Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Ek Niranjan (2009)

చిత్రం: ఏక్ నిరంజన్ (2009)
సంగీతం: మణిశర్మ
నటీనటులు: ప్రభాస్ , కంగనా రనౌత్
దర్శకత్వం: పూరీ జగన్నాధ్
నిర్మాత: ఆదిత్య రామ్
విడుదల తేది: 29.10.2009Songs List:ఏక్ నిరంజన్ పాట సాహిత్యం

 
చిత్రం: ఏక్ నిరంజన్ (2009)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: కార్తిక్

అమ్మా లేదు నాన్నా లేడు 
అక్కా చెల్లీ తంబీ లేరు ఏక్ నిరంజన్
పిల్లా లేదు పెల్లీ లేదు 
పిల్లనిచ్చీ పెళ్ళి చేసే మావ లేడు ఏక్ నిరంజన్
ఊరే లేదు నాకో పేరె లేదు 
నీడా లేదు నాకే తోడూ లేదు
నేనెవరికీ గుర్తే రాను ఎక్కిల్లే రావసలే
నాకంటూ ఎవరూ లేరే కన్నీలే లేవులే
పది మందిలో ఏకాకిని నా లోకమే వేరే
ఇరగేసినా తిరగేసినా 
నేనెప్పుడూ ఒంటరివాడినే

అమ్మా లేదు నాన్నా లేడు 
అక్కా చెల్లీ తంబీ లేరు ఏక్ నిరంజన్
పిల్లా లేదు పెల్లీ లేదు 
పిల్లనిచ్చీ పెళ్ళి చేసే మావ లేడు ఏక్ నిరంజన్

కేర్ ఆఫ్ ఫ్లాట్ ఫామ్ సన్ ఆఫ్ బాడ్ టైమ్ 
ఆవారా డాట్ కామ్
ఎ డమరడమ్ టైమ్స్ ఆఫ్ ఫ్రీడమ్ 
మనకు అదేరా ప్రాబ్లమ్
అరే డేట్ ఆఫ్ బర్తే తెలీయదే పెను గాలికి పెరిగాలే
ఏ జాలీ జోలా ఎరగదే నా గోలేదో నాదే
తిన్నావా దమ్మేసావా అని అడిగేదెవ్వడులే
ఉన్నావా పోయావా అని చూసే దిక్కే లేడే 
పది మందిలో ఏకాకిని నా లోకమే వెరే
ఇరగేసినా తిరగేసినా 
నేనెప్పుడూ ఒంటరివాడినే 

అమ్మా లేదు నాన్నా లేడు 
అక్కా చెల్లీ తంబీ లేరు ఏక్ నిరంజన్
తట్టా లేదు బుట్టా లేదు
బుట్ట కింద గుడ్డుపెట్టే పెట్టా లేదు ఏక్ నిరంజన్

స్టిల్ హిస్ బాడీ ఫుల్ ఆఫ్ ఫీలింగ్ 
నో వన్ ఇస్ కెరింగ్
దట్స్ ఒకె యార్ చెల్తా హె నేనా నా డార్లింగ్
ఈ గగ జాయే అమ్మలా అట్టి లేరా అంటుంది
ఓ గుక్కెడు రమ్మే కమ్మగా 
నను పడుకో పెడుతుందీ
రోజంతా నాతో నేనె కల్లోనూ నేనేలే
తెల్లారితే మల్లి నేనే తేడానేలే లేదే
పది మందిలో ఏకాకిని నా లోకమే వెరే
ఇరగేసినా తిరగేసినా 
నేనెప్పుడూ ఒంటరివాడినే

అమ్మా లేదు నాన్నా లేడు 
అక్కా చెల్లీ తంబీ లేరు ఏక్ నిరంజన్
కిస్సూ లేదు మిస్సు లేదు
కస్సు బుస్సు లాడే లస్సు లేదు ఏక్ నిరంజన్ గుండెల్లో... గుండెల్లో... పాట సాహిత్యం

 
చిత్రం: ఏక్ నిరంజన్ (2009)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: హేమచంద్ర, గీతా మాధురి

గుండెల్లో... గుండెల్లో...

గుండెల్లో గిటారు మొగించావే 
నాకేవొవో సిల్లీ తాట్స్ నేర్పించావే
చుపుల్తో పటాసు పేల్చేశావే 
నీ మాటల్తో ఫుల్ టాస్ వేసేశావే.. 
చెలియా నీవై ఫిక్స్ అయ్యెలా చేసావే
నీ దానై నా మైండ్ అంతా లాగేశావె.. 
లెఫ్ట్ రైటు టాప్ టు బాటమ్ నచ్చేశావే
ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ టచ్ చేసావే

గుండెల్లో... గుండెల్లో...
గుండెల్లో గిటారు మొగించావే 
నాకేవొవో సిల్లీ తాట్స్ నేర్పించావే
చుపుల్తో పటాసు పేల్చేశావే 
నీ మాటల్తో ఫుల్ టాస్ వేసేశావే

సున్నాలా ఉన్నానా నా పక్కన ఒకటయ్యావే 
ఎర వేసీ వలలోకి నను లాగేసింది నువ్వే
కాలి దిల్ లోన దేవతలా దిగి పోయావే 
తెరతీసి సరదాకే నను బందించింది నువ్వే 
అనుకోకుండా నాకన్నీ నువ్వైపోయావే 
ఎటువైపున్నా నీ వైపే నను నడిపించావే 
నరనరాన ఎక్కు తార వినిపించావే 
నా స్వరాన ప్రేమ పాట పలికించావే

గుండెల్లో...
గుండెల్లో
నాకేవొవో 
చుపుల్తో 
నీ మాటల్తో

యమ్మో ఎం ఫిగరో ఏం హాటనిపించేసావే 
నువ్వుకూడా పిల్లగాడా నన్ను ఎంతగానో కదిలించావే 
చెయ్య చెయ్య జర చెయ్ వాటమ్ చూపించవే 
నువ్వుకుడా నా వీరా ఇట్టాగే దోచెసావే 
కనుపాపల్లో హరివిల్లై నువు కనిపించావే 
ఎదలోయల్లో చిరు జల్లై నను తడిపేశావే 
అందమైన మత్తు మందు నువ్వే నువ్వే 
అందుకున్న ప్రేమ విందు నువ్వైయావే

గుండెల్లో...
గుండెల్లో గిటారు మొగించావే 
నాకేవొవో సిల్లీ తాట్స్ నేర్పించావే
చుపుల్తో పటాసు పేల్చేశావే 
నీ మాటల్తో ఫుల్ టాస్ వేసేశావే
గుండెల్లో...సమీరా సమీరా  పాట సాహిత్యం

 
చిత్రం: ఏక్ నిరంజన్ (2009)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: కార్తిక్

సమీరా సమీరా సమీరా సమీరా
ఒక్క సారి ఐ లవ్ యు అనవే సచ్చీ పోతా 
ఈ లైఫ్ తో నాకేం పని లేదని రెచ్చిపోతా 
నువ్వు ఒక్కసారి 143 అనవే రాలిపోతా 
నీ లవ్ కన్నా లక్ ఏదీ లేదు అని రేగి పోతా 
ఎహె సైట్లు వద్దూ ఎహె కోట్లు వద్దు 
నా కోహినూర్ నువంటా 
ఏ పాట్లూ రాని అగచాట్లు రానీ ప్రేమతో బతికేస్తా 
నిను దేవతల్లే పూజిస్తా ఓ ఓ దయ్యమల్లె సాధిస్తా 
నువ్వు లొంగనంటే ఏం చేస్తా 
నేను బ్రహ్మచారిగా పుచ్చిపోతా

సమీరా సమీరా సమీరా సమీరా

నీ ఇంటి ముందు టెంటు వేసుకుంటా
బైకుపెట్టి రచ్చ రచ్చ చేస్తా 
అప్పుడైనా తిట్టుకుంటూ చెప్పవే ఐ లవ్ యూ 
వీదీ వీదీ పద యాత్ర చేస్తా 
సంతకాలు లక్ష సేకరిస్తా 
అందుకైన మెంచుకుంటూ అనవే 143
అసలు ఎందుకంటా నేను అంటే మంట 
తెగ చిట పట మంటావే 
పొద్దున్న చోట లవ్ ఉంటదంటా 
అది నిజమని అనుకోవే 
బతిమాలి గతిమాలి అడిగా నిన్నే హో

సమీరా... సమీరా...

దండం ఏట్టీ నిను కాక పడతా 
దండలు ఏసీ కొకొనట్ కొడతా 
వెయ్యి పేర్లు దండకాలు చదువుతు ప్రేమిస్తా 
తిండి మాని బక్క చిక్కి పోతా 
మందు దమ్ము అన్నీ మానుకుంటా 
ఏడు కొండలు ఎక్కీ గుండు కొడతా ఏటేటా 
నీ కోసం ఇంత చేస్తున్నదంత
నువు చూసీ చూడవుగా 
ఏం మాయ సంత అన్నీ తిప్పుకుంటూ 
వెళ్లిపోతే వదలనుగా 
వెనకోస్తా విసిగిస్తా నువ్వు మారేదాకా

సమీరా సమీరా సమీరా సమీరా ఎవరూ లేరని అనకు పాట సాహిత్యం

 
చిత్రం: ఏక్ నిరంజన్ (2009)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: భాస్కరభట్ల
గానం: మాళవిక

ఎవరూ లేరని అనకు తోడుంటా నీ కడవరకు 
చీకటిలోనా వెలుగౌతా నీకొరకూ 
ఎపుడూ ఒంటరి అనకు నీతోనే చావుబ్రతుకు 
కంటికి రెప్పై ఉంటాలే తుది వరకు 
ప్రేమతోటి చెంప నిమరన గుండెచాటు బాధ చెరపన నీ ఊపిరే అవ్వనా...
గడిచిన కాలమేదో గాయపరిచిన 
జ్ఞాపకాల చేదు మిగిలిన మైమరిపించే హాయవ్వనా
ఒట్టేసి నేను చెబుతున్నా వదిలుండలేను క్షణమైనా 
నీ సంతోషానికి హామీ ఇస్తున్నా

ఎవరూ లేరని అనకు తోడుంటా నీ కడవరకు 
చీకటిలోన వెలుగౌతా నీకొరకూ 

నా మనసే నీకివ్వనా నీలోనే సగమవ్వనా 
అరచేతులు కలిపే చెలిమే నేనవనా 
ముద్దుల్లో ముంచేయనా కౌగిలిలో దాచెయ్యనా 
నా కన్నా ఇష్టం నువ్వే అంటున్నా 
తడిచొస్తే తల తుడిచే చీరంచుగ నేనే మారనా 
అలిసొస్తే ఎపుడైనా నా ఒడినే ఊయల చేస్తానంటున్నా

ఎవరూ లేరని అనకు తోడుంటా నీ కడవరకు 
చీకటిలోనా వెలుగౌతా నీకొరకూ 

నిను పిలిచే పిలుపవ్వనా నిను వెతికే చూపవ్వనా 
నీ కన్నుల వాకిట మెరిసే మెరుపవనా 
నిను తలచే తలపవ్వనా నీ కథలో మలుపవ్వనా 
ఏడడుగుల బంధం నీతో అనుకోనా 
మనసంతా దిగులైతే నిను ఎత్తుకు సముదాయించనా 
నీకోసం తపనపడే నీ అమ్మా నాన్నా అన్నీ నేనవనా

ఎవరూ లేరని అనకు తోడుంటా నీ కడవరకు 
చీకటిలోనా వెలుగౌతా నీకొరకూమహమ్మారి మహమ్మారి పాట సాహిత్యం

 
చిత్రం: ఏక్ నిరంజన్ (2009)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: భాస్కరభట్ల
గానం: కళ్యాణ్ వసంత్, గీతా మాధురి

మహమ్మారి మహమ్మారి మహమ్మారివేయ్
అందాల మహమ్మారివేయ్
బహబారి బహబారి బహబారియె
ఆహా వీర బహుబారియె
ఊగే చెవి రింగు ఒంపుల్లో ఉందే స్వింగూ
హెల్లో డార్లింగు లేటెందుకు తోడిగెయ్ రింగు

రా యె రా యె రాయె ఊరంతా నిద్దరోయె
రా యె రా యె రాయె కుర్రాడు రాలుగాయె
రా యె రా యె రాయె ఊరంతా నిద్దరోయె
రా యె రా యె రాయె కుర్రాడు రాలుగాయె

మహమ్మారి మహమ్మారి మహమ్మారివేయ్
అందాల మహమ్మారివేయ్
బహబారి బహబారి బహబారియె
ఆహా వీర బహుబారియె

నీ చూపే టకిలా నా షకిరా 
దిల్ ధడక్ ధడక్ రంగీలా 
నీ హైటే అక్కేలా పిచ్చెక్కేలా 
వయసుడికి ఉడికి పోయెలా 
షరపోవా స్టెఫీ గ్రాఫ్ రాంప్ మడోన్నాని మిక్సీ వేస్తె
నడిచొచ్చే ఆ బొమ్మ నీల ఉంటుందే 
హిమాన్ కౌ బాయ్ జేమ్స్ బాండ్ ఒకటై పుట్టి
ఎదురైతే అచ్చంగా నీలా ఉంటాడే
అచ్చా బహుత్ అచ్చా కాబట్టే గిల్లీ గిచ్చా 
నచ్చీ చనువిచ్చా నీ బండికి సిగ్నల్ ఇచ్చా

రా యె రా యె రాయె ఊరంతా నిద్దరోయె
రా యె రా యె రాయె కుర్రాడు రాలుగాయె
రా యె రా యె రాయె ఊరంతా నిద్దరోయె
రా యె రా యె రాయె కుర్రాడు రాలుగాయె

నువ్వే నా హానీ బీ నా హబ్బీ బీ 
నా నరాల్లో సడన్ గా హై బీ.పీ 
ఫైవ్ ఫీట్ గులాబీ లవ్ జలేబీ 
నీ తళ్ళూ బెలుకూ సో హాపీ 
హాలివుడ్ బాలీవుడ్ టాలీవుడ్ గాలించేశా
నీలాంటి మొనగాడు నో నో నో నో నో 
పికాసో నీకేసీ ఆనాడే చుసాడంటే
మొనాలిసా పేంటింగు మానేసుంటాడే 
నువ్వే హమ్మింగు నా కోటకి నువ్వే కింగు 
రంగు నీ హంగూ నీ నడుము కాదా స్ప్రింగు 

రా యె రా యె రాయె ఊరంతా నిద్దరోయె
రా యె రా యె రాయె కుర్రాడు రాలుగాయె
రా యె రా యె రాయె ఊరంతా నిద్దరోయె
రా యె రా యె రాయె కుర్రాడు రాలుగాయెఅరెరే నర్తన తార పాట సాహిత్యం

 
చిత్రం: ఏక్ నిరంజన్ (2009)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: విశ్వా
గానం: రంజిత్, నీలాయిని

అరెరే నర్తన తార జిగి విద్యుతై చల్లగై రా 
సురహే సుస్వరదార విని తన్మయమే కలిగేరా
ఇటుగా జిమ్మిక్ తేరా తనీ అన్నానా అనుకోరా 
వెలిగే వుల్కవు లే రా పడి చచ్చేనుగా జగుసారా 
జూమ్ మేరా సారా దునియా జూమ్ మేరా 
సాహోరా నీకు సాటీ పోటీ లేదు రా 
గగనమే నీ హద్దుగా చలరేగిన మైకేలా
విధి రాతనే మార్చుతూ తలపైన తళుకు తారా 
ఇట్స్ టూ వేస్ ఇన్ మేకింగ్ 
వెన్ ద వోల్ వరల్డ్ వాస్ వాచింగ్ 
హిస్ సాంగ్ అండ్ డాన్స్ అమేజింగ్ 
యూ చాంటెడ్ చాంటెడ్ గ్రాబ్డ్ దట్ షో 
ఆన్ ది ఫ్లోర్ వోచెయ్ వి కాంట్ స్టాప్ ద యెవె యెవె 
లిఫ్ట్ అప్ ద వారల్డ్ ఎంజెల్ 
యు ఆర్ ద త్రిల్లర్ బాడ్ ఇన్విసబుల్

అరె రే నర్తన తార జిగి విద్యుతై చల్లగై రా 
సురే సుస్వరదార విని తన్మయమే కలిగేలా 

మూన్ వాకింగ్ చేస్తున్నా గిర గిర తిరిగేస్తున్నా 
మునివేళ్ళపై నించున్నా హల్ చల్ కలిగేరా 
లవ్ సాంగ్ వినిపిస్తున్నా గోస్ట్ అయి బెదిరిస్తున్నా 
హీల్ ద వరల్డ్ అంటున్నా దిల్ బాజాలె కదరా 
విజయానికి వన్నేగా వెలుగొందిన దృవతార 
ఎదలయలను ఏలిన కింగ్ ఆఫ్ పాప్ యె రా.. 
ఇట్స్ టూ వేస్ ఇన్ మేకింగ్ 
వెన్ ద వోల్ వరల్డ్ వాస్ వాచింగ్ 
హిస్ సాంగ్ అండ్ డాన్స్ అమేజింగ్ 
యూ చాంటెడ్ చాంటెడ్ గ్రాబ్డ్ దట్ షో 
ఆన్ ది ఫ్లోర్ వోచెయ్ వి కాంట్ స్టాప్ ద యెవె యెవె 
లిఫ్ట్ అప్ ద వారల్డ్ ఎంజెల్ 
యు ఆర్ ద త్రిల్లర్ బాడ్ ఇన్విన్సిబిల్

అరె రే నర్తన తార సురేహే సుస్వరదార

బ్లాక్ ఆర్ వైట్ ఎవరైనా సోషల్ కాస్ ఎదైనా 
గళమెత్తిన గానమైనా సమతే నీదన్నా 
గిన్నీసు గ్రామ్మీలు బిల్ బోర్డులు లైఫ్ టైములు 
తలవంచే మహనియా చేరితే నీదాన్నా 
గగనమే నీ హద్దుగా చలరేగిన మైకేలా
విధి రాతనే మార్చుతూ తలపైన తళుకు తారా 
ఇట్స్ టూ వేస్ ఇన్ మేకింగ్ 
వెన్ ద వోల్ వరల్డ్ వాస్ వాచింగ్ 
హిస్ సాంగ్ అండ్ డాన్స్ అమేజింగ్ 
యూ చాంటెడ్ చాంటెడ్ గ్రాబ్డ్ దట్ షో 
ఆన్ ది ఫ్లోర్ వోచెయ్ వి కాంట్ స్టాప్ ద యెవె యెవె 
లిఫ్ట్ అప్ ద వారల్డ్ ఎంజెల్ 
యు ఆర్ ద త్రిల్లర్ బాడ్ ఇన్విన్సిబిల్

Most Recent

Default