Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Dammu (2012)చిత్రం: దమ్ము (2012)
సంగీతం: యమ్. యమ్. కీరవాణి
సాహిత్యం: చంద్రబోస్
గానం: గీతా మాధురి,  పృథ్వీచంద్ర , రేవంత్
నటీనటులు: జూనియర్ ఎన్ టీ ఆర్, కార్తీక, త్రిష
దర్శకత్వం: బోయపాటి శ్రీను
నిర్మాత: అలెగ్జాండర్ వల్లభ
విడుదల తేది: 27.04.2012

అంగ వంగ కేరళ కళింగ గౌడ కుంతల
విదర్భ మగధ సింహళ సాళ్వ గౌళ బర్బర
అవంతి చోళ లాట పాండ్య చేరి మద్ర
చక్రవర్తులెందరున్నా వీడు ఏకవీరుడు
ఏకైక క్షాత్రవీర్యుడు

కావ్య చిత్రలేఖనం సంగీత శిల్ప నాటకం
సాముద్రికం ఉచ్ఛాటనం ఆకర్షణం విద్వేషణం
అగ్ని జల వయస్తంభం బహుకళాప్రవీణుడు
ప్రవీణుడు నవీనుడు...

బాణ ఖడ్గ చేరి శక్తి యష్టి ప్రాశ గద పాశ
వజ్ర దండ కుంత శూల ధనుర్విద్యా ప్రపూర్ణుడు
ఘనఘనఘన ఘనుడు అగిణిత గుణ ఘనుడు
జనగణమున ఘనుడు...

రూలర్... రూలర్...

ప్రచండ చండ మార్తాండ తేజా...
రాజాధి రాజాధి రాజా
అఖండ మండలానంద భోజా...
రాజధి రాజాధి రాజా
చరితలో వెలుగుతున్న జ్యోతి నీవే
జగతిలో ఎగురుతున్న కీర్తి నీవే
పోరు నీది పేరు నీది...
భువన భవన కరుణ కిరణ ప్రభువు నువ్వులే

రూలర్... రూలర్...

ప్రచండ చండ మార్తాండ తేజా...
రాజాధి రాజాధి రాజా
అఖండ మండలానంద భోజా...
రాజధి రాజాధి రాజా

చరణం: 1
ముందు నుండి ముంచుకొచ్చు మృగాలనైనా
పిడికిలితో ఫెళఫెళఫెళ కూల్చేస్తా
వెనక నుండి తరుముకొచ్చు జ్వాలలనైనా
పాదంతో దబదబదబ తొక్కేస్తా
అందుకే మరందుకే మరందుకే
అందాలని అరచేతిలో పెడుతున్నా
నీకే అందాలని ఆరాట పడుతున్నా
కెరటమై ఉరుకుతున్న చురుకు నీదే
కదనమై దుముకుతున్న దుడుకు నీదే
ఆట నీది వేట నీది...
భువన భవన కరుణ కిరణ ప్రభువు నువ్వులే

రూలర్... రూలర్...

ప్రచండ చండ మార్తాండ తేజా...
రాజాధి రాజాధి రాజా

చరణం: 2
బీద ధనిక అంతరాలు అంతం చేసి
అందరిపై సమభావం చూపాలి
బంధుప్రీతి వర్గప్రీతి దూరం చేసి
అనునిత్యం సమధర్మం చాటాలి
అందుకే మరందుకే మరందుకే
ప్రాణంలో సగభాగం ఇస్తున్నా
నీ ప్రణయంతో సంపూర్ణమౌతున్నా
శిఖరమే శిరసు వంచు గెలుపు నీదే
గగనమే మెలిక తిరుగు మెరుపు నీదే
నీతి నీది ఖ్యాతి నీది...
భువన భవన కరుణ కిరణ ప్రభువు నువ్వులే

రూలర్...
**********  **********  **********


చిత్రం: దమ్ము (2012)
సంగీతం: యమ్. యమ్. కీరవాణి
సాహిత్యం: చంద్రబోస్
గానం: బాబా షెహగల్

ఎక్కడ ఎక్కడ ఎక్కడ చూడని
ఎత్తులు ఎత్తులు సొత్తులు సొత్తులు
మచ్చిక చేసిన మత్తలుపోయేడి
గుమ్మడి కాయల గుత్తులు గుత్తులు క్రేజీ... క్రేజీ

ఓ లిల్లీ బూరిబుగ్గల బుల్లి - బుల్లీ బుల్లీ
ఈడులోన లేడిగాగ చెల్లి - బుల్లీ బుల్ బుల్ బుల్లీ
నువ్వే సిల్లీ నవ్వే చల్లి వెళ్ళొద్దే నన్నే గిల్లి
కత్తిలాంటి నిన్ను చూసి గుండెలోన  కొతపుట్టి
క్రేజీ క్రేజీ క్రేజీ క్రేజీ

బెత్తెడంత నడుము చూసి బారెడంత మత్తు పుట్టి
క్రేజీ క్రేజీ క్రేజీ క్రేజీ క్రేజీ

ఓ లిల్లీ బూరిబుగ్గల బుల్లి - బుల్లీ బుల్లీ
ఈడులోన లేడిగాగ చెల్లి - బుల్లీ బుల్ బుల్ బుల్లీ

టాప్ యాంగిల్ లో తాట తీసేశావే
లోయాంగిల్ లో లొల్లి పుట్టించావే
సైడ్ యాంగిల్ లో సావగొట్టేశావే
బాక్ యాంగిల్ లో కేక పెట్టించావే

టాప్ యాంగిల్ లో తాట తీసేశావే
లోయాంగిల్ లో లొల్లి పుట్టించావే
సైడ్ యాంగిల్ లో సావగొట్టేశావే
బాక్ యాంగిల్ లో కేక పెట్టించావే

ఏ యాంగిల్ లో నెైన ఏంజెల్ నువ్వేనే
నాలైఫ్ కే కొత్త యాంగిల్ చుపావే...
మేజరెైన నిన్ను చూసి రోజు రోజు రాజుకుంది
క్రేజీ క్రేజీ క్రేజీ క్రేజీ క్రేజీ
రేజరంటి సోకుతగిలి కేజి కేజి పొంగుతోంది
క్రేజీ క్రేజీ క్రేజీ క్రేజీ క్రేజీ

ఓ లిల్లీ  ఓ లిల్లీ
ఓ లిల్లీ బూరిబుగ్గల బుల్లి - బుల్లీ బుల్లీ
ఈడులోన లేడిగాగ చెల్లి - బుల్లీ బుల్ బుల్ బుల్లీ

బ్లూ జీన్స్ తో బుర్ర నమిలేసావే
రెడ్ జాకెట్ తో రెచ్చగొట్టేశావే
వైలెట్ టాటూతో ఉతికేశావే
ఆరెంజ్ చున్నీతో ఆరేసావే

బ్లూ జీన్స్ తో బుర్ర నమిలేసావే
రెడ్ జాకెట్ తో రెచ్చగొట్టేశావే
వైలెట్ టాటూతో ఉతికేశావే
ఆరెంజ్ చున్నీతో ఆరేసావే

ఎన్నెన్నో రంగులతో ఎర్రెక్కించావే
నా గడలకె తోటి రంగులు తెచ్చావే
మమ్మి డాడి ఎవ్వరెైన మైండ్ లోన రేపినావే
క్రేజీ క్రేజీ క్రేజీ క్రేజీ క్రేజీ
మాన్ ఫ్యాక్చర్ ఎప్పుడైన మనసులోన పెంచినావే
క్రేజీ క్రేజీ క్రేజీ క్రేజీ క్రేజీ

ఓ లిల్లీ  ఓ లిల్లీ
ఓ లిల్లీ బూరిబుగ్గల బుల్లి - బుల్లీ బుల్లీ
ఈడులోన లేడిగాగ చెల్లి - బుల్లీ బుల్ బుల్ బుల్లీ
**********  **********  **********


చిత్రం: దమ్ము (2012)
సంగీతం: యమ్. యమ్. కీరవాణి
సాహిత్యం: చంద్రబోస్
గానం: యమ్. యమ్. కీరవాణి, కృష్ణ చైతన్య

రాజు వచ్చినాడో  ఓ ఓ ఓ
చిన రాజు వచ్చినాడో ఓ ఓ ఓ...
అహ  వస్తూ వస్తూ పండగ తెచ్చినాడు
ఊరు వాడ గడపల్లోన పున్నమి పంచినాడో

రాజు వచ్చినాడో  ఓ ఓ ఓ
చిన రాజు వచ్చినాడో ఓ ఓ ఓ...

శ్రీ శ్రీ శ్రీ రాజా వాసి రెడ్డి నువు విసిలేస్తే ఆంద్రాసోడా బుడ్డి
శ్రీ శ్రీ శ్రీ రాజా వాసి రెడ్డి నువు విసిలేస్తే ఆంద్రాసోడా బుడ్డి

మీ హృదయాలలో సింహాసనము
మీ అభిమానమే మణి కిరీటము
మీ ఆశీస్సులే నా ఐశ్వర్యము
మీ కనుచూపులే కీర్తి పతాకము
మీరంతా నా బలమై నా బలగమై ఉండగా
సంతోషమనే సామ్రాజ్యానికి రాజాధి రాజు నేనేగా...

వాసిరెడ్డి వంశానికి మూలం తారక సింహుడు
ఆ తారక సింహుని తనయుడెైన
మన విక్రమ సింహుని కడుపున పుట్టిన
ప్రతాప సింహుని ఇంట్లో వెలిసిన సూర్య సింహుడే
సూర్య సింహుని వంశం నిలిపిన రుద్ర సింహుని అంశలు మోసిన వీర సింహుని వారసుడెై
వాసిరెడ్డి విజయ ధ్వని శ్రీ సింహ

రాజు వచ్చినాడో  ఓ ఓ
చిన రాజు వచ్చినాడో ఓ ఓ ఓ...

తాతయ్య కోరిన మనవడు నేనెై
తోబుట్టువులడిగిన తమ్ముడు నేనై
అందరి ప్రాణం ఒక్కడు కాగా
ఒక్కడికోసం అందరు రాగా
ఏడేడు జన్మలు నీకంకితం చేయనా

శ్రీ శ్రీ శ్రీ రాజా వాసి రెడ్డి నువు విసిలేస్తే ఆంద్రాసోడా బుడ్డి
శ్రీ శ్రీ శ్రీ రాజా వాసి రెడ్డి నువు విసిలేస్తే ఆంద్రాసోడా బుడ్డి
**********  **********  **********


చిత్రం: దమ్ము (2012)
సంగీతం: యమ్. యమ్. కీరవాణి
సాహిత్యం: చంద్రబోస్
గానం: రాహుల్ సిప్లిగుంజ్, శ్రావణ భార్గవి, శివాని

ఉత్తరం ఊపు మీదుందే
దక్షిణం దంచికొట్టిందే
తూరుపు తుక్కు రేపిందే
పడమర పక్కవేసి
పైకి పైకి పైకి రమ్మందే

వాస్తు బాగుందే బేబీ వాస్తు బాగుందే
కాస్త కాస్త కాస్త కాస్త దోస్తు కమ్మందే
టోటల్గా వాస్తు బాగుందే బేబీ వాస్తు బాగుందే
కాస్త కాస్త కాస్త కాస్త దోస్తు కమ్మందే

ఉత్తరం ఊపు మీదుందే
దక్షిణం దంచికొట్టిందే
తూరుపు తుక్కు రేపిందే
పడమర పక్కవేసి
పైకి పైకి పైకి రమ్మందే

వాస్తు బాగుందే బేబీ వాస్తు బాగుందే
కాస్త కాస్త కాస్త కాస్త దోస్తు కమ్మందే
టోటల్గా వాస్తు బాగుందే బేబీ వాస్తు బాగుందే
కాస్త కాస్త కాస్త కాస్త దోస్తు కమ్మందే

అగ్గిలాంటి అందముంది ఆర్పేయనా
ఇచ్చిపుచ్చుకోవాలంది ఈశాన్యంలో
వంగి వంగి వాటేయమంది వాయవ్యంలో
నరం నరం మీటేమంది నైరుతి మూల
అన్నిదిక్కులు ఓకే ఓకే ఆడ దిక్కుతోని కిక్కే నాకే
శృంగారానికి విస్తారంగా శంకుస్థాపన చేసేటందుకు

వాస్తు బాగుందే బేబీ వాస్తు బాగుందే
కాస్త కాస్త కాస్త కాస్త దోస్తు కమ్మందే
టోటల్గా వాస్తు బాగుందే బేబీ వాస్తు బాగుందే
కాస్త కాస్త కాస్త కాస్త దోస్తు కమ్మందే

వీధిపోటు రానేరాదు వయ్యారంలో
లోపమంటు లేనేలేదు నా ఒంపుల్లో
ఆడదాని గూడే కాదు నా ప్రాయంలో
అడ్డుగోడ ఏదీలేదు ఆనందంలో
ఎంతచక్కని ఎలివేషన్లు ఎక్కువైనవి డెకరేషన్లు
మాస్టర్ బెడ్రూంలోన మస్త్ గ మత్తెక్కేటందుకు

వాస్తు బాగుందే బేబీ వాస్తు బాగుందే
కాస్త కాస్త కాస్త కాస్త దోస్తు కమ్మందే
టోటల్గా వాస్తు బాగుందే బేబీ వాస్తు బాగుందే
కాస్త కాస్త కాస్త కాస్త దోస్తు కమ్మందే

Most Recent

Default