-->
Home Movie Songs Latest Updated Movies Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Results for "Tarun Kumar"
Nuvvu Leka Nenu Lenu (2002) Telugu Songs Lyrics Album Cover

Nuvvu Leka Nenu Lenu (2002) Telugu Songs Lyrics

MOVIE DETAILS
Movie : Nuvvu Leka Nenu Lenu (2002)
Banner : Suresh Productions
Music : R. P. Patnaik
Director : Y. Kasi Viswanath
Producer : D. Suresh Babu
Actors : Tarun
Actresses : Aarthi Agarwal, Laya
Supporting Cast : Sarath Babu, Chandra Mohan
Release Date : 14 January 2002

Edo Edo Song Lyrics in Telugu – Nuvvu Leka Nenu Lenu (2002)

'Edo Edo' song from Nuvvu Leka Nenu Lenu (2002) movie is composed by R. P. Patnaik and sung by Usha.

SONG INFORMATION
Movie : Nuvvu Leka Nenu Lenu (2002)
Music : R. P. Patnaik
Lyricist : Y. Kasi Viswanath
Singers : Usha
చిత్రం: నువ్వు లేక నేను లేను (2002) సంగీతం: ఆర్. పి. పట్నాయక్ సాహిత్యం: వై. కాశీ విశ్వనాథ్ గానం: ఉష ఏదో ఏదో అయిపోతుంది ఎదలో ఏదో మొదలయ్యింది నిన్నే చూడాలని నీతో ఉండాలని నేనే ఓడాలని నువ్వే గెలవాలని పదే పదే అనిపిస్తుంది నీ పిలుపే వినిపిస్తుంది అది ప్రేమో ఏమో తెలియని వింత యాతన అది ప్రేమేనేమో ఎరుగని కొంటె భావన కళ్ళేమో కలలు మాని నిన్ను వెతుకుతుంటే మనసేమో పనులు మాని నిన్ను తలుచుకుంటే కాళ్ళు నీతో కలిసి నడవాలని కలవర పడుతుంటే చేయి నీతో చెలిమి చెయ్యాలని తొందర పెడుతుంటే వేరే దారి లేక నా దారే నువ్వయ్యాక తీరం చేరినాక ఈ కెరటం ఆగలేక నిన్నే తాకాలని నీతో గడపాలని ముద్దే ఇవ్వాలని పొద్దే పోవాలని మనసేమో మనసిచ్చింది వయసేమో చనువిచ్చింది అది ప్రేమో ఏమో తెలియని వింత యాతన అది ప్రేమేనేమో ఎరుగని కొంటె భావన ఏదో ఏదో అయిపోతుంది ఎదలో ఏదో మొదలయ్యింది ఆరాటం హద్దు దాటి మాట చెప్పమంటే మోమాటం సిగ్గుతోటి పెదవి విప్పనంటే ఉత్సాహం నిన్నే పొందాలని ఉరకలు వేస్తుంటే ఉల్లాసం నీకై చెందాలని పరుగులు తీస్తుంటే ఏమీ పాలుపోక సగపాలే నువ్వయ్యాక ప్రాయం వచ్చినాక పరువం ఆగలేక నువ్వే కావాలని నిన్నే కలవాలని మనసే విప్పాలని మాటే చెప్పాలని ఒళ్ళంతా పులకిస్తుంది తుళ్ళింత కలిగిస్తుంది అది ప్రేమో ఏమో తెలియని వింత యాతన అది ప్రేమేనేమో ఎరుగని కొంటె భావన ఏదో ఏదో అయిపోతుంది ఎదలో ఏదో మొదలయ్యింది

Ela Ela Song Lyrics in Telugu – Nuvvu Leka Nenu Lenu (2002)

'Ela Ela' song from Nuvvu Leka Nenu Lenu (2002) movie is composed by R. P. Patnaik and sung by R. P. Patnaik and Usha.

SONG INFORMATION
Movie : Nuvvu Leka Nenu Lenu (2002)
Music : R. P. Patnaik
Lyricist : Y. Kasi Viswanath
Singers : R. P. Patnaik, Usha
చిత్రం: నువ్వు లేక నేను లేను (2002) సంగీతం: ఆర్. పి. పట్నాయక్ సాహిత్యం: చంద్రబోస్ గానం: ఉష ఎలా ఎలా ఎలా ఎలా ఎలా తెలుపను ఎదలోని ప్రేమను మృదువైన మాటను ఎలా ఎలా ఎలా ఎలా ఎలా తెలుపను ఎదలోని ప్రేమను మృదువైన మాటను గాలిలోన వేలితోటి రాసి చూపనా నేల మీద సిగ్గుముగ్గు వేసి చూపనా వాలుజడల కాగితాన విరజాజుల అక్షరాలు ఏర్చి కూర్చి చూపనా ఎలా ఎలా ఎలా ఎలా ఎలా తెలుపను ఎదలోని ప్రేమను మృదువైన మాటను రామచిలక గోరువంక బొమ్మ గీసి తెలుపనా రాధాకృష్ణుల వంక చేయిచూపి తెలుపనా చిరునవ్వుతో తెలుపనా కొనచూపుతో తెలుపనా నీళ్ళు నమిలి తెలుపనా గోళ్ళు కొరికి తెలుపనా తెలుపకనే తెలుపనా... ఎలా ఎలా ఎలా ఎలా ఎలా తెలుపను ఎదలోని ప్రేమను మృదువైన మాటను కాలివేలు నేల మీద రాసి చూపనా నా చీరకొంగు తోటి వేలు చుట్టి చెప్పనా కూనలమ్మ పాటలో రాయబారమంపనా గాలికైనా తెలియకుండా మాట చెవిని వేయనా నాలో ప్రాణం నీవనీ... ఎలా ఎలా ఎలా ఎలా ఎలా తెలుపను ఎదలోని ప్రేమను మృదువైన మాటను ఎలా ఎలా ఎలా ఎలా ఎలా తెలుపను ఎదలోని ప్రేమను మృదువైన మాటను గాలిలోన వేలితోటి రాసి చూపనా నేల మీద సిగ్గు ముగ్గు వేసి చూపనా వాలుజడల కాగితాన విరజాజుల అక్షరాలు ఏర్చి కూర్చి చూపనా... ఎలా ఎలా ఎలా ఎలా ఎలా తెలుపను ఎదలోని ప్రేమను మృదువైన మాటను ఎదలోని ప్రేమను మృదువైన మాటను

Nindu Godari Kada Song Lyrics in Telugu – Nuvvu Leka Nenu Lenu (2002)

'Nindu Godari Kada' song from Nuvvu Leka Nenu Lenu (2002) movie is composed by R. P. Patnaik and sung by R. P. Patnaik and Kousalya.

SONG INFORMATION
Movie : Nuvvu Leka Nenu Lenu (2002)
Music : R. P. Patnaik
Lyricist : Y. Kasi Viswanath
Singers : R. P. Patnaik, Kousalya
చిత్రం: నువ్వు లేక నేను లేను (2002) సంగీతం: ఆర్. పి. పట్నాయక్ సాహిత్యం: కులశేఖర్ గానం: ఆర్. పి. పట్నాయక్, కౌసల్య నిండు గోదారి కదా ఈ ప్రేమ అందరికి బంధువుగా ఈ ప్రేమ రెండు హృదయాల కథే ఈ ప్రేమ పెళ్లికిలా పల్లకిగా ఈ ప్రేమ కోవెలలో హారతిలా మంచిని పంచే ప్రేమ నిండు గోదారి కదా ఈ ప్రేమ అందరికి బంధువుగా ఈ ప్రేమ ప్రేమ అన్నది ఎంత గొప్పదో మరి రాజు పేద బేధమంటు లేదు దీనికి బ్రహ్మచారికీ బతుకు బాటసారికీ ప్రేమదీపమల్లే చూపుతుంది దారిని మనసులు జత కలిపే బంధం ఈ ప్రేమ చెరితగ ఇల నిలిచే గ్రంథం ఈ ప్రేమ ప్రేమే మదిలోన మరి నమ్మకాన్ని పెంచుతుంది నిండు గోదారి కదా ఈ ప్రేమ అందరికి బంధువుగా ఈ ప్రేమ రెండు హృదయాల కథే ఈ ప్రేమ పెళ్లికిలా పల్లకిగా ఈ ప్రేమ ప్రేమ జోరుని ఎవ్వరాపలేరని ఆనకట్టలాంటి హద్దులంటు లేవని ప్రేమ తప్పని అంటే ఒప్పుకోమని గొంతు ఎత్తి లోకమంత చాటిచెప్పని ప్రేమే తోడుంటే నిత్యం మధుమాసం తానే లేకుంటే బతుకే వనవాసం ప్రేమే కలకాలం మనవెంట ఉండి నడుపుతుంది నిండు గోదారి కదా ఈ ప్రేమ అందరికి బంధువుగా ఈ ప్రేమ రెండు హృదయాల కథే ఈ ప్రేమ పెళ్లికిలా పల్లకిగా ఈ ప్రేమ కోవెలలో హారతిలా మంచిని పంచే ప్రేమ నిండు గోదారి కదా ఈ ప్రేమ అందరికి బంధువుగా ఈ ప్రేమ

Nuvvante Naakistam Song Lyrics in Telugu – Nuvvu Leka Nenu Lenu (2002)

'Nuvvante Naakistam' song from Nuvvu Leka Nenu Lenu (2002) movie is composed by R. P. Patnaik and sung by R. P. Patnaik.

SONG INFORMATION
Movie : Nuvvu Leka Nenu Lenu (2002)
Music : R. P. Patnaik
Lyricist : Veturi
Singers : R. P. Patnaik
చిత్రం: నువ్వు లేక నేను లేను (2002) సంగీతం: ఆర్. పి. పట్నాయక్ సాహిత్యం: వేటూరి గానం: ఆర్. పి. పట్నాయక్ నువ్వంటే నాకిష్టం నీ నవ్వంటే నాకిష్టం నువ్వంటే నాకిష్టం నా నువ్వైతే నాకిష్టం నాలో ఆలాపన ఆగేనా ఆపిన ఎదలో లయ వినవా ప్రియా నువ్వంటే నాకిష్టం నీ నవ్వంటే నాకిష్టం చరణం: 1 చెరువా దూరము లేవులే ఇష్టమైన ప్రేమలో ఆశలే కంటిలో బాసలై ఇష్టమాయే చూపులే కోపతాపాల తీపి శాపాల ముద్దు మురిపాల కథ ఇష్టమే ఎంత అదృష్టమో మన ఇష్టమే ఇష్టము నువ్వంటే నాకిష్టం నీ నవ్వంటే నాకిష్టం నువ్వంటే నాకిష్టం నా నువ్వైతే నాకిష్టం చరణం: 2 ఎగసే ఆ గువ్వల కన్నా మెరిసే ఆ మబ్బుల కన్నా కలిసే మనసేలే నాకిష్టం పలికే ఈ తెలుగులా కన్నా చిలికే ఆ తేనెల కన్నా చిలకా గోరింకకు నువ్విష్టం ఇష్టసఖి నువ్వై అష్టపది పాడే అందాల పాటల్లో నీ పల్లవిష్టం నువ్వంటే ఎంతిష్టం... నీ ప్రేమంటే అంతిష్టం... నేనంటే నాకిష్టం... నాకన్నా నువ్విష్టం....

Chinni Chinni Song Lyrics in Telugu – Nuvvu Leka Nenu Lenu (2002)

'Chinni Chinni' song from Nuvvu Leka Nenu Lenu (2002) movie is composed by R. P. Patnaik and sung by S. P. Balasubrahmanyam.

SONG INFORMATION
Movie : Nuvvu Leka Nenu Lenu (2002)
Music : R. P. Patnaik
Lyricist : Veturi
Singers : S. P. Balasubrahmanyam
చిత్రం: నువ్వు లేక నేను లేను (2002) సంగీతం: ఆర్. పి. పట్నాయక్ సాహిత్యం: వేటూరి గానం: ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం చిన్ని చిన్ని ఈ పువ్వులు చూసి జాబిలి నవ్వింది సిరి వెన్నెల జల్లింది పువ్వు పువ్వునా నవ్వులు చూసి పున్నమి వచ్చింది పులకింతలు తెచ్చింది ఆ తుంటరి కోపం తొలి పొద్దు ఆ ఇద్దరి రూపం కనులకు ముద్దు అల్లరి హద్దు గొడవల పద్దు ముద్దులకే ముద్దు చిన్ని చిన్ని ఈ పువ్వులు చూసి జాబిలి నవ్వింది సిరి వెన్నెల జల్లింది ఏ బ్రహ్మ రాసాడో పాశాలిలా మారాయి స్నేహాలుగా ఏ జన్మలో రక్త బంధాలిలా ఈ రెండు దీపాలుగా ఏ రెండు కళ్ళల్లో చూపొక్కటై మా పొద్దు తెల్లారగా ఏ గుండెలొ చోటు దక్కిందిలా ఏ తోడు కానంతగా రాలేటి ఏ పూల రంగులో ముంగిళ్ళలో ముగ్గుగా రోషాల ఈ లేత బుగ్గలో రోజాలు పూయించగా ఆ బంధం అనుబంధం మాదె కదా చిన్ని చిన్ని ఈ పువ్వులు చూసి జాబిలి నవ్వింది సిరి వెన్నెల జల్లింది ఆ చెమ్మచెక్కల్లో చెలిమే ఇలా మారింది పంతాలుగా ఈ కుర్ర తిక్కల్లో ఉడుకే ఇలా సాగింది పందాలుగా ఆ మూతి విరుపుల్లో మురిపాలిలా పొంగాయిలే పోరులా ఈ తిట్టి పోతల్లో అర్ధాలనే వెలిగించుకో వేలుగా కారాల మిరియాల దంపుడే కవ్వింత పుట్టించగా కల్యాణ తాంబూలమెప్పుడో కలలన్ని పండించగా ఆ అందం ఆనందం మాది కదా చిన్ని చిన్ని ఈ పువ్వులు చూసి జాబిలి నవ్వింది సిరి వెన్నెల జల్లింది పువ్వు పువ్వునా నవ్వులు చూసి పున్నమి వచ్చింది పులకింతలు తెచ్చింది ఆ తుంటరి కోపం తొలి పొద్దు ఆ ఇద్దరి రూపం కనులకు ముద్దు అల్లరి హద్దు గొడవల పద్దు ముద్దులకే ముద్దు చిన్ని చిన్ని ఈ పువ్వులు చూసి జాబిలి నవ్వింది సిరి వెన్నెల జల్లింది

Chi Chi Chi Song Lyrics in Telugu – Nuvvu Leka Nenu Lenu (2002)

'Chi Chi Chi' song from Nuvvu Leka Nenu Lenu (2002) movie is composed by R. P. Patnaik and sung by R. P. Patnaik, Lenina Chowdary and Usha.

SONG INFORMATION
Movie : Nuvvu Leka Nenu Lenu (2002)
Music : R. P. Patnaik
Lyricist : Veturi
Singers : R. P. Patnaik, Lenina Chowdary, Usha
చిత్రం: నువ్వు లేక నేను లేను (2002) సంగీతం: ఆర్. పి. పట్నాయక్ సాహిత్యం: వేటూరి గానం: ఆర్. పి. పట్నాయక్, లేనీనా చౌదరి, ఉష పల్లవి: చి చి చి బుల్లెమ్మ చి చి చి చి పరిగెడతావె అలా ఛీచి ఛీచి ఛీ చి చి చి బుల్లోడ చి చి చి చి ఎగబడతావె ఇలా ఛీచి ఛీచి ఛీ గునగున నడకల్లో నీకులుకు కాస్త పెంచి మగసిరి దరువుల్లో నీపొగరు కాస్త వంచి తిరుగుడు వయసుల్లో తిక్కకాస్తదించి పెడతా ఇవాళ పేచీ చీ చీ చీ చి చి చి బుల్లెమ్మ చి చి చి చి పరిగెడతావె అలా ఛీచి ఛీచి ఛీ చి చి చి బుల్లోడ చి చి చి చి ఎగబడతావె ఇలా ఛీచి ఛీచి ఛీ చి చి చి బుల్లోడ చి బుల్లోడ చి చి చి చి బుల్లెమ్మ చి బుల్లెమ్మ చి చరణం: 1 ఉంటే జానకిలా రాముని వలచీ వచ్చే శూర్పణక వరసలుమార్చీ సిగ్గేలేని చెలీ తగ్గుమరి చీ చి చి చి బుద్దేలేని ప్రియ పట్టెనట కొత్తపిచ్చి నాతో బడాయిలా లడాయిలా చీ చి చి చీ చి చి చి బుల్లోడ చి చి చి చి ఎగబడతావె ఇలా ఛీచి ఛీచి ఛీ చి చి చి బుల్లెమ్మ చి చి చి చి పరిగెడతావె అలా ఛీచి ఛీచి ఛీ చి చి చి బుల్లెమ్మ చి బుల్లెమ్మ చి చి పో చి బుల్లోడ చి పిల్లోడ చి చరణం : 2 మెచ్చా మేనకనే మెత్తగ వలచి ఇచ్చా నామనసే మల్లెలు తెచ్చి పైపై మెరుగులకే పోయెమతి చి చి చి చి భౌ భౌమనకె చెలీ భానుమతి చి చి చి చి ఐతే జులాయికే జిలాయిలే చి చి చి చి చి చి చి బుల్లెమ్మ చి చి చి చి పరిగెడతావె అలా ఛీచి ఛీచి ఛీ చి చి చి బుల్లోడ చి చి చి చి ఎగబడతావె ఇలా ఛీచి ఛీచి ఛీ గునగున నడకల్లో నీకులుకు కాస్త పెంచి మగసిరి దరువుల్లో నీపొగరు కాస్త వంచి తిరుగుడు వయసుల్లో తిక్కకాస్తదించి పెడతా ఇవాళ పేచీ చీ చీ చీ చి చి చి బుల్లెమ్మ చి చి చి చి చీచి చీచి చిచి చీచి చీచి చీచి చీ చి చి చి బుల్లోడ చి చి చి చి చీచి చీచి చిచి చీచి చీచి చీచి చీ

Palli Balakrishna Thursday, June 18, 2026


చిత్రం: యుద్ధం  (2014)
సంగీతం: చక్రి
సాహిత్యం:
గానం: రేవంత్ , సాహితి కోమందురి (సోనీ)
నటీనటులు: తరుణ్ కుమార్, యామి గౌతమ్, శ్రీహరి
దర్శకత్వం: భారతి గణేష్
నిర్మాతలు: నట్టుకుమార్
విడుదల తేది: 14.03.2014

ఏమైంది డార్లింగో కళ్ళలో ఏందీ ఈ ఫీలింగు
ఏం చెప్పను డార్లింగ్ గుండెలో ఉంది సంథింగో..
ఇదిగో డార్లింగ్.. ఒక సారిటు సుడర్రాదు

ఏమైంది డార్లింగో కళ్ళలో ఏంటి ఫీలింగు
ఏం చెప్పను డార్లింగ్ గుండెలో ఉంది సంథింగ్
ఏమైంది డార్లింగో కళ్ళలో ఏంటి ఫీలింగు
ఏం చెప్పను డార్లింగ్ గుండెలో ఉంది సంథింగ్
ఏంటేంటో డూయింగు ఏమైందో సంథింగ్
ఎద నిన్నే కాలింగు ఎంట్రీలో వెయిటింగ్
నేనిన్ను మిస్సింగు సేమ్ టు సేమ్ ఫీలింగు
మనమైతే మాచింగ్ చేసేద్దాం డేటింగ్
ఇంకేంటి సోది మీటింగు

ఏమైంది డార్లింగో కళ్ళలో ఏంటి ఫీలింగు
ఏం చెప్పను డార్లింగ్ గుండెలో ఉంది సంథింగ్

హలో హలో డార్లింగ్ డార్లింగ్  (2)
సునో సునో  డార్లింగ్ డార్లింగ్  (2)

హలో హలో డార్లింగ్ డార్లింగ్  (2)
ఏదో ఏదో ఫీలింగ్ ఫీలింగ్ (2)

చరణం: 1
గోళ్లు రంగు ఘోర రంగు హంగుపొంగులో
నన్ను చేసే డిస్టర్బింగ్
డిజైనింగ్ డెవలపింగ్ అన్ని రంగులు
పెళ్లిరోజే టోలేటింగు
అందాక డార్లింగ్ ఆకాల ఈటింగ్
బాబోద్దు క్రాసింగ్ దాస్తేనే థ్రల్లింగ్
హే నీ రూపే థింకింగ్ నీ పేరే రైమింగ్
ప్రేమంటే కాదా కేరింగూ..

ఏమైంది డార్లింగో కళ్ళలో ఏంటి ఫీలింగు
ఏం చెప్పను డార్లింగ్ గుండెలో ఉంది సంథింగ్

చరణం: 2
ఎవ్రిథింగ్ అమేజింగ్ పిల్ల సోకులు
ఎలుకుంటా లైఫ్ లాంగ్
ఎరైవింగ్ ఎటర్నింగ్ అందుకోసము
జంటగానే ట్రావిలింగు
ఏరేసను డార్లింగ్ స్వర్గాలే సంథింగ్
నువ్వేనా డేరింగ్ నీతోనే సంథింగ్
నువ్వే నా బ్రీతింగ్ నేనే నీ క్లోనింగ్
ఐపోతా నీలో మిక్సింగ్

ఏమైంది డార్లింగో కళ్ళలో ఏంటి ఫీలింగు
ఏం చెప్పను డార్లింగ్ గుండెలో ఉంది సంథింగ్


Palli Balakrishna Thursday, December 21, 2017


చిత్రం: వేట (2014)
సంగీతం: చక్రి
సాహిత్యం:
గానం: సింహా , గీతామధురి
నటీనటులు: తరుణ్ కుమార్, శ్రీకాంత్, మధురిమ, జాస్మిన్ భాసిన్
దర్శకత్వం: అశోక్ అల్లే
నిర్మాతలు: సి.వి.రావు, సి.కళ్యాణ్
విడుదల తేది: 21.03.2014

బావగారు బావగారు మీరు చాలా బాగున్నారు
బావగారు బావగారు మాకు ఎంతో నచ్చినారు
చక్కని చంద్రుడు మీరు చుక్కనే పట్టేశారు
మాయనే చేసేశారు మనసునే దోచేశారు
కన్నునే కలిపేశారు కలలో దించేశారు
ప్రేమని రాజేశారు గుండెని కాజేశారు
పెళ్లికి సిద్ధం చేశారు...

ఆజా ఆజా ఆజా ఆజా ఆజా అమ్మాయి
లేజా లేజా లేజా లేజా లేజా అబ్బాయి
ఆజా ఆజా ఆజా ఆజా ఆజా అమ్మాయి
లేజా లేజా లేజా లేజా లేజా అబ్బాయి

బావగారు ఓ బావగారు మీరు చాలా బాగున్నారు

ఏభైఐదు కేజీల గోల్డ్ మా అల్లరి అమ్మాయి
విల్లు చెదిరి కళ్యాణ జ్యూలరి ఇక మీ ఇల్లండి
చీరకట్టులో కొండపల్లి బొమ్మంటే నమ్మండి
మోడ్రన్ డ్రెస్ లో జన్నీఫర్ నే మరిపించేస్తుంది
లాకర్ లో బంగారాన్ని దాచేస్తా
మనప్పురం గోల్డ్ వారి తకట్టే పెట్టేయా
బొమ్మను ముద్దే చేస్తాను
అల్లరి మాన్పించేస్తాను
అమ్మను త్వరగా చేస్తానూ...

ఆజా ఆజా ఆజా ఆజా ఆజా అమ్మాయి
లేజా లేజా లేజా లేజా లేజా అబ్బాయి
ఆజా ఆజా ఆజా ఆజా ఆజా అమ్మాయి
లేజా లేజా లేజా లేజా లేజా అబ్బాయి

బావగారు బావగారు మీరు చాలా బాగున్నారు
మాకు ఎంతో నచ్చినారు

ఆంధ్రులందరి లవర్ బాయ్ ఈ మా అబ్బాయి
ఒక్క చూపుతో మనసు దోచే మన్మధుడితడోయి
హీరోయిన్స్ మోడల్స్ ట్రైచేసి విసిగారు
ఒక్క చాన్స్ మాకివ్వమంటు వెనకాలే తిరిగారు
అతిలోక సుందరిముందు ఆ అందమెంతండీ
జగదీక వీరుడి సత్తా చూపిస్తే బాగండి
అందం కోసం కాదండి ప్రేమతో ఒకటయ్యారండి
ఆశీస్సులందించేయండి ఓ ఓ...

ఆజా ఆజా ఆజా ఆజా ఆజా అమ్మాయి
లేజా లేజా లేజా లేజా లేజా అబ్బాయి
ఆజా ఆజా ఆజా ఆజా ఆజా అమ్మాయి
లేజా లేజా లేజా లేజా లేజా అబ్బాయి

Palli Balakrishna



చిత్రం: అంకుల్ (2000)
సంగీతం: వందేమాతరం శ్రీనివాస్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: యస్.పి.బాలు
నటీనటులు: తరుణ్ కుమార్, పల్లవి
దర్శకత్వం: రాజశేఖర్ ( కన్నడ డైరెక్టర్)
నిర్మాత: ఏవియస్
విడుదల తేది: May 2000

పల్లవి:
ఎన్నో ఎన్నో ఏళ్లుగా 
అడగాలనుంది ఓ వరం
ఆడే పాడే పాపగా 
గడపాలనుంది జీవితం
ఏదైవం ఇస్తాడో ఆ వరం 
ఏ దీపం చూపేనో ఆ వనం
వెదికి వెదికి వేసారిన

ఎన్నో ఎన్నో ఏళ్లుగా 
అడగాలనుంది ఓ వరం

చరణం: 1
చినుకమ్మకు పడవాటలు
చిలుకమ్మకు పొడిమాటలు
నేర్పించే చిన్నారులతో
చిగురమ్మకు తొలిపూతలు
వెలుగమ్మకు తొలి జ్యోతలు
అనిపించే చిరునవ్వులతో
ప్రతిక్షణం సంతోషమే
ప్రతిస్వరం సంగీతమే
దివిజాబిలి దిగలేదని చిరుకోపాలా
తీయతియ్యగ ఉంటుంది కన్నీరైన
అలక సొగసే ఆ ప్రాయాన

ఎన్నో ఎన్నో ఏళ్లుగా 
అడగాలనుంది ఓ వరం
ఆడే పాడే పాపగా 
గడపాలనుంది జీవితం

చరణం: 2
విలువెందుకు చదివేందుకు 
కలిమెందుకు బలిమెందుకు
పసితనమును కరిగిస్తుంటే
పాపాయిలుగా పుట్టి
పాపాలుగా మారే 
పయనం పేర పెరగడమంటే
తిరిగిరాని ఆ పెన్నిధి
ఏ సంపద కొనలేనిది
చేజారిన నా బాల్యమె వస్తానంటే
ఇన్నాళ్లుగ నన్నళ్లిన దారాన్నిట్టే
వదిలి తనతో వెళ్లాలని

ఎన్నో ఎన్నో ఏళ్లుగా 
అడగాలనుంది ఓ వరం
ఆడే పాడే పాపగా 
గడపాలనుంది జీవితం
ఏదైవం ఇస్తాడో ఆ వరం 
ఏ దీపం చూపేనో ఆ వనం
వెదికి వెదికి వేసారిన

ఎన్నో ఎన్నో ఏళ్లుగా 
అడగాలనుంది ఓ వరం


Palli Balakrishna Monday, December 18, 2017



చిత్రం: చిరుజల్లు (2001)
సంగీతం: వందేమాతరం శ్రీనివాస్
నటీనటులు: తరుణ్ కుమార్, రీచా
దర్శకత్వం: శ్రీరామ్
నిర్మాత: జి.వి.జి.రాజు
విడుదల తేది: 17.08.2001



Songs List:



రాదే...రాదే పాట సాహిత్యం

 
చిత్రం: చిరుజల్లు (2001)
సంగీతం: వందేమాతరం శ్రీనివాస్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: యస్.పి.బాలు, చిత్ర, విశాల, వందేమాతరం శ్రీనివాస్

రాదే...రాదే 



కురిసింది చిరుజల్లు పాట సాహిత్యం

 
చిత్రం: చిరుజల్లు (2001)
సంగీతం: వందేమాతరం శ్రీనివాస్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: ఉదిత్ నారాయణ్, విశాల

పల్లవి:
కురిసింది చిరుజల్లు నీలో అల్లరిలా
విరిసింది హరివిల్లు నీ చిరునవ్వుల్లా
చినుకుల్ని స్వాగతించే ఈ మట్టి వాసనలా
చిగురుల్నే మేలుకొలిపే సరికొత్త సరిగమల 
చిన్ననాటి అల్లర్ల తడి జ్ఞాపకంలా

కురిసింది చిరుజల్లు నీలో అల్లరిలా

చరణం: 1
నీ సరదాలన్నీ నా గుండెల్లో గువ్వలై వాలని
నీ కిలకిలలన్నీ నా కన్నుల్లో పువ్వులై విరియని
దివినుంచి తారకలన్ని దిగివచ్చేనా
మనకోసం వరములు ఎన్నో అందించేనా
ఆశలకే అవానమై నిను పిలిచా ఆషాడమై
పురివిరిసే మయూరమై బదులిచ్చా నీకోసమై
ఆ బదులే నా మదికి ముత్యాల జల్లు

కురిసింది చిరుజల్లు నీలో అల్లరిలా

చరణం: 2
నా ఏకాంతంలో వినిపించాయి ఘల్ అని మువ్వలు
నీ సావాసంలో చిగురించాయి ఝల్లనే ఊసులు
నువుమీటిన సంతోషాల శ్రావణవీణ
నిలువెల్లా కరిగిస్తుంది అనురాగాన
అడుగులలో నయాగర కనిపించే ఉత్సహమై
ఎద సడిలో సుధా స్వరం పలికించే సంగీతమై
మనసంత మురిపించె ఈ తేనె ముళ్ళు

కురిసింది చిరుజల్లు నీలో అల్లరిలా
చినుకుల్ని స్వాగతించే ఈ మట్టి వాసనలా
చిగురుల్నే మేలుకొలిపే సరికొత్త సరిగమల 
చిన్ననాటి అల్లర్ల తడి జ్ఞాపకంలా
విరిసింది హరివిల్లు నీ చిరునవ్వుల్లా



హయ్ రామా పాట సాహిత్యం

 
చిత్రం: చిరుజల్లు (2001)
సంగీతం: వందేమాతరం శ్రీనివాస్
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, యస్.పి.చరణ్, సుజాత 

హయ్ రామా 




భూదేవి బుగ్గ పాట సాహిత్యం

 
చిత్రం: చిరుజల్లు (2001)
సంగీతం: వందేమాతరం శ్రీనివాస్
సాహిత్యం: వేటూరి
గానం: వందేమాతరం శ్రీనివాస్, చిత్ర 

భూదేవి బుగ్గ 



కలలో నువ్వే పాట సాహిత్యం

 
చిత్రం: చిరుజల్లు (2001)
సంగీతం: వందేమాతరం శ్రీనివాస్
సాహిత్యం: సిరివెన్నెల 
గానం: ఉదిత్ నారాయణ్, కవితా కృష్ణ మూర్తి 

కలలో నువ్వే 



రెండే రెండంట పాట సాహిత్యం

 
చిత్రం: చిరుజల్లు (2001)
సంగీతం: వందేమాతరం శ్రీనివాస్
సాహిత్యం: వేటూరి 
గానం: యస్.పి.బాలు,, రాద శిరీషా , వందేమాతరం శ్రీనివాస్, టిమొతీ

రెండే రెండంట 

Palli Balakrishna Sunday, December 17, 2017


చిత్రం: చుక్కలాంటి అమ్మాయి చక్కనైన అబ్బాయి (2013)
సంగీతం: అనూప్ రూబెన్స్
సాహిత్యం: చిన్ని చరణ్
గానం: శ్రావణి
నటీనటులు: తరుణ్ కుమార్, విమలా రామన్
దర్శకత్వం: కన్మణి
నిర్మాతలు: రాజ్ కుమార్ హీర్వాణి , గోగినేని శ్రీనివాస్
విడుదల తేది: 25.05.2013

కమ్మని ఒక కోరిక
తుమ్మెదై నను తాకగా
గుండెల్లోన విరహమాగేనా
వెచ్చని ఒక వేడుక వెల్లువై నను చేరగ
రెప్పల్లోన కలలు తీరే చిలిపి తరుణాన
ఇది ప్రేమా.. ఇది ప్రేమా..
ఇది ప్రేమా.. ఇది ప్రేమా..

నన్నొచ్చి తాకే శ్వాసతో
మంచల్లే నేనే మారిన
వయసనే ఋతువులో మెరిసాక
కవ్వింత రేపే చూపులో
పువ్వల్లే నేను పూసినా
మనసుతో ఋతువుగా తగిలాక
పెదవులదిరి మధువు కురిసే
ఎదల అలజడిలో
ఇది ప్రేమా.. ఇది ప్రేమా..
ఇది ప్రేమా.. ఇది ప్రేమా..

తప్పేది కాదే తాపమే
ఒప్పేసుకుంది ప్రాణమే
తమకమే జగముగా ఎగిసాక
వద్దంటు ఇంకా దూరమే
ఇచ్చేసి నీకు భారమే
సుఖమయే కడలిలో మునిగాక
తపన పెరిగే తనువు ఒదిగే
వలపు అలుపులలో
ఇది ప్రేమా.. ఇది ప్రేమా..
ఇది ప్రేమా..ఇది ప్రేమా..

కమ్మని ఒక కోరిక
తుమ్మెదై నను తాకగా
గుండెల్లోన విరహమాగేనా


Palli Balakrishna


చిత్రం: అదృష్టం (2002)
సంగీతం: దిన
సాహిత్యం: సాహితి
గానం: సుజాత, ఉన్ని కృష్ణన్
నటీనటులు: తరుణ్ కుమార్, గజాల, రీమాసేన్
దర్శకత్వం: శేఖర్ సూరి
నిర్మాతలు: మాన్సూర్ అహ్మద్, పరాస్ జైన్, వాకాడ అప్పారావు
విడుదల తేది: 06.06.2002

పల్లవి:
వయసా వయసా నిను నే మరిచా
మనసే తెరచి ఇపుడే చూశా
మొదటిసారిగా కలిశా
అతని ధ్యాసలో తడిశా
తెలియకున్నదే వయసా
ప్రేమకాదు కద బహుశా

వయసా వయసా నిను నే మరిచా
మనసే తెరచి ఇపుడే చూశా

చరణం: 1
ఆకతాయి చెలి నవ్వుల మహిమలు వారెవా
తాడులేని గాలమేసి మనసును లాగవా
ఎంతహాయి మరి వెతికిన దొరకదు ఓ ప్రియా
ఓపలేని తీపి బాధ బహుమతి లేవయా
ఆశలు తీరాలి కలలే నిజమవ్వాలి
జాబిలి పంపాలి నడిజాబులునవ్వాలి
ఇదివరకింతలేదులే వయసుకి తొందర
ఈనాడే నే వింటున్నా మది చేసే గోడవ

వయసా వయసా నిను నే మరిచా
మనసే తెరచి ఇపుడే చూశా

చరణం: 2
రాక రాక వనికిన పెదవుల గతి చూడవా
మౌనరాగ మాలకించి ఎదగుడి చేరవా
ఈడులోన ప్రతి నిమిషము తికమకలే కదా
ఆడగాలి తాకినంత బడలిక తీరదా
నా జత చేరాలి ఒకటై చలరేగాలి
ఓపిక కావాలి సుముహూర్తము రావాలి
కుదురగ ఉండలేనయ ఉంటా నీ దయా
ఈనాడే నే చూస్తున్నా కనులారా నీ చొరవ

వయసా వయసా నిను నే మరిచా
మనసే తెరచి ఇపుడే చూశా
మొదటిసారిగా కలిశా
అమె ధ్యాసలో తడిశా
తెలియకున్నదే వయసా
ప్రేమకాదు కద బహుశా

వయసా వయసా నిను నే మరిచా
ఇపుడే చూశా... ఇపుడే చూశా...

Palli Balakrishna Saturday, December 16, 2017


చిత్రం: సోగ్గాడు (2005)
సంగీతం: చక్రి
సాహిత్యం: భాస్కరభట్ల
గానం: వేణు , కౌశల్య
నటీనటులు: తరుణ్ కుమార్ , ఆర్తి అగర్వాల్, శ్రేయా శరన్
దర్శకత్వం: రవిబాబు
నిర్మాత: డి.సురేష్ బాబు
విడుదల తేది: 31.03.2005

ప్రేమించా నిన్నే నిన్నే ప్రాణం కన్నా ప్రాణంగా
పూజించా నిన్నే నిన్నే దైవం కన్నా ఇష్టంగా
ఓ ఓ మనసా వినవా పెదవి చాటు ఈ మాట
ఓ ఓ ఒకటే గొడవ కుదురులేదు ఈ పూట
ప్రేమా ప్రేమా ప్రేమా ప్రేమా నువ్వే నువ్వే
ప్రేమా ప్రేమా ప్రేమా ప్రేమా నువ్వే నువ్వే

ప్రేమించా నిన్నే నిన్నే ప్రాణం కన్నా ప్రాణంగా
పూజించా నిన్నే నిన్నే దైవం కన్నా ఇష్టంగా

ప్రేమించా నిన్నే నిన్నే ప్రాణం కన్నా ప్రాణంగా
పూజించా నిన్నే నిన్నే దైవం కన్నా ఇష్టంగా
ఓ ఓ మనసా వినవా పెదవి చాటు ఈ మాట
ఓ ఓ ఒకటే గొడవ కుదురులేదు ఈ పూట
ప్రేమా ప్రేమా ప్రేమా ప్రేమా నువ్వే నువ్వే
ప్రేమా ప్రేమా ప్రేమా ప్రేమా నువ్వే నువ్వే

ప్రేమించా నిన్నే నిన్నే ప్రాణం కన్నా ప్రాణంగా
పూజించా నిన్నే నిన్నే దైవం కన్నా ఇష్టంగా

Palli Balakrishna Wednesday, December 6, 2017


చిత్రం: ఒక ఊరిలో (2005)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం:
గానం: మల్లికార్జున్
నటీనటులు: తరుణ్ కుమార్ , రాజా , సలోని
దర్శకత్వం: రమేష్ వర్మ
నిర్మాత: చంటి అడ్డాల
విడుదల తేది: 01.07.2005

ఒక ఊరిలో మొదలు అయింది
ఒక ప్రేమ కథే ఆ రోజు
ఈ చోటుకే ఏక చరణ మన కనుల ముందే ఈ రోజు

ఒక ఊరిలో మొదలు అయింది
ఒక ప్రేమ కథే ఆ రోజు
ఈ చోటుకే ఏక చరణ మన కనుల ముందే ఈ రోజు

ఏ చోట మలుపు తిరిగెనో తన చివర అ ఆ ఏదో
కథ కంచికె ఎపుడు వెళుతుందో తెలిపేది ఎవరో...

ఒక ఊరిలో మొదలు అయింది
ఒక ప్రేమ కథే ఆ రోజు
ఈ చోటుకే ఏక చరణ మన కనుల ముందే ఈ రోజు

ఒంటరిగా నువ్వుంటే జత చేసుకున్నానే
జంటగానే నన్ను అనుకుంటే నేను ఒంటరిగా చేయిచ్చనే
చితిమంట నను రమ్మందే బ్రతుకింక నాకు లేదే
కడసారి నేను చూడాలి కోన ఊపిరుండగా

ఒక ఊరిలో మొదలు అయింది
ఒక ప్రేమ కథే ఆ రోజు
ఈ చోటుకే ఏక చరణ మన కనుల ముందే ఈ రోజు

తుది క్షణమే ఒక హృదయం  అందే ఒక మాట ఏమందే
ఆ నిజమే కడదాక నాలో అంటుందే
మెతకటి నను చూడందే అటువైపు నువునా
నీ ప్రేమ నేను కాదు అనా ఈ స్నేహము ఉందిలే

ఒక ఊరిలో మొదలు అయింది
ఒక ప్రేమ కథే ఆ రోజు
ఈ చోటుకే ఏక చరణ మన కనుల ముందే ఈ రోజు

Palli Balakrishna





చిత్రం: నీ మనసు నాకు తెలుసు (2003)
సంగీతం: ఎ. ఆర్.రెహమాన్
సాహిత్యం: ఎ. యమ్. రత్నం
గానం: సుర్జో భట్టాచార్య , శ్రేయా ఘోషల్
నటీనటులు: తరుణ్ , శ్రేయా శరన్ , త్రిషా
దర్శకత్వం: జ్యోతి కృష్ణ
నిర్మాత: ఎ. యమ్. రత్నం
విడుదల తేది: 05.12.2003



Songs List:



అందని అందం అస్కావా పాట సాహిత్యం

 
చిత్రం: నీ మనసు నాకు తెలుసు (2003)
సంగీతం: ఎ. ఆర్.రెహమాన్
సాహిత్యం: ఎ. యమ్. రత్నం
గానం: సుర్జో భట్టాచార్య , శ్రేయా ఘోషల్

పల్లవి:
తకదిమి తకదిమి త... (4)
ధిం దిరత్తే తరారిరత్తే తరారిరత్తే అస్కావా
ధిం దిరత్తే తరారిరత్తే తరారిరత్తే వస్తావా
అందని అందం అస్కావా సరసాలాడగ వస్తావా (2)
ఈ అందం... అలా నింగిలో రాజహంసలై తేలిపోదాం
మనము వస్తావా
కులమొద్దు మతమొద్దు నువు వస్తేనే అస్కావా
సొమ్మొద్దు సోకొద్దు నువు ఇట్టాగే వస్తావా

చరణం: 1
నేస్తం నెచ్చెలి మాటలతో మిమ్ములనెపుడు పిలిచెదము
పిరికి మాటలు చెప్పొద్దు ప్రేయసి అంటూ పిలవండి
గురజాడ కలలు నిజమాయే మీరే ఆ ప్రతిరూపాలు
తెలుగున మాటలు కరువైతే ఫ్రెంచ్ భాషలో పొగడండి
అప్సరసలారా... ఆ... మా జీవిత గమ్యం మీరేలే

చరణం: 2
పట్టే మాకు దుస్తులుగా వెంటనే మీరు మారండి
ఇంకా ఏమేమేం కావాలో ప్రేమగ ఆజ్ఞలు వేయండి
భక్తి పరవశం చూసి మనసు పొంగి పోయెనులే
పక్కన కాస్తా కూర్చుంటాం అనుమతి మీరు ఇస్తారా
ప్రేమ పక్షులారా... ఆ... మీదనే వచ్చి వాలండి

కులమేలా మతమేలా నే వస్తేనే అస్కాలే
సొమ్మేలా సోకేలా నే ఇట్టాగే వ స్తాలే





కలుసుకుందామా... పాట సాహిత్యం

 
చిత్రం: నీ మనసు నాకు తెలుసు (2003)
సంగీతం: ఎ. ఆర్.రెహమాన్
సాహిత్యం: ఎ. యమ్. రత్నం
గానం: ఉన్ని మీనన్, అనుపమ, చిన్మయి

కలుసుకుందామా... ఇద్దరం కలుసుకుందామా
జూలై మాసం, జూపిటర్లో
ఒకపరి కలుసుకుందామా

ఏ దారిన వెళుతున్నాడో
మీసం వున్న కుర్రాడు
అల్లరివాడు అందగాడు
ఆపిల్ లాగా వుంటాడు
ఏ కాలేజీకి వెళుతున్నాదో...
నన్ను తాకిన పరికిణియో
తొలి సారి ప్రేమ భయం,
లేదు హృదయంలో

చరణం: 1
ఆ ట్యాంక్ బండు
జల తీరంలో
యువ ప్రేమికులం
మనమవుదామా
కాఫీడేకి వెళ్ళొచ్చు
స్నో బౌలింగ్ ఆడొచ్చు
ఫోన్లో గొడవ చెయ్యోచ్చు
బిలియర్డ్స్ లో చేరొచ్చు
మీటింగ్ అయితే
ఇక డేటింగ్ చేయ్యోచ్చు
ఒకే స్పూను తోటి ఐస్ క్రీం చెరి సగం తినవచ్చు ఎప్పుడురా....

కలుసుకుందామా... ఇద్దరం కలుసుకుందామా
జూలై మాసం, జూపిటర్లో
ఒకపరి కలుసుకుందామా

ఆగిపోదామా నెప్ట్యూన్ లో ఆగిపోదామా
ప్రేమే శ్వాసే చాలులే  కలసి జీవిద్దాం

ఏ దారిన వెళుతున్నాడో
మీసం వున్న కుర్రాడు
అల్లరివాడు అందగాడు
ఆపిల్ లాగా వుంటాడు
ఏ కాలేజీకి వెళుతున్నాదో...
నన్ను తాకిన పరికిణియో
తొలి సారి ప్రేమ భయం,
లేదు హృదయంలో

చరణం: 2
ఏ నవ్వయినా
నీకు సరిరాడు
ఏవాసనలు
నీకు సరిరావు
అయ్యో అనిపించిలే....
ఆనందం పోయెలే....
చీ చీ చీ చింతన
నవ్వులో వేదన
పోవే రావద్దే
మనసు పోతే రాలేదు
నిన్ను కన్నవేళ అమ్మపడ్డ బాధలను
పంచకే... చాలులే

కలుసుకుందామా... ఇద్దరం కలుసుకుందామా
జూలై మాసం, జూపిటర్లో
ఒకపరి కలుసుకుందామా

ఆగిపోదామా నెప్ట్యూన్ లో ఆగిపోదామా
ప్రేమే శ్వాసే చాలులే  కలసి జీవిద్దాం

ఏ దారిన వెళుతున్నాడో
మీసం వున్న కుర్రాడు
అల్లరివాడు అందగాడు
ఆపిల్ లాగా వుంటాడు
ఏ కాలేజీకి వెళుతున్నాదో...
నన్ను తాకిన పరికిణియో
తొలి సారి ప్రేమ భయం,
లేదు హృదయంలో




కమ కమ పాట సాహిత్యం

 
చిత్రం: నీ మనసు నాకు తెలుసు (2003)
సంగీతం: ఎ. ఆర్.రెహమాన్
సాహిత్యం: ఎ. యమ్. రత్నం
గానం: అనుపమ, అపర్ణ, కునాల్, బ్లేజ్, జార్జ్ పీటర్

Bling Dinga Ling Ling
Bling Dinga Ling Ling
Bling Dinga Ling
Everybody Sing

Bling Dinga Ling Ling
Bling Dinga Ling Ling
Blind Dinga Ling
నీకేం కావాలి

Bling Dinga Ling Ling
Bling Dinga Ling Ling
Bling Dinga ling
అది తీస్కోవాలి

కమ కమ తొలి వయసుని తట్టి
కమ కమ పసిమనసే పెట్టి
కమ కమ కొన్ని కలలను పట్టీ
కమ కమ పలు తలుపులు చుట్టి

Fall In Love
ఆహా వట్టి మాట కట్టిపెట్టు
Forget the War
ఇక గట్టి మేలు తలపెట్టు
Fall In Love
సరే ఏదో ఒకటి పట్టు పట్టు
Forget the War
అరె గొడవలింక కట్టిపెట్టు

Bling Dinga Ling Ling
Bling Dinga Ling Ling
Bling Dinga ling
నీకేం కావాలి

Bling Dinga Ling Ling
Bling Dinga Ling Ling
Bling Dinga Ling
అది తీస్కోవాలి

కమ కమ తొలి వయసుని తట్టి
కమ కమ పసిమనసే పెట్టి
కమ కమ కమ్ కమ కమ కమ
ఎకుమ కను తీయ్యని ప్రేమను మీటు
క్రమ కమ తియ్యని ప్రేమను మీటు


చరణం: 1
చక్కని బాలుడు చెంతకు వస్తే
కన్నులు మూసే పడుచెవరు
వడుపుగా ఒకతి దుడుకుగా వస్తే
తప్పుకు తిరిగే వాడెవడు
కిస్సుకు నోనో చెప్పే లిప్సే లేవోయి
నడుమును ఛీ ఛీ అనెడి
యువకుడు లేడోయి....
అతని కళ్ళూ, ఆమె కళ్ళూ
అట్టాగే కలవాలి
ఒకే ధ్యాస, ఒకే శ్వాస
తొలి ప్రేమ గెలవాలి

Fall In Love
ఆహా వట్టి మాట కట్టిపెట్టు
Forget the War
ఇక గట్టి మేలు తలపెట్టు
Fall In Love
సరే ఏదో ఒకటి పట్టు పట్టు
Forget the War
అరె గొడవలింక కట్టిపెట్టు

Bling Dinga Ling Ling
Bling Dinga Ling Ling
Bling Dinga ling
నీకేం కావాలి

Bling Dinga Ling Ling
Bling Dinga Ling Ling
Bling Dinga Ling
అది తీస్కోవాలి

కమ కమ తొలి వయసుని తట్టి
కమ కమ పసిమనసే పెట్టి
కమ కమ కొన్ని కలలను పట్టి
కమ కమ పలు తలుపులు చుట్టి

Fall in Love
We don't get sexy
Don't get the war
Don't wanna get messy

Fall in Love
Life is a melody
Don't get the war
To love everybody

Fall in Love
La la la la la
Don't get the war
La la la la la....

కమ కమ తొలి - వయసుని తట్టి
కమ కమ కొన్ని -  కలలను పట్టి

Fall in Love
We don't get sexy
Don't get the war
Don't wanna get messy




స్నేహితుడే వుంటే పాట సాహిత్యం

 
చిత్రం: నీ మనసు నాకు తెలుసు (2003)
సంగీతం: ఎ. ఆర్.రెహమాన్
సాహిత్యం: ఎ. యమ్. రత్నం
గానం: మనో, ఉన్ని కృష్ణన్, చిన్మయి

పల్లవి:
స్నేహితుడే వుంటే ఒక స్నేహితుడే వుంటే
చేతులతో భూమిని మోయ్యోచ్చు
ఆకాశం అంచులనే తాకేద్దాం మిత్రమా
మన పేరు దిక్కులలో చాటుదాం
నదులు కడలికే అంకితం
మన తనువు చెలిమికే అంకితం
చెలిమి మాకు ఒక చిరునామా
మా జీవితాలకే వీలునామా
ఈ జగతిలోని నిరుపేద
మిత్రుడు లేనివాడు హే...

చరణం: 1
భుజాన చేతులు వేసి తోచింది మాట్లాడుకుంటూ
ఊరు తిరిగి వచ్చాం వచ్చాం...
కలిసి చదువుకుని నిదర పోతిమి
చెలిమి దుప్పటిలో...
మన జీవితాన ప్రేమలు, అందాలు కలుగులే
స్నేహమన్న బంధమేమో కలుగును మనకి
ఊపిరిలో

చరణం: 2
గుండెల్లో గుండెల్లో వున్న
మాటల్ని మాటల్ని చెప్ప నేస్తం ఒకటే సొంతం
కలిసి కూర్చుని తినే తిండిలో
ఉండే స్నేహం రుచి
అరె జీవిత పయనం మారినా, స్నేహం మారునా
ఆయుర్దాయం తీరినా, మిత్రుని రూపం చెరిగేనా




ఏదో ఏదో నాలో పాట సాహిత్యం

 
చిత్రం: నీ మనసు నాకు తెలుసు (2003)
సంగీతం: ఎ. ఆర్.రెహమాన్
సాహిత్యం: ఎ. యమ్. రత్నం
గానం: కార్తీక్, గోపికా పూర్ణిమ

ఏదో ఏదో నాలో
పులకింత కలిగే
భాగ్యరేఖ వరియించలే
ప్రేమ రేఖ నాలో
హృదయాన్ని తెరచి
ముద్దుగా తరిమి కొట్టెనులే
ప్రియతమా.... హృదయం....
నీకే నీకే.....

నిన్ను కోరిన కన్నె ముందర
మౌనమన్నది కష్టంలే
మాటలాడని క్షణములన్నియు నష్టం
మాట తెలుపని అసలు అర్థము
మౌనములోనే ఉన్నది ఉన్నది
మౌనం ముదిరితే మాటలాడుటే మంచిది
సూర్యుని లాగే నా ముందు వెలిశావ్
మంచు బిందు వల్లే కరిగితివే
ప్రియతమా హృదయం
నీకే నీకే

కలలు అయితే ఉండిపోదాం
నిజం అయితే సాగిపోదాం
గుండె పీల్చిన శ్వాసం ఎప్పుడు
విశ్వాసం ఆగుటే న్యాయం న్యాయం
శ్వాస వాసనగా మారిపోవుటే మర్మం
కనులు కాచిన కలలు ఎప్పుడు
తెలుపు నలుపుగా తెలియును తెలియును
రంగులాగ అవి మారిపోవుటే మర్మం
బోధి వృక్షమల్లే నీ కనులు చూడ
నీ చూపు నాలో జ్ఞానమాయలే
ప్రియతమా హృదయం
నీకే నీకే




మస్తురా మస్తురా మస్తురా పాట సాహిత్యం

 
చిత్రం: నీ మనసు నాకు తెలుసు (2003)
సంగీతం: ఎ. ఆర్.రెహమాన్
సాహిత్యం: ఎ. యమ్. రత్నం
గానం: శ్రీరాం పార్థసారథి, చిత్ర, మాతంగి, జార్జ్ పీటర్

మస్తురా మస్తురా మస్తురా
పెదవితో భువినే కదిపెరా
సొగసురా సొగసురా సొగసురా
కళ్ళతో సూర్యుని కాల్చెరా
షననన షన్ నన్ నన్ నే....
ఇది వయసు పోతేరానే రాదే
షననన షన్ నన్ నన్ న్నే
ఇది వయసు దేనిని కోరుకోవే

పల్లవి:
విద్యార్థి విద్యార్థి మమ్ముల చదవద్దు
ఇద్దరము కావ్యంలా ప్రణయం సాగిద్దాం
పదహారో ఓహోహో
పదిహేడో ..... ఓ హోహో......
నిను చూశాక, మురిశాక... చైతన్యం

చరణం: 1
బాల్య ప్రాయంలో ... ఓహోహో
అమ్మ వడి మధురం... ఓహోహో
పరువ ప్రాయంలో ... ఓహోహో
భామ వడి మధురం... ఓహోహో
మదిలోనే తోచే ... ఓహోహో
కోర్కె దాచొద్దు... ఓహోహో
నూరేళ్ళు అయిన ప్రేమ దాచొద్దు
ఓహోహో

చరణం: 2
ఏరు దాటొచ్చాం
ఓహోహో
ఊరు దాటొచ్చాం
ఓహోహొ
నీ సొగసు దాటాం
ఓహోహొ
నావల్లకాలేదా
ఓహోహో
నీరాక మెచ్చాం...
ఓహోహో
పొగడ్తలకు మెచ్చాం
ఓహోహొ
ఓ చిరునవ్వు చూసి మెచ్చాం

Palli Balakrishna Monday, November 20, 2017



చిత్రం: సఖియా (2004)
సంగీతం: మణిశర్మ
నటీనటులు: తరుణ్ , నహీద్ సైరుసి
దర్శకత్వం: జయంత్ సి. పరాన్జీ
నిర్మాతలు: ఆర్.అప్పలరాజు, ఎ. కె.కుమార్
విడుదల తేది: 02.12.2004



Songs List:



నన్నొచ్చి తాకింది పాట సాహిత్యం

 
చిత్రం: సఖియా (2004)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: సాహితి
గానం: కార్తీక్, గోపికా పూర్ణిమ 

నన్నొచ్చి తాకింది 



ఓ చంద్రమా పాట సాహిత్యం

 
చిత్రం: సఖియా (2004)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: సాహితి
గానం: చిత్ర , మల్లికార్జున్

ఓ చంద్రమా మచ్చేలేని ప్రియబంధమా
యే నాటికీ నన్నే వీడి పోబోకుమా
చెలి నీవే నా ఆరోప్రాణం అంతున్నానే
కలకాలాలు నీతో చేరి వుంటా నేనే
ఇక నీతోనె యేకం అవుతు లోకాలే నే మరిచేనా
ఓ చంద్రమా మచ్చేలేని ప్రియబంధమా
ఓ అందమా నా ప్రియరాణి నీవే సుమా

ఓ గోరింకా నూరేళ్ళింకా తొదే నీవై వుండాలిలే
ఓ నా మైనా యే జన్మానా నీకె జంటై వుంటానులే
నీ గుండెలోనా వున్నంత ప్రేమా
ఆ కళ్ళలోనా చూసా ఈ వేళా
చేసాక నిలపాలి బాస
ఇచ్చక మాటా విడిచేన బాట
విడిపోయే వరకు నా శ్వాసా

అంతా నీకే సొంతం అవుతా నీ ప్రేమంతా అందించుమా
అయితే నాకో ముద్దిస్తేనే ప్రేమిస్తాలే ఓ నేస్తమా
నేడే నీతోనా నేనవుతు వీణ
నీ పూలవాన స్వప్నాలలోనా
నిలువెల్ల పులకించిపోనా
నేనే నీవైనా ఆ వేణువులోనా రాగాలు రవళించుకోనా
ఓ అందమా నా ప్రియరాణి నీవే సుమా
యే నాడికా నిన్నే వీడి పోలేనుగా
ఇక నీవే నా ఆరొప్రాణం అంతున్నాలే
కలకాలాలు నీతో చేరి వుంటా నేనే
సఖి నీతోనె యేకం అవుతు లోకాలే నే మరిచేనా
ఓ చంద్రమా ఓ అందమా




వాన వాత్సాయన పాట సాహిత్యం

 
చిత్రం: సఖియా (2004)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: చిన్ని చరణ్ 
గానం: యస్. పి. చరణ్, సునీత 

వాన వాత్సాయన 



రాదు కదా పాట సాహిత్యం

 
చిత్రం: సఖియా (2004)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: వేటూరి సుందరరామ మూర్తి 
గానం: యస్.పి. బాలు, కల్పన 

రాదు కదా 



నోటిలోన పాట సాహిత్యం

 
చిత్రం: సఖియా (2004)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: చంద్రబోస్ 
గానం: మల్లికార్జున్ 

నోటిలోన



చక్కరంటి పాట సాహిత్యం

 
చిత్రం: సఖియా (2004)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: చంద్రబోస్ 
గానం: మనో, లెనినా చౌదరి

చక్కరంటి 

Palli Balakrishna Friday, September 22, 2017


చిత్రం: నవ వసంతం (2007)
సంగీతం: ఎస్.ఏ.రాజ్ కుమార్
సాహిత్యం: ఈ.యస్.మూర్తి
గానం: యస్.పి. బాలు
నటీనటులు: తరుణ్ , ప్రియమణి, రోహిత్, సునీల్
దర్శకత్వం: కె.షాజహాన్
నిర్మాత: ఆర్.బి.చౌదరి
విడుదల తేది: 09.11.2007

పాటలె ప్రాణమని పాడన పాటలని
గాలిలొ తేలి తేలిపూలతావి కాద సంగీతం
మనసు మీటె పాట ఉంటె స్వర్గమె నీ సొంతం

కలతె లేదు కొయిలకి పాటె ఉంటె
అలుపె రాదు తుమ్మెదకి ఝుం ఝుం అంటె
తుళ్ళింతల మదిలొ అలలకి తెలిసెని తకధిమి తాళం
కవ్వింతల చలి గాలికి తెలియనిద ఇందొళం
అందరికి అనుభవమేగ పాటలలొ ఆ సంతొషం
శివుడైన ఆడక మానడు వింటె చక్కని సంగీతం
పాటలె ప్రెమించె మనసు నందనం

పాటె మనిషి అనందం పాటె అందం
పాటె ప్రెమసందెశం పాటె బంధం
గాలి సైతం పాటకు మురిసి కురిసెను జల్లుగమేఘం
శ్రికృఇషునుడి మనసె దొచెను మీర తీయని గానం
ఆవెశం నిప్పై రగిలె నా పాటె నా గాండివం
జగమంతో దాస్యం చెసే అధ్బుతమె నా సంగీతం
నమ్మకమె ఆయుధం బ్రతుకులొ పొరులొ


*********  **********   ***********


చిత్రం: నవ వసంతం (2007)
సంగీతం: ఎస్.ఏ.రాజ్ కుమార్
సాహిత్యం: ఎస్.ఏ.రాజ్ కుమార్, ఏ. శ్రీనివాస్
గానం: ఉదిత్ నారాయణ్ , రీటా

చూశా చూశా చూశా చూశా
పున్నమి వెన్నెల్లో నే నిన్నే చూశాను
చూశాను చూశాను నీ దాసుడినయ్యాను
చూశా చూశా చూశా చూశా
పున్నమి వెన్నెల్లో నే నిన్నే చూశాను
చూశాను చూశాను నీ దాసుడినయ్యాను

అల్లరి వయసుల్లొ ఆనందం చూశాను
చూశాను చూశాను ఆది నాలో దాచాను
వేల కోటీ తారాల్లోనా జాబిళమ్మా నువ్వే కదా
వంద కోటీ అమ్మాయిల్లో అమ్ము నువ్వు నా సొంతం కదా
పున్నమి వెన్నెల్లో నే నిన్నే చూశాను
చూశాను చూశాను నీ దాసుడినయ్యాను
చూశా చూశా చూశా చూశా

నీతో పాటూ ఉంటానంటూ కోరిన మనసును చూశానూ
నీ తోడుగా ఉండాలంటూ వెళ్ళిన నీడను చూశాను
మూడో మనిషే లేని ఓ సుందర లోకం చూశా
నువ్వు నేనే కాదు నీ ప్రేమను కూడా చూశా
నువు నా లోనే సగమైతే నన్నే కొత్తగ చూశాను

చూశా చూశా చూశా చూశా
పున్నమి వెన్నెల్లో నే నిన్నే చూశాను
చూశాను చూశాను నీ దాసుడినయ్యాను

సీతా కోక సిగ్గుల్లోనా ఎన్నెన్నో మెరుపులు చూశాను
వీచే గాలీ పరుగుల్లోనా ఏవేవో మలుపులు చూశాను
ఆశల జలపాతంలో అరవిరిసిన అందం చూశా
శ్వాసల సంగీతం లో వినిపించే గానం చూశా
జడి వానలలొ జల్లులలో చినుకె నువ్వానీ చూశాను

చూశా చూశా చూశా చూశా
పున్నమి వెన్నెల్లో నే నిన్నే చూశాను
చూశాను చూశాను నీ దాసుడినయ్యాను
చూశా చూశా చూశా చూశా
పున్నమి వెన్నెల్లో నే నిన్నే చూశాను
చూశాను చూశాను నీ దాసుడినయ్యాను





Palli Balakrishna Tuesday, August 1, 2017



చిత్రం: భలే దొంగలు (2008)
సంగీతం: కె.యమ్.రాధకృష్ణన్
నటీనటులు: తరుణ్ ,ఇలియానా
దర్శకత్వం: కె.విజయ్ భాస్కర్
నిర్మాత: శాఖమురి పాండు రంగారావు
విడుదల తేది: 11.04.2008



Songs List:



రోమియో జూలియట్ పాట సాహిత్యం

 
చిత్రం: భలే దొంగలు (2008)
సంగీతం: కె.యమ్.రాధకృష్ణన్
సాహిత్యం: సాహితి 
గానం: టిప్పు 

రోమియో జూలియట్ 




నీతోనే కలిసి పాట సాహిత్యం

 
చిత్రం: భలే దొంగలు (2008)
సంగీతం: కె.యమ్.రాధకృష్ణన్
సాహిత్యం: వనమాలి 
గానం: షాన్ , గీతామాధురి 

నీతోనే కలిసి 




పంచదార ఎడారిలో పాట సాహిత్యం

 
చిత్రం: భలే దొంగలు (2008)
సంగీతం: కె.యమ్.రాధకృష్ణన్
సాహిత్యం: వేటూరి 
గానం: టిప్పు, గాయత్రీ 

పంచదార ఎడారిలో 




మనసులో నువ్వేనా పాట సాహిత్యం

 
చిత్రం: భలే దొంగలు (2008)
సంగీతం: కె.యమ్.రాధకృష్ణన్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి 
గానం: ఉదిత్ నారాయణ్, చిత్ర 

మనసులో నువ్వేనా 



పసందైన వేళా వయ్యరాల కోయిలా పాట సాహిత్యం

 
చిత్రం: భలే దొంగలు (2008)
సంగీతం: కె.యమ్.రాధకృష్ణన్
సాహిత్యం: కె.యమ్.రాధకృష్ణన్
గానం: చిత్ర, కె.యమ్.రాధకృష్ణన్

పసందైన వేళా వయ్యరాల కోయిలా 
ఒడే చేర రమ్మంది వస్తావా ఇలా 
హుఁ హుఁ హుఁ రా...

ఈ మల్లిమొగ్గ నీదే ఈ బుల్లీ బుగ్గ నీదే
కన్నే సిగ్గు నీదే కాటేసే ముద్దు నీదే
పాలు పళ్ళు నీవే బంగారు ఒళ్ళు నీదే
కొంటె నవ్వు నీదే గుండెల్లో జివ్వు నీదే
నువ్వడిగిందల్లా ఇస్తారారా పోకిరి

ఈ మల్లిమొగ్గ నీదే ఈ బుల్లీ బుగ్గ నీదే
కన్నే సిగ్గు నీదే కాటేసే ముద్దు నీదే
పాలు పళ్ళు నీవే బంగారు ఒళ్ళు నీదే
కొంటె నవ్వు నీదే గుండెల్లో జివ్వు నీదే
నువ్వడిగిందల్లా ఇస్తారారా పోకిరి

హే వంటరిగుంటే పోరు గుండెల్లోన హోరు 
లవ్వో గివ్వో ఏదో లాగించేయ్ గురూ
చూశాలే నీ జోరు ఎందుకు ఆ కంగారు 
నే రెచ్చానంటే వేడెక్కదా వింటరూ
హే ముద్దొచ్చేలా ముద్దిచ్చేయ్ నా 
మత్తెక్కేలా మురిపించే నా
రారా ఇల్లా రారాజులా సాగించేద్దాం ముక్కాబ్బులా
వద్దే నాటి నారి ఇంకొద్దే ముద్దుల ప్యారి 
కితకిత లెడితే పోరి కుమ్మేస్తాడీషికారి 
నీ తట్టా బుట్టా సర్దే జల్దీ జాంగిరి

ఈ మల్లిమొగ్గ నీదే ఈ బుల్లీ బుగ్గ నీదే
కన్నే సిగ్గు నీదే కాటేసే ముద్దు నీదే
పాలు పళ్ళు నీవే బంగారు ఒళ్ళు నీదే
కొంటె నవ్వు నీదే గుండెల్లో జివ్వు నీదే
నువ్వడిగిందల్లా ఇస్తారారా పోకిరి

కావాలంటూ బోణి కటేస్తుందోయ్ వోణి 
కాస్తో కూస్తో కానీ జవానీ పని
చెప్పొద్దే కహానీ చెయ్యొద్దే ఖుర్బానీ 
చల్లా కొచ్చి ముంతా దాచోద్దే హనీ
నీతో ఇల్లా ఉండాలనీ ఏదేదేదో చెయ్యాలని 
రమ్మన్నాలే రాజాజాని ఓ ఎస్ అంటే నీ బాంచనీ
వద్దన్నా వయ్యారి పడమాకే ఒల్లో జారీ 
లెఫ్టో రైటో చేరి దరువెయ్యోద్దే తందూరి 
నీ నకరాలింక చాల్లే చెక్కే చోకిరీ

ఈ మల్లిమొగ్గ నీదే ఈ బుల్లీ బుగ్గ నీదే
కన్నే సిగ్గు నీదే కాటేసే ముద్దు నీదే
పాలు పళ్ళు నీవే బంగారు ఒళ్ళు నీదే
కొంటె నవ్వు నీదే గుండెల్లో జివ్వు నీదే
నువ్వడిగిందల్లా ఇస్తారారా పోకిరి 

ఈ మల్లిమొగ్గ నీదే ఈ బుల్లీ బుగ్గ నీదే
కన్నే సిగ్గు నీదే కాటేసే ముద్దు నీదే
పాలు పళ్ళు నీవే బంగారు ఒళ్ళు నీదే
కొంటె నవ్వు నీదే గుండెల్లో జివ్వు నీదే
నువ్వడిగిందల్లా ఇస్తారారా పోకిరి హోయ్...




చోటా చోటా పాట సాహిత్యం

 
చిత్రం: భలే దొంగలు (2008)
సంగీతం: కె.యమ్.రాధకృష్ణన్
సాహిత్యం: చంద్రబోస్
గానం: టిప్పు 

చోటా చోటా 

Palli Balakrishna
Nuvve Nuvve (2002) Telugu Songs Lyrics Album Cover

Nuvve Nuvve (2002) Telugu Songs Lyrics

MOVIE DETAILS
Movie : Nuvve Nuvve (2002)
Music : Koti
Actors : Tarun, Prakash Raj
Actresses : Shriya Saran
Release Date : 10 October 2002

Computerlu Song Lyrics in Telugu – Nuvve Nuvve (2002)

'Computerlu' song from Nuvve Nuvve (2002) movie is composed by Koti and sung by Devan, Koti, Trivikram and Anuradha Sriram.

SONG INFORMATION
Movie : Nuvve Nuvve (2002)
Music : Koti
చిత్రం: నువ్వే నువ్వే (2002) సంగీతం: కోటి సాహిత్యం: సిరివెన్నెల గానం: దేవన్, కోటి, త్రివిక్రమ్, అనురాధ శ్రీరాం సాకి: పాపం రో పాపాయి రో కోపమొద్దు బాసు.. ఈస్టుకు వెస్టుకి తేడా తెలియని ఇన్నోసెంట్ పేస్ తప్పదుగా నెమ్మదిగా తీసుకోరా క్లాస్ ఒకటా రెండా ఎన్నున్నాయో కదా కండిషన్స్ పల్లవి: కంప్యూటర్స్ ఆర్ట్స్ సైన్స్ మాథ్స్ కామర్స్ ఇవన్నీ క్లాస్ రూం సబ్జెక్ట్సూ..ఎలాగూ తప్పని నూసెన్సు కేంపస్ లో అబ్బాయిల మధ్యన తిరిగే మేనర్సూ.. తెలీదంటె తప్పే మిస్సూ..వెరీ ఇంపార్టెంట్ సిలబస్సు టాటా బిర్లా డాటెర్లైనా తలొంచి తీరాలి.. మీరేమి చెయ్యాలనుకున్నా మా పర్మిషనుండాలి ఈమాట్ల్నే పాటంగా చదువుకోండి డైలీ.. That’s the way ..we like it That’s the way ..we like it That’s the way ..we like it That’s the way ..we like it కంప్యూటర్స్ ఆర్ట్స్ సైన్స్ మాథ్స్ కామర్స్ ఇవన్నీ క్లాస్ రూం సబ్జెక్ట్సూ..ఎలాగూ తప్పని నూసెన్సు చరణం: 1 ఐస్క్రీంలు గట్రా తింటూ హై స్పీడ్లో లావైపోకు డైటింగ్ పాటిస్తూ స్లిం గా వుండు బోండంలా వున్నావ్ పండు నీ బోడీ చూస్కో ముందు నీక్కూడ కావాలా గర్ల్ ఫ్రెండు…. నువ్వెంత అంటే నువ్వెంత అంటూ డిబేట్ మానెయ్యాలి మగాళ్ళ పనులను మహాబ్ధుతం అని పదే పదే పొగడాలి ప్రతీ దినం మాకోసం తాజా ఫ్లవర్ బొకే తేవాలి దిల్దే సనం అంటూ మమ్మల్ని దీనంగ బ్రతిమాలాలి ఆ బెట్టు కాస్త తగ్గాలి మా పట్టుదలే నెగ్గాలి మా కంటి చూపుకే భయపడుతూ కంట్రోల్లో వుండాలి That’s the way ..we like it That’s the way ..we like it కంప్యూటర్స్ ఆర్ట్స్ సైన్స్ మాథ్స్ కామర్స్ ఇవన్నీ క్లాస్ రూం సబ్జెక్ట్సూ..ఎలాగూ తప్పని నూసెన్సు చరణం: 2 గన్నీ బేగ్ అనిపించేలా చున్నీతో చుట్టేయ్యాలా కాస్తైన డ్రెస్సింగ్ సెన్స్ వుండాలి ఫన్నీగా కనిపించేల నున్నంగా షేవింగేల కొంచెం రఫ్ మేన్లీనెస్ ఉండాలి ఎలాగ మీరుండాలో చెప్పే ప్రతీ డెసిషన్ మాది సరే సరే అని ఫాలో అయ్యే డిసిప్లిన్ ఒకటే మీది సరేలే పోని సరదా పడనీ అనేంత సహనం మాది మరీ ఇలా శృతి మించారంటే కధంతా చెడిపోతుంది మీరుడుక్కుంటే చూడాలి మా హుషారు చెలరేగాలి మీరేడుస్తుంటే ఓదార్చే అవకాశం కావాలి That’s the way ..we like it That’s the way ..we like it కంప్యూటర్స్ ఆర్ట్స్ సైన్స్ మాథ్స్ కామర్స్ ఇవన్నీ క్లాస్ రూం సబ్జెక్ట్సూ ఎలాగూ తప్పని నూసెన్సు కేంపస్ లో అబ్బాయిల మధ్యన తిరిగే మేనర్సూ తెలీదంటె తప్పే మిస్సూ వెరీ ఇంపార్టెంట్ సిలబస్సు టాటా బిర్లా డాటెర్లైనా తలొంచి తీరాలి మీరేమి చెయ్యాలనుకున్నా మా పర్మిషనుండాలి ఈమాట్ల్నే పాటంగా చదువుకోండి డైలీ

Naa Manasukemayyindi Song Lyrics in Telugu – Nuvve Nuvve (2002)

'Naa Manasukemayyindi' song from Nuvve Nuvve (2002) movie is composed by Koti and sung by Udit Narayan and Nitya Santoshini.

SONG INFORMATION
Movie : Nuvve Nuvve (2002)
Music : Koti
చిత్రం: నువ్వే నువ్వే (2002) సంగీతం: కోటి సాహిత్యం: సిరివెన్నెల గానం: ఉదిత్ నారాయణ్, నిత్య సంతోషిని పల్లవి; అర్రెర్రె ర్రెర్రె రేరే.. అర్రెర్రె ర్రెర్రె రేరే.. నా మనసుకేవయింది నీ మాయలో పడింది నిజమా కలా తెలిసేదెలా నాకు అలాగె ఉంది ఎన్నో అనాలనుంది దాచేదెలా లోలోపల మన ఇద్దరికి తెలియనిది ఏదో జరిగే ఉంటుంది అందుకే ఇంతలా గుండె ఉలికి పడుతు ఉంది నా మనసుకేవయింది నీ మాయలో పడింది నిజమా కలా తెలిసేదెలా చరణం: 1 చుక్కలే తెచ్చి ఇవ్వనా అంది నీ మీద నాకున్న ప్రేమ కొత్తగా ఉంది బొత్తిగా నమ్మలేనంత ఈ వింత ధీమా జంటగా వెంట నువ్వుంటే అందడా నాకు ఆ చందమామ అందుకే నాకు నువ్వంటే మాటలో చెప్పలేనంత ప్రేమ పంచుకున్న ముద్దులో ఇలా జతే పడి పెంచుకున్న మత్తులో పడి మతే చెడి గాలితో చెప్పనీ మన మొదటి గెలుపు ఇదని నా మనసుకేవయింది నీ మాయలో పడింది నిజమా కలా తెలిసేదెలా చరణం: 2 ఎప్పుడూ గుండె చప్పుడు కొట్టుకుంటుంది నీ పేరు లాగ ఎప్పుడో అప్పుడప్పుడు గుర్తుకొస్తొంది నా పేరు కొద్దిగ ఒంటిగా ఉండనివ్వదు కళ్ళలో ఉన్న నీ రూపురేఖ ఇంతగా నన్ను ఎవ్వరూ కమ్ముకోలేదు నీలా ఇలాగ లోకమంటె ఇద్దరే అదే మనం అని స్వర్గమంటె ఇక్కడే అంటే సరే అని వెన్నెలే పాడనీ మన చిలిపి చెలిమి కథని నా మనసుకేవయింది నీ మాయలో పడింది నిజమా కలా తెలిసేదెలా నాకు అలాగె ఉంది ఎన్నో అనాలనుంది దాచేదెలా లోలోపల మన ఇద్దరికి తెలియనిది ఏదో జరిగే ఉంటుంది అందుకే ఇంతలా గుండె ఉలికి పడుతు ఉంది

Nuvve Nuvve Kavalantundi Song Lyrics in Telugu – Nuvve Nuvve (2002)

'Nuvve Nuvve Kavalantundi' song from Nuvve Nuvve (2002) movie is composed by Koti and sung by K. S. Chithra.

SONG INFORMATION
Movie : Nuvve Nuvve (2002)
Music : Koti
Singers : K. S. Chithra
చిత్రం: నువ్వే నువ్వే (2002) సంగీతం: కోటి సాహిత్యం: సిరివెన్నెల గానం: కె.యస్. చిత్ర పల్లవి: ఏ చోట ఉన్నా ఉన్నా ఉన్నా నీ వెంట లేన లేన లేన సముద్రమంతా నా కన్నుల్లో కన్నీటి అలలౌతుంటే ఎడారి అంతా నా గుండెల్లో నిట్టుర్పు సెగలౌతుంటే రేపు లేని చూపు నేనై శ్వాస లేని ఆశ నేనై మిగలనా నువ్వే నువ్వే కావాలంటుంది పదే పదే నా ప్రాణం నిన్నే నిన్నే వెంటాడుతూ ఉంది ప్రతి క్షణం నా మౌనం ఏ చోట ఉన్నా నీ వెంట లేన సముద్రమంతా నా కన్నుల్లో కన్నీటి అలలౌతుంటే ఎడారి అంతా నా గుండెల్లో నిట్టుర్పు సెగలౌతుంటే చరణం: 1 నేల వైపు చూసే నేరం చేశావని నీలి మబ్బు నిందిస్తుందా వాన చినుకుని గాలి వెంట వెళ్ళే మారం మానుకోమని తల్లి తీగ భందిస్తుందా మల్లె పూవుని ఏమంత పాపం ప్రేమ ప్రేమించడం ఇకనైనా చాలించమ్మా వేధించడం చెలిమై కురిసే సిరివెన్నెలవ క్షణమై కరిగే కలవా ఆ ఆ నువ్వే నువ్వే కావాలంటుంది పదే పదే నా ప్రాణం నిన్నే నిన్నే వెంటాడుతూ ఉంది ప్రతి క్షణం నా మౌనం రేపు లేని చూపు నేనై శ్వాస లేని ఆశ నేనై మిగలనా చరణం: 2 వేలు పట్టి నడిపిస్తుంటే చంటి పాపలా నా అడుగులు అడిగే తీరం చేరేదెలా వేరెవరో చూపిస్తుంటే నా ప్రతి కలా కంటి పాప కోరే స్వప్నం చూసేదెలా నాక్కూడ చోటేలేని నా మనసులో నిన్నుంచగలనా ప్రేమ ఈ జన్మలో వెతికే మజిలి దొరికే వరకు నడిపే వెలుగై రావా ఆ ఆ నువ్వే నువ్వే కావాలంటుంది పదే పదే నా ప్రాణం నిన్నే నిన్నే వెంటాడుతూ ఉంది ప్రతి క్షణం నా మౌనం ఏ చోట ఉన్నా నీ వెంట లేన సముద్రమంతా నా కన్నుల్లో కన్నీటి అలలౌతుంటే ఎడారి అంతా నా గుండెల్లో నిట్టుర్పు సెగలౌతుంటే

I Am Very Sorry Song Lyrics in Telugu – Nuvve Nuvve (2002)

'I Am Very Sorry' song from Nuvve Nuvve (2002) movie is composed by Koti and sung by KK.

SONG INFORMATION
Movie : Nuvve Nuvve (2002)
Music : Koti
Singers : KK
చిత్రం: నువ్వే నువ్వే (2002) సంగీతం: కోటి సాహిత్యం: సిరివెన్నెల గానం: కె.కె. పల్లవి: అయామ్ వెరీ సారీ అన్నాగా వందోసారి సరదాగా నవ్వేసెయ్ ఒకసారి అయామ్ వెరీ సారీ అన్నాగా వందోసారి సరదాగా నవ్వేసెయ్ ఒకసారి హయో హయో హయో పెదాలలా బిగించి శపించకే మరీ మంత్రాలవీ జపించి వదిలెయ్ క్షమించి అరె పాపం చిరుకోపం నిజమేనా మేకప్పా అరె పాపా సారీ చెప్పా ఓ మై గోల్డెన్ చేపా ఫారెక్స్ బేబీ టైపా లౌలీ లాలి పాప్పా అయామ్ వెరీ సారీ అన్నాగా వందోసారి సరదాగా నవ్వేసెయ్ ఒకసారి ఓ అయామ్ వెరీ సారీ అన్నాగా వందోసారి సరదాగా నవ్వేసెయ్ ఒకసారి చరణం: 1 తరిమి తరిమి తరిమి నిను ఏడిపించడం ఎందుకా అని అడిగావనుకో చెబుతా వింటావా మరి తరిమి తరిమి తరిమి నిను ఏడిపించడం ఎందుకా అని అడిగావనుకో చెబుతా వింటావా మరి సమ్మర్ గిమ్మర్ వింటర్ అంటూ ప్రతీ ఋతువుకో డిఫరెన్సూ ఉన్నప్పుడే కద బాగుంటుంది చిరునవ్వు తప్ప నీ ఫేసుకెప్పుడూ మరో కలర్ రాదా అని డౌటుపుట్టి అదె తీర్చుకుందుకే తమాషాగా ట్రైలేసి చూశానే బేబే అయామ్ వెరీ సారీ అన్నాగా వెయ్యోసారి సరదాగా నవ్వేసెయ్ ఒకసారి హే అయామ్ వెరీ సారీ అన్నాగా వెయ్యోసారి సరదాగా నవ్వేసెయ్ ఒకసారి చరణం: 2 లిప్స్టిక్ అవసరమైనా లేనంత ఎర్రగా పెదవి ఉందిగా కందే వరకూ కొరికి తెగ హింసించకే లిప్స్టిక్ అవసరమైనా లేనంత ఎర్రగా పెదవి ఉందిగా కందే వరకూ కొరికి తెగ హింసించకే టొమేటో పళ్ళకి డూపుల్లా సుమారు సిమ్లా యూపిల్లా ఉన్నావే పిల్లా నువు నిలువెల్లా నీ బంగమూతితో పొంగనీయకే బుగ్గలు బర్గర్లా నన్నుండనీయక ఊరించితే అవి నిజం చెప్పు నీ తప్పు కాదా అదీ అయామ్ వెరీ సారీ అన్నాగా వెయ్యోసారి సరదాగా నవ్వేసెయ్ ఒకసారి ఓ అయామ్ వెరీ సారీ అన్నాగా వెయ్యోసారి సరదాగా నవ్వేసెయ్ ఒకసారి హయో హయో హయో పెదాలలా బిగించి శపించకే మరీ మంత్రాలవీ జపించి వదిలెయ్ క్షమించి

Niddurapothunna Song Lyrics in Telugu – Nuvve Nuvve (2002)

'Niddurapothunna' song from Nuvve Nuvve (2002) movie is composed by Koti and sung by Shankar Mahadevan.

SONG INFORMATION
Movie : Nuvve Nuvve (2002)
Music : Koti
చిత్రం: నువ్వే నువ్వే (2002) సంగీతం: కోటి సాహిత్యం: సిరివెన్నెల గానం: శంకర్ మహదేవన్ పల్లవి: చెలియా నీవైపే వస్తున్నా కంటపడవా ఇకనైనా ఎక్కడున్నా నిద్దరపోతున్న రాతిరినడిగా గూటికి చేరిన గువ్వలనడిగా చల్లగాలినడిగా ఆ చందమామనడిగా ప్రియురాలి జాడ చెప్పరేమనీ అందరినీ ఇలా వెంటపడి అడగాలా సరదాగా నువ్వే ఎదురైతే సరిపోదా చల్లగాలినడిగా ఆ చందమామనడిగా ప్రియురాలి జాడ చెప్పరేమనీ అందరినీ ఇలా వెంటపడి అడగాలా సరదాగా నువ్వే ఎదురైతే సరిపోదా చరణం: 1 ఓ అసలే ఒంటరితనం అటుపై నిరీక్షణం అసలే ఒంటరితనం అటుపై నిరీక్షణం అరెరే పాపమనీ జాలిగా చూసే జనం గోరంత గొడవ జరిగితే కొండంత కోపమా నన్నొదిలి నువ్వు ఉండగలవ నిజం చెప్పవమ్మా అందరినీ ఇలా వెంటపడి అడగాలా సరదాగా నువ్వే ఎదురైతే సరిపోదా నిద్దరపోతున్న రాతిరినడిగా గూటికి చేరిన గువ్వలనడిగా చల్లగాలినడిగా ఆ చందమామనడిగా ప్రియురాలి జాడ చెప్పరేమనీ అందరినీ ఇలా వెంటపడి అడగాలా సరదాగా నువ్వే ఎదురైతే సరిపోదా చరణం: 2 ఓ నువ్వు నా ప్రాణం అని విన్నవించు ఈ బాధని నువ్వు నా ప్రాణమని విన్నవించు ఈ బాధని ఎక్కడో దూరానున్నా చుక్కలే విన్నా గాని కదిలించలేద కాస్త కూడ నీ మనస్సుని పరదాలు దాటి ఒక్కసారి పలకరించవేమే అందరినీ ఇలా వెంటపడి అడగాలా సరదాగా నువ్వే ఎదురైతే సరిపోదా నిద్దరపోతున్న రాతిరినడిగా గూటికి చేరిన గువ్వలనడిగా తానేన తన తాన నన తాన నన తానేన తన తాన నన నా ఓ ఓ ఓ తన నన నా తన నన నా

Ammai Nachesindi Song Lyrics in Telugu – Nuvve Nuvve (2002)

'Ammai Nachesindi' song from Nuvve Nuvve (2002) movie is composed by Koti and sung by Rajesh Krishnan and Kousalya.

SONG INFORMATION
Movie : Nuvve Nuvve (2002)
Music : Koti
Special Note : వీడియో సాంగ్ లో చరణం: 2 లో ఈ లైన్ లేదు గమనించగలరు కొమ్మల్లో చిలకా మోమాట పడక వచ్చి వాలమ్మా
చిత్రం: నువ్వే నువ్వే (2002) సంగీతం: కోటి సాహిత్యం: సిరివెన్నెల గానం: రాజేష్ కృష్ణన్, కౌశల్య పల్లవి: అమ్మాయి నచ్చేసింది ఆహ్వానమిచ్చేసింది ఓ ముద్ద మందారంలా ముస్తాబయ్యిందీ వైశాఖ మొచ్చేసింది ఇవ్వాళ రేపో అంది ఓ మంచి మూర్తం చూసి సిద్ధం కమ్మందీ ఓ...ఓ...ఓ... ఈ కబురు విన్న ఎదలో ఎన్నెన్ని పొడుపు కధలో మనువే కుదిరీ కునుకే చెదిరి మురిపెం ముదిరి నా మనసు నిలవనందీ కొమ్మల్లో చిలకా మోమాట పడక వచ్చి వాలమ్మా అమ్మాయి నచ్చేసింది ఆహ్వానమిచ్చేసింది ఓ ముద్ద మందారంలా ముస్తాబయ్యిందీ చరణం: 1 ఈ గాలి రోజూలా వీస్తున్నా ఈ వేల వేరేలా వింటున్నా సన్నాయి రాగాలుగా నావైపు రోజూలా చూస్తున్నా ఈనాడు ఏదోలా అవుతున్న నీ కన్ను ఏమన్నదో ఓ...నా ఈడు ఏం విన్నదో ఆశ పెట్టి పెట్టి పెట్టి చంపొద్దమ్మా ఇట్టా నువ్వు పట్టి పట్టి పట్టి చూస్తూ ఉంటే ఎట్టా ఎన్నెన్నొ అంటించి ఉక్కిరి బిక్కిరి అవుతున్నా కొమ్మల్లో చిలకా మోమాట పడక వచ్చి వాలమ్మా అమ్మాయి నచ్చేసింది ఆహ్వానమిచ్చేసింది ఓ ముద్ద మందారంలా ముస్తాబయ్యిందీ చరణం: 2 ముత్యాల మేనాలే రప్పించి మేఘాల వీధుల్లో తిప్పించి ఊరేగనీ హాయిగా అందాల హద్దుల్నే తప్పించి వందేళ్ళ కౌగిల్లే అందించీ ఊరించు ఆ వేడుక ఓ... ఊహించనీ నన్నిలా ఏంటి గిచ్చి గిచ్చి రెచ్చ గొట్టేలా నువ్వూ ఇంత పిచ్చి పిచ్చి పిచ్చి పెంచేస్తొందే నువ్వూ హోయ్ కవ్వించి కరిగించి కరిగే వయసుని కాపాడు కొమ్మల్లో చిలకా మోమాట పడక వచ్చి వాలమ్మా అమ్మాయి నచ్చేసింది ఆహ్వానమిచ్చేసింది ఓ ముద్ద మందారంలా ముస్తాబయ్యింది ఓ...ఓ...ఓ...ఈ కబురు విన్న ఎదలో ఎన్నెన్ని పొడుపు కధలో మనువే కుదిరీ కునుకే చెదిరి మురిపెం ముదిరి నా మనసు నిలవనంది కొమ్మల్లో చిలకా మోమాట పడక వచ్చి వాలమ్మా

గమనిక: వీడియో సాంగ్ లో ఈ లైన్ లేదు గమనించగలరు (కొమ్మల్లో చిలకా మోమాట పడక వచ్చి వాలమ్మా)

Palli Balakrishna Saturday, July 29, 2017



చిత్రం: ఎలా చెప్పను (2003)
సంగీతం: కోటి
నటీనటులు: తరుణ్ , శ్రేయ శరన్
దర్శకత్వం: బి.వి.రమణ
నిర్మాత: స్రవంతి రవికిశోర్
విడుదల తేది: 02.10.2003



Songs List:



రంగుల తారక పాట సాహిత్యం

 
చిత్రం: ఎలా చెప్పను (2003)
సంగీతం: కోటి
సాహిత్యం: సిరివెన్నెల
గానం: కార్తీక్, సుచిత్ర

Yes I am from bombay
come baby lets play
sing with me swing with me
dont you ever feel so

రంగుల తారక నింగిని ఆగక కిందికి జారినదా
ముంబై మేనక ముందరి కాళ్ళకి బంధము వేసినదా
తప్పు జరిగేలా తప్పటడుగేలా
సిగ్గు బెదిరేలా చిందులెయ్యాల

బంగరు బాలిక పొంగుల కానుక వద్దనరాదు కదా
సంగతి తేలక లొంగని కోరిక నిద్దరపోదు కదా
తట్టి పిలవాలా బెట్టు వదిలేలా జట్టు కలిపేలా చెట్టు దిగావేలా

ఎత్తులో పొడగరి కట్టులో పొదుపరి కాపలా చాలదే చిలిపి చిన్నారి
ఊహలో అలజడి ఉరకదే తదుపరి ఊరికే దేనికి మాట కచ్చేరి
చక్కదనం చూడమని ఉక్కిరి బిక్కిరి చెయ్యకిలా
మక్కువనే అణుచుకుని చక్కెర చేదంటే ఎలా
హెయ్ అందరు చేరి మందలా మారి చెయ్యరా చోరి బెదరదే పోరి హా

బంగరు బాలిక పొంగుల కానుక వద్దనరాదు కదా
సంగతి తేలక లొంగని కోరిక నిద్దరపోదు కదా

సొంపులే దోచుకో సొంతమే చేసుకో కాదని లేదని అడ్డు చెబుతానా
వద్దులే దాచుకో కొద్దిగా ఓర్చుకో వీధిలో విసరకే ఎంత బరువైనా
కన్నెదరే ఉంది కదా అడగని వరమై కన్నె ధనం
కర్ణుడికే లేదుగదా నువ్వు చూపే ఈ దాన గుణం
అప్సరస మీద ఆశపడరాదా పౌరుషం లేదా పరువు చెడిపోదా

రంగుల తారక నింగిని ఆగక కిందికి జారినదా
ముంబై మేనక ముందరి కాళ్ళకి బంధము వేసినదా
తప్పు జరిగేలా తప్పటడుగేలా
సిగ్గు బెదిరేలా చిందులెయ్యాల





ఈ క్షణం ఒకే ఒక కోరిక పాట సాహిత్యం

 
చిత్రం: ఎలా చెప్పను (2003)
సంగీతం: కోటి
సాహిత్యం: సిరివెన్నెల
గానం: చిత్ర

ఈ క్షణం ఒకే ఒక కోరిక
నీ స్వరం వినాలని తియ్యగా
ఈ క్షణం ఒకే ఒక కోరిక నీ స్వరం వినాలని తియ్యగా
తరగని దూరములో...ఓ...ఓ...
తెలియని దారులలో... ఓ... ఓ...
ఎక్కడున్నావు అంటోంది ఆశగా
ఈ క్షణం ఒకే ఒక కోరిక నీ స్వరం వినాలని తియ్యగా

ఎన్ని వేల నిమిషాలో లెక్కపెట్టుకుంటోంది
ఎంత సేపు గడపాలో చెప్పవేమి అంటోంది
నిన్ననేగా వెళ్ళావన్న సంగతి గుర్తేలేని గుండె ఇదీ...
ఆ... ఆ... ఆ... ఆ...
మళ్లీ నిన్ను చూసేదాకా నాలో నన్ను ఉండనీక ఆరాటంగా కొట్టుకున్నది
ఈ క్షణం ఒకే ఒక కోరిక నీ స్వరం వినాలని తియ్యగా

రెప్ప వేయనంటోంది ఎంత పిచ్చి మనసు ఇది
రేపు నువ్వు రాగానే కాస్త నచ్చచెప్పు మరి
నిన్న మొన్న చెప్పుకున్న ఊసులే మళ్లీ మళ్లీ తలచుకుని 
ఆ... ఆ... ఆ... ఆ...
ఇంకా ఎన్నో ఉన్నాయంటు ఇప్పుడే చెప్పాలంటు నిద్దరోను అంటోంది

ఈ క్షణం ఒకే ఒక కోరిక నీ స్వరం వినాలని తియ్యగా
తరగని దూరములో...ఓ...ఓ...
తెలియని దారులలో... ఓ... ఓ...
ఎక్కడున్నావు అంటోంది ఆశగా



ఆ నవ్వులో ఏమున్నదో పాట సాహిత్యం

 
చిత్రం: ఎలా చెప్పను (2003)
సంగీతం: కోటి
సాహిత్యం: సిరివెన్నెల
గానం: కార్తీక్

ఆ నవ్వులో ఏమున్నదో చలించింది నా మనసు తొలిసారిగా
ఆ కళ్ళతో ఏమన్నదో ఒకే చూపుతో నన్ను మంత్రించగా
ఉదయంలా కనిపించింది హృదయంలో కొలువయ్యింది
మెరుపల్లె నను తాకింది వరదల్లే నను ముంచిందీ...
అవునన్నా కాదన్నా అయ్యేది అయ్యిందిగా చేసేది ఏముందికా...

నచ్చజెప్పినా ఏ ఒకరు నమ్మరే ఎలా నన్నిపుడు నేనే నేనన్నా (2)
మునుపు ఎన్నడూ ఇంతిదిగా మురిసిపోలేదుగా
అదుపు తప్పేంత అలజడిగా ఊగిపోలేదుగా
అడుగడుగు అలలవగా పరుగులు నేర్పింది తానే కదా...
అవునన్నా కాదన్నా అయ్యేది అయ్యిందిగా చేసేది ఏముందిక

గుర్తుపట్టనే లేదసలు గుండెలోతులో గుసగుసలు తానొచ్చేదాక (2)
తెలియజెప్పింది తుంటరిగా వయసువచ్చిందని
తలుపుతట్టింది సందడిగా నిదర ఎన్నాళ్ళని
తన చెలిమే అడగమని తరుముకు వచ్చింది తుఫానుగా
అవునన్నా కాదన్నా అయ్యేది అయ్యిందిగా చేసేది ఏముందిక...

ఆ నవ్వులో ఏమున్నదో చలించింది నా మనసు తొలిసారిగా
ఉదయంలా కనిపించింది హృదయంలో కొలువయ్యింది
మెరుపల్లె నను తాకింది వరదల్లే నను ముంచిందీ...
అవునన్నా కాదన్నా అయ్యేది అయ్యిందిగా చేసేది ఏముందికా...




మేఘాల పల్లకిలోన పాట సాహిత్యం

 
చిత్రం: ఎలా చెప్పను (2003)
సంగీతం: కోటి
సాహిత్యం: సిరివెన్నెల
గానం: సునీత, శ్రీరాం ప్రభు

మేఘాల పల్లకిలోన దిగి వచ్చింది ఈ దేవకన్య (2)
మిలమిల మెరిసిన శశికళ చినుకులా కురిసిన హరివిల్లా
గుడిలో దివ్వేలా గుండెలో మువ్వలా
ఎగిరే గువ్వలా ఎదిగే పువ్వులా
నవ్వవే నిత్యం ఇలా ముత్యాల వానలా
అందాల మందార కొమ్మా హోయ్ అల్లారు ముద్దైన బొమ్మా

నీలా నవ్వాలని నీతో నడవాలని
పచ్చని పండుగ వచ్చింది చల్లని కబురు తెచ్చింది
వచ్చే నూరేళ్ళ కాలానికి నువ్వే మారాణివంటున్నది
ప్రతి రోజులా ఒక రోజా ఇది ఏడాదిలో మహారాజే ఇది
లోకాన ఉన్న అందరికన్నా చక్కనైన చిన్నది 
తన ఒడిలో పుట్టింది అంటున్నది

మేఘాల పల్లకిలోనా...
మేఘాల పల్లకిలోన దిగి వచ్చింది ఈ దేవకన్య
మిలమిల మెరిసిన శశికళ చినుకులా కురిసిన హరివిల్లా

నన్నే మరిపించగా నిన్నే మురిపించగా
ప్రతి రాతిరి వేళల్లో రాని చందమామయ్యని
నీ కలువ కన్నుల్లో ఎన్నో కళలు నింపాలని
నీకోసమే ఆ నీలాకాశం పంపిందమ్మా వెన్నెల సందేశం
నిన్నటి కన్నా రేపెంతో మిన్న చూడమన్న ఆశతో 
సందడిగా చేరింది సంతోషం

మేఘాల పల్లకిలోనా...
మేఘాల పల్లకిలోన దిగి వచ్చింది ఈ దేవకన్య
మిలమిల మెరిసిన శశికళ చినుకులా కురిసిన హరివిల్లా



మాఘమాస వేళ పాట సాహిత్యం

 
చిత్రం: ఎలా చెప్పను (2003)
సంగీతం: కోటి
సాహిత్యం: సిరివెన్నెల
గానం: ఉదిత్ నారాయణ్, శ్రేయ ఘోషల్

కళలు చిలుకు అలివేణి నుదుట కస్తూరి తిలకమును దిద్దరే
సిగ్గులొలుకు చెలి పసిడి బుగ్గలకు పసుపుతో నిగ్గు పెంచరే
కొత్త వెలుగు చూపించగలుగు పారాణి పూసి నడిపించరే
కన్నె గోదారి వధువుగా మారి కడలి కౌగిలికి చేరు తరుణమిది
వేడుకైన కళ్యాణ సమయమిది

మాఘమాస వేళ కోకిలమ్మ పాట
ప్రేమ పర్ణశాల చూపుతున్న బాట
అనురాగం తోడు రాగా నవలోకం ఏలుకోగా
శుభలగ్నం చేరుకుందని పిలిచేలా

ఓ ఓ ఓ... ఓ ఓ ఓ... (2)

మాఘమాస వేళ కోకిలమ్మ పాట

తందాన తందాన తానాన తానానా
తందాన తందాన తననన నా...

ఎవరిని నే చూసినా అడుగులు ఎటు వేసినా
ఎదురయేది నువ్వే నీకు తెలుసునా
నిను కలవని రోజున గడవదు ఏం చేసినా
వదలనంది నన్నే తీపి యాతన
నువ్వు వెతికే మజిలీ అవనా...
నెచ్చెలిగా మదిలో చేరనా...
ఇక అటు ఇటు ఎగరకే పావురమా
నా కౌగిలి కొలువున స్థిరపడుమా
తలపును దోచిన దొరతనమా
నా అనుమతి తమకిక అవసరమా
నన్ను నీలో నిన్ను నాలో నింపే నీ ప్రేమ

మాఘమాస వేళ కోకిలమ్మ పాట

మనసుకి మలి జన్మగా నువు మలిచిన బొమ్మగా
నిన్ను అల్లుకోనీ కొత్త ఊపిరి
హో గగనము దిగి నేరుగా ప్రియసఖిలా చేరగా
నన్ను కలుసుకుందా నింగి జాబిలి
నా మనవిని విననే వినవా...
ఇది నిజమని అననే ఆనవా...
నది నడకలు నేర్పిన సాగరమా
నీ ఒడిలో ఒదిగితే చాలు సుమా
తెలియని సైగల స్వాగతమా
ఈ బిడియము దేనికే సోయగమా
ఆగనీదు సాగనీదు చూడు ఈ ప్రేమ

మాఘమాస వేళ కోకిలమ్మ పాట
అనురాగం తోడు రాగా నవలోకం ఏలుకోగా
శుభలగ్నం చేరుకుందని పిలిచేలా
ఓ ఓ ఓ... ఓ ఓ ఓ... (2)




మన్నించు ఓ ప్రేమా పాట సాహిత్యం

 
చిత్రం: ఎలా చెప్పను (2003)
సంగీతం: కోటి
సాహిత్యం: సిరివెన్నెల
గానం: చిత్ర, ఉదిత్ నారాయన్

ఓ ప్రేమా ప్రేమా ప్రేమా...
మన్నించు ఓ ప్రేమా మురిపించుకోకమ్మా
మౌనాలు కరిగించేలా మాటాడుమా
మన్నించు ఓ ప్రేమా మరుగేల చెప్పమ్మా
దరిచేరు దారేదైనా చూపించుమా
చెప్పనంటు దాచడానికైనా
అంత చెప్పరాని మాట కాదు ఔనా
ఇంత మంచి వేళ ఎదురైనా
మరి చెప్పుకోవ ఇంక ఇపుడైనా
పట్టరాని ఆశ పెంచుకున్నా
అది మోయరాని భారమవుతున్నా
చెప్పుకుంటే తప్పు లేదు అయినా
నువ్వు ఒప్పుకోవో ఏమో అనుకున్న...
ఓ ప్రేమా ప్రేమా ప్రేమా...
మన్నించు ఓ ప్రేమా మురిపించుకోకమ్మా
మౌనాలు కరిగించేలా మాటాడుమా

జంట కమ్మని వెంట రమ్మని పిలిచే నేస్తమా
కొంత చేరువై కొంత దూరమై ఉంటే న్యాయమా
రెండు చేతులా అందుకోమని అనవేం స్నేహమా
చెంత నిలిచినా చేయి కలపవేం నాదే నేరమా
చొరవగా పొదువుకో నడిపే ప్రణయమా
బిడియమే వదులుకో బెదిరే ప్రియతమా
తగిన తరుణమని ఉదయ కిరణమై
ఎదురుపడిన వరమా
మన్నించు ఓ ప్రేమా మురిపించుకోకమ్మా
మౌనాలు కరిగించేలా మాటాడుమా

అన్నివైపులా చెలిమి కాపలా అల్లే బంధమా
మబ్బులో అలా దాగితే ఎలా దిగిరా చంద్రమా
నిదురలో అలా నిలిచిపోకలా మెరిసే స్వప్నమా
కంటిపాపలో కబురులేమిటో చెబితే పాపమా
తలపునే తెలుపవే నాలో ప్రాణమా
పెదవిపై పలకవే ఊహా గానమా
మదిని మీటినది నీవు కాదా మరి మధురమైన స్వరమా
మన్నించు ఓ ప్రేమా మురిపించుకోకమ్మా
మౌనాలు కరిగించేలా మాటాడుమా
చెప్పనంటు దాచడానికైనా
అంత చెప్పరాని మాట కాదు ఔనా
ఇంత మంచి వేళ ఎదురైనా
మరి చెప్పుకోవ ఇంక ఇపుడైనా
ఓ ప్రేమా ప్రేమా ప్రేమా... ఓ ప్రేమా ప్రేమా ప్రేమా...





మంచు తాకినా ఈ వనం పాట సాహిత్యం

 
చిత్రం: ఎలా చెప్పను (2003)
సంగీతం: కోటి
సాహిత్యం: సిరివెన్నెల
గానం: మల్లికార్జున్

మంచు తాకినా ఈ వనం పూలు తొడిగేనా
ముగవోయిన జీవితం మళ్ళీ పలికేనా
చిరునవ్వుల ఇక ఈ పెదవులకి జ్ఞాపకమై మిగిలేనా
కల జారిన ఈ కనుపాపలకి నలువైపుల నలుపేనా ఏమో 

మంచు తాకిన ఈ వనం పూలు తొడిగేనా
ముగవోయిన జీవితం మళ్ళీ పలికేనా

తుంచిన పూలను తెచ్చి అతికించలేను గాని
చైత్రం నేనై వచ్చి నా తప్పు దిద్దుకోని
చిగురాశలు రాలిన కొమ్మా చినబోకమ్మా
పచ్చదనం నీలో ఇంకా మిగిలుందమ్మా
అందామని ఉన్నా అవకాశం ఉందా
నిందించలేని మౌనమే నన్నాపగా

మంచు తాకిన ఈ వనం పూలు తొడిగేనా
ముగవోయిన జీవితం మళ్ళీ పలికేనా

నిన్నటి స్వప్నం కోసం వెనుదిరిగి చూడకంటూ
రేపటి ఉదయం కోసం ముందడుగు వెయ్యమంటూ
తెలవారని రేయని నడిపే వెలుగవగలనా...
తడి ఆరని చెంపలు తుడిచే చెలిమవగలనా...
నిదురించని నిజమై నిలదీసే గతమే
భరించలేని భారమై వెంటాడగా...

మంచు తాకిన ఈ వనం పూలు తొడిగేనా
ముగవోయిన జీవితం మళ్ళీ పలికేనా
చిరునవ్వుల ఇక ఈ పెదవులకి జ్ఞాపకమై మిగిలేనా
కల జారిన ఈ కనుపాపలకి నలువైపుల నలుపేనా ఏమో 




ప్రతీ నిజం పగటి కలగా పాట సాహిత్యం

 
చిత్రం: ఎలా చెప్పను (2003)
సంగీతం: కోటి
సాహిత్యం: సిరివెన్నెల
గానం: చిత్ర 

ప్రతీ నిజం పగటి కలగా నిరాశగా నిలవనా
ప్రతీ క్షణం కలత పడగా నిరీక్షగా గడపనా
కన్నీటి సంద్రంలో నావనై ఎన్నాళ్ళీ ఎదురీత
ఏనాడు ఏ తీరం ఎదుట కనబడక

ప్రతీ నిజం పగటి కలగా నిరాశగా నిలవనా
ప్రతీ క్షణం కలత పడగా నిరీక్షగా గడపనా

పెదవులు మరచిన చిరు నగవై నిను రమ్మని పిలిచానా
వెతకని వెలుగుల పరిచయమై వరమిమ్మని అడిగానా
నిదరపోయే ఎదను లేపి నిశిను చూపించగా
ఆశతో చాచిన దోసిట శూన్యం నింపీ
కరగకుమా నా కన్నులనే వెలి వేసి...

ప్రతీ నిజం పగటి కలగా నిరాశగా నిలవనా
ప్రతీ క్షణం కలత పడగా నిరీక్షగా గడపనా

ఎక్కడ నువ్వని దిక్కులలో నిను వెతికిన నా కేక
శిలలను తాకిన ప్రతిధ్వనిగా నను చేరితే ఒంటరిగా
సగములోనే అలసిపోయే పయనమయ్యాగా
ఇసుకను చేసిన సంతకమా నీ స్నేహం
ఏ అల నిను చేరిపిందో తెలుపదు కాలం


Palli Balakrishna Thursday, July 27, 2017

Most Recent

Default