Search Box

Erra Gulabeelu (1979)



చిత్రం: ఎర్ర గులాబీలు (1979)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, యస్.జానకి
నటీనటులు: కమల్ హాసన్, శ్రీదేవి
దర్శకత్వం: భారతీ రాజా
నిర్మాత: జె. పద్మావతి
విడుదల తేది: 1979

లలలలల లా...
ఎదలో తొలి వలపే విరహం జత కలిసే
మధురం ఆ తలపే నీ పిలుపే...

ఎదలో తొలి వలపే విరహం జత కలిసే
మధురం ఆ తలపే నీ పిలుపే...

ఎదలో తొలి వలపే

రోజాలతో పూజించనీ
విరి తెనెలే నను తాగనీ
నా యవ్వనం పులకించనీ
అనురాగమే పలికించనీ
కలగన్నదీ నిజమైనదీ
కధలే నడిపిందీ...

ఎదలో తొలి వలపే విరహం జత కలిసే
మధురం ఆ తలపే నీ పిలుపే...

ఎదలో తొలి వలపే

పయనించనా నీ బాటలో
మురిపించనా నా ప్రేమలో
ఈ కమ్మనీ తొలి రేయిని
కొనసాగనీ మన జంటనీ
మోహాలలో మన ఊహలే
సాగే చేలరేగే...

ఎదలో తొలి వలపే విరహం జత కలిసే
మధురం ఆ తలపే నీ పిలుపే...

ఎదలో తొలి వలపే విరహం జత కలిసే
మధురం ఆ తలపే నీ పిలుపే...

ఎదలో తొలి వలపే

Most Recent

Default