Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Ramudu Kadu Krishnudu (1983)




చిత్రం: రాముడుకాదు కృష్ణుడు (1983)
సంగీతం: చక్రవర్తి
సాహిత్యం: దాసరి నారాయణరావు (All Songs)
గానం: యస్.పి.బాలు, పి.సుశీల (All Songs)
నటీనటులు: నాగేశ్వర రావు, జయప్రద, రాధిక
దర్శకత్వం: దాసరి నారాయణరావు
నిర్మాత: యన్.ఆర్. అరుణాదేవి
విడుదల తేది: 25.03.1983



Songs List:



ఒక లైలా కోసం.. పాట సాహిత్యం

 
చిత్రం: రాముడుకాదు కృష్ణుడు (1983)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: దాసరి నారాయణరావు
గానం: యస్.పి.బాలు, పి.సుశీల

(ఈ పాటని నాగ చైతన్య నటించిన ఒక లైలా కోసం (2014)  సినిమాలో రీమిక్స్ చేశారు దీనికి  అనూప్ రూబెన్స్ సంగీతం సమకూర్చారు, యస్.పి.బి.చరణ్, దివ్య పాడారు)

పల్లవి:
ఒక లైలా కోసం.. తిరిగాను దేశం
ఒక లైలా కోసం.. తిరిగాను దేశం
ప్రతి రోజూ.. ప్రతి రాత్రీ .. ప్రతి పాటా.. ఆమె కోసం
లైలా... లైలా... లైలా

ఒక మజ్ఞూ కోసం వెతికాను లోకం
ఒక మజ్ఞూ కోసం వెతికాను లోకం
ప్రతి పగలూ ప్రతి రాత్రీ ప్రతి తలపూ అతని కోసం
మజ్ఞూ... మజ్ఞూ... మజ్ఞూ

ఒక లైలా కోసం తిరిగాను దేశం

చరణం: 1
ఆకాశానికి నిచ్చెన వేసీ... చుక్కల పట్టుకొనడిగానూ
లైలా ఏదనీ.. నా లైలా ఏదనీ...
స్వర్గానికి నే దారులు వెతికీ.. ఇంద్రుని పట్టుకొనడిగానూ
లైలా ఏదనీ.. నా లైలా ఏదనీ

దిక్కుల నడుమా నేనుంటే.. చుక్కల పట్టుకొనడిగావూ
కన్నుల ముందూ నేనుంటే.. కన్నులు మూసుకు వెదికావూ
ప్రతి చూపూ ప్రతి పిలుపూ... ప్రతి చోటా నీ కోసం

ఒక మజ్ఞూ కోసం వెతికాను లోకం
ప్రతి పగలూ.. ప్రతి రాత్రీ.. ప్రతి తలపూ అతని కోసం
లైలా...లైలా...లైలా
ఒక లైలా కోసం.. తిరిగాను దేశం

చరణం: 2
పగలూ రేయీ పందెం వేసీ.. సృష్టిని పట్టుకు బ్రతిమాలాయి
మజ్ఞూ ఏడనీ.. నా మజ్ఞూ ఏడనీ
రంభా ఊర్వశి ధైర్యం చేసీ.. స్వర్గం విడిచీ వచ్చారూ
లైలా నేననీ.. హహహ.. ఆ లైలా నేననీ

ఇల్లూ వాకిలి వదిలొస్తే రంభా ఊర్వశి అంటావూ
నీ కోసం నే పుట్టొస్తే.. ఎవ్వరి వెంటో పడతావూ
ప్రతి పగలూ.. ప్రతి రాత్రీ.. ప్రతి తలపూ నీ కోసం

ఒక మజ్ఞూ కోసం వెతికాను లోకం
ప్రతి పగలూ.. ప్రతి రాత్రీ .. ప్రతి తలపూ అతని కోసం
మజ్ఞూ...మజ్ఞూ...మజ్ఞూ
ఒక లైలా కోసం తిరిగాను దేశం
ప్రతి రోజూ.. ప్రతి రాత్రీ.. ప్రతి పాటా.. ఆమె కోసం
లైలా...లైలా...లైలా




అందమంత అరగదీసి పాట సాహిత్యం

 
చిత్రం: రాముడుకాదు కృష్ణుడు (1983)
సంగీతం: చక్రవర్తి
సాహిత్యం: దాసరి నారాయణరావు
గానం: యస్.పి.బాలు, పి.సుశీల 

అందమంత అరగదీసి 



చూసాకా నిను చూసాకా.. పాట సాహిత్యం

 
చిత్రం: రాముడుకాదు కృష్ణుడు (1983)
సంగీతం: కె. చక్రవర్తి
సాహిత్యం: దాసరి నారాయణరావు
గానం: యస్.పి.బాలు, పి.సుశీల 

ఒక సంధ్యా సమయానా..దిక్కుచోక నే దిక్కులన్ని చూచుచుండ
ఉత్తర దిక్కున మెరిసెనొక తారకా..అది తారకో..మేనకో..నా అభిసారికో...'

చూసాకా నిను చూసాకా..చూసాకా నిను చూసాకా..
ఆగలేక..మనసాపుకోలేకా..రాసాను ఒక లేఖ
అందుకో ఈ ప్రేమలేఖా..అందించు శుభలేఖ

చూసాక నిను చూసాక..

అందమంతా ఏర్చి కూర్చి అక్షరాలుగ పేర్చినాను
అందమంతా ఏర్చి కూర్చి అక్షరాలుగ పేర్చినాను
మనసులోనికి తొంగి చూసి భావమంతా కూర్చినాను
మనసులోనికి తొంగి చూసి భావమంతా కూర్చినాను

నీ కనులలో.. నా కనులు కలిపినానూ
నీ అడుగులో..నా అడుగువేసినానూ
ఈ ఉత్తరం ..నా జీవితం ..నీ సంతకం ..నా జాతకం

చూసాకా నిను చూసాకా..
ఆగలేక..మనసాపుకోలేకా..రాసాను ఒక లేఖ
అందుకో ఈ ప్రేమలేఖా..అందించు శుభలేఖ

భావమంతా మార్చి మార్చి..భారతం లా చదువుకున్నా
భావమంతా మార్చి మార్చి..భారతం లా చదువుకున్నా
బరువుగుండెల రాత చూసి..బాధనంతా పోల్చుకున్నా
బరువుగుండెల రాత చూసి..బాధనంతా పోల్చుకున్నా

నీ చూపులో..నా రూపు చూసినానూ
నా గుండెలో..నీ మూర్తి నిలిపినానూ
ఈ మాటలే నా ఉత్తరం ..ఈ పిలుపులే నా సంతకం ..

చూసాకా నిను చూసాకా.. చూసాకా నిను చూసాకా..
ఆగలేక..మనసాపుకోలేకా..చూసాను నీ లేఖ
చదివాలే చివరిదాకా..పంపిస్తా శుభలేఖ

చూసాకా నిను చూసాకా..చూసాకా నిను చూసాకా..
ఆగలేక..మనసాపుకోలేకా..
రాసాను ఒక లేఖ..చూసాను ఆ లేఖ




మంచు ముత్యానివో.. పాట సాహిత్యం

 
చిత్రం: రాముడుకాదు కృష్ణుడు (1983)
సంగీతం: కె. చక్రవర్తి
సాహిత్యం: దాసరి నారాయణరావు
గానం: యస్.పి.బాలు

మంచు ముత్యానివో..
హంపి రాతననివో..
తెలుగు వాకిట వేసిన ముగ్గువో
ముగ్గు నడుమన విరిసిన ముద్దబంతి పువ్వువో
మంచు ముత్యానివో..

తెలుగు బడిలో తొలుత చుట్టిన శ్రీకారానివో
జానపదమున తీపి కలిపిన నుడికారనివో
గాలి వాటుకు..ఎండ పోటుకు..తాలలేని ఆకు చాటు పిందెవో 
కూచిపూడి కొమ్మవో...కొండపల్లి బొమ్మవో...
ప్రణయ మూర్తుల రాగ ప్రమిదకు..ప్రమిద ప్రమిదలో వెలుగు ప్రేమకు
ప్రతిగా కృతిగా ఆకృతిగా.. నిలిచే సుందరివో

మంచు ముత్యానివో..
హంపి రాతననివో..
తెలుగు వాకిట వేసిన ముగ్గువో
ముగ్గు నడుమన విరిసిన ముద్దబంతి పువ్వువో
మంచు ముత్యానివో..

కాళిదాసుని కావ్యకవితకు ఆకారానివో
దేవరయుని శిల్ప చరితకు ప్రకరనివో
రెప్ప పాటుకు ..లిప్త చూపుకు..అందరాని అందమైన మెరుపువో
మెరుపులోని పిలుపువో..పిలుపులోని తలపువో..
విరగబూసిన నిండు పున్నమికి..తిరగబోసిన పండు వెన్నెలకు
ప్రతిగా కృతిగా ఆకృతిగా .. నిలిచే సుందరివో

మంచు ముత్యానివో..
హంపి రాతననివో..
తెలుగు వాకిట వేసిన ముగ్గువో
ముగ్గు నడుమన విరిసిన ముద్దబంతి పువ్వువో
మంచు ముత్యానివో..




ఒక చేత తాళి పాట సాహిత్యం

 
చిత్రం: రాముడుకాదు కృష్ణుడు (1983)
సంగీతం: కె. చక్రవర్తి
సాహిత్యం: దాసరి నారాయణరావు
గానం: యస్.పి.బాలు, పి.సుశీల

ఒక చేత తాళి



అన్నం పెట్టమంది అమ్మ పాట సాహిత్యం

 
చిత్రం: రాముడుకాదు కృష్ణుడు (1983)
సంగీతం: కె. చక్రవర్తి
సాహిత్యం: దాసరి నారాయణరావు
గానం: పి.సుశీల

అన్నం పెట్టమంది అమ్మ 


Most Recent

Default