-->
Home Movie Songs Latest Updated Movies Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Results for "J. D. Chakravarthy"



చిత్రం: మా పెళ్లికి రండి (2000)
సంగీతం: ఎస్. ఎ. రాజకుమార్
నటీనటులు: జె. డి.చక్రవర్తి, సాక్షి శివానంద్, అల్ఫన్సా 
సాహిత్యం: సామవేదం షణ్ముఖ శర్మ, భువన చంద్ర, కలువ కృష్ణ సాయి 
దర్శకత్వం: ముప్పలనేని శివ
నిర్మాతలు: NR అనురాధా దేవి, జాస్తి ఫణీంద్ర కుమార్ 
విడుదల తేది: 14.07.2000



Songs List:



నీకోసం నీలాకాశం పాట సాహిత్యం

 
చిత్రం: మా పెళ్లికి రండి (2000)
సంగీతం: ఎస్. ఎ. రాజకుమార్
సాహిత్యం:
గానం: రాజేష్, చిత్ర 

నీకోసం నీలాకాశం 



హల్లో చలాకి చిలకమ్ పాట సాహిత్యం

 
చిత్రం: మా పెళ్లికి రండి (2000)
సంగీతం: ఎస్. ఎ. రాజకుమార్
సాహిత్యం:
గానం: మనో, చిత్ర 

 హల్లో చలాకి చిలకమ్మా 




నువ్వే నాకు లోకం పాట సాహిత్యం

 
చిత్రం: మా పెళ్లికి రండి (2000)
సంగీతం: ఎస్. ఎ. రాజకుమార్
సాహిత్యం:
గానం: రాజేష్, చిత్ర 

నువ్వే నాకు లోకం 




మామ చందమామ పాట సాహిత్యం

 
చిత్రం: మా పెళ్లికి రండి (2000)
సంగీతం: ఎస్. ఎ. రాజకుమార్
సాహిత్యం: కలువ కృష్ణ సాయి 
గానం: పి. ఉన్నీకృష్ణన్, చిత్ర 

మామ చందమామ 

Palli Balakrishna Tuesday, April 21, 2026



చిత్రం: హోమం (2008)
సంగీతం: నితిన్ బాబా, జె.డి.చక్రవర్తి
బ్యాక్ గ్రౌండ్ స్కోర్: అమర్ మొహిలే 
సాహిత్యం: సుద్దాల అశోక్ తేజ (All)
నటీనటులు: జగపతి బాబు, జె.డి.చక్రవర్తి , మమతా మోహన్ దాస్, మధురిమ తులి 
డైలాగ్స్: కోనా వెంకట్ 
దర్శకత్వం: జె.డి.చక్రవర్తి
నిర్మాత: కోనేరు కిరణ్ కుమార్ 
విడుదల తేది: 29.08.2008



Songs List:



ఏ పాగలే ఏ హవులే పాట సాహిత్యం

 
చిత్రం: హోమం (2008)
సంగీతం: నితిన్ బాబా, జె.డి.చక్రవర్తి
సాహిత్యం: సుద్దాల అశోక్ తేజ 
గానం: శివాని, జె.డి.చక్రవర్తి

ఏ పాగలే ఏ హవులే 




ఏయ్ మిస్టర్... నిన్నే పాట సాహిత్యం

 
చిత్రం: హోమం (2008)
సంగీతం: నితిన్ బాబా, జె.డి.చక్రవర్తి
సాహిత్యం: సుద్దాల అశోక్ తేజ 
గానం: మమతా మోహన్ దాస్, శివాని, నిహాల్ 

ఏయ్ మిస్టర్... నిన్నే



పెడవికేదెం కసిరో పాట సాహిత్యం

 
చిత్రం: హోమం (2008)
సంగీతం: నితిన్ బాబా, జె.డి.చక్రవర్తి
సాహిత్యం: సుద్దాల అశోక్ తేజ 
గానం: మమతా మోహన్ దాస్, జగపతి బాబు, జె.డి.చక్రవర్తి

పెడవికేదెం కసిరో 




మగాళ్ళు మీ మాటలో పాట సాహిత్యం

 
చిత్రం: హోమం (2008)
సంగీతం: నితిన్ బాబా, జె.డి.చక్రవర్తి
సాహిత్యం: సుద్దాల అశోక్ తేజ 
గానం: మధుశ్రీ,  జె.డి.చక్రవర్తి

మగాళ్ళు మీ మాటలో 



కత్తినాకు గుచ్చాడమ్మో పాట సాహిత్యం

 
చిత్రం: హోమం (2008)
సంగీతం: నితిన్ బాబా, జె.డి.చక్రవర్తి
సాహిత్యం: సుద్దాల అశోక్ తేజ 
గానం: మాలతి 

కత్తినాకు గుచ్చాడమ్మో 



హోమం యుద్ధం పాట సాహిత్యం

 
చిత్రం: హోమం (2008)
సంగీతం: నితిన్ బాబా, జె.డి.చక్రవర్తి
సాహిత్యం: సుద్దాల అశోక్ తేజ 
గానం: వినోద్ రాథోడ్ 

హోమం యుద్ధం 

Palli Balakrishna Sunday, August 7, 2022



Movie Details

Palli Balakrishna Thursday, August 26, 2021


చిత్రం: డైనమైట్ (2015)
సంగీతం: అచ్చు రాజమణి
నటీనటులు: విష్ణు మంచు, ప్రణిత సుభాస్, జె.డి.చక్రవర్తి
దర్శకత్వం: విష్ణు మంచు, విజయన్ మాస్టర్
నిర్మాత: మంచు విష్ణు
విడుదల తేది: 04.09.2015


Palli Balakrishna Tuesday, February 19, 2019


చిత్రం: సత్య (1999)
సంగీతం: విశాల్ భరద్వాజ్ , బ్యాక్గ్రౌండ్ స్కోర్: సందీప్ చౌతా
సాహిత్యం: సిరివెన్నెల
గానం: రాజేష్
నటీనటులు: జె.డి చక్రవర్తి , ఊర్మిళ మథోండ్కర్
దర్శకత్వం: రాంగోపాల్ వర్మ
నిర్మాత: రాంగోపాల్ వర్మ
విడుదల తేది: 1999

గాలి లోనే మాటి మాటికీ
వేలితో నీ పేరు రాయడం
గాలి లోనే మాటి మాటికీ
వేలితో నీ పేరు రాయడం
యెమయ్యిందో యేమిటో
నాకేమయ్యిందో యేమిటో
రాతిరంతా చందమామతో
లేని పోని ఊసులాడటం
యెమయ్యిందో యేమిటో

నాకేమయ్యిందో యేమిటో
ఒక్క సారి నిన్ను వానవొల్లో
ఆడుతుంటె చూసాను
అంత వరకు ఎప్పుడు ఆనవాలే
లేని ఊహలోన తడిసాను
ఒక్క సారి నిన్ను వాన వొల్లో
ఆడుతుంటె చూసాను
అంత వరకు ఎప్పుడు ఆనవాలే
లేని ఊహ లోన తడిసాను

మెరిసె వాన విల్లులా కలలో నువ్విలా
కొలువుండిపోతె ఇంక నిదురించేదెలా

కునుకు రాని అర్ధరాత్రిలో
కళ్ళు తెరిచి కలవరించడం
యెమయ్యిందో యేమిటో
నాకేమయ్యిందో యేమిటో

మెరిసె మాయలేడి రూపం
మంత్రం వేసి నన్ను లాగుతుంటె
ఆగుతుందా నాలో వయసు వేగం
మనస్సులో సముద్రమై
అలజడి ఎటున్నా రమ్మని
నీకోసం కోటి అలలై పిలిచే సందడి
దిక్కులంటి నీ దాటి జాడ వెతకనీ

దారి పోయె ప్రతి వారిలో
నీ పోలికలే వెతుకుతుండటం
యెమయ్యిందో యేమిటో
నాకేమయ్యిందో యేమిటో

గాలి లోనే మాటి మాటికీ
వేలితో నీ పేరు రాయడం
యెమయ్యిందో యేమిటో
నాకేమయ్యిందో యేమిటో

Palli Balakrishna Tuesday, November 21, 2017


చిత్రం: మనీ (1993)
సంగీతం: శ్రీ (కొమ్మినేని శ్రీనివాస చక్రవర్తి)
సాహిత్యం: సిరివెన్నెల
గానం: సత్యం, సిరివెన్నెల, శ్రీ
నటీనటులు: జె. డి.చక్రవర్తి, చిన్నా, జయసుధ
దర్శకత్వం: శివ నాగేశ్వరరావు
నిర్మాత: రామ్ గోపాల్ వర్మ
విడుదల తేది: 10.06.1993

వారెవ్వా ఏమి ఫేసు అచ్చు హీరోలా ఉంది బాసు
వచ్చింది సినిమా చాన్సు ఇంక వేసేయి మరో డోసు
వారెవ్వా ఏమి ఫేసు అచ్చు హీరోలా ఉంది బాసు
వచ్చింది సినిమా చాన్సు ఇంక వేసేయి మరో డోసు
పిచ్చెక్కి ఆడియన్సు రెచ్చిపోయేలా చెయ్యి డాన్సు
చెప్పింది చెయ్య రా నీవే రా ముందు డేసు

అమితాబచ్చను కన్నా ఏం తక్కువ నువ్వైనా
హాలీవుడ్ లో అయినా ఎవరెక్కువ నీకన్నా
ఫైటూ ఫీటూ ఆటా పాటా రావా నీకైనా
చిరంజీవైనా పుడుతూనే మెగాస్టార్ అయిపోలేదయ్యా
తెగించి సత్తా చూపందే సడన్ గా స్వర్గం రాదయ్యా
బాలయ్య వెంకటేషు నాగార్జునా నరేషూ
రాజేంద్రుడూ సురేషూ రాజశేఖరు అదర్సూ
మొత్తంగా అందరూ అయిపోవాలోయ్ మటాషూ

గూండా రౌడీ దాదా అంటారే బయటుంటే
ఇక్కడ చేసే పన్లే సినిమాల్లో చూపిస్తే
ఓహో అంటూ జై కొడతారు తేడా మేకప్పే
నువ్వుంటే చాల్లే అంటారు కధెందుకు పోన్లే అంటారు
కటౌట్లూ గట్రా కడతారు టికట్లకు కొట్టుకు చస్తారు
బావుంది కానీ ప్లాను పల్టీ కొట్టిందో ఏమి గాను
బేకారీ బాత్ మాను జర గారు తగ్గించు ఖాను
అరె చుప్ హో శకున పక్షి లా తగులుకోకు ముందు


********   ********  ********


చిత్రం: మనీ (1993)
సంగీతం: శ్రీ (కొమ్మినేని శ్రీనివాస చక్రవర్తి)
సాహిత్యం: సిరివెన్నెల
గానం: యస్.పి.బాలు

చక్రవర్తికీ వీధీ బిచ్చగత్తెకీ బంధువవుతానని అంది మనీ మనీ
అమ్మ చుట్టము కాదు అయ్య చుట్టము కాదు ఐన అన్నీ అంది మనీ మనీ
పచ్చ నోటుతో లైఫు లక్ష లింకులు పెట్టుకుంటుందని అంది మనీ మనీ
పుట్టటానికీ పాడె కట్టటానికి మద్య అంతా తనే అంది మనీ మనీ
కాలం ఖరీదు చేద్దాం పదండి అంది మనీ మరీ
తైలం తమాష చూద్దాం పదండి అంది మనీ మనీ
డబ్బునే లబుడబ్బనే గుండెల్లో పెట్టుకొరా
దీక్షగా ధనలక్ష్మినే లవ్వాడి కట్టుకోరా
చక్రవర్తికీ వీధీ బిచ్చగత్తెకీ బంధువవుతానని అంది మనీ మనీ
అమ్మ చుట్టము కాదు అయ్య చుట్టము కాదు ఐన అన్నీ అంది మనీ మనీ

ఇంటద్దె కట్టావా నా తండ్రి నో ఎంట్రి నీకు వాకిట్లో
దొంగల్లే దూరాలి సైలెంట్లి నీ ఇంట్లో చిమ్మ చీకట్లో
అందుకే పదా బ్రదర్ మనీ వేటకి
అప్పుకే కదా బ్రదర్ ప్రతి పూటకీ
రోటీ కపడా రూము అన్నీ రూపీ రూపాలే
సొమ్మునే శరనమ్మనే చరనమ్ము నమ్ముకోరా
దీక్షగా ధనలక్ష్మినే లవ్వాడి కట్టుకోరా
చక్రవర్తికీ వీధీ బిచ్చగత్తెకీ బంధువవుతానని అంది మనీ మనీ
అమ్మ చుట్టము కాదు అయ్య చుట్టము కాదు ఐన అన్నీ అంది మనీ మనీ

ప్రేమించుకోవచ్చు దర్జాగా పిక్చర్లో పేద హీరోలా
డ్రీమించుకోవచ్చు ధీమాగ డ్రామాలో ప్రేమ స్టోరీలా
పార్కులో కనే కలే ఖరీదైనది బ్లాకులో కొనే వెలే సినీ ప్రేమదీ
చూపించరుగా ఫ్రీ షో వేసి ప్రేమికుల్లెవరికీ
జీవితం ప్రతి నిమిషము సొమ్మిచ్చి పుచ్చుకోరా
దీక్షగా ధనలక్ష్మినే లవ్వాడి కట్టుకోరా
చక్రవర్తికీ వీధీ బిచ్చగత్తెకీ బంధువవుతానని అంది మనీ మనీ
అమ్మ చుట్టము కాదు అయ్య చుట్టము కాదు ఐన అన్నీ అంది మనీ మనీ
కాలం ఖరీదు చేద్దాం పదండి అంది మనీ మరీ
తైలం తమాష చూద్దాం పదండి అంది మనీ మనీ
డబ్బునే లబుడబ్బనే గుండెల్లో పెట్టుకొరా
దీక్షగా ధనలక్ష్మినే లవ్వాడి కట్టుకోరా

Palli Balakrishna Monday, October 16, 2017





చిత్రం: నవ్వుతూ బ్రతకాలిరా (2001)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
నటీనటులు: జే. డి. చక్రవర్తి, సంగీత, అశాషైని, మాళవిక
దర్శకత్వం: కోడి రామకృష్ణ
నిర్మాత: శ్రీనివాస రెడ్డి
విడుదల తేది: 2001



Songs List:



నోరారా నవ్వేద్దాం పాట సాహిత్యం

 
చిత్రం: నవ్వుతూ బ్రతకాలిరా (2001)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహితం: సిరివెన్నెల
గానం: యస్. పి. బాలు


నోరారా నవ్వేద్దాం



కోనసీమ కుర్రదాన్నిరో పాట సాహిత్యం

 
చిత్రం: నవ్వుతూ బ్రతకాలిరా (2001)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహితం: సిరివెన్నెల
గానం: యస్. పి. బాలు, చిత్ర


కోనసీమ కుర్రదాన్నిరో




ధిరనతోం తకిట..ధిరనతోం పాట సాహిత్యం

 
సినిమా: నవ్వుతూ బ్రతకాలిరా
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహితం: సిరివెన్నెల
గానం: యస్.పి.బాలు, సుమంగళి

ధిరణతోం తకిట ధిరణతోం తకిట 
ధిరణతోం తకిట తానాన 
నిదుర ఉండదట కుదురు ఉండదట 
మధురమైన ఈ మైకాన 
నిమిషమైన ఇక నిలవనీయదట
మొదట అందరికి ఇంతేనా
తగని తొందరట చిలిపి చిందులట
అదుపులేని అనందనా
వలపు తేనె రుచి తెలుసుకున్న మది 
ఆగనన్నది ఏమైన


మనసుతో...మనసు ముడిపడినదీ 
కనులతో... కనులు కలిసినవీ
వయసుతో... వయసు జతపడినదీ
వలపుతో ...వరుస కుదిరినదీ
చెలియలో ...హొయలు తికమక పడినవీ
కులుకులో... కునుకు చెదిరినదీ
నడకలో... నడుమునడిగిన బరువిదీ
బిగుతుతో ..సొగసు రగిలినదీ
చలువ నీడవని తగిన తోడువని
ఒడికి చేరిన అల్లరిని 

బిడియమా... అవును సహజము కదా 
కుదురుకో... ఉడుకు తెలియదు కదా
తమకమా.. తమకు తెలుసును కదా
అణుచుకొ ..తెగని తగువు కదా
చినుకులా.. ఎదను తడిమిన గొడవిది
వరదలా ..ఎదిగి తడిమినదీ 
పిలుపుల.. మెలిక తిరిగిన కథకళి
తనువులో తళుకు తెలిసినదీ
అదురుతున్న తడి పెదవి అలజడికి నిదుర లేవని కలలన్ని




అయ్యప్ప శరణమయ్యా పాట సాహిత్యం

 
చిత్రం: నవ్వుతూ బ్రతకాలిరా
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహితం: సిరివెన్నెల
గానం: యస్.పి.బాలు

అయ్యప్ప శరణమయ్యా
ఈల కొట్టి తోలవయ్య
కొత్త రధం కదెలనయ్యా
వెనకడుగే వెయ్యదయ్యా
చీకటని చిక్కులని ఆగకురా భాయి
సుడిగాలులతో వానలతో చెయ్యి లడాయి
కొండలని కోనలని చూడకురా భాయి
అడుగేయనిదే తీరమే నీకు ఎదురు రాదోయి

దీవేనలిచ్చే ఆ దేవుడికైనా కోవ్వెల కట్టి దీపమెట్టాలి
అన్నము పెట్టే యజమానికి మనం కండలతొటి కంచె కట్టాలి
పనినిచ్చి మన బ్రతుకులు నడిపించే వాడు
తన చక్రముని చేతికిచ్చి తిప్పమన్నాడు
చీడలని చేరకుండ చేట్టున్నవాడు 
ఆ నీడని నీకున్నదిరా చల్లని గూడు

చినుకు పడందే నువ్వు దున్నే చేలొ తనకు తనే పైరు వస్తుందా
కునుకు వీడందే కలలన్ని నిజం చేసేటందుకు వీలు వింటుందా
చెమట చిందే శ్రమను నమ్మి బ్రతుకు బండిని తొయ్యి
అలుపు అనే మాట అనక అడుగులు వెయ్యి
ముందుకెళ్ళే దారులన్ని తెలుసుకోరా భాయి
నీవెనకే నలుగురిని తీసుకెళ్ళాలి



ధిన్ ధిన్ తార.. పాట సాహిత్యం

 
చిత్రం: నవ్వుతూ బ్రతకాలిరా (2001)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహితం: సిరివెన్నెల
గానం: దేవి శ్రీ ప్రసాద్, మురళి, సుమంగళి

ధిన్ ధిన్ తార..ధిన్ తార..ధిన్ ధిన్ తార..ధిన్ ధిన్ ధిన్నా
అంగరంగ వైభోగంగా పెళ్ళి చేద్దాం రారండి
నిండు పందిరి వేసుందండి నేల పీట ఆయిందండి
బుగ్గ చుక్కతో పెళ్ళికూతురు సిగ్గు మొగ్గ ఆయింది
పక్కవాడితో లగ్గమైతే ఆ మొగ్గ విరియునండి
కొంగుముళ్ళతో పగ్గమెయ్యగా పిల్ల ఎదురయింది
అరె కుదురులేని ఈ కుర్రవాడికి తిక్క కుదురుతుంది
ధిన్ ధిన్ తార..ధిన్ తార..ధిన్ ధిన్ తార..ధిన్ ధిన్ ధిన్నా

పాలరాతి మేడ కరిగి..నేల మీద కాళ్ళే కడిగి
పేదపెద్దలు అను తేడాలను చెరపాలి

కోటలోని ఆ యువరాణి..తోటరాముడితో జతగూడి
ప్రేమరాజ్యమును కలకాలం పాలించాలి

కలిమికి చెలిమికి నడుమున నిలిచిన ఇనుప తెరలు కరుగుతూ ఉంటే
కని విని యెరుగని జత ఇదని మన మనసు పాడుతుందే

మనువుతో ముడిపడి విరిసిన మనసులు ఒకరికొకరు అనిపిస్తుంటే
తళతళ వెలుగుల తడిసిన కనులకు సిరులు దొరికినట్లే

ముందుజన్మలో ఋణమంతా తీర్చుకోను కలిసిందంట
బ్రహ్మరాతలకు అర్ధం చెప్పే ఈ జంట
అ:
ముందు ఇద్దరుంటారంట..కలిసి ఒక్కటవుతారంట
లెక్క చూస్తే పైఏటికి మూడవుతారంట
ఆ:
మసకలు, ముసుగులు గుసగుస గోదవులు
ఉరికి ఉరికి తలబడుతుంటే
పరులకు తెలియని పడుచుతనపు కధ వదను తేలుతుందే
అ:
జరిగిన తగువుకు బిడియము భయపడి పరువు విడిచి పరుగేడుతుంటే
తికమక పడి కరిగే సమయము తెల్లవారుతుందే

Palli Balakrishna Monday, September 25, 2017
Gulabi (1995) Telugu Songs Lyrics Album Cover

Gulabi (1995) Telugu Songs Lyrics

MOVIE DETAILS
Movie : Gulabi (1995)
Banner : Varma Creations / Amitabh Bachchan Corporation (ABCL)
Music : Shashi Preetam
Director : Krishna Vamsi
Producer : Ram Gopal Varma
Actors : J. D. Chakravarthy, Brahmaji
Actresses : Maheswari
Supporting Cast : Chandra Mohan, Banerjee, Chalamaiah, Jeeva
Release Date : 03 November 1995
MOVIE HIGHLIGHTS

Gulabi (1995) marked the sensational directorial debut of creative genius Krishna Vamsi, becoming a defining cult musical thriller in Telugu cinema.

• The film deals boldly with the gritty, real-world issue of human trafficking, packaged with intense romance and suspense.

• Debutant composer Shashi Preetam delivered an immortal soundtrack blending fresh electronic synth rhythms and soulful melodies.

• Renowned singer Sunitha made her iconic playback singing debut at the age of 17 with the timeless romantic masterpiece "Ee Velalo Neevu".

• The rebellious youth track "Class Room Lo", sung by Hariharan and penned by Sirivennela Seetharama Sastry, became an instant college youth anthem.

Beat In My Heart Song Lyrics in Telugu – Gulabi (1995)

'Beat In My Heart (Meghalalo Thelipommannadhi)' song from Gulabi (1995) movie is composed by Shashi Preetam, written by Sirivennela Seetharama Sastry, and sung by Mano and Gayatri.

SONG INFORMATION
Movie : Gulabi (1995)
Singers : Mano, Gayatri
మేఘాలలో తేలిపొమ్మన్నది తుఫానులా రేగిపొమ్మన్నది అమ్మాయితో సాగుతూ చిలిపి మది beat in my heart ఎందుకింత కొట్టుకుంది heat in my thought వెంటపడి చుట్టుకుంది oh my God ఏమిటింత కొత్తగున్నది హల్లో పిల్ల అంటూ ఆకతాయి ఆనందాలు ఆలాపిస్తూ వుంటే స్వాగతాల సంగీతాలు ఆడగా నెమలి తీరుగా మనసు ఝల్ ఝల్ ఝల్లుమని ఆకాశాన్నే హద్దు పావురాయి పాపాయికి ఆగే మాటే వద్దు అందమైన అల్లరి మారదా వరద హోరుగా వయసు ఝల్ ఝల్ ఝల్లుమని ఓం నమః వచ్చి పడు ఊహలకు ఓం నమః కళ్ళు వీడు ఆశలకు ఓం నమః ఇష్టమైన అలజడికీ మెచ్చినట్టే వుంది రెచ్చిపోయి పిచ్చి స్పీడు వద్దంటున్నా విందే చెంగుమంటూ చిందే ఈడు గువ్వలా రివ్వు రివ్వున యవ్వనం ఎటు పోతుంది కట్టలేక ఈడు నన్ను మెచ్చుకుంది నేడు పందెం వేస్తా చూడు పట్టలేరు నన్నెవ్వడు అంతగా బెదురు ఎందుకు మనకు ఎదురింకేముంది నీ తరహా కొంప ముంచేటట్టే వుంది నా సలహా ఆలపిస్తే safety వుంది ఏంటి మహా అంత జోరు కాస్త నెమ్మది

Ee Velalo Neevu Song Lyrics in Telugu – Gulabi (1995)

'Ee Velalo Neevu' song from Gulabi (1995) movie is composed by Shashi Preetam, written by Sirivennela Seetharama Sastry, and sung by Sunitha.

SONG INFORMATION
Movie : Gulabi (1995)
Singers : Sunitha
ఈ వేళలో నీవు ఏం చేస్తు ఉంటావో అనుకుంటూ ఉంటాను ప్రతి నిమిషమూ నేను నా గుండె ఏనాడో చేజారిపోయింది నీ నీడగా మారి నా వైపు రానంది దూరాన ఉంటూనే ఏ మాయ చేశావో ఈ వేళలో నీవు ఏం చేస్తు ఉంటావో అనుకుంటూ ఉంటాను ప్రతి నిమిషమూ నేను నడిరేయిలో నీవు.. నిదురైన రానీవు.. గడిపేదెలా కాలమూ .. గడిపేదెలా కాలమూ .. పగలైన కాసేపు ... పని చేసుకోనీవు... నీ మీదనే ధ్యానము .. నీ మీదనే ధ్యానము .. ఏ వైపు చూస్తున్నా ... నీ రూపే తోచింది... నువు కాక వేరేదీ .. కనిపించనంటోంది... ఈ ఇంద్రజాలాన్ని .. నీవేనా చేసింది... నీ పేరులో ఏదో ... ప్రియమైన కైపుంది.. నీ మాట వింటూనే .. ఏం తోచనీకుంది.. నీ మీద ఆశేదో ... నను నిలవనీకుంది.. మతి పోయి నేనుంటే... నువు నవ్వుకుంటావు.. ఈ వేళలో నీవు ఏం చేస్తు ఉంటావో అనుకుంటూ ఉంటాను ప్రతి నిమిషమూ నేను

Class Room Lo Song Lyrics in Telugu – Gulabi (1995)

'Class Room Lo' song from Gulabi (1995) movie is composed by Shashi Preetam, written by Sirivennela Seetharama Sastry, and sung by Hariharan.

SONG INFORMATION
Movie : Gulabi (1995)
Singers : Hariharan
క్లాసు రూములో తపస్సు చేయుట వేష్టు రా గురూ... ఆహా బయట వున్నది ప్రపంచమన్నది చూడరా గురూ... ఆహా పాఠాలతో పట్టాలతో టాటాలు బిర్లాలు కారెవ్వరు చేయి జారితే ఇలాంటి రోజులు రావు ఎన్నడూ... ఆహా అందుకే నువు ప్రతీ క్షణాన్ని అందుకో గురూ... ఆహా సా నిసా నీ దపా సా నిసా నీ దపా షీషోరులోన నిన్నొక మిస్ తెగ వేసేసిందిర ఫ్రీ షోష్స్ షాక్ అయిపోయా ప్రామిస్ అసలా షోకేందిర జస్ట్ టూ పీస్ She is like a venus so chance ఇస్తేను how nice Wish me success...Yup... Yup... మై డియర్ జూనియర్ వై ఫియర్ లే బ్రదర్ Oh shameless simply useless mister drop all this rubbish నీ manliness కో Litmus test రా silly full of bullshit Life is so precious stop your foolishness క్రేజి... క్రేజి... క్రేజి పనిసస మగసస పనిస గరిరిస పనిసస మగసస పనిస గరిరిస సా నిసా నీ దపా సా నిసా నీ దపా సినిమాలలో రీసర్చ్ చెయ్ Atleast character అవుతావురోయ్ సర్కస్ ప్రాక్టిస్ చెయరోయ్ హీరోగా పనికొస్తావోయ్ హీరో... హీరో... హీరో సా నిసా నీ దపా సా నిసా నీ దపా ముప్పూటలా గావ్ కేకలెయ్ ఫేమస్ పాప్ సింగర్ వి కావచ్చురోయ్ రాత్రంతా టీ తాగి తెగచదివేసేమవుతావురోయ్ జీరో... జీరో... జీరో ఆ ఆ ఆ ఆ ఆ ఆ క్లాసు రూములో తపస్సు చేయుట వేస్ట్ రా గురూ... ఆహా బయట వున్నది ప్రపంచమన్నది చూడరా గురూ... ఆహా పాఠాలతో పట్టాలతో టాటాలు బిర్లాలు కారెవ్వరూ చేయి జారితే ఇలాంటి రోజులు రావు ఎన్నడూ... ఆహా అందుకే నువు ప్రతీ క్షణాన్ని అందుకో గురు... ఆహా కాలేజిలో మహరాజులు ఈ గేటు దాటాక ప్రజలౌదురూ క్లాసు రూములో తపస్సు చెయ్యుట వేస్ట్ రా గురూ బయట వున్నది ప్రపంచమన్నది చూడరా గురూ ఆ ఆ ఆ ఆ ఆ ఆ

Dream Girl Song Lyrics in Telugu – Gulabi (1995)

'Dream Girl' song from Gulabi (1995) movie is composed by Shashi Preetam, written by Sirivennela Seetharama Sastry, and sung by Chakri and Urmila.

SONG INFORMATION
Movie : Gulabi (1995)
Singers : Chakri, Urmila
మాధురీని మరిపించె సుస్మితాను ఓడించె అందమైన అమ్మయిరోయ్ రమ్య కృష్ణ రూపాన్ని చిత్రలోని రాగాన్ని కలుపుకున్న పాపాయి రోయ్ ఎవ్వరు రా ఆ చిన్నది.. ఎక్కడ రా దాగున్నది.. ఎప్పుడు రా.. ఎటు నుంచి దిగుతుంది dream girl యదలో ఈల వేసే nightingale dream girl మెడలో మాల వేసే darling doll లా..లా..లా..ల..ల..ఆహా..ఆహ.హా.హ.హా.. hello honey welcome అని అంటూ నీ వెంట ఉన్నానని కల్లోన నువు లేవని గిల్లేసి చూపించని వెంటాడినా వేధించినా నీ చెంత చేరాలని నమ్మలి నా మాటని తగ్గించు అల్లర్లని dream girl గుండెల్లో మోగే Temple bell dream girl దిగి రా నీలి నింగి twinkle star ఆటడినా మాటాడినా ఆలోచనంత తానేనని చెప్పేది ఎల్లాగని చేరేది యే దారిని యెటు పోయినా ఎం చేసినా నా నీడలాగ అడుగడుగుని చూస్తున్న ఆ కళ్ళని చూసేది యే నాడనీ dream girl కొంగు చాటు గులాబి ముళ్ళు నాటు honeybee ఎక్కడుందొ ఆ baby కొంటె ఊసులడింది heartbeat పెంచింది ఎమిటంట దాని hobby What is this వంకయ్ పుల్స్ no address miss universe mental case అంతెలేర బాసు may God Bless u dream girl యదలో ఈల వేసే nightingale dream girl దిగి రా నీలి నింగి twinkle star dream girl నిన్నే తలచుకొంటే నిద్దర nill dream girl మనసే తడిసిపొయే waterfall dream girl త్వరగా చేరుకోవే my darling dream girl ఇంకా ఎంతకాలం ఈ waiting hey my dream girl

Ee Rojaithey Chusanu Song Lyrics in Telugu – Gulabi (1995)

'Ee Rojaithey Chusanu' song from Gulabi (1995) movie is composed, penned by Sirivennela Seetharama Sastry, and sung by Shashi Preetam.

SONG INFORMATION
Movie : Gulabi (1995)
Singers : Shashi Preetam
ఏ రోజైతే చూసానో నిన్ను ఆ రోజే నువ్వైపోయా నేను కాలం కాదన్నా ఏ దూరం అడ్డున్నా నీ ఊపిరినై నే జీవిస్తున్నాను నీ స్పర్శే ఈ వీచే గాలుల్లో నీ రూపే నా వేచే గుండెల్లో నిన్నటి నీ స్వప్నం నన్ను నడిపిస్తూ ఉంటే ఆ నీ నీడై వస్తాను ఎటువైపున్నా నీ కష్టంలో నేను ఉన్నాను కరిగే నీ కన్నీరవుతా నేను చెంపల్లో కారి నీ గుండెల్లో చేరి నీ ఏకాంతంలో ఓదార్పౌతాను కాలం ఏదో గాయం చేసింది నిన్నే మాయం చేసానంటోంది లోకం నమ్మి అయ్యో అంటోంది శోకం కమ్మి జోకొడతానంది గాయం కోస్తున్నా నే జీవించే ఉన్నా ఈ జీవం నీవని సాక్షం ఇస్తున్నా నీతో గడిపిన ఆ నిమిషాలన్ని నాలో మోగే గుండెల సవ్వడులే అవి చెరిగాయంటే నే నమ్మేదెట్టాగా నువ్వే లేకుంటే నేనంటూ ఉండనుగా నీ కష్టంలో నేనూ ఉన్నాను కరిగే నీ కన్నీరవుతా నేను చెంపల్లో కారి నీ గుండెల్లో చేరి నీ ఏకాంతంలో ఓదార్పౌతాను ఏ రోజైతే చూసానో నిన్ను ఆ రోజే నువ్వైపోయా నేను కాలం కాదన్నా ఏ దూరం అడ్డున్నా నీ ఊపిరినై నే జీవిస్తున్నాను

Palli Balakrishna Wednesday, August 16, 2017


చిత్రం: W/o వి. వరప్రసాద్ (1998)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
సాహిత్యం: సిరివెన్నెల (All Songs)
గానం: యస్.పి.బాలు, రేణు కణ్ణన్, సుజాత, శ్రీలేఖ పార్థసారథి
నటీనటులు: వినీత్ , జె. డి.చక్రవర్తి , అవని, ఇషా
దర్శకత్వం: వంశీ
నిర్మాత: రాంగోపాల్ వర్మ
విడుదల తేది: 1998

ఆ.... నా జత నీవే ప్రియా...

ఎక్కడకి నీ పరుగు ఎందుకనీ ఈ ఉరుకు
నీ కోసం నేనుండగా మరి ముందుకు పోతావేం అలా
అలసట అంత తీరగా నా ఒడిలో లాలిస్తా పద
ఆగనిదీ నా అడుగు ఎందుకనో నా ఎదనడుగు
ఏమో ఎక్కడ ఉన్నదో నా కలలో కదిలే చిన్నదీ
నీలో మాత్రం లేదులే నేనన్వేషించే ఆ చెలీ

ఆ.... నా జత నీవే ప్రియా...

ఎక్కడకి నీ పరుగు ఎందుకనీ ఈ ఉరుకు
నీ కోసం నేనుండగా మరి ముందుకు పోతావేం అలా
అలసట అంత తీరగా నా ఒడిలో లాలిస్తా పద
ఆగనిదీ నా అడుగు ఎందుకనో నా ఎదనడుగు
ఏమో ఎక్కడ ఉన్నదో నా కలలో కదిలే చిన్నదీ
నీలో మాత్రం లేదులే నేనన్వేషించే ఆ చెలీ


ఆ....నా జత నీవే ప్రియా...

నే వెతికే కలల చెలీ ఇక్కడనే నా మజిలీ
జాడను చూపినదే మరీ నువు పాడిన తీయని జావళి
వెలిగించావే కోమలీ నా చూపులలో దీపావళీ
గుండెల్లో నీ మురళీ వెళ్ళదులే నన్నొదిలి
తెరిచే ఉంచా వాకిలీ దయచేయాలని నా జాబిలీ
ముగ్గులు వేసిన ముంగిలీ అందిస్తున్నది ప్రేమాంజలీ
ఈ.. రామచిలక సాక్ష్యం నీ.. ప్రేమ నాకే సొంతం
చిలిపి చెలిమి రాజ్యం మనమింక ఏలుకుందాం
కాలం చేరని ఈ వనం విరహాలకు వాడదు ఏక్షణం
కల నిజమై నిలిచినదీ మన జతనే పిలిచినదీ
ఆమని కోకిల తీయగా మన ప్రేమకి దీవెనలీయగా


********  *********  *********


చిత్రం: W/o వి. వరప్రసాద్ (1998)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
సాహిత్యం: సిరివెన్నెల
గానం: చిత్ర, యస్.పి.బాలు

అందం ఏమిటంటే అర్థం చెప్పమంటే
సందేహం ఎందుకింకా నువ్వేనంటా
నాట్యం ఏమిటంటే సాక్ష్యం చూపమంటె
నీ ప్రాయం ఆడుతుంటే చూడాలంటా
ఔనా చెప్పమంటే నువ్వేమో నవ్వుతుంటె
వెన్నెల్లో ఈదినట్టూ వుంటుందంట
అందం ఏమిటంటే అర్థం చెప్పమంటే
సందేహం ఎందుకింకా నువ్వేనంటా

స్వర్గమంటూ ఉంటుందని
చెప్పుకుంటూ ఉంటే వినీ
ఒట్టిదనుకున్నా ఇపుడొప్పుకుంటున్నా
నిను చూస్తుంటే నిజమేననీ
వయ్యారాలే వర్ణించుంటే ఇష్టంగా ఉండగా
కావాలంటే ఏమిమ్మన్నా ఇచ్చేసే తీరుగా
పాపం పైకి మాత్రం జాలేస్తు ఊరుకుండు
అంటూనే ఆశ చెప్పీ వింటూ ఉంది
అందం ఏమిటంటే అర్థం చెప్పమంటే
సందేహం ఎందుకింకా నువ్వేనంటా

చిన్నబోతావేమోనని
చెంతకొచ్చా పోన్లే అనీ
కన్నె సిగ్గంతా తెగ కందిపోతున్నా
సరదా తీర్చి పోదామనీ
ఐనా ఇంకా ఆసక్తుంటే కష్టంగా ఉండదా
అంతో ఇంతో ఔనంటున్నా అంతంటూ ఉండదా
పాపం గాలి కుట్టీ ఊ కొట్టీ ఊరిస్తుంటే
ఉప్పెనలా ఊపిరొచ్చి ఊపేసింది

అందం ఏమిటంటే అర్థం చెప్పమంటే
సందేహం ఎందుకింకా నువ్వేనంటా
నాట్యం ఏమిటంటే సాక్ష్యం చూపమంటె
నీ ప్రాయం ఆడుతుంటే చూడాలంటా
ఔనా చెప్పమంటే నువ్వేమో నవ్వుతుంటె
వెన్నెల్లో ఈదినట్టూ వుంటుందంట


Palli Balakrishna Monday, August 14, 2017



చిత్రం: అమృత (2౦౦2)
సంగీతం: ఏ.ఆర్.రెహమాన్
నటీనటులు: మాధవన్ , సిమ్రాన్, కీర్తన పార్థిబన్, జె. డి.చక్రవర్తి, నందిత దాస్
దర్శకత్వం: మణిరత్నం
నిర్మాత: జి. శ్రీనివాసన్
విడుదల తేది: 14.02.2002



చిత్రం: అమృత (2౦౦2)
సంగీతం: ఏ.ఆర్.రెహమాన్
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, బలరాం

పల్లవి:
కడసారిది వీడ్కోలు కన్నీటితో మా చేవ్రాలు
అడవి చెట్లను పావురాళ్ళను కలలోనైనా కనగలమా
ఆశలు సమాధి చేస్తూ బంధాలను బలి చేస్తూ
ప్రాణాలే విడిచి సాగే పయనమిది ఓ...ఓ..

కడసారిది వీడ్కోలు కన్నీటితో మా చేవ్రాలు
అడవి చెట్లను పావురాళ్ళను కలలోనైనా కనగలమా
ఆశలు సమాధి చేస్తూ బంధాలను బలి చేస్తూ
ప్రాణాలే విడిచి సాగే పయనమిది ఓ...ఓ..

చరణం: 1
తల్లి నేలని పల్లె సీమని విడ తరమా తరమా
తల్లి నేలని పల్లె సీమని విడతరమా తరమా
ఉన్న ఊరిలో ఉన్న సౌఖ్యము స్వర్గమివ్వగలదా గలదా
జననానికి ఇది మా దేశం మరణానికి మరి ఏ దేశం
జననానికి ఇది మా దేశం మరణానికి మరి ఏ దేశం
కదిలే నదులారా కలలే అలలౌనా
జననీ... జన్మ భూమి స్వర్గాదపి గరీయసి
కన్నీటి తెరలలో తల్లి నేలని
కడసారి పేగు కనలేక కదిలిపోయెనో

కడసారిది వీడ్కోలు కన్నీటితో మా చేవ్రాలు
అడవి చెట్లను పావురాళ్ళను కలలోనైనా కనగలమా
ఆశలు సమాధి చేస్తూ బంధాలను బలి చేస్తూ
ప్రాణాలే విడిచి సాగే పయనమిది ఓ...ఓ..

చరణం: 2
పాడే జోలలు పాపల ఏడ్పుల పాలైపోతే
పాడే జోలలు పాపల ఏడ్పుల పాలైపోతే
ఉదయ సూర్యుడే విలయ ధూమపు తెరలో దాగే
పూల డోల నిన్నటి నిదర ముళ్ళు కదా ఇప్పటి నడక
ఉసురు మిగిలుంటే మరలా దరిచేరవా
మనసే.. మిగిలుంటే ఒడిలో తలదాచవా
తలపే అల్పం తపనే అధికం
బరువెక్కిన హృదయం మోసుకునే పోతున్నా...

కడసారిది వీడ్కోలు కన్నీటితో మా చేవ్రాలు
అడవి చెట్లను పావురాళ్ళను కలలోనైనా కనగలమా
ఆశలు సమాధి చేస్తూ బంధాలను బలి చేస్తూ
ప్రాణాలే విడిచి సాగే పయనమిది ఓ...ఓ..





చిత్రం: అమృత (2౦౦2)
సంగీతం: ఏ.ఆర్.రెహమాన్
సాహిత్యం: వేటూరి
గానం: ఏ.ఆర్.రెహమాన్

పల్లవి:
మరు మల్లెల్లో ఈ జగమంతా విరియగా
ప్రతి ఉదయంలో శాంతి కోసమే తపనగా
పారాణేదో భూమికి మెరుపుగా
మందారాలే మత్తును వదలగా
కనులా తడి తుడిచే ఒడిలో పసి పాపాయి
చిలికే చిరు నగవే చీకటి తల్లికి వేకువా

మరు మల్లెల్లో ఈ జగమంతా విరియగా
ప్రతి ఉదయంలో శాంతి కోసమే తపనగా
పారాణేదో భూమికి మెరుపుగా
మందారాలే మత్తును వదలగా
కనులా తడి తుడిచే ఒడిలో పసి పాపాయి
చిలికే చిరు నగవే చీకటి తల్లికి వేకువా

చరణం: 1
గాలి పాటలా సడి వాన జావళీ
అది మౌనంలా దూరం అవునా
వేళ మాటలే వివరించలేనిది
తడి కన్నుల్ల అర్ధం అవునా

మరు మల్లెల్లో ఈ జగమంతా విరియగా -  విరియగా
ప్రతి ఉదయంలో శాంతి కోసమే తపనగా -  తపనగా
పారాణేదో భూమికి మెరుపుగా
మందారాలే మత్తును వదలగా

చరణం: 2
లేత పాపలా చిరు నవ్వు తోటకే
దిగి వస్తావా సిరుల వెన్నెలా
వీర భూమిలో సమరాలు మారితే
వినిపించే నా స్వరమే కోయిలా

మరు మల్లెల్లో ఈ జగమంతా విరియగా
ప్రతి ఉదయంలో శాంతి కోసమే తపనగా
పారాణేదో భూమికి మెరుపుగా
మందారాలే మత్తును వదలగా

మరు మల్లెల్లో ఈ జగమంతా విరియగా -  విరియగా
ప్రతి ఉదయంలో శాంతి కోసమే తపనగా -  తపనగా





చిత్రం: అమృత (2౦౦2)
సంగీతం: ఏ.ఆర్.రెహమాన్
సాహిత్యం: వేటూరి
గానం: హరిహరన్

పల్లవి:
ఎంత చక్కిల్ గిల్ గిల్ కళ్ళు జిల్ జిల్ జిల్ జిల్
చెక్కిళ్ళ ముద్దు పెడితే నీ చిన్నారి ముద్దు పెడితే
ఎంత చక్కిల్ గిల్ గిల్ కళ్ళు జిల్ జిల్ జిల్ జిల్
చెక్కిళ్ళ ముద్దు పెడితే నీ చిన్నారి ముద్దు పెడితే
ఏ దేవి వరము నీవో చిరు నీడలేల కనులా
ఏ దేవి వరము నీవో చిరు నీడలేల కనులా
ఆయువడిగినది నీ నీడే...
ఆయువడిగినది నీ నీడే
గగనం ముగియు దిశ నీవేలే
గాలి కెరటమై సోకినావే
ప్రాణ వాయువే అయ్యినావే మదిని ఊయలూగే

ఏ దేవి వరము నీవో చిరు నీడలేల కనులా
ఎంత చక్కిల్ గిల్ గిల్ కళ్ళు జిల్ జిల్ జిల్ జిల్
చెక్కిళ్ళ ముద్దు పెడితే నీ చిన్నారి ముద్దు పెడితే
ఎంత చక్కిల్ గిల్ గిల్ కళ్ళు జిల్ జిల్ జిల్ జిల్
చెక్కిళ్ళ ముద్దు పెడితే నీ చిన్నారి ముద్దు పెడితే

చరణం: 1
ఎదకు సొంతం లే  ఎదురు మాటవు లే
కలికి వెన్నెలలే కడుపు కోతవులే
స్వాతి వానని చిన్న పిడుగని
స్వాతి వానని చిన్న పిడుగని
ప్రాణమైనది పిదప కానిది
ప్రాణమైనది పిదప కానిది
మరణ జనన వలయం నీవే
ఏ దేవి వరము నీవో...

ఏ దేవి వరము నీవో చిరు నీడలేల కనులా
ఎంత చక్కిల్ గిల్ గిల్ కళ్ళు జిల్ జిల్ జిల్ జిల్
చెక్కిళ్ళ ముద్దు పెడితే నీ చిన్నారి ముద్దు పెడితే
ఎంత చక్కిల్ గిల్ గిల్ కళ్ళు జిల్ జిల్ జిల్ జిల్
చెక్కిళ్ళ ముద్దు పెడితే నీ చిన్నారి ముద్దు పెడితే

చరణం: 2
సిరుల దీపం నీవే  కరువు రూపం నీవే
సరస కావ్యం నీవే తగని వాక్యం నీవే
ఇంటి వెలుగని కంటి నీడని
ఇంటి వెలుగని కంటి నీడని
సొగసు చుక్కవో తెగిన రెక్కవో
సొగసు చుక్కవో తెగిన రెక్కవో
నేనెత్తి పెంచిన శోకంలా...

ఏ దేవి వరము నీవో చిరు నీడలేల కనులా
ఏ దేవి వరము నీవో చిరు నీడలేల కనులా
ఆయువడిగినది నీ నీడే...
ఆయువడిగినది నీ నీడే
గగనం ముగియు దిశ నీవేలే
గాలి కెరటమై సోకినావే
ప్రాణ వాయువే అయ్యినావే మదిని ఊయలూగే

ఏ దేవి వరము నీవో చిరు నీడలేల కనులా



Palli Balakrishna Saturday, August 5, 2017


చిత్రం: ప్రేమకువేళాయెరా (1999)
సంగీతం: యస్.వి. కృష్ణారెడ్డి
సాహిత్యం: చంద్రబోస్
గానం: శంకర్ మహదేవన్, హరిణి
నటీనటులు: జే. డి. చక్రవర్తి, సౌందర్య
దర్శకత్వం: యస్.వి. కృష్ణారెడ్డి
నిర్మాత: తరంగ సుబ్రహ్మణ్యం
విడుదల తేది: 06.08.1999

ఆఆఆఅ..ఆఆఆ.ఆ..ఆఆఅ..ఆఆఆ...
తళతళ తారకలాగా మెరుపుల మాలికలాగా
తళతళ తారకలాగా మెరుపుల మాలికలాగా
కరుణించ వచ్చావే సిరులెన్నో తెచ్చావే
కులుకా ఆఆఆ... పంచవన్నెల రామచిలుక
నిధిలాగ దొరికావే తళుకా తళుకా
వదిలేసి పోమాకే మొలకా మొలకా
పంచవన్నెల రామచిలుక..
పంచదారల ప్రేమచినుకా...అఆ...

మాణిక్య వీణవు నువ్వే మలిసంధ్య వేణువు నువ్వే
నామనసు మందిరాన మోగుతున్న
అందమైన అందము నువ్వే
ఆరాద్య దేవత నువ్వే గంధర్వ కాంతవు నువ్వే
స్వర్గాల దారిలోనా నీడనిచ్చు పాలరాతి మేడవు నువ్వే
నీగాలి సోకింది నాకొమ్మ ఊగింది
నీ ప్రేమ తాకింది నాజన్మ పొంగింది

పంచవన్నెల రామచిలుక
నిధిలాగా దొరికావే తళుకా తళుకా
వదిలేసి పోమాకే మొలకా మొలకా
పంచవన్నెల రామచిలుక..
పంచదారల ప్రేమచినుకా...అఆ...

నాతేనె విందువు నువ్వే నాలంకె బిందెవు నువ్వే
నాగుండె గంపలోనా ఒంపుకున్న అంతులేని సంపద నువ్వే
నాపొద్దు పొడుపువు నువ్వే నాభక్తి శ్రద్ధవు నువ్వే
చిననాడు దిద్దుకున్న ఒద్దికైన ఓనమాలు నువ్వే నువ్వే
నీ చూపు అందింది నాచెంప కందింది
నీ మెరుపు తెలిసింది నా వలపు కురిసింది

పంచవన్నెల రామచిలుక
నిధిలాగా దొరికావే తళుకా తళుకా
వదిలేసి పోమాకే మొలకా మొలకా

తళతళ తారకలాగా మెరుపుల మాలికలాగా
కరిణించ వచ్చావే సిరులెన్నో తెచ్చావే
కులుకా ఆఆఆ... పంచవన్నెల రామచిలుక
నిధిలాగ దొరికావే తళుకా తళుకా
వదిలేసి పోమాకే మొలకా మోలకా
పంచవన్నెల రామచిలుకా.ఆఅ..
ఓ పంచదారల ప్రేమచినుకా..ఆఆఆ...





Palli Balakrishna Tuesday, August 1, 2017



చిత్రం: నేను ప్రేమిస్తున్నాను (1997)
సంగీతం: సిర్పీ
నటీనటులు: జె.డి.చక్రవర్తి, రచన బెనర్జీ
దర్శకత్వం: ఈ. వి.వి.సత్యన్నారాయణ
నిర్మాత: ఆర్.బి.చౌదరి
విడుదల తేది: 06.06.1997



Songs List:



లూలి లూలి పాట సాహిత్యం

 
చిత్రం: నేను ప్రేమిస్తున్నాను (1997)
సంగీతం: సిర్పీ
సాహిత్యం: చంద్రబోస్
గానం: యస్.పి. బాలు, మనో

లూలి లూలి




అందరి ముందర పాట సాహిత్యం

 
చిత్రం: నేను ప్రేమిస్తున్నాను (1997)
సంగీతం: సిర్పీ
సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి 
గానం: యస్.పి. బాలు, కె.యస్.చిత్ర 

అందరి ముందర 



ప్రేమా దీవించుమా పాట సాహిత్యం

 
చిత్రం: నేను ప్రేమిస్తున్నాను (1997)
సంగీతం: సిర్పీ
సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి 
గానం: మనో 

ప్రేమా దీవించుమా 




ప్రేమతో నిను పాట సాహిత్యం

 
చిత్రం: నేను ప్రేమిస్తున్నాను (1997)
సంగీతం: సిర్పీ
సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి 
గానం: మనో,  కె.యస్.చిత్ర 

ప్రేమతో నిను 



ఓ కోవెల్లో దీపంలా పాట సాహిత్యం

 
చిత్రం: నేను ప్రేమిస్తున్నాను (1997)
సంగీతం: సిర్పీ
సాహిత్యం: సిరివెన్నెల
గానం: యస్.పి.బాలు, మనో

అరె అరే తొందరగా పాడరా బాబు 
అవతల సిగరెట్ సాంగా చూసే సాంగా అని 
ఆడియెన్స్ అంతా వెయిట్ చేస్తున్నారు
తొందరగా పాడు కమాన్ సింగ్

ఓ కోవెల్లో దీపంలా కావ్యంలో భావంలా 
తెలుగింటి కాంతరా తోలి సంధ్య కాంతిరా
నాయదలో ఊయలూగుతోందిరా ఊగుతోందిరా
కోవెల్లో దీపంలా తెలుగింటి కాంతరా తోలి సంధ్య కాంతిరా

బాగానే ఉందికాని ఇంతకి నువ్వు ప్రేమిస్తున్నట్టు ఆ అమ్మాయికి తెలుసా?
ఉహూఁ మరి ఆ అమ్మాయి నో అంటే ఏమి చేస్తావ్
దేవదాసునైపోతా 
నీకు మందు అలవాటు లేదుకదరా చేసుకుంటా తాగుతుంటా 
ఆ సీను తరువాత ముందు ఆ పిల్ల ఊరు పేరు చెప్పు

సౌందర్యం అమ్మడి ఊరు లావణ్యం ఆ చెలి పేరు 
కూర్చోని ఉంటే చూసే గుండెలు ఊగాలి
తను కదిలిందంటే సాగే కాలం ఆగాలి
ఆ నవ్వుకు నేనే దాసోహం ఏ పువ్వుకు లేదే ఆ సుకుమారం
ఓ కోవెల్లో దీపంలా తెలుగింటి కాంతరా తోలి సంధ్య కాంతిరా

ఆహా ఓహో ఏంటిరా మనోడు సూపర్ గా చెప్తున్నాడురా 
నువ్వుండవోయ్ అరే తొందరగా చెప్పరాబాబు ఆఁ

ఊహల్లో ఊర్వశులైనా ఊరించే మేనకలైనా
ఆ చిన్నారిని చూశారంటే చినబోరా
తన చెలికత్తెలుగా ఉంటే చాలని అనుకోరా
ఏ కలలో లేదే ఆ అందం తను కనిపిస్తేనే కళ్ళకు అర్ధం

ఓ కోవెల్లో దీపంలా కావ్యంలో భావంలా 
తెలుగింటి కాంతరా తోలి సంధ్య కాంతిరా
నాయదలో ఊయలూగుతోందిరా ఊగుతోందిరా
కోవెల్లో దీపంలా తెలుగింటి కాంతరా తోలి సంధ్య కాంతిరా
లల లాల లాల లా... లల లాల లాల లా
లల లాల లాల లా... లల లాల లాల లా




బేబీ బేబీ పాట సాహిత్యం

 
చిత్రం: నేను ప్రేమిస్తున్నాను (1997)
సంగీతం: సిర్పీ
సాహిత్యం: చంద్రబోస్ 
గానం: హరిహరన్,  కె.యస్.చిత్ర 

బేబీ బేబీ

Palli Balakrishna Monday, July 31, 2017


చిత్రం: ఎగిరే పావురమా (1997)
సంగీతం: యస్.వి. కృష్ణారెడ్డి
సాహిత్యం: వేటూరి
గానం: ఉన్నికృష్ణన్, సునీత
నటీనటులు: శ్రీకాంత్ మేకా, జె.డి. చక్రవర్తి, లైలా
దర్శకత్వం: యస్.వి. కృష్ణారెడ్డి
నిర్మాత: పి.ఉషారాణి
విడుదల తేది: 30.01.1997

గుండె గూటికి పండుగొచ్చింది
పండు వెన్నెల పంచుతుందీ
మబ్బుల్లో జాబిల్లీ ముంగిట్లో దిగుతుందీ
నా ఇంట్లో దీపం పెడుతుందీ

గుండె గూటికి పండుగొచ్చింది
పండు వెన్నెల పంచుతుందీ
మబ్బుల్లో జాబిల్లీ  ముంగిట్లో దిగుతుందీ
నా ఇంట్లో దీపం పెడుతుందీ

నేలనోదిలిన గాలి పరుగున ఊరంతా చుట్టాలి
వేళ తెలియక వేల పనులను వేగంగా చేయాలి
ఇంటి గడపకి మింటి మెరుపుల తోరణమే కట్టాలి
కొంటె కలలతో జంట చిలకకి  స్వాగతమే చెప్పాలి
ఎన్నెన్నో ఎన్నెన్నో చేసినా ఇంతేనా అనిపిస్తుంది
ఏ పని తోచక తికమక పెడుతుంది

గుండె గూటికి పండుగొచ్చింది
పండు వెన్నెల పంచుతుందీ
మబ్బుల్లో జాబిల్లీ ముంగిట్లో దిగుతుందీ
నా ఇంట్లో దీపం పెడుతుందీ

బావ మమతల భావ కవితలే  శుభ లేఖలు కావాలి
బ్రహ్మ కలిపినా జన్మ ముడులకు సుముహుర్తం రావాలి
మా ఏడు అడుగుల జోడు నడకలు  ఊరంతా చూడాలి
వేలు విడువని తోడూ ఇమ్మని  అక్షింతలు వేయాలి
ఇన్నాళ్ళూ ఇన్నాళ్ళు ఎదురు చూసే నా ఆశల రాజ్యంలో
రాణిని తీసుకు వచ్చే కళకళ కనపడగ

గుండె గూటికి పండుగొచ్చింది..
పండు వెన్నెల పంచుతుందీ
మబ్బుల్లో జాబిల్లీ ముంగిట్లో దిగుతుందీ
నా ఇంట్లో దీపం పెడుతుందీ

Palli Balakrishna Saturday, July 29, 2017




చిత్రం: బొంబాయి ప్రియుడు (1996)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
నటీనటులు: జె.డి.చక్రవర్తి, రంభ
దర్శకత్వం: కె.రాఘవేంద్రరావు
నిర్మాత: కె.కృష్ణమోహన్ రావు
విడుదల తేది: 27.09.1996



Songs List:



రాజ్ కపూర్ సినిమాలోని పాట సాహిత్యం

 
చిత్రం: బొంబాయి ప్రియుడు (1996)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
సాహిత్యం: చంద్రబోస్
గానం: యమ్.యమ్.కీరవాణి, చిత్ర 

రాజ్ కపూర్ సినిమాలోని 




బొంబాయి ప్రేమిక పాట సాహిత్యం

 
చిత్రం: బొంబాయి ప్రియుడు (1996)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, యమ్.యమ్. శ్రీలేఖ 


బొంబాయి ప్రేమిక 



బాలమురళి కృష్ణ పాట సాహిత్యం

 
చిత్రం: బొంబాయి ప్రియుడు
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
సాహిత్యం: చంద్రబోస్
గానం: యస్.పి.బాలు, చిత్ర

ఆ  ఆ
మగమదనిసా సగమదనిసా..ఆ
ఓహో హిందోళం బాగుంది పాడండి పాడండి
బాలమురళి కృష్ణ మాకు బాల్య మిత్రుడే
ఆశ భోస్లే అక్షరాల అత్త కూతురే
గులాం అలీ అంతటోడు మాకు ఆప్తుడే
ఘంటసాల ఉండెవాడు ఇంటి ముందరే
స్వఛ్చమైన సంగీతం
కచ్చితంగ మాసొంతం
రాగ జీవులం నాద బ్రహ్మలం
స్వరం పదం ఇహం తరం కాగ..ఆ
బాలమురళి కృష్ణమాకు బాల్య మిత్రుడే
ఆశ భోస్లే అక్షరాల అత్త కూతురే
గులాం అలీ అంతటోడు మాకు ఆప్తుడే
ఘంటసాల ఉండెవాడు ఇంటి ముందరే

తేనె పాట పాడితే మేను పులకరించదా
వీణ పాట పాడితే జాణ పరవశించదా
ఈల పాట పాడితే గాలి తాళమేయదా
జావలీలు పాడితే జాము తెల్లవారదా
భూపాళం పాడితే భూగోళం కూలదా
హిందోళం పాడితే అందోలన కలగదా
హొ హొ హొ హొ హొ హొ హొ హొ ఒ
కళ్యాణిలో పాడితే
కళ్యాణం జరగదా
శ్రీరాగం పాడితే సీమంతం తప్పదా
గునకరాళ్ళకేమి తెలుసు చిలక పలుకులూ
ఈ గార్దబాలకేమి తెలుసు గాంధర్వ గానాలూ ఆ
బాలమురళి కృష్ణమాకు బాల్య మిత్రుడే
ఆశ భోస్లే అక్షరాల అత్త కూతురే
గులాం అలీ అంతటోడు మాకు ఆప్తుడే
ఘంటసాల ఉండెవాడు ఇంటి ముందరే


సామగదామగ సామగదామగ సామగదామగసా
షడ్యమంలో పాడితే లోకం అంతా వూగదా
మధ్యమంలో పాడితే మత్తులోన మునగదా
గొంతు విప్పి పాడితే మంత్ర ముగ్దులవ్వరా
శ్రోతలంత బుద్దిగా వంతపాడకుందురా
ఎలుగెత్తి పాడగా
ఆకాశం అందదా
శ్రుతి పెంచి పాడగా
పాతాళం పొంగదా
హొ హొ హొ హొ హొ ఒ
అలవోకగా పాడగా
హరివిల్లే విరియదా
ఇల గొంతుతో పాడగా
చిరు జల్లే కురవదా
తేట తెలుగు పాటలమ్మ తోట పువ్వులం
మేము సందేహం అంటు లేని సంగీత సోదరులం ఆ
బాలమురళి కృష్ణమాకు బాల్య మిత్రుడే
ఆశ భోస్లే అక్షరాల అత్త కూతురే
గులాం అలీ అంతటోడు మాకు ఆప్తుడే
ఘంటసాల ఉండెవాడు ఇంటి ముందరే

సనిస దానీస గస నిదమగసా
తారినన్న తారినన్న తారినన్న నా
నీ పప్పులుడవోయ్ నీకు ముప్పుతప్పదోయ్
నీ పప్పులుడవోయ్ నీకు ముప్పుతప్పదోయ్
నినిస గస నిస గాస నిదమసా
నీ పప్పులుడవోయ్ నీకు ముప్పుతప్పదోయ్
నీ పప్పులుడవోయ్ నీకు ముప్పుతప్పదోయ్

సస్సస్సస్ససగస సస్సాగ ససగ సస్సాగ సనిదమగస గమదా మదనీ
గని సగ్గరి నిసరి దనిద మగదసా
నీదరి దనిస్సా గసనిదనీ మగగ సస నిదమగ దమ్



చేతిలోన చెయ్యేసి పాట సాహిత్యం

 
చిత్రం: బొంబాయి ప్రియుడు (1996)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, ప్రతిమా రావ్

చేతిలోన చెయ్యేసి చెప్పేయవ నను ఎన్నడూ విడిపోనని
ప్రేమ మీద ఒట్టేసి చెప్పేయవ నను వీడని జత నీవని
చేతిలోన చెయ్యేసి చెప్పేయవ నను ఎన్నడూ విడిపోనని
ప్రేమ మీద ఒట్టేసి చెప్పేయవ నను వీడని జత నీవని
ప్రతిక్షణం ప్రేమలో పరీక్షలే వచ్చిన
తలరాతకు తలవంచదు ప్రేమా ఆ... ఆ...
చేతిలోన చెయ్యేసి చెప్పేయవ నను ఎన్నడూ విడిపోనని

చరణం: 1
నీవు నేనులే మనస్సు ఒక్కటే
ఇద్దరైన ఈ మమకారంలో
నీవు నేననే పదాలు లేవులే
ఏకమైన ఈ ప్రియమంత్రంలో
నా గుండెలో కోకిలా నీ గొంతులో పాడగా
నా జన్మ ఓ పూవులా నీ కొమ్మలో పూయగా
కలా ఇలా కౌగిలై కనే కలే వెన్నెలై
చెయ్ కలిపిన చెలిమే అనురాగం ఆ... ఆ...
చేతిలోన చెయ్యేసి చెప్పేయవ నను ఎన్నడూ విడిపోనని
ప్రేమ మీద ఒట్టేసి చెప్పేయవ నను వీడని జత నీవని

చరణం: 2
నిన్ను తాకితే దేవతార్చన
పూజలందుకో పులకింతల్లో
వాలు చూపులే వరాల దీవెన
నన్ను దాచుకో కనుపాపల్లో
నా ప్రేమ గీతానికీ నీవేలే తోలి అక్షరం
నా ప్రేమ పుట్టింటికీ నీవేలే దీపాంకురం
రసానికో రాగమై రచించని కావ్యమై
చెయ్ కలిపిన చలవే అనుబంధం ఆ... ఆ...
చేతిలోన చెయ్యేసి చెప్పేయవ నను ఎన్నడూ విడిపోనని
ప్రేమ మీద ఒట్టేసి చెప్పేయవ నను వీడని జత నీవని




చందన చీరలు కట్టి పాట సాహిత్యం

 
చిత్రం: బొంబాయి ప్రియుడు
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
సాహిత్యం: చంద్రబోస్
గానం: యస్.పి.బాలు, అనురాధ శ్రీరాం 


చందన చీరలు కట్టి 



అహో ప్రియా... పాట సాహిత్యం

 
చిత్రం: బొంబాయి ప్రియుడు
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
సాహిత్యం: చంద్రబోస్
గానం: యస్.పి.బాలు, చిత్ర

అహో ప్రియా...
క్యా బాత్ బోల చిడియా మేరా దిల్ పిత్తర్ పిత్తర్ హోగయా
అయ్యయ్యో మిమ్మల్ని కాదండీ
నేను నేనేదో సరదాగ రాసుకున్న పాట
ప్రాక్టీస్ చేసుకుంటున్నా నంతే అంతే అంతేనండి
అహో ప్రియా... ఇంతకన్న తియ్యనైన పిలుపు వేరె వుందా
అహొ  అహొ అహో ప్రియా
అంత మంచి పిలుపు విన్న మనసు ఆగుతుందా
కౌగిళించవా ప్రియా అనే జవాబు తానివ్వదా
అహొ  అహొ అహో ప్రియా

చరణం: 1
రాగమంటు ఏమిటుంది అనురాగమను పాటకీ
తాళమంటు ఏమిటుంది పెనవేసుకొను ఆటకీ
మూగసైగ కన్న మంచి పలుకు ఏముందీ
ముద్దు కన్న పెద్దదైన  కవిత ఏముందీ
జంటకోరే గుండెలన్నీ ఒక్కటే భాషలో దగ్గరౌతున్నవీ
కౌగిళించవా ప్రియా ప్రియా అనేటి భావం అదీ
అహొ  అహొ అహో ప్రియా
ఇంతకన్న తియ్యనైన పిలుపు వేరె వుందా
అహొ  అహొ అహో ప్రియా
అంత మంచి పిలుపు విన్న మనసు ఆగుతుందా

చరణం: 2
తీయనైన స్నేహముందీ విరిసేటి పూలతీగలో
తీరిపోని దాహముంది తిరిగేటీ తేనే టీగలో
పూల బాల పరిమళాల కబురు పంపిందీ
తేనే టీగ చిలిపి పాట బదులు పలికింది
ఎన్ని సార్లో విన్నదైనా ఎందుకు ఎప్పుడూ కొత్తగా వుంటది
కౌగిళించవా ప్రియా ప్రియా అనేటి ఆ సంగతీ
అహొ  అహొ అహో ప్రియా
ఇంతకన్న తియ్యనైన పిలుపు వేరె వుందా
అహొ  అహొ అహో ప్రియా
అంత మంచి పిలుపు విన్న మనసు ఆగుతుందా
కౌగిళించవా ప్రియా అనే జవాబు తానివ్వదా
అహొ  అహొ అహో ప్రియా




గుప్పెడు గుండెను పాట సాహిత్యం

 
చిత్రం: బొంబాయి ప్రియుడు
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
సాహిత్యం: సిరివెన్నెల
గానం: యస్.పి.బాలు, చిత్ర

గుప్పెడు గుండెను తడిపే దాని చప్పుడు పేరు సంగీతం
కొప్పున మల్లెలు పెడితే అది చప్పున రమ్మని సంకేతం
అదిరిపడిన పెదవికేంటి అర్థం
అడుగుతోంది ఎదురు చూసి అధరకాగితం నీ మధుర సంతకం
అధరకాగితం.. మధుర సంతకం..
గుప్పెడు గుండెను తడిపే దాని చప్పుడు పేరు సంగీతం
కొప్పున మల్లెలు పెడితే అది చప్పున రమ్మని సంకేతం
అదిరిపడిన పెదవికేంటి అర్థం
అడుగుతోంది ఎదురు చూసి అధరకాగితం నీ మధుర సంతకం
అధరకాగితం.. మధుర సంతకం..

కిలకిలా కులికితే ఒంటి పేరే సుందరం కంటి ముందే నందనం
చిలకలా పలికితే ఉండిపోదా సంబరం గుండె కాదా మందిరం
జాబిల్లి జాబు రాసి నన్నే కోరే పరిచయం
పున్నాగపూలు పూసే వన్నె చిన్నె రసమయం
ఎందువల్లో ముందులేదీ కలవరం
అదిరిపడిన పెదవికేంటి అర్థం
అడుగుతోంది ఎదురు చూసి అధరకాగితం నీ మధుర సంతకం
అధరకాగితం.. మధుర సంతకం..
గుప్పెడు గుండెను తడిపే దాని చప్పుడు పేరు సంగీతం
కొప్పున మల్లెలు పెడితే అది చప్పున రమ్మని సంకేతం

వలపులా వాలితే కన్నెపైటే స్వాగతం కన్న కలలే అంకితం
చెలిమిలా చేరితే పల్లెసీమే పావురం పిల్లప్రేమే వాయనం
సింధూరపూల వాన నిన్నూ నన్ను తడపనీ
అందాల కోనలోన హాయి రేయి గడపనీ
కొత్తగున్నా మత్తుగుంది మన జగం
అదిరిపడిన పెదవికేంటి అర్థం
అడుగుతోంది ఎదురు చూసి అధరకాగితం నీ మధుర సంతకం
అధరకాగితం.. మధుర సంతకం..
గుప్పెడు గుండెను తడిపే దాని చప్పుడు పేరు సంగీతం
కొప్పున మల్లెలు పెడితే అది చప్పున రమ్మని సంకేతం
అదిరిపడిన పెదవికేంటి అర్థం
అడుగుతోంది ఎదురు చూసి అధరకాగితం నీ మధుర సంతకం

అధరకాగితం.. మధుర సంతకం..




ప్రణయమా మరు మల్లె పూల పాట సాహిత్యం

 
చిత్రం: బొంబాయి ప్రియుడు
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
సాహిత్యం: చంద్రబోస్
గానం: యమ్.యమ్.కీరవాణి, చిత్ర

ఆ ఆ ఆ ఆ.... ఆ ఆ ఆ ఆ....
ఆ ఆ ఆ ఆ  ఆ ఆ ఆ ఆ
ప్రణయమా మరు మల్లె పూల తోటలో ఘుమ ఘుమా
పరువమా సరసాల వీణ పాటలో సరిగమా
మోయలేని భావమా రాయలేని కావ్యమా నండూరి వారి గేయమా
ప్రణయమా మరు మల్లె పూల తోటలో ఘుమ ఘుమా
పరువమా సరసాల వీణ పాటలో సరిగమా
మోయలేని భావమా రాయలేని కావ్యమా నండూరి వారి గేయమా
ప్రణయమా మరు మల్లె పూల తోటలో ఘుమ ఘుమా
పరువమా సరసాల వీణ పాటలో సరిగమా

చరణం: 1
ఔననకా కాదనకా మనసే వినకా మురిపిస్తావేల ప్రాయమా న న నా
రేయనకా పగలనకా తపనల వెనకా తరిమిస్తావేల న్యాయమా లా ల లా
నిన్న లేని చోద్యమా నిన్ను ఆప సాధ్యామా
నిన్న లేని చోద్యమా నిన్ను ఆప సాధ్యామా
ఆ ఆ ఆ ఆ.... ఆ ఆ ఆ ఆ....
ఆ ఆ ఆ ఆ  ఆ ఆ ఆ ఆ
గుండె చాటు గానమా గొంతు దాటు మౌనమా ఎదలోని ఇంద్రజాలమా
ప్రణయమా మరు మల్లె పూల తోటలో ఘుమ ఘుమా
పరువమా సరసాల వీణ పాటలో సరిగమా
టింక్టటటన్ టింక్టటటర టింక్టటటర టంటటన్
టింక్టటటన్ టింక్టటటర టిరంటరంటర టరరన్

చరణం: 2
పూలనకా ముళ్ళనకా వలచిన క్షణమే విహరిస్తావేల హృదయమా
రేపనకా మాపనకా ఆ మరు క్షణమే విసిగిస్తావేల విరహమా లవ్లీ
ఇంత వింత సత్యమా ఎంతకైనా సిద్దమా
అంతులేని ఆత్రమా అందులోనే అందమా
ఆ ఆ ఆ ఆ.... ఆ ఆ ఆ ఆ....
ఆ ఆ ఆ ఆ  ఆ ఆ ఆ ఆ
కోటి కలల నేత్రమా కొంటె వలపు గోత్రమా శృంగార సుప్రభాతమా
ప్రణయమా మరు మల్లె పూల తోటలో ఘుమ ఘుమా
పరువమా సరసాల వీణ పాటలో సరిగమా
మోయలేని భావమా రాయలేని కావ్యమా నండూరి వారి గేయమా
ప్రణయమా మరు మల్లె పూల తోటలో ఘుమ ఘుమా
పరువమా సరసాల వీణ పాటలో సరిగమా

Palli Balakrishna Wednesday, July 19, 2017

Most Recent

Default