Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Preminchu (2001)




చిత్రం: ప్రేమించు (2001)
సంగీతం: యమ్.యమ్.శ్రీలేఖ
నటీనటులు: లయ, సాయి కిరణ్, రూప
దర్శకత్వం: బోయిన సుబ్బారావు
నిర్మాత: డి.రామానాయుడు
విడుదల తేది: 11.04.2001



Songs List:



తొలిసారి నిను చూసి ప్రేమించిన పాట సాహిత్యం

 
చిత్రం: ప్రేమించు (2001)
సంగీతం: యమ్. యమ్. శ్రీలేఖ
సాహిత్యం: సిరివెన్నెల
గానం: యస్. పి. బాలు, చిత్ర

లాలాల లాలల
లాలాల లాలల
లాలాల లాలాల లా

తొలిసారి నిను చూసి ప్రేమించిన
బదులిచ్చినావమ్మ ప్రియురాలిగ
తొలిసారి నిను తాకి ప్రేమించిన
మనసిచ్చినానమ్మ ప్రియ నేస్తమా
కలలోను ఇలా కలిసుండాలని
విడిపోని  వరమీయవా
అన్నది ప్రేమ ఓ ఓ ఓ అన్నది ప్రేమ

తొలిసారి నిను తాకి ప్రేమించిన
మనసిచ్చినానమ్మ ప్రియ నేస్తమా

తూగే నా పాదం నువ్వే నడిపిస్తుంటే
సాగింది పూబాట మీదుగా
ఊగే నీ ప్రాయం నా వేలే శృతి చేస్తుంటే
మోగింది వయ్యారి వీణగా
ముద్దుల ఊసులు మబ్బుల వేడికి తీసుకు వెళ్ళాలి
ముచ్చట చూసిన అల్లరి గాలులు పల్లకి తేవాలి
అనుబంధానికి ప్రతిరూపం అని మన పేరే ప్రతి వారికి
చెబుతుంది ప్రేమ ఓ ఓ ఓ చెబుతుంది ప్రేమ

తొలిసారి నిను చూసి ప్రేమించిన
బదులిచ్చినావమ్మ ప్రియురాలిగ

లలలల లా లలలల లా
లలలల లా లాలల లా

నిన్నే నాకోసం పంపించడేమో బ్రహ్మ
నడిచేని నా ఇంటి దీపం మా
ఓ నీతో సావాసం పండించింది నా జన్మ
నూరేళ్లు నా నొసట కుంకుమ
వెచ్చని శ్వాసల యవ్వన గీతికి పల్లవి నువ్వంట
పచ్చని ఆశల పువ్వుల తీగకి పందిరి నీ జంట
మన బిగి కౌగిలి తన కోవెల అని
కొలువుండి పోవాలని
చేరింది ప్రేమ... చేరింది ప్రేమ

తొలిసారి నిను తాకి ప్రేమించిన
మనసిచ్చినానమ్మ  ప్రియ నేస్తమా
కలలోను ఇలా కలిసుండాలని
విడిపోని  వరమీయవా
అన్నది ప్రేమ ఓ ఓ ఓ అన్నది ప్రేమ

లాలల లలలా  లాలల లలలా



కంటేనే అమ్మ అని అంటే ఎలా పాట సాహిత్యం

 
చిత్రం: ప్రేమించు (2001)
సంగీతం: యమ్. యమ్. శ్రీలేఖ
సాహిత్యం: సి. నారాయణ రెడ్డి
గానం: యస్. పి. బాలు, చిత్ర

కంటేనే అమ్మ అని అంటే ఎలా
కంటేనే అమ్మ అని అంటే ఎలా
కరుణించే ప్రతి దేవత అమ్మే కదా
కన్న అమ్మే కదా
కంటేనే అమ్మ అని అంటే ఎలా
కంటేనే అమ్మ అని అంటే ఎలా
కడుపుతీపి లేని అమ్మ బొమ్మేకదా
రాతి బొమ్మే కదా

కన కనలాడే ఎండకు శిరసు మాడినా
మనకు తల నీడను అందించే చెట్టే అమ్మ
చారెడు నీళ్లను తాను దాచుకోక
జగతికి సర్వస్వం అర్పించే మబ్బే అమ్మ
ఆ అమ్మలనే మించిన మా అమ్మకు
ఆ అమ్మలనే మించిన మా అమ్మకు
ఋణం తీర్చుకోలేను ఏ జన్మకు

కంటేనే అమ్మ అని అంటే ఎలా
కడుపుతీపి లేని అమ్మ బొమ్మేకదా
రాతి బొమ్మే కదా

ఎన్నో అంతస్థులుగా ఎదిగి పోయిన
మేడకున్న అసలు ఉనికి ఆ పునాది పైనే
సిరుల జల్లులో నిత్యం పరవసించిన
మగువ జీవన సాఫల్యం మాతృత్వంలోనే
ప్రతి తల్లికి మమకారం పరమార్ధం
ప్రతి తల్లికి మమకారం పరమార్ధం
అదిలేని అహంకారం వ్యర్థం వ్యర్థం

కరుణించే ప్రతి దేవత అమ్మే కదా
కడుపుతీపి లేని అమ్మ బొమ్మేకదా
రాతి బొమ్మే కదా




ఏడుకోట్ల ఆంధ్రులులో పాట సాహిత్యం

 
చిత్రం: ప్రేమించు (2001)
సంగీతం: యమ్. యమ్. శ్రీలేఖ
సాహిత్యం: సిరివెన్నెల
గానం: యస్. పి. బాలు, చిత్ర

ఏడుకోట్ల ఆంధ్రులులో నా ఈడు మెచ్చిన హ్యాండ్సమ్ నువ్వేరా
వందకోట్ల చుక్కలలో నా విందుకొచ్చిన చిం చిం నువ్వేగా
పైట మీద ప్రామిస్ ముని పంటిమీద ప్రామిస్
పెదవి మీద ప్రామిస్ కొన గోటిమీద ప్రామిస్
పగలు రాతిరి పరుగు తీయని పడుచు దారిలో లవ్ బర్డ్స్

ఏడుకోట్ల ఆంధ్రులులో నా ఈడు మెచ్చిన హ్యాండ్సమ్ నువ్వేరా
వందకోట్ల చుక్కలలో నా విందుకొచ్చిన చిం చిం నువ్వేగా

ఉత్తరాల పై స్టాంప్ వేసినట్టు
ముద్దులు పెట్టు ముద్దులు పెట్టు
పుస్తకాలపై కవరు వేసినట్టు
కౌగిలి చుట్టు కౌగిలి చుట్టు
ఉడుము పట్టినట్టు లేత నడుము పట్టు
వండి వార్చి నట్టు వన్నెలన్ని పెట్టు
నీ తీపి జబ్బుకి తేనే పిచ్చికి తనువే టాబ్లెట్

ఏడుకోట్ల ఆంధ్రులులో నా ఈడు మెచ్చిన హ్యాండ్సమ్ నువ్వేరా
వందకోట్ల చుక్కలలో నా విందుకొచ్చిన చిం చిం నువ్వేగా

పంచదారపై చీమ చేరినట్టు
ఓంపులు ముట్టు, ఓంపులు ముట్టు
పుష్కరాలకై వేచి చూసినట్టు
ఓపిక పట్టు, ఓపిక పట్టు
స్విచ్ వేసినట్టు స్వీట్ చిప్స్ పెట్టు
లైట్ వెలిగినట్టు గోటి గాటు పెట్టు
రసలోకయాత్రలే చేయడానికి పరుపే పాస్పోర్ట్

ఏడుకోట్ల ఆంధ్రులులో నీ ఈడు మెచ్చిన హ్యాండ్సమ్ నేనేగా
వందకోట్ల చుక్కలలో నీ విందుకొచ్చిన చిం చిం నేనేగా
నీ పైట మీద ప్రామిస్ ముని పంటిమీద ప్రామిస్
పెదవి మీద ప్రామిస్ కొన గోటిమీద ప్రామిస్
పగలు రాతిరి పరుగు తీయని పడుచు దారిలో లవ్ బర్డ్స్

ఏడుకోట్ల ఆంధ్రులులో నా ఈడు మెచ్చిన హ్యాండ్సమ్ నువ్వేరా రా
వందకోట్ల చుక్కలలో నా విందుకొచ్చిన చిం చిం నువ్వేగా




హాయ్ అమ్మ హాయ్ హాయ్ అమ్మ పాట సాహిత్యం

 
చిత్రం: ప్రేమించు (2001)
సంగీతం: యమ్. యమ్. శ్రీలేఖ
సాహిత్యం: సిరివెన్నెల
గానం: యస్. పి. బాలు, చిత్ర

హాయ్ అమ్మ హాయ్ హాయ్ అమ్మ
ఈ తుంటరి గాలేంటమ్మ నిలువెల్లా గిల్లుతోందమ్మా
దాయమ్మ దాయ్ దాయ్ అమ్మ
నా ఒళ్ళో దాక్కోవమ్మ గాలైన చేరలేదమ్మా
చెలినాదుకో పురుషోత్తమా
చెయ్యందుకో ప్రియ నేస్తమా
జడి వానతో సుడిగాలితో  పడలేనయ ప్రియుడా

దాయమ్మ దాయ్ దాయ్ అమ్మ
నా ఒళ్ళో దాక్కోవమ్మ గాలైన చేరలేదమ్మా
హాయ్ అమ్మ హాయ్ హాయ్ అమ్మ
ఈ తుంటరి గాలేంటమ్మ నిలువెల్లా గిల్లుతోందమ్మా

గాలి ఖవ్వాలీలా గాన కచ్చేరీల ఊపు
రెచ్చే వయసు వయ్యారం
ఊపు తాళం వేసి కూని రాగం తీసి
తూగి పోయే తీగ సింగారం
నర నరంలో నిప్పు తరంగం
ఆప తరంకాని సుకుమారం
హత్తు మృదంగం కొత్త తతంగం
యమ కధం తొక్కు సింగారం
మునుపు ఎపుడు వినపడని మధురిమల
మొదటి చెలిమి శృతిలో
వలపు తలపులకు తలపు తెరిచి శివమెత్తే గతిలో
జత గీతమే జలపాతమై జతులాడే లయలో

దాయమ్మ దాయ్ దాయ్ అమ్మ
నా ఒళ్ళో దాక్కోవమ్మ గాలైన చేరలేదమ్మా
హా హాయ్ అమ్మ హాయ్ హాయ్ అమ్మ
ఈ తుంటరి గాలేంటమ్మ నిలువెల్లా గిల్లుతోందమ్మా

ఇంత కాలం ఇంత పెనుభారం
వంటరిగా ఉన్నాం కంట పడక
నిన్ను చూసే లేత నయగారం
కళ్ళుతెరిచిందా వెంటపడుతోందా
ఈడు పొంగుల్లో ఏడు రంగుల్లో
ఎంత బాగున్నదే చెలి అందం
ఎన్ని కళ్ళున్న చాలవంటుందే
పురి విప్పే నెమలి సౌందర్యం
చిటుకు చిటుకు మని తళుకు మెళికలను
చిదుము గిలుపు చలిలో
తొడిమ నడుము తెగ తడిమి తడిమి తరిమేసే గిలితో
చలగాటలో చలి వేటలో వణికించే గొడవ

హాయ్ అమ్మ హాయ్ హాయ్ అమ్మ
ఈ తుంటరి గాలేంటమ్మ నిలువెల్లా గిల్లుతోందమ్మా
దాయమ్మ దాయ్ దాయ్ అమ్మ
నా ఒళ్ళో దాక్కోవమ్మ గాలైన చేరలేదమ్మా
చెలినాదుకో పురుషోత్తమా
చెయ్యందుకో ప్రియ నేస్తమా
జడి వానతో సుడిగాలితో  పడలేనయ ప్రియుడా



స్వాగతం స్వాగతం పాట సాహిత్యం

 
చిత్రం: ప్రేమించు (2001)
సంగీతం: యమ్. యమ్. శ్రీలేఖ
సాహిత్యం: సిరివెన్నెల
గానం: యస్. పి. బాలు, చిత్ర

వీరి వీరి గుమ్మడి పండు వీరి పేరెవరు
పెళ్ళి కూతురు
వీరి వీరి గుమ్మడి పండు వీరి పేరెవరు
పెళ్ళి కొడుకు

స్వాగతం  స్వాగతం యువ ప్రేమికులకు స్వాగతం
ప్రేమతో ప్రేమనే గెలిచిన జంటకు స్వాగతం
మనస్పూర్తిగ మిమ్మల్ని దీవిస్తున్నది మా హృదయం
శుభాకాంక్షలే అందిస్తు చేయిస్తాము మీ కళ్యాణం
శుభమస్తని అంటు మోగించేస్తాం సన్నాయి మేళాలే
ఓ పసిడి మనసులే పందిళ్లు
తీపి తలపులే తోరణాలు
పిల్ల నవ్వులే కట్నాలు
ప్రియుడు చూపులే తలంబ్రాలు

స్వాగతం  స్వాగతం యువ ప్రేమికులకు స్వాగతం
ప్రేమతో ప్రేమనే గెలిచిన జంటకు స్వాగతం

నిసస సాసగరె నిసస సాసగరె
నిసగరె నిసగరె సా హొయ్
నిసస సాసగరె నిసస సాసగరె
నిసగరె నిసగరె నిసస సాససా
ఓ... ఓ... ఓ... ఓ...
అబ్బా చూడరా మనోడు ఎంత వెలిగి పోతున్నాడో
కౌన్ బనేగా కరోడ్ పతిలోకోటి గెలిచి నట్టు లేడు
అయ్య బాబోయ్
అన్నమాట తప్పలేని రాముడంటి పిల్లవాడు
అల్లుడైతే మామగారి కెంత టెక్కో
క్యా బోలా జనార్ధన టీ పార్టి ఇమ్మందున రేయ్
ముద్దబంతి పువ్వులాంటి కన్నె పిల్ల ప్రేమ దోచుకున్న కుర్రవాడి దెంత లక్కో
వారెవ్వా చులోచన పాడేయ్ నా ఓ కీర్తన
ఇలాంటి ప్రేమ కళ్లార మళ్ళి చూడలేము సోదరా
ఇలాంటి జంట లోకాన లేనే లేదు చూడరా
వేదికెక్కడోయ్ పెళ్ళి ఎప్పుడోయ్
ముచ్చటైన మూడు ముళ్ళ విందు ఎప్పుడోయ్
అది కావాలంటే చూడాలండి శుభలగ్నం ముందు
తళుకు తారలే దీపాలు గుండె చప్పుడులె మంత్రాలు
కన్నె సొగసులే కట్నాలు కలల వానలే తలంబ్రాలు
వెల్కమ్...
స్వాగతం  స్వాగతం యువ ప్రేమికులకు స్వాగతం
ప్రేమతో ప్రేమనే గెలిచిన జంటకు స్వాగతం

అమ్మోయ్  అమ్మోయ్
ఎవరు చూడకుండానే బావే అక్కని గిల్లేస్తున్నాడే
అమ్మ దొంగా...
కోరుకున్న పిల్లవాడు కోరచూపు గుచ్చుకుంటే
ఎర్రబడ్డ పిల్ల బుగ్గకెంత నిక్కో
ఆగవే ఆ బామ్మని చూసేయ్యని ఒన్స్ మోర్ అబ్బ
ప్రేమతోని పిల్లదాని ఫేసే చూసుకుంటే
పట్టుబడ్డ పిల్లగాడి కెంత సిగ్గో
లాల్ సలాం వాత్సాయన లవ్ కిస్సే ఇమ్మందునా
ప్రేమా జిందాబాద్ ప్రేమించు అన్న పెద్దలకు జిందాబాద్
బడి అచ్చిబాత్ గుండె ధర్యం ఉన్నవాడే సిందు బాద్
బలం కాదురా మంచి మనసు ఉన్నవాడే మనిషి సోదరా
ఆ మనిషి తనం గల పిలగాడే మన బంధువైనాడో
ఓ స్వర్గ లోకములో పెళ్ళిళ్ళు జరుగునంటారు పెద్దోళ్ళు
కానేకాదు అని రుజువు చేశారు చిన్నోళ్లు

స్వాగతం  స్వాగతం యువ ప్రేమికులకు స్వాగతం
ప్రేమతో ప్రేమనే గెలిచిన జంటకు స్వాగతం
మనస్పూర్తిగ మిమ్మల్ని దీవిస్తున్నది మా హృదయం
శుభాకాంక్షలే అందిస్తు చేయిస్తాము మీ కళ్యాణం
శుభమస్తని అంటు మోగించేస్తాం సన్నాయి మేళాలే
ఓ పిపి పిపిపి తాళాలు తుతు తుతుతూ మేళాలు
ఓ పిపి పిపిపి తాళాలు తుతు తుతుతూ మేళాలు



స్వగతం యువ ప్రేమికులకు పాట సాహిత్యం

 
చిత్రం: ప్రేమించు (2001)
సంగీతం: యమ్. యమ్. శ్రీలేఖ
సాహిత్యం: సిరివెన్నెల
గానం: యస్.పి.బాలు, చిత్ర

స్వగతం యువ ప్రేమికులకు 




మా గుండెలలో నిండిన దైవమా పాట సాహిత్యం

 
చిత్రం: ప్రేమించు (2001)
సంగీతం: యమ్. యమ్. శ్రీలేఖ
సాహిత్యం: సిరివెన్నెల
గానం: యస్.పి.బాలు, చిత్ర

మా గుండెలలో నిండిన దైవమా 




24 Carat Golden Babu పాట సాహిత్యం

 
చిత్రం: ప్రేమించు (2001)
సంగీతం: యమ్. యమ్. శ్రీలేఖ
సాహిత్యం: సిరివెన్నెల
గానం: యస్.పి.బాలు, చిత్ర

24 Carat Golden Babu

Most Recent

Default