Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Guru (2017)




చిత్రం: గురు (2017)
సంగీతం: సంతోష్ నారాయణన్
నటీనటులు: వెంకటేష్ , రితిక సింగ్
దర్శకత్వం: సుధా కొంగర ప్రసాద్
నిర్మాత: ఎస్. శశికాంత్
విడుదల తేది: 31.03.2017



Songs List:



నే జర మొరటోడ్ని రా పాట సాహిత్యం

 
చిత్రం: గురు (2017)
సంగీతం: సంతోష్ నారాయణన్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: సిద్ధార్ద్ మహదేవన్

నే జర మొరటోడ్ని రా
నే సాలా నీ ఢర్ని రా
నా మాటే నికర్షయిన పిచ్చి నిజమేరా
నా బాటే ముక్కుసూటి తట్టుకోలేరా

వీరమొండి ఖరాఖండి నేనే గురు ఓ ఓ...
వీరమొండి ఖరాఖండి నేనే గురు ఓ ఓ...

ఉడుకుతున్న కోపం నాకు నేర్పినది నడక
ఆవేశం వీరావేశం దారి చూపే గనుక 
పిచ్చి లోకం తీరు నాకు వంటబట్టదింక
నా సిద్ధాంతంకై రాద్ధాంతాలే చేస్తా జంకు లేక

నగ్న సత్యం నేనే సిగ్గే లేదే
నీ సానుభూతేం నాకేం అక్కర్లేదే

వీరమొండి ఖరాఖండి నేనే గురు ఓ ఓ...
వీరమొండి ఖరాఖండి నేనే గురు ఓ ఓ...

కంకర్రాయి కూడా ఉంటుందేదో వైపు చదును
నా కేరక్టర్ నిండా లెక్కలేనంత పదును
అహంకారి తిక్కవైరి అనుకుంటారా
అవును మీ అర్ధం లేని స్వార్ధం కోసం నన్ను మార్చుకోను ఓ ఓ...

అడ్డదిడ్డం నాకే అడ్డే ఎవడు
రెడ్డా మాత్రం నాదే నెగ్గేదెవడు

వీరమొండి ఖరాఖండి నేనే గురు ఓ ఓ...
వీరమొండి ఖరాఖండి నేనే గురు ఓ ఓ...

నే జర మొరటోడ్ని రా
నే సాలా నీ ఢర్ని రా
నా మాటే నికర్షయిన పిచ్చి నిజమేరా
నా బాటే ముక్కుసూటి తట్టుకోలేరా

వీరమొండి ఖరాఖండి నేనే గురు ఓ ఓ...
వీరమొండి ఖరాఖండి నేనే గురు ఓ ఓ...





జింగిడి జింగిడి పాట సాహిత్యం

 
చిత్రం: గురు (2017)
సంగీతం: సంతోష్ నారాయణన్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: వెంకటేష్

తాగుబోతు మహారాజు లందరికి
పేరు పేరున నమస్కారం
దిస్ మేటెర్ ఈజ్ 
దీని అర్ధం ఏమిటంటే 
బాధలు మర్చిపోవటానికి
పీతల్లా తగుతున్నారుకాని
లోపల లివర్ దొబ్బుతుందని
ఆరోగ్యం షెడ్ కెళ్తుందని
జిందగి బార్బద్ అయిపోతుందని
అసలు తెలులుకోరే
జీవితమంటే సినిమా కాదురా అయ్యా
ప్రతీది సెన్సార్ బోర్డు చూసు కోవటానికి
ధూమ పానం మద్యపానం మా చెడ్డది రా అబ్బాయి
అని ఎంత చెప్పినా వినరే
మిలాంటోళ్లకోసమే యముడు పక్క సీటు రెడీ గా ఉంది
బయలుదేరండి బయలుదేరండి
ఆబ్బె మాకు తెలియదు మరి అంటారా
తాగండి ఊగండి మీ చావు మీరు చావండ్రా

క్వాటర్ బాటిల్ జానెడున్నా మేటర్ బోలెడుంది
మాటలు బొత్తిగా రానోడిచేత పాటలు పాడిస్తుంది
దీనిని మించిన స్వర్గమన్నది
స్వర్గములో కూడా ఉండదన్నది
చీర కట్టిన చిలక లాగ చిల్డ్ బీర్ పొంగి పొరలే
కన్ను కొట్టి పిలవగానే మనసు ఎగిరే...

జింగిడి జింగిడి జింగిడి జింగిడి జింగిడి జింగిడి జింగిడి (4)

హే పిరికోడికైనా ధైర్యమొస్తది
పేదోనికైనా పండగొస్తది
పిచ్చోడికైనా జ్ఞానమోస్తది
మందులోనే మందులోనే
దీనిని మించిన యోగముండదే
దీనికి తగ్గని రోగముండదే
లోకాన్ని మడిచి పెట్టుకున్నదే
ఇందులోనే ఇందులోనే

కూల్ కూల్ డ్యూడ్ ని కూటికి లేని వాడ్ని
చీర్స్ కొట్టి కలపదా మందు మహా రాణి
మూసిన షట్టర్ ఎత్తకపోతే పలికిస్తా పదనిస
మేరా నామ్ ఎనీ సెంటర్ సింగల్ హ్యాండ్ గణేశా

తళుకు బెళుకు తస్సాదియ్య కిక్కు కిక్కు కిక్కు
అప్పులేదు చేతులెత్తి మొక్కు మొక్కు మొక్కు
తళుకు బెళుకు తస్సాదియ్య కిక్కు కిక్కు కిక్కు
అప్పులేదు చేతులెత్తి మొక్కు మొక్కు మొక్కు


జింగిడి జింగిడి

జింగిడి జింగిడి జింగిడి జింగిడి జింగిడి జింగిడి జింగిడి (4)




గుండెలోతుల్లో పాట సాహిత్యం

 
చిత్రం: గురు (2017)
సంగీతం: సంతోష్ నారాయణన్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: ఢీ

గుండెలోతుల్లో 





ఏయ్ పటాకే పాట సాహిత్యం

 
చిత్రం: గురు (2017)
సంగీతం: సంతోష్ నారాయణన్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: అనంత్

ఐదు వందలు చూడగానే కళ్ళు మెరిసెరా
పెదవిమీద నవ్వు పూల వాన కురిసెరా
ఆడ పిల్ల లాగ ఉన్న లేడి పిల్లరా
ఆకాశాన ఎగురుతున్న చేపపిల్లరా
అసలే ఫైర్ బ్రాండు
రెచ్చగొడితే తీస్తది మీ బెండు
ఏయ్ పటాకే  పటాకే
చెయ్ పడిందో ఎటాకే
చల్ చలాకి పటాకే  పటాకే
చెయ్ పడిందో ఎటాకే

కళ్ళలోన కోటి కలల కోట తనదిరా
తనకి తానె తిరుగులేని మహారాణిరా
కత్తి అంచు మీద పరుగు నేర్చుకుందిరా
సీతాకోక కాదు సీమ్మిరపకాయ్
మన ప్యాంటు షర్ట్ వేసుకున్న చిరుత పులేరోయ్
చిరుత పులేరోయ్ చిరుత పులేరోయ్

ఏయ్ పటాకే  పటాకే
చెయ్ పడిందో ఎటాకే
చల్ చలాకి పటాకే  పటాకే
చెయ్ పడిందో ఎటాకే

ఆశలన్ని దండగుచ్చి వేసుకుంటది
మనసు మాట తప్ప ఏది వినను అంటది
జీవితాన్ని ఆటలాగ మార్చుకుంటది
నిప్పు కనిక లాగ దూకి నెగ్గుకొస్తది

ఏయ్ పటాకే  పటాకే
చెయ్ పడిందో ఎటాకే
చల్ చలాకి పటాకే  పటాకే
చెయ్ పడిందో ఎటాకే




ఉక్కునరం పాట సాహిత్యం

 
చిత్రం: గురు (2017)
సంగీతం: సంతోష్ నారాయణన్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: సిద్ధార్ద్ మహదేవన్

నీకేమి తక్కువ నిన్నే నువ్ గుర్తించవ
నీలోను ఉంది చూడు ఉక్కునరం
నువ్వేంటో చూపించవ
నిన్నే నువ్ గెలిపించవ
నీకే తెలియని నీలో సత్తా ఉక్కునరం

ఉక్కునరం (4)

అమ్మా నాన్న పుడుతూనే పెట్టారు పేరు
అందరిలాగ నీకోటి 
రంగుల్లోన వెలిగేలా ఆ పేరు నేడు 
సాధించాలి ఏదోటి
గమ్యం లేని గాలల్లే తిరిగావంటే ఏం లాభం
కలలకు ఊపిరి పోయాలి నీ ఉక్కు నరం
స్వాగతమంటు పిలిచింది నలుదిక్కుల్లో మైదానం
జెండా ఎగరెయ్యాలి నీలో ఉక్కునరం

ఉక్కునరం
నీలో దాగున్న సైన్యం
ఉక్కునరం
నిన్నే నడిపించు ధైర్యం
ఉక్కునరం
నీలో దాగున్న సైన్యం
ఉక్కునరం

ఉక్కునరం (4)

నీలో బలం ఇంతేనని హే గీతల్లోన ఒదగకు
ఇంకేముందో చూద్దామనే ఆలోచనని వదలకు
నొప్పి లేని పోరాటం ఏ గొప్ప ఇవ్వదులే
నిప్పుల నడకలు తప్పవులే ఓ...
గమ్యం చేరే దారుల్లో గాయాలన్ని మామూలే 
ప్రతి ఆట పొరాటమంటూ పట్టు బిగించు

ఉక్కునరం
నీలో దాగున్న సైన్యం
ఉక్కునరం
నిన్నే నడిపించు ధైర్యం
ఉక్కునరం
నీలో దాగున్న సైన్యం
ఉక్కునరం

ఇంతే చాలు అనే నీ ప్రయాణం
కోరే గమ్యాన్ని సాధించదే
ఇంకా ఇంకా అనే నీ ప్రయత్నం ఏనాడూ తలొంచదే

ఉక్కునరం (8)




ఓ సక్కనోడ పట్టు పిడికిలి పాట సాహిత్యం

 
చిత్రం: గురు (2017)
సంగీతం: సంతోష్ నారాయణన్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: ఢీ

ఓ సక్కనోడ పట్టు పిడికిలి
ధాడి చేసినావే ధడ ధడ
కస్సు బస్సు కయ్యాలు ఇంకెంత కాలం
తీపి ముద్దు యుద్దాలు వెయ్యాలి తాళం
విడిగా నలిగా ఒంటరి నేను
నీలో కొంచం నాకు చోటివ్వు

నిన్ను పట్టేసుకుంటా
జంట కట్టేసుకుంటా
నువ్వు నా సొంతం అంట బాబూ
నన్ను ఇచ్చేసుకుంటా
నిన్ను తెచ్చేసుకుంటా
తాళి కట్టించుకుంటా బాబూ...

చిర్రు బుర్రుగా చిచ్చు బుడ్డిలా
నువ్వంటే ఎడముఖమై తిరిగా నేను
ఎపుడో అలా తెలవారగా
నన్ను నేను నీ కలలో కనుగొన్నాను
నచ్చావు అందగాడా
తెచ్చావు నాలో తేడా
నువ్వు ఆడే ఆట లాగే ప్రేమించు నన్ను కూడా

నిన్ను పట్టేసుకుంటా
జంట కట్టేసుకుంటా
నువ్వు నా సొంతం అంట బాబూ
నన్ను ఇచ్చేసుకుంటా
నిన్ను తెచ్చేసుకుంటా
తాళి కట్టించుకుంటా బాబూ...

పగవాడివో అయినోడివో
తడిలేని పొడి చూపై తరిమేస్తావేం
మన మధ్యలో తెరలెందుకో
గడి దాటి చెలి ఒడిలో పడనంటావేం
చిరు నవ్వు చిలకరించు
చిన్నపాటి చనువు పెంచు
బుజ్జి బుజ్జి మనసు పాపం
కన్నెత్తి దాన్ని కనికరించు

నిన్ను పట్టేసుకుంటా
జంట కట్టేసుకుంటా
నువ్వు నా సొంతం అంట బాబూ
నన్ను ఇచ్చేసుకుంటా
నిన్ను తెచ్చేసుకుంటా
తాళి కట్టించుకుంటా బాబూ...
 
ఓ సక్కనోడ పట్టు పిడికిలి
ధాడి చేసినావే ధడ ధడ
కస్సు బస్సు కయ్యాలు ఇంకెంత కాలం
తీపి ముద్దు యుద్దాలు వెయ్యాలి తాళం
విడిగా నలిగా ఒంటరి నేను
నీలో కొంచం నాకు చోటివ్వు

నిన్ను పట్టేసుకుంటా
జంట కట్టేసుకుంటా
నువ్వు నా సొంతం అంట బాబూ
నన్ను ఇచ్చేసుకుంటా
నిన్ను తెచ్చేసుకుంటా
తాళి కట్టించుకుంటా బాబూ...

Most Recent

Default