అల్లరి, ఊ...ఓ... ఊ...ఓ...బాగున్నది, ఊ...ఓ... గల గల పారుతున్న గోదారిలా జల జల జారుతుంటే కన్నీరెలా గల గల పారుతున్న గోదారిలా చామంతి రూపమా తాళలేవుమా రాకుమా ఈ ఎండమావితో నీకు స్నేహమా చాలమ్మా హిందోళరాగమా మేళతాళమా గీతమా కన్నీటి సవ్వడి హాయిగున్నది ఏమైనా ఊ...ఓ...ఈ లాహిరి, ఊ...ఓ... ఊ...ఓ...నీ ప్రేమది, ఊ...ఓ... గల గల పారుతున్న గోదారిలా జల జల జారుతుంటే కన్నీరెలా గల గల పారుతున్న గోదారిలా

Ippatikinka Song Lyrics in Telugu – Pokiri (2006)

'Ippatikinka' song from Pokiri (2006) movie is composed by Mani Sharma and sung by Suchitra and Khushi Murali.

SONG INFORMATION
Movie : Pokiri (2006)
Music : Mani Sharma
Lyricist : Bhaskarabhatla
చిత్రం: పోకిరి (2006) సంగీతం: మణిశర్మ సాహిత్యం: భాస్కరభట్ల రవికుమార్ గానం: మురళి, సుచిత్ర ఆ...అ...ఆ... నా మాటే వింటారా ఆ...అ...ఆ... నే నడిగిందిస్తారా ఆ...అ...ఆ... నా మాటే వింటారా ఇప్పటికింకా నా వయస్సు నిండా పదహారే చీటికి మాటికి చెయ్యేస్తూ చుట్టూ కుర్రాళ్ళే ఇప్పటికింకా నా వయస్సు నిండా పదహారే చీటికి మాటికి చెయ్యేస్తూ చుట్టూ కుర్రాళ్ళే నా కెవ్వరూ నచ్చట్లే నా ఒంటిలో కుంపట్లే ఈడు ఝుమ్మంది తోడెవ్వరే... జాసేజా అతడి కోసం వెతుకుతూ రైలెక్కేశాలే జాసేజా ఒకడి కోసం మురగా ఈ ఊరొచ్చాలే జాసేజా అతడి కోసం వెతుకుతూ రైలెక్కేశాలే జాసేజా ఒకడి కోసం మురుగా ఈ ఊరొచ్చాలే ఇప్పటికింకా నా వయస్సు నిండా పదహారే చీటికి మాటికి చెయ్యేస్తూ చుట్టూ కుర్రాళ్ళే పడకింటిలో ప్లాటినం పరుపే వెయ్యాలే డాలర్సుతో డైలీ నాకు పూజలు చెయ్యాలే బంగారమే కరిగించీ ఇల్లంతా పరచాలే వజ్రాలతో ఒళ్ళంతా నింపేసి పోవాలి ఆ చందమామ తేవాలి ఆ వైటు హౌసు కావాలి టైటానిక్కు గిఫ్టివ్వాలి... జాసేజా అతడి కోసం వెతుకుతూ రైలెక్కేశాలే జాసేజా ఒకడి కోసం మురగా ఈ ఊరొచ్చాలే జాసేజా నిన్ను చూస్తే సడన్ గా దడ పుడతా ఉంది జాసేజా ఇంతకాలం ఇలాంటి ఆశలు విన్లేదే పొగరెక్కిన సింహంలాంటి మగోడు కావాలే చురకత్తిలో పదునంతా తనలో ఉండాలే ఆ చూపుతో మంటలకే చెమటలు పట్టాలే ఆరడుగుల అందంతో కుదిపేసి చంపాలి తలంటి నీవు రుద్దాలె నైటంత కాళ్ళు పట్టాలి నిదురోతుంటే జోకొట్టాలే... జాసేజా అతడి కోసం వెతుకుతూ రైలెక్కేశాలే జాసేజా ఒకడి కోసం మురగా ఈ ఊరొచ్చాలే జాసేజా ఆగు తల్లే రంభలా ఫోజే కొట్టకులే జాసేజా ఎవ్వడైనా అసలు నీ వంకే చూడరులే ఇప్పటికింకా నా వయస్సు నిండా పదహారే చీటికి మాటికి చెయ్యేస్తూ చుట్టూ కుర్రాళ్ళే

Jagadame Song Lyrics in Telugu – Pokiri (2006)

'Jagadame' song from Pokiri (2006) movie is composed by Mani Sharma and sung by Kunal Ganjawala.

SONG INFORMATION
Movie : Pokiri (2006)
Music : Mani Sharma
Lyricist : Kandikonda
Singers : Kunal Ganjawala
చిత్రం: పోకిరి (2006) సంగీతం: మణిశర్మ సాహిత్యం: కందికొండ గానం: కునాల్ జగడమే... జగడమే... నా కనులను సూటిగా చూస్తే నా ఎదుటకు నేరుగా వస్తే నా పిడికిలి వాడిగా వేస్తే ఈ పోకిరి పొగరును కవ్విస్తే సమరమే... సమరమే... నా ఎదురుగా ఎవ్వరు ఉన్నా ఆ దేవుడు దిగివస్తున్నా ఆకాశమే తెగి పడుతున్నా బిన్లాడిన్ ఎదుటే నిలుచున్నా ఎక్కడైన నా తీరింతే ఏ సెంటరైనా నా స్పీడింతే హే టైము చెప్పు వస్తానంతే జగడమే... నువ్వో నేనో మిగలాలంటే ఇక వాడి వేడి చూపాలంటే వైలెన్స్ జరగాలంతే జగడమే... నా ఊహకు వాయువు వేగం నా చూపుకు సూర్యుడు తాపం నా చేతికి సాగర వాటం నే సాగితే తప్పదు రణరంగం బోలో బోలో గణపతి బప్పా బోలియ (4) ఎప్పుడైనా నా రూటింతే ఈ రాంగు రూటు నా స్టైలంతే హే నచ్చకుంటే నీ కర్మంతే జగడమే... ఏయ్ రాజీ గీజీ పడలేనంతే మరి చావోరేవో తేలాలంతే గళ్ళ పట్టి కొడతానంతే జగడమే... నే పాడితే అల్లరి రాగం నే ఆడితే చిల్లర తాళం నా దారికి లేదొక గమ్యం నా వరసే నిప్పుతో చెలగాటం

Choododdantunna Song Lyrics in Telugu – Pokiri (2006)

'Choododdantunna' song from Pokiri (2006) movie is composed by Mani Sharma and sung by Karthik and Mahalakshmi Iyer.

SONG INFORMATION
Movie : Pokiri (2006)
Music : Mani Sharma
Lyricist : Bhaskarabhatla
చిత్రం: పోకిరి (2006) సంగీతం: మణిశర్మ సాహిత్యం: భాస్కరభట్ల రవికుమార్ గానం: కార్తీక్, మహాలక్ష్మి అయ్యర్ చూడొద్దంటున్నా చూస్తూనే ఉంటా నా కోసం ఇంతందంగా పుట్టావనుకుంటా వద్దొద్దంటున్నా వస్తూనే ఉంటా కలకాలం నీ కౌగిళ్ళే నా ఇల్లనుకుంటా వచ్చేయ్నా వచ్చేయ్నా మోమాటమింక మనకేల వచ్చేయ్నా వచ్చేయ్నా ఆరాటమేదో కలిగేలా వచ్చేయ్వా వచ్చేయ్వా బొట్టెట్టి నిన్ను పిలవాలా వచ్చేయ్వా వచ్చేయ్వా వచ్చేయ్వా... సడియో సడియో సడియో నేనే వస్తానుగా సడియో సడియో సడియో నీతో ఉంటానుగా సడియో సడియో సడియో నువ్వే కావాలిగా సడియో సడియో సడియో నాకే ఇల్లాలిగా చూడొద్దంటున్నా చూస్తూనే ఉంటా నా కోసం ఇంతందంగా పుట్టావనుకుంటా నువ్వు నేను ఒకరికి ఒకరం చెరిసగమనుకుంటా కాసేపైనా కనబడకుంటే కలవపడుతుంటా పక్కన నువ్వే ఉన్నావనుకుని పొరబడి పోతుంటా నిద్దరలోన తలగడకెన్నో ముద్దులు పెడుతుంటా ఎదురుగ్గా ఎవరున్నా ఎద నిండా నువ్వంటా ఎవ్రీ డే ఓసారైనా కన్ఫ్యూజ్ అవుతుంటా చుట్టూరా ఎందరు ఉన్నా ఒంటరినవుతుంటా నువులేని లైఫే బోరని ఫీలైపోతుంటా వచ్చేయ్వా వచ్చేయ్వా బొట్టెట్టి నిన్ను పిలవాలా వచ్చేయ్వా వచ్చేయ్వా వచ్చేయ్వా... సడియో సడియో సడియో నేనే వస్తానుగా ఒడిలో ఒడిలో ఒడిలో చోటే ఇస్తానుగా సడియో సడియో సడియో నువ్వే రావాలిగా గడియో గడియో గడియో నేనే తీస్తానుగా ఎన్నాళ్ళైనా వీడని బంధం మనదేననుకుంటా చూపులు కలిసిన తరుణం ఎంతో బాగుందనుకుంటా నీ వెనకాలే ఒక్కో అడుగు వెయ్యాలనుకుంటా నీ చేతుల్లో బందీనయ్యే భాగ్యం ఇమ్మంటా నువ్వుంటే ఎవ్వరినైనా ఎదిరిస్తానంటా నీ కోసం ఎక్కడికైనా ఎగిరొస్తానంటా నీ కన్నా విలువైంది నాకేదీ లేదంటా నీ కోసం ప్రాణాలైనా ఇచ్చేస్తానంటా వచ్చేయ్వా వచ్చేయ్వా బొట్టెట్టి నిన్ను పిలవాలా వచ్చేయ్వా వచ్చేయ్వా వచ్చేయ్వా... హా సడియో సడియో సడియో నేనే వస్తానుగా ఒడిలో ఒడిలో ఒడిలో చోటే ఇస్తానుగా సడియో సడియో సడియో నువ్వే రావాలిగా గడియో గడియో గడియో నేనే తీస్తానుగా చూడొద్దంటున్నా చూస్తూనే ఉంటా నా కోసం ఇంతందంగా పుట్టావనుకుంటా వద్దొద్దంటున్నా వస్తూనే ఉంటా కలకాలం నీ కౌగిళ్ళే నా ఇల్లనుకుంటా

Palli Balakrishna Tuesday, January 25, 2022



చిత్రం: అమర్ అక్బర్ ఆంటోని (2018)
సంగీతం: ఎస్. ఎస్.థమన్
నటీనటులు: రవితేజ, ఇలియానా
దర్శకత్వం: శ్రీనువైట్ల
నిర్మాత: నవీన్ యెర్నేని
విడుదల తేది: 16.11.2018



Songs List:



కలలా కథలా పాట సాహిత్యం

 
చిత్రం: అమర్ అక్బర్ ఆంటోని (2018)
సంగీతం: ఎస్. ఎస్.థమన్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: హరిణి ఇవటూరి

కలలా కథలా ఎందుకో అలా 
నువ్ ఎటు వెళ్లిపోయావో
శిలలా మిగిలి ఉన్నా నేనిలా
నువ్ ఎప్పుడు ఎదురౌతావో

ఎన్నాళ్లయినా ఎన్నేళ్ళైనా
చెరగదు నీ తలపు
నీ తలపే  తూరుపుగా 
తెల్లారెను ప్రతి రేపు

ఏ దూరంలో  ఏ వైపున్న
వింటావా నా పిలుపు

చిరు చిరు నవ్వా పరుగున రావా 
చిన్ననాటి నేస్తంలా  చేరుకోవ
చిరు చిరు నవ్వా పరుగున రావా
చిన్ననాటి నేస్తంలా చేరుకోవ

నిను వెతకని చోటే లేదు
నువ్వే లేక వెలుగే లేదు
నిను మరచిన రోజే లేదు
నువ్వే లేని క్షణమే చేదు

నీ జాడ దొరకని కన్నులకి
కన్నీరు ముసిరిన నా కలకి
నీ పేరే వినిపిస్తూ
ముందడుగై వెళుతున్నా

వేయి జనుమల బంధం అంటూ
ఎన్నో ఎన్నో అనుకున్నాను
ఎద రగిలిన శూన్యం లాగ
నాతో నేనే మిగిలున్నాను

ఎడారి దారుల వేసవిగా
తడారిపోయిన గొంతుకగా
నీ కొరకై నిరీక్షణగా
ఉన్నానంటే వున్నా





డాన్ బాస్కో పాట సాహిత్యం

 
చిత్రం: అమర్ అక్బర్ ఆంటోని (2018)
సంగీతం: ఎస్. ఎస్.థమన్
సాహిత్యం: విశ్వా
గానం: శ్రీకృష్ణ, జస్ప్రీత్ జస్జ్, హరితేజ

హే హల్లో హల్లో డాన్ బాస్కో
చల్ చలో చలో పని చూస్కో
పడి పడి ఎంతైన ట్రై చేస్కో
నే దొరకను కాస్కో

హే హల్లో హల్లో డాన్ బాస్కో
చల్ చలో చలో పని చూస్కో
నా అందం అందదు రాసేస్కో కో కో కో కో..

గాలక్సీ లోకి ఊబర్ క్యాబ్స్ వేసుకోవచ్చు
సహారా డెసర్ట్ మధ్యలో క్రాప్స్ పెంచుకోవచ్చు
కింగ్ జాంగ్ గారి ఇంట్లో దూరి నూక్స్ పిక్స్ తీయవచ్చు

హే ట్రంఫ్ గారిని వీసాలడగొచ్చు
సెన్సెక్స్  ట్రెండ్స్ ని ముందే చెప్పొచ్చు
అట్లాంటిక్ ఓషన్ హైదరాబాద్ కి షిఫ్ట్ చెయ్యవచ్చు
బట్ నా గుండె గేట్ కు దొరకదు స్విచ్ వేయకు స్కెచ్

హే హల్లో హల్లో డాన్ బాస్కో
చల్ చలో చలో పని చూస్కో
పడి పడి ఎంతైన ట్రై చేస్కో
నే దొరకను కాస్కో

హే హల్లో హల్లో డాన్ బాస్కో
చల్ చలో చలో పని చూస్కో
నా అందం అందదు రాసేస్కో కో కో కో కో..

నీపై కన్ను గురిపెడతా నేనో యాప్ కనిపెడతా
అది యూజ్ చేసి నీ గుండె మ్యాప్ లో అడుగెడతా
నీ గట్స్ కి జై కొడతా నీలో ఆశ రేపెడతా
నువ్వేమీ చేసినా అందనంటు మతి పోగొడతా

రూబిక్స్ క్యూబ్ లా నీ గ్లామరే 
సాల్వ్ కాని ఓ పజిలా
పార్టీ బేబీ లా నీ పార్ట్నరై  
నే కలిసి రానని దిగులా
రోమన్ గాడ్ కే నీ యాక్ట్ 
నువ్వు షో ఆఫ్ చెయ్యకల

హే ట్రంఫ్ గారిని వీసాలడగొచ్చు
సెన్సెక్స్ ట్రెండ్స్ ని ముందే చెప్పొచ్చు
అట్లాంటిక్ ఓషన్ హైదరాబాద్ కి షిఫ్ట్ చెయ్యవచ్చు
బట్ నా గుండె గేట్ కు దొరకదు స్విచ్ వేయకు స్కెచ్



ఖుల్లం ఖుల్లా చిల్లం పాట సాహిత్యం

 
చిత్రం: అమర్ అక్బర్ ఆంటోని (2018)
సంగీతం: ఎస్. ఎస్.థమన్
సాహిత్యం: బాలాజీ 
గానం: నకాష్ అజీజ్ , మోహన, రమ్యా బెహ్రా

ఖుల్లం ఖుల్లా చిల్లం 




గుప్పెట పాట సాహిత్యం

 
చిత్రం: అమర్ అక్బర్ ఆంటోని (2018)
సంగీతం: ఎస్. ఎస్.థమన్
సాహిత్యం: బాలాజీ 
గానం: రంజిత్ , కాలభైరవ, శ్రీకృష్ణ, సాకేత్ 

గుప్పెట 

Palli Balakrishna Tuesday, January 15, 2019



చిత్రం: ఖతర్నాక్ (2006)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
నటీనటులు: రవితేజా , ఇలియానా
కథ, మాటలు: అమ్మా రాజశేఖర్ , మరుదూరి రాజా
దర్శకత్వం: అమ్మా రాజశేఖర్
నిర్మాతలు: బి.వి.యస్. యన్. ప్రసాద్
సినిమాటోగ్రఫీ: సంతోష్ శ్రీనివాస్
ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వరరావు
బ్యానర్: శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర
విడుదల తేది: 14.12.2006



Songs List:



మాటంటే మాటేరా పాట సాహిత్యం

 
చిత్రం: ఖతర్నాక్ (2006)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
సాహిత్యం: చంద్రబోస్ 
గానం: టిప్పు 

మాటంటే మాటేరా 




ఆ గగనంలోన పాట సాహిత్యం

 
చిత్రం: ఖతర్నాక్ (2006)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
సాహిత్యం: చంద్రబోస్
గానం: గీతామాధురి , నాని, నోయల్ (RAP)

ఆ గగనంలోన తరాజ్యోతై కిరణం నువ్వైతే
ఈ బృందావనం లోన నీకై వేచి నయనం నేనౌతా
ఆ గగనంలోన తరాజ్యోతై కిరణం నువ్వైతే
ఈ బృందావనం లోన నీకై వేచి నయనం నేనౌతా
స్వప్నంలో ఉంటూ పాపం మరిచావ సత్యం
గగనం భూమికి బహుదూరం
పెరిగేకొలది దూరం పెరుగును అనురాగం
అని ఎవరన్నారో గాని అది మరి నాకోసం

చరణం: 1
చలివేణువు నేను చెలివయ్యావు నువ్వు
రవలించే పదమై రాలేవా ఓహో
కరిమబ్బువు నువ్వు గిరికొనను నేను
నన్ను ముంచే వారదై రాలేవా ఓహో
బ్రతుకంటే కవితే కాదు
పతివుంటే కవితే రాదు
ఆ మాటే వలదు వలదు వలదు వలచితివా
కుదరదురా కలలకురా కలపకురా

ఆ గగనంలోన తరాజ్యోతై కిరణం నువ్వైతే
ఈ బృందావనం లోన నీకై వేచి నయనం నేనౌతా

చరణం: 2
ఔనంటే కాదు కాదంటే అవును
నీ మాటల సరసం రమ్మంటే విరసం
ఏనాడో తేలదు నీ విషయం ఓహో
నువేగా ఊహిస్తున్న మౌనంగా చూస్తూ ఉన్నా
మౌనాలే అంగీకారం తెలిపెనురా
చెదరనురా వదలదురా తెలిపెనురా

ఆ గగనంలోన తరాజ్యోతై కిరణం నువ్వైతే
ఆ గగనంలోన తరాజ్యోతై కిరణం నువ్వైతే
స్వప్నంలో ఉంటూ పాపం మరిచావ సత్యం
గగనం భూమికి బహుదూరం
పెరిగేకొలది దూరం పెరుగును అనురాగం
అని ఎవరన్నారో గాని అది మరి నాకోసం




దోమ కుడితే పాట సాహిత్యం

 
చిత్రం: ఖతర్నాక్ (2006)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
సాహిత్యం: చంద్రబోస్
గానం: శంకర్ మహదవన్,  కె.యస్.చిత్ర 

దోమ కుడితే 




బుజ్జి బుజ్జి పాప పాట సాహిత్యం

 
చిత్రం: ఖతర్నాక్ (2006)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
సాహిత్యం: జొన్నిత్తుల 
గానం: శంకర్ మహదవన్, ఆర్. గాయత్రి, నోయల్ (RAP)

బుజ్జి బుజ్జి పాప 



లవ్ చేసే వాళ్ళకి పాట సాహిత్యం

 
చిత్రం: ఖతర్నాక్ (2006)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
సాహిత్యం: భాషా శ్రీ 
గానం: ఉలగ నాథన్, వేణుమాధవ్ 

లవ్ చేసే వాళ్ళకి 



వేస్తావా పాట సాహిత్యం

 
చిత్రం: ఖతర్నాక్ (2006)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
సాహిత్యం: కె. శివదత్తా 
గానం: శంకర్ మహదవన్,  కె.యస్.చిత్ర 

వేస్తావా

Palli Balakrishna Friday, February 23, 2018



చిత్రం: రెచ్చిపో (2009)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: భాస్కరభట్ల (All)
నటీనటులు: నితిన్, ఇలియానా
దర్శకత్వం: పరుచూరి మురళి
నిర్మాత: జి.వెంకట రమణ
విడుదల తేది: 25.09.2009



Songs List:



భయం పాట సాహిత్యం

 
చిత్రం: రెచ్చిపో (2009)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: భాస్కరభట్ల
గానం: రాహుల్ నంబియార్ 

భయం 



ఓ రోరి పాట సాహిత్యం

 
చిత్రం: రెచ్చిపో (2009)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: భాస్కరభట్ల
గానం: వేణు, గీతామాధురి

ఓ రోరి 




తొలి తొలిగా పాట సాహిత్యం

 
చిత్రం: రెచ్చిపో (2009)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: భాస్కరభట్ల
గానం: రంజిత్, శ్వేత 

తొలి తొలిగా 




గాలైన పాట సాహిత్యం

 
చిత్రం: రెచ్చిపో (2009)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: భాస్కరభట్ల
గానం: హేమచంద్ర, మాళవిక 

గాలైన 



ఎత్తుకో నన్నెత్తుకో పాట సాహిత్యం

 
చిత్రం: రెచ్చిపో (2009)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: భాస్కరభట్ల
గానం: గీతామాధురి

ఎత్తుకో నన్నెత్తుకో ముప్పుటల ముద్దెట్టుకో
నా కొంపకి నిప్పెట్టుకో రా రా..
జట్టుగా చెయ్యట్టుకో మడికట్టునే చెడగొట్టుకో
నసపెట్టక రసపట్టుకె రా రా..
దండాస దండాస ధమాయించు తూనిషా
జల్దీసే అందించేయ్ భరోసా
మసాల నిషాలో కసే రేగి వచ్చేసాక
వద్దే నాలో ఈ దురాశ

ఎత్తుకో నన్నెత్తుకో  ముప్పుటల ముద్దెట్టుకో
నా కొంపకి నిప్పెట్టుకో రా రా..
జట్టుగా చెయ్యట్టుకో మడికట్టునే చెడగొట్టుకో
నసపెట్టక రసపట్టుకె రా రా..

సిగ్గేసింది కిక్ రా గోలెట్టేసింది హుక్కురా
నా దిక్కు ముక్కు అన్ని నువ్వేరా..
అందం చెక్ బుక్ రా అది పొందే హక్కే నీదిరా
చెక్కే చెక్కి చోరీ చేసై రా.. ఓ ఓ 
వారెవ్వా బాగుంది రా ఈ మైకమే అదిరింది రా 
సరిహద్దులే చెరిపేయరా రారా
అందులో ఇంతుందని నాకిప్పుడే తెలిసింది రా
మహా మత్తులో ముంచేయరా మగడా

గుండెల్లోన గాబరా ఇంకా తగ్గేలాగ లేదురా..
లిప్ లిప్ లింకే పెట్టేయ్ రా
నా గల్లీ గల్లీ నీదిరా నువు గిల్లీ గిల్లీ గిచ్చర
స్పీడో మీటర్ స్పీడే పెంచెయ్ రా ఓ ఓ
పైకి రా పైపైకి రా నన్ను కర కర నమిలేయ్ రా
నడుము వంపులే నలిపేయరా రారా 
సోకులే అరిటాకురా మగ చూపులే పిడిబాకురా
సుఖ జాతరే జరిపించరా త్వరగా




పాతికేళ్ళ పాట సాహిత్యం

 
చిత్రం: రెచ్చిపో (2009)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: భాస్కరభట్ల
గానం: రంజిత్, సైంధవి 

పాతికేళ్ళ 

Palli Balakrishna Wednesday, February 21, 2018

చిత్రం: జాదు (2006)
సంగీతం: యువన్ శంకర్ రాజా
సాహిత్యం:
గానం:
నటీనటులు: రవికృష్ణ , ఇలియానా, తమన్నా
దర్శకత్వం: ఎ. యమ్. జ్యోతి కృష్ణ
నిర్మాత: ఎ. యమ్.రత్నం
విడుదల తేది: 24.09.2006

ఆదిమవసుడు నెనె , నీ ప్రెమకు దాసుడు నెనె
నిన్ను చెర విడిపించె ప్రెమ నదెలె
అశా వాసుడు నెనె , నే బానిసనయిపొయానె
నా గుండెల్లొ నిన్ను దాచుకుందునె
దెవత నిన్నె విడిపించ, ప్రాణమె త్యాగం చెస్తానీ
వెన్నెలె నిన్ను బంధిస్తె , నింగి నె చేల్చి వెస్తా నీ

కలతె ల చెలియ నీ కన్ను చోఓపు నెనె
కావలిని దాటి , నే దరి చెరుతానె
నా తొడు నేవుంటె భయమెల హౄదయంలొ
నిప్పులొ నిలిచున్న , నన్నెమి చెయ్యదులె
నా కన్నులలొ వెలుగులొలికెను, నీ నడకకు దారి తెలియును
జననం మరణం అన్ని నీవల్లె….

నువ్వులెక పొతె నా బ్రతుకె భారం
మరణాన్ని కన్న ఆ క్షన్మె ఘొరం
హౄదయాన్ని చెదించి , రక్తాన్ని చిందించి
రాస్తాను లెఖలనీ నరములె సందించి
నాలుగు యుగములుగ భూమి నిలిచెను
దాన్ని మించి మన ప్రెమ నిలిచును
దెహం ప్రాణం నిన్నె కొరెలీ

ఆదిమవసూ మెమె , ఇక ప్రెమకు దాసులు మెమె
మమ్మ్ము చెర విడిపించె ప్రెమ మాదెలె

Palli Balakrishna Wednesday, September 27, 2017

చిత్రం: నేను నా రాక్షసి (2011)
సంగీతం: విశ్వా, రెహ్మాన్, అనూప్ రూబెన్స్
నటీనటులు: రానా దగ్గుబాటి, ఇలియానా
దర్శకత్వం: పూరీ జగన్నాథ్
నిర్మాత: నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి)
విడుదల తేది: 29.04.2011



చిత్రం: నేను నా రాక్షసి (2011)
సంగీతం: రెహ్మాన్
సాహిత్యం: రెహ్మాన్
గానం: శంకర్ మహదేవన్

మళ్ళీ మళ్ళీ మెరుపులా నా కళ్ళను తాకిందో కల
అది చంపేస్తోంది రోజు ఇలా రగిలే సెగలా
గుండెల్లోన కొడవలా అది చిచ్చే పెట్టిందేంటిల
తెగ మార్చేసింది నన్నిలా నడిచే కలలా
నిమిషానికి అరవై సార్లు మెదడుకు పొడిచిందే తూట్లు
అకలిని నిదురను మరిచి అలుపెరుగక
వెతికా వెతికా వెతికా

మళ్ళీ మళ్ళీ మెరుపులా నా కళ్ళను తాకిందో కల
అది చంపేస్తోంది రోజు ఇలా రగిలే సెగలా
గుండెల్లోన కొడవలా అది చిచ్చే పెట్టిందేంటిల
తెగ మార్చే సింది నన్నిలా నడిచే కలలా

అది మోనాలీసా చెల్లెలోమరి మోహం పెంచే వెన్నెలో
అది బంగారానికి బందువో నా దాహం తీర్చే బిందువో
ఏవరిది అసలెవరిదిఇంతలా నను నిలివునా తడిపిన తొలకరి చినుకులా
వెతికా వెతికా వెతికా

మళ్ళీ మళ్ళీ మెరుపులా నా కళ్ళను తాకిందో కల
అది చంపేస్తోంది రోజు ఇలా రగిలే సెగలా
గుండెల్లోన కొడవలా అది చిచ్చే పెట్టిందేంటిల
తెగ మార్చే సింది నన్నిలా నడిచే కలలా

ఏ పనిలేదు ఏమిటోనా పై తనకి ఈ హక్కేమిటో
నన్నే నాకు వేరుగా నెట్టేసే ఈ ప్లాను ఏమిటోహాయిదీ తొలి దిగులిది
వింతగా యెద తొలిచిన గెలిచిన సొగసరి చిలకను
వెతికా వెతికా వెతికా వెతికా

మళ్ళీ మళ్ళీ మెరుపులా నా కళ్ళను తాకిందో కల
అది చంపేస్తోంది రోజు ఇలా రగిలే సెగలా
గుండెల్లోన కొడవలా అది చిచ్చే పెట్టిందేంటిల
తెగ మార్చే సింది నన్నిలా నడిచే కలలా
నిమిషానికి అరవై సార్లు మెదడుకు పొడిచిందే తూట్లు
అకలిని నిదురను మరిచి అలుపెరుగక
వెతికా వెతికా వెతికా

మళ్ళీ మళ్ళీ మెరుపులా నా కళ్ళను తాకిందో కల
అది చంపేస్తోంది రోజు ఇలా రగిలే సెగలా
గుండెల్లోన కొడవలా అది చిచ్చే పెట్టిందేంటిల
తెగ మార్చే సింది నన్నిలా నడిచే కలలా





చిత్రం: నేను నా రాక్షసి (2011)
సంగీతం: విశ్వా
సాహిత్యం: విశ్వా
గానం: విశ్వా

వయ్యారి నిన్ను చూసి నన్ను నేను మరిచిపోయా
నీ వంపుసొంపు చూసి నాలో నేను మురిసిపోయా
వయ్యారి నిన్ను చూసి నన్ను నేను మరిచిపోయా
నీ వంపుసొంపు చూసి నాలో నేను మురిసిపోయా
ఇల్లాగ ఎదురురాగ పలకరించ కలవరించా
అందాల రాజహంస నడకచూసి పరవశించా
పడితినమ్మో పడితినమ్మో పడితినమ్మో పడితినమ్మో
పడితినమ్మో పడితినమ్మో పడితినమ్మో పడితినమ్మో
నీ ప్రేమలోన పడితినమ్మో

మిల మిల మెరుపుతీగ దరికి రాగ దిల్ తో బెహ్ లా
మతిచెడి పలువిధాల వలపు రేగే ముజ్కో పెహ్ లా
మిల మిల మెరుపుతీగ దరికి రాగ దిల్ తో బెహ్ లా
మతిచెడి పలువిధాల వలపు రేగే ముజ్కో పెహ్ లా
కులాసా కులుకు తార అలుకమాని పలుకవేలా
బడాయి తగదు బేల వగలుమాని వినవదేలా
పడితినమ్మో పడితినమ్మో పడితినమ్మో పడితినమ్మో
పడితినమ్మో పడితినమ్మో పడితినమ్మో పడితినమ్మో
నీ ప్రేమలోన పడితినమ్మో

Around beside you is where I belong longer
when your heart, when your soul
May be I will share your world
You too can feel what I feel inside girl
I don't wanna let you go
So come on girl say ya ya ya yaa
I can feel it turn around
Surely we make a bond
God I know the swedish band
Come on Come on I'm gonna get you in it

నడకలు హొయలు మీర ఇలకు జారె జగన తార
కదిలెను సుగుణశీల అలవికాని అభినయాల
నడకలు హొయలు మీర ఇలకు జారె జగన తార
కదిలెను సుగుణశీల అలవికాని అభినయాల
కల్లోలమయ్యి మునిగి ఉల్లమెల్ల మోహనాలా
సమ్మోహనాలు కలిగి తనివితీర తంభీ డోలా చమ చమ చమ చమకుతార
పడితినమ్మో పడితినమ్మో పడితినమ్మో పడితినమ్మో
పడితినమ్మో పడితినమ్మో పడితినమ్మో పడితినమ్మో
Damn it నీ ప్రేమలోన పడితినమ్మో

వయ్యారి నిన్ను చూసి నన్ను నేను మరిచిపోయా
నీ వంపుసొంపు చూసి నాలో నేను మురిసిపోయా
ఇల్లాగ ఎదురురాగ పలకరించ కలవరించా
అందాల రాజహంస నడకచూసి పరవశించా
పడితినమ్మో పడితినమ్మో పడితినమ్మో పడితినమ్మో
పడితినమ్మో పడితినమ్మో పడితినమ్మో పడితినమ్మో
నీ ప్రేమలోన పడితినమ్మో


Palli Balakrishna Saturday, September 23, 2017


చిత్రం: సలీం (2009)
సంగీతం: సందీప్ చౌత
సాహిత్యం: చంద్రబోస్ (All Songs)
గానం: నిఖితా నిగమ్
నటీనటులు: మంచు విష్ణు, ఇలియానా, మోహన్ బాబు
దర్శకత్వం: వై. వి.యస్. చౌదరి
నిర్మాత: మోహన్ బాబు
విడుదల తేది: 11.12.2009

ఈవేళలో హాయిలోమాయలో మాటరాని మత్తులో
i wanna talk to you
i wanna talk to you
హొయ్ ఒయ్ ఒయ్ హొయ్ ఒయ్ ఒయ్
నేనిన్నాళ్ళు నన్నే దాచి ఉన్నాను నాఊహలో
హొయ్ ఒయ్ ఒయ్ హొయ్ ఒయ్ ఒయ్
నేనీనాడు నన్నేదాటి ఉ౦డాలి నీ గు౦డెలో
i wanna talk to you
i wanna talk to you

పెదాలలో ప్రక౦పనే తొలి సాక్ష్య౦
పదాలలో ప్రవాహమే మలి సాక్ష్య౦
చెక్కిళ్ళలో సి౦ధూరమే చిరు సాక్ష్య౦
నా కళ్ళలో సముద్రమే తుది సాక్ష్య౦
అణువణువు నేడు అనేక గొ౦తులై
కణకణముకూ స్వరాల త౦త్రులై
ఒకే మాటనీ సదా స్మరి౦చుతున్నా
అదేమాటనీ చెప్పేస్తూ ఉన్నా..
i love you! i love you!
ఏ౦చేయనూ ఏమని చెప్పనూ
what do i do without you !
i wanna talk to you
i wanna talk to you

వెన్నెల్లలో అ౦ది౦చనా ఆహ్వాన౦
కన్నీళ్ళతో చేయి౦చనా అభిషేక౦
కౌగిళ్ళలొ దాచేయనా నీస్నేహ౦
ప్రాణాలలో ని౦పేయనా నీరూప౦
నీ శ్వాసలోన సుమాలగాలినై
నీ కాళ్ళ లోన సుగ౦ధ ధూలినై
ఎన్నో మాటలూ వినిపి౦చు వీలులేక
ఒకే మాటతో వివరి౦చేస్తున్నా
i love you i love you!
ఏ౦చేయనూ ఏమనీ చెప్పనూ
what do i do without you
i wanna talk to you
i wanna talk to you

Palli Balakrishna Thursday, September 14, 2017


చిత్రం: ఆట (2007)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: శంకర్ మహదేవన్
నటీనటులు: సిద్దార్థ్, ఇలియానా
దర్శకత్వం: వి.యన్. ఆదిత్య
నిర్మాత: యమ్. ఎస్. రాజు
విడుదల తేది: 09.05.2007

హే జెండాపై కపిరాజుంటే రధమాపేదెవరంటా
గుండెల్లొ నమ్మకముంటే బెదురెందుకు పదమంటా
అల్లాద్దీన్ అద్భుత దీపం అవసరమె లేదంట
చల్లారని నీ సంకల్పం తోడుంటె చాలంట
అల్లదిగొ ఆశల ద్విపం  కళ్ళెదుటె ఉందంట
ఎల్లలనె తెంచె వేగం మేఘాలు తాకాలంట
ఆట ఆట నువు నిలబడి చూడకు ఏ చోట
ఆట ఆట ఇది గెలవక తప్పని బతుకాట
ఆట ఆట అనుకుంటె బతకడమొక ఆట
ఆట ఆట కాదంటె బరువె ప్రతి పూట

హే ముందుగా తెలుసుకో మునిగే లోతెంతా
సరదాగ సాగదు బేటా నట్టేట ఎదురీతా
తెలివిగా మలచుకో నడిచే దారంతా
పులి మీద స్వారి కూడా అలవాటు అయిపోదా
సాధించె సత్తావుంటె సమరం ఒక సయ్యాటా
తల వంచుకు రావలిసిందె ప్రతి విజయం నీ వెంటా

అల్లాద్దీన్ అద్భుత దీపం అవసరమె లేదంట
చల్లారని నీ సంకల్పం తోడుంటె చాలంట
ఆట ఆట నువు నిలబడి చూడకు ఏ చోట
ఆట ఆట ఇది గెలవక తప్పని బతుకాట

హే చెలిమితో గెలుచుకో చెలితో వలపాటా
అతిలోక సుందరి రాద జత కోరి నీ వెంటా
తెగువతో తేల్చుకో చెడుతో చెలగాటా
జగదేక వీరుడు కూడ మనలాంటి మనిషంటా
ఇటునుంచె అటువెళ్ళారు సినిమా హీరోలంతా
దివినుంచేం దిగిరాలేదు మన తారగణమంతా
మనలోను ఉండుంటారు కాబోయె ఘనులంతా
పైకొస్తె జై కొడతారు అభిమానులై జనమంతా
ఆట ఆట నువు నిలబడి చూడకు ఏ చోట
ఆట ఆట ఇది గెలవక తప్పని బతుకాట
ఆట ఆట అనుకుంటె బతకడమొక ఆట
ఆట ఆట కాదంటె బరువె ప్రతి పూట


********   *********   ********


చిత్రం: ఆట (2007)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: చంద్రబోస్
గానం: టిప్పు, గోపిక పూర్ణిమ

కాకినాడ కాజా కాజా కైకలూరు బాజాబాజ
కాణిపాకం గణపతి పూజ మనదేలే

కాకినాడ కాజా కాజా కైకలూరు బాజాబాజ
కాణిపాకం గణపతి పూజ మనదేలే
కోటప్ప కొండపై పేరంటం
సింహాద్రి గుట్టపై సాయంత్రం
వెంకన్న కరుణతో కళ్యాణం మనదేలే
సిద్దాంతి పెట్టిన సుముహుర్తం
పెద్దోళ్ళు చెప్పిన సిద్దాంతం
సిగ్గంతా జారగా శ్రమదానం మనదేలే
లగ్గులాహిరే లగ్గు లాహిరే లగ్గు లాహిరే లగ్‌రే
లగ్గులాహిరే లగ్గు లగ్గు లగ్గులాహిరే

లగ్గులాహిరే లగ్గు లాహిరే లగ్గు లాహిరే లగ్‌రే
లగ్గులాహిరే లగ్గు లగ్గు లగ్గులాహిరే

కాకినాడ కాజా కాజా కైకలూరు బాజాబాజ
కాణిపాకం గణపతి పూజ మనదేలే

చిన్నగుండెనే నీకు దండ చెయ్యనా
చిన్నవాడి ఆశలన్ని కట్టకట్టి కాలికే మెట్టె వేయనా

కన్నె జన్మనే నీకు కట్నమివ్వనా
తాళలేని ప్రేమ పుట్టి తాళికట్టినప్పుడే తప్పకుండ తాళమెయ్యనా
ఓ నీభామ చర్యలే ప్రారంభం నా బ్రహ్మచర్యమే గోవిందం
బ్రహ్మండమైన పరమానందం మనదేలే

లగ్గులాహిరే లగ్గు లాహిరే లగ్గు లాహిరే లగ్‌రే
లగ్గులాహిరే లగ్గు లగ్గు లగ్గులాహిరే

కాకినాడ కాజా కాజా కైకలూరు బాజాబాజ
కాణిపాకం గణపతి పూజ మనదేలే


మల్లెపూలతో ఓ మాట చెప్పనా
పిల్లగాడు గిల్లుతుంటె గొల్లు గొల్లుమంటూ ఏడవొద్దని
వెండి మువ్వతో నే విన్నవించనా
వేడిపుట్టి అల్లుకుంటే ఘల్లు ఘల్లుమంటూ
గుట్టు బైటపెట్టవొద్దని
పడకింట నిండగా నిశ్శబ్దం
పెదవుల్లో పొంగగా కిశ్శబ్దం
అటుపైన జరిగిన అణూయుద్ధం మనదేలే

లగ్గులాహిరే లగ్గు లాహిరే లగ్గు లాహిరే లగ్‌రే
లగ్గులాహిరే లగ్గు లగ్గు లగ్గులాహిరే

కాకినాడ కాజా కాజా కైకలూరు బాజాబాజ
కాణిపాకం గణపతి పూజ మనదేలే


********   *********   ********


చిత్రం: ఆట (2007)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: చంద్రబోస్
గానం: ఉదిత్ నారాయణ్

హే ముద్దులాట ముద్దులాట ఇద్దరాడె ముద్దులాట
మధ్యలొ ఎవడొస్తె ఏంటటా
ఎవ్రిబాడి ముద్దులాట ముద్దులాట ఇద్దరాడె ముద్దులాట
మధ్యలొ ఎవడొస్తె ఏంటటా

ఓ సారి సయ్యాట ఓ సారి పోట్లాట
హోరెత్తె పడుచాట ఓడేది కాదు ప్రేమాట
అరె బేటా అరె బేట ఆరు నూరవుతున్న ఆటాడేసుకొ
అరె బేట బొమ్మ బొరుసవుతున్న ప్రేమించేసుకో

హే ముద్దులాట ముద్దులాట ఇద్దరాడె ముద్దులాట
మధ్యలొ ఎవడొస్తె ఏంటటా

పాఠశాల లేకున్న పుస్తకాలు చూడకున్న
పాకులాడి నేర్చుకున్న ఆట సోకాటా
పక్కవాళ్ళు చూస్తున్న పొరుగువాళ్ళు వింటున్న
పట్టనట్టు ఆడుకున్న ఆట సొంతాటా
ఏయ్ ఏంటి ఎక్కువ చేస్తున్నావ్ ఇదేం బాలేదు
ఇంకొంచెం ఎక్కువ చేయి బాగుంటుంది
తీయంగ పెదవాట న్యాయంగ నడుమాట
మౌనంగ మనువాట మారేది కాదు మనసాట
అరె బేటా అరె బేట ఆరు నూరవుతున్న ఆటె ఆడేసుకొ
అరె బేట బొమ్మ బొరుసవుతున్న ప్రేమించేసుకో

హే ముద్దులాట ముద్దులాట
ముద్దులాట ముద్దులాట ఇద్దరాడె ముద్దులాట
మధ్యలొ ఎవడొస్తె ఏంటటా

ఎండలేవి లేకున్న వానలేవి రాకున్న
ఒకరినొకరు కమ్ముకున్న ఆట గొడుగాటా
చీకటేల కాకున్న చందమామ రాకున్న
ఒకరినొకరు కప్పుకున్న ఆట పడకాటా హయ్యొ
ఛి ఛి నువ్వు ఎప్పుడు ఇంతె
నీతొ అస్సలు మాట్లాడను ఆట్లాడతాను
ప్రే అంటె మొదలంట మ అంటే చివరంట
ఈ రొండిటి నడిమధ్య ఆడాలి చూడు బ్రతుకాట
అరె బేటా అరె బేట ఆరు నూరవుతున్న ఆటాడేసుకొ
అరె బేట బొమ్మ బొరుసవుతున్న ప్రేమించేసుకో

హే ముద్దులాట ముద్దులాట
ముద్దులాట ముద్దులాట ఇద్దరాడె ముద్దులాట
మధ్యలొ ఎవడొస్తె ఏంటటా


********   *********   ********


చిత్రం: ఆట (2007)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: సిద్దార్ధ్, సుమంగళి

హే నిను చూస్తుంటె చెడి పోతానె తప్పనుకోవు కద
పొగిడావంటె పడిపోతానె తప్పని గొడవ కద
పద పద అంటోందే హాయ్ పదె పదె నీ అందం
అహ మహ బాగుందే హాయ్ మతె చెడె ఆనందం
ఉరకలెత్తె యవ్వనం తరుముతుంటె కాదనం
సనం ఓ సనం సనం ఓ సనం

హే నిను చూస్తుంటె చెడి పోతానె తప్పనుకోవు కద
పొగిడావంటె పడిపోతానె తప్పని గొడవ కద

తీగ నడుము కద తూగి తడబడద
రేకు విరిసిన సోకు బరువుకు సాయపడమనదా
ఆడ మనసు కద బైత పడగలద
అంత సులువుగ అంతు దొరకదు వింత పొదుపు కధా
కబురు పంపిన పై యదా ఇపుడు వెయ్యకు వాయిదా
సనం ఓ సనం సనం ఓ సనం

హే నిను చూస్తుంటె చెడి పోతానె తప్పనుకోవు కద
పొగిడావంటె పడిపోతానె తప్పని గొడవ కద

లేడి కన్నులతొ వగలాడి వన్నెలతొ
కంటపడి మహ కొంటెగ కవ్వించు తుంటరివో
వాడి తపనలతొ మగవాడి తహ తహతొ
జంట పడమని వెంటపడి వేధించు తొందరవో
పెదవి అంచున ఆగిన అసలు సంగతి దాగున
సనం ఓ సనం సనం ఓ సనం

హే నిను చూస్తుంటె చెడి పోతానె తప్పనుకోవు కదా
పొగిడావంటె పడిపోతానె తప్పని గొడవ కదా


********   *********   ********


చిత్రం: ఆట (2007)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: సునీత, స్మిత

యేల యేలా యేలా యేలా యేల యేలా యేలారె
రేల రేలా రేలా రేలా రేల రేలా రేలారె

హే కొంగు కొంచం భద్రం పిల్లొ కొంప ముంచేటట్టుందే
యేల యేలా యేలా యేలా యేల యేలా యేలారె
పొంగుకొచ్చె సింగారంలొ సంగతేమయ్యుంటుందే

రేల రేలా రేలా రేలా రేల రేలా రేలారె
నాకు మాత్రం ఏం తెలుసే ఆగనంటు నా వయసే
దూకుతుంటె నేనేం చేసేదే
మాటువేసి లాగేసే మాయలోపడి నా మనసే
మాట విననని మారాం చేస్తోందే

యాల యాల యాల యాల
యేల యేలా యేలా యేలా యేల యేలా యేలారె
రేల రేలా రేలా రేలా రేల రేలా రేలారె

హే కళ్ళు చెదిరె ఎన్నందాలొ తుల్లిపడర కురాళ్ళు
యేల యేలా యేలా యేలా యేల యేలా యేలారె
గుండెలదిరె ఆనందంలొ ఎంటపడర ఎర్రోల్లు
రేల రేలా రేలా రేలా రేల రేలా రేలారె
నీడపట్టున ఇన్నాళ్ళు కూడబెట్టిన అందాలు
దాచుకుంటె భారంగా ఉందే
వెచ్చ వెచ్చని ఆవిరితొ వచ్చి తగిలె చూపుల్లొ
వేడి కూడ వేడుకగా ఉందే

యాల యాల యాల యాల
యేల యేలా యేలా యేలా యేల యేలా యేలారె
రేల రేలా రేలా రేలా రేల రేలా రేలారె

ఎప్పుడిట్ట విచ్చేసిందె వంటిమీదకి పెళ్ళీడూ
ఎందుకిట్ట వీధెక్కిందె ఎండ తగలని నీ ఈడు
కాల దోషం వదిలిందొ మీన మేషం కుదిరిందొ
జంట చేరె దారె తెలిసిందో
పచ్చ జెండ ఊగిందొ పడుచు ప్రాయం తూగిందొ
పల్లకి పదమంటు పిలిచిందో

యాల యాల యాల యాల
యేల యేలా యేలా యేలా యేల యేలా యేలారె
రేల రేలా రేలా రేలా రేల రేలా రేలారె


********   *********   ********


చిత్రం: ఆట (2007)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: శంకర్ మహదేవన్

హే జెండాపై కపిరాజుంటే రధమాపేదెవరంటా
గుండెల్లొ నమ్మకముంటే బెదురెందుకు పదమంటా
అల్లాద్దీన్ అద్భుత దీపం అవసరమె లేదంట
చల్లారని నీ సంకల్పం తోడుంటె చాలంట
అల్లదిగొ ఆశల దీపం కళ్ళెదుటె ఉందంట
ఎల్లలనె తెంచె వేగం మేఘాలు తాకాలంట

ఆట ఆట నువు నిలబడి చూడకు ఏ చోట
ఆట ఆట ఇది గెలవక తప్పని బతుకాట
ఆట ఆట అనుకుంటె బతకడమొక ఆట
ఆట ఆట కాదంటె బరువె ప్రతి పూట


హే ముందుగా తెలుసుకో మునిగే లోతెంతా
సరదాగ సాగదు బేటా నట్టేట ఎదురీతా
తెలివిగా మలచుకో నడిచే దారంతా
పులి మీద స్వారి కూడా అలవాటు అయిపోదా
సాధించె సత్తావుంటె సమరం ఒక సయ్యాటా
తల వంచుకు రావలిసిందె ప్రతి విజయం నీ వెంటా
అల్లాద్దీన్ అద్భుత దీపం అవసరమె లేదంట
చల్లారని నీ సంకల్పం తోడుంటె చాలంట

ఆట ఆట నువు నిలబడి చూడకు ఏ చోట
ఆట ఆట ఇది గెలవక తప్పని బతుకాట

హే చెలిమితో గెలుచుకో చెలితో వలపాటా
అతిలోక సుందరి రాద జత కోరి నీ వెంటా
తెగువతో తేల్చుకో చెడుతో చెలగాటా
జగదేక వీరుడు కూడ మనలాంటి మనిషంటా
ఇటునుంచె అటువెళ్ళారు సినిమా హీరోలంతా
దివినుంచేం దిగిరాలేదు మన తారగణమంతా
మనలోను ఉండుంటారు కాబోయె ఘనులంతా
పైకొస్తె జై కొడతారు అభిమానులై జనమంతా

ఆట ఆట నువు నిలబడి చూడకు ఏ చోట
ఆట ఆట ఇది గెలవక తప్పని బతుకాట
ఆట ఆట అనుకుంటె బతకడమొక ఆట
ఆట ఆట కాదంటె బరువె ప్రతి పూట

Palli Balakrishna Sunday, August 20, 2017



చిత్రం: కిక్ (2009)
సంగీతం: ఎస్.ఎస్.థమన్
నటీనటులు: రవితేజ, ఇలియానా
దర్శకత్వం: సురేంధర్ రెడ్డి
నిర్మాత: ఆర్.ఆర్.వెంకట్
విడుదల తేది: 08.05.2009



Songs List:



దిల్ ఖలాసే పాట సాహిత్యం

 
చిత్రం: కిక్ (2009)
సంగీతం: ఎస్.ఎస్.థమన్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: అనుష్క మంచంద

దిల్ ఖలాసే




ఐ డోంట్ వాంట్ లవ్ పాట సాహిత్యం

 
చిత్రం: కిక్ (2009)
సంగీతం: ఎస్.ఎస్.థమన్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: కార్తీక్

కన్నెత్తి చూడకే కన్యామని పన్నెత్తి చెప్పకే ఆ మాటని
నేనంటే కొద్దిగా నీకుందని నాక్కూడా తెలుసును గాని
చి కొట్టి పొమ్మనే అమ్మాయిని చేపట్ట గలిగే దమ్ముందని
నా పట్టుదలని చూపెట్టి నిన్ను ఆకట్టు కుంట రావే

అందుకే అందుకే అంత సులువుగా భామ
ఆటావో వేటవో అంతు తెలియని ప్రేమ

ఐ డోంట్ వాంట్ లవ్ న దీన దీన దో
యూ డోంట్ గివ్ నౌ న దీ న దీ న దో
బట్ ఐ వోంట్ లివ్ న దీ న దీ న దో లెట్ మీ షో హౌ
ఐ డోంట్ వాంట్ లవ్ న దీన దీన దో
యూ డోంట్ గివ్ నౌ న దీ న దీ న దో
బట్ ఐ వోంట్ లివ్ న దీ న దీ న దో లెట్ మీ షో హౌ
వాంట్ సం మోర్ కిక్ అ వాంట్ సం మోర్ కిక్ అ
వాంట్ సం మోర్ కిక్ అ ఐ వాంట్ సం మోర్ కిక్ అ

కన్నెత్తి చూడకే కన్యామని పన్నెత్తి చెప్పకే ఆ మాటని
నేనంటే కొద్దిగా నీకుందని నాక్కూడా తెలుసును గాని

కిక్ కిక్ ఓ కిక్ కిక్ హి వాంట్ సం మోర్ కిక్
కిక్ కిక్ ఓ కిక్ కిక్ హి వాంట్ సం మోర్ కిక్

తౌబా తౌబా తౌబా డోంట్ సే ఐ లవ్ యూ
ఓహ్ ఓ నో నో నో డోంట్ సే ఐ లవ్ యూ
ఓహ్ పాపా వాడు పాపా ముందుంది నీ పై పాప
ఓ ప్యారి మధు బాలాతు హాయ్ ఉస్కీ లైలా

రోజా పువ్వు ఓటందించి ఐ లవ్ యూ అంటే
నజ్జుగ్గ నువ్ స్పందించి ఐ డూ అనవద్దే
దీనంగా దే దే అంటూ దానం ఇమ్మంటే
పోనిలే లే లే అంటూ దిల్ ఇస్తామంటే

వలపు నైనా గెలుపు నైనా కోరుకుంటే చాలదే
ప్రాణమైన పందెమేసి కోరకుంటే నచ్చదే

ఐ డోంట్ వాంట్ లవ్ న దీన దీన దో
యూ డోంట్ గివ్ నౌ న దీ న దీ న దో
బట్ ఐ వోంట్ లివ్ న దీ న దీ న దో లెట్ మీ షో హౌ
ఐ డోంట్ వాంట్ లవ్ న దీన దీన దో
యూ డోంట్ గివ్ నౌ న దీ న దీ న దో
బట్ ఐ వోంట్ లివ్ న దీ న దీ న దో లెట్ మీ షో హౌ

గెట్ హిం సం మోర్ మోర్ కిక్ వన్ మోర్ కిక్ వన్ మోర్ కిక్
వన్ మోర్ మోర్ కిక్

త న న త తరర ర త త న న త తరర ర తార
తరర త తరర తరర తరర త తరర తరరరరర తరర

జుట్టంతా పీక్కునేంత పిచ్చెకించిందే
యిట్టే చెయ్ జిక్కావంటే ఎం బావుంటుందే
రిస్క్ అంటూ ఎం లేకుంటే ఇష్క్ ఐన చేదే
లక్ కెళ్ళి లాక్కొచ్చేస్తే కిక్ ఏముంటుందే

నా దారికాదే న తీరుకాదే టేక్ ఇట్ ఈజీ పాలసీ
నా తిక్క నాదే న లెక్క నాదే సాధిస్తా ఏదో ప్లాన్ ఎసి

ఐ డోంట్ వాంట్ లవ్ న దీన దీన దో
యూ డోంట్ గివ్ నౌ న దీ న దీ న దో
బట్ ఐ వోంట్ లివ్ న దీ న దీ న దో లెట్ మీ షో హౌ
ఐ డోంట్ వాంట్ లవ్ న దీన దీన దో
యూ డోంట్ గివ్ నౌ న దీ న దీ న దో
బట్ ఐ వోంట్ లివ్ న దీ న దీ న దో లెట్ మీ షో హౌ
వాంట్ సం మోర్ కిక్ అ వాంట్ సం మోర్ కిక్ అ
వాంట్ సం మోర్ కిక్ అ ఐ వాంట్ సం మోర్ కిక్ అ
వాంట్ సం మోర్ కిక్ అ వాంట్ సం మోర్ కిక్ అ
వాంట్ సం మోర్ కిక్ అ ఐ వాంట్ సం మోర్ కిక్ అ
కిక్ ఆ




అటు చూడొద్దన్నానా పాట సాహిత్యం

 
చిత్రం: కిక్ (2009)
సంగీతం: ఎస్.ఎస్.థమన్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: చిత్ర

అటు చూడొద్దన్నానా మాటాడొద్దన్నానా 
ఒద్దొద్దు అంటే విన్నావంటే మనసా 
ఏం పరవాలేదనుకున్నావేమో బహుశా 
ఈ తలనొప్పేదైనా నీ తప్పేంలేదన్నా 
అయ్యయ్యో అంటారేమో గానీ మనసా 
పడవలసిందేగా నువిలా నానా హింస 

ప్రేమని కదిలించావే తోచీతోచని తొలి వయసా 
ఎందుకు బదులిచ్చావే తెలిసి తెలియని పసి మనసా 

మునుపేనాడూ ఏ కుర్రాడు పడలేదంటే నీ వెనకాలా 
వందలు వేలు ఉండుంటారు మతి చెడలేదే ఇలా వాళ్ళందరి వల్లా 
ఎందుకివాళే ఇంత మంటెక్కిందో చెబుతావా 
ఏం జరిగుంటుందంటే అడిగినవాళ్ళని తిడతావా 
అందరి లాగా వాణ్ణి వీధుల్లో వదిలెసావా 
గుండెల గుమ్మందాటి వస్తుంటే చూస్తున్నావా 

ఏ దారైనా ఏ వేళైనా ఎదురౌతుంటే నేరం తనదే 
ఇంట్లో ఉన్నా నిదరోతున్నా కనిపిస్తుంటే ఆ చిత్రం నీలో ఉందే 
ఎవ్వరినని ఏం లాభం ఎందుకు ఎద లయ తప్పిందే 
ఎక్కడ ఉందో లోపం నీతో వయసేంచెప్పిందే 
అలకో ఉలుకో పాపం ఒప్పుకునేందుకు ఇబ్బందే 
కనకే నాకీకోపం కన్నెగా పుట్టిన నామీదే 




గోరే గోరే పాట సాహిత్యం

 
చిత్రం: కిక్ (2009)
సంగీతం: ఎస్.ఎస్.థమన్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: కార్తిక్ , జోస్న

గోరే గోరే గోగోరే గోరే గోరే గోగోరే గోగోరే 
పోపోపొమ్మంటోందా నను రారా రమ్మంటోందా 
నీ మనసేమంటోందో నీకైనా తెలిసిందా 
పోపోపొమ్మంటోందా నను రారా రమ్మంటోందా 
నీ మనసేమంటోందో నీకైనా తెలిసిందా 
చూస్తూ చూస్తూ సుడిగాలల్లే చుట్టేస్తుంటే నిలువెల్లా 
ఉక్కిరి బిక్కిరి ఐపోతున్నా ఊపిరి ఆడక నీ వల్లా 
ఇదరా అదరా ఎద ఏమన్నా తెలిసే వీలుందా 

గోరే గోగోరే గోరే గోరే గోగోరే గోగోరే 
గోరే గోరే గోగోరే గోరే గోరే గోగోరే గోగోరే 

తెగ ఉరుముతు కలకాలం 
తెరమరుగున తన భారం 
మోసుకుంటు తిరగదు మేఘం 
నీలా దాచుకోదుగా అనురాగం 
ముల్లుగా నాటితే నీ వ్యవహారం 
తుళ్ళిపడదా నా సుకుమారం 
మెల్లగ మీటితే నాలో మారం 
పలికుండేదే మమకారం 
ఔనా ఐనా నన్నే అంటావే నేరం నాదా 

గోరే గోగోరే గోరే గోరే గోగోరే గోగోరే 
గోరే గోరే గోగోరే గోరే గోరే గోగోరే గోగోరే 

వెంటపడుతుంటే వెర్రి కోపం 
నువ్వు కంటపడకుంటే పిచ్చి తాపం 
మండిపడుతుందే హృదయం 
మరిచే మద్యమైనా చెప్పదే సమయం 
నీతోనీకే నిత్యం యుద్ధం ఎందుకు చెప్పవే సత్యభామా 
ఏం సాధిస్తుందే నీ పంతం ఒప్పుకుంటే 
తప్పు లేదే ఉన్న ప్రేమా 
తగువా మగువా నా పొగరంటే నీకిష్టం కాదా 

గోరే గోగోరే గోరే గోరే గోగోరే గోగోరే 
గోరే గోరే గోగోరే గోరే గోరే గోగోరే గోగోరే 



మనసే తడిసేలా పాట సాహిత్యం

 
చిత్రం: కిక్ (2009)
సంగీతం: ఎస్.ఎస్.థమన్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: వర్ధని థమన్

మనసే తడిసేలా కురిసే నవ్వుల చిరుజల్లా
సమయం మెరిసేలా విరిసే ఆశల హరివిల్లా

కంటి కనపడు ప్రాణమ గుండెకు వినబడు మౌనమా

మనసే తడిసేలా కురిసే నవ్వుల చిరుజల్ల
సమయం మెరిసేలా విరిసే ఆశల హరివిల్ల

ఆగని జీవన గానమా ఆ దేవుని వరదానమా

పదములు తరిమాయె తెలిసే అర్ధం నువ్వేనా
పరుగులు అలిసాయే కలిసే తీరం నువ్వేనా

ఓఓఓ ఊఊ ఊఊ ఓ




బాసు మనకి మెమోరి లాస్ పాట సాహిత్యం

 
చిత్రం: కిక్ (2009)
సంగీతం: ఎస్.ఎస్.థమన్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: రవితేజ, అలీ, రంజిత్, రాహుల్ నంబియార్, నవీన్ మాధవ్ 

అ ఆ ఇ ఈ ఉ ఊ ఎ ఏ ఐ
అ ఆ ఇ ఈ ఉ ఊ ఎ ఏ ఐ
హే వాట్స్ అల్ దిస్ అ ఆ ఇ ఈ ఉ
మేటర్ కొంచెం కాట్రవల్లి,  డోంట్ డిస్టర్బ్ బి కూల్ 
అ ఆ ఇ ఈ ఉ ఊ ఎ ఏ ఐ
అ ఆ ఇ ఈ ఉ ఊ ఎ ఏ ఐ
ఛి ఎత్తు పైకెత్తి పాడు
అ ఆ ఇ ఈ ఉ ఊ ఎ ఏ ఐ
అ ఆ ఇ ఈ ఉ ఊ ఎ ఏ ఐ
నీ అయ్య ఎంతసేపు రా అ ఆ ఇ ఈ
మేటర్  లోకి రా

బాసు  మనకి  మెమోరి లాస్ 
అద్ది కోరస్
(బాసు  మనకి  మెమోరి లాస్  
బాసు  మనకి  మెమోరి లాస్)

మ్... గతం గతః
గతమంతా ఖల్లాస్ బతుకంతా బిందాస్
లక లక లక లక లక హే ఏం లక్కీచాన్స్
(గతమంతా ఖల్లాస్ బతుకంతా బిందాస్)
లక లక లక లక లక హే ఏం లక్కీచాన్స్
మధ్యలో ఈ లకలకలేంటిరా
చంద్రముఖిని చూసిన రజినిలాగ
మనకి జనమే యాద్ లేదు గురు, మెమరీ లాస్ షురు
రజినిలా కాదు ఘజినిలా
మైండ్  అంతా ఖాళి ప్లేస్ 
టోటల్ గా మెదడు మటాష్
 జోలి  గా ఉన్నా బాసు జాలిగ పెట్టకు నీ ఫేస్
వెళ్ళిపోయిన  యెస్టర్ డేస్
వదిలేసిన గుర్తుల  ట్రాష్ 
దులిపేసిన మెంటల్ పీస్ కి చెపుతున్నా థాంక్స్ 
మంచిగాని చెడ్డగాని తీపిగాని చేదుగాని
జ్ఞాపకాల జాడలేదు ఫ్లాష్ బ్యాక్  వీడలేదు
లైలాతో ఫెయిల్  అయితే లవ్ ఫేస్
లైఫ్ అంతా ఫీల్అ వడం  నాన్సెన్స్ 
పారు అనడం పాపం దేవదాసు
వేరెవ్వరికో మిస్సెస్సు రా నీ  మిస్సు 
హెల్త్ వెల్త్ వేస్ట్  కద బ్రదర్ 
మత్తు కన్నా మార్పు మస్తు బెటర్ 

హే హే హే హే
గతమంతా ఖల్లాస్ బతుకంతా బిందాస్
లక లక లక లక లక హే ఏం లక్కీచాన్స్
(గతమంతా ఖల్లాస్ బతుకంతా బిందాస్
లక లక లక లక లక హే ఏం లక్కీచాన్స్)

భలే బాగుంటుందే ఖామోషు
ఖాళి దిల్ సే గడిపేయ్ ఆల్వేజ్
ఫ్రెష్ గా  ఉంటె వెయ్యి లేదా వేస్ 
తాజాగా మొదలవదా ప్రతి రోజు
హెల్త్ వెల్త్ వేస్ట్  కద బ్రదర్ 
మత్తు కన్నా మార్పు మస్తు బెటర్ 
బెటర్  బెటర్  బెటర్  బెటర్ మెమోరి లాస్
బాస్ మెమోరి లాస్ బాస్ మెమోరి లాస్
వీడు దేవదాస్ వీడు దేవదాస్
కాదు కాళిదాస్ కాదు కాళిదాస్
ఇది మనకి మస్త్ ఇది మనకి మస్త్
ప ని ప మ గ మ, మనకి మెమోరి లాస్
గ గ స ని స మ, మనకి మెమోరి లాస్ లాస్
మనకి మెమోరి లాస్ లాస్ లాస్ 

మెమోరి లాస్...
ఏ పేస్ ఏ ప్లేస్  పోల్చదుగా నా మనసు
లక లక లక లక హే ఏం  లక్కీచాన్స్
(ఏ పేస్ ఏ ప్లేస్  పోల్చదుగా నా మనసు)
లక లక లక లక హే ఏం లక్కీచాన్స్
బాస్  మనకి మెమోరి లాస్...
ఈ లాస్  ఎంతో లాభం కద బాసూ...
ఈ ఈ లాస్ ఎంతో లాభం కద బాసు
గాలి కానీ పూలు కానీ
పాత హిస్టరీ లు లేని వంద ఏళ్ళ జిందగీలో ప్రతి పూట కొత్తదంట
కాబట్టి కాట్రవల్లీ, ఇది రోగం కాదు మహా రాజయోగం

Palli Balakrishna Tuesday, August 15, 2017



చిత్రం: భలే దొంగలు (2008)
సంగీతం: కె.యమ్.రాధకృష్ణన్
నటీనటులు: తరుణ్ ,ఇలియానా
దర్శకత్వం: కె.విజయ్ భాస్కర్
నిర్మాత: శాఖమురి పాండు రంగారావు
విడుదల తేది: 11.04.2008



Songs List:



రోమియో జూలియట్ పాట సాహిత్యం

 
చిత్రం: భలే దొంగలు (2008)
సంగీతం: కె.యమ్.రాధకృష్ణన్
సాహిత్యం: సాహితి 
గానం: టిప్పు 

రోమియో జూలియట్ 




నీతోనే కలిసి పాట సాహిత్యం

 
చిత్రం: భలే దొంగలు (2008)
సంగీతం: కె.యమ్.రాధకృష్ణన్
సాహిత్యం: వనమాలి 
గానం: షాన్ , గీతామాధురి 

నీతోనే కలిసి 




పంచదార ఎడారిలో పాట సాహిత్యం

 
చిత్రం: భలే దొంగలు (2008)
సంగీతం: కె.యమ్.రాధకృష్ణన్
సాహిత్యం: వేటూరి 
గానం: టిప్పు, గాయత్రీ 

పంచదార ఎడారిలో 




మనసులో నువ్వేనా పాట సాహిత్యం

 
చిత్రం: భలే దొంగలు (2008)
సంగీతం: కె.యమ్.రాధకృష్ణన్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి 
గానం: ఉదిత్ నారాయణ్, చిత్ర 

మనసులో నువ్వేనా 



పసందైన వేళా వయ్యరాల కోయిలా పాట సాహిత్యం

 
చిత్రం: భలే దొంగలు (2008)
సంగీతం: కె.యమ్.రాధకృష్ణన్
సాహిత్యం: కె.యమ్.రాధకృష్ణన్
గానం: చిత్ర, కె.యమ్.రాధకృష్ణన్

పసందైన వేళా వయ్యరాల కోయిలా 
ఒడే చేర రమ్మంది వస్తావా ఇలా 
హుఁ హుఁ హుఁ రా...

ఈ మల్లిమొగ్గ నీదే ఈ బుల్లీ బుగ్గ నీదే
కన్నే సిగ్గు నీదే కాటేసే ముద్దు నీదే
పాలు పళ్ళు నీవే బంగారు ఒళ్ళు నీదే
కొంటె నవ్వు నీదే గుండెల్లో జివ్వు నీదే
నువ్వడిగిందల్లా ఇస్తారారా పోకిరి

ఈ మల్లిమొగ్గ నీదే ఈ బుల్లీ బుగ్గ నీదే
కన్నే సిగ్గు నీదే కాటేసే ముద్దు నీదే
పాలు పళ్ళు నీవే బంగారు ఒళ్ళు నీదే
కొంటె నవ్వు నీదే గుండెల్లో జివ్వు నీదే
నువ్వడిగిందల్లా ఇస్తారారా పోకిరి

హే వంటరిగుంటే పోరు గుండెల్లోన హోరు 
లవ్వో గివ్వో ఏదో లాగించేయ్ గురూ
చూశాలే నీ జోరు ఎందుకు ఆ కంగారు 
నే రెచ్చానంటే వేడెక్కదా వింటరూ
హే ముద్దొచ్చేలా ముద్దిచ్చేయ్ నా 
మత్తెక్కేలా మురిపించే నా
రారా ఇల్లా రారాజులా సాగించేద్దాం ముక్కాబ్బులా
వద్దే నాటి నారి ఇంకొద్దే ముద్దుల ప్యారి 
కితకిత లెడితే పోరి కుమ్మేస్తాడీషికారి 
నీ తట్టా బుట్టా సర్దే జల్దీ జాంగిరి

ఈ మల్లిమొగ్గ నీదే ఈ బుల్లీ బుగ్గ నీదే
కన్నే సిగ్గు నీదే కాటేసే ముద్దు నీదే
పాలు పళ్ళు నీవే బంగారు ఒళ్ళు నీదే
కొంటె నవ్వు నీదే గుండెల్లో జివ్వు నీదే
నువ్వడిగిందల్లా ఇస్తారారా పోకిరి

కావాలంటూ బోణి కటేస్తుందోయ్ వోణి 
కాస్తో కూస్తో కానీ జవానీ పని
చెప్పొద్దే కహానీ చెయ్యొద్దే ఖుర్బానీ 
చల్లా కొచ్చి ముంతా దాచోద్దే హనీ
నీతో ఇల్లా ఉండాలనీ ఏదేదేదో చెయ్యాలని 
రమ్మన్నాలే రాజాజాని ఓ ఎస్ అంటే నీ బాంచనీ
వద్దన్నా వయ్యారి పడమాకే ఒల్లో జారీ 
లెఫ్టో రైటో చేరి దరువెయ్యోద్దే తందూరి 
నీ నకరాలింక చాల్లే చెక్కే చోకిరీ

ఈ మల్లిమొగ్గ నీదే ఈ బుల్లీ బుగ్గ నీదే
కన్నే సిగ్గు నీదే కాటేసే ముద్దు నీదే
పాలు పళ్ళు నీవే బంగారు ఒళ్ళు నీదే
కొంటె నవ్వు నీదే గుండెల్లో జివ్వు నీదే
నువ్వడిగిందల్లా ఇస్తారారా పోకిరి 

ఈ మల్లిమొగ్గ నీదే ఈ బుల్లీ బుగ్గ నీదే
కన్నే సిగ్గు నీదే కాటేసే ముద్దు నీదే
పాలు పళ్ళు నీవే బంగారు ఒళ్ళు నీదే
కొంటె నవ్వు నీదే గుండెల్లో జివ్వు నీదే
నువ్వడిగిందల్లా ఇస్తారారా పోకిరి హోయ్...




చోటా చోటా పాట సాహిత్యం

 
చిత్రం: భలే దొంగలు (2008)
సంగీతం: కె.యమ్.రాధకృష్ణన్
సాహిత్యం: చంద్రబోస్
గానం: టిప్పు 

చోటా చోటా 

Palli Balakrishna Tuesday, August 1, 2017




చిత్రం: జల్సా (2008)
సంగీతం: దేవీ శ్రీ ప్రసాద్
నటీనటులు: పవన్ కళ్యాణ్, ఇలియానా, పార్వతి మెల్టన్
దర్శకత్వం: త్రివిక్రమ్ శ్రీనివాస్
నిర్మాత: అల్లు అరవింద్
విడుదల తేది: 02.04.2008



Songs List:



కరో కరో జర జల్సా పాట సాహిత్యం

 
చిత్రం: జల్సా (2008)
సంగీతం: దేవీ శ్రీ ప్రసాద్
సాహిత్యం: సిరి వెన్నెల
గానం: బాబా సెహగల్ ,  రీటా 

సరిగమపదనిస అరె కరో కరో జర జల్సా స జల్సా
సనిదపమగరిస అరె కరో కరో జర జల్సా స జల్సా
తెల్సా తెల్సా తెల్సా ఎవ్వరికైనా తెల్సా
సునామీ ఎదురుగ వస్తే ఎలాగ కనబడుతుందో
తెల్సా తెల్సా తెల్సా ఎవ్వరికైనా తెల్సా
తుఫానే తలుపులు తడితే ఎలాగ వినబడుతుందో
అరె తెలియకపోతే చూడర బాబూ 
హిజ్ హ్యూమన్ సునామీ
తెలియాలనుకుంటే డేంజర్ బాబూ 
యు హావ్ గాట్ బిలీవ్ మి
హే సరిగమపదనిస అరె కరో కరో జర జల్సా స జల్సా
హే సనిదపమగరిస అరె కరో కరో జర జల్సా స
వన్ మోర్ టైమ్ జల్సా

చరణం: 1
హైటెంతుంటాడో కొలవాలనిపిస్తే అమాంతమూ
అలా అలా మౌంటెవరెస్ట్ అవుతాడు
ఫైటేంచేస్తాడో అని సరదాపడితే స్ట్రెచర్ తనై
సరాసరి వార్డుకి చేరుస్తాడు
అరె గడ్డిపోచ అనుకుని తుంచడానికొస్తే
గడ్డపార నమిలేస్తాడు
గుండు సూది చేతికిచ్చి దండ గుచ్చమంటే
కొండ తవ్వి పారేస్తాడూ
హే సరిగమపదనిస అరె కరో కరో జర జల్సా స జల్సా
హే సనిదపమగరిస అరె కరో కరో జర జల్సా

చరణం: 2
మనవాడనుకుంటే చెలికాడవుతాడు
హెయ్ విమానమై భుజాలపై సవారి చేయిస్తాడు
పగవాడనుకుంటే విలుకాడవుతాడు
హెయ్ ప్రమాదమై క్షణాలలో శవాలు పుట్టిస్తాడు
హే దోసెడు పూలను తెచ్చిపెట్టమంటే 
తోటలన్నీ నొల్లుకొస్తాడు
యమపాశం వచ్చి పీకచుట్టుకుంటే 
దానితోటి ఊయలూగుతాడు
సరిగమపదనిస అరె కరో కరో జర జల్సా స జల్సా
సనిదపమగరిస అరె కరో కరో కరో జర జల్సా స జల్సా



మై హార్ట్ ఈజ్ బీటింగ్ పాట సాహిత్యం

 
చిత్రం: జల్సా (2008)
సంగీతం: దేవీ శ్రీ ప్రసాద్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: కె.కె

మై హార్ట్ ఈజ్ బీటింగ్ అదోలా తెలుసుకోవా అదీ
ఎన్నాళ్ళీ వెయిటింగ్ అనేలా తరుముతోంది మదీ

పెదవిపై పలకదే మనసులో ఉన్న సంగతి
కనులలో వెతికితే దొరుకుతుందీ
టీ స్పూన్ టన్ను బరువవుతుందే
ఫుల్ మూన్ నన్ను ఉడికిస్తుందే
క్లౌడ్ 9 కాళ్ళకిందకొచ్చిందే
లాండ్ మైన్ గుండెలో పేలిందే దే దే

మై హార్ట్ ఈజ్ బీటింగ్ అదోలా తెలుసుకోవా అదీ
ఎన్నాళ్ళీ వెయిటింగ్ అనేలా తరుముతోంది మదీ

Hey I wanna be with you forever
Hey I wanna live with you forever

పెనుతుఫాను ఏదైనా మెరుపుదాడి చేసిందా
మునుపు లేని మైకానా మదిని ముంచి పోయిందా
ఊరికినే పెరగదుగా ఊపిరి సలపని భారమిలా
నీ ఉనికే ఉన్నదిగా నాలో నిలువెల్లా
తలపులలో చొరబడుతూ గజిబిజిగా చెలరేగాలా
తలగడతో తలబడుతూ తెల్లార్లు ఒంటరిగా వేగాలా
సెల్ ఫోన్ నీ కబురు తెస్తుంటే స్టెన్ గన్ మోగినట్టు ఉంటుందే
క్రాంప్టన్ ఫాను గాలి వీస్తుంటే సైక్లోన్ తాకినట్టు ఉంటుందే దే దే

మై హార్ట్ ఈజ్ బీటింగ్ అదోలా తెలుసుకోవా అదీ
ఎన్నాళ్ళీ వెయిటింగ్ అనేలా తరుముతోంది మదీ

ఎప్పుడెలా తెగిస్తానో నా మీదే నాకు అనుమానం
మాటల్లో పైకనేస్తానో నీ మీద ఉన్న అభిమానం
త్వరత్వరగా తరిమినదే పదపదమని పడుచు రథం
యదలయలో ముదిరినదే మదనుడి చిలిపి రిథం
గుసగుసగా పిలిచినదే మనసున మెరిసిన కలలవనం
తహతహగా తరిమినదే ధమ్ రె ధమ్ అని తూలే ఆనందం
ఫ్రీడం దొరికినట్టు గాలుల్లో వెల్కం పిలుపు వినిపిస్తుందే
బాణం వేసినట్టు ఏ విల్లో ప్రాణం దూసుకెళ్ళిపోతుందే దే దే

మై హార్ట్ ఈజ్ బీటింగ్ అదోలా తెలుసుకోవా అదీ
ఎన్నాళ్ళీ వెయిటింగ్ అనేలా తరుముతోంది మదీ




యు అండ్‌ ఐ (ఏ జిందగీ నడవాలంటే హస్తే హస్తే ) పాట సాహిత్యం

 
చిత్రం: జల్సా (2008)
సంగీతం: దేవీ శ్రీ ప్రసాద్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: దేవీ శ్రీ ప్రసాద్

ఏ జిందగీ నడవాలంటే హస్తే హస్తే నదిలో దిగి ఎదురీదాలి అంతే అంతే 
హీరోషిమా  ఆగిందా ఆటంబాంబేేస్తే
ఛల్ చక్ దే చక్ దే అంటే పదినాళ్ళే చస్తామంతే 
హకునామ టాటా అనుకో తమాషగా తలఊపి 
వెరైటీగా శబ్ధం విందాం అర్ధం కొద్దిగా సైడుకి జరిపి 
అదే మనం తెలుగులో అంటే డోంట్‌ వర్రీ బిహ్యాపీ 
మరోరకంగా మారుద్దాం కొత్తదనం కలిపి

యు అండ్‌ ఐ లెట్స్ గో హై అండ్ డు భల్లే భల్లే 
లైప్ ఈజ్ లైక్ సాటర్ డే నైట్ లెట్స్ డు భల్లే భల్లే
లెట్స్ డు భల్లే భల్లే లెట్స్ డు భల్లే భల్లే

ఏ జిందగీ నడవాలంటే హస్తే హస్తే నదిలో దిగి ఎదురీదాలి అంతే అంతే 
హీరోషిమా  జీరో అయిందా  ఆటంబాంబేదో వేస్తే
ఛల్ చక్ దే చక్ దే అంటే పదినాళ్ళే చస్తామంతే

చరణం: 1 
ఎన్నో రంగుల జీవితం నిన్నే పిలిచిన స్వాగతం విన్నా నీలో సంశయం పోదా
ఉంటే నీలో నమ్మకం కన్నీరైన అమృతం కష్టం కూడా అధ్భుతం కాదా 
బొటానికల్ బాషలో మెటల్స్ పూరేకులు 
మెటీరియల్ సైన్స్ లో కలలు మెదడు పెనుకేకలు 
మెకానికల్ శ్వాసలో ఉసూరనే ఊసులు 
మనస్సు పరి భాషలో మధురమైన కధలు

యు అండ్‌ ఐ లెట్స్ గో హై అండ్ డు భల్లే భల్లే 
లైప్ ఈజ్ లైక్ సాటర్ డే నైట్ లెట్స్ డు భల్లే భల్లే
లెట్స్ డు భల్లే భల్లే లెట్స్ డు భల్లే భల్లే

ఏ జిందగీ నడవాలంటే హస్తే హస్తే నదిలో దిగి ఎదురీదాలి అంతే అంతే 
హీరోషిమా  జీరో అయిందా  ఆటంబాంబేదో వేస్తే
ఛల్ చక్ దే చక్ దే అంటే పదినాళ్ళే చస్తామంతే 

చరణం: 2 
పొందాలంటే విక్టరీ పోరాటం కంపల్సరీ రిస్కంటే ఎల్లామరి బోలో 
ఎక్కాలంటే హిమగిరి ధిక్కారం తప్పనిసరి కాలం మొక్కే హిస్టరీ లిఖనా 
ఇథోఫియా ఊహలో అటో ఇటో సాగుదాం 
యుకోరియా ఊపులో ఎగసి ఎగసి చెలరేగుదాం 
ఫిలాసఫీ చూపులో ప్రపంచమో బూటకం 
ఎనాటమి ల్యాబులో మనకు మనము దొరకం

యు అండ్‌ ఐ లెట్స్ గో హై అండ్ డు భల్లే భల్లే 
లైప్ ఈజ్ లైక్ సాటర్ డే నైట్ లెట్స్ డు భల్లే భల్లే
లెట్స్ డు భల్లే భల్లే లెట్స్ డు భల్లే భల్లే




చలోరే చలోరే చల్ పాట సాహిత్యం

 
చిత్రం: జల్సా (2008)
సంగీతం: దేవీ శ్రీ ప్రసాద్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: రంజిత్

చలోరే చలోరే చల్ చలోరే చలోరే చల్ 
చలోరే చలోరే చల్ చల్ (2)

నీ పయనం ఎక్కడికో నీకు తెలియాలిగా 
ఏ సమరం ఎవ్వరితో తేల్చుకో ముందుగా

చలోరే చలోరే చల్ చలోరే చలోరే చల్ 
చలోరే చలోరే చల్ చల్ (2)

చంపనిదే బతకవనీ బతికేందుకు చంపమనీ 
నమ్మించే అడవిని అడిగేం లాభం బతికే దారెటనీ 
చలోరే చలోరే చల్ చలోరే చలోరే చల్ 
చలోరే చలోరే చల్ చల్ 
సంహారం సహజమనీ సహవాసం స్వప్నమనీ 
తర్కించే తెలివికి తెలిసేనా తానే తన శతృవనీ
చలోరే చలోరే చల్ చలోరే చలోరే చల్ 
చలోరే చలోరే చల్ చల్ 
నీ పయనం ఎక్కడికో నీకు తెలియాలిగా 
ఏ సమరం ఎవ్వరితో తేల్చుకో ముందుగా

ధీరులకీ దీనులకీ అమ్మ ఒడి ఒక్కటే 
వీరులకీ చోరులకీ కంటతడి ఒక్కటే 
చలోరే చలోరే చల్ చలోరే చలోరే చల్ 
చలోరే చలోరే చల్ చల్ 
అపుడెపుడో ఆటవికం మరి ఇపుడో ఆధునికం 
యుగయుగాలుగా ఏ మృగాల కన్నా ఎక్కువ ఏం ఎదిగాం
చలోరే చలోరే చల్ చలోరే చలోరే
రాముడిలా ఎదగగలం రాక్షసులను మించగలం 
రకరకాల ముసుగులు వేస్తూ 
మరిచాం ఎపుడో సొంత ముఖం 
చలోరే చలోరే చల్ చలోరే చలోరే 
తారలనే తెంచగలం తలుచుకుంటే మనం 
రవికిరణం చీల్చగలం రంగులుగా మార్చగలం

చలోరే చలోరే చల్ చలోరే చలోరే చల్ 
చలోరే చలోరే చల్ చల్ (2)



హే Jennifer Lopez స్కెచ్ గీసినట్టుగా ఉందిరో ఈ సుందరి  పాట సాహిత్యం

 
చిత్రం: జల్సా (2008)
సంగీతం: దేవీ శ్రీ ప్రసాద్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: బెన్నీ దయల్ , ప్రియా

హే Jennifer Lopez స్కెచ్ గీసినట్టుగా ఉందిరో ఈ సుందరి 
హే Britney Spears ని ప్రింట్ తీసినట్టుగా ఉందిరో ఈ కాడ్బరి 
ఓ నడుమే చూస్తే Shakira దాన్ని అంటుకున్న చెయ్యే లక్కిరా 
నడకే చూస్తే Beyonce  బేబి నవ్విందంటే ఖల్లాసే
ఓ జీన్స్ పాంట్ వేసుకున్న James Bond లాగా గన్ను లాంటి కన్ను కొట్టి చంపమాకురో 
బ్లాక్ బెల్ట్ పెట్టుకొని Jackie Chan లాగా నాన్ చాక్ తిప్పమాకురో 

చరణం: 1
హే లేడికళ్ళ లేజరే నువ్వా పారడైజ్ ఫ్లేవరే నువ్వా 
Oxyzen నింపుకున్న ఆడబాంబువా సాక్సోఫోన్ వంపువే నువ్వా 
ఓ Volcano కి బెస్ట్ ఫ్రెండ్ వా వెయ్యి వోల్ట్స్ హై కరెంటువా
వయసు మీద వాలుతున్న Tornedo నువ్వా Earth Quack థండరేనువ్వా 
నీ రెండు కళ్ళు Radium డయల్సా నీ పెదవులు ప్లాటినం ఫ్లవర్సా 
నువ్వు Hello అంటే రొమాన్సా నీ సైలెన్స్ అయినా వాయిలెన్సా
హే టైటానిక్ హీరోయిన్ పార్ట్ 2 నువ్వని నవ్వుతున్న మోనలిస మొత్తుకోదా 
Playboy చూపులున్న సమురాయ్ నువ్వని సుమోలంత సలాం కొట్టరా

హే Jennifer Lopez స్కెచ్ గీసినట్టుగా ఉందిరో ఈ సుందరి 
Britney Spears ని ప్రింట్ తీసినట్టుగా ఉందిరో ఈ కాడ్బరి 

చరణం: 2
హే DTS రింగుటోన్ వా హార్ట్ షేపు మూనువే నువ్వా
అందమన్న సాఫ్ట్ వేరు CD-ROM వా కమ్మనైన క్లోరోఫామ్ వా
హో రోమెయోకి క్లోనువే నువ్వా రెయిన్బోకి ట్విన్నువే నువ్వా
Dream University కి డీనువే నువ్వా నా Zodiac సైనువే నువ్వా 
హే 24 Carrot Vanila నువ్వు హాట్ హాట్ మెక్సికన్ Taquilla 
Fully Loaded రైఫుల్లా నన్ను రైడ్ చేసావే రాంబోలా
హే మడొన్నాను బంతి చేసి బౌన్సరేసినట్టుగా పల్స్ రేటు పెంచినావే ఫ్రెంచ్ మోడలా 
Maradona లాగిపెట్టి గోల్ కొట్టినట్టుగా Flying Kiss పెట్టమాకురో

హే Jennifer Lopez స్కెచ్ గీసినట్టుగా ఉందిరో ఈ సుందరి 
Britney Spears ని ప్రింట్ తీసినట్టుగా ఉందిరో ఈ కాడ్బరి 




గాల్లో తేలినట్టుందే గుండె పేలినట్టుందే పాట సాహిత్యం

 
చిత్రం: జల్సా (2008)
సంగీతం: దేవీ శ్రీ ప్రసాద్
సాహిత్యం: భాస్కరభట్ల రవి కుమార్
గానం: జి. సాహితి, గోపికా పూర్ణిమ, టిప్పు 

పల్లవి:
గాల్లో తేలినట్టుందే గుండె పేలినట్టుందే
తేనె పట్టు మీద రాయి పెట్టి కొట్టినట్టుందే
ఒళ్ళు ఊగినట్టుందే దమ్ము లాగినట్టుందే
ఫుల్లు బాటిలెత్తి దించకుండా తాగినట్టుందే
ఊర్వశివో నువ్వు రాక్షసివో నువ్వు
ప్రేయసివో నువ్వు నా కళ్ళకి
ఊపిరివో నువ్వు ఊహలవో నువ్వు
ఊయలవో నువ్వు నా మనసుకి

చరణం: 1
హే నిదుర దాటి కలలే పొంగె
పెదవి దాటి పిలుపే పొంగె
అదుపుదాటి మనసే పొంగె నాలో
గడపదాటి వలపే పొంగె
చెంపదాటి ఎరుపే పొంగె
నన్ను దాటి నేనే పొంగె నీ కొంటె ఊసుల్లో
రంగులవో నువ్వు రెక్కలవో నువ్వు
దిక్కులవో నువ్వు నా ఆశకి
తుమ్మెదవో నువ్వు తుంటరివో నువ్వు
తొందరవో నువ్వు నా ఈడుకి

గాల్లో తేలినట్టుందే గుండె పేలినట్టుందే
తేనె పట్టు మీద రాయి పెట్టి కొట్టినట్టుందే
ఒళ్ళు ఊగినట్టుందే దమ్ము లాగినట్టుందే
ఫుల్లు బాటిలెత్తి దించకుండా తాగినట్టుందే

చరణం: 2
తలపుదాటి తనువే పొంగె
సిగ్గుదాటి చనువే పొంగె
గట్టుదాటి వయసే పొంగె లోలో
కనులుదాటి చూపే పొంగె
అడుగు దాటి పరుగే పొంగె
హద్దు దాటి హాయే పొంగె నీ చిలిపి నవ్వుల్లో
తూరుపువో నువ్వు వేకువవో నువ్వు
సూర్యుడివో నువ్వు నా నింగికి
జాబిలివో నువ్వు వెన్నెలవో నువ్వు
తారకవో నువ్వు నా రాత్రికి



Chalore Chalore Chal (Hindi)

 
చిత్రం: జల్సా (2008)
సంగీతం: దేవీ శ్రీ ప్రసాద్
సాహిత్యం: Raqueeb Alam
గానం: దేవీ శ్రీ ప్రసాద్

Chalore Chalore Chal (Hindi)



మై హార్ట్ ఈజ్ బీటింగ్ (Remix) పాట సాహిత్యం

 
చిత్రం: జల్సా (2008)
సంగీతం: దేవీ శ్రీ ప్రసాద్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: కె.కె

మై హార్ట్ ఈజ్ బీటింగ్  (Remix)



సరిగమపదనిస (The Devi Mix)

 
చిత్రం: జల్సా (2008)
సంగీతం: దేవీ శ్రీ ప్రసాద్
సాహిత్యం: సిరి వెన్నెల
గానం: బాబా సెహగల్ ,  దేవీ శ్రీ ప్రసాద్

సరిగమపదనిస అరె కరో కరో జర జల్సా  (The Devi Mix)

Palli Balakrishna Monday, July 31, 2017



చిత్రం: దేవదాసు (2006)
సంగీతం: చక్రి
నటీనటులు: రామ్ పోతినేని, ఇలియానా
దర్శకత్వం & నిర్మాత: వై. వి. యస్. చౌదరి
విడుదల తేది: 11.01.2006



Songs List:



బంగారం బంగారం నీకై వేచానే పాట సాహిత్యం

 
చిత్రం: దేవదాసు (2006)
సంగీతం: చక్రి
సాహిత్యం: చంద్రబోస్
గానం: చక్రి

నా పండూ.. నా బుజ్జీ.. నా కన్నా.. నా నాన్నా
పండూ బుజ్జీ కన్నా నాన్నా బంగారం

బంగారం బంగారం నీకై వేచానే
బంగారం బంగారం నిన్నే చేరానే
నీ పలుకే వినబడుతుంటె నా చెవులే కనులవ్తుంటే
మాటలకే రూపొస్తుంటె నీ ఉనికే కనబడుతుంటె
పంచ ప్రాణాలు లక్ష ప్రాణాలై పొంగిపోయయే

బంగారం బంగారం నీకై వేచానే
బంగారం బంగారం నిన్నే చేరానే

కాయలైన కనులలోన పూలు పూచే రత్తె రత్తె రత్తె రత్తె....
భారమైన కాల్లలోన రెక్కలొచ్చే రత్తె రత్తె రత్తె రత్తె....
రక్తం బదులు అనువుల్లోనా అమ్రుతమేదొ ప్రవహించే
దేహం నుంచి వీదుల్లోకి విద్యుత్తేదొ పావహించె
నువ్వుంటే... నావెంటే... కాదంటె కలానికె నే తాలాలు వేస్తనే

బంగారం బంగారం నీకి వేచానే

నా పండూ.. నా బుజ్జి.. నా కన్న.. నా నాన్న....

ప్రశ్నలాంటి బ్రతుకులోనా బదులు దొరికె రత్తె రత్తె రత్తె రత్తె...
పేదలిన ఎదకు ప్రేమ నిదులు దొరికె రత్తె రత్తె రత్తె రత్తె...
ఇప్పటికిప్పుడు ఉప్పెనతెచ్చె సంతోషాలె ఎదురొచ్చె
కుప్పలుతెప్పలు స్వర్గాలుండె సమ్రాజ్యాలె కనిపించే
నువ్వుంటే... నావెంటే... నాకంతె దెవుల్లకె నేను వరాలు ఇస్తానే

బంగారం బంగారం నీకై వేచానే
బంగారం బంగారం నిన్నే చేరానే
నీ పలుకే వినబడుతుంటె నా చెవులే కనులవ్తుంటే
మాటలకె రూపొస్తుంటె నీ ఉనికే కనబడుతుంటె
పంచ ప్రాణాలు లక్ష ప్రాణాలై పొంగిపోయయే

బంగారం బంగారం నీకై వేచానే
బంగారం బంగారం నిన్నే చేరానే




నిజంగా చెప్పలంటె క్షమించూ పాట సాహిత్యం

 
చిత్రం: దేవదాసు (2006)
సంగీతం: చక్రి
సాహిత్యం: చంద్రబోస్
గానం: చక్రి

త నా నా నిజంగా
తా న నా న చెప్పలంటె
నిజంగా చెప్పలంటె క్షమించూ
నా పరంగ తప్పె ఉంటె క్షమించూ
చిరాకె తెప్పించనంటె క్షమించూ
ని మన్నస్సె నొప్పించనంటె క్షమించూ
దయె చేసి excuse me
దరి చేరి forgive me
ఒకసారి believe me
అహ్ హొ ఓ ఓ అహ్ హొ ఓ ఓ
పాట ఆలకించూ
నా మనవి చిత్తగించూ
కాస్త హెచ్చరించు
తరువాత బుజ్జగించు

నిజంగా చెప్పలంటె క్షమించూ
నా పరంగ తప్పె ఉంటె క్షమించూ

పెదాల్లోని తొందరపటె
పదాల్లొని వేగిరపాటె
నిదానించి బతిమాలాయి క్షమించూ
పదారెల్ల అనుమానాలె తుదేలేని ఆలోచనలె
తలొంచేసి నించున్నాయి క్షమించూ
చూపుల లోపల కలిగిన మర్పును
సూటిగ గమనించు
చెంపల వెలుపల పొంగిన రంగును
నేరుగ గుర్తించు
హ్రుదయం అంతట నిండిన ప్రతిమను
దర్సించు ఆపైన ఆలొచించు

నిజంగా ఓహొ క్షమించూ
నిజంగా ఆ క్షమించూ

తగాదాలె చెలిమికి పునాది
విభేదాలె ప్రేమ పునాది
గతం అంతా మంచికి అనుకొని క్షమించూ
తపించేతి ఈ పాపాయిని
బరించేటి ఈ ముద్దాయిని
ప్రియా అంటూ ముద్దుగ పిలిచి క్షమించూ
పిడికెడు గుండెను చీకటి బోలెడు
భారం తగ్గించు
ఇరువురి నడుమున ఇంతకు ఇంత దూరం తొలగించు
అనువనువున మమతల చెరలొ బందించు
వందెల్లు ఆనందించు

నిజంగా ఆ క్షమించూ
నిజంగా ఆ క్షమించూ
ల ల ల లలలలల క్షమించూ
ల ల ల లలలలల క్షమించూ
దయె చేసి excuse me
దరి చేరి forgive me
ఒకసారి believe me
అహ్ హొ ఓ ఓ అహ్ హొ ఓ ఓ
పాట ఆలకించు
నా మనవి చిత్తగించు
కాస్త హెచ్చరించు
తరువాత బుజ్జగించు

నిజంగా చెప్పలంటె క్షమించు
నా పరంగ తప్పె ఉంటె క్షమించు




నువ్వంటేనే ఇష్టం పాట సాహిత్యం

 
చిత్రం: దేవదాసు (2006)
సంగీతం: చక్రి
సాహిత్యం: చంద్రబోస్
గానం: చక్రి

నువ్వంటేనే ఇష్టం నువు కాదంటేనే కష్టం
నువ్వంటేనే ఇష్టం నువు కాదంటేనే కష్టం
ఏం చేయమంటావో ఓ... ఓ... ప్రియతమా...
ఆకాశం నేలైనా ఈ నేలే నింగైనా ఆ రెండూ లేకున్నా...

నువ్వంటేనే ఇష్టం నువ్వంటేనే ఇష్టం
నువ్వంటేనే ఇష్టం నువు కాదంటేనే కష్టం
నువ్వంటేనే ఇష్టం నువు కాదంటేనే కష్టం

రంపంతోనే వద్దు నీ రూపంతో కోసెయ్యి
సుడిగుండంలో వద్దు నీ ఒడిలో నన్నే
నిలువున ముంచెయ్యి
నిప్పులతోనే వద్దు కనుచూపులతో కాల్చేయ్యి
ఉరితాడసలే వద్దు నీ వాలుజడతోనే నా ఊపిరి తియ్యి
మందుపాతరే వద్దమ్మో ముద్దుపాతరే చాలమ్మో
తిరుగుబాటులే వద్దమ్మో అడుగు కింద నలిపేయమ్మో
ఇష్టం ఇష్టం ఐనా ఇష్టం
నువు నన్నే చంపు నాలో ప్రేమని కాదంటే కష్టం

నువ్వంటేనే  హే నువ్వంటేనే
నువ్వంటేనే ఇష్టం నువు కాదంటేనే కష్టం
ఏం చేయమంటావో ఓ... ఓ... ప్రియతమా...

పాతాళానికి వద్దు ఏ నరకానికి పంపొద్దు
నీ గుండెల గుహలో నన్ను
తెగ హింసించెయ్యి అంతే చూసెయ్యి
కారాగారం వద్దు ఏ చెరసాలకి పంపొద్దు
నీ కౌగిలిలోనే నన్ను నువు బంధించెయ్యి
నన్నంతం చెయ్యి
వేల సార్లు నే జన్మిస్తా వేల సార్లు నే మరణిస్తా
ఒక్కసారి నువు ప్రేమిస్తే చావులేక నే బ్రతికేస్తా
ఇష్టం ఇష్టం ఇది నాకిష్టం
ఏ కష్టాన్నైనా ఎదిరిస్తాను కాదంటే కష్టం

నువ్వంటేనే  హే నువ్వంటేనే
నువ్వంటేనే ఇష్టం నువు కాదంటేనే కష్టం
ఏం చేయమంటావో ఓ... ఓ... ప్రియతమా...
ఆకాశం నేలైనా ఈ నేలే నింగైనా ఆ రెండూ లేకున్నా






అడిగీ అడగలేక పాట సాహిత్యం

 
చిత్రం: దేవదాసు (2006)
సంగీతం: చక్రి
సాహిత్యం: చంద్రబోస్
గానం: చక్రి

అడిగీ అడగలేక ఒక మాటే అడగనా
అడిగీ అడగలేక ఒక మాటే అడగనా
తెలిపీ తెలుపలేక ఒక మాటే తెలుపనా
ఆశగ అడగనా నీ అడుగునై అడగనా
మౌనమై తెలుపన నీ దానినై తెలుపనా
యెన్ని జన్మలైన జంట వీడరాదనీ

అడిగీ అడగలేక ఒక మాటే అడగనా
తెలిపీ తెలుపలేక ఒక మాటే తెలుపనా

నీకన్న మెత్తనిది నీ మనసే నచ్చినదీ
నీకన్న వెచ్చనిది నీ శ్వాసే నచ్చినదీ
పెదవి కన్న యెద తీయనిదీ
కనులకన్న కద అల్లనిదీ
నువ్వు కన్న సిగ్గే నాన్యమైనదీ
జన్మ కన్న ప్రేమే నమ్మికైనదీ
యెన్ని జన్మలైన ప్రేమ మాయరాదనీ

అడిగీ అడగలేక ఒక మాటే అడగనా
తెలిపీ తెలుపలేక ఒక మాటే తెలుపనా

నీకన్న చల్లనిది నీ నీడే దొరికిందీ
నీకన్న నిజమైంది నీ తోడే నాకుంది
సొగసు కన్న వొడి వాడనిదీ
బిగుసుకున్న ముడి వీడనిదీ
ముల్లు లేని పువ్వే ప్రేమ అయినదీ
పూలు లేని పూజే ప్రేమ అన్నదీ
యే జన్మలోన ప్రేమ పూజ మానరాదనీ

అడిగీ అడగలేక ఒక మాటే అడగనా
తెలిపీ తెలుపలేక ఒక మాటే తెలుపనా
ఆశగ అడగనా నీ అడుగునై అడగనా
మౌనమై తెలుపన నీ దానినై తెలుపనా
బాస చేసుకున్న మాట మార్చరాదనీ




కుర్రాళ్ళు పాట సాహిత్యం

 
చిత్రం: దేవదాసు (2006)
సంగీతం: చక్రి
సాహిత్యం: చంద్రబోస్
గానం: మాలతి

ఝంచక్కిడిచింధులకైనా
ధీం తొక్కిడి సందడికైనా
ఒర్రబ్బా
ఒర్రబ్బా

ఝాం చక్కిడిచింధులకైనా
ధోం తొక్కిడి సందడికైనా
వెంటపడివచ్చేవాళు కుర్రాల్లు
సొంపాపిడివింధులకైనా
ఆ comedy సంధులకైనా
జంటపడివచ్చేవాళుకుర్రాల్లు
బ్రమాండం
బద్దలుకొట్టి
బ్రమాండం బద్దలుకొట్టె అణుబాంబులు కుర్రాళ్లు
వయారం వాసనపట్టె గలిచీమలు కుర్రాల్లు
చూపులతోనె గుచ్చేస్తారు సూదులు
హేమాటలతోనే వేసేత్తారు మందులు

ఝాం చక్కిడి ఝాం చక్కిడి ఝాం చక్కిడి ఝాంచక
ఝంచక్కిడి చింధులకైనా
ధోంతొక్కిడి సందడికైనా
వెంటపడి వచ్చేవాళు కుర్రాల్లు

మనసు అనె ముంగిలికి మంచి అనె వాకిళికి
దారాలు మీ కుర్రాల్లు
కోరుకునే గుండెలకీ కన్నెపులధండలకి
దారాలు మీ కుర్రాల్లు
కొంచం కెడీలు కొంచం rowdyలు
అచ్చం heroలు మీ కుర్రాల్లు
మొసే గొబ్బిలు
మొసే గొబ్బిల్లు
(మీరే మీరే మీరే మీరే)
బిగిసే కౌగిళు
(మీరే మీరే మీరే మీరే
బ్రమాండం బద్దలుకొట్టె అణుబాంబులు కుర్రాల్లు
బ్రహ్మయ్యికి అర్ధం కానీ తలరాతలు కుర్రాళ్లు

ఝాం చక్కిడి చిందులకైనా
ధోంతొక్కిడి సందడికైనా
వెంటపడి వచ్చేవాళుకుర్రాల్లు

కలుసుకోక కన్ను కొట్టి ముట్టుకోక ముద్దు పెట్టె ముదుర్లు మీ కుర్రాల్లు
అడుగుతుంటే ఆశ పెట్టి అడగకుంటై దోచి పెట్టె జాదులు మీ కుర్రాల్లు
చూస్తే చిన్నాలు లేస్తే తిక్కలు మాకే ఎక్కిళు మీ కుర్రాల్లు
చిలిపి ఎక్కిళ్లు
(మీరే మీరే మీరే మీరే
చిలకా కొట్టుడ్లు
(మీరే మీరే మీరే మీరే)
బ్రమాండం బద్దలుకొట్టై అణుబాంబులు కుర్రాల్లు
ఆస్వర్గం కిందకు దించ్చె శ్రమజీవులు కుర్రాల్లు
చూపులతోనె గుచ్చేస్తారు సూదులు
హేమాటలతోనే వేసేత్తారు మందులు

ఝంచక్కిడి ఝాం చక్కిడి ఝాం చక్కిడి ఝాం చక్కిడి
ఝాం చక్కిడి చిందులకైనా
దొంతొక్కిడి సందడికైనా
వెంటపడి వచ్చేవాళుకుర్రాల్లు
సొంపాపిడి వింధులకైనా
ఆ comedy సంధులకైనా
జంటపడి వచ్చేవాళు కుర్రాల్లు





తెలుసా తెలుసా (Title Rolling Song) పాట సాహిత్యం

 
చిత్రం: దేవదాసు (2006)
సంగీతం: చక్రి
సాహిత్యం: చంద్రబోస్
గానం: చెర్రి, రేవతి 

తెలుసా  తెలుసా తెలుసా  తెలుసా తెలుసా  
తెలుసా  మనసా తెలుసా  మనసా తెలుసా  

గుండెల్ని పిండేది తెలుసా 
యే స్వార్దం లేనిది తెలుసా
యే మలినం లేనిది తెలుసా 
యే కపటం లేనిది తెలుసా
యే బందం లేనిదిరా 
అనుబందం అయినది రా 
యే చుట్టం కానిదిరా 
నీ చుట్టూ చేరునురా
ప్రతి రోజు వచ్చె పచ్చని పండుగరా ప్రేమా
బ్రతుకంత నిలిచె తీయని కానుకరా ప్రేమా

గుండెల్ని పిండేది - తెలుసా 
యే స్వార్దం లేనిది  - తెలుసా
యే మలినం లేనిది - తెలుసా 
యే కపటం లేనిది  - తెలుసా

తెలుసా  తెలుసా తెలుసా  తెలుసా తెలుసా  
తెలుసా  మనసా తెలుసా  మనసా తెలుసా  



ఒక నేస్తం కావాలే పాట సాహిత్యం

 
చిత్రం: దేవదాసు (2006)
సంగీతం: చక్రి
సాహిత్యం: చంద్రబోస్
గానం: చక్రి

యేదో యేదో కావాలె కావాలే
ఏదో కావాలె ఇంకెదొ కావాలే
యే యి యే ఏదో కావాలె
యే యి యే ఇంకేదో కావాలే

యే యి యే ఒక నేస్తం కావాలే
యే యి యే తన friedship కావాలే
అవదులు లేని ఆనందానికి అర్దం కావాలే
పరిమితి లేని ఆలోచనలకి ప్రాణం కావాలే
ఇదివరకెన్నడు పరిచయం అవని
ఇకపై ఎప్పుడు దూరం కాని
నాకొ కొత్త లోకం కావాలె యే యే యే యే

యే యి యే ఒక నేస్తం కావాలే
యే యి యే తన friedship కావాలే
pocket లోన అలలుగ ఎగిసె సంద్రం కావాలే
pocket వెనక మనసుని నిమిరె బందం కావాలే
ఇదివరకెన్నడు పరిచయం అవని
ఇకపై ఎప్పుడు దూరం కాని
నాకొ కొత్త లోకం కావాలె యే యే యే యే

యే యి యే ఒక నేస్తం కావాలె
యే యి యే తన friedship కావాలె

తాను మేఘం లాగ రావాలే
నేను బూతాలం లా మారాలే
రంగుల వర్షం లో ప్రతి గడియా గడపాలే
పరిమల వర్షం లో ప్రతి క్షనము తడవాలే
నా నిమిషాలన్ని మెరుపులు చేసి
గంటలు తేనెల పంటలు చేసి
రోజొక రేపు గ ఎదుటె నిలిపే నేస్తం కావాలే

ఏదో కావాలె ఇంకెదొ కావాలే
ఏదో చెయ్యాలె ఇంకేదొ ఏదో ఏదో ఏదో
యే యి యే ఒక నేస్తం కావాలే
యే యి యే తన friedship కావాలే

తాను రాగం లాగ రావాలే
నేను అనురాగం లా నిలవాలే
గీతలు మారేల ఓ గీతం పాడాలే
నీరులు కలిసేల ఓ తీరం చేరాలే
నా కమ్మని కాలాలకి riming తానై
తుంటరి మనసుకి tuning తానై
జీవిత కాలపు simphony లో
తన company కావాలె హే హే హే

ఏదో కావాలె ఇంకెదొ కావాలె
ఏదో చెయ్యాలె ఇంకేదొ ఏదో ఏదో ఏదో
యే యి యే ఒక నేస్తం కావాలె
యే యి యే తన friedship కావాలె





హేయ్ బాబు ఏంటి సంగతి పాట సాహిత్యం

 
చిత్రం: దేవదాసు (2006)
సంగీతం: చక్రి
సాహిత్యం: చంద్రబోస్
గానం: అనుష్క  మంచంద

సాబ్ తీక్ తొ హేయ్ నా
నే చెప్పె ప్రేమ సూక్తులు
భూల్ మత్ నా జానా

హేయ్ బాబు ఏంటి సంగతి
సాబ్ తీక్ తొ హేయ్ నా
నే చెప్పె ప్రేమ సూక్తులు
భూల్ మత్ నా జానా

మనసారా సున్ లో నా మనసుంటే సంజోన
అటుపై ఆ మత్తులొ
జాగ్రతలె జల్ది సీకోన

హేయ్ బాబు ఏంటి సంగతి
సాబ్ తీక్ తొ హేయ్ నా
నే చెప్పె ప్రేమ సూక్తులు
భూల్ మత్ నా జానా

అల్లరి పిల్ల చక్కెర బిల్ల
టక్కున రావేలా......
చక్కని వాదు వచ్చెను
చూడు తోటకు ఈ వేలా....

ఆమ్మాయి పైనా కన్నెస్తె కన్నా
చీ అన్న పీచె జానా
వాల్ల అమ్మ నాన్నా ఆపేస్తు ఉన్నా
ఆగొద్దు ఆగె చల్ నా
ఒంటి కుండదిక ఖాన పీన
కంటి కుందదిక తోడ సోన
వల్ల కాన్ని నానా హైరానా
వెల్లలేవు యే దావాఖాన
పిచ్చొడివి అంటుందిరా సారా జమానా

హేయ్ బాబు ఏంటి సంగతి
సాబ్ తీక్ తొ హేయ్ నా
నే చెప్పె ప్రేమ సూక్తులు
భూల్ మత్ నా జానా

పడిపోతు ఉన్నా లేవాలి కన్నా
ప్రేమిస్తె కైకు డర్ నా
మునకేస్తు ఉన్నా తేలాలి మున్నా
మనసిస్తె కుచ్ భి కర్నా
ఆమె రూపమిక దిల్ మే భర్నా
ప్రేమ కోసమిక జీనా మర్నా
అర్దమైతె మరి చాన చానా
ఆచి తూచి ఒక నిర్నయ్ లేనా
ఏం జరిగిన నన్నడగక
భగ్వాన్ కొ స్మర్నా

హేయ్ బాబు ఏంటి సంగతి
సాబ్ తీక్ తొ హేయ్ నా
నే చెప్పె ప్రేమ సూక్తులు
భూల్ మత్ నా జానా

మనసారా సున్ లో నా మనసుంటే సంజోన
అటుపై ఆ మత్తులొ
జాగ్రతలె జల్ది సీకోన





గుండెల్ని పిండేది పాట సాహిత్యం

 
చిత్రం: దేవదాసు (2006)
సంగీతం: చక్రి
సాహిత్యం: చంద్రబోస్
గానం: చక్రి

గుండెల్ని పిండేది తెలుసా యే స్వార్దం లేనిది తెలుసా
యే మలినం లేనిది తెలుసా యే కపటం లేనిది తెలుసా
యే బందం లేనిదిరా అనుబందం అయినదిరా
ప్రతి రోజు వచ్చె పచ్చని పండుగరా ప్రేమా
బ్రతుకంత నిలిచె తీయని కానుకరా ప్రేమా

గుండెల్ని పిండేది తెలుసా యే స్వార్దం లేనిది తెలుసా
యే మలినం లేనిది తెలుసా యే కపటం లేనిది తెలుసా
యే చుట్టం కానిదిరా నీ చుట్టూ చేరునురా
ప్రతి రోజు వచ్చె పచ్చని పండుగరా ప్రేమా
బ్రతుకంత నిలిచె తీయని కానుకరా ప్రేమా

ఒక్కటిగా ఇద్దరు నేర్చె పాటం రా ప్రేమంటె
ఇద్దరిని ఒకటిగ నడిపె పాదం రా ప్రేమంటె
రూపం లేని ఊపిరి ప్రేమ ఓ ఓ ఓ ఓ ఓ ఓ
దీపం లేని వెలుగును ప్రేమ ఓ ఓ ఓ ఓ ఓ ఓ
క్షణ కాలం లొ పుట్టి యుగమంత నిలుచును ప్రేమా
అనువంతె తానుండి జగమంత నిండును ప్రేమ
ప్రేమను కొనగల సిరి వుంటె ఆ సిరి మల్లీ ప్రేమేరా

గుండెల్ని పిండేది తెలుసా యే స్వార్దం లేనిది తెలుసా
యే మలినం లేనిది తెలుసా యే కపటం లేనిది తెలుసా

హౄదయాలకి నీడగ నిలిచె గొడుగేరా ప్రేమంటె
గొడుగుల్లొ చల్లగ కురిసె చినుకెరా ప్రేమంటె
అంతం కాని వాక్యం ప్రేమా
సొంతం అయితె సౌక్యం ప్రేమా
నీలోనె తాను పుట్టి నిను తనలా మార్చును ప్రేమా
నీలోనె తానుండి నిన్నొకరికి పంచును ప్రేమా
ప్రేమకు మార్గం ప్రేమేరా
ప్రేమకు గమ్యం ప్రేమేరా

గుండెల్ని పిండేది తెలుసా యే స్వార్దం లేనిది తెలుసా
యే మలినం లేనిది తెలుసా యే కపటం లేనిది తెలుసా
యే బందం లేనిదిరా అనుబందం ఐయ్నదిరా
ప్రేమా ప్రేమా ప్రేమా ప్రేమా ప్రేమా
ప్రేమా ప్రేమా ప్రేమా ప్రేమా ప్రేమా





ఇదిగిదిగిదిగో పాట సాహిత్యం

 
చిత్రం: దేవదాసు (2006)
సంగీతం: చక్రి
సాహిత్యం: చంద్రబోస్
గానం: సింహ , వేణు 

ఇదిగిదిగిదిగో 




మాయదారి చిన్నోడు పాట సాహిత్యం

 
చిత్రం: దేవదాసు (2006)
సంగీతం: చక్రి
సాహిత్యం: చంద్రబోస్
గానం: విజయలక్ష్మి 

పల్లవి:
మాయదారి చిన్నోడు మనసే లాగేసిండు
నా మనసే లాగేసిండు
లగ్గమెప్పుడ్రా మావ అంటే
మాఘమాసం వెళ్ళేదాకా మంచి రోజు లేదన్నాడే

ఆగెదెట్టాగా అందాకా ఏగేదెట్టాగా 
ఆగెదెట్టాగా అందాకా ఏగేదెట్టాగా
మడోన్నా చెప్పవే డయానా చెప్పవే
షకీర చెప్పవే  జెన్నిఫర్ చెప్పవే 
ఆగేదెట్టాగా  అందాకా  ఏగేదెట్టాగా 

మాయదారి చిన్నోడు మనసే లాగేసిండు
మాఘమాసం వెళ్ళేదాకా మంచి రోజు లేదన్నాడే

చరణం: 1
వరల్డ్ ట్రేడు సెంటరు కాడా సైటు కొట్టినాడే
పార్టీ ఎయిట్ ఫ్లోరులోన పైట పట్టినాడే 
వరల్డ్ ట్రేడు సెంటరు కాడా సైటు కొట్టినాడే
పార్టీ ఎయిట్ ఫ్లోరులోన పైట పట్టినాడే 
స్పీడింగు రీడింగు ఫీల్డింగు తూలక ముందు
ఫ్రీడం ఇచ్చినాడే
తూలిన తర్వాత కూలబడ్డాడే

ఎప్పుడ్రా మావా అంటే బిన్‌లాడెన్ దొరికే దాక
బ్రహ్మముళ్ళు పడమన్నాడే

ఆగెదెట్టాగా అందాకా ఏగేదెట్టాగా
కరీనా చెప్పవే కాజోల్ చెప్పవే అమీషా చెప్పవే
బిపాస చెప్పవే

ఆగెదెట్టాగా అందాకా ఏగేదెట్టాగా

చరణం: 2
యూనివర్శల్ స్టూడియోలో వరస కలిపినాడే 
సినిమా కేసిన సెట్టీంగుల్లో చెంపగిల్లినాడే 
యూనివర్శల్ స్టూడియోలో వరస కలిపినాడే 
సినిమా కేసిన సెట్టీంగుల్లో చెంపగిల్లినాడే 

పడవల్లో ఓడల్లో నా ఒళ్ళో తన ఒళ్ళో లాగించిండే
మాయల్లోనా మనసంతా ముంచేసిందే

పెళ్ళెప్పుడ్రా మావ అంటే
టైటానిక్ తేలేదాకా తగిన గడియ లేదన్నాడే

ఆగేదెట్టాగా అందాకా ఏగేదెట్టాగా
శ్రియ చెప్పవే, త్రిష చెప్పవే
చార్మి చెప్పవే, జెనిలియా చెప్పవే

ఆగేదెట్టాగా అందాకా ఏగేదెట్టాగా

ఎరుపంటే నాకిష్టం పసుపంటే తనకిష్టం
పులుపంటే నాకిష్టం తీపంటే తనకిష్టం
ఒరేయ్ అంటే నాకిష్టం ఒసేయ్ అంటే తనకిష్టం 
నీయబ్బ అంటే నాకిష్టం నీ బాబు అంటే తనకిష్టం 
పో నాకిష్టం ఛీ తనకిష్టం 
ఒకరంటే ఒకరికి ఇష్టం తానంటే ఇష్టం ఇష్టం
దేవదాసంటే నే ఇష్టం దేవదాసుకు నేనిస్టం

Palli Balakrishna Saturday, July 29, 2017

Most Recent

Default